Kishan Reddy
-
ఈ అమానుష దాడి దురదృష్టకరం: కిషన్‌రెడ్డి
ఢిల్లీ: చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు. ‘చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగ రాజన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలి.ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న శ్రీ రంగరాజన్.. దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో ముందువరసలో ఉన్నారు. దీన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నాను. బీజేపీ శ్రీ రంగరాజన్ గారికి అన్నిరకాలుగా అండగా నిలబడుతుంది మనవిచేస్తున్నాను’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.దాడి ఇలా.. సీఐ పవన్‌కుమార్ కథనం ప్రకారం శుక్రవారం రంగరాజన్ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పని చేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కోరారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని, సహకరించకుంటే నిన్ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని, ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.🚨Great job, Telangana law and order—thriving for all the wrong reasons!What a proud moment for our society—when even a deeply respected figure like Sri Rangarajan garu, the chief priest of Chilkur Balaji Temple and a staunch advocate for Dharma, isn’t spared from goons.… pic.twitter.com/sVeNmCiXus— VoiceofValor (@VoiceofValr) February 10, 2025 -
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కార్పొరేటర్లంతా పూర్తి సమయం కేటాయించాలని కిషన్ రెడ్డి కోరారు. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికలకు.. ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలు, ప్రజలకు చేకూరే లబ్ధి, ప్రాజెక్టులు, నిధులను వివరించాలని కోరారు.జీహెచ్ఎంసీ మేయర్ పీఠం సాధిస్తే.. అనంతరం రాష్త్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందనే సంకేతాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్టాండింగ్ కమిటీపై మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. జీహెచ్ఎంసీ పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానంపై బీఆర్ఎస్, ఎంఐఎంలు ఎలా వ్యవహరిస్తాయో చూసి.. దానికనుగుణంగా బీజేపీ వ్యూహం ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా.. పార్టీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. కేజ్రీవాల్ ఓటమితో బీఆర్ఎస్లో కలకలంబీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో జతకట్టాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సూచించడంపై కేంద్రమంత్రి, జి.కిషన్‌రెడ్డి స్పందించారు. ‘లిక్కర్ స్కామ్ భాగస్వామి’ అయిన కేజ్రీవాల్ ఓడిపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందని, అందుకే పాత దోస్తు అయిన కాంగ్రెస్‌తో మరోసారి బహిరంగంగా జతకట్టేందుకు కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. -
అన్ని సీట్లూ గెలవాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు (రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్) సీట్లనూ గెలుచుకుని సత్తా చాటాలని బీజేపీ తీర్మానించింది. ఈ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహం, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకోసం వెంటనే రంగంలో దిగాలని నిర్ణయించింది. కేంద్రమంత్రులు, ఎంపీస్థాయి నేతలు మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు పూర్తిగా ఈ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి, అనుకున్న ఫలితాలను సాధించాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించింది. శనివారం ఓ స్టార్ హోటల్లో తొలుత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, ఆ తర్వాత రాష్ట్రపదాధికారులతో జరిగిన కీలక సమావేశాల్లో.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్– నిజామాబాద్– మెదక్– ఆదిలాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, ఇదే నియోజకవర్గం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, నల్లగొండ– ఖమ్మం– వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డిలను రాష్ట్ర నాయకత్వం పరిచయం చేసింది. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రానున్న రోజుల్లో కర్ణాటక, తెలంగాణలో స్వతంత్రంగా అధికారంలోకి వస్తాం. కేరళ, తమిళనాడులో కూడా బీజేపీ బలం పెరిగింది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పట్ల వివక్షతో వ్యవహరిస్తోంది’అని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ప్రతిఒక్కరూ చైతన్యంతో ఆలోచించి ప్రజల పక్షాన నిలిచిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్రరావు, పొంగులేటి సుధాకరరెడ్డి, పారీ్టనేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు, డా.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చారు’
హైదరాబాద్: ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అక్కడ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈరోజు(శనివారం) ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ఇది ఢిల్లీ(Delhi Assembly Elections 2025) ప్రజల స్పష్టమైన తీర్పు అని తేల్చిచెప్పారు.ఢిల్లీ గల్లీలో దుర్గంధం చూస్తే అన్నం కూడా తినలేం. ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈ తీర్పునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి 400 సీట్లు ఇవ్వనందుకు ప్రజలు బాధపడుతున్నారు. అందుకే ఆ తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం అందిస్తున్నారు ప్రజలు. ఢిల్లీలో కేజ్రీవాల్ బాగుపడ్డాడు తప్ప.. పేద ప్రజల బతుకులు మారలేదు. గల్లీ గల్లీలో లిక్కర్ షాపులు ఏర్పాటు చేశారు. ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చిన ఘనత కేజ్రీవాల్‌ది. లిక్కర్ స్కాం తో ఢిల్లీ ప్రజలు తలదించుకున్నారు. ఢిల్లీ ప్రజల చేతిలో కేజ్రీవాల్, ిసిసోడియాలు చావుదెబ్బ తిన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు.అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసే సత్తా మోదీ(Narendra Modi)కే ఉందని ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ పాలన చూశాక వారికి పొరపాటున కూడా ఓటేయొద్దని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అతి తక్కువ కాలంలో వ్యతిరేకత మూటగట్టుకుంది. తొందర్లోనే ఢిల్లీ తీర్పు తెలంగాణలో రాబోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలపై బీజేపీ మాత్రమే కొట్లాడుతుందని ప్రజలు నమ్ముతున్నారు’ అని ఈటెల పేర్కొన్నారు.కాంగ్రెస్ దీన స్థితి చూస్తే జాలేస్తోంది: కిషన్‌రెడ్డి -
కాంగ్రెస్ కు గాడిద గుడ్డు.. ఉచితాలతో అధికారం రాదు
-
అజయ్ కోసం హుస్సేన్ సాగర్‌లో గాలింపు
హైదరాబాద్, సాక్షి: ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటన తర్వాత అజయ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్‌లో రెండు బృందాలతో ఈ ఉదయం నుంచి అధికారులు గాలింపు చేపట్టారు. మరోవైపు.. యువకుడి తల్లిదండ్రుల రోదనలతో ఈ ప్రాంతం మారుమోగుతోంది. కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్(21)గా నిర్ధారణ అయ్యింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి భరతమాత మహా హారతి కార్యక్రమం కోసం అజయ్ ట్యాంక్ బండ్‌కు వచ్చాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. మరోవైపు.. అతని ఆచూకీ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అజయ్‌కు ఈత రాదని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఉదయం నుంచి గజఈతగాళ్లతో సాగర్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.ఘటనపై కేసు నమోదుహుస్సేన్ సాగర్‌లో భారతమాత హారతి అపశ్రుతి ఘటనపై కేసు నమోదయ్యింది. బోటు టూరిజం ఇన్‌ఛార్జి ప్రభుదాస్ ఫిర్యాదుతో లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆదివారం భరతమాతకు మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి కొద్దిక్షణాల ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లారు. అనంతరం ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్‌లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలో ఉండగా... సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవ్వగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. -
హుస్సేన్ సాగర్ తీరంలో ఘనంగా భారతమాతకు మహా హారతి (ఫొటోలు)
-
సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతృప్తిగా లేరు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి చెందిన ప్రజలూ సంతృప్తికరంగా లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, వ్యాపారులు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సంతృప్తికరంగా లేరన్నమాట వాస్తవం. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ లేదు.యువతకు ఇస్తామన్న రూ.4వేల నిరుద్యోగ భృతి లేదు, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు లేదు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న రూ.2,500 ఆర్థిక సహాయం రాలేదు. రైతులకు చేస్తామన్న రుణమాఫీ పూర్తి చేయరు, రైతు భరోసా కూడా అరకొరే. ఆటో డ్రైవర్లు మొదలుకొని గీత కార్మికుల వరకూ కార్మికులకు ఇస్తామన్న భరోసా దొరకదు. దళితులకు ఇస్తామన్న రూ.12 లక్షలు మరిచిపోయారు. బెదిరింపులతో వ్యాపారాలకు అనువైన వాతావరణాన్ని దెబ్బ తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలకు అంతేలేదు. సామాన్య ప్రజలు మొదలుకొని తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో అసంతృప్తితో ఉన్నారు..’ అని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్.. బొమ్మా బొరుసు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ప్రజలు చూస్తున్నారని, అభివృద్ధిలో ఈ రెండు పార్టీల వైఖరి బొమ్మ, బొరుసు మాదిరి ఉందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పలువురు యువకులు ఆదివారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కాలయాపన చేస్తున్నాయని, రెండు పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలని ఆరోపించారు.ఈ రెండు పార్టీల నేతలు రాష్ట్ర ఖజానాను దోపిడీ చేశారని మండిపడ్డారు. విశ్వనగరమని చెబుతూ వీధుల్లో కనీసం లైట్లు కూడా లేవన్నారు. ప్రభుత్వ శాఖల్లో కిందిస్థాయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. లిక్కర్ మీద వచ్చే డబ్బులు కూడా ఇతర వాటికి మళ్లిస్తున్నారని, దీంతో లిక్కర్ కంపెనీలు కూడా రాష్ట్రానికి మద్యం ఇవ్వమని చెబుతున్నాయన్నారు. బీజేపీపై నమ్మకంతో ప్రజలు 8 పార్లమెంటు సీట్లు కట్టబెట్టారన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నా రు. రాష్ట్రంæ అప్పుల కుప్పగా మారడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని మండిపడ్డారు. అవినీతి మచ్చ లేకుండా మూడు దఫాలుగా మోదీ ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాం«దీకి లేదన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదకొండేళ్లుగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేసిందని, ఈ దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా ఉండే కులసంఘాలు, ఇతర సంస్థలతో కలసి పనిచేస్తామన్నారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించే అవకాశముందని వస్తున్న వార్తలపై స్పందించాలని విలేకరులు కోరినపుడు.. కేంద్ర మంత్రిగా ప్రజలకు, తన శాఖలో పనిచేస్తున్న వారికి సేవ చేయాలని అనుకుంటున్నానని ఆయన బదులిచ్చారు. తన బొగ్గు, గనుల శాఖ పరిధిలో 6 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి రూ.కోటి బీమా పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించే అవకాశం ఉందనే ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిస్తూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే వారికి ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలని నిబంధన లేదు. బీజేపీ అధ్యక్ష పదవికి రెండు సార్లు క్రియాశీల సభ్యుడు అయి ఉండాలి. అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు. ఆ నిబంధన ఆయనకు వర్తించదు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను నేతల ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తారు. నామినేషన్ పద్ధతిలో వారం తర్వాత కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు’అని తెలిపారు. మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో అన్నింటిలోనూ గెలుస్తామనే నమ్మకం తమకుందన్నారు. ‘రాష్ట్రంలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు కదా’అన్న ప్రశ్నకు.. ఎన్నికలు ఉంటాయంటున్న కేటీఆర్, సుప్రీంకోర్టు జడ్జి కూడా అయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. సినీహీరో చిరంజీవి బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు.. ‘నా ఆహ్వానం మేరకు ఇటీవల ఆయన ఢిల్లీకి వచ్చారు, అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. కొందరు పార్టీలో చేరారు. మంత్రులు అయ్యారు. కొందరు పార్టీకి ప్రచారం చేశారు. ఇకపై ఏవైనా ఫంక్షన్లకు నేను పిలిస్తే వస్తారంటే నాగార్జున, వెంకటేశ్, ఇతర హీరోలను కూడా పిలుస్తాను’అని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ఉచితాలు వద్దని ఎక్కడా చెప్పలేదు.. ‘బీజేపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, ఉచితాల (ఫ్రీ బీస్)కు వ్యతిరేకం కాదు. ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు. రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని హామీలివ్వాలి’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. తెలంగాణలో టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, రీజినల్ రింగ్ రోడ్ నేనే తెచ్చా. ప్రధానిని ఒప్పించి మహబూబ్‌నగర్ సభలో పసుపు బోర్డు ప్రకటన నేనే చేయించా. మూసీ సుందరీకరణకు కేంద్రం నిధులను నిబంధనల మేరకు కచ్చితంగా ఇస్తాం. హైదరాబాద్ మెట్రోకి రూ.1,250 కోట్లు కేంద్రం ఇచ్చింది. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు కచ్చితంగా సహకరిస్తాం. రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కేంద్రం డబ్బులు ఇచ్చింది. అలైన్మెంట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘తెలంగాణలో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎంఐఎం సహకరిస్తోంది. బీజేపీపై విషం చిమ్మడమే ఎంఐఎం నేతలు పనిగా పెట్టుకున్నారు. దేశంలో ముస్లింనేతగా ఎదగాలన్న ఆశతో ఆ పార్టీనేత అసదుద్దీన్ ఒవైసీ పిట్టల దొరగా మారారు’అని విమర్శించారు. -
త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ (RSS) నేపథ్యం ఉండాలన్న నిబంధనేది లేదని, వారం రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. శనివారం(జనవరి18) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు.‘ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను నేతల ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేస్తారు.వారం రోజుల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో తర్వాత ప్రెసిడెంట్ ఎవరో తెలిసిపోయింది.బీఆర్ఎస్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.బీజేపీలో వచ్చే అధ్యక్షుడు ఎవరో ఎవరు చెప్పలేరు. కొత్త సభ్యత్వాలు,పోలింగ్ బూత్ కమిటీలు,మండల కమిటీలు పూర్తయ్యాయి.జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ నడుస్తోంది.600 మండల కమిటీలు పూర్తి చేస్తాం..అందులో 50 శాతంపైగా బీసీలకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చాం.పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇస్తాం.స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదు..బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి మూడు వాయిదాల నిధులు రాలేదంటే అందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడమే.రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా ? ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు.రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని పథకాలు అమలు చేయాలి. కేంద్రానికి వచ్చే ఆర్థిక వనరులను బేరీజు వేసుకొని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.హైదరాబాద్‌లో ఏడు నెలలుగా వీధి దీపాలు కాలిపోతే నిధుల కొరత ఏర్పడింది. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. తెలంగాణలో మద్యంపై వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేశారు.హైడ్రా కొత్తది కాదు..గతంలో ఉన్నదానిని పేరు మార్చారు.మూసీ సుందరీకరణకు నిబంధనల మేరకు కేంద్రం నిధులు ఖచ్చితంగా ఇస్తాం’అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఆనందం.. ఆరోగ్యం ఇవ్వాలి..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన ఈ సంబరాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. మోదీకి కిషన్‌రెడ్డి కుటుంబస భ్యులతోపాటు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి తదితరులు స్వాగతం పలికారు. నేరుగా తులసికోట వద్దకు చేరుకొని అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయి ద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య భోగి మంటలు వెలిగించారు.గంగిరె ద్దులకు వృషభ పూజ చేశారు. అక్కడి నుంచి సంప్రదాయ, జానపద కళాకారుల నృత్యా లు, డప్పు చప్పుళ్ల మధ్య సభాస్థలి వరకు మోదీకి స్వాగతం పలికారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వేదికపై ప్రధాని మోదీ జ్యోతి వెలిగించారు. ప్రముఖ గాయని సునీత శ్లోకం అలపించగా, ఢిల్లీ నా ట్య అకాడమీ బృందం నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇది సంస్కృతి, సమృద్ధి, పునరుద్ధరణ వేడుక: మోదీ సంక్రాంతి పండుగ సంస్కృతి, పునరుద్ధర ణల వేడుక అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘నా మంత్రివర్గ సహచరుడు జి.కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరయ్యాను. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా చూసి ఆనందించాను. ఇది మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయాలల్లో అంతర్భాగ మైన కృతజ్ఞత, సమృద్ధి, పునరుద్ధరణల వేడుక. సంక్రాంతి అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతోపాటు రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నాను’అంటూ ట్వీట్ ముగించారు. సంకాంత్రి అంటే రైతుల పండుగ: కిషన్రెడ్డిసంక్రాంతి అంటేనే రైతులు..గ్రామాల పండుగ అని కిషన్‌రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో తొలిసారిగా తన అధికార నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించానని తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్, గజేంద్రసింగ్ షెకావత్, జ్యోతిరాధిత్య సింథియా, మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, సతీష్‌చంద్ర దూబే, శ్రీనివాస్‌వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు కె.లక్ష్మణ్, అనురాగ్ ఠాకూర్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, గోడెం నగేష్, బాలశౌరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే.అరుణతోపాటు, తెలంగాణ, ఏపీకి చెందిన బీజేపీ నేతలు, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, క్రీడాకారిణి పీవీ.సింధు, మంగ్లీ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. -
కిషన్‌రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు.. హాజరైన ప్రధాని
సాక్షి,న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సోమవారం(జనవరి13) సాయంత్రం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని తొలుత తులసి చెట్టుకు పూజ చేశారు.అనంతరం గంగిరెద్దులకు అరటిపళ్ళు తినిపించి,నూతన వస్త్రాలు బహుకరించారు. భోగి రోజు కావడంతో భోగి మంట వేశారు. ఈ సంబరాలకు ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,పలువురు కేంద్రమంత్రులు,బీజేపీ ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.అంతకుముందు సినీ నటుడు చిరంజీవి,ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు,బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి సంక్రాంతి వేడుకలకు ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ గాయని సునీత గీతాలాపనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. -
కాంగ్రెస్ వాళ్లు ఒక్కరూ కూడా బయట తిరగలేరు.. ఖబడ్దార్: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(kishan Reddy) తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.బీజేపీ(Telangana BJP Office) రాష్ట్ర కార్యాలయంపై దాడి నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..‘తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తున్నాం. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడటం దుర్మార్గం.రాళ్లు, కర్రలతో కాంగ్రెస్ గూండాలు పోలీసుల సమక్షంలో, పోలీసులతో కలిసి వచ్చి ఆఫీసుపైన, బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు, భౌతిక దాడులకు తావు లేదు. ఇలాంటి రాజకీయాలకు మేం పూర్తి వ్యతిరేకం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి కక్షపూరిత, ద్వేషపూరిత రాజకీయాలు రాష్ట్రంలో పెరిగిపోయాయి. గతంలో సొంతపార్టీకి చెందిన ముఖ్యమంత్రులను గద్దెదించేందుకు మతకల్లోలాలు సృష్టించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసమర్థ పాలనతో ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న తరుణంలో.. అసహనంతో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి దాడులను ఆపకపోతే.. ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యాలయంపై దాడిచేసి.. మా కార్యకర్తలను గాయపరిచిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదు. ఖబడ్దార్, అసహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రెస్‌కు ఉన్న కొద్దిపాటి నాయకులు తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయి.రాష్ట్రంలో ఈ రకమైన దాడులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మా సహనాన్ని అసమర్థతగా భావించవద్దు. మేం హింసా రాజకీయాలను ప్రోత్సహించం. అలాగని మాపై దాడులు చేస్తే సహించం. ఎవరి వ్యాఖ్యలైనా మీకు నచ్చకపోతే.. నిరసన తెలియజేయండి అంతే కానీ.. కార్యాలయంపై భౌతికంగా దాడి చేయడం, రాళ్లు, కర్రలతో దాడికి దిగడం సరికాదు. తన వ్యాఖ్యలకు ఢిల్లీకి చెందిన మాజీ ఎంపీ రమేశ్ బిదూరీ గారు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా.. అసహనంతో దాడులు చేయడం సరైనదేనా?.గతంలోనూ ప్రధానమంత్రికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ ఎక్కడైనా దాడులు చేసిందా?. ఈ వ్యాఖ్యలకు ఒక్కసారి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక్కసారైనా క్షమాపణలు చెప్పారా?. అలాంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీకి లేదు. మేం దీనికి ప్రతిగా సమాధానం చెబితే.. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు దేశంలో రోడ్లపై తిరగలేడు. కానీ ఇది మా సంస్కృతి కాదు. మీ సంస్కృతిని మార్చుకోండి అంటూ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: రాళ్లు, కర్రలతో దాడి.. బీజేపీ ఆఫీసు వద్ద ఉదద్రిక్తత.. -
కోతలే తప్ప చేతలు లేవు
సాక్షి. హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీది ప్రజాప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం. అది చేతల ప్రభుత్వం కాదు.. మాటలు, కోతల ప్రభుత్వం మాత్రమే’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి ఇచి్చన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారంఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆ పార్టీ నాయకుల ఆర్థిక స్థితిలో మార్పు వచ్చిందే తప్ప ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు. ఆశచూపి వెన్నుపోటు కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆశచూపి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రైతు లు, కూలీలు, కౌలు రైతుల డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉండగా.. మళ్లీ ఎందుకు దరఖాస్తులు అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘గతంలో దరఖాస్తులు తీసుకున్నారు..సర్వే చేశారు.. ఇప్పుడు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఎందుకు? రైతు భరోసా కింద ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కా రు కూడా సంకెళ్లు వేసింది’అని విమ ర్శించారు. రైతులకు నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నట్లు నవంబర్ 30వ తేదీనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఆ డబ్బులు ఇంకా రైతు ల ఖాతాల్లో పడలేదని తెలిపారు.ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి రెండో వారంలో రైతుల సమస్యలు, హామీల అమలుపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల ఆఫీసర్లు, తహసీల్దార్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచినప్పుడు తమ ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రకటిస్తుందని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు కేంద్రం అండగా నిలుస్తుంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం దిల్ కుశ అతిథి గృహంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, సమగ్ర శిక్ష ప్రతినిధులు.. కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సమగ్ర శిక్ష కార్యక్రమ అమలుకు కేంద్రం తన వాటా కింద 60 శాతం నిధులు, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ఉద్యోగుల సంఘం నేతలు యాదగిరి, అనిల్ చారి తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందు కు సమగ్ర శిక్ష ఉద్యోగులు కృషి చేస్తున్నా, చాలీచాలని వేతనాల తో సతమతమవుతున్నామని వాపోయారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం ఇచ్చే 60 శాతం నిధుల వాటాను కొనసాగించాలని ఉద్యోగులు కిషన్‌రెడ్డిని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించం’
