Fast charger option
-
15 నిమిషాల ఛార్జ్‌తో 500 కిమీ ప్రయాణం.. ఈవీ సెక్టార్లో సంచలన ఆవిష్కరణ
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఛార్జింగ్ సమస్య ఓ పెనుభారంగా మారుతోంది. దీనిని పరిష్కరించడానికి చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'జీకర్' (Zeekr) సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ పరిచయం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓ పెను మార్పును తీసుకువచ్చే క్రమంలో కంపెనీ జెజియాంగ్ ప్రావిన్స్‌లోని గీలీ హోల్డింగ్ గ్రూప్‌కు చెందిన బ్యాటరీ ప్లాంట్‌లో వినూత్న టెక్నాలజీ ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేసుకుంటే ఏకంగా 500 కిమీ (300 మైల్స్) ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది. జీకర్ ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ వేసుకునే సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. చైనాలో జీకర్ ప్రత్యర్థి నియో( Nio) కూడా ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు CATL కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలలో పురోగతి సాధించింది. కంపెనీ Li Auto మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ మల్టీపర్పస్ వెహికిల్ MEGA కోసం ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలను పరిచయం చేసింది. ఇది కేవలం 12 నిమిషాల ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల (300 మైళ్ళు) డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇండియాలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ భారతదేశంలో లేదు, కానీ కొన్ని కంపెనీల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్‌లో మాత్రం సుమారు 20 నుంచి 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం లేదా 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవడం వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
ఐఫోన్ 15 సిరీస్‌లో మార్పులు.. అదే జరిగితే యాపిల్‌కు తిరుగుండదు!
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ విడుదలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. అయినా యాపిల్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఫీచర్లు, కలర్, డిజైన్ల గురించి ఊహాగానాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఐఫోన్ యూఎస్‌బీఐ టైప్-సి (USB Type-C) కేబుల్ వినియోగాన్ని హైలెట్ చేసేలా ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. యూరోపియన్ యూనియన్ చట్టాల ప్రకారం..ఐఫోన్ సిరీస్‌లోని ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లలో ఛార్జింగ్ టైప్-సి పోర్ట్ అమర్చాల్సి ఉంది. అయితే యాపిల్ సంస్థ ఐఫోన్ 15 మోడళ్లకు టైప్-సి పోర్ట్‌ను పరిమితం చేస్తూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఎంఎఫ్ఐ (ఐఫోన్ కోసమే ప్రత్యేకంగా) సర్టిఫైడ్ కేబుల్స్‌ను వినియోగంలో తేనున్నట్లు సమాచారం. టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సంస్థ అనలిస్ట్ Ming-Chi Kuo రిపోర్ట్ విడుదల చేశారు. ఆ నివేదికలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సర్టిఫైడ్ కేబుల్స్‌తో ఐఫోన్ 15 మోడల్స్ అన్నింటిలో యూఎస్బీ టైప్- సి పోర్ట్ ఉంటుందని సూచించారు. చదవండి👉 ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపరాఫర్!..మరీ ఇంత డిస్కౌంటా? అదే జరిగితే యాపిల్‌కు తిరుగుండదు ప్రస్తుతం ఐఫోన్ 14 మోడల్స్‌లో లైట్నింగ్ కనెక్టర్ (ఐఫోన్ ఛార్జర్) 20 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది. కానీ ఈ ఏడాది క్యూ1, క్యూ 2లలో యాపిల్ లైట్నింగ్ కనెక్టర్‌తో పాటు యూఎస్బీ-సీ ఛార్జర్‌తో 20 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకునేలా డిజైన్ చేయాలనే డిమాండ్లు పెరిగినట్లు తెలిపారు. ఒకవేళ అదే జరిగితే యూఎస్బీ టైప్- సీ సెగ్మెంట్లో యాపిల్ మరింత స్ట్రాంగ్ అవ్వొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. క్యూ 4 నాటికి యూఎస్బీ టైప్ -సీ షిప్మెంట్ 120 శాతం వృద్దితో 70 మిలియన్ల యూనిట్స్‌కు చేరుకోవచ్చని అన్నారు. ఛార్జర్ కొనాల్సిందే యాపిల్ బాక్స్‌లోని ఐఫోన్‌తో ఛార్జింగ్ అడాప్టర్‌ను బండిల్‌ను అందించదు. కాబట్టి, ఐఫోన్ 15 యూనిట్లలో రాబోయే ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి వినియోగదారులు యాపిల్-సర్టిఫైడ్ యూఎస్బీ టైప్-సి కేబుల్ లేదా అడాప్టర్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం, కంపెనీ 20డబ్ల్యూ యూఎస్బీ టైప్-సి అడాప్టర్, 30డబ్ల్యూ అడాప్టర్‌ను అందిస్తోంది. చదవండి👉 ‘హార్ట్ ఎటాక్’ను గుర్తించే యాపిల్ వాచ్ సిరీస్ 8పై భారీ డిస్కౌంట్లు! -
భారత మార్కెట్లలోకి ఆంకర్ టూ ఇన్ వన్ ఫాస్ట్ ఛార్జర్..!
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఆంకర్ భారత మార్కెట్లలోకి సరికొత్త ఫాస్ట్ ఛార్జర్‌ను లాంచ్ చేసింది. 35W పవర్‌ఐక్యూ 2.0 డ్యూయల్-పోర్ట్ USB-C వాల్ ఛార్జర్‌ను భారత మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫాస్ట్ ఛార్జర్ ఒకేసారి రెండు స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేయగలదు. దీని ధర రూ. 2,199.ఇక దీనిపై 18 నెలల వారంటీ వస్తుంది. ఈ పరికరాన్ని అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు. PowerIQ 2.0 అనేది హై-స్పీడ్ 35W మొబైల్ ఛార్జర్. ఇది 20W, 15W ఛార్జింగ్ టూ-ఇన్-వన్ ఫంక్షనాలిటీని అందిస్తుంది. 15W పోర్ట్ ఒకేసారి రెండు పరికరాలను ఛార్జ్ చేయగలదు. అంకర్ ఇన్నోవేషన్స్ 146 దేశాలలో 54 మిలియన్లకు పైగా ఉత్పత్తులను విక్రయిస్తోంది. Anker PowerIQ 2.0 ఛార్జర్ ఫీచర్లు స్మార్ట్ డివైజ్ డిటెక్షన్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ హీట్ డిస్సిపేషన్ వాల్ ఛార్జర్ USB-C ఛార్జింగ్ సపోర్ట్ చదవండి: అమెరికా సంచలన నిర్ణయం..! చైనాకు చావు దెబ్బే..? -
10నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్
సాధారణంగా ఒక స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఫోన్లో ఉండే బ్యాటరీ కెపాసిటీని బట్టి 1 నుంచి 2 గంటలు సమయం పడుతుంది. ఎప్పుడైతే ఫాస్ట్ ఛార్జర్స్ టెక్నాలజీ మార్కెట్ లోకి వచ్చిందో అప్పటి నుంచి ఛార్జింగ్ సమయం ఒక గంట లేదా అంతకన్నా తక్కువకు తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న 65వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను 40 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. అంతే కాకుండా, 125వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌తో 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 100 పర్సెంట్ ఛార్జ్ చేయొచ్చు. ఒప్పో కూడా 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సహాయంతో 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. కానీ, చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తయారీపై దృష్ట్టి సారించినట్లు సమాచారం. 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే స్మార్ట్‌ఫోన్‌ను 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. వైర్డ్, వైర్లెస్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో షియోమీ అందించే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే షియోమీ 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావొచ్చు. త్వరలో రాబోయే షియోమీ ఎంఐ 11 అల్ట్రాలో ఈ టెక్నాలజీ తీసుకోని రావచ్చు. -
అయిదు నిమిషాల్లోనే బ్యాటరీ చార్జింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఆటో మొబైల్ రంగంలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్’ హాట్ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న కంపెనీలు అధిక సామర్థ్యమున్న బ్యాటరీల తయారీపై ఫోకస్ చేశాయి. ఈవీ టెక్నాలజీలో ఉన్న సింగపూర్ సంస్థ షాడో గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన బెంగళూరుకు చెందిన అదరిన్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఓ అడుగు ముందుకేసి అల్ట్రా కెపాసిటర్ బ్యాటరీని అభివృద్ధి చేసింది. అయిదు నిమిషాల్లోనే చార్జింగ్ పూర్తి అవడం దీని ప్రత్యేకత. ఎరిక్ పేరుతో రూపొందించిన త్రిచక్ర వాహనానికై ఈ బ్యాటరీని తయారు చేశారు. బ్యాటరీని ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ ఈ టెక్నాలజీని ధ్రువీకరించింది. అంతేకాదు 10 ఏళ్లపాటు మన్నుతుందని స్పష్టం చేసిందని షాడో గ్రూప్ కో–సీఈవో సౌరభ్ మార్కండేయ సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధికి వెల్లడించారు. డీజిల్ వాహనంతో పోలిస్తే ఖర్చు 25–30 శాతం తగ్గుతుందని చెప్పారు. గంటకు 50 కిలోమీటర్ల వేగం.. ఎరిక్ బ్రాండ్‌లో ప్యాసింజర్ వేరియంట్‌తోపాటు కార్గో రకం కూడా రూపొందించారు. ప్యాసింజర్ వాహనం గంటకు 50 కిలోమీటర్లు, కార్గో మోడల్ 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కార్గోలో 550 కిలోల సరుకు రవాణా చేయవచ్చు. రెండు రకాల బ్యాటరీలను అందుబాటులోకి తెచ్చామని సౌరభ్ మార్కండేయ తెలిపారు. ‘అల్ట్రా కెపాసిటర్ బ్యాటరీ జీవిత కాలం 10 ఏళ్లు. ధర రూ.4 లక్షలు. లిథియం అయాన్ బ్యాటరీ జీవిత కాలం రెండున్నరేళ్లు. చార్జింగ్కు 8 గంటలు పడుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 80–100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ధర రూ. లక్ష ఉంది. అల్ట్రా కెపాసిటర్ అభివృద్ధికి రెండేళ్లు పట్టింది. ఈ మోడల్ వాహనాలు ఇండోనేషియాకు ఎగుమతి చేయనున్నాం. భారత్‌లో క్యాబ్ అగ్రిగేటర్లు, లాజిస్టిక్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. 2019 అక్టోబరు నుంచి మార్కెట్లో వాహనం అందుబాటులో ఉంటుంది’ అని చెప్పారు. పుణేలో ఉన్న ప్లాంటు కోసం షాడో గ్రూప్ రూ.70 కోట్లు వెచ్చిస్తోంది. సౌరభ్ మార్కండేయ -
రోడ్డుపై రాకెట్..!
ఈ బైక్‌ను చూస్తుంటే రయ్య్ ్రఅంటూ రోడ్డుపై దూసుకుపోవాలనిపిస్తోంది కదూ? దీని వేగం, ప్రత్యేకతలు చూస్తే బైక్ ప్రేమికులు మనసు పారేసుకోవడం ఖాయం. ఇటలీకి చెందిన ఎనర్జికా అనే సంస్థ రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బైక్ పేరు ‘ఇగో’. 11.7 కిలోవాట్ల బ్యాటరీ, వంద కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉండటం వల్ల ఇది రోడ్డుపై రాకెట్లా దూసుకుపోతుంది. క్లచ్, గేర్లు లేని ఈ బైక్ గరిష్ట వే గం గంటకు 240 కిలోమీటర్లు. సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం మూడు సెకన్ల కంటే తక్కువ సమయంలోనే అందుకుంటుంది. బ్యాటరీని పూర్తిస్థాయిలో చార్జింగ్ చేయడానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. మాకు అంత సమయం లేదు.. ఇంకా తొందరగా చార్జింగ్ అయిపోవాలనుకుంటే ఫాస్ట్ చార్జర్ ఆప్షన్‌ను ఉపయోగిస్తే అరగంటలో 80 శాతం చార్జింగ్ అయిపోతుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. ధర ఎంత ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? బ్యాటరీ తేడాలను బట్టి రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్య ఉంటుంది. అది కూడా వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి రానుంది.