Riyan Parag
-
IND VS SA T20 Series: శివమ్ దూబే, రియాన్ పరాగ్‌కు ఏమైంది..?
సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును నిన్న (అక్టోబర్ 25) ఎంపిక చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ జట్టు ఎంపిక జరిగినప్పటికీ.. ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన సిరీస్‌లలో జట్టుతో పాటు ఉన్న శివమ్ దూబే, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక కాలేదు. వీరిని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.మయాంక్ యాదవ్, శివమ్ దూబే గాయాల బారిన పడటంతో వారిని పరిగణలోకి తీసుకోలేదని చెప్పిన బీసీసీఐ.. రియాన్ పరాగ్ భుజం సమస్య కారణంగా సెలెక్షన్‌కు అందుబాటులో లేడని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రియాన్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయని అంశాన్ని పక్కన పెడితే.. జట్టులో రెండు అనూహ్య ఎంపికలు జరిగాయి.బౌలింగ్ ఆల్‌రౌండర్ రమన్‌దీప్ సింగ్, పేస్ బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్ ఊహించని విధంగా జట్టులోకి వచ్చారు. వీరిద్దరికి చోటు దక్కుతుందని ఎవరు ఊహించలేదు. ఇవి మినహా మిగతా జట్టు ఎంపిక అంతా ఊహించిన విధంగానే జరిగింది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనుండగా.. వికెట్కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్‌తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కూడా భారత జట్టును నిన్ననే ప్రకటించారు.దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్సౌతాఫ్రికాతో టీ20 సిరీస్..తొలి మ్యాచ్- నవంబర్ 8 (డర్బన్)రెండో మ్యాచ్- నవంబర్10 (గ్వెకెర్బా)మూడో మ్యాచ్- నవంబర్ 13 (సెంచూరియన్)నాలుగో మ్యాచ్- నవంబర్ 15 (జోహనెస్బర్గ్)చదవండి: ఆ్రస్టేలియా పర్యటనకు నితీశ్ కుమార్ రెడ్డి -
రియాన్ పరాగ్ ఓవరాక్షన్.. షాకిచ్చిన అంపైర్(వీడియో)
ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ వింత బౌలింగ్ యాక్షన్‌తో అందరిని ఆశ్యర్యపరిచాడు. కొత్త బౌలింగ్ యాక్షన్‌ను ప్రయత్నించి నవ్వుల పాలయ్యాడు.అసలేం జరిగిందంటే?బంగ్లా ఇన్నింగ్స్ 11వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పార్ట్ టైమ్ స్పిన్నర్ రియాన్ పరాగ్ చేతికి బంతి అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రియాన్ వేసిన మొదటి బంతినే బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లా భారీ సిక్సర్‌గా మలిచాడు.తద్వారా పరాగ్ కాస్త నిరాశచెందాడు. ఈ క్రమంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించి బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. దీంతో లసిత్ మలింగ స్టైల్లో బౌలింగ్ చేయాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని రియాన్.. మహ్మదుల్లాకు స్లింగ్లింగ్ డెలివరీగా సంధించాడు. అతడి బౌలింగ్ యాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడి బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం వచ్చిన ఫీల్డ్ అంపైర్ మధన్ గోపాల్ థర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు. రిప్లేలో బ్యాక్‌ఫుట్ నో బాల్‌గా తేలింది. డెలివరీ సంధించే క్రమంలో పరాగ్ బ్యాక్ ఫుట్ ట్రామ్‌లైన్ వెలుపల ఉంది. అందుకునే థర్డ్ అంపైర్ బ్యాక్‌ఫుట్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో మహ్మదుల్లాకు ఫ్రీ హిట్ లభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. What was that Riyan Parag ? 🤣🤣#INDvsBAN pic.twitter.com/JAOTn2mLZM— sajid (@NaxirSajid32823) October 9, 2024 -
రాణించిన రియాన్ పరాగ్
సాక్షి, అనంతపురం: యువ ఆటగాడు రియాన్ పరాగ్ (101 బంతుల్లో 73; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో భారత్ ‘సి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ చివరి రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (53; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కుమార్ కుషాగ్ర (40 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కెపె్టన్ మయాంక్ అగర్వాల్ (34) సత్తాచాటారు. భారత్ ‘సి’ బౌలర్లలో అన్షుల్ కంబోజ్, గౌరవ్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 216/7తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘సి’ జట్టు చివరకు 234 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ పొరెల్ (82), పులకిత్ నారంగ్ (41) ఆకట్టుకున్నారు. భారత్ ‘ఎ’ బౌలర్లలో అవేశ్ ఖాన్, అఖీబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 4 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ఓవరాల్‌గా 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. కుమార్ కుషాగ్రతో పాటు తనుశ్ కోటియాన్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 297; భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: 234; భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) గౌరవ్ యాదవ్ 11; మయాంగ్ అగర్వాల్ (బి) అన్షుల్ కంబోజ్ 34; తిలక్ వర్మ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) అన్షుల్ కంబోజ్ 19; రియాన్ పరాగ్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) గౌరవ్ యాదవ్ 73; శాశ్వత్ రావత్ (బి) మానవ్ సుతార్ 53; కుమార్ కుషాగ్ర (నాటౌట్) 40; షమ్స్ ములానీ (సి) అన్షుల్ కంబోజ్ (బి) మానవ్ సుతార్ 8; తనుశ్ కోటియాన్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం (64 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 270. వికెట్ల పతనం: 1–35, 2–73, 3–94, 4–199, 5–209, 6–234, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 16–3–52–2; గౌరవ్ యాదవ్ 14–0– 60–2; విజయ్‌కుమార్ వైశాఖ్ 6–0–36–0; పులకిత్ నారంగ్ 8–1–30–0; మానవ్ సుతార్ 20–0–75–2. -
టీమిండియా ప్లేయర్లు విఫలం.. 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇండియా-సి
దులీప్ ట్రోఫీ 2024లో ఇవాళ (సెప్టెంబర్ 19) మూడో రౌండ్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఇండియా-డి, ఇండియా-బి తలపడుతుండగా.. రెండో మ్యాచ్‌లో ఇండియా-ఏ, ఇండియా-సి జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు అనంతపురం ఆర్డీటీ స్టేడియమ్స్‌లో జరుగుతున్నాయి.టీమిండియా ప్లేయర్లు విఫలంఇండియా-సితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా ప్లేయర్లు మయాంక్ అగర్వాల్ (6), తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో ఆ జట్టు 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం సమయానికి ఇండియా-ఏ స్కోర్ 67/5గా ఉంది. షాశ్వత్ రావత్ (20), షమ్స్ ములానీ (19) ఇండియా-ఏని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్, అన్షుల్ కంబోజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అర్ద సెంచరీల దిశగా పడిక్కల్, శ్రీకర్ భరత్ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్ (44), శ్రీకర్ భరత్ (46) అర్ద సెంచరీల దిశగా సాగుతున్నారు.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇండియా-సి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇండియా-బి ఏడు, ఇండియా-ఏ ఆరు పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఇండియా-డి సున్నా పాయింట్లతో చిట్టచివరి స్థానంలో ఉంది. చదవండి: ఆండ్రీ రసెల్ విధ్వంసం.. నైట్ రైడర్స్ ఖాతాలో మరో విజయం -
నువ్విక మారవా?.. ఇలా అయితే టెస్టుల్లో చోటు కష్టమే!
టీమిండియా యువ బ్యాటర్ రియాన్ పరాగ్ దులిప్ ట్రోఫీ-2024లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇన్నింగ్స్‌ను మెరుగ్గా ఆరంభిస్తున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. నిర్లక్ష్య ఆట తీరుతో వికెట్ పారేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా అసోంకు చెందిన ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్.. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.తొలి మ్యాచ్‌లో ఇలాతాజా ఎడిషన్‌లో భాగంగా ఇండియా-‘ఎ’ తొలుత బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో మ్యాచ్ ఆడింది. ఇందులో రియాన్ చేసిన స్కోర్లు 30, 31. ఇక ప్రస్తుతం అనంతపురంలో ఇండియా-‘ఎ’ తమ రెండో మ్యాచ్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇండియా-‘డి’ జట్టుతో తలపడుతోంది. మ్యాచ్‌లో జట్టు పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ.. విశ్లేషకులు మాత్రం రియాన్ పరాగ్ ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు.వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడుతొలి ఇన్నింగ్స్‌లో 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసిన రియాన్.. మంచి జోష్‌లో కనిపించాడు. అయితే, కాస్త ఆచితూచి ఆడాల్సిన చోట వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పాత కథే పునరావృతం చేశాడు.ఇండియా-‘ఎ’ శతక ధీరుడు, ఓపెనర్ ప్రథమ్ సింగ్(122) అవుట్‌కాగా.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు రియాన్ పరాగ్. తిలక్ వర్మ(111 నాటౌట్)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల మాదిరే దూకుడుగా ఆడి మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. Century for Pratham Singh 💯6⃣, 4⃣, 4⃣What a way to get your maiden Duleep Trophy hundred 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/EmmpwDJX1Q— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024భారీ స్కోర్లుగా మలచలేకపోయాడుఇండియా-‘డి’ స్పిన్నర్ సౌరభ్ కుమార్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాది.. అతడి చేతికే చిక్కి పెవిలియన్ చేరాడు. 31 బంతుల్లో 20 పరుగుల వద్ద ఉండగా.. అనవసరపు షాట్‌కు పోయి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఆదిత్య థాకరేకు సులువైన క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే రియాన్ పనికివస్తాడు. సంప్రదాయ క్రికెట్లోనూ ప్రతీ బంతికి దూకుడు ప్రదర్శిస్తానంటే కుదరదు. నిజానికి.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు తనను తాను నిరూపించుకునేందుకు రియాన్‌కు మంచి అవకాశం వచ్చింది. ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.టెస్టు జట్టులో చోటు దక్కాలంటే కాస్త ఓపిక కూడా ఉండాలి’’ అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా-‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇండియా-‘డి’కి 426 పరుగుల భారీ లక్ష్యం విధించింది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'20(31) Riyan parag gifted his wicket after settled#riya #parag #riyanparang #DuleepTrophy2024 #cricket #IPL2025 #ipl #test pic.twitter.com/lMGSUBQZna— mzk (@Zuhaib006) September 14, 2024 -
రాణించిన రియాన్ పరాగ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక
కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా శ్రీలంక నామమాత్రపు స్కోర్‌కే (248/7) పరిమితమైంది. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రియాన్ పరాగ్ బంతితో రాణించాడు. రియాన్ 9 ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబే నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.తృటిలో సెంచరీ చేజార్చుకున్న అవిష్కటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అవిష్క నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.రాణించిన కుసాల్ మెండిస్అవిష్క ఫెర్నాండో ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కుసాల్ మెండిస్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కుసాల్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆఖర్లో కమిందు మెండిస్ (23 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సధీర సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. -
శ్రీలంకతో రెండో వన్డే.. భారత తుది జట్టు ఇదే! పరాగ్ అరంగేట్రం?