సాక్షి,హైదరాబాద్: ‘రైతుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించబోమని’ కాంగ్రెస్ (congress) ప్రభుత్వానికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)హెచ్చరించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘రుణ మాఫీ వచ్చే నాలుగేళ్లలో కూడా పూర్తిస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. 35 రోజుల క్రితం రుణమాఫీ చెక్కు ఇచ్చినా..ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో డబ్బులు జమకాలేదు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది.పండిన ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది. ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం 26 వేల కోట్లు ఖర్చుపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పట్టు లేదా ? రైతులంటే పట్టింపు లేదా ? ఎందుకు ధాన్యం కొనుగోలు చేయలేకపోతుంది ?.రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. పత్తి, వరి పంటలను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ భారం అంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. రైతులపై భారం పడకుండా రైతు పక్షపాతిగా మోదీ (narendra modi) ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది’ అని అన్నారు. -
రీజినల్ రింగ్ కోసం కేంద్రం టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టింది
-
జీవితాంతం అంబేడ్కర్‌ను అవమానించారు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను జీవితాంతం అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆయనకు భారతరత్న ఇవ్వకపోగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కనీసం చిత్రపటం కూడా ఏర్పాటు చేయకపోవడం చూస్తే కాంగ్రెస్‌కు అంబేడ్కర్ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇందిరాగాంధీ సహా ఎంతోమందికి భారతరత్న ఇచి్చనా.. కాంగ్రెస్ అంబేడ్కర్‌కు ఇవ్వలేకపోయిందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ కావాలనే ఓడించిందని ఆరోపించారు. ఎన్డీయే హయాంలోనే అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చామని గుర్తుచేశారు. ఏడాదిపాటు వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాజ్‌పేయి జీవితం దేశానికి ఆదర్శమని, ఆయన ప్రసంగం వినడానికి దేశం నలుమూలల నుంచి వేలాదిమంది వచ్చేవారన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో వాజ్‌పేయి జనసంఘ్ నేతలతో కలిసి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, వారి సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ రాజకీయాల గురించి ప్రజలకు వివరిస్తూ.. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఇంటింటికీ తెలియచేస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. అబద్ధాల్లో కాంగ్రెస్‌కు ఆస్కార్: బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ 70 ఎంఎం సినిమా చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాజ్‌పేయి అందరికీ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. దేశభక్తి, అభివృద్ధి, చతుర్భుజి పేరిట జాతీయ రహదారుల నిర్మాణంతో దేశాన్ని ఒక ప్రాంతంతో మరో ప్రాంతాన్ని అనుసంధానించారన్నారు. అన్ని పారీ్టల్లోనూ ఆయనను అభిమానించే నేతలు ఉన్నారని చెప్పారు. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు జరుగుతున్నాయన్నారు. సంతుïÙ్టకరణ విధానాలకు వాజ్‌పేయి వ్యతిరేకమని, అవినీతికి ఆమడదూరం ఉన్నారని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్‌పేయి మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌కు, అంబేడ్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని, అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్ అంబేడ్కర్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతికి కృషి: భట్టి మధిర: క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం రోమన్ కేథలిక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని మతాల అభ్యున్నతికి స్థిర సంకల్పంతో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు. -
దేశం గర్వించదగ్గ గొప్ప నేత
సాక్షి, హైదరాబాద్: దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖ్యులని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది కొనియాడారు. వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మారకోపన్యాసంలో త్రివేది ప్రసంగించారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు నాయకులుగా పుట్టి ప్రధాని పగ్గాలు చేపట్టింది ఇద్దరేనని.. వారిలో వాజ్‌పేయి అయితే మరొకరు నరేంద్ర మోదీ అన్నారు. వాజ్‌పేయి ఆలోచలను ప్రధాని మోదీ అనుసరిస్తున్నారని త్రివేది చెప్పారు. దేశంలో మౌలికవసతుల కల్పనకు వాజ్‌పేయి బీజం వేస్తే దాన్ని మోదీ వటవృక్షం చేశారన్నారు. విద్యతోపాటు, నైపుణ్యం, డిజిటల్ విద్య, డిజిటల్ ఎకానమీ వరకు అన్నింటినీ గ్రామాల చెంతకు చేర్చారని ప్రశంసించారు. నాటి వాజ్‌పేయి ప్రభుత్వం దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రస్తుతం మోదీ సర్కారు అణ్వాయుధాలను భూమ్యాకాశాల నుంచి ప్రయోగించే సామర్థ్యానికి తీసుకెళ్లిందని గుర్తుచేశారు. అందరినీ మెప్పించిన నేత వాజ్‌పేయి: కిషన్‌రెడ్డి అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పాయ్ పేరు కాదని, ఒక చరిత్ర అని అన్నారు. దేశ ప్రధానిగా, కేంద్రమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధినేతగా వేలెత్తి చూపించలేని పనితీరుతో అందరినీ మెప్పించారన్నారు. చివరి శ్వాస వరకు జాతీయ వాదానికి, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. అటల్జీ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామన్నారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ వాజ్‌పేయిని ప్రజలు దేశానికి ఒక కాంతిరేఖగా గుండెల్లో దాచుకున్నారన్నారు. అలాంటి వ్యక్తి పాలనలో పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, వాజ్‌పేయి ఫౌండేషన్ చైర్మన్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన కిషన్‌రెడ్డి
ఢిల్లీ : అల్లు అర్జున్ ఇంటిపై పలువురు దాడి చేసిన ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఇది రాష్ట్రంలోని శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలన అసమర్థతను ఇలాంటి సంఘటనలు ప్రతిబింబిస్తాయన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. ఈ ఆందోళన కాంగ్రెస్‌కు మద్దతుగానా?, లేక స్పాన్సర్డ్గానా అని ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. The incident of stone pelting at actor Allu Arjun's residence in Hyderabad highlights the shocking failure of law and order under the Congress government in the state. Incidents reflect the administration's inability to protect & ensure the safety and security of citizens.… pic.twitter.com/xhRMmNs1mj— G Kishan Reddy (@kishanreddybjp) December 22, 2024 ‘స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్’.. సోషల్ మీడియాలో వైరల్అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి -
జార్జ్ సోరోస్ తో మీకు సంబంధాలు లేవా! కిషన్ రెడ్డి కౌంటర్
-
‘రేవంత్ ధర్నా చూసి జనం నవ్వుకున్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మంత్రి వర్గ సహచరులతో.. అనుచరులతో రాజ్ భవన్ ముందు ధర్నా చెయ్యడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా అనిపించింది. ఏడాదిగా పాలనలతో.. సరైన పాలన లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి మీద గాని ముందుడుగు పడటం లేదు.👉ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్నిరకాల వైఫల్యంతో.. 12 ఏళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు అదానీ విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. వందకోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా?.. వందకోట్ల సహాయం ఎందుకు అడిగారు? ఎందుకు ఇస్తామన్నారు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.👉కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నా.. రేవంత్ అయినా రాహుల్ గాంధీ అయినా.. ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలి. ఒక సాక్ష్యం చూపిస్తారా?. మన మీడియా ముందు, న్యాయస్థానాల ముందు, ప్రజలముందు ఆధారాలు చూపించకుండా.. విమర్శలు చేయడం సరికాదు.👉గత పార్లమెంటు ఎన్నికల్లో ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న పార్టీ.. ఇవాళ ఫ్రస్టేషన్ లో అదానీ మాట మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని, కేంద్రం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరూపించగలరా?.👉మాటమీద నిలబడే సత్తాలేక.. ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచదేశాల ముందు భారతదేశాన్ని నవ్వలుపాలు చేస్తున్నది, భారత దేశ గౌరవ వ్యవస్థలపైన.. విదేశాల్లో మన సైనికుల మీద పరువు తీసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైన రాహుల్ గాంధీకి ఉంది.👉రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైపే ఉన్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తులే. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే రావాలని కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్ రెడ్డికి హెచ్చరించిందా?. అందుకే రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పాట పాడుతున్నాడా?. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు.. దొందూ దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచించడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
పరిపాలనా సౌలభ్యం కోసమే భాషల ఫార్ములా: కిషన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చాకే 21 భాషలకు స్థానం దక్కిందన్నారు. అలాగే, భాషలు.. మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయం అని చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదు. 121 భాషలు, మన దేశంలో ఉన్నాయి. మన రాజ్యాంగంలో 14 అధికార భాషలుండేవి. మోదీ ప్రభుత్వం వచ్చాకా 21 భాషలకు స్థానం దక్కింది. భాషలు మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయాలు. ఎన్డీయే ప్రభుత్వం, వాజ్‌పేయి గారి నేతృత్వంలో ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యత ఇచ్చారు. భాష మన సంస్కృతికి ఆత్మ వంటిదని వాజ్‌పేయి చెప్పేవారు.జ్ఞానాన్ని ప్రసరింపజేసేందుకు 1835లో మెకాలే ద్వారా భారత శాస్త్రీయ భాషల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం జరిగింది. ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్ర్యానంతరం.. 1956లో భాష ఆధారిత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగినపుడు.. దేశానికి సహకార సమాఖ్య, పాలనాపరమైన అంశాల కోసం భాష కీలకమైన అంశంగా మారింది. పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు భాషల ఫార్ములాను రూపొందించారు. ఈ ఫార్ములా వినియోగంలో ప్రజలు సంతృప్తిగా లేని కారణంగా మార్పులు తీసుకురావాలనే డిమాండ్ పెరిగింది. దీనికి అనుగుణంగా ప్రధాని మోదీ 2020లో NEP-2020 నూతన జాతీయ విద్యావిధానం ద్వారా కనీసం రెండు ప్రాంతీయ భాషలను విద్యార్థులు నేర్చుకునేలా ప్రోత్సాహాన్ని అందించారు’ అని కామెంట్స్ చేశారు. -
కేంద్రం సాయం చేసేలా సహకరించండి: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కావల్సిన చేయూతపై కిషన్‌రెడ్డితో చర్చించారు. ట్రిపుల్ ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్, వరంగల్‌లో సీవరేజీ, భూగర్భ డ్రైనేజీ, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలను ప్రస్తావించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం సాయంత్రం కిషన్‌రెడ్డితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ భేటీల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, గడ్డం వంశీ, సురేశ్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనుమతులు ఇప్పించండి ‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలు, ఇండ్రస్టియల్ హబ్‌లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కులు వంటివి అభివృద్ధి అవుతాయి. ఆర్ఆర్ఆర్కు సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయండి. మెట్రో ఫేజ్–2 సంయుక్తంగా చేపట్టేలా చూడండి మెట్రో ఫేజ్–2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీ నగర్–హయత్‌నగర్ మధ్య మొత్తం 76.4 కి.మీ మేర నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో దీనిని చేప్టటేందుకు సహకరించాలి. ‘మూసీ’కి అనుమతులు, నిధులు కావాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. దీనితో పాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణం ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశాం. ఈ మేరకు అనుమతులు, నిధుల మంజూరుకు సహకరించాలి.· మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించాం. ఆ మొత్తం విడుదలకు సహకరించాలి. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీకి ప్రణాళిక రూపొందించాం. రూ.4,170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రణాళికను అమృత్–2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టేలా చూడండి. సింగరేణి సంస్థ దీర్ఘకాలం పాటు మనుగడ కొనసాగించేందుకు గాను గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించండి..’ అని కిషన్‌రెడ్డిని సీఎం కోరారు. ఆర్ఆర్ఆర్ అనుమతులు వెంటనే ఇవ్వండి ‘ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159 కి.మీ) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్–765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. అయితే మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ, పర్యావరణ శాఖల నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకం ఎదురవుతోంది. దీనివల్ల కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కాబట్టి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేయండి. ఇది నిర్మిస్తే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాల మధ్య 45 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. హైదరాబాద్–విజయవాడ డీపీఆర్ త్వరగా పూర్తి చేయండి హైదరాబాద్–విజయవాడ (ఎన్‌హెచ్–65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయండి. వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి. పర్వత్‌మాల ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి దేవాలయం, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయండి. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయండి. నల్లగొండ జిల్లాలో ఎన్‌హెచ్–65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయండి..’ అని నితిన్ గడ్కరీతో భేటీలో రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి ‘ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు. కానీ రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదు. కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించండి. డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అయినప్పటికీ.. ఇటీవల కేవలం కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఓసీ కూడా తప్పకుండా తీసుకునేలా చూడండి..’ అని ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి కోరారు. నేడు ఏఐసీసీ నేతలతో సీఎం భేటీ! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల ¿భర్తీ వంటి అంశాలపై చర్చించవచ్చని సమాచారం.