
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ టీ20-2025 టోర్నీలో ఇండియన్ మాస్టర్స్ టీమ్ మరో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాయ్‌పూర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో సౌరబ్ తివారీ(37 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్‌లతో 60), అంబటి రాయుడు(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో మెరవగా.. ఆఖరిలో కెప్టెన్ యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టించాడు.
విండీస్ బౌలర్లను యువీ ఉతికారేశాడు. కేవలం 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసి ఆజేయగా నిలిచాడు. వీరితో పాటు గుర్‌క్రీత్ సింగ్ మానన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో బెన, కార్టర్, టేలర్ తలా వికెట్ సాధించారు.
అనంతరం భారీ లక్ష్య చేధనలో విండీస్ ఆఖరి వరకు పోరాడింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డ్వైన్ స్మిత్(34 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 79), విలియమ్ పెర్కిన్స్(52) హాఫ్ సెంచరీలు సాధించాడు.
లెండల్ సిమిన్స్( 13 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్‌లతో 38) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో వెస్టిండీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. పవన్ నేగి రెండు, ఇర్ఫాన్ పఠాన్ ఒక్క వికెట్ సాధించారు.
చదవండి: Champions Trophy final: 'అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే'
Comments
Please login to add a commentAdd a comment