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే టై అయిన సంగతి తెలిసిందే. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను భారత్ టైగా ముగించింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన నేపథ్యంలో భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ టై అయింది. అయితే తొలి వన్డేలో చేసిన చిన్న చిన్న తప్పిదాలను రెండో వన్డేలో పునరావృతం చేయకూడదని భారత జట్టు యోచిస్తోంది. ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న రెండో వన్డేలో మాత్రం ఎలాగైనా గెలిచి సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓ కీలక మార్పుతో బరిలోకి దిగనున్నట్లుట్లు తెలుస్తోంది. కొలంబో వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు ఛాన్స్ ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్ధానంలో పరాగ్ తుది జట్టులో వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రిషబ్ పంత్‌కు మరోసారి నో ఛాన్స్..?ఇక ఈ మ్యాచ్‌కు కూడా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వన్డేల్లో పంత్ కంటే కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉండడంతో అతడి వైపే జట్టు మెనెజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు వినికిడి.వన్డేల్లో రాహుల్‌కు 50పైగా సగటు ఉంది. అయితే దాదాపు 8 నెలల తర్వాత భారత జట్టులోకి రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో రాహుల్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. టైగా ముగిసిన మ్యాచ్‌లో రాహుల్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
IND vs SL 3rd T20: తడబడిన భారత బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమిత మైంది. లంక బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ థీక్షణ మూడు వికెట్లతో సత్తాచాటగా.. హసరంగా రెండు, విక్రమసింఘే, ఆసితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.భారత బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(39) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రియాన్ పరాగ్(26), వాషింగ్టన్ సుందర్(25) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఇక ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
'సంజూకు కాదు.. ఆ కుర్రాడికే టీమిండియాలో ఛాన్స్‌లు ఎక్కువ'
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో బెంచ్‌కే పరిమితమైన శాంసన్‌కు.. రెండో టీ20లో ఆడే ఛాన్స్ లభించింది. గిల్ స్ధానంలో ఓపెనర్‌గా వచ్చిన శాంసన్.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.ఈ క్రమంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో శాంసన్ కంటే యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కే ఎక్కువ అవకాశాలు దక్కుతాయని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా లంకతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ రియాన్ భారత జట్టులో భాగమయ్యాడు. మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమై పరాగ్.. బౌలింగ్‌లో మాత్రం 3 వికెట్లతో సత్తాచాటాడు. రెండో మ్యాచ్‌లోనూ తన 4 ఓవర్ల బౌలింగ్ కోటాను ఈ అస్సాం ఆల్‌రౌండర్ పూర్తి చేశాడు."భారత జట్టులో రియాన్ పరాగ్‌కు ఎక్కువగా అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఎవరికి బౌలింగ్ చేసే సామర్థ్యం లేదు. అదే అతడికి బాగా కలిసిస్తోందని" ఎక్స్‌లో పఠాన్ రాసుకొచ్చాడు. ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పరాగ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పరాగ్‌ను ఎక్స్ ఫ్యాక్టర్ అని కొనియాడాడు. -
అతడెందుకు దండగ అన్నారు.. కట్‌చేస్తే! గంభీర్ ప్లాన్ సూపర్ సక్సెస్
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లెయింగ్ ఎలెవన్‌లో ఎంపిక చూసి మొదట అందరూ షాక్‌కు గురయ్యారు. అందుకు కారణం.. జింబాబ్వే సిరీస్‌లో దారుణంగా విఫలమైన రియాన్ పరాగ్‌కు ఈ మ్యాచ్ తుది జట్టులో చోటివ్వడమే.ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లను పక్కన పెట్టి మరి పరాగ్‌కు ఛాన్స్ ఇచ్చిన జట్టు మెనెజ్‌మెంట్ చాలా మంది అగ్రహం వ్యక్తం చేశారు. కానీ పరాగ్‌కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వడం వెనక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాస్టర్ మైండ్ దాగి ఉందని మ్యాచ్ ఆఖరిలో అందరికి ఆర్దమైంది.ఈ మ్యాచ్‌లో రియాన్‌ను పార్ట్‌టైమ్ బౌలర్‌గా ఉపయోగించాలని గంభీర్ ముందే నిర్ణయించుకున్నాడంట. అందుకే పరాగ్‌కే తొలి ప్రాధన్యతను గౌతీ ఇచ్చాడు. అయితే గౌతీ ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందే అనే చెప్పుకోవాలి. బ్యాటింగ్‌లో విఫలమైన రియాన్ పరాగ్.. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. వికెట్ కాస్త స్పిన్‌కు అనుకూలించడంతో లంక ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు పరాగ్‌ను కెప్టెన్ సూర్యకుమార్ తీసుకువచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని పరాగ్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్లో కీలకమైన వికెట్‌ను భారత్‌కు అందించాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 1.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఈ అస్సాం ఆల్‌రౌండర్.. 5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దీంతో గంభీర్ మాస్టర్ మైండ్ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కదా గౌతీ మార్క్ అంటే పోస్ట్‌లు పెడుతున్నారు. Riyan Parag can Bowl Off Spin + Leg Spin just like Great Sachin Tendulkar used to Bowl 👏🏻That's a Great News for Team India 🇮🇳 #INDvSL #RiyanParagpic.twitter.com/P0VjcDKEkf— Richard Kettleborough (@RichKettle07) July 28, 2024 -
రింకూ కాదు!.. టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ అతడే: సూర్య
శ్రీలంకతో సిరీస్ సందర్భంగా టీమిండియా టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. పొట్టి ఫార్మాట్లో భారత్‌ను నంబర్ వన్‌గా నిలపడంతో పాటు టీ20 ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మ వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కొత్త కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో జూలై 27న రెగ్యులర్ కెప్టెన్ హోదాలో తన తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. జట్టులో అతడే కీలకంఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ టీమిండియా యువ క్రికెటర్‌పై ప్రశంసలు కురిపించాడు. జట్టులో అతడే కీలకం(ఎక్స్ ఫ్యాక్టర్) కాబోతున్నాడంటూ సదరు ఆటగాడి నైపుణ్యాలను కొనియాడాడు. సూర్య ప్రశంసించిన క్రికెటర్ మరెవరో కాదు అసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకుంటున్న ఈ రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు ఇటీవలే టీమిండియాలో అరంగేట్రం చేశాడు.జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సందర్భంగా శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని జట్టుకు ఎంపికైన రియాన్ పరాగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టూర్లో మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం 25 పరుగులే చేశాడు. అయినప్పటికీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు. అతడే ఎందుకంటూ విమర్శలుఅంతేకాదు వన్డే జట్టులోనూ తొలిసారిగా చోటిచ్చారు. జింబాబ్వే సిరీస్‌లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ, అద్భుతంగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్ వంటి వాళ్లను పక్కనపెట్టి రియాన్‌ను సెలక్ట్ చేయడం విమర్శలకు దారితీసింది. అయితే, ఆల్‌రౌండర్ ప్రతిభ కారణంగానే అతడికి జట్టులో చోటు దక్కాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పూర్తిగా మారిపోయాడుఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రియాన్ పరాగ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘అన్ని రకాల క్రీడల్లో ట్రోలింగ్ అనేది కామన్. అయితే, దానిని మనం ఎలా అధిగమిస్తామన్నదే ముఖ్యం. రియాన్ పరాగ్ ప్రతిభావంతుడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నపుడే.. ఏ జట్టులోనైనా అతడొక ఎక్స్ ఫ్యాక్టర్ అవగలడని అంచనా వేశాను. ఇప్పుడు తను పూర్తిగా మారిపోయాడు. విమర్శల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు. గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు అతడు మా జట్టుతో ఉండటం సంతోషం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. కాగా రియాన్ పరాగ్ విఫలమైనప్పుడల్లా అతడిపై నెట్టింట తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక లంకతో మొదటి టీ20లో మాత్రం రియన్కు తుదిజట్టులో చోటు దక్కే ఛాన్స్ లేదు! -
చేసింది 25 పరుగులే.. అయినా టీమిండియాలో ఛాన్స్! అస్సలు కారణమిదే?
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు టీమిండియా సిద్దమైంది. లంక పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. జూలై 27 జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో భారత కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ల ప్రస్ధానం మొదలు కానుంది. ఇప్పటికే ఆతిథ్య దేశానికి చేరుకున్న భారత జట్టు గంభీర్ నేతృత్వంలో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే శ్రీలంకతో టీ20, వన్డేలకు భారత జట్టులో యువ ఆటగాడు రియాన్ పరాగ్‌కు చోటు దక్కడం అందరిని ఆశ్యర్యపరిచింది.జింబాబ్వే టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిన పరాగ్.. తన మార్క్‌ను చూపించలేకపోయాడు. దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటకి సెలక్టర్లు ఏ ప్రాతిపాదికన అతడిని లంక టూర్‌కు ఎంపిక చేశారని పెద్ద ఎత్తున ఇప్పటికి చర్చనడుస్తోంది. కాగా తాజాగా ఇదే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌లకు తొలుత హైదరాబాదీ తిలక్ వర్మను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారట. కానీ తిలక్ వర్మ గాయపడటంతో పరాగ్‌ను అతడి స్ధానంలో పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం."పరాగ్ చాలా టాలెంటడ్. అతడికి అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆఫ్ ది ఫీల్డ్, ఆన్ ది ఫీల్డ్ తన వైఖరిని కూడా మార్చుకున్నాడు. చాలా విషయాల్లో అతడు మెరుగయ్యాడు. ఇప్పడు అతడి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. క్రీజులో నిలదొక్కకునే ప్రయత్నం చేస్తున్నాడు. పరాగ్ అద్భుతమైన ఫీల్డర్ కూడా. అయితే సెలక్టర్ల దృష్టిలో పరాగ్ కంటే ముందు తిలక్ వర్మ ఉండేవాడు. కానీ అతడి గాయపడటం రియాన్‌కు మార్గం సుగమమైందని" బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో వెల్లడించాయి. కాగా జింబాబ్వే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన పరాగ్ కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్. సిరాజ్.భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్‌ప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
రియాన్ పరాగ్ బెస్ట్ ఎమోషనల్ మూమెంట్
-
జింబాబ్వేతో తొలి టీ20.. ముగ్గురు మొనగాళ్ల అరంగేట్రం
భారత తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ కల ఎట్టకేలకు నేరవేరింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20తో వీరిద్దరూ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అదే విధంగా ఇప్పటికే టెస్టు క్రికెట్లో భారత తరపున డెబ్యూ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రవ్ జురెల్.. ఇప్పుడు ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. వీరిముగ్గురూ భారత తత్కాలిక హెడ్ కోచ్ వీవీయస్ లక్ష్మణ్, సపోర్ట్ స్టాప్ చేతుల మీదగా డెబ్యూ క్యాప్‌ను అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విధ్వంసం సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. మరోవైపు పరాగ్ కూడా తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పరాగ్ నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు.ఇక జురెల్ విషయానికి వస్తే.. ఇప్పటికే టెస్టుల్లో తన ఏంటో నిరూపించుకున్న ఈ రాజస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్, ఇప్పుడు టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. టీ20ల్లో ఫినిషర్‌గా జురెల్‌కు మంచి రికార్డు ఉంది. -
జింబాబ్వేతో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే? విధ్వంసకర వీరుల ఎంట్రీ
విశ్వవిజేతలగా నిలిచిన అనంతరం భారత జట్టు తొలి టీ20 సిరీస్‌కు సిద్దమైంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సాయిసుదర్శన్, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రానాలకు తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. జూలై 6న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈమ్యాచ్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే హరారేకు చేరుకుంది. తొలి పోరు కోసం తీవ్రంగా యంగ్ టీమిండియా శ్రమించింది. ఈ క్రమంలో తొలి టీ20లో ఆడే భారత తుది జట్టుపై ఓ లూక్కేద్దం.అభిషేక్, పరాగ్ ఎంట్రీ..ఈ మ్యాచ్‌తో ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశముంది. అతడు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా ఫస్ట్‌డౌన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను బ్యాటింగ్ దింపే ఆలోచనలో జట్టు మెనెజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అభిషేక్‌తో పాటు రియాన్ పరాగ్ కూడా డెబ్యూ చేయనున్నట్లు సమాచారం. అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌కు చోటు దక్కే అవకాశముంది. ఫినిషర్‌గా రింకూ సింగ్ ఎలాగో ఉంటాడు.ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బౌలర్లగా రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ల స్ధానాలు దాదాపు ఖాయమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.భారత తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్,రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ -
నా కల నెరవేరింది.. పాస్ పోర్ట్, ఫోన్ కూడా మర్చిపోయా: పరాగ్
టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత తొలి విదేశీ పర్యటనకు టీమిండియా సిద్దమైంది. జూలై 6 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భారత జట్టు తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లను విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. యువ భారత జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్-2024లో అదరగొట్టిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రానాలకు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని యంగ్ ఇండియా టీమ్ జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది.పాస్ పోర్ట్ కూడా మర్చిపోయా?ఇక తొలిసారి భారత జట్టు నుంచి పిలుపురావడంపై రాజస్తాన్ రాయల్స్ యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ స్పందించాడు. "భారత జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నాను. ఇండియన్స్ జెర్సీ వేసుకోవడం వేరే ఫీల్. ఆ భావనను మాటల్లో వర్ణించలేను. అస్సా నుంచి వచ్చిన నేను భారత్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్నాను. నా కలను ఎన్నాళ్లకు నెరవేర్చుకోగలిగాను. ఈ ఉత్సాహంలో పాస్‌పోర్టు, నా ఫోన్లు మరిచిపోయా. వాటిని పోగొట్టుకోలేదు కానీ ఎక్కడ పెట్టానో గుర్తుకు రాలేదు. అయితే సరైన సమయంలో నాకు మళ్లీ దొరికాయి. చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రయాణం చేయాలని కలలు కన్నా.ఇప్పటికే నేను చాలా మ్యాచ్‌లు విదేశాల్లో ఆడాను. కానీ భారత్ జెర్సీ ధరించి ప్రయాణించడం వేరు. జింబాబ్వేతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని బీసీసీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాగ్ పేర్కొన్నాడు. -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే! ఐపీఎల్ హీరోలకు చోటు
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అజిత్ అగార్క్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించింది.ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ టూర్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.అదే విధంగా ఈ సిరీస్‌కు భారత జట్టులో ఐపీఎల్లో హీరోలకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్, సీఎస్కే పేసర్ తుషార్ దేశ్ పాండేలకు సెలక్టర్లు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు.నితీష్ కుమార్ ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన నితీష్ కుమార్ రెడ్డి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఈ ఆంధ్ర ఆటగాడు ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ 33.67 సగటుతో 303 పరుగులతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అద్బుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.అభిషేక్ శర్మఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ సైతం సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్‌తో కలిసి భీబత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్‌లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్లో సైతం అదరగొడుతున్నాడు.రియాన్ పరాగ్..ఇక ఆస్సాం స్టార్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ సైతం ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. ఓవరాక్షన్ స్టార్ అని అందరితో విమర్శలు ఎదుర్కొన్న పరాగ్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న పరాగ్ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అతడికి టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌కు సీనియర్లు దూరం కావడంతో సెలక్టర్లు పరాగ్‌కు అవకాశమిచ్చారు. తుషార్ దేశ్‌పాండే..ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే కూడా తన బౌలింగ్‌తో అందరని ఆకట్టుకున్నాడు. గత రెండు సీజన్ల నుంచి దేశ్‌పాండే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు.ఐపీఎల్-2024లో 13 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 17 వికెట్లు పడగొట్టాడు. కేవలం ఐపీఎల్లో మాత్రం దేశీవాళీ క్రికెట్లో కూడా ముంబై తరపున దేశ్‌పాండే రాణిస్తున్నాడు. -
శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఐపీఎల్ హీరోలు
ఐపీఎల్ 2024 విన్నింగ్ కెప్టెన్ (కేకేఆర్) శ్రేయస్ అయ్యర్ జులై, ఆగస్ట్ నెలల్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. వివిధ కారణాల చేత టీ20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాని శ్రేయస్.. లంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం.మరోవైపు ఐపీఎల్ 2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ దయాల్ జులై 6 నుంచి జింబాబ్వేతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపికయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరందరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.వీరితో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఎంపికైన శుభ్‌మన్ గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికవుతారని తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనకు హార్దిక్ పాండ్యా కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవుతారని ప్రచారం జరుగుతుంది. జింబాబ్వే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతినిస్తారని సమాచారం. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉంది. మెగా టోర్నీలో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. -
ఇలా అయితే.. టీమిండియాలో ఛాన్స్ రానేరాదు!
సూటిగా.. సుత్తి లేకుండా మాట్లాడటం తనకు అలవాటు అంటున్నాడు రాజస్తాన్ రాయల్స్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్. టీ20 ప్రపంచకప్-2024కు ఎంపిక చేసిన జట్టులో తనకు స్థానం లేదని.. కాబట్టి మ్యాచ్‌లు చూసి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నాడు.కాగా అసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నాడు. క్యాష్‌రిచ్ లీగ్ కెరీర్ ఆరంభంలో సరిగ్గా ఆడకపోయినా మేనేజ్మెంట్ అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలయ్యాడు.ఈ క్రమంలో ఒకానొక సమయంలో జట్టులో స్థానం కోల్పోయిన రియాన్ పరాగ్.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు. అదే జోరును ఐపీఎల్-2024లోనూ కొనసాగించి.. విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో 14 ఇన్నింగ్స్ ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. ఏకంగా 573 పరుగులతో దుమ్ములేపాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానంలో నిలిచాడు.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 ద్వారా రియాన్ పరాగ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు పరగణనలోకి తీసుకోలేదు. అనుభవం లేని రియాన్ పరాగ్‌ను కనీసం స్టాండ్‌బై ప్లేయర్‌గా కూడా ఎంపిక చేయలేదు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ స్పందిస్తూ.. ఏదో ఒక రోజు సెలక్టర్లు తనను టీమిండియాకు ఎంపిక చేయక తప్పదని.. ఇది తాను అహంభావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానంటూ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈసారి వరల్డ్‌కప్ టోర్నీని చూడాలనే ఆసక్తి తనకు ఏమాత్రం లేదంటూ కుండబద్దలు కొట్టాడు.టీమిండియాకు మద్దతుగా నిలిచే ‘భారత్ ఆర్మీ’తో రియాన్ మాట్లాడుతున్న క్రమంలో.. ఈసారి వరల్డ్‌కప్ సెమీ ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంటే పక్షపాత ధోరణితో మాట్లాడినట్లే అవుతుంది.నిజానికి నేను ఈసారి అసలు వరల్డ్‌కప్ మ్యాచ్ చూడాలనే అనుకోవడం లేదు. ఫైనల్లో ఎవరు గెలిచారు? ట్రోఫీ ఎవరు అందుకున్నారని మాత్రమే చూస్తాను. ఒకవేళ నేను ప్రపంచకప్ టోర్నీలో గనుక ఆడుతూ ఉన్నట్లయితే.. కచ్చితంగా ఈ టాప్-4 వగైరాల గురించి పట్టించుకునేవాడిని’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘రియాన్ పరాగ్ మరో ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్ అవడం ఖాయం. ఇలాంటి ఆటిట్యూడ్ ఉంటే నీకు ఛాన్సులెలా వస్తాయి? ఓవరాక్షన్ స్టార్ అనే బిరుదు సార్థకం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నావా ఏంటి?’’ అని విమర్శిస్తున్నారు.కాగా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించారనే కారణంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తూ ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
తాను త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమంటున్నాడు రియాన్ పరాగ్. సెలక్టర్లు ఏదో ఒకరోజు తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయక తప్పదని.. ఈ విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.అసోంకు చెందిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్. కుడిచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన ఈ యంగ్‌స్టర్.. రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ కూడా! ఐపీఎల్లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అయితే, ఆరంభంలో నామమాత్రపు స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరాగ్ ఈ ఏడాది మాత్రం అద్భుతంగా రాణించాడు. దేశవాళీ క్రికెట్లో సూపర్ ఫామ్ అందుకున్న అతడు .. ఐపీఎల్-2024లోనూ దానిని కొనసాగించాడు.రాజస్తాన్ తరఫున 14 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 573 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.సీజన్ ఆసాంతం మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని రాజస్తాన్‌ను ప్లే ఆఫ్స్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు రియాన్ పరాగ్. ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారిస్తున్న ఈ అసోం ఆటగాడు త్వరలోనే టీమిండియాకు ఎంపిక కానున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడిన రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏదో ఒకరోజు వాళ్లు నన్ను సెలక్ట్ చేయక తప్పదు కదా! నేను టీమిండియాకు ఆడతాననే నమ్మకం నాకుంది.ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నేను లెక్కచేయను.నేను పరుగులు సాధించని సమయంలోనూ ఇదే తరహా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నాపై నాకున్న నమ్మకం అది.ఇదేమీ నేను అహంభావంతో చెబుతున్న మాట కాదు. పదేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి మా నాన్న, నేను ఇదే అనుకున్నాం. ఏదేమైనా ఏదో ఒకరోజు కచ్చితంగా జాతీయ జట్టుకు ఆడటమే మా ధ్యేయం అని ఫిక్సైపోయాం’’ అని రియాన్ పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.వచ్చే ఆరునెలల కాలంలో కచ్చితంగా టీమిండియా తరఫున తాను అరంగేట్రం చేసే అవకాశం ఉందని రియాన్ నమ్మకంగా చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సందర్భంగా ఐపీఎల్-2024లో దుమ్ములేపిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా తదితరులు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. -
SRH vs RR: ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?: టీమిండియా దిగ్గజం ఫైర్
రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. ప్రతిభ ఉంటే సరిపోదని.. దానిని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలంటూ చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో ఆది నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ సంజూ శాంసన్ సేన స్థాయికి తగ్గట్లు రాణించడం లేదని విశ్లేషకులు పెదవి విరిచారు.ఎలిమినేటర్ మ్యాచ్‌లో విశ్వరూపంఅలాంటి సమయంలో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో రాజస్తాన్ తిరిగి సత్తా చాటింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.విలువైన ఇన్నింగ్స్ ఆడిన రియాన్ఈ విజయంలో రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. 26 బంతుల్లో 36 విలువైన పరుగులు జోడించి జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో సహకారం అందించాడు. అయితే, మరో కీలకమైన మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో అతడు చిత్తయ్యాడు.మరో కీలక మ్యాచ్‌లో మాత్రం విఫలంసన్రైజర్స్ హైదరాబాద్‌లో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ పూర్తిగా విఫలమయ్యాడు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ తడబడుతున్న వేళ నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో మొదటి బంతిని ఎదుర్కొనే క్రమంలో.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అనవసరపు షాట్‌కు యత్నించి బంతిని గాల్లోకి లేపగా.. అభిషేక్ శర్మ క్యాచ్ పట్టాడు.Shahbaz Ahmed has put Sunrisers Hyderabad on 🔝🧡#RR in deep trouble and in search of something special in Chennai! Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCall pic.twitter.com/8sGV8fzxcZ— IndianPremierLeague (@IPL) May 24, 2024 దీంతో రియాన్ పరాగ్ తడ‘బ్యాటు’ అంతటితో ముగిసిపోయింది. అతడు అవుటైన తీరుకు రాజస్తాన్ కోచ్ సంగక్కర షాక్‌లో ఉండిపోగా.. కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు.ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?‘‘ఎలా ఉపయోగించుకోవాలో తెలియనపుడు నీకు ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం? అసలు ఇలాంటి షాట్ ఎలా ఆడతావు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అపారమైన ప్రతిభ.. కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. ఇంకొన్ని బంతుల వరకు పరుగులు రానంత మాత్రాన ఏం మునిగిపోతుంది? ఆ తర్వాత మళ్లీ పుంజుకోవచ్చు కదా!’’ అంటూ గావస్కర్ లైవ్ కామెంట్రీలోనే రియాన్ పరాగ్‌పై ఫైర్ అయ్యాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో రియాన్ పరాగ్ 16 మ్యాచ్‌లలో కలిపి 573 పరుగులు సాధించాడు.చదవండి: Kavya Maran Viral Reaction Video: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
రాజస్తాన్‌ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
ఐపీఎల్ - 2024 ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ మరో ముందడుగు వేసింది. రాజస్తాన్ రాయల్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది.చెపాక్ వేదికగా రాజస్తాన్‌తో ఆదివారం తలపడిన చెన్నై టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ సిమర్జీత్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్ (21) వికెట్లు పడగొట్టి శుభారంభం అందించాడు.వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్(15)ను కూడా వెనక్కి పంపి రాజస్తాన్ టాపార్డర్‌ను దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్(35 బంతుల్లో 47 నాటౌట్) పోరాడగా.. ధ్రువ్ జురెల్(18 బంతుల్లో 28) అతడికి సహకారం అందించాడు. మిగతా వాళ్లు చేతులెత్తేయగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్ రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. 41 బంతులు ఎదుర్కొని 42 పరుగులు మాత్రమే చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో డారిల్ మిచెల్(22) ఫర్వాలేదనిపించగా.. మొయిన్ అలీ(10), శివం దూబే(18), రవీంద్ర జడేజా(5) విఫలమయ్యారు. ఏడో స్థానంలో వచ్చిన సమీర్ రజ్వీ ధనాధన్ ఇన్నింగ్స్(8 బంతుల్లో 15)తో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.సొంతమైదానంలో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు వెళ్లింది. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన సిమర్జీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. -
