
ప్రముఖ చైనీస్ న్యూ ఎనర్జీ వెహికల్ (NEV) తయారీదారు బీవైడీ (BYD) 1,000 కేడబ్ల్యు ఛార్జింగ్ సిస్టమ్‌ను కలిగి ఉన్న సూపర్ ఈ ప్లాట్‌ఫామ్ అనే కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త టెక్నాలజీ కేవలం ఐదు నిమిషాల్లోనే 470 కి.మీ.ల పరిధిని అందించడానికి కావలసిన ఛార్జ్ చేస్తుంది. అంటే ఫ్యూయెల్ కారుకు పెట్రోల్ నింపే అంత సమయంలో ఛార్జింగ్ అవుతుందన్నమాట.
కొత్త ఛార్జింగ్ సిస్టం 1000 వోల్ట్స్ వరకు ఛార్జింగ్ వోల్టేజ్.. 1000 యాంపియర్స్ వరకు కరెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 1000 కేడబ్ల్యు ఛార్జింగ్ శక్తిని అనుమతిస్తుంది. కంపెనీ ఈ కొత్త బ్యాటరీలకు 'ఫ్లాష్-ఛార్జ్ బ్యాటరీలు' అని పేరుపెట్టింది. వేగంగా ఛార్జింగ్ అయినప్పటికీ.. బ్యాటరీ వేడిగా అవ్వడం వంటివి ఉండదని కంపెనీ వెల్లడించింది.
ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి మోడళ్లు హాన్ ఎల్ సెడాన్, టాంగ్ ఎల్ ఎస్యూవీ అని తెలుస్తోంది. ఈ కొత్త టెక్నాలజీకి మద్దతుగా చైనా అంతటా 4,000 సూపర్‌ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించాలని బీవైడీ యోచిస్తోంది. కొత్త బ్యాటరీ టెక్నాలజీ.. ప్రత్యర్థులపైన గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment