భారత తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ కల ఎట్టకేలకు నేరవేరింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20తో వీరిద్దరూ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.
అదే విధంగా ఇప్పటికే టెస్టు క్రికెట్‌లో భారత తరపున డెబ్యూ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రవ్ జురెల్.. ఇప్పుడు ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. వీరిముగ్గురూ భారత తత్కాలిక హెడ్ కోచ్ వీవీయస్ లక్ష్మణ్, సపోర్ట్ స్టాప్ చేతుల మీదగా డెబ్యూ క్యాప్‌ను అందుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో విధ్వంసం సృష్టించాడు.
ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. మరోవైపు పరాగ్ కూడా తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పరాగ్ నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు.
ఇక జురెల్ విషయానికి వస్తే.. ఇప్పటికే టెస్టుల్లో తన ఏంటో నిరూపించుకున్న ఈ రాజస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్, ఇప్పుడు టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. టీ20ల్లో ఫినిషర్‌గా జురెల్‌కు మంచి రికార్డు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment