సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ | BJP Telangana President Kishan Reddy writes A letter To CM Revanth | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

Published Mon, Feb 24 2025 3:01 PM | Last Updated on Mon, Feb 24 2025 4:21 PM

BJP Telangana President Kishan Reddy writes A letter To CM Revanth

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనపై  కిషన్‌కెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. ‘14 నెలల మీ పాలన అసంతృప్తిగా ఉంది. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా?, రిటైర్‌మెంట్ బెన్ ఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయం?, ఉద్యోగులకు రోటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటు,  నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు మీరు ఏ సందేశం ఇస్తున్నట్లు?, కళాశాలల యాజమాన్యాలపట్ల మీ తీరు దుర్మార్గం, ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారు. 

కాలేజీల యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే దుస్థితి దాపురించింది. ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం ఎంత వరకు కరెక్ట్?, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమవడం సిగ్గు చేటు, నిరుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా రూ.56 వేల బకాయిపడి యువతను దగా చేశారు. మీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా యుద్ద ప్రాతిపదికన బకాయిలు విడుదల చేయండి. ఈరోజే రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయండి. 

ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ బకాయిలన్నీ ఈరోజే విడుదల చేయండి. యువత అకౌంట్లలో 14 నెలల బకాయి కలిపి రూ.56 వేల నిరుద్యోగ భృతి జమ చేయాలి. ఇవన్నీ యుద్ద ప్రాతిపదికన విడుదల చేసిన తరువాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. దగా హామీలు, మోసపు మాటలతో మభ్యపెడితే మోసపోయేందుకు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు సిద్ధంగా లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement