Megha
-
Tenant Movie Review: ‘టెనెంట్' మూవీ రివ్యూ
టైటిల్: టెనెంట్ నటీనటులు: సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు దర్శకత్వం: వై. యుగంధర్ నిర్మాత: మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణ సంస్థ: మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ సినిమాటోగ్రఫీ: జెమిన్ జోం అయ్యనీత్ ఎడిటర్: విజయ్ ముక్తవరపు సంగీతం: సాహిత్య సాగర్ విడుదల తేదీ: 19-04-2024 అసలు కథేంటంటే.. సత్యం రాజేశ్(గౌతమ్), మేఘా చౌదరి(సంధ్య) పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటారు. అన్యోన్య దాంపత్యం అంటే ఎలా ఉంటుందో వారి మధ్య ప్రేమానురాగాలు అలా ఉంటాయి. ఓ ఖరీదైన ఫ్లాట్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. త్వరలోనే అమెరికా వెళ్లాలనుకున్న ఆ దంపతుల మధ్య బంధం, ప్రేమ ఒక్కసారిగా దూరమవుతుంది. కానీ అన్నింటిని మౌనంగానే భరిస్తూ వస్తాడు గౌతమ్. సంధ్య ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఆమె ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎవరూ ఊహించని విధంగా ఆమె బెడ్‌పైనే విగతజీవిలా పడి ఉంటుంది. అదే సమయంలో వారి అపార్ట్మెంట్లోనే ఓ యువకుడు పైనుంచి కిందకు దూకేస్తాడు. అసలు సంధ్యను ఎవరు చంపారు? ఆమెది హత్యా? లేక ఆత్మహత్యా?. గౌతమే ఆమెను చంపేశాడా? లేదా ఆమె మరణం వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అసలు అపార్ట్మెంట్ నుంచి కిందకు దూకిన యువకుడు ఎవరు? అసలు పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? అనే విషయాలు తెలియాలంటే టెనెంట్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ తర్వాత డైరెక్టర్ వై యుగంధర్ తెరకెక్కించిన చిత్రమిది. సమాజంలో నిజజీవితంలో సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే టెనెంట్. టెనెంట్.. ఈ టైటిల్ చూడగానే చాలామందికి గుర్తొచ్చేది అద్దెకు ఉంటున్న వాళ్లు అని. టైటిల్‌తోనే మీకు కథ ఏంటనేది ఓ ఐడియా వచ్చేస్తుంది. ఆ కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాను తీశారు. క్లైమాక్స్ సీన్‌తో కథను ప్రారంభించిన యుగంధర్.. ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్‌లో గౌతమ్, సంధ్యకు పెళ్లి కావడం, వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో కథను నడిపించారు. వారి ఫ్లాట్ పక్కన ఉండే టెనెంట్స్తో సన్నివేశాలు కాస్తా నవ్వులు తెప్పించినా.. సీరియస్‌నెస్ ఎక్కడా మిస్సవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవైపు పోలీసుల దర్యాప్తు.. మరోవైపు భార్య, భర్తల మధ్య వచ్చే సీన్లతో మెల్లగా ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లాడు. కానీ పెద్దగా సస్పెన్ష్, ట్విస్టుల్లాంటి లేకపోవడంతో కథ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఎలాంటి హడావుడి లేకుండానే ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోతుంది. సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. పక్క ఫ్లాట్‌లో ఉండేవారితో గౌతమ్ భార్య సంధ్యకు పరిచయం కావడం, వారితో కలిసిపోవడం చకాచకా జరిగిపోతుంది. గౌతమ్, సంధ్యకు ఫ్లాట్ పక్కన ఉండే రిషి(భరత్ కాంత్) తనకు కాబోయే అమ్మాయి శ్రావణిని(చందన) పరిచయం చేస్తాడు. అక్కడి నుంచే కథ మలుపులు తిరుగుతుంది. రిషి ఫ్రెండ్స్ అతని ఫ్లాట్‌కు రావడం.. గౌతమ్‌ను రిషి సాయం కోరడం.. ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతాయి. అదే సమయంలో రిషి ఫ్రెండ్స్ చేసిన పనికి అతని జీవితం ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. అతని ఫ్రెండ్స్ చేసిన పనేంటి? చివరికీ రిషికి గౌతమ్ సాయం చేశాడా? ఆ తర్వాత రిషి, శ్రావణి ఏమయ్యారు? సంధ్య ఎలా మరణించింది? పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ చివరికీ నిజం చెప్పాడా? అనే సస్పెన్ష్తో ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేలా చేశారు. క్లైమాక్స్ సీన్ వరకు సంధ్య ఎలా చనిపోయిందన్న విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్ష్ కొనసాగించాడు డైరెక్టర్. చివర్లో వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఓవరాల్‌గా ఆడియన్స్‌కు ఓ మంచి సందేశం ఇస్తూ ముగింపు పలికాడు. ఎవరెలా చేశారంటే.. పొలిమేర-2 తర్వాత సత్యం రాజేశ్ నటించిన చిత్రం టెనెంట్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగాయి. సత్యం రాజేశ్ మరోసారి తనదైన మార్క్ చూపించారు. ఇలాంటి మిస్టరీ కథల్లో హావాభావాలతో మెప్పించడంలో సత్యం రాజేశ్ ఒదిగిపోయారు. హీరోయిన్గా మేఘా చౌదరి ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి మూవీ తర్వాత నటించిన చిత్రమిది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన నటనతో మెప్పించింది. ఇన్స్పెక్టర్ ఎస్తేర్ నోరోన్హా ఈ సినిమాలో హైలెట్. తన గ్లామర్‌తో పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించింది. చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే సాహిత్య సాగర్ నేపథ్యం సంగీతం, బీజీఎం బాగుంది. జెమిన్ జోం అయ్యనీత్ సినిమాటోగ్రఫీ, విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
Wanaparthy: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై దాడికి యత్నం
వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై సొంతపార్టీ నాయకులే పెట్రోల్‌తో దాడికి యత్నించడం కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్, తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా.. చేరికలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించి నానా హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. చిన్నారెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని మేఘారెడ్డి వర్గీయులు హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికలపై మాట్లాడుతున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు గణేష్ గౌడ్ అనుచరులు. చిన్నారెడ్డి… pic.twitter.com/yTCuOrbKaf — Telugu Scribe (@TeluguScribe) April 18, 2024 -
ఇండియా ఎనర్జీ వీక్‌లో ‘మేఘా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక ఇండియా ఎనర్జీ వీక్–2024లో మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్), దాని అనుబంధ సంస్ధ డ్రిల్మెక్ తయారు చేసిన హెచ్‌హెచ్ 150 ఆటోమేటెడ్ హైడ్రాలిక్ వర్క్ఓవర్ రిగ్‌ను ప్రదర్శించింది. అత్యంత అధునాతన రిగ్‌లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం పట్ల కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ హర్షం వ్యక్తం చేశారు. ఓఎన్జీసీకి ఎంఈఐఎల్ 20 రిగ్‌లను అందిస్తోందని, దేశ ఇంధన రంగ ప్రయాణంలో శుభ పరిణామం అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి తెలిపారు. ప్రపంచ పటంలో చమురు, సహజ వాయు రంగంలో సముచిత స్థానంలో భారత్‌ను నిలబెట్టేందుకు అవసరమైన ఉత్పాదనలను తయారు చేస్తామని ఈ సందర్భంగా ఎంఈఐఎల్ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్‌లో ఎంఈఐఎల్ అనుబంధ కంపెనీలైన మేఘా గ్యాస్, ఓలెక్ట్రా, ఈవీట్రాన్స్, ఐకామ్ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. -
నిజాయితీగా శ్రమిస్తే సక్సెస్ గ్యారంటీ
‘సత్యం’ రాజేశ్, మేఘా చౌదరి హీరో హీరోయిన్లుగా, ఎస్తేర్ ఓ కీలక పాత్ర చేసిన చిత్రం ‘టెనెంట్’. వై. యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత సాహు గారపాటి, నటుడు ‘సుడిగాలి’ సుధీర్ అతిథులుగా హాజరై ‘టెనెంట్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సినీ పరిశ్రమను నమ్ముకుని నిజాయితీగా శ్రమిస్తే ఆలస్యమైనా సక్సెస్ తప్పకుండా వస్తుందనడానికి నిదర్శనం ‘సత్యం’ రాజేశ్, ‘సుడిగాలి’ సుధీర్. ఈ ఇద్దరూ కష్టపడి హీరోలుగా నిరూపించుకున్నారు. యుగంధర్ ప్రతిభ గల వ్యక్తి’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సాహు గారపాటి. ‘‘సత్యం’ రాజేశ్‌గారు వరుస హిట్స్ సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఈ సినిమా కథలోని ఎమోషన్స్‌కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్. -
రూ. 8,200 కోట్లతో మేఘా ఈవీ ప్లాంటు! బీవైడీతో కలిసి ఏర్పాటు యోచన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ భాగస్వామ్యంలో తెలంగాణలో ఈ ఫెసిలిటీని స్థాపించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే ప్లాంటుకు కావాల్సిన స్థలం, ఇతర సౌకర్యాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంఈఐఎల్, బీవైడీ సంప్రదించనున్నాయి. ప్రతిపాదిత ప్రణాళిక కార్యరూపం దాలిస్తే ప్లాంటు కోసం ఇరు సంస్థలు కలిసి సుమారు రూ.8,200 కోట్లు వెచ్చించనున్నాయి. మేఘా అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఇప్పటికే బీవైడీ సాంకేతిక భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ బస్‌లను తయారు చేస్తోంది. అలాగే తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్‌ల తయారీకై 150 ఎకరాల స్థలాన్ని ఒలెక్ట్రా కొనుగోలు చేసింది. (తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్) అత్యాధునిక రీతిలో ఏటా 10,000 ఈ–బస్‌లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో ఇది రానుంది. ఎలక్ట్రిక్ టిప్పర్ల తయారీలోకి సైతం ఒలెక్ట్రా ఎంట్రీ ఇచ్చింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు, త్రిచక్ర, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలనూ పరిచయం చేయాలన్నది కంపెనీ ప్రణాళిక. ఇది కూడా చదవండి: Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం -
మేఘా కంపెనీకి రూ.500 కోట్ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ ఐకామ్ టెలి తాజాగా భారత రక్షణ శాఖ నుంచి రూ. 500 కోట్ల ఆర్డర్ చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా 5/7.5 టన్నుల రేడియో రిలే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కంటైనర్స్ 1,035 యూనిట్లు సరఫరా చేయనుంది. రక్షణ శాఖతో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఐకామ్ టెలి గురువారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే డెలివరీలు ప్రారంభం అవుతాయని వివరించింది. -
‘మేఘా’కు మహారాష్ట్ర సర్కార్ ప్రశంసలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక సమృద్ధి మహామార్గ్ ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసినందుకు గాను హైదరాబాద్‌కు చెందిన మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్)ను మహారాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. ఆదివారం నాగ్‌పూర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సీహెచ్ సుబ్బయ్యలకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ ప్రాజెక్టులో 85.40 కిలోమీటర్ల రెండు ప్యాకేజీలను ఎంఈఐఎల్ పూర్తి చేసింది. శివమడక నుండి నాగ్‌పూర్‌లోని ఖడ్కీ ఆమ్గావ్ వరకు 31. కి.మీ.లు, రెండో సెగ్మెంట్లో ఔరంగాబాద్ జిల్లాలోని బెండేవాడి నుండి ఫతివాబాద్ వరకు 54.40 కి.మీ. రహదారిని పూర్తి చేసింది. వయాడక్ట్‌లు, అండర్‌పాస్‌లు, వైల్డ్ యానిమల్ ఓవర్‌పాస్‌లు మొదలైన వాటిని నిర్మించింది. ఈ బృహత్ ప్రాజెక్టుతో నాగ్‌పూర్-ముంబై మధ్య ప్రయాణ సమయం ఏడు గంటలకు తగ్గనుంది. -
అమ్మాయి వైపు నుంచి చెప్పే ప్రేమకథ ఇది
‘‘డియర్ మేఘ’ ఒక భావోద్వేగంతో కూడిన ప్రేమకథ. ఇప్పటివరకూ అబ్బాయిల వైపు నుంచి వచ్చిన ప్రేమకథలు చాలా చూసి ఉంటాం. కానీ, ఇది మేఘ అనే అమ్మాయి వైపు నుంచి చెప్పే ప్రేమకథ’’ అని నిర్మాత అర్జున్ దాస్యన్ అన్నారు. మేఘా ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ– ‘‘ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసి, లండన్, హైదరాబాద్‌లో పనిచేశాను. చిరంజీవిగారి అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. సినిమాల మీద ఇష్టం పెరిగి నిర్మాతగా స్థిరపడాలనే టాలీవుడ్లో అడుగుపెట్టాను. ప్రొడక్షన్ ప్రారంభించకముందు రెండేళ్ల పాటు దర్శకుడు వీఎన్ ఆదిత్యతో ప్రయాణం చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. నా తొలి చిత్రం ఆదిత్యగారి దర్శకత్వంలోనే నిర్మించాను. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం వల్ల నేను తీసిన రెండో చిత్రం ‘డియర్ మేఘ’ తొలి చిత్రంగా విడుదలవుతోంది. ఈ సినిమా సక్సెస్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. ఆ ధైర్యంతోనే ఓటీటీకి వెళ్లకుండా థియేటర్లో విడుదల చేస్తున్నాం. కొందరు కొత్త దర్శకులు, రచయితలు కథలు చెప్పారు.. నాలుగైదు కథలను ఓకే చేశాం. వీఎన్ ఆదిత్యతో తీసిన సినిమా రిలీజ్ తర్వాత పెద్ద హీరోతో ఓ సినిమాని ప్రకటించబోతున్నాం’’ అన్నారు. చదవండి : ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావాలి: ఆర్జీవీ అప్పుడు నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా – నాని -
సక్సెస్ఫుల్ సలాడ్!
మొలకెత్తిన విత్తనాలు, క్యాప్సికమ్, టొమాటో, క్యారట్, బీట్ రూట్ వంటి కొన్ని రకాల పచ్చి కూరగాయల ముక్కలు సన్నగా కట్ చేసి, ఉదయం పూట సలాడ్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే అవగాహన చాలామందిలో ఉంటుంది. కానీ, రోజూ అలా సలాడ్ తయారు చేసుకునే తీరిక అందరికీ ఉండదు. ముఖ్యంగా ఉద్యోగస్థులకు.‘సైడ్’ డిష్‌గా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా భావించే ఈ హెల్తీ సలాడ్ స్థిరమైన సంపాదనకు దారి చూపుతుందని భావించింది పూణెలో ఉంటున్న మేఘా బఫ్నా. ఐదేళ్ల క్రితం రూ.3500తో మొదలుపెట్టిన మేఘా హెల్తీ సలాడ్ వ్యాపారం ఇప్పుడు ఆమెకు నెలకు లక్షన్నర రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది. ‘నా నైపుణ్యాల పట్ల నాకు చాలా నమ్మకం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో 15 ఏళ్ల పాటు ఉన్నాను. పనిలో ఎంత బిజీగా ఉన్నా బ్రేక్‌ఫాస్ట్ ్టగా నేను తీసుకున్న సలాడ్ నన్ను ఆరోగ్యంగా ఉంచింది. దీన్నే బిజినెస్‌గా మార్చుకుంటే..? అనే ఆలోచన వచ్చినప్పుడు సలాడ్ వ్యాపారి గా మారిపోయాను’ అంటారు మేఘా. అనారోగ్యం తెచ్చిన మార్పు తన జీవితంలో ఎంత ముఖ్యమైనదో వివరిస్తూ ‘9వ తరగతి చదువుతున్న సమయంలో అనారోగ్య కారణంగా ఆపరేషన్ వరకు వెళ్లాను. నా కాళ్లు నా స్వాధీనంలోకి రావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. పెద్దయ్యాక వచ్చే ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్లు ముందే హెచ్చరించారు. దీంతో ఎప్పుడూ బయట ఆహారం తీసుకోలేదు. కాలేజీ స్థాయి నుంచి ఆఫీసు వరకు.. అన్ని రోజుల్లోనూ నాకు నేనుగా తయారు చేసుకున్న ప్రత్యేక భోజనం ఎప్పుడూ నాతోపాటు ఉంటుంది. మా కొలీగ్స్ కూడా నా సలాడ్ బాక్స్‌ను తిని, మెచ్చుకునేవారు. దీనినే మార్కెట్ చేయమని వారు చెబుతుండేవారు’ అని నాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటారు మేఘా. తాజా తాజా సలాడ్స్ ‘జంక్ ఫుడ్ ఎక్కడైనా సులభంగా లభిస్తుంది. కానీ, మంచి ఆరోగ్యకరమైన సలాడ్స్ మాత్రం అందుబాటులో లేవు. తాజా సలాడ్స్ లభించకపోవడం అనే సమస్యను నేను పరిష్కరించాలనుకున్నాను. అందుకు మా కుటుంబసభ్యులతోనూ చర్చించాను. అలా 2017లో సలాడ్ బిజినెస్ మొదలుపెట్టాను. ప్రచారం కోసం వాట్సప్, ఫేస్‌బుక్‌లను మాత్రమే ఉపయోగించాను’ అని వివరించే మేఘా మరెక్కడా ప్రమెషన్లు ఇవ్వలేదని, పూర్తిగా సేంద్రియ పదార్థాలతోనే సలాడ్స్ తయారుచేస్తానని చెబుతుంది. కొత్త ఆర్డర్లు.. కొత్త సవాళ్లు మొదటి రోజున 3,500 రూపాయలతో ఆరు ఆర్డర్ల ప్రారంభ పెట్టుబడితో మేఘా సలాడ్ వ్యాపారం మొదలైంది. వచ్చిన ప్రతీ కొత్త ఆర్డర్‌తో, కొత్త సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. కార్పోరేట్ ఉద్యోగం చేస్తూనే అదనంగా సలాడ్ వ్యాపారం చేస్తూ వచ్చింది. అందుకు మేఘా రోజూ తెల్లవారుజామున 4 గంటలకు తన పనిని ప్రారంభిస్తుంది. ‘సలాడ్స్ కోసం రోజూ ధాన్యాలు నానబెట్టాలి, తాజా కూరగాయలు కావాలి. అందుకు రోజూ మార్కెట్‌కు వెళతాను. కూరగాయలను శుభ్రం చేసి, కట్ చేసి సలాడ్స్ సిద్ధం చేయాలి. నా కొడుకు స్కూల్‌కు వెళ్లేవరకు నాకు సాయంగా ఉంటాడు. సలాడ్స్ ప్యాక్ చేసి, పనికి బయల్దేరడం.. ఎలా ఉంటుందంటే రోలర్కోస్ట్ పై ప్రయాణం చేస్తున్నట్టుగా నా పని ఆనందంగా పూర్తిచేస్తాను’ అని మేఘా చెబుతుంది. ప్రత్యేకమైన ప్యాకింగ్ ఇప్పుడు మేఘా ప్రతి నెల లక్షన్నర రూపాయలు సలాడ్స్ మీద సంపాదిస్తుంది. ‘ఇది అంత ఆషామాషీగా జరగలేదు. నాలుగేళ్లు సలాడ్ వ్యాపారంలో వచ్చిన అడ్డంకులను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు ఆర్డర్లు తగ్గిపోవడం, ప్లాస్టిక్ నిషేధం సమయంలో ప్యాకింగ్ విషయంలోనూ సమస్యలు వచ్చాయి. బీపీ, షుగర్ సమస్యలున్న కస్టమర్ల కోసం ప్రత్యేకమైన సలాడ్స్ తయారుచేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ ఉద్యోగులకు మరో తరహాలో సలాడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఈ వ్యాపారంలో ఎదురైన ఇబ్బందులు, వాటిని అధిగమిస్తున్న తీరు తెన్నుల గురించి తెలియజేస్తుంది మేఘా. ‘‘ఇప్పుడు పది మందికి పైగా మహిళలను సలాడ్ తయారీలో ఉద్యోగినులుగా నియమించుకోవడంతో వారాంతాలు కుటుంబంతో గడపడం, ఉదయం కాస్త లేటుగా నిద్రలేవడం వంటివి చేస్తున్నాను’’ అని చిరునవ్వుతో చెబుతుంది మేఘా. వారానికి రూ.620లతో మేఘా దగ్గర సలాడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. -
భారత్‌కు మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, హైదరాబాద్: భారత్‌కు థాయ్‌లాండ్ నుంచి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు రానున్నాయి. యుద్ధ ప్రతిపాదికన ట్యాంకుల దిగుమతికి అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్లో 1.40 లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ వుంటుంది. దేశంలో తొలిసారిగా అధిక సంఖ్యలో దిగుమతి చేస్తున్నారు. సామాజిక సేవ బాధ్యతలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ(ఎంఈఐఎల్) థాయ్‌లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను భారత్‌కు దిగుమతి చేస్తోంది. తొలి విడతగా ఆర్మీ విమానంలో మూడు ట్యాంకులు శనివారం హైదరాబాద్ చేరుకున్నాయి. బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు ప్రత్యేకంగా డిఫెంస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆక్సిజన్ ట్యాంకర్లను రప్పించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి ఈ ఆక్సిజన్ ట్యాంకర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఉచితంగా ఇవ్వనుంది. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యమని మేఘా ఇంజనీరింగ్ సంస్థ పేర్కొంది. చదవండి: మరో కీలక కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ Corona: వ్యాక్సిన్ కోసం వేరే దేశాలకు! -
తెలంగాణ: చౌకగా ఇంటి, వాహన గ్యాస్..
హైదరాబాద్: టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసి కొత్త పుంతలు తొక్కిస్తోంది. పటిష్టమైన ప్రణాళికతో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా నేరుగా పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి నేరుగా గ్యాస్‌ను సరఫరా చేయడంతో పాటు వాహన అవసరాలకు ఇంధనాన్ని అందిస్తోంది. ఈ మేఘా టెక్నాలజీతో సమయం ఆదాతో పాటు వినియోగదారులకు సులభంగా, సురక్షితంగా గ్యాస్ అందిస్తోంది. ఒక వైపు ఆకాశాన్నంటిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. మరో వైపు పరుగులు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో పేద, మధ్యతరగతి గృహ వినియోగదారులు భారం మోయలేకపోతున్నారు. ఆ భారాన్ని తగ్గించి వారికి ఊరటనివ్వడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ కృషి చేస్తోంది. పక్కా ప్రణాళికతో శరవేగంగా సీజీడీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లను నిర్మించి మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ ధరలతో పోలిస్తే 40 శాతం తక్కువ రేటుకు మేఘా గ్యాస్‌ను ఎంఈఐఎల్ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లో ఇప్పటికే గ్యాస్ ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్ సంస్థ ఇప్పుడు తెలంగాణాలో తన సేవలను విస్తరిస్తోంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో సేవలను ఇటీవలనే ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి వాణిజ్య పరంగా వంటగ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన సీజీడీ (City Gas Distribution) ప్రాజెక్ట్‌లో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ప్రాంతాల్లో పనులను పూర్తి చేసి మేఘా గ్యాస్ కింద గ్యాస్ సరఫరా సేవలను చౌకదరలకు అందిస్తోంది. 5000 కోట్లతో ఈ మూడు రాష్ర్టాలలో కలిపి మొత్తం 11 లక్షల గ్రహాలకు గ్యాస్ సరఫరా కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సిజిడి వ్యవస్థ ద్వారా దాదాపు 4 వేల మంది ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. నల్గొండ జిల్లాలో తొలిసారిగా గ్యాస్ పైప్ లైన్, సిటీ గేట్ స్టేషన్, పనులను గడువులోగా పూర్తి చేసి నల్గొండ ప్రజలకు 'మేఘా గ్యాస్' కింద చౌక ధరలకు గ్యాస్ సరఫరా చేస్తోంది. సీజీడీ - నల్గొండ ప్రాజెక్ట్ లో భాగంగా నల్గొండ జిల్లాలోని వెలిగొండ మండలం, సుంకిషాల గ్రామంలో సహజవాయువు సరఫరా లో కీలకమైన సిటీ గేట్ స్టేషన్ (CGS), మదర్ స్టేషన్ ను ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సరఫరా సేవలను అందిస్తోంది మేఘా సంస్థ. వ్యయ ప్రయాసలు తగ్గించి సులభంగా ఇంటింటికి గ్యాస్ అందే విధంగా ‘మేఘా గ్యాస్’ పటిష్టమైన ప్రణాళికతో మౌళిక వసతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లోని వివిధ జిల్లాలో అమలు చేస్తున్నట్లు మేఘా గ్యాస్ బిజినెస్ హెడ్ పలింపాటి వెంకటేశ్ తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా గ్యాస్ సిటీ గేట్ స్టేషన్ ద్వారా PNG ( piped natural gas) గృహ, పారిశ్రామిక అవసరాలకు, అలాగే మదర్ స్టేషన్ ద్వారా సీఎన్జీ (compressed Natural Gas) ని వాహన అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు. దీనితో నల్గొండ జిల్లాలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే 32 km స్టీల్ పైప్ లైన్ వేయగా, మరో 80 కి.మీ పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. 40,000 కుటుంబాలకు, పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశ్యం తో ఇంకా 500 కి.మీ పొడవు గల ఎండీపీఈ పైప్ లైన్ నిర్మాణము చేపడుతోంది. అంతే కాకుండా మేఘా సంస్థ నల్గొండ జిల్లాలో బిబినగర్, భువనగిరి, చౌటుప్పల్, చిట్యాల, నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మల్లేపల్లి, సూర్యాపేట మరియు కోదాడ లలో 10 సీఎన్జీ స్టేషన్లు నిర్మిస్తున్నారు. సిజిడి ప్రాజెక్ట్‌లో భాగంగా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేయడానికి ఉమ్మడి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్ లైన్ నిర్మాణంతో పాటు 20 సిఎన్జి స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఎంఈఐఎల్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, కర్నాటకలోని తూంకూరు - బెల్గాం జిల్లాలలో గ్యాస్ సరఫరాను ఇప్పటికే ప్రారంభించింది. కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో సిటి గ్యేట్ స్టేషన్ ద్వారా, అలాగే తూంకూరు - బెల్గాం జిల్లాల్లోనూ గ్యాస్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ - వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్ సరఫరా చేయటం ద్వారా ఏకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు అవసరమైన గ్యాస్‌ను ఓఎన్జీసీ - గెయిల్ నుంచి పొందనుంది. మేఘా గ్యాస్ ‘ఇట్స్ స్మార్ట్ - ఇట్స్ గుడ్’ అనే ట్యాగ్ లైన్ తో తన సేవలను విస్తరిస్తున్న మేఘా గ్యాస్ గృహాలు - వాణిజ్య సంస్థలు - పారిశ్రామిక సంస్థలతో పాటు రవాణా వాహనాలకు సహజ వాయువును సరసమైన ధరకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన మదర్ స్టేషన్ నుంచి గ్యాస్‌ను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు స్టీల్ - ఎండిపీ ఈ పైప్‌లను 722 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసారు కర్ణాటకలోని తూంకూరు జిల్లాలో కూడా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తోంది. వక్కోడి - హెగ్గేరి - గోళ్లహళ్లి - గొల్లరహతి - కుప్పూరు - దసముద్దేప్యా - సిరగతే - దిబ్బుర్ - గుళురు - సంతపేట - మరురూర్ దీన్నే - శేట్టిహళ్లి - జయనగర్ - గోకుల్ ఎక్స్ టెన్షన్ - ఖ్యాతిసాండ్రా - హీరేహళ్లి ఏరియా - మంచికల్ కుప్పె - బట్వాడీ - హనుమంతపురలో 595 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేసింది. అలాగే బెల్గామ్ జిల్లాలో బసవన్న కోళ్ల - ఆటోనగర్ - రాంతీర్థనగర్ - అశోక సర్కిల్ - ఆజాద్ నగర్ - చెన్నమ్మ సర్కిల్ - మారుతీ నగర్ - సదాశివ నగర్ తదితర ప్రాంతాల్లో 460 కిలోమీటర్ల మేర స్టీల్ - ఎండిపీ ఈ పైప్ లైన్ వేశారు. చదవండి: వీధి కుక్కలంటే అందరికి భయం.. కానీ ఆమెకు కాదు! ప్రముఖ హిప్నాటిస్ట్ కమలాకర్ కన్నుమూత -
మేఘా ఒలెక్ట్రా మెగా డీల్: మరో 350 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, హైదరాబాద్ : ఎలక్ట్రిక్ బస్సుల (ఈవి) తయారీలో అగ్రగామీగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకుంది. పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు సంబంధిత అధికారులు గురువారం (28.01.2021) ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే దిశలో కేంద్ర ప్రభుత్వ ఫేమ్- 2 పథకంలో భాగంగా ఈ బస్సులను సరఫరా చేయనుంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) / ఓపేక్స్ మాడల్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పాటు ఈ 350 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టనుంది. ఈవీ ట్రాన్స్ ఈ 350 ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుండి సేకరించనుంది. ఈ 350 బస్సులను ఏడు నెలల్లో ఒలెక్ట్రా సంస్థ అందించనుంది. అందిస్తుంది. కాంట్రాక్ట్ కాలంలో ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా ఎవీ ట్రాన్స్ పరిధిలోనే ఉంటుంది. మొత్తంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ దాదాపు 1250 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనున్నది. బీఎంటీసీ బిడ్డింగ్ లో ఎల్-1 గా నిలిచిన ఒలెక్ట్రా ఇక భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన గ్రీన్ సిటీ బెంగళూరులో సైతం 300 బస్సులను సరఫరా చేయడానికి పిలిచిన టెండర్లలో ఒలెక్ర్టా సంస్థ ఎల్-1 గా నిలిచింది. ఫేమ్-2 పథకంలో భాగంగా బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ (బీఎంటీసీ) 300 విద్యుత్ బస్సులకు గాను నిర్వహించిన టెండర్ లో అతి తక్కువగా బిడ్డింగ్ కోట్ చేసి ఎల్-1 గా నిలిచింది. ఈ 300 ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ)/ఓపేక్స్ మాడల్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చేపడుతుంది. ఈవీ ట్రాన్స్ కి 300 బస్సుల సరఫరాకు అనుమతి లభించిన వెంటనే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ నుంచి 12 నెలల కాలంలో సేకరిస్తుంది. పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ నుండి 350 ఎలెక్ట్రిక్ బస్సుల ఆర్డర్ దక్కించుకున్నందుకు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) సీఈఓ అండ్ సీఎఫ్ఓ శరత్ చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ “ఇప్పటికే ఎవీ ట్రాన్స్ ఇప్పటికే పూణేలో 300 ఎలెక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని ఈ కొత్త బస్సుల రాకతో ఈ సంఖ్య 650 లకు చేరిందన్నారు. దేశంలోని ఒక రాష్ర్టంలో అత్యధికంగా బస్సులను సరఫరా చేసిన ఘనత ఒలెక్ర్టాకే చెందుతుందని తెలిపారు. ఒలెక్ర్టా ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ర్టాలలో ప్రయాణికులను గమ్యం చేరుస్తున్నాయి. దేశంలో మొట్టమొదటి సారిగా ఒలెక్ర్టా బస్సు 13,000 అడుగుల (3,962.4 మీ) ఎత్తు ఉన్న రోహ్తాంగ్ పాస్ వరకు ప్రయాణం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. 12 మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 33 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం పొందగలరు. ప్రయాణికుల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్ ను కూడా ఏర్పాటు చేశారు. బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ (Li-ion) బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధునిక సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్ ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 2 నుంచి 5 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది. -
గుడ్ టచ్ బ్యాడ్ టచ్
