ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు | BYD eMAX 7 Launched In India, Check Prices Details And Specifications Inside | Sakshi
Sakshi News home page

ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు

Published Wed, Oct 9 2024 3:27 AM | Last Updated on Wed, Oct 9 2024 10:47 AM

BYD eMAX 7 Launched Prices Start From Rs 26. 90 Lakh

భారత్‌కు బీవైడీ ఈ–మ్యాక్స్‌ 7 

ధర 26.9 లక్షల నుంచి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహన తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత మార్కెట్లో ఈ–మ్యాక్స్‌ 7 ఎలక్ట్రిక్‌ ఎంపీవీ ప్రవేశపెట్టింది. ధర రూ.26.9 లక్షల నుంచి ప్రారంభం. మూడు వరుసల సీటింగ్‌తో 2021లో ఎంట్రీ ఇచి్చన ఈ6కు ఆధునిక హంగులు జోడించి ఈ–మ్యాక్స్‌7కు రూపకల్పన చేశారు.  ఒకసారి చార్జింగ్‌తో ప్రీమియం వేరియంట్‌ 420 కిలోమీటర్లు, సుపీరియర్‌ వేరియంట్‌ 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్, 12.7 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, 12.8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్, వైర్‌లెస్‌ చార్జింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్‌ కంట్రోల్, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ వంటి హంగులు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement