chetan
-
తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా నటుడిపై దాడి.. తీవ్రగాయాలు
కన్నడ నటుడు చేతన్ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. గుడికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి నటుడిపై దాడి చేశారు. అతడి కారును సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కగ్గలిపురలో ఆదివారం చోటు చేసుకుంది. నటుడు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 12న మాతృదినోత్సవం సందర్భంగా నటుడు చేతన్ చంద్ర తన తల్లిని తీసుకుని గుడికి వెళ్లాడు. నటుడిపై దాడితిరుగు ప్రయాణమైన సమయంలో ఓ వ్యక్తి తనను ఫాలో చేయడమే కాక కార్ డ్యామేజ్ చేశాడు. ఇదేంటని వెళ్లి ప్రశ్నించగా.. వెంటనే 20 మంది అక్కడికి చేరుకుని నటుడిపై దాడికి దిగారు. రక్తం వచ్చేలా చితకబాదారు. ముక్కు పగలగొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు ఆ దుండగులు మళ్లీ నటుడి కారు దగ్గరకు చేరుకుని దాన్ని ధ్వంసం చేశారు. ఆ గ్యాంగ్‌లో ఓ మహిళ కూడా ఉంది.న్యాయం కావాలితనకు జరిగిన అన్యాయాన్ని చేతన్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇది చాలా భయంకరమైన సంఘటన.. నాకు న్యాయం కావాలి అంటూ గాయాలతో ఉన్న వీడియోను షేర్ చేశాడు. తాగిన మత్తులో ఉన్న వ్యక్తి.. నటుడి కారును చేజ్ చేయాలని ప్రయత్నించే క్రమంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.నిందితుడు అరెస్ట్చేతన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా చేతన్ 'సత్యం శివం సుందరం' అనే సీరియల్లో నటించాడు. 'ప్రేమిజం', 'రాజధాని', 'జరాసంధ', 'కుంభ రాశి', ప్లస్', 'బజార్'.. ఇలా తదితర కన్నడ చిత్రాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Chetan Chanddrra (@chetan_chanddrra) -
వరల్డ్‌కప్‌లో భారత్ ఓటమి.. నటుడి సంచలన వ్యాఖ్యలు
కోట్లాది మంది కల ఒక్కసారిగా బుగ్గిపాలైంది. గెలుపును మాత్రమే కలగన్నవారికి ఒక్కసారిగా భంగపాటు ఎదురైంది. అందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఆస్ట్రేలియా వరల్డ్ కప్పు ఎగరేసుకుపోయింది. టీమిండియా ఓటమితో యావత్ భారత్ ఉద్వేగానికి లోనైంది. భారత జట్టు మరోసారి చరిత్ర తిరగరాస్తుందనుకుంటే ఇలా జరిగిందేంటని క్రికెట్ అభిమానులు కలత చెందారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అహింస వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'నేను మళ్లీ చెప్తున్నా.. క్రికెట్ క్రీడలో కూడా రిజర్వేషన్స్ ఉండాలి. ఆ రిజర్వేషన్స్ ఈపాటికే అమలై ఉంటే భారత్ వరల్డ్ కప్ సులువుగా గెలిచేది' అని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'అందరూ బాధలో ఉంటే నీ గోల ఏంటి?', 'ఇక్కడ కూడా రిజర్వేషన్లా?', 'పెద్ద సైకోలా ఉన్నావే?' అని ట్రోల్ చేస్తున్నారు. వరల్డ్ కప్ జరిగే రోజు చేతన్ మరో ట్వీట్ కూడా చేశాడు. 'ఈ రోజు క్రికెటర్లు బంతి క్యాచ్ చేస్తారు, లేదంటే విసురుతారు.. దాన్ని బ్యాట్‌తో కొడతారు.. అంతే తప్ప దేశ నిర్మాణం కోసం ఇసుమంత సాయం కూడా చేయరు. వందేళ్ల క్రితం పల్వంకర్ బాలూ అని ఓ దళిత క్రికెటర్ సామాజిక కార్యకర్తగా చురుకుగా పనిచేశాడు. డబ్బు, ఫేమ్ కోసం పాటుపడే వాళ్లు కాకుండా ఇతడిలా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లే దేశానికి అవసరం' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. I repeat, India needs reservations in cricket If India had cricket reservations, India would’ve easily won this #WorldCup ನಾನು ಮತ್ತೆ ಹೇಳುತಿದ್ದೇನೆ, ಭಾರತಕ್ಕೆ ಕ್ರಿಕೆಟ್ನಲ್ಲಿ ಮೀಸಲಾತಿ ಅಗತ್ಯವಿದೆ ಭಾರತಕ್ಕೆ ಕ್ರಿಕೆಟ್ನಲ್ಲಿ ಮೀಸಲಾತಿ ಇದ್ದಿದ್ದರೆ ಭಾರತ ಸುಲಭವಾಗಿ ಈ ವಿಶ್ವ ಕಪ್ಪನ್ನು ಗೆಲ್ಲುತ್ತಿತ್ತು — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) November 19, 2023 Indian cricketers today can throw/catch/hit a ball but dont contribute much to nation-building 100+ yrs ago, Palwankar Baloo—Dharwad-born bowler & India’s 1st Dalit cricketer—was an activist & acquaintance of Babasaheb India needs cricketrs who care fr society—not money & glory pic.twitter.com/L0Rs08LzxU — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) November 19, 2023 చదవండి: దాదాపు రూ. లక్షన్నర తీసుకునే స్థాయి నుంచి కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరో -
శోభతో చేతన్ 8 నెలలుగా సహజీవనం...
కర్ణాటక: ముగళూరు దక్షిణ పినాకిని నదిలో గతనెల 26న హత్యకు గురైన చేతన్(26) అనే యువకుడి కేసులో బ్యూటీపార్లర్ మహిళతో పాటు ముగ్గురిని సర్జాపుర పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నగరానికి చెందిన శోభ, కోలారు జిల్లా మాలూరు తాలూకా చిక్కతిరుపతికి చెందిన సతీశ్, స్నేహితుడు శశి పట్టుబడారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణరాజపురంలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న శోభతో చేతన్ 8 నెలలుగా సహజీవనం చేస్తున్నాడు. అతను కృష్ణరాజపురంలోని అయ్యప్పనగర రియల్ఎస్టేట్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. అయితే శోభకు చిక్కతిరుపతికి చెందిన సతీశ్ అనే వ్యక్తితో పరిచయమైంది. సతీశ్ భూ విక్రయ వ్యవహారంలో రూ.40 లక్షలకు పైగా డబ్బు సంపాదించగా శోభ కోరిక మేరకు రూ.25 లక్షలు ఖర్చుచేసి బ్యూటీపార్లర్ పెట్టించాడు. సతీశ్ తన స్నేహితులైన మధు, శశితో కలిసి చేతన్‌ను చిక్కతిరుపతి సమీపంలోని బార్‌కు పిలిపించి మద్యం తాపించి హత్యచేసి దక్షిణ పినాకినిలో మృతదేహం పడేసి ఉడాయించారు. ఈ ఘటనపై సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని బార్ వద్ద అమర్చిన సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి హత్యకేసులో నిందితులను ఆదివారం అరెస్ట్‌చేశారు. -
జెంటిల్మన్లో భాగమవడం సంతోషం – ప్రాచీ తెహ్లాన్
‘‘జెంటిల్మన్ 2’ సినిమాలో నటించాలని నిర్మాత కేటీ కుంజుమోన్ గారు ఫోన్ చేసినప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యాను. ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఫ్రాంచైజీలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ ప్రాచీ తెహ్లాన్ అన్నారు. అర్జున్, మధుబాల, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జెంటిల్‌మేన్’. కేటీ కుంజుమోన్ నిర్మించిన ఈ సినిమా 1993లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘జెంటిల్మన్ 2’ నిర్మిస్తున్నారు కుంజుమోన్. చేతన్ చీను హీరోగా ఎ.గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశం రావడంపైప్రాచీ తెహ్లాన్ మాట్లాడుతూ–‘‘జెంటిల్మన్ 2’ లో ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర చేస్తున్నాను. యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించబోతున్నాను. ఈ సీక్వెన్స్ లో నటించటం సవాల్‌తో కూడుకున్నది.. ఇందుకోసం శిక్షణ తీసుకున్నాను. త్వరలోనే షూటింగ్లో పాల్గొనబోతున్నాను’’ అన్నారు. -
ప్రముఖ నటుడు సంచలన వ్యాఖ్యలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రముఖ కన్నడ నటుడు చేతన్ కుమార్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభవాలను దెబ్బతీసే విధంగా ఇటీవల ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో చేతన్ కుమార్‌పై హిందుమత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఆయనను అరెస్ట్ చేశారు. వివరాలు.. స్వయాన హిందువైన కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింస మత విశ్వాసాలను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మార్చి 20న ఆయన ట్వీట్ చేస్తూ ‘సావర్కర్: రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి చేరుకున్న తర్వాత భారతదేశ జాతి ప్రారంభమైంది అనేది ఒక అబద్ధం. 1992: బాబ్రీ మసీదు రాముడి జన్మస్థలం అనేది ఒక అబద్ధం. 2023: ఉరిగౌడ-నంజిగౌడ కులస్తులు టిప్పుని చంపిన హంతకులు అనేది ఒక అబద్ధం’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే అంతేకాదు హిందుత్వం అనేది సత్యం చేత ఓడించబడుతుందంటూ హిందు మతాన్ని, హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసేలా అభ్యంతరకర కామెంట్స్ చేశాడు. దీంతో చేతన్ కుమార్‌పై పలు హిందు మతసంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కులాలు, మతాల మధ్యనే శత్రుత్వం పెరిగిలా ఆయన ట్వీట్ ఉందంటూ చేతన్‌పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయనకు వ్యతిరేకంగా పలు హిందు సంఘాలు బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు చేతన్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా చేతన్ కుమార్ తరచూ తన తీరుతో, కామెంట్స్‌తో వివాదానికి తెరలేపుతుంటాడు. గతంలో ఇలానే అభ్యంతరకర కామెంట్స్ చేసి ఒకసారి అరెస్ట్ అయ్యాడు. 2022 ఫిబ్రవరిలో హిజాబ్ కేసులో తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పై అభ్యంతర కామెంట్స్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు. Hindutva is built on LIES Savarkar: Indian ‘nation’ began when Rama defeated Ravana & returned to Ayodhya —> a lie 1992: Babri Masjid is ‘birthplace of Rama’ —> a lie 2023: Urigowda-Nanjegowda are ‘killers’ of Tipu—> a lie Hindutva can be defeated by TRUTH—> truth is EQUALITY — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) March 20, 2023 -
రెండురోజులు జైళ్లోనే హీరో.. అనుచిత ట్వీట్ ఎఫెక్ట్
హిజాబ్ వ్యవహారంలో విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తిపైనే అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కన్నడ హీరో చేతన్ కుమార్ అహింసాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బెయిల్ దొరక్కపోవడంతో.. రెండురోజులు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఎదురైంది అతనికి. కన్నడనాట హిజాబ్ వివాదం నడుస్తుండగా.. నటుడు చేతన్ చేసిన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ. సుమోటోగా పరిణగనలోకి తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం అరెస్ట్ చేసి లోకల్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ‘‘హిజాబ్ పిటిషన్లపై విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పైనే చేతన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతను బయటకు వస్తే మతపరమైన విద్వేషాన్ని రాజేస్తాడని, కాబట్టి.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని ప్రాసెక్యూటర్ అభ్యర్థించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. శుక్రవారానికి బెయిల్ పిటిషన్ పరిశీలిస్తామని తెలిపింది. చేతన్ చేసిన ట్వీట్‌గా వైరల్ అవుతోంది ఇదే అయితే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని చేతన్ భార్య మేఘ ఆరోపిస్తోంది. చేతన్ అరెస్ట్ విషయంలో పోలీసులు అతిప్రదర్శించారన్నది ఆమె వాదన. ఎంతో మంది ట్వీట్లు చేస్తున్నారు. వాళ్లను వదిలేసి.. తన భర్తనే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఆమె. నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు చెప్పకుండా అదుపులోకి తీసుకోవడంపై మేఘ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా.. చేతన్ వ్యవహారం హిజాబ్ అంశంలో కొత్త వివాదానికి ఆజ్యం పోసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష అరెస్ట్‌ను.. హిజాబ్‌కు ముడిపెట్టడం, ఆ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించడం చూశాం. ఈ తరుణంలో చేతన్ మద్దతుదారులంటూ కొందరు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ బయట ఆందోళనచేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన చేతన్.. డజన్‌కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట క్రేజ్ సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్ గిఫ్ట్‌గా అందించి వార్తల్లో నిలిచాడు. డజనుకుపైగా సినిమాల్లో నటించిన చేతన్.. తరచూ కన్నడ, దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు కూడా. -
ఉపేంద్రపై యంగ్ హీరో సెటైర్లు.. ఫ్యాన్స్ ఆగ్రహం
బెంగళూరు: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను టార్గెట్ చేసి యంగ్ హీరో చేతన్ చేసిన వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ మధ్యే ‘నన్ను సీఎంను చేస్తారా?’ అని ప్రజలకు ట్విట్టర్ ద్వారా ఓ బహిరంగ లేఖ రిలీజ్ చేసిన ఉప్పీ.. కులరాజకీయలపై ప్రజాకీయ పార్టీ అభిప్రాయం వెల్లడిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే ఉపేంద్ర స్టాండ్‌పై సెటైర్లు వేస్తూ యువ నటుడు చేతన్ అహింసా ఓ వీడియోను రిలీజ్ చేయడం దుమారం రేపుతోంది. ‘‘మా సెలబ్రిటీలలో కొంతమంది కులం, వివక్ష గురించి చర్చించకుండా ఉండడం వల్ల సమస్యలు శాశ్వత్వంగా పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. ఇది నవ్వులాట కాదా? ఒక రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే పరిష్కారించడమే. అలాగే కుల వివక్ష ఈ సొసైటీలో ఒక జబ్బులాంటిది. తన వ్యాఖ్యల ద్వారా ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో, ఎంతగా పరిణితి చెందాడో అర్థం చేసుకోవచ్చు’’ అంటూ చేతన్ వీడియోలో పరోక్షంగా ఉపేంద్రపై సెటైర్లు వేశాడు. దీంతో ఉప్పీ ఫ్యాన్స్ చేతన్‌పై మండిపడుతున్నారు. చేతన్‌కు అంత అర్హత లేదని విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో చేతన్, అంబేద్కర్ ప్రస్తావన తీసుకురావడాన్ని మరో స్టార్ హీరో దర్శన్ తప్పుబడుతూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కులరాజకీయాల గురించి మాట్లాడుతూ.. చివర్లో వాటికి తన పార్టీ దూరమని ఉప్పీ ఆ వీడియోలో తెలిపాడు. ಜಾತಿ / caste (1/2) pic.twitter.com/nHnTnF3Qyc — Chetan Kumar / ಚೇತನ್ (@ChetanAhimsa) May 27, 2021 కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన 38 ఏళ్ల చేతన్.. డజన్‌కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట మంచి పేరు సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్ గిఫ్ట్‌గా అందించి వార్తల్లో నిలిచాడు. -
‘నా తమ్ముడి ఆత్మహత్య గురించి తెలియనివ్వలేదు’
న్యూఢిల్లీ: ‘‘గత నెలలో నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నేను ఇంట్లో లేను. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్లో ఆడుతున్నాడు. మ్యాచ్ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాతే నా తమ్ముడు ఇక లేడనే విషయం తెలిసింది. అప్పుడు కూడా నా కుటుంబ సభ్యులు తమకు తాముగా ఈ విషయం బయటపెట్టలేదు. రాహుల్ ఎక్కడున్నాడు అని ఎన్నోసార్లు అడిగాను. ప్రతీసారి బయటకు వెళ్లాడు తొందరగానే వస్తాడు అని చెప్పేవారు. కానీ ఒకానొకరోజు నిజం చెప్పక తప్పలేదు. నా తమ్ముడు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఈ రోజు వాడు బతికి ఉంటే నా కంటే ఎక్కువ తనే సంతోషించేవాడు. కానీ తను శాశ్వతంగా దూరమయ్యాడు’’అంటూ యువ క్రికెటర్ చేతన్ సకారియా భావోద్వేగానికి లోనయ్యాడు. తన తమ్ముడిని తలచుకుని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా చెన్నైలో జరిగిన ఐపీఎల్-2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ చేతన్ సకారియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్ కోసం ఆర్సీబీ కూడా ఆసక్తి కనబరచగా, రాజస్తాన్ రూ.1.20 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన చేతన్‌కు భారీ మొత్తం దక్కడంతో అతడి పంట పండినట్లయింది. అయితే అదే సమయంలో తమ్ముడిని కోల్పోయిన బాధ అతడిని వెంటాడుతోంది. ఈ విషయాల గురించి చేతన్ మాట్లాడుతూ... ‘‘మా నాన్న టెంపో నడుపుతారు. ఆయన సంపాదనతోనే మమ్మల్ని పోషించారు. ఇక ఇప్పుడు ఆయనకు కాస్త విశ్రాంతినివ్వాలని భావిస్తున్నా. కుటుంబ బాధ్యతను తీసుకుంటానని చెప్పాను. ఇంత పెద్ద మొత్తంతో ఏం చేస్తావని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ముందైతే డబ్బు చేతికి రానివ్వండి. రాజ్‌కోట్‌కు షిఫ్ట్ అయిపోతాం. అక్కడే ఒక మంచి ప్రదేశంలో ఓ ఇల్లు కొనుగోలు చేయాలనకుంటున్నా అని చెప్పాను’’ అంటూ తన కలల గురించి చెప్పుకొచ్చాడు. కాగా మినీ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రికార్డు ధరకు(రూ. 16.25 కోట్లు) దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, శివం దూబేను రూ. 4.40 కోట్లు, ముస్తాఫిజుర్ రహమాన్‌ను రూ. కోటికి కొనుగోలు చేసింది. ఇక సకారియాను 1.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోగా, ఆర్ఆర్ అత్యధిక ధరకు కొన్న ఆటగాళ్లలో అతడు మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: ఐపీఎల్ 2021 మినీ వేలం పూర్తి వివరాలు చదవండి: ఐపీఎల్ వేలం: అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి! -
కామెడీ.. థ్రిల్
‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్, చేతన్, సాక్షీ చౌదరి, ఐశ్వర్య, యమీ ప్రధాన పాత్రల్లో విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. దివిజా సమర్పణలో సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. నిర్మాత ‘మధుర’ శ్రీధర్ పూజ కార్యక్రమాలు మొదలుపెట్టగా నాగం తిరుపతి రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. సాయి కార్తీక్ క్లాప్ ఇవ్వగా, చిత్ర సహనిర్మాత శ్రీకాంత్ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇంతకాలం మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసిన నేను తొలిసారి ప్రొడక్షన్లోకి ప్రవేశించాను’’ అన్నారు సాయి కార్తీక్. ‘‘నిర్మాతగా నాకిది నాలుగో చిత్రం’’ అన్నారు నాగం తిరుపతి రెడ్డి. ‘‘వైవిధ్యమైన కామెడీ థ్రిల్లర్ ఇది’’ అన్నారు విరాట్ చక్రవర్తి. ‘‘ఈ కథ విని, థ్రిల్ అయ్యాను’’ అన్నారు రాహుల్. ‘‘కన్నడలో 10 సినిమాలు చేసిన నాకు తెలుగులో ఇది మొదటి సినిమా’’ అన్నారు చేతన్. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ముర్గిల్. -
ప్రేయసితో నటుడి రిజిస్టర్ మ్యారేజ్
బెంగళూరు : కన్నడ నటుడు చేతన్ తన ప్రియురాలు మేఘను వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. బెంగళూరులోని వల్లబ్ నికేతన నినోబాభావే ఆశ్రమంలో వీరు పెళ్లి చేసుకున్నారు. శనివారం ఇద్దరు కలిసి గాంధీనగర్‌లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహ చట్టం ప్రకారం పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ విషయాన్ని చేతన్ తన ఫేస్బుక్ ద్వారా అభిమానులకు వెల్లడించారు. కాగా, నటుడిగానే కాకుండా.. సామాజిక కార్యకర్తగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, మేఘ కూడా సామాజిక కార్యకర్త కావడం విశేషం. ఇంజనీర్ పూర్తి చేసిన మేఘ.. ఆ తర్వాత మానవ హక్కుల పట్ల అభిరుచితో లా డిగ్రీని పూర్తి చేశారు. అయితే తమది ప్రేమ వివాహం అని కొద్ది రోజుల కిందట చేతన్ వెల్లడించారు. -
గల్ఫ్ కష్టాలు తెలుసుకున్నా!
‘‘సునీల్‌కుమార్‌రెడ్డిగారి సినిమాలన్నీ చూశా. విశాఖలో ఇంజినీరింగ్ చదివే టైమ్‌లో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’కు వెళ్లా. 60వ రోజున కూడా థియేటర్ హౌస్‌ఫుల్ అయింది. సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసే ఆయన దర్శకత్వంలో ఎప్పటికైనా నటించాలనుకున్నా. లక్కీగా నా రెండో సినిమాతోనే కుదిరింది’’ అన్నారు చేతన్ మద్దినేని. ఆయన హీరోగా సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్.యస్. రామ్‌కుమార్ నిర్మించిన సినిమా ‘గల్ఫ్’. చేతన్ మద్దినేని మాట్లాడుతూ – ‘‘సిరిసిల్ల చేనేత కార్మికుడి కుమారుడు శివ పాత్రలో నటించా. బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన వాళ్లు ఎలాంటి కష్టాలు పడ్డారనేది నా పాత్ర ద్వారా దర్శకుడు చూపించారు. కష్టాలే కాదు, ఫ్లైట్‌లో పరిచయమైన ఓ అమ్మాయి (డింపుల్)తో క్యూట్ లవ్‌స్టోరీ కూడా ఉంది. మా పేరెంట్స్ అమెరికాలో ఉంటారు. వాళ్లను కలవడానికి ఇండియా టు అమెరికా వయా దుబాయ్ ఫ్లైట్‌లో వెళ్తుంటాను. జర్నీలో గల్ఫ్ కార్మికుల కష్టాలు కొన్ని తెలుసుకున్నా. ఈ సినిమా అంగీకరించాక, సునీల్‌కుమార్‌రెడ్డిగారితో నేనూ తెలంగాణలో కొన్ని ప్రాంతాలు పర్యటించి రీసెర్చ్ చేశా. అందువల్ల, సినిమా అంతా తెలంగాణ యాసలో ఈజీగా నటించగలిగా. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’, ‘హై ఎండ్ ఫోన్’ సినిమాలు చేస్తున్నా. ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’కు మారుతిగారు నిర్మాత’’ అన్నారు. -
నిఫ్ట్ ఛైర్మన్ గా చేతన్ చౌహాన్
మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ చేతన్ చౌహాన్.. నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (నిఫ్ట్) ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఢిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) వైస్ ప్రెసిడెంట్, సీనియర్ బీసీసీఐ అధికారిగా ఉన్న చౌహాన్.. సొంతంగా ఓ క్రికెట్ అకాడమీని నడపడంతో పాటు, న్యూస్ ప్రింట్ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. తనను నిఫ్ట్ ఛైర్మన్ గా నియమించినందుకు చౌహాన్ ప్రధానమంత్రి మోదీకి, బీజేపీ చీఫ్ అమిత్ షా కు కృతజ్ఞతలు తెలిపారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కు చాలాకాలం పాటు ఓపెనింగ్ పార్టనర్ గా ఉన్న చౌహాన్, రెండుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచారు. నిఫ్ట్ చట్టం 2006 ప్రకారం ప్రముఖ విద్యావేత్త, శాస్త్రవేత్త, సాంకేతిక లేదా వృత్తిపరమైన అనుభవం ఉన్నవారిని ఈ పదవిలో నియమిస్తారు. వీరి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. ప్రస్తుతం నిఫ్ట్ ఛైర్మన్ గా నియమితులైన 68 ఏళ్ల చౌహాన్.. తనకు అప్పగించిన అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. మరోవైపు ఇంతకు ముందు డీడీసీఏ విషయంలో అవినీతి అభియోగాలు ఎదుర్కొన్న చౌహాన్ ను నిఫ్ట్ ఛైర్మన్ గా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కూతురికి ప్రేమతో...
సినిమా ఇండస్ట్రీలో వారసులను హీరోలుగా పరిచయం చేసి, వాళ్లు నిలదొక్కుకునేలా సపోర్ట్‌గా నిలిచేందుకు హీరోలు, నిర్మాతలు, దర్శకులు.. ఇలా అందరూ దాదాపు ముందుంటారు. కొడుకులను హీరోలను చేసినంత ఇష్టంగా కూతుళ్లను హీరోయిన్లను చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కొంతమంది మాత్రమే కూతుళ్లను కూడా ప్రోత్సహిస్తుంటారు. అలాంటివారిలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒకరు. ఆయన కుమార్తె ఐశ్వర్య ‘పట్టత్తు యానై’ అనే తమిళ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత స్వీయదర్శకత్వంలో తన తండ్రి నటించి, నిర్మించిన ‘జైహింద్ -2’కు ఆమె సహనిర్మాతగా వ్యవహరించారు. తొలి చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఐశ్వర్యకు కథానాయికగా తదుపరి ఆశించినంతగా అవకాశాలు రాలేదట. అందుకని కూతుర్ని హీరోయిన్గా నిలబెట్టాలని అర్జున్ రంగంలోకి దిగారు. స్వయంగా తాను రాసుకున్న ఓ ప్రేమకథను చేతన్, ఐశ్వర్య జంటగా స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు అర్జున్. ‘‘ఇందులో నేను ఓ లీడ్ రోల్లో కనిపిస్తా. వచ్చే ఏడాది జనవరిలోపు షూటింగ్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని అర్జున్ తెలిపారు. -
పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న నటుడు
అర్ధరాత్రి బయటకు వెళ్లి... లాఠీ దెబ్బలతో తిరిగొచ్చాడు శాండల్‌వుడ్ నటుడు చేతన్. మిడ్నైట్ 1.45కు చర్చ్‌స్ట్రీట్‌లోని తన మిత్రులను కలిసి తిరిగొస్తుండగా... ఆపిన పోలీసులు పంచ్‌లతో పిచ్చెక్కిచ్చారట. కారణం చెప్పకుండానే... కారు ఆపేసీ... కీ లాగేసుకుని... ఆపై ఫటఫటా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడట లోకల్ ఎస్ఐ. ఇంతలో అక్కడికి చేరుకున్న ఏసీపీ కూడా ఎస్ఐని ఫాలో అయిపోయాడట. గుద్దులు కాక... ఇద్దరూ కలసి బూతులూ తిట్టి... వదిలేశారట. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు వెళితే... సదురు ఎస్ఐ అక్కడికీ వచ్చి మళ్లీ పంచ్‌లిచ్చి లాకప్‌లో పెట్టాడట. బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చిన చేతన్... తన బాధను నగర పోలీస్ కమిషనర్ ముందు మొరపెట్టుకున్నాడట! -
ఇదో ‘ప్రేమ్’కథ
ప్రేమ ఓ మధుర జ్ఞాపకం... అది ఎప్పుడు... ఎక్కడ... ఎలా.. మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ఆ ప్రేమ పుట్టుక తొలిచూపునకే అవ్వొచ్చు.. తొలి పలుకుకే అవ్వొచ్చు.. తొలి స్పర్శకే అవ్వొచ్చు.. అలాంటి ఈ ప్రేమ దేశంలో ఒకమ్మాయిని ఫస్ట్ టైం చూసి ప్రేమ్ అనే కుర్రాడు పడిన తపన.. తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనే అంశంతో లఘు చిత్ర దర్శకుడు చేతన్ సిరసపల్లి నిర్మించిన ప్రేమ్‌కథ లఘు చిత్రం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. బీటెక్ విద్యార్థి చేతన్ దర్శకత్వం మీద ఉన్న మక్కువతో ప్రణీత్, కృష్ణకుమారిలను హీరో, హీరోయిన్లుగా తీసుకొని అద్భుతమైన స్క్రీన్‌ప్లే, మాటలతో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించాడు. వైజాగ్‌లోని సుందరమైన లోకేషన్లలో చిత్రీకరించాడు. దీని తరువాత చేతన్‌కు రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ నుంచి పిలుపు వచ్చింది. అతడి నూతన చిత్రంలో దర్శకత్వ విభాగంలోనూ చోటు సంపాదించాడు. జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రేమకథా చిత్రాలను తీస్తానని చేతన్ చెబుతున్నాడు.