హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ భాగస్వామ్యంలో తెలంగాణలో ఈ ఫెసిలిటీని స్థాపించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే ప్లాంటుకు కావాల్సిన స్థలం, ఇతర సౌకర్యాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంఈఐఎల్, బీవైడీ సంప్రదించనున్నాయి.
ప్రతిపాదిత ప్రణాళిక కార్యరూపం దాలిస్తే ప్లాంటు కోసం ఇరు సంస్థలు కలిసి సుమారు రూ.8,200 కోట్లు వెచ్చించనున్నాయి. మేఘా అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఇప్పటికే బీవైడీ సాంకేతిక భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ బస్‌లను తయారు చేస్తోంది. అలాగే తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్‌ల తయారీకై 150 ఎకరాల స్థలాన్ని ఒలెక్ట్రా కొనుగోలు చేసింది. (తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్)
అత్యాధునిక రీతిలో ఏటా 10,000 ఈ–బస్‌లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో ఇది రానుంది. ఎలక్ట్రిక్ టిప్పర్ల తయారీలోకి సైతం ఒలెక్ట్రా ఎంట్రీ ఇచ్చింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు, త్రిచక్ర, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలనూ పరిచయం చేయాలన్నది కంపెనీ ప్రణాళిక.
ఇది కూడా చదవండి: Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం
Comments
Please login to add a commentAdd a comment