మేఘా భాటియా... యానిమేటెడ్ చిత్రాల రూపకర్త. పిల్లల లైంగిక దోపిడీ గురించి అర్థం అయ్యేలా చెప్పాలనే ఆమె ప్రయత్నం ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. ఆలోచింపజేస్తుంది. తను రూపొందించిన చిత్రాల ద్వారా ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ని పిల్లలు అర్థం చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది. మేఘా మొదట పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ చేసింది. దీనిని హిందీతోపాటు ఇంగ్లిష్‌లోనూ విడుదల చేసింది. సినిమా పేరు ‘హమారే సూపర్ బడ్డీస్, హమారే రక్షక్’. మేఘాకు ‘అవర్ వాయిస్’ అనే ఎన్జీఓ కూడా ఉంది. దీని ద్వారా ఆమె సెమినార్లను నిర్వహించి మరీ విషయాలను రాబడుతుంది. పిల్లల లైంగిక వేధింపులు.. సమాచార సేకరణ ఢిల్లీలో రాజేంద్రనగర్‌లో నివసిస్తున్న మేఘా భాటియా లండన్ యూనివర్శిటీ కాలేజ్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందింది. అక్కడే ఒక పరిశోధన ప్రాజెక్ట్ సమయంలో పిల్లల లైంగిక వేధింపుల గురించిన సమగ్ర సమాచారం ఆమెకు లభించింది. ఆ తర్వాత ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. తను ఎంచుకున్న అంశం మీద ఎంతో సమాచార సేకరణ చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం పిల్లలతో సంబంధం ఉన్న 1,06,958 కేసులలో 36,022 కేసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డవే. వీరిలో సగం మంది పిల్లలు నేరాలకు పాల్పడతారనే భయంతో పోలీస్‌స్టేషన్‌లో నివేదికలో రాయడం లేదని తెలిసింది. ఇలాంటి పిల్లలకు సాయం చేయడానికి మేఘ యానిమేషన్ చేయడం ప్రారంభించింది. పిల్లలకు తెలియదు.. పెద్దలు అర్థం చేసుకోరు! యానిమేషన్ సినిమాలు అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. అందుకే, వాటి ద్వారానే పిల్లలకు లైంగిక విద్యను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మేఘ. ‘‘నిజానికి పిల్లలకు సంబంధించిన నేరాలు చాలా మటుకు వారికి తెలియకుండానే జరుగుతాయి. ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి, ‘నా పట్ల ఒకరు అసహ్యంగా ప్రవర్తించారని అమ్మకు చెప్పాను. మరోసారి ఇలాంటి మాటలు చెబితే కొడతాన’ని చెప్పింది’ అని ఆ పాప చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది’ అన్నారు మేఘ. ఈ పరిస్థితుల్లో ఈ పిల్లలకు సురక్షితమైన వాతావరణం అవసరమని మేఘా గ్రహించింది. ఆ ఆలోచనతోనే ‘హమారే సూపర్ బడ్డీస్, హమారే రక్షక్’ పేరుతో పది నిమిషాల నిడివిగల యానిమేటెడ్ సినిమా రూపొందించింది. మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో నివసిస్తున్న 100 మందికి పైగా న్యాయవాదులు, ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని తీసుకున్న తరువాత మేఘా ఈ చిత్రాన్ని రూపొందించింది. మేఘ చేస్తున్న ఈ ప్రయత్నం పిల్లల క్షేమం కోసమే. పిల్లలు సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ పిల్లల్లో అవగాహన తీసుకురావాలి. పెద్దలూ అర్థం చేసుకోవాలి. (చదవండి: ఆమె ఒక నడిచే గ్రంథాలయం) -
మరింత వేగంగా ఉద్దానం ప్రాజెక్టు
శ్రీకాకుళం,అరసవల్లి: ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(హైదరాబాద్) సంస్థ దక్కించుకుంది. ప్రతిష్టాత్మకమైన ఉద్దానం ప్రాంతంలో శాశ్వత మంచినీటి పథకం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధుల మంజూరు, పనులకు చెందిన పరిపాలన ఆమోదాన్ని కూడా ప్రకటించింది. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు ఎన్నాళ్ల నుంచో వేధిస్తున్న మంచినీటి సమస్యకు ఈవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ఈ మేరకు రూ.700 కోట్లతో ఉద్దానంలో ప్రతి ఇంటికి మంచినీటిని అందించేలా ప్రత్యేక ప్రాజెక్టును నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే పారదర్శకంగా నిర్వహించిన టెండర్లను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మేఘా’ దక్కించుకుంది. పనులు పూర్తయితే ఉద్దాన ప్రాంతంలో ఉన్న మొత్తం ఏడు మండలాల్లో 807 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. ఏపీ తాగునీటి సరఫరా సంస్థ (ఏపీడీడబ్ల్యూఎస్సీ) ఆధ్వర్యంలో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. హిరమండలమే ప్రధాన నీటి వనరుగా.... ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టును మొదట్లో రేగులపాడు వద్ద ఉన్న ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన నీటి వనరుగా గుర్తించినప్పటికీ సాంకేతిక కారణాలతో తాజాగా హిరమండలం బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టును ఖరారు చేశారు. ఈ సోర్స్ సెంటర్ నుంచి సుమారు 19.2 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. దీంతో ఉద్దాన ప్రాంతంలోని ఇచ్ఛాపురం మండలంలో 45 గ్రామాలు, కంచిలిలో 138, కవిటిలో 118, సోంపేటలో 74, మందసలో 225, పలాసలో 86, వజ్రపుకొత్తూరులో 121 గ్రామాలకు మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కిడ్నీ సంబంధిత రోగాలతో ఉద్దాన ప్రాంత ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్న సంగతి విదితమే. వీరికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యేందుకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. 2051 నాటి అవసరాలకు అనుగుణంగా...: ఉద్దాన ప్రాంత పరిధిలో 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం తాజా ప్రాజెక్టు ద్వారా మొత్తం ఏడు మండలాల్లోని 807 గ్రామాల్లోని సుమారుగా 4,69,157 మందికి ప్రస్తుతానికి మంచినీటి అవసరాలు తీరనున్నాయి. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2051 నాటికి ఇదే ప్రాంతంలో సుమారు 7,82,707 మంది జనాభాకు ఈ ప్రాజెక్టు ద్వారా మంచినీటిని వినియోగించుకునేలా డిజైన్ చేశారు. ఈ మేరకు మేఘా సంస్థ త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించనుంది. ఏడు మండలాలతో పాటు పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాల్టీల్లోనూ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. -
వ్యర్థాలతో పాదరక్షలు
పాదాలకు అందమైన నాణ్యమైన ఫ్యాషనబుల్ చెప్పులు, షూస్‌ను అందరూ ఇష్టపడతారు. అందుకే డబ్బు కాస్త ఎక్కువైనా ఖర్చుకు వెనకాడరు. రాజస్థాన్‌కు చెందిన మేఘా రావత్ వాడి పడేసిన వస్తువులతో అందమైన చెప్పులను తయారుచేస్తోంది. . ఫ్యాషనబుల్‌గా ఉండేవి, నాణ్యమైన, సరసమైన ధరలలో లభించే పాదరక్షల తయారీని ప్రారంభించడమే కాకుండా వాటికో బ్రాండ్‌ను క్రియేట్ చేసింది మేఘారావత్. ఇవి పూర్తిగా రీసైక్లింగ్ వస్తువులతో తయారు చేసినవి. వనరుల విలువ తెలుసుకున్నప్పుడు మేఘా రావత్ చాలా చిన్నది. 28 ఏళ్ల మేఘా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో పెరిగారు. ‘నా చిన్నతనంలో నీళ్లు, కరెంట్ సరఫరా సరిగా ఉండేది కాదు. నా తమ్ముడు, నేను స్కూల్ నుంచి వచ్చాక ఇంటి పనులకు నీళ్ల కోసం దగ్గరలోని కాలువకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. వాడి పడేసిన సీసాలను దీపానికి ఉపయోగించేది అమ్మ’ అని గుర్తు చేసుకుంటుంది మేఘ. తండ్రి ఆర్మీలో ఉద్యోగి. తల్లి స్థానిక పాఠశాలలో టీచర్. తక్కువ వస్తువులతో ఎలా జీవించాలో నేర్పేది తల్లి. అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయడం అలవాటు చేసింది. వాడిన వస్తువులను తిరిగి ఉపయోగించడం సాధ్యమైనంతవరకు ప్రయత్నించేవారు. ‘మా అమ్మ తన పాత చీరలతో నాకు గౌన్లు కుట్టేది. అవి చిరిగాక దిండు కవర్లుగా, టేబుల్ క్లాత్‌గా, దుమ్ము దులపడానికి ఉపయోగించే డస్టర్లుగా వాటిని చూసేదాన్ని’ అని మేఘా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంది. స్క్రాప్‌తో స్ట్రాప్స్ మేఘా 2014లో కురుక్షేత్రలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పై చదువుల కోసం తను ఉంటున్న పట్టణం నుండి నగరానికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలామంది ఏవీ ఆలోచించకుండా వస్తువులను కొనడం గమనించేది. ‘వాటిని వాళ్లు ఎంతోకాలం వాడరు. కొంత కాలానికి వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. వాటన్నిటి అసలు ఖర్చు మాత్రమే కాదు, ప్రకృతికి జరిగే నష్టాన్ని కూడా అదే టైమ్‌లో అంచనా వేసుకునేదాన్ని’ అని చెబుతారు మేఘా. ఆ ఆలోచనతోనే మేఘా 2015లో రీ సైక్లింగ్ మెటీరియల్‌తో ఫుట్‌వేర్‌ను డిజైన్ చేయడం కనుక్కుంది. దానికి ‘కురియో’ అని నామకరణం చేసింది. దీనికి ముందు మేఘా ముంబయ్‌లోని ఒక ఐటి సంస్థ, ఎక్స్పోర్ట్ కంపెనీలలో పనిచేసింది. అక్కడ తనకా ఉద్యోగం సంతృప్తిని ఇవ్వడం లేదని అర్థమయ్యాక పర్యావరణ స్పృహ కలిగిన పాదరక్షలను తయారు చేయడం మొదలుపెట్టింది. వీటి తయారీలో నైపుణ్యం కలిగిన 200 మంది చేతివృత్తులవారిని, మహిళలను ఎన్జీవోల సాయంతో నియమించుకుంది. టైర్లతో చెప్పుల అడుగు భాగం ‘చిన్నప్పటి నుండి సొంతంగా రకరకాల వస్తువులను తయారు చేయడం సరదాగా చేసేదాన్ని. మా అమ్మ టైలరింగ్ పనిచేస్తుంటే నేను పాత పేపర్లతో కటింగ్ నేర్చుకునేదాన్ని. క్లాత్ ముక్కలతో రకరకాల బొమ్మలను తయారుచేసేదాన్ని. రీ సైకిల్ ద్వారా కొత్తవస్తువును తయారు చేసినప్పుడల్లా చాలా ఆనందించేదాన్ని. అదే ఈ చెప్పుల తయారీకి పురికొల్పింది. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడంతో బాధ్యత పెరిగింది. ఏ పని చేసినా పర్యావరణ స్పృహతో చేయాలనే ఆలోచన కలిగింది’ అంటుంది మేఘా. కురియో బ్రాండ్ ద్వారా పాదరక్షలు, కేశాలంకరణ వస్తువులు, బ్రోచెర్స్, ఫోల్డర్లు, ఫ్రిజ్ మాగ్నెట్స్, పర్సులు, కోస్టర్స్ వంటి ఉత్పత్తులను తయారుచేస్తుంది మేఘా. వీటిలో బాగా పేరొందినవి కొల్హాపురీ చెప్పులు. అలాగే కవర్ బూట్లు. పాదరక్షలకు ఉపయోగించే పట్టీలు పూర్తిగా చేనేత దారుల నుండి సేకరించిన బట్టతో, టైలరింగ్ యూనిట్ల నుండి సేకరించిన వ్యర్థ వస్త్ర పదార్థాలను ఉపయోగిస్తారు. దానికి తోడు పాదరక్షల అడుగు భాగానికి రీసైకిల్ టైర్లను వాడుతారు. వ్యర్థాల కోసం నెట్వర్క్ ‘కొని వాడిన నాణ్యమైన బట్టలను దేశంలోని వివిధ మూలల నుండి సేకరిస్తాం. ఇవి సహజమైన రంగులు, చేతితో నేసిన క్లాత్స్ అయి ఉంటాయి. వాటిలో ‘ఖాదీ, అజ్రఖ్, కలాంకారి, ఇండీ ఫాబ్రిక్స్ మొదలైనవి. దీనికి స్థానిక చేతివృత్తులు, చేనేత కార్మికులూ సహకరిస్తారు. ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమైనా ఉన్నాయా అంటే రీసైక్లింగ్ పదార్థాల కోసం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడమే. ఇందుకు సమయం, అనుభవం చాలా అవసరం ఉంటుంది..’ అని వివరిస్తుంది మేఘా. కాలుష్యకారకాలలో అతిపెద్దది ఫ్యాషన్ ప్రపంచం. మేఘా చేసే రీ సైక్లింగ్ ఉత్పత్తులు కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదం చేస్తున్నాయి. ఈ రీ సైక్లింగ్ తయారీ ఉత్పత్తులు ప్రజలకు మరింత అందుబాటులోకి రాగలిగితే పర్యావరణ నష్టాన్ని బాగా తగ్గించవచ్చు. -
పోలవరం పరుగులు పెడుతోంది
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాయి. అటు నిర్మాణ పరంగానూ ఇటు ఇంజనీరింగ్ అనుమతుల్లోనూ అడ్డంకులు తొలగిన విషయం తెలిసిందే. రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనులను పూర్తిస్థాయి ఇంజనీరింగ్, శాస్త్రసాంకేతిక పద్ధతుల్లో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి ప్రాధాన్యత ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, లోటుపాట్లు, ముఖ్యంగా అశాస్త్రీయంగా (నాన్-ఇంజనీరింగ్) పద్ధతిలో చేపట్టిన పనులన్నింటినీ క్రమంగా సవరిస్తూ ఇంజనీరింగ్ మోడల్లోనే పోలవరం ముందుకు సాగుతోంది. (పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎం జగన్) అనువైన సమయం- పనులు ముమ్మరం నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మేఘా) పూర్తిస్థాయిలో తన శక్తి యుక్తులను ఈ ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించింది. నిర్ణీత గడువుకన్నా ముందే ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు యత్నిస్తోంది. అనతికాలంలోనే ప్రాజెక్ట్ స్పిల్‌వేకు సంబంధించి 62818 ఘనపు మీటర్ల పనిని చేయడంతో పాటు మిగిలిన పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టేందుకు ప్రాథమిక కసరత్తులను మేఘా వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌కు ప్రధానమైన పనులు వేగవంతం చేసేందుకు గోదావరి ఒడ్డున మట్టి పటిష్టతకు సంబంధించి పటుత్వ (VIBRO COMPACTION WORKS UNDER PROGRESS) పరీక్షలు, గ్యాప్-1లో నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్), ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ అవసరం మేరకు అంటే వరద ఉదృతి వల్ల ప్రాజెక్ట్ పనులకు అవరోధం ఎదురుకాని విధంగా చేపట్టే పనులు ముమ్మరం అయ్యాయి. కీలకమైన అనుమతులకు ప్రత్యేక అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష్యం మేరకు పనులు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా శాస్త్రీయమైన పద్ధతిలో డిజైన్లకు సంబంధించిన అనుమతులు సాధించడం చాలా కీలకమైనది. ఇప్పుడు చేపట్టాల్సిన పనులకు సంబంధించిన డిజైన్లకు అనమతులు లభించకపోతే పనులు వేగంగా చేసినా ప్రయోజనం ఉండదు. మళ్లీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లు మొదటికి వస్తుంది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్ట్‌ను పరిశీలించి సమీక్షించినప్పుడు అనుమతులు త్వరగా మంజూరు చేస్తే నిర్దేశించిన గడువు ప్రకారం పనులను పూర్తిచేస్తామని మేఘా యాజమాన్యం స్పష్టం చేసింది. దాంతో డిజైన్ల అనుమతులు సాధించేందుకు ఢిల్లీ, హైదరాబాద్‌లోనూ ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి పనులు శాస్త్రీయ పద్ధతిలో ఊపందుకున్నాయి. (ప్రాజెక్టుల బాటకు శ్రీకారం) గత ప్రభుత్వ తప్పిదాలు ప్రాజెక్ట్ పనులను మేఘా సంస్థ గత ఏడాది నవంబర్‌లో దక్కించుకున్నప్పటికీ వెంటనే పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. దాదాపు మూడు నెలల పాటు విలువైన సమయం వృధా అయ్యింది. అందుకు గత ప్రభుత్వం నాన్ ఇంజనీరింగ్ పద్ధతిలో పనులు చేపట్టడమే. ముంపు సమస్య తలెత్తి విలువైన సమయం వృధా కావడానికి చంద్రబాబు ప్రభుత్వం కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడమే కారణం. వాస్తవానికి ఇది ఇంజనీరింగ్ విధానాలకు వ్యతిరేకం. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో ఆయన ఒత్తిడికి తలొగ్గి 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించేందుకు అంగీకరించడం మరింత నష్టం చేకూర్చింది. ఇంతవరకు ఏ జలాశయ నిర్మాణాల్లోనూ లేనివిధంగా పోలవరంలో మాత్రమే ఈ విధమైన అనుమతి లభించింది. కాఫర్ డ్యామ్ అనేది ప్రధాన జలాశయంలో నిర్మాణం జరిగేప్పుడు నీరు అడ్డు రాకుండా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణం. దీనివల్ల గత ఏడాది వరదలప్పుడు జలాశయంలో నీరు నిలిచిపోయి పనులు ఆగిపోవడమే కాకుండా నిర్మాణం ప్రాంతంలో నిర్మించిన రహదారులు కొట్టుకుపోయాయి. (ట్రాన్స్ట్రాయ్.. డబ్బులేమయ్యాయ్?) కనీసం 4 టిఎంసీల నీరు నిలువ ఉండడంతో దానిని తోడితే తప్ప పనులు చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో దాదాపు మూడు నెలల పాటు పంపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి ఆ నీటిని తరలించాల్సి వచ్చింది. దాంతో జనవరి నెలాఖరుకు కానీ పనులు ఉపందుకుకోవడం సాధ్యం కాలేదు. గత ప్రభుత్వం స్పిల్‌వేతో పాటు కాఫర్ డ్యామ్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. వాటిని కూడా సకాలంలో పూర్తి చేయలేకపోయింది. ఈ ప్రాజెక్ట్‌లో ఎర్త్‌కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ (ప్రధాన ఆనకట్ట)తో పాటు అందులోని మూడు గ్యాప్‌లు, స్పిల్‌వే, స్పిల్ చానెల్, అప్రోచ్ చానెల్, పైలెట్ చానెల్, కుడి-ఎడమ కాలువల అనుససంధానంతో పాటు జల విద్యుత్ కేంద్రం కీలకమైనవి. వీటిల్లో చాలా పనులు అసలు గత ప్రభుత్వం చేపట్టనే లేదు. జనవరి నుంచి స్పిల్‌వే పనులు ముమ్మరం చేసిన మేఘా ఇంజనీరింగ్ లక్ష్యానికి అనుగుణంగా పనులు సాగిస్తోంది. జనవరిలో 20631 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32124 ఘ.మీ, మార్చిలో ఇప్పటివరకు 21358 ఘ.మీ పనిని పూర్తిచేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్‌వే బీమ్ల నిర్మాణంతో పాటు బ్రిడ్జ్‌లు, డివైడ్ వాల్, ట్రైనింగ్ వాల్, గైడ్‌వాల్ పనులను ఉదృతం చేసింది. అదే సమయంలో ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్, అందులోని మూడు గ్యాపులు, జల విద్యుత్ కేంద్రం మొదలైన ప్రధానమైన పనులు శరవేగంగా సాగుతున్నాయి. (ముంపు ప్రాంతాల నివేదిక ఇవ్వండి) నిజానికి చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్ట్ నత్తనడక నడిచింది. దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ కీలకమైన అనుమతులన్నీ అప్పుడే సాధించారాయన. ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ చూపలేదు. వైఎస్సార్ పాలనలోనే దాదాపు కుడి-ఎడమ కాలువలు పూర్తయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో 2010 నుంచి 2019 వరకు కేవలం స్పిల్‌వేలో కొంత పనితోపాటు డయాఫ్రం వాల్, కాఫర్ డ్యామ్ మాత్రమే నిర్మించారు. ఇంతకు మించి అప్పుడు జరిగిందేమీ లేదు. (కాఫర్ డ్యామ్పేరుతో కపట నాటకం) కీలకమైన డిజైన్లు: ఈ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ సంస్థను మార్చి పనులు వేగం చేయించడంతో పాటు అదే సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనులల్లో అనుమతులు చాలా కీలకమైనవి. గత ప్రభుత్వ వీటిని నిర్లక్ష్యం చేసింది. మొత్తం ప్రాజెక్ట్‌లో 45 డిజైన్లు అనుమతి లభించాల్సి ఉండగా వాటిలో 37 డిజైన్లు అనుమతి సాధించడానికి దాదాపు 10 ఏళ్ళ సమయం పట్టింది. మరో ఎనిమిది కీలకమైన డిజైన్ల అనుమతి లభించలేదు. దీంతో త్వరితగతిన అనుమతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రధాన ఆనకట్టలోని గ్యాప్-1లో నిర్మించే మట్టి, రాతి నిర్మాణ పనులకు ఇంకా అనుమతి లభించలేదు. ప్రాజెక్ట్‌కు ఇది ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వం దీని అనుమతులు సాధించేందుకు శ్రద్ధ చూపించలేదు. గ్యాప్-2లో ఏ విధమైన నిర్మాణం ఉండాలనే దానిపైన కూడా చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనేక పనులకు సంబంధించి ఇప్పుడే ఇంజనీరింగ్ తరహాలో పనులు ముమ్మరం అయ్యాయి. దీంతో పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అవుతుందనే నమ్మకం కలుగుతోంది. -
ప్రేయసితో నటుడి రిజిస్టర్ మ్యారేజ్
బెంగళూరు : కన్నడ నటుడు చేతన్ తన ప్రియురాలు మేఘను వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. బెంగళూరులోని వల్లబ్ నికేతన నినోబాభావే ఆశ్రమంలో వీరు పెళ్లి చేసుకున్నారు. శనివారం ఇద్దరు కలిసి గాంధీనగర్‌లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహ చట్టం ప్రకారం పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ విషయాన్ని చేతన్ తన ఫేస్బుక్ ద్వారా అభిమానులకు వెల్లడించారు. కాగా, నటుడిగానే కాకుండా.. సామాజిక కార్యకర్తగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, మేఘ కూడా సామాజిక కార్యకర్త కావడం విశేషం. ఇంజనీర్ పూర్తి చేసిన మేఘ.. ఆ తర్వాత మానవ హక్కుల పట్ల అభిరుచితో లా డిగ్రీని పూర్తి చేశారు. అయితే తమది ప్రేమ వివాహం అని కొద్ది రోజుల కిందట చేతన్ వెల్లడించారు. -
అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట
ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామి సంస్థ మేఘా ఇంజనీరింగ్ సామాజిక సేవలోనూ ముందుంటోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. మరోవైపు క్యాన్సర్ బాధిత చిన్నారులను అక్కున చేర్చుకుని, వారికి మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర సామగ్రిని అందిస్తోంది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో అత్యాధునిక వసతులతో క్యాన్సర్ బాధితుల కోసం అంకాలజీ భవనాన్ని నిర్మించి ఇచ్చింది. అంతేకాకుండా అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట కార్యక్రమాన్ని కూడా ఎంఇఐఎల్ నిర్వహిస్తున్నది. అలాగే ఎంఇఐఎల్ తన సేవా కార్యక్రమాలను గ్రామాలకు విస్తరించింది. ఎలాంటి రాజకీయ ఎజెండా లేకుండా.. కేవలం గ్రామాలకు సేవ అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ గ్రామాలను దత్తత తీసుకొని వాటి వికాసానికి తనవంతు తోడ్పడుతోంది. ఏపీ, తెలంగాణలోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా జములపల్లిలో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను ఆధునీకరించి, ప్రతి ఇంటికి తాగునీరు, అలాగే సోలార్ ప్లాంట్ తోపాటు రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లాలోని డోకిపర్రు, ఖాజా గ్రామాలను దత్తత తీసుకున్న ఎంఇఐఎల్ ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్నది. డోకిపర్రులో కళ్యాణ మండపం, దేవాలయం నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు అందించింది. అలాగే రాయలసీమ ప్రాంతంలో నాగులాపురం,గంజిగుంటపల్లి గ్రామాలను దత్తత తీసుకుంది. ద ఇక తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలోని పస్పుల, మురహరిదొడ్డి గ్రామాలను దత్తత తీసుకుని,రహదారులను నిర్మించడంతో పాటు సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆసుపత్రుల్లోని రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఎంఇఐఎల్ భోజనామృతం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. తొలివిడతలో నీలోఫర్‌తోపాటు ఉస్మానియాలో రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. ఇలా సంత్సరంలో దాదాపు 10 లక్షల మంది ఆకలి తీరుస్తున్నది. అలాగే ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిచేస్తోంది. దీంతోపాటు ప్రాణం ఫౌండేషన్‌కు చెందిన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యంతో పాటు, సద్దిమూట కార్యక్రమం ద్వారా సిద్దిపేట, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ యార్డ్ లలో రైతులు, హమాలీల ఆకలి తీరుస్తున్నది. నిమ్స్‌లో అత్యాధునిక అంకాలజీ భవనం నిమ్స్‌లో అత్యాధునిక సదుపాయాలతో అంకాలజీ ఆసుపత్రి భవనాన్ని మేఘా సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలను ఎంఇఐఎల్ కల్పించింది. ఇందులో ప్రత్యేక వార్డులతో పాటు.. ఐసీయూ, బెడ్లు, ఆక్సిజన్ సదుపాయాలు, సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయం, బెడ్ లిఫ్ట్ సౌకర్యం గత ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చింది. -
ట్రూజెట్... చిల్డ్రన్స్ డే ప్రయాణం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానయాన రంగ సంస్థ ‘ట్రూజెట్’ పేద పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 40 మంది పిల్లలను బుధవారం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి సేలంకు తీసుకెళ్లింది. వీరంతా తమిళనాడుకు చెందిన ఎస్ఆర్వీవీ పాఠశాల విద్యార్థులు. వెల్లప సెంబనా గౌండర్ మెమోరియల్ ట్రస్ట్ సాయంతో పిల్లలకు విమానయాన అవకాశం కలిగింది. ‘వింగ్స్ ఆఫ్ హోప్’ కార్యక్రమం కింద ఏటా 300 మంది పేద పిల్లలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ట్రూజెట్‌ను ప్రమోట్ చేస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్ కమర్షియల్ హెడ్ సెంథిల్ రాజా తెలియజేశారు. -
ధ్రువకు జోడీ కుదిరింది!
తమిళసినిమా: కొన్ని చిత్రాలకు కథానాయికలు త్వరగా దొరకరు. కారణం దర్శక నిర్మాతలకు నచ్చకపోవడం కావచ్చు. కథానాయకులకు సెట్ కాకపోవచ్చు. ఆయా పాత్రలకు నప్పకపోవచ్చు. ఇంకేదైనా కావచ్చు. అలా నవ నటుడు ధ్రువ విక్రమ్‌కు జంటగా నటించే హీరోయిన్ కోసం కొన్ని నెలలుగా అన్వేషణ జరుగుతోంది. ధ్రువ విక్రమ్ అనగానే అతను హీరో విక్రమ్ వారసుడని ఇట్టే అర్థమవుతుంది. ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఈ యువ నటుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి ఈ చిత్రం రీమేక్. విజయ్ దేవరకొండ నటించిన పాత్రను తమిళంలో ధ్రువ విక్రమ్ పోషిస్తున్నారు. తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌తో నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే హీరోయిన్ ఎంపిక కాకుండానే ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు దర్శకుడు బాలా. తెలుగులో శాలినీపాండే నటించిన పాత్రను తమిళంలో పోషించే నటి కోసం చిత్ర యూనిట్ తెగ వెతికింది. పలువురు నటీమణులను పరిశీలించారు. చాలామంది పేర్లు ప్రచారమయ్యాయి కూడా. చివరికి బెంగాలీ బ్యూటీకి ఆ అదృష్టం దక్కింది. బెంగాలీలో పలు టీవీ, మూవీ చిత్రాల్లో నటించిన మేఘాచౌదరి వర్మ చిత్రంలో ధ్రువ్‌తో రొమాన్స్ చేయనుంది. ఈ బ్యూటీ హిందీ సీరియల్స్‌లోనూ నటించింది. మోడల్‌గా రాణించిన మేఘా చౌదరి తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘చిల్లన్ను ఒరు కాదల్’ చిత్రంలో ఆయన కూతురిగా నటించిందన్నది గమనార్హం. తాజాగా వర్మ చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. మరి ఇక్కడ కథానాయకిగా ఏ పాటిగా నిలదొక్కుకుంటుందో చూడాలి. త్వరలో ప్రారంభం కానున్న వర్మ చిత్ర షూటింగ్ రెండవ షెడ్యూల్లో మేఘా చౌదరి పాల్గొననుందన్నది తాజా సమాచారం. ఇ4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రాజుమురుగన్ సంభాషణలను రాస్తున్నారు. -
ఇంటింటికీ ‘మేఘా గ్యాస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్ఫ్రా దిగ్గజం ‘మేఘా ఇంజనీరింగ్’ (ఎంఈఐఎల్)... గ్యాస్ సరఫరాలోకి ప్రవేశిస్తోంది. గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను సరఫరా చేసే ప్రాజెక్ట్‌ను ఆంధప్రదేశ్‌లోని కృష్ణా, కర్ణాటకలోని తుముకూరు, బెల్గాం జిల్లాల్లో ఆరంభిస్తోంది. ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించామని, త్వరలో పూర్తిస్థాయి సరఫరా ఆరంభిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో సంస్థ తెలియజేసింది. గ్రామీణ ప్రాంతంలో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాలోకి అడుగుపెడుతున్న తొలి కంపెనీ ఇదే. ‘‘కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో ఆగిరిపల్లి, కానూరుల్లో ఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీనికి అవసరమైన భూగర్భ సరఫరా వ్యవస్థ కూడా సిద్ధమయింది. కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 571 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఇప్పటికే పూర్తయింది. తుముకూరు జిల్లాలో 300 కి.మీ., బెల్గాం జిల్లాలో 350 కిలోమీటర్ల భూగర్భ పైప్‌లైన్ కూడా గ్యాస్ సరఫరాకు సిద్ధమయింది. దీనికి అవసరమైన గ్యాస్‌ను ఓఎన్జీసీ–గెయిల్ నుంచి పొందేలా ఒప్పందం చేసుకుంటున్నాం’’ అని ఎంఈఐఎల్ హైడ్రోకార్బన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అందుబాటు ధరల్లో ఉండే ‘మేఘా గ్యాస్’ వాణిజ్య కార్యకలాపాలు... త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారాయన. రోజుకు 1.4 లక్షల ఘనపుటడుగుల గ్యాస్! గ్యాస్‌కోసం ఓఎన్జీసీ–గెయిల్‌తో ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పిన రాజేశ్‌రెడ్డి... కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో ఓఎన్జీసీ ఇటీవలే వాణిజ్యపరమైన ఉత్పత్తి ఆరంభించినట్లు తెలియజేశారు. దీన్నుంచి స్థానిక సరఫరా కోసం రోజుకు 90వేల ఘనపుటడుగుల గ్యాస్‌ను సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఇక కర్ణాటకలోని రెండు జిల్లాలకూ రోజుకు 50వేల ఘనపుటడుగుల గ్యాస్‌ను సరఫరా చేస్తారు. ఇప్పటికే కొందరికి గ్యాస్ కనెక్షన్లు కూడా ఇచ్చామని, త్వరలో పూర్తిస్థాయి సరఫరా మొదలవుతుందని కంపెనీ తెలియజేసింది. వినియోగదారుల ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా కంపెనీ రూపొందించింది. -
కాశ్మీర్ వరదలు కలిపాయి!
సాధారణంగా వరదలు మనుషుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తాయి. కాని జలప్రళయం ఓ చిన్నారిని తనవారికి చేరువ చేసింది. కాశ్మీర్ వరదలు ఓ చిన్నారికి చెర నుంచి విముక్తి కల్పించాయి. ఓ మంచి వ్యక్తి సాయంతో సదరు బాలిక సొంతగూటికి చేరుకోగలిగింది. మేఘ అనే ఆరేళ్ల బాలిక ముంబైలోని బాంద్రా ప్రాంతం నుంచి ఏడాది క్రితం కిడ్నాపయింది. మేఘను ఎత్తుకుపోయిన దుండగుడు ఆమెను జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ తీసుకుపోయాడు. అక్కడ ఆమెతో బలవంతంగా భిక్షాటన చేయించాడు. సెప్టెంబర్ లో శ్రీనగర్ లో వరదలు సంభవించినప్పుడు చాలా మంది గల్లంతయ్యారు. వరదల్లో గల్లంతైన బాలిక అనుకుని మేఘను దాల్ గేట్ ప్రాంత వాసులు చేరదీశారు. ఇమామ్ ఆషిక్ ఇలాహి అనే వ్యక్తి ఆమె బాధ్యత తీసుకున్నాడు. మేఘను జహాన్ ఆరా అనే మహిళ ఇంట్లో ఉంచి పోలీసులకు సమాచారం అందించాడు. ఆమె ఫోటోలు ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశాడు. ఈ ప్రయత్నాలు ఫలించడంతో రెండు వారాల తర్వాత మేఘ తనవారిని చేరుకుంది. మేఘ గురించి తెలుసుకున్న ఆమె తాతయ్య రమేష్ మదన్ ఠాకూర్.. శ్రీనగర్ కు వచ్చారు. వివరాలు అన్ని నిర్ధారించుకున్న తర్వాత మేఘను ఆమె తాతయ్యకు పోలీసులు అప్పగించారు. నజీర్ అహ్మద్ అనే వ్యక్తి తనను ఎత్తుకొచ్చాడని మేఘ తెలిపింది. ముందుగా యూపీ, కోల్‌కతా తీసుకెళ్లాడని తర్వాత శ్రీనగర్ తీసుకొచ్చాడని వెల్లడించింది. భిక్షాటన చేయాలని ఒత్తిడి చేసేవాడని తెలిపింది. కాగా, మేఘ గురించి ఎవరూ రాకపోతే తమదగ్గరే ఉంచుకోవాలనుకున్నామని జహాన్ ఆరా తెలిపింది. తన నలుగురు పిల్లలతో ఆమె కలిసిపోయిందని వెల్లడించింది. మళ్లీ తనవారిని కలుసుకోవడంతో చిన్నారి మేఘ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.