satires
-
‘రేవంత్ ధర్నా చూసి జనం నవ్వుకున్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మంత్రి వర్గ సహచరులతో.. అనుచరులతో రాజ్ భవన్ ముందు ధర్నా చెయ్యడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా అనిపించింది. ఏడాదిగా పాలనలతో.. సరైన పాలన లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి మీద గాని ముందుడుగు పడటం లేదు.👉ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్నిరకాల వైఫల్యంతో.. 12 ఏళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు అదానీ విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. వందకోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా?.. వందకోట్ల సహాయం ఎందుకు అడిగారు? ఎందుకు ఇస్తామన్నారు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.👉కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నా.. రేవంత్ అయినా రాహుల్ గాంధీ అయినా.. ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలి. ఒక సాక్ష్యం చూపిస్తారా?. మన మీడియా ముందు, న్యాయస్థానాల ముందు, ప్రజలముందు ఆధారాలు చూపించకుండా.. విమర్శలు చేయడం సరికాదు.👉గత పార్లమెంటు ఎన్నికల్లో ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న పార్టీ.. ఇవాళ ఫ్రస్టేషన్ లో అదానీ మాట మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని, కేంద్రం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరూపించగలరా?.👉మాటమీద నిలబడే సత్తాలేక.. ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచదేశాల ముందు భారతదేశాన్ని నవ్వలుపాలు చేస్తున్నది, భారత దేశ గౌరవ వ్యవస్థలపైన.. విదేశాల్లో మన సైనికుల మీద పరువు తీసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైన రాహుల్ గాంధీకి ఉంది.👉రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైపే ఉన్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తులే. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే రావాలని కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్ రెడ్డికి హెచ్చరించిందా?. అందుకే రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పాట పాడుతున్నాడా?. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు.. దొందూ దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచించడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
మీటింగ్‌లకు వచ్చేదంతా వాళ్లే.. దీపాదాస్ వివాదాస్పద కామెంట్స్
సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లపై ఏకంగా ఆ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ ఇన్చార్జి దీపదాస్ మున్షీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు పార్టీ మీటింగులు పెడితే దానికి కార్యకర్తలు రావాలి కానీ 200 రూపాయల కూలీలు రాకూడదని నేతలకు మున్షీ చురకంటించారు. సోమవారం(డిసెంబర్16) హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్‌లో మున్షీ చేసిన ఈ వ్యాఖ్యలు కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. తమను కూలీలతో పోలుస్తారా అని కార్యకర్తలు ఫైర్ అయ్యారు.మరోవైపు సీనియర్ నేత హనుమంతరావు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రసంగాలపై మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలు పొద్దంతా కాంగ్రెస్‌తో ఉండి సాయంత్రానికి ఎమ్ఐఎమ్కు ఓట్లు వేస్తారన్న హనుమంతరావు ,అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై మైనారిటీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. -
ఎనుముల కాదు.. ‘ఎగవేతల’ రేవంత్‌రెడ్డి: హరీష్‌రావు సెటైర్లు
సాక్షి, ఖమ్మం జిల్లా: చింతకాని మండలంలోని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్ పర్యటించారు. భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సభలో హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్పు వచ్చిందని.. అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారు.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది. ఆరు లక్షల తులాల బంగారం కళ్యాణలక్ష్మీకి బాకీ పడింది. భద్రాద్రి రాములోరి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. పాలకుడే మాట తప్పితే.. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ఈ ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్నా.. కాంగ్రెస్‌లో పనిచేసేది తక్కువ.. లొల్లి మాత్రం ఎక్కువ’’ అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు.‘‘ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చారు.. అమలు చేశారా?. ఏడాది పాలనలో ఆత్మ విమర్శలు చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు కేసీఆర్ రైతుబంధు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అమలు చేయని మోసపూరిత పార్టీ కాంగ్రెస్. ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి.’’ అంటూ హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘‘లచ్చగూడెంలో విద్యుత్ షాక్‌తో మరణించిన ప్రసాద్ అనే రైతుకు ఎక్స్‌గ్రేషియా అడిగినందుకు అక్రమ కేసులు బనాయించారు. అక్రమంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు పెడితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా పనిచేపిస్తాం. అధికారం చేపట్టిన దగ్గర నుంచి అవ్వతాతలకు 4 వేల పెన్షన్ ఇవ్వాల్సిందే’’ అని హరీష్‌రావు డిమాండ్ చేశారు. -
సీఎం రేవంత్ పాలనపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుస్తామన్న మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మేరకు సోమవారం(నవంబర్ 4) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘మూడు వందల ముప్పై రోజులు ముగిసింది. ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు. ఎకరాకు రూ.15000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు.పెంచిన రూ.4 వేల పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు.నెల నెల ఇస్తామన్న రూ.2500 ఎక్కడబోయాయంటున్నారు అడబిడ్డలు. ఉద్యోగులు మా పీఆర్సీ ఎక్కడ, మా డీఏలు ఎక్కడని సమ్మెలకు సై అంటున్నారు.కౌలు రైతులు రూ.15000 ఎక్కడ, రైతు కూలీలు రూ. 12000 ఎక్కడ అంటున్నారు.తులం బంగారం ఎక్కడా అంటున్నారు మా బంగారు తల్లులు.చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే.. చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే. ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్ తో పబ్బం గడిపిన మూసీ సర్కార్. ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు,రాస్తారోకోలు తప్ప’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: 8న యాదాద్రికి సీఎం రేవంత్ -
బాబుకు మాటలెక్కువ, చేతలు తక్కువ.. విజయసాయి చురకలు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు మాటలెక్కువ, చేతలు తక్కువని మరోసారి చాటుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్స్ వేదిగా సీఎం చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం.. దాని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజం అంటూ మండిపడ్డారు.‘‘రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ గురించి మాత్రం ముఖ్యమంత్రి నోరు మెదపడు. ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు జల్లేలా కార్మికులను, సంఘాలను చంద్రబాబు తప్పుబడుతున్నారు. మీ తుప్పు బట్టిన ఆలోచనలకి ఉచిత గ్యాస్ లబ్ధిదారుల్లో అరకోటి మందికి ఎగనామం పెట్టడం తెలుసు. మరి వైజాగ్‌ను అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన ఎక్కడ చంద్రబాబూ?’’ అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.చంద్రబాబుకు మాటలెక్కువ, చేతల తక్కువని మరోసారి చాటుకున్నారు..ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం/ప్రక్రియ. దాని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజం. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ గురించి మాత్రం ముఖ్యమంత్రి నోరు…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 2, 2024 -
బాబు వచ్చాడు.. కరువు తెచ్చాడు
-
తులం బంగారం అన్నడు.. ఇనుము కూడా ఇవ్వలేదు
-
అడుసు తొక్కనేల.. చంద్రబాబు లిక్కర్ పాలసీపై సీపీఐ నారాయణ సెటైర్లు
సాక్షి, విజయవాడ: సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ.. మద్యాన్ని ఆదాయ వనరుగా గుర్తించి సీఎం చంద్రబాబు చాలా సంతోషపడిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు.అప్లికేషన్లలోనే మూడు వేల కోట్లు వచ్చాయి.. డిపాజిట్లలో మరో మూడు వేలు కోట్లు వస్తాయంటున్నారు. మద్యం ద్వారా ఆదాయ వనరులను చూపించడం ప్రజల శ్రేయస్సు కాదు మద్యంపై సెస్సు వస్తుంది.. ఆ సెస్సుతో వచ్చిన డబ్బును రిహాబిటేషన్ సెంటర్‌కు ఖర్చుచేస్తామంటున్నారు. బాగా తాగించి.. తాగేవారికి మందు ఇచ్చి తాగనివ్వకుండా ఉండేందుకు మరొక ఖర్చు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల. తాగించడం ఎందుకు.. వారిని రీహాబిటేషన్కు తరలించడం ఎందుకు? ఇదంతా తలతిక్క పనులు’’ అంటూ సీపీఐ నారాయణ చురకలు అంటించారు.ఇదీ చదవండి: అవే బ్రాండ్లు... అవే రేట్లు -
ట్విట్టర్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ పై ప్రకాశ్ రాజ్ సటైర్లు
-
చంద్రబాబు మాటలకు అర్ధాలే వేరులే... జగ్గిరెడ్డి అదిరిపోయే సెటైర్లు
-
KSR Live Show: అచ్యుతాపురం ఘటనపై పవన్ కామెంట్స్.. చింతా రాజశేఖర్ కౌంటర్..
-
చంద్రబాబు అబద్దాలపై వైఎస్ జగన్ పంచులు
-
కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఏం ఆశించవచ్చని ఓ జర్నలిస్ట్ ఈ ఉదయం నన్ను అడిగారు. గత 10 సంవత్సరాలుగా మనకు వచ్చేదే రావొచ్చని నేను బదులిచ్చాను. అదేంటంటే.. పెద్ద సున్న మాత్రమే’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.A journalist asked me this morning about my expectations for Telangana from Union Budget Told him that we will get the same thing that we got for last 10 yearsA Big Zero— KTR (@KTRBRS) July 23, 2024 మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని, నూతన చట్టాలపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని తెలిపారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని, నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు,ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. -
పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు
-
చంద్రబాబుకు మాజీ మంత్రి అంబటి చురకలు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. పోలవరం కాఫర్ డ్యాంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గురించి ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టిన అంబటి.. కాఫర్ డ్యాంలు లేకుండానే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అనుకున్న బాబు గారికి ప్రాజెక్టు ఇంకా అర్ధం కాలేదన్నమాట?.. అందుకే చెప్పా పోలవరం క్లిష్టమైన ప్రాజెక్ట్ అని, అర్ధం కావటం కష్టం అని!’’ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.కాఫర్ డ్యాంలు లేకుండానే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అనుకున్న బాబు గారికి ప్రాజెక్టు ఇంకా అర్ధం కాలేదన్నమాట ?అందుకే చెప్పా పోలవరం క్లిష్టమైన ప్రాజెక్ట్ అని అర్ధం కావటం కష్టం అని ! pic.twitter.com/4FuIVXwoGF— Ambati Rambabu (@AmbatiRambabu) June 30, 2024 -
మోదీ వల్లే గెలిచాం: పవార్ సెటైర్లు
ముంబై: ప్రధాని మోదీకి ఎన్సీపీ(శరద్‌చంద్రపవార్) నేత శరద్‌పవార్ కృతజ్ఞతలు తెలిపారు. మహావికాస్అఘాడీ(ఎమ్వీఏ) నేతలు ఉద్థవ్ థాక్రే, పృథ్విరాజ్ చవాన్లతో కలిసి పవార్ శనివారం(జూన్15) ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మహారాష్ట్రలో చేసిన ప్రచారంపై పవార్ సెటైర్లు వేశారు. మోదీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ప్రతి చోట ఎంవీఏ ఘన విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. ‘ఎక్కడైతే ప్రధాని రోడ్‌షోలు చేశారో అక్కడ మేం గెలిచాం. ఇందుకే ప్రధానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది నా బాధ్యత. ఎన్డీఏను గట్టి దెబ్బ కొట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి’ అని పవార్ అన్నారు.తిరిగి తన మేనల్లుడు, ఎన్సీపీ అధినేత అజిత్‌పవార్‌తో కలిసే అవకాశం లేదని శరద్‌పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల పంపకంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఉద్ధవ్, చవాన్ తెలిపారు.కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కంటే కాంగ్రెస్,ఎన్సీపీ(శరద్‌పవార్), శివసేన(ఉద్ధవ్) పార్టీల కూటమే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. -
Lok sabha elections 2024: మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో
బక్తియార్పూర్/పాలీగంజ్/జగదీశ్‌పూర్(బిహార్): తాను సామాన్య వ్యక్తినికాదని, దేవుడు పంపించాడని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సోమవారం బిహార్‌లో బక్తియార్పూర్, పాలీగంజ్, జగదీశ్పూర్ల్లో ఆయన ప్రచార ర్యాలీల్లో మాట్లాడారు. ‘‘ఎన్నికల ఫలితాలొచ్చాక బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై మోదీని ఈడీ ప్రశ్నించొచ్చు. అప్పుడాయన ‘నాకేమీ తెలీదు. దేవుడు పంపిస్తే వచ్చా. ఆయన చెప్పినట్లే చేశా’’ అని చెబుతారేమో’’ అంటూ ఎద్దేవా చేశారు. బిలియనీర్లకు సేవ చేయడానికే దేవుడు ఆయన్ను పంపాడా అంటూ మండిపడ్డారు. పాలీగంజ్‌లో రాహుల్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మీసా భారతి సహా డజనుకు పైగా నేతలు కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుంగింది. దాంతో రాహుల్ కాస్త పక్కకు నడవగా అక్కడా కుంగింది. వారంతా కింద పడబోయి తమాయించుకున్నారు.మోదీవి కూలదోసే కుట్రలు: ప్రియాంకసిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ వద్రా ఆరోపించారు. కాంగ్రా సమీపంలోని చంబాలో ఆమె కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. -
టీడీపీపై బొత్స సెటైర్లు
-
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
-
నాగబాబుపై ట్విట్టర్ వేదికగా పోతిన మహేష్ విమర్శలు
-
చంద్రబాబు ఏమైనా హీరోనా ?..అంబటి మురళి మాస్ ర్యాగింగ్
-
ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడు: ప్రధాని మోదీ
భోపాల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. ఇన్నాళ్లూ ఈ రాయల్ మాంత్రికుడు ఎక్కడ దాక్కున్నాడని రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని ఒకే ఒక్క దెబ్బకు లేకుండా చేస్తానన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని ఎద్దేవా చేశారు. ఆదివారం(ఏప్రిల్14) మధ్యప్రదేశ్‌లోని హొషాంగాబాద్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మేనిఫెస్టోలోని ప్రతీ హామీ దేశాన్ని దివాతా తీయిస్తుందని హెచ్చరించారు. కాగా, గత వారం రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒకే ఒక దెబ్బతో దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తామన్నారు.‘మీరు గనుక దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే మీ ఖాతాల్లోకి లక్ష రూపాయాలు వచ్చి పడతాయి. డబ్బులు వస్తూనే ఉంటాయి మీ ఖాకతాల్లోకి. ఒకే ఒక్క దెబ్బకు పేదరికం లేకుండా పోవాలి’అని రాహుల్ ప్రజలకు హామీ ఇచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుంటుంబాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల -
‘శీష్‌మహల్ టు తీహార్’.. కేజ్రీవాల్‌పై బీజేపీ సెటైర్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ సోషల్ మీడియాలో సెటైర్లు మొదలు పెట్టింది. ఢిల్లీలోని కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్‌మహల్ నుంచి జైలుకు వెళుతున్నట్లుగా ఉన్న ఫొటోతో ఢిల్లీ బీజేపీ శాఖ తన అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. शराब घोटाले के सरगना - Sheesh Mahal To Tihar pic.twitter.com/MbLH0pn1JA — BJP Delhi (@BJP4Delhi) April 1, 2024 ‘గిల్టీ ఆఫ్ లిక్కర్ స్కామ్.. శీష్ మహల్ టు తీహార్’ అనే క్యాప్షన్‌ను పోస్టుకు జత చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి బీజేపీ నేతలు శీష్‌మహల్ అనే పేరు పెట్టి పిలుస్తారు. రూ.45 కోట్లతో ఈ నివాసాన్ని కేజ్రవాల్ సుందరీకరించుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి 6 రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు సోమవారం( ఏప్రిల్ 1) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదీ చదవండి.. మీరు వారితో పోల్చుకోవద్దు.. ఉదయనిధికి సుప్రీం చురక -
తమిళనాడులో ప్రచార వేడి.. ప్రధానిపై ఉదయనిధి సెటైర్లు
చెన్నై: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామనాథపురం, తేనిలలో జరిగిన ప్రచార సభల్లో మాట్లాడుతూ మోదీ 28 పైసల ప్రధాని అని సెటైర్లు వేశారు. కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో తిరిగి 28 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందని, ఇందుకే ప్రధాని 28 పైసల పీఎం అని విమర్శించారు. ఎన్నికలున్నప్పుడే తమిళనాడుకు ప్రధాని వస్తారని మండిపడ్డారు. మధురైలో ఎయిమ్స్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) తీసుకువచ్చి తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును కేంద్రం నాశనం చేస్తోందన్నారు. నీట్‌పై నిషేధంతో పాటు ప్రతి అంశంలోనూ తమిళనాడుపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ఉదయనిధి మండిపడ్డారు. కాగా, తమిళనాడులోని 39 ఎంపీ సీట్లకు గాను ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి.. కేజ్రీకి దక్కని ఊరట -
చన్నీటితో స్నానం చేస్తే పాత పార్టీ, వేడి నీళ్లైతే కొత్త పార్టీ..! ఇంతకీ ఎవరాయన?
ఆయన నిన్న రాత్రి డిన్నర్ చేసి పడుకొనే సమయానికి ఒక పార్టీలో ఉన్నాడు. పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని... మరో పార్టీ లో చేరేందుకు సిద్ధం అయ్యాడు . టిఫిన్ చేస్తుంటే .. పాత పార్టీ వారు వచ్చి నచ్చ చెప్పారు . సాయంకాలం టీ తాగే సమయానికి తిరిగీ పార్టీ మారే ప్రయత్నం చేసారు . రేపు లేచి స్నానం చేసి , ఏ పార్టీ లో చేరుతారో తెలియదు . అయన రేపు చన్నీటితో స్నానం చేస్తే పాత పార్టీలోనే కొనసాగవచ్చని .. వేడి నీటితో స్నానం చేస్తే మాత్రం పార్టీ మారడం ఖాయం అని ప్రముఖ రాజకీయ జ్యోతిష్యుడు పేను స్వామి విశ్లేషించారు. గవ్వల శాస్త్రం ప్రకారం అయన పాత పార్టీ లో కొనసాగే అవకాశం ఉందని యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంట్వ్యూ లో గవ్వల గన్నా రావు గారు సెలవిచ్చారు . చిలుక జ్యోతిష్యం ప్రకారం ఆయన కొత్త పార్టీ లోకి పోతాడు అని ఒక యూట్యూబ్ ఛానల్ తీసిన వీడియోకు ఒక్క రోజులో వెయ్యి కోట్ల వ్యూస్ వచ్చాయి . ఒక రోజులో వెయ్యి కోట్ల వ్యూస్ బోగస్ అని యూట్యూబ్ చానెల్స్ వ్యూస్ ను డబ్బులిచ్చి కొనుక్కొంటారని..... గిట్టని.. గిట్టుబాటు లేని కొన్ని యూట్యూబ్ చానెల్స్ వారు సణుక్కొంటున్నారు. అయన ఏ పార్టీలో ఉంటాడు అనే దాని పై ఇప్పుడు జోరుగా బెట్టింగ్ సాగుతోంది. దుబాయ్ కేంద్రంగా వున్న ప్రముఖ బెట్టింగ్ సంస్థ వారు ఆయన కొత్త పార్టీ లో చేరే అవకాశముందని చెప్పారు. ఇదిలా ఉండగా ఆయన పాత పార్టీ లోనే కొనసాగాలని కోరుతూ... ఆ పార్టీ కి చెందిన నలుగురు కార్యకర్తలు ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మ హత్య ప్రయత్నం చేసారు . వారు ఒంటికి నిప్పంటించుకొంటారేమో కెమెరా లు ఆన్ చేసి ఆశగా ఎదురు చూసిన ముప్పై అయిదు యూట్యూబ్ చానెల్స్ వారికి నిరాశ ఎదురయ్యింది . కాల్ షీట్స్ అయిపోవడంతో మరో షూటింగ్ కోసం ఆ కార్యకర్తలు బండెక్కి వెళ్లిపోయారు. షూటింగ్ పూర్తి కాకుండానే వారి వెళ్లిపోవడం అన్యాయమని ఇలా అయితే తాము జూనియర్ ఆర్టిస్ట్‌ల కోసం మరో కంపెనీని చూసుకొంటామని ఆ పార్టీ కీలకనాయకుడు వ్యాఖ్యానించినట్టు తెలిసింది . ఆయన కొత్త పార్టీలో చేరాలని కోరుతూ ఆ నాయకులు నగర బంద్‌కు పిలుపునిచ్చారు. మద్యం దుకాణాలు లాంటి వాటి జోలికి తాము పోమని విద్యా సంస్థలు తెరిస్తే మాత్రం ఫర్నిచర్ ధ్వసం చేస్తామని వారు హెచ్చరించారు . ఢిల్లీకి చెందిన ప్రముఖ సర్వే సంస్థ జరిపిన సర్వేలో ఆయన కొత్త పార్టీలో చేరడం ఖాయం అని అరవై శాతం ప్రజలు తెలిపారు. ఆయన పాత పార్టీలోనే కొనసాగాలని కోరుతూ సర్వ మత ప్రార్ధనలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు . ఆయన పార్టీ మారుతారు లేదా అనే విషయంపై ఇప్పుడు ప్రజానీకం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఊపిరి ఆడక ఇప్పటికే యాభై మంది గుండెపోటుకు , ఇరవై మంది మెదడు పోటుకు గురయ్యారు . మీ పిల్లాపాపల ఆలనా పాలన గాలికి వదిలి .. మీ శ్రీమతి గారిని టీవీ సీరియళ్లకు వదిలేసి .. మీరు మాత్రం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ప్రతి క్షణం మారుతున్న పరిస్థితిని మీకు అర్ధ రాత్రి అయినా అప రాత్రి అయినా అందిస్తూనే ఉంటాము. గమనిక: ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కమెంట్లు. వీటిని చదువుతోంటే.... గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా చతికిలపడిన నేత, కేకలు, కూకలు తప్ప, ప్రసంగాల్లో మేటర్ లేని , వేల బుక్స్ చదివిన అపర మేధావి (అంతా ఉత్తిదే) గుర్తొస్తే మాత్రం మా బాధ్యత కాదు.