‘రేవంత్‌ ధర్నా చూసి జనం నవ్వుకున్నారు’ | BJP Kishan Reddy Satires On Cm Revanth Reddy Raj Bhavan Protest | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌ రాజ్‌భవన్‌ ధర్నా చూసి జనం నవ్వుకున్నారు’

Published Wed, Dec 18 2024 4:45 PM | Last Updated on Wed, Dec 18 2024 5:00 PM

BJP Kishan Reddy Satires On Cm Revanth Reddy Raj Bhavan Protest

న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, తన మంత్రి వర్గ సహచరులతో.. అనుచరులతో రాజ్ భవన్ ముందు ధర్నా చెయ్యడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ  ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా అనిపించింది. ఏడాదిగా పాలనలతో.. సరైన పాలన లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి మీద గాని ముందుడుగు పడటం లేదు.

👉ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్నిరకాల వైఫల్యంతో.. 12 ఏళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి  ప్రజలు  నవ్వుకుంటున్నారు. అసలు అదానీ విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. వందకోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా?.. వందకోట్ల  సహాయం ఎందుకు అడిగారు? ఎందుకు ఇస్తామన్నారు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.

👉కాంగ్రెస్ పార్టీని  సవాల్ చేస్తున్నా.. రేవంత్ అయినా రాహుల్ గాంధీ  అయినా.. ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలి. ఒక సాక్ష్యం చూపిస్తారా?. మన మీడియా ముందు, న్యాయస్థానాల ముందు, ప్రజలముందు ఆధారాలు చూపించకుండా.. విమర్శలు చేయడం సరికాదు.

👉గత పార్లమెంటు ఎన్నికల్లో ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న పార్టీ.. ఇవాళ ఫ్రస్టేషన్ లో అదానీ మాట మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని, కేంద్రం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరూపించగలరా?.

👉మాటమీద నిలబడే సత్తాలేక.. ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచదేశాల ముందు భారతదేశాన్ని నవ్వలుపాలు చేస్తున్నది, భారత దేశ గౌరవ వ్యవస్థలపైన.. విదేశాల్లో మన సైనికుల మీద పరువు తీసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైన రాహుల్ గాంధీకి ఉంది.

👉రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైపే ఉన్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తులే. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే రావాలని కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్ రెడ్డికి హెచ్చరించిందా?. అందుకే రేవంత్ రెడ్డి..  బీఆర్ఎస్ పాట పాడుతున్నాడా?. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు.. దొందూ దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచించడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement