బెంగళూరు: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను టార్గెట్ చేసి యంగ్ హీరో చేతన్ చేసిన వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ మధ్యే ‘నన్ను సీఎంను చేస్తారా?’ అని ప్రజలకు ట్విట్టర్ ద్వారా ఓ బహిరంగ లేఖ రిలీజ్ చేసిన ఉప్పీ.. కులరాజకీయలపై ప్రజాకీయ పార్టీ అభిప్రాయం వెల్లడిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే ఉపేంద్ర స్టాండ్‌పై సెటైర్లు వేస్తూ యువ నటుడు చేతన్ అహింసా ఓ వీడియోను రిలీజ్ చేయడం దుమారం రేపుతోంది.
‘‘మా సెలబ్రిటీలలో కొంతమంది కులం, వివక్ష గురించి చర్చించకుండా ఉండడం వల్ల సమస్యలు శాశ్వత్వంగా పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. ఇది నవ్వులాట కాదా? ఒక రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే పరిష్కారించడమే. అలాగే కుల వివక్ష ఈ సొసైటీలో ఒక జబ్బులాంటిది. తన వ్యాఖ్యల ద్వారా ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో, ఎంతగా పరిణితి చెందాడో అర్థం చేసుకోవచ్చు’’ అంటూ చేతన్ వీడియోలో పరోక్షంగా ఉపేంద్రపై సెటైర్లు వేశాడు. దీంతో ఉప్పీ ఫ్యాన్స్ చేతన్‌పై మండిపడుతున్నారు. చేతన్‌కు అంత అర్హత లేదని విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో చేతన్, అంబేద్కర్ ప్రస్తావన తీసుకురావడాన్ని మరో స్టార్ హీరో దర్శన్ తప్పుబడుతూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కులరాజకీయాల గురించి మాట్లాడుతూ.. చివర్లో వాటికి తన పార్టీ దూరమని ఉప్పీ ఆ వీడియోలో తెలిపాడు.
ಜಾತಿ / caste (1/2) pic.twitter.com/nHnTnF3Qyc
— Chetan Kumar / ಚೇತನ್ (@ChetanAhimsa) May 27, 2021
కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన 38 ఏళ్ల చేతన్.. డజన్‌కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట మంచి పేరు సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్ గిఫ్ట్‌గా అందించి వార్తల్లో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment