భారత మార్కెట్లలోకి ఆంకర్‌ టూ ఇన్‌ వన్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌..! | Anker announces two port 35W USB-C Wall Charger | Sakshi
Sakshi News home page

భారత మార్కెట్లలోకి ఆంకర్‌ టూ ఇన్‌ వన్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌..!

Published Wed, Mar 30 2022 8:48 PM | Last Updated on Wed, Mar 30 2022 9:01 PM

Anker announces two port 35W USB-C Wall Charger - Sakshi

అమెరికాకు చెందిన మల్టీనేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఆంకర్‌ భారత మార్కెట్లలోకి  సరికొత్త ఫాస్ట్‌ ఛార్జర్‌ను లాంచ్‌ చేసింది. 35W పవర్‌ఐక్యూ 2.0 డ్యూయల్-పోర్ట్ USB-C వాల్ ఛార్జర్‌ను భారత మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫాస్ట్‌ ఛార్జర్‌ ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లను ఛార్జ్‌ చేయగలదు.  దీని ధర రూ. 2,199.ఇక దీనిపై 18 నెలల వారంటీ వస్తుంది. ఈ పరికరాన్ని అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు. 

PowerIQ 2.0 అనేది హై-స్పీడ్ 35W మొబైల్ ఛార్జర్.  ఇది 20W, 15W ఛార్జింగ్ టూ-ఇన్-వన్ ఫంక్షనాలిటీని అందిస్తుంది. 15W పోర్ట్ ఒకేసారి రెండు పరికరాలను ఛార్జ్ చేయగలదు. అంకర్ ఇన్నోవేషన్స్ 146 దేశాలలో 54 మిలియన్లకు పైగా ఉత్పత్తులను విక్రయిస్తోంది. 

Anker PowerIQ 2.0  ఛార్జర్‌ ఫీచర్లు

  • స్మార్ట్ డివైజ్ డిటెక్షన్
  • ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్‌
  • హీట్ డిస్సిపేషన్ 
  • వాల్ ఛార్జర్ USB-C ఛార్జింగ్ సపోర్ట్‌

చదవండి: అమెరికా సంచలన నిర్ణయం..! చైనాకు చావు దెబ్బే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement