
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభం నుంచే రాజస్తాన్ రాయల్స్‌కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే అందుబాటులో ఉన్నాడు. ఆ తర్వాత సంజూ సారథిగా పునరాగమం చేసినా రాయల్స్ రాతలో పెద్దగా మార్పులేదు.
వరుస ఓటములు
ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం రెండు మాత్రమే గెలిచి.. నాలుగు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. కాగా సంజూ స్థానంలో టీమిండియా యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ (Riyan parag)రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అతడి సారథ్యంలో సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన పింక్ జట్టు.. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనూ పరాజయం పాలైంది.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. అయితే, జట్టులో అనుభవజ్ఞుడైన నితీశ్ రాణాను కాదని.. యువ ఆటగాడైన రియాన్ పరాగ్‌కు పగ్గాలు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై నితీశ్ రాణా తాజాగా పెదవి విప్పాడు.

‘‘నేను గతంలో కేకేఆర్ కెప్టెన్‌గా పనిచేశాను. అప్పటికి నేను ఆ జట్టుతో 6-7 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నా. కాబట్టి ఫ్రాంఛైజీ వాతావరణం, సంస్కృతి ఎలా ఉంటుందో నాకు పూర్తి అవగాహన ఉంది.
కెప్టెన్‌గా నేను కాదు!.. అతడే సరైనోడు..
కానీ.. రాజస్తాన్ రాయల్స్‌లోకి కొత్తగా వచ్చాను. రియాన్ మాత్రం చాలా కాలంగా ఈ జట్టుతోనే ఉన్నాడు. కాబట్టి అతడికి ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంటుంది. అందుకే మేనేజ్‌మెంట్ నన్ను కాదని.. రియాన్‌ను కెప్టెన్‌గా చేసి తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ సరైందే’’ అని నితీశ్ రాణా పేర్కొన్నాడు.
అదే విధంగా.. ‘‘ఒకవేళ యాజమాన్యం నన్ను తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించమని అడిగితే తప్పకుండా అంగీకరించేవాడిని. అయితే, అంతిమంగా మా అందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యం. అందుకే వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను’’ అని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌కు ముందు అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
రూ. 4.20 కోట్లకు
కాగా ఐపీఎల్-2023లో శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో నితీశ్ రాణా కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో కేకేఆర్ పద్నాలుగింట ఆరు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచి.. ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. ఇక ఐపీఎల్-2024లో అయ్యర్ రాకతో రాణా ఆటగాడిగానే కొనసాగగా.. మెగా వేలానికి ముందు కేకేఆర్ అతడిని విడిచిపెట్టింది.
ఈ క్రమంలో రూ. 4.20 కోట్లకు రాజస్తాన్ నితీశ్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 117 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 113 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 2753 రన్స్ చేశాడు.
చదవండి: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’