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్‌రేట్‌తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్ అభిషేక్ శర్మ. ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఈ సీజన్లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో అదిరిపోయే స్ట్రయిక్‌రేట్‌తో 315 పరుగులు చేశాడు.వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..ఈ ఐపీఎల్ సీజన్లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్ సింగ్ అనే పంజాబ్ మిడిలార్డర్ బ్యాటర్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్లో శశాంక్ మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. శశాంక్‌ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్ అనుకుని ఈ శశాంక్‌ను సొంతం చేసుకుందని సోషల్‌మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్. ప్రభ్‌సిమ్రన్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 221 పరుగులు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్ నితీశ్‌కుమార్ రెడ్డి. ఈ ఎస్ఆర్హెచ్ మిడిలార్డర్ బ్యాటర్ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్ ఈ సీజన్ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్‌రైజర్స్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్క్యాప్డ్ బ్యాటర్లు ఈ సీజన్లో ఇరగదీస్తున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్‌కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్ లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు. -
‘నాకు దక్కలేదు.. సంజూ భయ్యాను మాత్రం సెలక్ట్ చేశారు’
‘‘నేను చాలా విషయాల్లో మెరుగుపడాలి. ప్రస్తుతం నేను నా అత్యుత్తమ ఫామ్‌లో లేను. ఒకవేళ ఫామ్‌లో ఉండి ఉంటే గనుక కచ్చితంగా మ్యాచ్‌ను విజయంతో ముగించేవాడిని.నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. అవి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్సేనా అంటే కానేకాదు. ఒకవేళ సెంచరీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుగా మిగిలిపోవడం నిరాశకు గురిచేస్తుంది. ఈరోజు మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడగలిగాం. ఓటమిని తలచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం.రెండు- మూడు ఓవర్లలో చేసిన తప్పుల కారణంగా మ్యాచ్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాం. టీ20 అంటేనే ఇలా ఉంటుంది. కాబట్టి తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించే క్రమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం’’ అని రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అన్నాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ గురువారం తలపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ రైజర్స్ సీనియర్ భువనేశ్వర్ కుమార్ రోవ్‌మన్ పావెల్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో రాజస్తాన్ కథ ముగిసిపోయింది.ఫలితంగా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ కష్టాల్లో కూరకుపోయి ఉన్నవేళ.. 77 పరుగులతో రాణించిన రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వరల్డ్‌కప్-2024కు ప్రకటించిన జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా అయినా పరాగ్‌కు చోటు దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. అయితే, బీసీసీఐ మాత్రం 22 ఏళ్ల ఈ అసోం బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు అప్పుడే పిలుపునిచ్చేందుకు సిద్ధంగా లేనట్లు స్పష్టం చేసింది. సంజూ భయ్యాకు చోటు దక్కడం సంతోషంఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది అసలు నేను ఐపీఎల్ పోటీలోనే లేను. కానీ ఈసారి నా గురించి ఏవో వదంతులు కూడా వినిపిస్తున్నాయి. నా గురించి అందరూ చర్చించుకునే స్థాయికి వచ్చాను.నా గురించి గళం వినిపిస్తున్న వారికి ధన్యవాదాలు. అయితే, నేను మాత్రం ఇప్పుడే వాటి(టీమిండియాలో చోటు) గురించి ఆలోచించడం లేదు. మా జట్టు నుంచి వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కించుకున్న వారికి అభినందనలు. ముఖ్యంగా సంజూ భయ్యాకు చోటు దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని రియాన్ పరాగ్ పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశాడు.ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్లో 409 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో 400 పరుగుల మార్కు అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.చదవండి: SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ -
వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేయలేదు.. ఆ కసి మొత్తం చూపించేశాడు
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పరాగ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ బౌలర్లకు పరాగ్ చుక్కలు చూపించాడు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను పరాగ్ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో నిలిపాడు. పరాగ్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 135 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేయలేదన్న కసి మొత్తం ఈ మ్యాచ్‌లో చూపించాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పరాగ్ అద్బుత ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 409 పరుగులు చేశాడు.ఎస్ఆర్హెచ్ చేతిలో ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) హాఫ్ సెంచరీలతో పోరాట పటిమ కనబరిచారు.ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. If you are one of those who trolled Riyan Parag during his tough time then you need to say sorry to him.He is slapping all of us with his exceptional performance.He is the finisher along with Rinku Singh who will bring the ICC trophy in future for Indiapic.twitter.com/Mk0IRvtfhJ— Sujeet Suman (@sujeetsuman1991) May 2, 2024