
బెంగళూరు : కన్నడ నటుడు చేతన్ తన ప్రియురాలు మేఘను వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. బెంగళూరులోని వల్లబ్ నికేతన నినోబాభావే ఆశ్రమంలో వీరు పెళ్లి చేసుకున్నారు. శనివారం ఇద్దరు కలిసి గాంధీనగర్‌లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహ చట్టం ప్రకారం పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ విషయాన్ని చేతన్ తన ఫేస్‌బుక్ ద్వారా అభిమానులకు వెల్లడించారు. కాగా, నటుడిగానే కాకుండా.. సామాజిక కార్యకర్తగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కాగా, మేఘ కూడా సామాజిక కార్యకర్త కావడం విశేషం. ఇంజనీర్ పూర్తి చేసిన మేఘ.. ఆ తర్వాత మానవ హక్కుల పట్ల అభిరుచితో లా డిగ్రీని పూర్తి చేశారు. అయితే తమది ప్రేమ వివాహం అని కొద్ది రోజుల కిందట చేతన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment