రాష్ట్రం నుంచి ఢిల్లీకి సూట్‌కేసులు | Congress Party and BRS foment defections in Telangana: G Kishan Reddy | Sakshi
Sakshi News home page

రాష్ట్రం నుంచి ఢిల్లీకి సూట్‌కేసులు

Published Sat, Jul 13 2024 6:09 AM | Last Updated on Sat, Jul 13 2024 10:55 AM

Congress Party and BRS foment defections in Telangana: G Kishan Reddy

సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు పోటీ పడుతున్నారు 

పార్టీ ఫిరాయింపులతో గాం«దీభవన్‌ గులాబీ మయంగా మారింది 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య ఫలితాలు రాబోతున్నాయి 

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఆరు నెలల కిందట అధికారంలోకి వచి్చన కాంగ్రెస్‌ పార్టీ ఆర్‌జీ ట్యాక్స్, ఆర్‌ట్యాక్స్, యూకే ట్యాక్స్, బీవీ ట్యాక్స్‌ పేరుతో వసూళ్లకు తెగబడింది. ఢిల్లీకి మూటలు మోసే పనిలో పడింది. పదేళ్లు కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకుంటే, ఇప్పుడు తెలంగాణ ప్ర భుత్వాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ దోచుకుంటోంది. పరిపాలనను పక్కనబెట్టి భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, కమీషన్లు, పర్సంటేజీల పేరుతో ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్మును పోటీపడి ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు ఢిల్లీకి కప్పం కట్టే పనిలో బిజీ అయిపోయారు’అని అని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

శంషాబాద్‌లో శుక్రవారం బీజేపీ రాష్ట్ర విస్త్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ’’మంత్రులు, ఎమ్మెల్యేలు సహా బీఆర్‌ఎస్‌ నాయకులు అవినీతికి పాల్పడని రంగం లేదు.

ల్యాండ్‌ మాఫియా, సాండ్‌ మాఫియా, గ్రానైట్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియా, డ్రగ్స్‌ మాఫియాలో కూరుకుపోయి ప్రజాధనాన్ని, రాష్ట్ర ఖజానాను లూఠీ చేశారు. పర్యవసానంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఆఖరుకు ఇప్పుడే పుట్టిన బిడ్డకు సైతం నెత్తిన లక్షల రూపాయల అప్పు మూటను మోపారు. తామేమీ తక్కువ కాదన్నట్లుగా కొత్తగా అధికారంలోకి వచి్చన కాంగ్రెస్‌ పార్టీ అక్రమ వసూళ్లకు తెగబడింది. 

ఢిల్లీకి మూటలు మోసే పనిలో పడింది. పేరు మారిందే కానీ పెద్దగా బీఆర్‌ఎస్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడాలేదు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్‌ పార్టీ అతితక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది.’’అని విమర్శించారు. 

ఫిరాయింపులే కార్యాచరణగా..  
’’ప్రజాపాలనపై సోయిలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రధాన కార్యాచరణగా ముందుకెళ్తోంది. గత బీఆర్‌ఎస్‌ పార్టీ మాదిరిగానే కాంగ్రెస్‌ పార్టీ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ప్రజా తీర్పునకు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తోంది. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పార్టీ మారితే డిస్‌ క్వాలిఫై చేయాలన్న కాంగ్రెస్‌పారీ్ట, తమ ఎజెండాను తుంగలో తొక్కింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కాంగ్రెస్‌లో చేర్చుకుంటుంది. గాంధీ భవన్‌ గులాబీ భవన్‌లా మారింది.’’అని కిషన్‌రెడ్డి నిందించారు.  

సెక్యూరిటీ లేకుండా రాహుల్‌కు ఓయూలో తిరిగే దమ్ముందా?: బండి సంజయ్‌ 
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందంటూ మాట్లాడుతున్న రాహుల్‌ గాం«దీకి సవాల్‌ విసురుతున్నా. తెలంగాణలో మీ కాంగ్రెస్‌ పార్టే అధికారంలో ఉంది కదా! సెక్యూరిటీ లేకుండా మీకు ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా? తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా ఏ స్థాయిలో విస్తరిస్తుందో వారిని కలిసి మాట్లాడితే తెలుస్తుంది.

అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన కాం గ్రెస్‌ పార్టీయే అంటువ్యాధి లాంటిది. మోదీరోజ్‌గార్‌ మేళాతో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అయినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని రాహుల్‌ గాంధీ చెప్పడం సిగ్గు చేటు’’అని కేంద్రమంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. 

రిటైర్డ్‌ పోలీసు అధికారిని చైర్మన్‌ చేయడం వల్లనే సమస్యలు: ఎంపీ రఘునందన్‌ 
’’ప్రభుత్వం ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారిని టీజీఎస్పీ చైర్మన్‌గా నియమించింది. ఆయన పదవీకాలం డిసెంబర్‌తో ముగియనుంది. తన హయాంలో ఉద్యోగాలు భర్తీ చేయాలన్న తప్పుడు ఆలోచనతోనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. డీఎస్సీ కోసం మరో 45 రోజుల సమయం కేటాయించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గ్రూప్‌–1,2,3 ఉద్యోగ పోస్టులను పెంచకుండా నిరుద్యోగులను మోసం చేసింది.

గ్రూప్‌–1 మెయిన్స్‌కు 1ః100 ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉండగా, ఇదే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిండు సభలో గుర్తు చేశారు’’అని ఎంపీ రఘునందన్‌ పేర్కొన్నారు. నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆధారాలున్నా కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదనీ, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ జరిపించాలని మాట్లాడిన రేవంత్‌ ఇప్పుడెందుకు నోరుమెదపడం లేదని రఘునందన్‌ నిలదీశారు.  

కాలేజీల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు: ఈటల 
ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీల యాజమాన్యాల నుంచి కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ టాక్స్‌ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. అందుకే విద్యార్థుల నుంచి యాజమాన్యాలు ఎక్కువ డబ్బులు తీసుకునే దుస్థితి నెలకొందన్నారు. కాంట్రాక్టర్లు, సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇచ్చే అధికారం తమకు లేదంటూ ఆర్థిక శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారన్నారు. శుక్రవారం శంషాబాద్‌లో బీజేపీ విస్తృత సమావేశం సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి బిల్లుకి 8 శాతం డబ్బులు ముందు చెల్లిస్తేనే బిల్లులు విడుదల చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్‌ డబ్బులు కూడా లంచం ఇస్తే తప్ప వచ్చేలా లేవన్నారు.

ప్రతిబిల్లుకి డబ్బులు తీసుకునే నీచ సంస్కృతి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో వచి్చందని మండిపడ్డారు. ఏడు నెలల కాలంలోనే అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ కాంగ్రెస్‌ అని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల క్రమబదీ్ధకరణకు సంబంధించి జీవో నంబర్‌ 58, 59ని అమలు చేస్తానని హామీ ఇచి్చన రేవంత్‌రెడ్డి దానిని మరచారన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం లేదని, కాంగ్రెస్‌ పట్ల విశ్వాసం లేదని, ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు వచి్చనా గెలుపొందేది బీజేపీయేనని ధీమా వ్యక్తంచేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement