Dhruv Jurel
-
గంభీర్ వ్యూహం అదే.. ఇకపై కూడా మార్పు ఉండదు: అసిస్టెంట్ కోచ్
ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై వచ్చిన విమర్శలపై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే(Ryan Ten Doeschate) స్పందించాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) వ్యూహాలకు అనుగుణంగానే తమ ప్రణాళికలు ఉంటాయని తెలిపాడు. ఫలితాలతో సంబంధం లేకుండా.. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఇక ముందు కూడా ప్రయోగాలు కొనసాగిస్తామని పేర్కొన్నాడు.కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్(India vs England)తో పాటు మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ ఇండియా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఇరుజట్ల మధ్య ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరిగాయి.బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూకోల్కతా, చెన్నైలలో వరుస విజయాలు సాధించిన.. రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం పరాజయం పాలైంది. తద్వారా ఇంగ్లండ్‌పై సూర్య సేన ఆధిక్యం 2-1కు తగ్గింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సహా పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు.స్పెషలిస్టు బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో ఆడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిని కాదని.. కేవలం లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్- అక్షర్ పటేల్‌లను ముందుగా బ్యాటింగ్‌కు పంపడాన్ని తప్పుబట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో జురెల్ రెండు పరుగులకే పరిమితం కాగా.. వాషింగ్టన్ సుందర్ 6, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు.మిగతా వాళ్లు కూడా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసే క్రమంలో 145 పరుగుల వద్ద నిలిచి.. 26 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వచ్చాయి. మా వ్యూహాల్లో భాగమే..ఈ క్రమంలో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే స్పందిస్తూ.. ‘‘ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారని మీరు వాదించవచ్చు. అయితే, కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. ముఖ్యంగా టీ20 క్రికెట్లో గౌతం గంభీర్ బ్లూప్రింట్ ఎలా ఉందో ఓ సారి గమనిస్తే విషయం మీకే అర్థమవుతుంది.ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండేలా అతడు సెట్ చేస్తాడు. ఇక ధ్రువ్ ఎనిమిదో స్థానంలో వచ్చినపుడు అతడి అత్యుత్తమ ప్రదర్శన చూస్తామని నేను అనుకోలేదు. ఏదేమైనా అతడిని అలా లోయర్ ఆర్డర్లో పంపించడం మా వ్యూహాల్లో భాగమే.వీలైనన్ని అవకాశాలు ఇస్తాంఫలితం ఎలా ఉన్నా... మా ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతాం. సుదీర్ఘకాలంలో జట్టు ప్రయోజనాల దృష్ట్యా వారికి వీలైనన్ని అవకాశాలు ఇస్తాం. తప్పక తమను తాము నిరూపించుకుని. తమ విలువేంటో చాటుకుంటారు’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నాలుగో టీ20 జరుగనుంది. పుణె ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌లను తప్పించి..వారి స్థానంలో శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్‌లను ఆడించాలని సూచించాడు. చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆసీస్‌కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం -
Ind vs Eng: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో రెండు మార్పులు! ఎందుకంటే
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)కి టీమిండియా సిద్ధమైంది. పుణెలో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ తాలూకు తప్పులు సరిదిద్దుకుని.. పరుగుల వరదకు ఆస్కారమిచ్చే పిచ్‌పై బ్యాట్ ఝులిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.పక్కనపెడితేనే బెటర్‌ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) కీలక సూచనలు చేశాడు. పుణె టీ20లో భారత జట్టు రెండు మార్పులతో రంగంలోకి దిగాలని సూచించాడు. ధ్రువ్ జురెల్(Dhruv Jurel), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) సేవలను మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదన్న ఆకాశ్ చోప్రా.. వారిద్దరిని పక్కనపెడితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్‌ను బౌలర్‌గా వాడుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతడిని రెండు మ్యాచ్‌లలో ఆడించారు. తన మొదటి మ్యాచ్‌లో అతడు తొలి బంతికే వికెట్ తీశాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేశాడు.అంతేకాదు.. తన తొలి ఓవర్లో ఎక్కువగా పరుగులు కూడా ఇవ్వలేదు. అయినా సరే.. అతడికి రెండో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు. ఇక తన రెండో మ్యాచ్‌లో వాషీ తొలి ఓవర్లోనే పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతడి చేతికి బంతిని ఇవ్వలేదు.ఒకవేళ ఒకే ఒక్క ఓవర్ వేయించాలనుకుంటే అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు?.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు కదా! .. ఇక ధ్రువ్ జురెల్ సేవలను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటప్పుడు అతడు కూడా జట్టులో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.నలుగురు బౌలర్లుఇక ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగానే ఉండాలి. తిలక్ వర్మ వన్‌డౌన్‌లో.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో ఆడాలి.ఇక ఆరోస్థానంలో శివం దూబేను ఆడిస్తే బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. లోయర్- మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా అతడు చక్కటి ఆప్షన్ అని తెలిపాడు. రాజ్‌కోట్‌లో మూడో టీ20లో ఎడమచేతి వాటం బ్యాటర్ కోసమే వాషీని పంపినప్పుడు.. ఈసారి దూబే సేవలు వినియోగించుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.అదే విధంగా... ‘‘ఏడో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఉండాలి. ఈ మ్యాచ్‌లో నలుగురు బౌలర్లు ఉండాలి. అందుకే.. మరో బ్యాటర్ లేదంటే.. ఆల్‌రౌండర్ గురించి నేను ఆలోచించడం లేదు. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తిలతో పాటు.. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీలను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా బౌల్ చేయగలరన్న ఆకాశ్ చోప్రా.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా బంతితో రాణించగలరని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌ల బదులు.. అర్ష్‌దీప్ సింగ్, శివం దూబేలను ఆడించాలని సూచించాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
Ind vs Eng: టీమిండియాకు శుభవార్త!.. పాపం అతడిపై వేటు!
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India Vs England)కి ముందు టీమిండియాకు శుభవార్త! నయా ఫినిషర్ రింకూ సింగ్(Rinku Singh) పూర్తి ఫిట్నెస్ సాధించాడు. పుణె మ్యాచ్‌లో ఆడేందుకు అతడు సన్నద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే ధ్రువీకరించాడు.భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికి మూడు పూర్తి చేసుకుంది. కోల్‌కతా, చెన్నై టీ20లలో గెలిచిన టీమిండియా.. రాజ్‌కోట్(Rajkot T20I)లో మాత్రం విఫలమైంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్‌పై ఆధిక్యం 2-1కు తగ్గింది.వెన్ను నొప్పి కారణంగా..ఇదిలా ఉంటే.. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20 తుదిజట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు మాత్రం దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా అతడు ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడు ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది.జురెల్‌పై వేటు పడే అవకాశంఈ విషయం గురించి కోచ్ డష్కాటే మాట్లాడుతూ.. అతడు బుధవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. ఒకవేళ రింకూ తిరిగి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. అయితే, అతడు వస్తే ధ్రువ్ జురెల్‌పై వేటు పడే అవకాశం ఉంది.మూడో టీ20లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన జురెల్.. ఒత్తిడిలో చిత్తైపోయాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. నిజానికి బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకాస్త ముందు వస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం వాషింగ్టన్ సుందర్- అక్షర్ పటేల్‌లను ఆరు, ఏడు స్థానాల్లో పంపడంతో జురెల్‌కు దెబ్బ పడింది.రింకూ లేదంటే.. ఆ ఇద్దరిలో ఒకరు?ఇక రింకూకు కోల్‌కతా టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. గతేడాది కూడా అతడి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. పద్దెనిమిది మ్యాచ్‌లలో కలిపి అతడు 245 పరుగులే చేశాడు. అయితే, 2023లో మాత్రం 12 మ్యాచ్‌లలోనే 262 పరుగులతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచుతారా? లేదంటే.. శివం దూబే, రమణ్‌దీప్ సింగ్‌లలో ఒకరికి తుదిజట్టులో చోటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.కాగా శుక్రవారం పుణె వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉండగా.. 2-2తో సమం చేయాలని బట్లర్ బృందం భావిస్తోంది. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం ముంబైలో ఆఖరిదైన ఐదో టీ20 జరుగుతుంది.ఇంగ్లండ్‌తో టీ20లకు భారత జట్టు(అప్డేటెడ్)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శివం దూబే, రమణ్‌దీప్ సింగ్.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
‘అతడిని మర్చిపోయాం.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే!’
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడిన అతడిని అందరూ త్వరగానే మర్చిపోయామన్నాడు. ఇప్పట్లో ఇషాన్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డాడు.కాగా 2023లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశాలను పెడచెవిన పెట్టాడు. నాటి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలను కూడా లెక్కచేయక మొండిగా వ్యవహరించాడు.సెంట్రల్ కాంట్రాక్టు పాయె!ఈ క్రమంలో బీసీసీఐ ఇషాన్ కిషన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. దీంతో దిగొచ్చిన ఇషాన్ తన సొంతజట్టు జార్ఖండ్ తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.వికెట్ కీపర్ల కోటాలో టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్(Sanju Samson) ముందుకు దూసుకురాగా.. టెస్టుల్లో రిషభ్ పంత్‌తో కలిసి ధ్రువ్ జురెల్ పాతుకుపోయాడు. ఇక వన్డేల్లో సీనియర్ కేఎల్ రాహుల్ ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రీఎంట్రీ కోసం ప్రయత్నించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి.ప్రపంచకప్‌లో ఆడినా..వన్డే ప్రపంచకప్-2023 జట్టులో కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్‌ను ఎంపిక చేసినా.. అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టీమ్‌లో మాత్రం రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సంజూ- జురెల్‌లను ఎంపిక చేసిన బోర్డు.. వన్డేలకు రాహుల్- పంత్‌లను ఎంచుకుంది.అదే విధంగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లకే వికెట్ కీపర్ కోటాలో చోటిచ్చింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు మద్దతుగా ఉండే కొంతమంది నెటిజన్లు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిని ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ విషయమై ఆకాశ్ చోప్రాను స్పందించాల్సిందిగా కోరారు. డబుల్ సెంచరీ కూడా చేశాడు.. కానీఇందుకు బదులిస్తూ.. ‘‘ఇషాన్ కిషన్.. అతడిని మనం ఇంతత్వరగా మర్చిపోవడం ఆసక్తికరమే!.. మళ్లీ అతడిని గుర్తు కూడా చేసుకోవడం లేదు. అతడు టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడాడు. దుబాయ్‌లో టీ20 ప్రపంచకప్.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఆడాడు. వన్డేల్లో అతడి పేరిట డబుల్ సెంచరీ కూడా ఉంది.కాకపోతే అతడు చేసిన తప్పు ఇప్పటికీ వెంటాడుతోంది. ఫస్ల్ క్లాస్ క్రికెట్ ఆడటం ఇష్టం లేదనే సందేశం ఇచ్చాడు. అయితే, సెలక్టర్లకు ఇది నచ్చలేదు. అందుకే బీసీసీఐ అతడి ప్రాధాన్యం తగ్గించింది. ఇప్పట్లో సెలక్టర్లు మళ్లీ అతడిని కనికరించకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో గనుక సత్తా చాటితే ఏదేమైనా ప్రస్తుతం ధ్రువ్ జురెల్‌తో పోటీలో ఇషాన్ కిషన్ వెనుకబడి పోయాడన్న ఆకాశ్ చోప్రా.. జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఓపికగా ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. సెలక్టర్లు అతడి గత ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఈసారి ఐపీఎల్లో గనుక సత్తా చాటితే పరిస్థితి మారవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 11.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది.చదవండి: CT 2025: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్ -
అద్భుత బ్యాటర్.. లోయర్ ఆర్డర్లో పంపిస్తారా?: కెవిన్ పీటర్సన్
రాజ్‌కోట్ టీ20(Rajkot T20I)లో టీమిండియా ఆట తీరును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. కోల్‌కతా, చెన్నైలలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తద్వారా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన సూర్యకుమార్ సేనకు పరాజయం ఎదురైంది.బ్యాటర్ల వైఫల్యం వల్లేఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిని చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటర్ల వైఫల్యమేనని చెప్పవచ్చు. గత రెండు మ్యాచ్‌లలో టీమిండియా టాపార్డర్ ఒకే విధంగా ఉంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ.. వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వచ్చారు. ఇక నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేశాడు.హార్దిక్ ఐదో నంబర్లోమూడో టీ20లోనూ ఈ నలుగురి స్థానాలు మారలేదు. కానీ వరుస విరామాల్లో వికెట్లు పడిన వేళ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మేనేజ్మెంట్ ప్రమోట్ చేసింది. ఐదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు దిగాడు. మరోవైపు.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఆ తర్వాతి స్థానాల్లో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్(6), అక్షర్ పటేల్(15)లను రంగంలోకి దించారు.ఎనిమిదో స్థానంలో జురెల్అదే విధంగా.. అచ్చమైన బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. ఇక హార్దిక్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇరవైకి పైగా బంతులు తీసుకుని.. మొత్తంగా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చే సమయానికి.. టీమిండియా విజయలక్ష్యానికి ఓవర్‌కు పదహారు పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఇలాంటి తరుణంలో ఒత్తిడిలో చిత్తైన జురెల్ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయిన టీమిండియా 145 పరుగులకే పరిమితమైంది. తద్వారా ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది.అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టిఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. టీమిండియా అనవసరంగా ఆల్రౌండర్లను ముందు పంపిందని అభిప్రాయపడ్డాడు. వారికి బదులు జురెల్‌ను పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు.ఈ మేరకు.. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది సరైంది కానేకాదు. ధ్రువ్ జురెల్ అచ్చమైన, స్వచ్ఛమైన బ్యాటర్. అద్భుత నైపుణ్యాలు ఉన్న ఆటగాడు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని అతడిని లోయర్ ఆర్డర్లో పంపించడం సరికాదు. జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లు కచ్చితంగా కాస్త టాప్ ఆర్డర్‌లోనే రావాలి’’ అని కెవిన్ పీటర్సన్ హిందుస్తాన్ టైమ్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- మూడో టీ20 స్కోర్లు👉టాస్: ఇండియా.. తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సూర్య👉ఇంగ్లండ్ స్కోరు: 171/9 (20)👉ఇండియా స్కోరు: 145/9 (20)👉ఓవరాల్ టాప్ రన్ స్కోరర్: బెన్ డకెట్(28 బంతుల్లో 51)👉టీమిండియా టాప్ రన్ స్కోరర్: హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో 40)👉ఫలితం: ఇండియాపై 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(5/24).చదవండి: అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య -
సర్ఫరాజ్ కెప్టెన్సీలో కోహ్లి.. గెలిచింది మాత్రం వాళ్లే!
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలుపొందిన భారత్.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓటమిని చవిచూసింది.బాక్సింగ్ డే టెస్టు కోసం సన్నద్ధంఇక వర్షం వల్ల బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టు ‘డ్రా’గా ముగియడంతో ఇరుజట్లు ఇప్పటికీ 1-1తో సమంగా ఉన్నాయి. తదుపరి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో భారత్- ఆసీస్ తలపడనున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాక్టీస్ ముమ్మరం చేసిన భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ లైవ్లీ ఫీల్డింగ్ డ్రిల్‌తో టీమిండియా ప్లేయర్ల మధ్య పోటీ నిర్వహించాడు. ఇందులో భాగంగా ఆటగాళ్లను మూడు జట్లుగా విభజించారు. వీటికి యువ క్రికెటర్లనే కెప్టెన్లుగా నియమించడం విశేషం.సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో కోహ్లిగ్రూప్-1లో భాగంగా సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, అభిమన్యు ఈశ్వరన్, హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్.. గ్రూప్-2లో మహ్మద్ సిరాజ్ సారథ్యంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి.. గ్రూప్-3లో ధ్రువ్ జురెల్ నాయకత్వంలో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్, ప్రసిద్ క్రిష్ణ, వాషింగ్టన్ సుందర్ ఈ డ్రిల్‌లో పాల్గొన్నారు.జురెల్ సారథ్యంలోని జట్టుదే గెలుపుఅయితే, ఫీల్డింగ్‌తో అద్భుత నైపుణ్యాలతో మెరిసిన జురెల్ బృందం గెలిచింది. ఈ నేపథ్యంలో జురెల్ కెప్టెన్సీలోని జట్టుకు మూడు వందల డాలర్ల క్యాష్ రివార్డు లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. కాగా మెల్బోర్న్లో డిసెంబరు 26 నుంచి 30 వరకు నాలుగో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.అలా అయితేనే ఫైనల్ ఆశలు సజీవంఇక భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదిక. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో మిగిలిన ఈ రెండు టెస్టులు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక బ్రిస్బేన్ టెస్టు తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల రూపంలో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఆసీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండటంతో అశూ స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయలేదు. చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై..
భారత స్టార్ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో తాను కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాననే సంకేతాలు ఇచ్చాడు. వికెట్ కీపర్ బాధ్యతలను ఓ యువ ఆటగాడికి అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా 2021లో రాజస్తాన్ రాయల్స్ సారథిగా పగ్గాలు చేపట్టాడు సంజూ శాంసన్.కెప్టెన్‌గా హిట్ఆ మరుసటి ఏడాదే అంటే.. 2022లో రాజస్తాన్‌ను ఫైనల్ చేర్చి సత్తా చాటాడు. 2008 తర్వాత ఆ జట్టు మళ్లీ తుదిపోరుకు అర్హత సాధించడం అదే తొలిసారి. అయితే, 2023లో మాత్రం ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినప్పటికీ ఐదో స్థానంలో నిలపగలిగాడు. ఇక తాజా ఎడిషన్‌లో మాత్రం రాజస్తాన్‌ను మరోమారు ఆఫ్స్‌లో నిలబెట్టాడు సంజూ.అతడి కోసం త్యాగం చేసేందుకు సిద్దంఇలా గత మూడేళ్లుగా రాజస్తాన్‌ను మెరుగైన స్థితిలో నిలపడంలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, వచ్చే ఏడాది మాత్రం ధ్రువ్ జురెల్ కోసం వికెట్ కీపర్‌గా తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సంజూ తాజాగా వెల్లడించాడు.నాకు ఇదొక పెద్ద సవాలే.. అయినా‘‘ధ్రువ్ జురెల్ ప్రస్తుతం టెస్టుల్లో సెకండ్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లోనూ అతడు కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తే అతడి అంతర్జాతీయ కెరీర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయం గురించి మేము చర్చలు జరుపుతున్నాం.జురెల్‌తో కలిసి కీపింగ్ బాధ్యతలు పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. నిజానికి.. నేను కేవలం ఓ ఫీల్డర్‌గా ఎప్పుడూ కెప్టెన్సీ చేయలేదు. కాబట్టి నాకు ఇదొక పెద్ద సవాలే. అయితే.. ధ్రువ్ విధుల పట్ల మాత్రం స్పష్టతతో ఉన్నాను.నాయకుడిగా నా బాధ్యత.. అందుకే ఈ నిర్ణయంనేను అతడితో ఇప్పటికే ఈ విషయం గురించి మాట్లాడాను. ‘‘చూడు ధ్రువ్.. నాయకుడిగా నేను నీ గురించి తప్పక ఆలోచిస్తాను. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లలో కీపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండు’’ అని చెప్పాను. ఏదేమైనా మాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యం.అయితే, ఆటగాళ్ల వ్యక్తిగత ఎదుగుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే వికెట్ కీపింగ్ బాధ్యతలు పంచుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నాం’’ అని సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ సంజూ ఈ మేరకు తన ఆలోచినలు, నిర్ణయం గురించి వెల్లడించాడు.రూ. 18 కోట్లకుకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాజస్తాన్.. సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతడితో పాటు యశస్వి జైస్వాల్(రూ. 18 కోట్లు ), రియాన్ పరాగ్(రూ. 14 కోట్లు)ధ్రువ్ జురెల్(రూ. 14 కోట్లు), హెట్‌మైర్(రూ. 11 కోట్లు), సందీప్ శర్మ(రూ. 4 కోట్లు)లను అట్టిపెట్టుకుంది.ఐపీఎల్ వేలం-2025 తర్వాత రాజస్తాన్ జట్టుయశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మైర్, సందీప్‌శర్మ, జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు), వనిందు హసరంగ (రూ.5.25 కోట్లు),మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు), నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు), ఫజల్హక్ ఫారూకీ(రూ. 2 కోట్లు), క్వెనా మఫాక (రూ. 1.50 కోట్లు), ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు), వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు), శుభమ్ దూబే (రూ. 80 లక్షలు), యుద్వీర్ చరక్ (రూ. 35 లక్షలు), కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు), అశోక్ శర్మ (రూ. 30 లక్షలు), కునాల్‌సింగ్ (రూ. 30 లక్షలు).చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
‘గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను మరికొన్నాళ్లపాటు బెంచ్‌కే పరిమితం చేయాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.గాయం వల్ల జట్టుకు దూరంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండగా.. టెస్టుల్లో వన్‌డౌన్‌లో ఆడుతున్న గిల్ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.రిషభ్ పంత్ ఉన్నప్పటికీఈ నేపథ్యంలో రోహిత్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. మరోవైపు.. గిల్ లేకపోవడంతో.. రిషభ్ పంత్ ఉన్నప్పటికీ మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ, గిల్ అందుబాటులోకి రావడంతో ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తోంది.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇండియా టుడేతో మాట్లాడాడు. ‘‘కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్‌లను ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలి. కెప్టెన్ రోహిత్ శర్మ కోసం శుబ్‌మన్ గిల్ తన మూడోస్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో రాగా.. మిగతా స్థానాల్లో యథావిధిగా అందరూ కొనసాగాలి.గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలిగిల్ మరికొన్నాళ్లు వేచి చూడాలి. నిజానికి జురెల్‌కు తొలి టెస్టులో అవకాశం ఇచ్చారు. కానీ అతడు పరుగులేమీ రాబట్టలేకపోయాడు. కాబట్టి అతడిని బెంచ్‌కే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. గిల్‌ను ఓపెనింగ్ నుంచి ఐదో స్థానం వరకు ఎక్కడా ఆడించలేము కదా!ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవడం మంచిదే. బెంచ్ ఎంత పటిష్టంగా ఉందో తెలియజేస్తుంది. మేనేజ్మెంట్ గిల్ వైపు మొగ్గు చూపి జురెల్‌ను తప్పించవచ్చు. అయితే, నా అభిప్రాయం ప్రకారం జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలి’’ అని భజ్జీ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీకాగా ఆసీస్-‘ఎ’ జట్టుతో రాణించిన జురెల్.. తొలి టెస్టులో మాత్రం నిరాశపరిచారడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 11, 1 పరుగులు చేశాడు. మరోవైపు.. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో పింక్ బాల్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీ(రిటైర్డ్ హర్ట్) సాధించాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు జరుగనుంది. దీనిని పింక్ బాల్‌తో నిర్వహించనున్నారు. ఇక పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు -
అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించండి: రవిశాస్త్రి
పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మొదటి టెస్టుకు టీమిండియా అన్ని విధాల సన్నదమవుతోంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో బుమ్రా సారథ్యంలో భారత జట్టు ఆసీస్‌ను ఢీకొట్టనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి టీమ్ మేనెజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు. ఆసీస్‌తో తొలి టెస్టుకు యవ ఆటగాడు ధృవ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఎంపిక చేయాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.కాగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధృవ్ జురెల్ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి రావడంతో జురెల్‌కు తుది జట్టులో అవకాశాలు లభించడం లేదు.స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు జురెల్ ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎతో తలపడిన మ్యాచ్‌లో భారత్ -ఎ తరఫున రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు.ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూలో శాస్త్రి మాట్లాడుతూ.."తొలి టెస్టుకు ధృవ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఎంపిక చేయండి. అతడికి ఆ సత్తా ఉంది. ఒత్తిడిలో చాలా మంది ఆటగాళ్లు తీవ్ర ఇబ్బంది పడటం మనం చూసి ఉంటాం. మరి కొంతమంది వెంటనే వికెట్‌ను సమర్పించుకుని ఔటవ్వడం చూసి ఉంటాము. కానీ ధృవ్ జురెల్ కథ మాత్రం వేరు. జురెల్ ఎటువంటి పరిస్థితులోనైనా ప్రశాంతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడి కూల్‌నెస్ నాకు బాగా నచ్చింది. అదే అతడి స్పెషల్ కూడా. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ సిరీస్‌లో కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడెంతో పరిపక్వతను చూపించాడు. కాబట్టి పెర్త్ టెస్టులో అతడు ఆడితే చూడాలనుకుంటున్నాను" పేర్కొన్నాడు.చదవండి: ఆస్ట్రేలియా అంటే చాలు కోహ్లికి పూనకాలే.. జాగ్రత్తగా ఉండండి: వార్నర్ -
బౌన్సీ పిచ్‌లపై జురెల్ బ్యాటింగ్ భళా.. తుదిజట్టులో చోటివ్వాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్
టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ ప్రశంసలు కురిపించాడు. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ తుది జట్టులో కచ్చితంగా చోటు దక్కించుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. బౌన్సీ పిచ్‌లపై మెరుగైన ప్రదర్శన చేసిన ధ్రువ్ జురెల్.. ఆసీస్‌తో సిరీస్‌లో గనుక ఆడకపోతే తాను ఆశ్చర్యపోతానని పేర్కొన్నాడు.కాగా ఆసీస్‌తో కీలక టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా పిచ్‌పై అవగాహన కోసం.. భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు భారత జట్టు ఆటగాళ్లు బరిలోకి దిగగా... రెండో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ కూడా ఆడారు.మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళఅయితే, ఈ పోరులో మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ జురెల్ చక్కటి ఆటతీరు కనబర్చాడు. బౌన్సీ వికెట్‌పై పేసర్లను సమర్థంగా ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్‌లో 80, రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన మాజీ క్రికెటర్ టిమ్ పైన్... 23 ఏళ్ల ధ్రువ్ ఆట తీరు తనను ఆకట్టుకుందని కొనియాడాడు. ‘ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడి బ్యాటింగ్ శైలి చూసిన తర్వాత బోర్డర్–గావస్కర్ సిరీస్ తుది జట్టులో అతడు ఆడకపోతే ఆశ్చర్యపోవాల్సిందే.మెరుగైన షాట్ సెలెక్షన్‌తో ఆకట్టుకున్నాడుధ్రువ్ ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆటతీరు చూస్తుంటే... సహచర ఆటగాళ్ల కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది. ఆసీస్ పిచ్‌లపై రాణించాలంటే పేస్‌ను, బౌన్స్‌ను ఎదుర్కోవడం తెలిసి ఉండాలి. అది ధ్రువ్‌లో చూశాను. సాధారణంగా భారత జట్టు ఆటగాళ్ల ప్రదర్శన కన్నా అతడు మెరుగైన షాట్ సెలెక్షన్‌తో ఆకట్టుకున్నాడు. మెల్బోర్న్ పిచ్‌పై అతడు చేసిన పరుగులు చాలా విలువైనవి. ఆసీస్ పేసర్లను ఎదుర్కోవడం అంత సులువు కాకపోయినా... జురెల్‌లో ఆ సత్తా ఉందని మాత్రం చెప్పగలను. రిషబ్ పంత్ రూపంలో టీమిండియాకు అత్యుత్తమ వికెట్ కీపర్ అందుబాటులో ఉన్నా... కనీసం ప్లేయర్‌గానైనా ధ్రువ్ భారత జట్టులో ఉంటాడని అనుకుంటున్నా’ అని పైన్ అన్నాడు. కాగా ఈ ఏడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్... కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. పంత్ తిరిగి జట్టులోకి రావడంతోఅయితే, ప్రమాదం నుంచి కోలుకొని రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రావడంతో జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఇటీవల న్యూజిలాండ్తోసిరీస్లోనూ జురెల్ జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు ఆడిన అనధికారిక టెస్టులో రాణించడంతో ధ్రువ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే మిడిలార్డర్లో నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు బదులు ధ్రువ్ జురెల్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. చదవండి: సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్ -
ధృవ్ జురెల్ మరో హాఫ్ సెంచరీ.. 229 పరుగులకు భారత్ ఆలౌట్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న రెండో ఆనాధికరిక టెస్టులో భారత-ఎ జట్టును వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మరోసారి ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా జురెల్ హాఫ్ సెంచరీ సాధించాడు. తన అద్బుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఫైటింగ్ స్కోర్‌ను అందించాడు.122 బంతులు ఎదుర్కొన్న జురెల్ 5 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు తనీష్ కొటియన్(44), నితీష్ కుమార్ రెడ్డి(38) పరుగులతో రాణించారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 229 పరుగులకు ఆలౌటైంది. 75/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత-ఎ జట్టు అదనంగా 154 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.దీంతో ఆస్ట్రేలియా ముందు 168 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు.భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు.. ఇక రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలతో రాణించిన ధృవ్ జురెల్‌ను పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టులో ఆడించాలని భారత జట్టు మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు వేసి జురెల్‌కు చోటు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్న జురెల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. తుది జట్టులో ధృవ్ జురెల్..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడని తెలుస్తుంది. రోహిత్ భార్య రితిక సజ్దే రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో అతను పితృత్వ సెలవులో ఇండనున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో టీమిండియా బ్యాకప్ ఓపెనర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.రోహిత్ లీవ్ విషయం ముందే తెలిసి టీమిండియా మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ బ్యాకప్ ఓపెనర్‌గా ఉపయోగపడతాడని ఆస్ట్రేలియాకు పంపింది. అయితే రాహుల్ ఆసీస్-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్‌లో దారుణంగా విఫలమయ్యాడు. రాహుల్‌తో పాటు మరో బ్యాకప్ ఓపెనర్‌గా పరిగణించబడిన అభిమన్యు ఈశ్వరన్ కూడా రెండు అనధికారిక టెస్ట్‌ల్లో చేతులెత్తేశాడు. వీరిద్దరితో పాటు ఓపెనర్ రేసులో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ సైతం దారుణంగా నిరాశ పరిచాడు.ఈ నేపథ్యంలో రెండో అనధికారిక టెస్ట్‌లో అద్భుతంగా ఆడిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ధృవ్ జురెల్‌ను రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయాలని అభిమానులు కోరుతున్నారు. యశస్వి జైస్వాల్‌కు జతగా శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా పంపించి జురెల్‌ను మిడిలార్డర్లో ఆడించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆసీస్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో అందరూ విఫలమైన వేల జురెల్ సూపర్‌గా బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 186 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతులు ఎదుర్కొని 19 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆసీస్‌తో తొలి టెస్ట్ సమయానికి రోహిత్ అందుబాటులో ఉండకపోతే జురెల్నే ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపిక చేయడం మంచిందని అందరూ అనుకుంటున్నారు. మరి టీమిండియా మేనేజ్మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి. -
Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రుతురాజ్ సేన ఓటమి దిశగా పయనిస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు భారత్-‘ఎ’- ఆసీస్- ‘ఎ’ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది.రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో.. బీజీటీకి ఎంపికైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ తదితరులు ముందుగానే భారత్-‘ఎ’ జట్టుతో చేరగా.. రెండో టెస్టు కోసం కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా కంటే ముందే ఆసీస్‌కు వచ్చారు.తొలిరోజు ఇలాఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుకాగా.. భారత్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (4), అభిమన్యు ఈశ్వరన్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (16) అందివచ్చిన చక్కని అవకాశాన్ని అందుకోలేక మరోసారి చేతులెత్తేశాడు. ఒకే ఒక్కడు ధ్రువ్ జురేల్ (186 బంతుల్లో 80; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్ ‘ఎ’ జట్టును ఆదుకున్నాడు.ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన అభిమన్యుతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (0)లను జట్టు ఖాతా తెరవకముందే నెసర్ తొలి ఓవర్ వరుస బంతుల్లోనే అవుట్ చేశాడు. రెండో ఓవర్లో రాహుల్, మూడో ఓవర్లో కెప్టెన్ రుతురాజ్ (4) నిష్క్రమించడంతో 11 పరుగులకే టాప్–4 బ్యాటర్లను కోల్పోయింది. ఈ దశలో దేవ్‌దత్ పడిక్కల్ (26; 3 ఫోర్లు)కు జతయిన జురేల్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలకుండా ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించాక పడిక్కల్‌ను నెసర్ అవుట్ చేశాడు. జురెల్ ఈసారి నితీశ్‌తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో వెబ్‌స్టర్ ఒకే ఓవర్లో నితీశ్, తనుశ్ (0), ఖలీల్ అహ్మద్ (1)లను అవుట్ చేసి భారత్‌ను ఆలౌట్‌కు సిద్ధం చేశాడు. ప్రసిద్ కృష్ణ (14) సహకారంతో జురేల్ ఇన్నింగ్స్‌ను నడిపించడంతో భారత్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో నెసర్ (4/27), వెబ్‌స్టర్ (3/19) భారత్‌ను దెబ్బ కొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.ఆసీస్ 223 ఆలౌట్‌ఈ క్రమంలో 53/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత బౌలర్లు 223 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లు ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ మూడు వికెట్లు కూల్చాడు. మరో ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించాడు.మరోసారి విఫలమైన భారత బ్యాటర్లుఈ నేపథ్యంలో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(17), కేఎల్ రాహుల్(10) ఇలా వచ్చి అలా వెళ్లగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 3 పరుగులకే నిష్క్రమించాడు.ఇక కెప్టెన్ రుతురాజ్(11) మరోసారి దారుణంగా విఫలం కాగా.. దేవ్‌దత్ పడిక్కల్ ఒక్క పరుగే చేయగలిగాడు. ధ్రువ్ జురెల్ మరోసారి పోరాటం చేస్తుండగా.. నితీశ్ రెడ్డి అతడికి తోడుగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్-‘ఎ’ 31 ఓవర్లు ఆడి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 73 పరుగులు చేసింది. ఆట పూర్తయ్యేసరికి జురెల్ 19, నితీశ్ రెడ్డి 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ మెక్ ఆండ్రూ, బ్యూ వెబ్స్టర రెండేసి వికెట్లు తీయగా.. కోరే రొచిసియోలి ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య -
BGT 2024: సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు.. మిడిలార్డర్లో అతడు ఫిక్స్!
టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. సహచర ఆటగాళ్లంతా విఫలమైన వేళ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సెంచరీ చేజారినా తన విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.కివీస్‌తో టెస్టులలో నో ఛాన్స్కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ఎంపిక చేసిన జట్టులో ధ్రువ్ జురెల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్ బరిలోకి దిగగా.. జురెల్‌ను పక్కనపెట్టారు.అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టులోఇక కివీస్‌తో స్వదేశంలో మూడు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయి 3-0తో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీసీసీఐ.. కేఎల్ రాహుల్‌తో పాటు ధ్రువ్ జురెల్‌ను ముందుగానే ఆస్ట్రేలియాకు పంపింది. బీజీటీ కంటే ముందు ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టులో వీరిద్దరిని చేర్చి.. వారి ఆట తీరును పరిశీలిస్తోంది.161 పరుగులకే ఆలౌట్ఇక ఇప్పటికే ఆసీస్-ఎ, భారత్-ఎ జట్ల మధ్య తొలి మ్యాచ్‌లో రుతు సేన ఓడిపోగా.. గురువారం మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 161 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. నిజానికి భారత్ ఈ మాత్రం స్కోరు చేయడానికి కారణం జురెల్.టాపార్డర్ కుప్పకూలి 11 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ.. జురెల్ ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ వికెట్ కీపర్ 80 పరుగులు(186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. సహచరులంతా ఆసీస్ బౌలర్ల ధాటికి.. పెవిలియన్‌కు క్యూ కడితే.. తాను మాత్రం పట్టుదలగా నిలబడి.. జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు వేసిఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ధ్రువ్ జురెల్‌ను కొనియాడుతున్నారు. బీజీటీలో మిడిలార్డర్లో అతడిని తప్పక ఆడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో జురెల్‌కు చోటు దక్కడం అంత సులభమేమీ కాదు.వికెట్ కీపర్‌గా పంత్ అందుబాటులో ఉంటాడు కాబట్టి.. మిడిలార్డర్లో ఎవరో ఒకరిపై వేటు పడితేనే జురెల్‌కు లైన్ క్లియర్ అవుతుంది. కివీస్ సిరీస్‌లో ప్రదర్శనను బట్టి చూస్తే సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కివీస్‌తో తొలి టెస్టులో భారీ శతకం(150) సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఈ ముంబై బ్యాటర్ వరుసగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆరో స్థానంలో సర్ఫరాజ్‌కు బదులు జురెల్ ఆసీస్ గడ్డపై బీజీటీలో ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయిబోర్డర్- గావస్కర్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆర్ జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
Aus A vs Ind A: రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్.. జురెల్ ఒక్కడే!.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. ఆట మొదటి రోజే స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది.తొలి టెస్టులో ఓటమికాగా ఆసీస్-‘ఎ’- భారత్-‘ఎ’- జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మెకే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఈ మేర పరాభవం తప్పలేదు.అదొక్కటే సానుకూలాంశంఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ సెంచరీ చేయడం ఒక్కటే సానుకూలాంశం. ఈ క్రమంలో ఓటమిభారంతో గురువారం రెండో టెస్టు మొదలుపెట్టిన భారత జట్టు.. మరోసారి విఫలమైంది. రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్మెల్బోర్న్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత్. అయితే, ఆసీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. పెవిలియన్‌కు గత మ్యాచ్‌లో శతకం బాదిన వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి సున్నాకే అవుట్‌కాగా.. కెప్టెన్ రుతురాజ్(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో మిడిలార్డర్లో దేవ్‌దత్ పడిక్కల్(26) కాసేపు పోరాడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో పట్టుదలగా నిలబడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 186 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 80 పరుగులు సాధించాడు.నితీశ్ రెడ్డి మరోసారిమిగతా వాళ్లలో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(16) మరోసారి నిరాశపరచగా.. మరో ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్(0), టెయిలెండర్లు ఖలీల్ అహ్మద్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ కృష్ణ 14 పరుగులు చేయగా.. ముకేశ్ కుమార్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.చెలరేగిన నాసెర్ఆసీస్ బౌలర్లలో పేసర్ మైకేల్ నాసెర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. స్పిన్నర్ కోరే రోచిసియెలి, కెప్టెన్ నాథన్ మెక్స్వినే(జురెల్ వికెట్) తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను ముందుగానే బీసీసీఐ అక్కడికి పంపించింది. వీరిలో జురెల్ హిట్ కాగా.. రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఇక బీజీటీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. చదవండి: WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్! వీడియో -
బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు?
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కివీస్‌పై చేసిన తప్పిదాలను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పునరావృతం చేయకూడదని గంభీర్ అండ్ కో భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను వారం రోజుల ముందుగానే ఆస్ట్రేలియా పంపాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న భారత-ఎ జట్టుతో వీరిద్దరూ బుధవారం(నవంబర్ 6) కలవనున్నారు. నవంబర్ 7 నుంచి మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో రాహుల్, జురెల్ భారత్-ఎ తరపున ఆడే ఛాన్స్ ఉంది.కాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైన రాహుల్ కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో విఫలమం కావడంతో మిగితా రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం చేశాడు. ఈ క్రమంలోనే అతడు ప్రాక్టీస్ కోసం ముందుగానే ఆస్ట్రేలియా గడ్డపై అడగుపెట్టనున్నాడు. రాహుల్‌కు ఆసీస్ గడ్డపై ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడిన రాహుల్ 20.77 సగటుతో కేవలం 187 పరుగులు మాత్రమే చేశాడు.జురెల్ ఇదే తొలిసారి.. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. విదేశీ గడ్డపై ఆడిన అనుభవం జురెల్‌కు లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే జురెల్‌ను కూడా జట్టు మేనేజ్మెంట్ ఆస్ట్రేలియాకు పంపింది. ఇక నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: Ind vs Aus: కివీస్ చేతిలో టీమిండియా వైట్‌వాష్.. ఆసీస్ స్టార్ కామెంట్స్ వైరల్ -
టీమిండియాకు మరో భారీ షాక్.. స్టార్ బ్యాటర్‌కు గాయం
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 46 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 13, కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులే చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ సున్నా చుట్టారు.పంత్ ఒక్కడేఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 20 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ కాగా.. కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్ నాలుగు(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది.మోకాలికి బలంగా తాకిన బంతిమరోవైపు.. బౌలింగ్‌లోనూ రోహిత్ సేన పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఈ క్రమంలో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు టీమిండియాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో పంత్ మోకాలికి బాల్ బలంగా తాకింది.కివీస్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన ఆఖరి బంతిని ఆడేందుకు డెవాన్ కాన్వే ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వెళ్లి పంత్ మోకాలిని తాకగా.. నొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో టీమిండియా ఫిజియోలు వచ్చి పంత్‌ను పరీక్షించారు.బరిలోకి జురెల్అయితే, బాధ తాళలేక పంత్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతడు మైదానం వీడాడు. ఈ క్రమంలో పంత్ సబ్‌స్టిట్యూట్‌గా ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఒకవేళ పంత్ గనుక కోలుకోకపోతే టీమిండియాకు మరిన్ని కష్టాలు తప్పవు. ఇదిలా ఉంటే.. గురువారం నాటి ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(15) నిరాశపరచగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో దుమ్ములేపాడు. విల్ యంగ్ 33 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: టీమిండియా రాకపోతే..: పీసీబీ, ఐసీసీకి ఇంగ్లండ్ బోర్డు వార్నింగ్! -
Team India: ఇషాన్ కిషన్ కల చెదిరిపోయినట్లే!
ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబైతో జరుగుతున్న ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 93 పరుగులతో దుమ్ములేపాడు.'శతకం చేజారినాసెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(191)తో కలిసి రెస్ట్ ఆఫ్ ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ధ్రువ్ జురెల్ అదరగొడుతున్నాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో అతడు మూడు క్యాచ్‌లతో మెరిశాడు.ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఆయుశ్ మాత్రే(19), హార్దిక్ తామోర్(0), యశ్ దయాల్ బౌలింగ్‌లో కెప్టెన్ అజింక్య రహానే(97) ఇచ్చిన క్యాచ్‌లు పట్టి.. వారిని పెవిలియన్‌కు పంపడంలో తోడ్పడ్డాడు. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టి తనపై నుంచి మరలకుండా చేసుకోగలిగాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.ఇషాన్ కిషన్ విఫలంమరోవైపు.. ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్‌తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకే ఆడుతున్న మరో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ మాత్రం నిరాశపరిచాడు. ఐదో స్థానంలోబ్యాటింగ్‌కు దిగిన ఈ లెఫ్టాండర్ 60 బంతులు ఎదుర్కొని 38 పరుగులకే పరిమితమయ్యాడు. కాగా ఇషాన్ కిషన్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే.టీమిండియా సెలక్టర్ల దృష్టి మరలకుండాముఖ్యంగా టెస్టుల్లో స్థానం పొందాలన్న ఇషాన్ కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఈ జార్ఖండ్ బ్యాటర్‌కు ధ్రువ్ జురెల్ చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధ్రువ్.. తన తొలి మ్యాచ్‌లోనే మెరుగ్గా రాణించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా దులిప్ ట్రోఫీ-2024లోనూ వికెట్ కీపర్‌గా రాణించిన ధ్రువ్ జురెల్.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో పంత్ బ్యాకప్‌గా ఉన్నాడు.ఇషాన్ రంజీల్లో రాణిస్తేనేతాజాగా రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున అద్బుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. స్వదేశంలో టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో ఆడే సిరీస్‌కు ముందు సెలక్టర్ల ముందు సత్తా నిరూపించుకున్నాడు. దీంతో సెలక్టర్లు.. టెస్టుల్లో ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ రేసు నుంచి తప్పించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఏడాది రంజీల్లో గనుక ఇషాన్ రాణిస్తే తన రాత మారే అవకాశం ఉంటుంది. భారీ ఆధిక్యం దిశగా ముంబైకాగా రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై.. ఇరానీ కప్ కూడా గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. లక్నోలో అక్టోబరు 1న మొదలైన ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు రెస్ట్ ఆఫ్ ఇండియా 416 పరుగులతో బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
తుదిజట్టులో వారికి చోటు లేదు: కారణం చెప్పిన గంభీర్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టులో చోటు కోసం.. యువకులు మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. చెన్నై టెస్టులో ఆడబోయే ప్లేయింగ్ ఎలెవన్‌లో ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లకు చోటు దక్కదని సంకేతాలు ఇచ్చాడు.బంగ్లాదేశ్‌కు వార్నింగ్ఇక చెపాక్‌లో ఈసారి మ్యాచ్ జరుగబోయేది ఎర్రమట్టి పిచ్ మీదే అయినప్పటికీ.. తమ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపుతారని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. దిగ్గజ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ త్రయంతో బంగ్లాదేశ్ జట్టు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది.పంత్ జట్టులోకి వచ్చాడు.. కాబట్టిఈ క్రమంలో గురువారం చెన్నై వేదికగా తొలి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ బుధవారం మాట్లాడుతూ.. ‘‘మేము ఎవరినీ జట్టు నుంచి తప్పించం. అయితే, ప్లేయింగ్ ఎలెవన్‌లో ఫిట్ అయ్యే ఆటగాళ్లను మాత్రమే ఎంచుకుంటాం. జురెల్ అద్భుతమైన ఆటగాడు. అయితే, పంత్ జట్టులోకి వచ్చాడు.కాబట్టి.. కొన్నిసార్లు కొంతమంది ఎదురుచూడకతప్పదు. సర్ఫరాజ్కూ ఇదే వర్తిస్తుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. కానీ ఓపికగా ఎదురుచూడటం అవసరం’’ అని పేర్కొన్నాడు. తద్వారా వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్ ఆడటం ఖాయమని చెప్పకనే చెప్పాడు.మాకు అశూ, జడ్డూ ఉన్నారుఇక స్పిన్దళం అశ్విన్, జడేజా, కుల్దీప్ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘మా స్పిన్నర్లు మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు ప్రభావం చూపగలరు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆటగాళ్లను తుదిజట్టులోకి తీసుకోలేము కదా. అదృష్టవశాత్తూ మాకు అశ్విన్, జడేజా ఉన్నారు. వాళ్లు డిఫెన్సివ్‌గా ఆడగలరు. అదే సమయంలో దూకుడూ ప్రదర్శించగలరు’’ అని గంభీర్ ప్రశంసించాడు. కాగా చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుందన్న వార్తల నేపథ్యంలో.. తమ స్పిన్ దళం నుంచే ప్రత్యర్థికి ఎక్కువ ప్రమాదమని గౌతీ చెప్పడం విశేషం.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు భారత తుదిజట్టు అంచనారోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.చదవండి: IND vs BAN: విరాట్ కోహ్లినే భయపెట్టాడు..! ఎవరీ గుర్నూర్ బ్రార్? -
భారత తుది జట్టులో వారిద్దరికి నో ఛాన్స్.. హింట్ ఇచ్చిన రోహిత్
సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టులో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇప్పటికే చెన్నైకు చేరుకున్న టీమిండియా, బంగ్లా జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి.వారిద్దరికి నో ఛాన్స్..ఇక బంగ్లాతో తొలి టెస్టుకు భారత తుది జట్టులో యువ ఆటగాళ్లు ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లకు చోటు దక్కే సూచనలు కన్పించడం లేదు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రావడంతో వీరిద్దరూ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఈవార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. మా ఆఖరి టెస్టు సిరీస్ ఇంగ్లండ్‌తో ఆడినప్పుడు చాలా మంది సీనియర్ ఆటగాళ్లు గాయం కారణంగా దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొత్త ఆటగాళ్లకు జట్టులో చోటు లభించింది.బహుశా ఇప్పుడు కొంతమంది యువ ఆటగాళ్లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు. కానీ కచ్చితంగా వారికి ముందుముందు అవకాశాలు లభిస్తాయి అని రోహిత్ పేర్కొన్నాడు. దీంతో జురెల్, సర్ఫరాజ్‌లకు దాదాపుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లేనిట్లే. కాగా వీరిద్దరూ తమ అరంగేట్ర సిరీస్‌లో అదరగొట్టారు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జురెల్, సర్ఫారాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కానీ సీనియర్ ఆటగాళ్లు అందరూ ఇప్పుడు అందుబాటులో ఉండడంతో వీరిద్దరూ తుది జట్టులో చోటు కోసం వేచి చూడక తప్పదు.చదవండి: వారు ముగ్గురు ఒక అద్బుతం.. కొంచెం కూడా భయం లేదు: రోహిత్ -
'ఇద్దరం ఒకే జట్టుకు ఆడాము.. అయినా నన్ను స్లెడ్జ్ చేశాడు'
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి జురెల్ అడుగుపెట్టాడు. హైదారాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గాయ పడిన కేఎల్ రాహుల్ స్ధానంలో ధ్రువ్ ఎంట్రీ ఇచ్చాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో 90 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన జురెల్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే తాజాగా తన డెబ్యూ టెస్టులో ఇంగ్లండ్ ఆటగాళ్ల నుంచి ఎదురైన అనుభవాలను ధ్రువ్ పంచుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌లో కలిసి ఆడిన జో రూట్ సైతం తనను స్లెడ్జింగ్ చేయడం ఆశ్చర్యపరిచందని ధ్రువ్ చెప్పుకొచ్చాడు.రాంచీ టెస్టుల్లో నేను 32 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాను. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకుంది. కొత్త బంతి తీసుకోవడంతో జేమ్స్ ఆండర్సన్ ఎటాక్‌లోకి వస్తాడని నేను ముందే ఊహించాను. అతడు అప్పటికే కొంచెం దూకుడుగా ఉన్నాడు. ఎందుకంటే మా భాగస్వామ్యం నెమ్మదిగా పెరుగుతుందని వారికి తెలుసు.మా భాగస్వామ్యాన్ని ఎలా అయినా బ్రేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో నన్ను స్లెడ్జింగ్ చేయడం మొదలు పెట్టారు. కానీ నేను వారి మాటలను పట్టించుకోకడదని డిసైడ్ అయ్యాను. వారు నా ఏకగ్రాతను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. జానీ బెయిర్‌స్టో అయితే కంటిన్యూగా ఏదో ఒకటి అంటూ వున్నాడు.అతడితో జో రూట్ కూడా చేరాడు. ఐపీఎల్లో జో రూట్ కలిసి ఆడాము. అయినప్పటకి అతడు నన్ను స్లెడ్జ్ చేయడంతో షాక్ అయ్యాను. వెంటనే జో రూట్ భాయ్ మీరు నన్ను ఎందుకు స్లెడ్జింగ్ చేస్తున్నారు? అని అడిగాను. ఇది నా వృత్తి ధర్మం. మనమందరం ఇప్పుడు మన దేశం కోసం ఆడుతున్నాము అని రూట్ బదలిచ్చాడని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువ్ పేర్కొన్నాడు. కాగా ధ్రువ్ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు. -
ధృవ్ జురెల్ కళ్లు చెదిరే క్యాచ్
బెంగళూరు వేదికగా ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-బి వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్ ముషీర్ ఖాన్ లెగ్ సైడ్ దిశగా ఆడిన షాట్‌ను జురెల్ నమ్మశక్యం కాని రీతిలో అద్భుత క్యాచ్‌గా మలిచాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. The Dhruv Jurel stunner in Duleep Trophy. 🤯🙇♂️pic.twitter.com/Rteg0d0CX8— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2024ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో జురెల్ మొత్తం ఐదు క్యాచ్‌లు పట్టాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 240 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (9), అభిమన్యు ఈశ్వరన్ (4), ముషీర్ ఖాన్ (0), నితీశ్ రెడ్డి విఫలం కాగా.. సర్ఫరాజ్ ఖాన్ (46), రిషబ్ పంత్ (61) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వాషింగ్టన్ సుందర్ (6) క్రీజ్‌లో ఉన్నాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్, ఖలీల్ అహ్మద్ తలో 2, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ చెరో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (36), శుభ్‌మన్ గిల్ (25), రియాన్ పరాగ్ (30), కేఎల్ రాహుల్ (37), తనుశ్ కోటియన్‌కు (32) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/62), నవ్‌దీప్ సైనీ (3/60), సాయికిషోర్ (2/10), యశ్ దయాల్ (1/39), వాషింగ్టన్ సుందర్ (1/15) సత్తా చాటారు.ముషీర్ భారీ శతకం..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి.. ముషీర్ ఖాన్ (181) భారీ శతకంతో చెలరేగడంతో 321 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇండియా-బిను దశలో ముషీర్, సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు. -
ఫామ్‌లో ఉన్నా.. ఇషాన్‌కు టీమిండియాలో ఇప్పట్లో నో ఛాన్స్!
భారత క్రికెట్ జట్టులో పునరాగమనమే లక్ష్యంగా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ముందుకు సాగుతున్నాడు. స్వీయ తప్పిదాల వల్ల జట్టులో చోటు కోల్పోయిన అతడు.. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ జార్ఖండ్ చోటా డైనమైట్.. సెంచరీతో చెలరేగాడు.తదుపరి దులిప్ ట్రోఫీలోమధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 114, 41 (నాటౌట్) పరుగులతో ఇషాన్ అలరించాడు. ఈ టోర్నీలో జార్ఖండ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తదుపరి దులిప్ ట్రోఫీలోనూ ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్-డిలో వికెట్ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.ఈ రెడ్‌బాల్ టోర్నీలోనూ నిరూపించుకుంటే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం ఆ అవకాశం లేదంటున్నాడు. ఇప్పట్లో ఇషాన్‌కు టీమిండియా సెలక్టర్ల పిలుపురాదని.. జాతీయ జట్టులో చోటుపై ఆశలు పెట్టుకోవడం మాని.. ఐపీఎల్‌పై దృష్టి సారించాలని అతడికి హితవు పలికాడు.అప్పటిదాకా నో ఛాన్స్.. ఐపీఎల్‌పై ఫోకస్ పెడితే మంచిదిచాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు ఇషాన్ కిషన్ పేరును బీసీసీఐ సెలక్టర్లు పరిశీలించకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. ‘‘ఆస్ట్రేలియా సిరీస్ దాకా ఇషాన్ కిషన్ వేచి చూడాల్సిందే. అయితే, అంతకంటే ఎక్కువగా అతడు ఐపీఎల్‌పైన ఫోకస్ పెడితే మంచిది. నాకు తెలిసి చాంపియన్స్ ట్రోఫీ వరకు కూడా ఇషాన్ రీఎంట్రీ కుదరకపోవచ్చు’’ అని పాక్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.పంత్ రాకతో ఇషాన్‌కు చిక్కులుకాగా గతేడాది జట్టుతో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్ అర్ధంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసిక ఆందోళన కారణం చూపి సెలవు తీసుకున్న ఇషాన్.. తిరిగి జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఫలితంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే క్రమంలో డొమెస్టిక్ క్రికెట్‌పై దృష్టి సారించాడు. అయితే, బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (పునరాగమనం), ధ్రువ్ జురెల్ రూపంలో కీపర్ కోటాలో ఇషాన్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు కేఎస్ భరత్ కూడా రేసులో ఉండే అవకాశం ఉంది.చదవండి: బుమ్రా ఓకే.. రోహిత్, కోహ్లికి రెస్ట్ అవసరమా?: టీమిండియా దిగ్గజం -
IND vs ZIM: సంజూ వచ్చేశాడు.. అతడిపై వేటు! భారత తుది జట్టు ఇదే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మూడో టీ20కు సిద్దమవుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే మూడో టీ20లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత తుది జట్టు ఎంపిక చేయడం శుభ్‌మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు వరల్డ్‌కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ కారణంగా యశస్వీ జైశ్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే దూరమైన సంగతి తెలిసిందే. వారి స్ధానంలో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలను తాత్కాలికంగా బీసీసీఐ జింబాబ్వేకు పంపింది. అయితే ఇప్పుడు జైశ్వాల్, సంజూ, దూబే మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం జట్టుతో చేరారు. వీరి రావడంతో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలు జట్టును వీడనున్నారు.ఈ క్రమంలో జట్టు కూర్పు కొంచెం కష్టంగా మారింది. అభిషేక్ శర్మ ఓపెనర్‌గా దుమ్ములేపుతుండడంతో జైశ్వాల్ మూడో మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్ధానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో జురెల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికి తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక రెండో టీ20కు జట్టులోకి వచ్చిన సాయిసుదర్శన్ స్ధానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జింబాబ్వేతో మూడో టీ20.. భారత తుది జట్టు(అంచనా) శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, రింకూ సింగ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. -
జింబాబ్వేతో తొలి టీ20.. ముగ్గురు మొనగాళ్ల అరంగేట్రం
భారత తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ కల ఎట్టకేలకు నేరవేరింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20తో వీరిద్దరూ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అదే విధంగా ఇప్పటికే టెస్టు క్రికెట్లో భారత తరపున డెబ్యూ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రవ్ జురెల్.. ఇప్పుడు ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. వీరిముగ్గురూ భారత తత్కాలిక హెడ్ కోచ్ వీవీయస్ లక్ష్మణ్, సపోర్ట్ స్టాప్ చేతుల మీదగా డెబ్యూ క్యాప్‌ను అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విధ్వంసం సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. మరోవైపు పరాగ్ కూడా తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పరాగ్ నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు.ఇక జురెల్ విషయానికి వస్తే.. ఇప్పటికే టెస్టుల్లో తన ఏంటో నిరూపించుకున్న ఈ రాజస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్, ఇప్పుడు టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. టీ20ల్లో ఫినిషర్‌గా జురెల్‌కు మంచి రికార్డు ఉంది. -
IND vs ZIM 1st T20: భారత్‌కు బిగ్ షాక్.. జింబాబ్వే చేతిలో ఓటమి
India vs Zimbabwe, 1st T20 Live Updates and Highlights:భారత్‌కు బిగ్ షాక్.. జింబావ్వే చేతిలో ఓటమిటీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత్.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు.తొమ్మిదో వికెట్ డౌన్..టీమిండియా ఓటమికి చేరువైంది. ముఖేష్ కుమార్ రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్..అవేష్ ఖాన్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన అవేష్ ఖాన్.. మజకజ్డా బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ విజయానికి 22 బంతుల్లో 31 పరుగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు.టీమిండియా ఏడో వికెట్ డౌన్.. బిష్ణోయ్ ఔట్జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. రవి బిష్ణోయ్ రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి 39 బంతుల్లో 53 పరుగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్(5) పరుగులతో ఉన్నారు.టీమిండియా ఆరో వికెట్ డౌన్.. శుబ్‌మన్ గిల్ ఔట్కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన గిల్.. సికిందర్ రజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. భారత విజయానికి 53 బంతుల్లో 63 పరగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ ఉన్నారు.కష్టాల్లో టీమిండియా.. ఐదో వికెట్ డౌన్ధ్రువ్ జురెల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్.. మజకజ్డా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 43/5రింకూ సింగ్ ఔట్..టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. చతర బౌలింగ్‌లో రింకూ సింగ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 28/4. క్రీజులో శుబ్‌మన్ గిల్(19) పరుగులతో ఉన్నారు.నిరాశపరిచిన పరాగ్..భారత అరంగేట్ర ఆటగాడు రియాన్ పరాగ్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన పరాగ్.. చతరా బౌలింగ్‌లో ఔటయ్యాడు.రెండో వికెట్ డౌన్..టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. ముజబారనీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 16/2తొలి వికెట్ డౌన్.. అభిషేక్ శర్మ ఔట్116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రియన్ బెన్నట్ వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. మసకజ్డాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.4 వికెట్లతో చెలరేగిన బిష్ణోయ్.. 115 పరుగులకే జింబాబ్వే పరిమితంహరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. బిష్ణోయ్‌తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్,ముఖేష్ కుమార్ చెరో వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మదండే(29), మైర్స్(23), బెన్నట్(23), పరుగులు చేశారు.ఆలౌట్ దిశగా జింబాబ్వే.. 90 పరుగులకే 7 వికెట్లుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 15వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో జింబాబ్వే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 23 పరుగులు చేసిన డియాన్ మైర్స్ సుందర్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత బంతికే మస్కజ్డా స్టంపౌటయ్యాడు. 13 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 77/5జింబాబ్వే వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఐదో బంతికి సికిందర్ రజా ఔట్ కాగా.. ఆరో బంతికి క్యాంప్‌బెల్ రనౌటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే.. 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.మూడో వికెట్ డౌన్..జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన మాధవరే.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మైర్స్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.రెండో వికెట్ డౌన్.. 40 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన బెన్నట్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ సికిందర్ రజా, మాధవరే(17) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో కయా క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో బెన్నట్(8), మాధవరే(6) పరుగులతో ఉన్నారు.భారత్-జింబాబ్వే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. హరారే వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడతున్నాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో భారత తరపున యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్‌జురెల్ టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. కాగా సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో యువ భారత జట్టుకు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహిస్తున్నాడు.తుది జట్లుభారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
అక్కడ బ్యాటింగ్ చేయడం కష్టం.. అతడు అద్భుతం!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో అదరగొడుతున్న రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. అందరి కంటే ముందుగానే టాప్-4లో బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడింది.ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. అదే విధంగా రాయల్స్‌ను గెలుపుతీరాలకు చేర్చడంలో తనకు అండగా నిలిచిన ధ్రువ్ జురెల్‌పై ప్రశంసలు కురిపించాడు.ఫామ్లేమితోగతేడాది ఐపీఎల్లో అదరగొట్టి టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు.. ఐపీఎల్-2024 ఆరంభంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఫామ్‌లేమితో సతమతమైన అతడు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ కంటే ముందు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 50 పరుగులే చేశాడు.అయితే, శనివారం నాటి మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్ సుడిగాలి ఇన్నింగ్స్(33 బంతుల్లో 71 నాటౌట్)తో విరుచుకుపడగా మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించాడు.మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు రాబట్టాడు. తద్వారా సంజూ శాంసన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించి ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘ఫామ్ టెంపరరీ. నిజానికి టీ20 క్రికెట్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే, ధ్రువ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లు పిచ్ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని రాణిస్తుండటం సానుకూలాంశం.టీమిండియా తరఫున టెస్టుల్లో తన ప్రదర్శన మనం చూశాం. ఆరంభంలో తడబడ్డా అతడిపై మా నమ్మకం సడలలేదు. నెట్స్‌లో రెండు నుంచి మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించాడు. అతడు తప్పక రాణిస్తాడని మాకు తెలుసు. అదే జరిగింది కూడా’’ అని ధ్రువ్ జురెల్ ఆట తీరును కొనియాడాడు.రాజస్తాన్ వర్సెస్ లక్నో స్కోర్లు:వేదిక: లక్నోటాస్: రాజస్తాన్.. బౌలింగ్లక్నో స్కోరు: 196/5 (20)రాజస్తాన్ స్కోరు: 199/3 (19)ఫలితం: లక్నోపై ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయంప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్.చదవండి: డీకే అవసరమా?: యువీ Winning streak continues 🩷A Sanju Samson special & Dhruv Jurel's attractive innings propel Rajasthan Royals to their 8th win this season🙌Scorecard ▶️ https://t.co/Dkm7eJqwRj#TATAIPL | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/cam0GepXVo— IndianPremierLeague (@IPL) April 27, 2024 -
రాజస్తాన్ దర్జాగా...
లక్నో: ఈ సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్ రాయల్స్ అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ చేరేందుకు మరింత చేరువైంది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. తొలుత లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.ఆరంభంలోనే ఓపెనర్ డికాక్ (8), హిట్టర్ స్టొయినిస్ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సూపర్‌జెయింట్స్‌ను కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (31 బంతుల్లో 51; 7 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించారు.మిగతావారిలో పూరన్ (11), బదోని (18 నాటౌట్), కృనాల్ పాండ్యా (15 నాటౌట్) పెద్ద స్కోర్లేమీ చేయలేదు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.కెప్టెన్ సంజు సామ్సన్ (33 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ధ్రువ్ జురేల్ (34 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించి మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) బౌల్ట్ 8; రాహుల్ (సి) బౌల్ట్ (బి) అవేశ్ ఖాన్ 76; స్టొయినిస్ (బి) సందీప్ 0; దీపక్ హుడా (సి) పావెల్ (బి) అశి్వన్ 50; పూరన్ (సి) బౌల్ట్ (బి) సందీప్ 11; బదోని నాటౌట్ 18; కృనాల్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–126, 4–150, 5–173. బౌలింగ్: బౌల్ట్ 4–0–41–1, సందీప్ 4–0–31–2, అవేశ్ ఖాన్ 4–0–42–1, అశ్విన్ 4–0–39–1, చహల్ 4–0–41–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) బిష్ణోయ్ (బి) స్టొయినిస్ 24; బట్లర్ (బి) యశ్ ఠాకూర్ 34; సామ్సన్ నాటౌట్ 71; పరాగ్ (సి) బదోని (బి) అమిత్ 14; జురేల్ నాటౌట్ 52; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–78. బౌలింగ్: హెన్రీ 3–0–32–0, మొహసిన్ 4–0–52–0, యశ్ ఠాకూర్ 4–0–50–1, స్టొయినిస్ 1–0–3–1, కృనాల్ 4–0–24–0, అమిత్ మిశ్రా 2–0–20–1, రవి బిష్ణోయ్ 1–0–16–0. -
అతడికి ప్రమోషన్ ఇవ్వండి.. దంచికొడతాడు: గవాస్కర్
ఐపీఎల్ 2024 సీజన్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. శుక్రవారం(మార్చి 22)న చెపాక్ స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కీలక సూచనలు చేశాడు. ఆ జట్టు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024లో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కచ్చితంగా ఆకట్టుకుంటాడు. అతడు ప్రస్తుతం మంచి రిథమ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అతడు ఏమి చేశాడో మనమందరం చూశాం. గత ఐపీఎల్లో కూడా ధ్రువ్ మెరుపులు మెరిపించాడు. కానీ అతడు బ్యాటింగ్‌కు మాత్రం చాలా ఆలస్యంగా వస్తున్నాడు. కాబట్టి ఈ ఏడాది సీజన్లో అతడి బ్యాటింగ్ ఆర్డర్‌ను కచ్చితంగా మార్చాల్సిందే. అతడికి ప్రమోషన్ ఇచ్చి కాస్త ముందు పంపాలని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జురెల్ అదరగొట్టాడు. కీలక ఇన్నింగ్స్‌లతో అందరి ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో సైతం చోటు దక్కింది. అతడితో పాటు సర్ఫరాజ్ ఖాన్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. -
సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్‌కు జాక్ పాట్.. కేవలం మూడు మ్యాచ్‌లకే
టెస్టు క్రికెట్ అరంగేట్రంలోనే సత్తాచాటిన టీమిండియా ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ జాక్ పాట్ తగిలింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో వీరిద్దరికి చోటు దక్కింది. వీరిద్దరికి గ్రేడ్-సీ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం (మార్చి 18) జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా బీసీసీఐ కాంట్రాక్టు పొందాలంటే ప్రస్తుత సీజన్ లో కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ ఇంగ్లండ్ తో చెరో మూడు టెస్టులు ఆడిన కారణంగా నేరుగా సీ-గ్రేడు జాబితాలో బీసీసీఐ చేర్చింది. సీ-గ్రేడ్ కేటగీరీ కింద వీరు రూ. కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్ అదరగొట్టాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అతడితో పాటు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సైతం సత్తాచాటాడు. రాంచీ టెస్టులో 90, 39 స్కోర్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ధ్రువ్ నిలిచాడు. వీరిద్దరి అద్బుత ప్రదర్శన కారణంగానే కేవలం మూడు మ్యాచ్‌లకే బీసీసీఐ కాంట్రాక్ట్‌లు అప్పగించింది. కాగా 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గత నెలలో ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అనూహ్యంగా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు ఈ జాబితాలో చోటు దక్కలేదు. -
అప్పటికే అప్పుల్లో కూరుకుపోయాం.. బాకీలన్నీ తీర్చేసా!
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో ధ్రువ్ జురెల్ ఒకడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను ఐపీఎల్-2022 వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని సొంతం చేసుకుంది. అయితే, ఆ ఏడాది మాత్రం ధ్రువ్ జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయినప్పటికీ సానుకూల దృక్పథంతో వేచి చూసి..గతేడాది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో 11 ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ 152 పరుగులు చేశాడు. ఇక దేశవాళీ క్రికెట్లోనూ రాణించిన ఈ యూపీ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసి.. తనదైన ముద్ర వేయగలిగాడు. ముఖ్యంగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించి సత్తా చాటాడు. అయితే, చాలా మంది క్రికెటర్లలాగే ధ్రువ్ జురెల్ కూడా అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. తనలాగే కొడుకును కూడా సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్ మాత్రం క్రికెటర్ అవుతానని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అతడి తల్లి అండగా నిలిచి.. తన వద్ద ఉన్న చిన్నపాటి బంగారు వస్తువులు కూడా అమ్మేసి కిట్ కొనేందుకు డబ్బులిచ్చారు. ఎల్లవేళలా కొడుకుకు మద్దతుగా నిలిచారు. తండ్రి కూడా అర్థం చేసుకుని బాసటగా నిలవడంతో ధ్రువ్ జురెల్ తన కలలు నెరవేర్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గతాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నాకు మొట్టమొదటిసారి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కిన సమయంలో నా తల్లిదండ్రులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. నేను ఆ బాకీలన్నీ తీర్చేశాను. మా అమ్మ కోసం కొన్ని నగలు కూడా కొన్నాను’’ అని ధ్రువ్ జురెల్ ఉద్వేగానికి లోనయ్యాడు. తల్లిదండ్రులు తనకోసం పడిన కష్టం వెలకట్టలేనిదని పేర్కొన్నాడు. కాగా మార్చి 22న ఐపీఎల్ తాజా సీజన్ మొదలుకానుండగా.. రాజస్తాన్ మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
టీమిండియా నయా సంచలనాలు...
India vs England Test Series 2024: ఒకరు ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు. అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్‌దత్ పడిక్కల్ గురించే ఈ పరిచయ వాక్యాలు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో తాజా సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో 30 ఏళ్ల రజత్ పాటిదార్ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్‌లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం! సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. సంచలనం రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్‌కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జహూర్ సమక్షంలో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్‌లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్‌లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 ధ్రువ్ జురెల్(Dhruv Jurel).. మెరుపులు రాజ్‌కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్ జురెల్. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్ కీపర్‌గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. ఆకాశ్ దీప్(Akash Deep).. ఆకాశమే హద్దుగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్ స్టార్లు బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 దేవ్‌దత్ పడిక్కల్(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఈ సిరీస్‌లో వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్‌లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 712 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్‌గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఉపఖండ పిచ్‌లపై తాము సైతం అంటూ.. ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్లే, షోయబ్ బషీర్ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్ బషీర్ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు. -
ఎందుకంత మిడిసిపడుతున్నావు?.. గిల్- బెయిర్‌స్టో గొడవలో సర్ఫరాజ్
India vs England, 5th Test- Shubman Gill- Sarfaraz Khan Vs Jonny Bairstow: టీమిండియా- ఇంగ్లండ్ సిరీస్‌లో భాగంగా తొలిసారి ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో వాగ్యుద్ధం మొదలుపెట్టగా.. భారత యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ అతడికి ఘాటుగా బదులిచ్చారు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం గొడవను చల్లార్చేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ధర్మశాల వేదికగా ఐదో టెస్టు శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 473/8 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ ఆటను మొదలుపెట్టింది. ఈ స్కోరుక కేవలం నాలుగు పరుగులు జతచేసి అంటే.. 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు టాపార్డర్ కుప్పకూలడంతో కష్టాల్లో పడింది. 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో జో రూట్, జానీ బెయిర్ స్టోతో కలిసి భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశాడు. ఆది నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టిన బెయిర్‌స్టో.. 18 ఓవర్లో కుల్దీప్ యాదవ్ బాల్ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి.. స్లెడ్జ్ చేశాడు. ఈ క్రమంలో గిల్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా బెయిర్‌స్టోకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. వారి మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైకులో రికార్డైంది. Full sledging encounter between Gill & Bairstow:#INDvsENGTest #INDvsENG #ShubmanGill #JonnyBairstowpic.twitter.com/HjdkESr38z — Ashu 🖤 (@Ashu_x18) March 9, 2024 సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం ఆ సంభాణ ఇలా జానీ బెయిర్‌స్టో: ‘‘జిమ్మీతో నువ్వేమన్నావు? తన రిటైర్మెంట్ గురించి.. తుదిజట్టు నుంచి తప్పించడం గురించి మాట్లాడతావా? కానీ అతడి బౌలింగ్‌లోనే నువ్వు అవుటయ్యావు కదా?’’. శుబ్‌మన్ గిల్: ‘‘అయితే.. ఏంటి.. నా శతకం పూర్తైన తర్వాతే అతడు నన్ను అవుట్ చేయగలిగాడు. అయినా.. నువ్వు ఇక్కడ ఎన్ని పరుగులు చేశావేంటి?’’. జానీ బెయిర్‌స్టో: ‘‘బాల్ స్వింగ్ అవుతున్నపుడు నువ్వెన్ని పరుగులు చేయగలిగావు?’’. ధ్రువ్ జురెల్: ‘‘జానీ భాయ్ ఊరుకోండి!’’ సర్ఫరాజ్ ఖాన్: ‘‘ఈరోజు ఏవో కొన్ని పరుగులు చేశాడని.. తెగ ఎగిరెగిరిపడుతున్నాడు’’. కాగా ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ విలువైన 56 పరుగులు చేశాడు. ఇక వందో టెస్టు ఆడిన బెయిర్ స్టో తొలి ఇన్నింగ్స్‌లో 29, రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులు(31 బంతుల్లో) చేశాడు. . ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. ఇక బెయిర్‌స్టో- గిల్, సర్ఫరాజ్ వాగ్వాదంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది బయిర్స్టోది తప్పు అంటే.. మరికొందరు వందో టెస్టు ఆడుతున్న క్రికెటర్(బెయిర్‌స్టో)కు గౌరవం ఇవ్వాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: BCCI: బీసీసీఐ కీలక ప్రకటన.. ఒక్కో మ్యాచ్‌కు ఏకంగా రూ. 45 లక్షలు That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 -
ధ్రువ్‌తో అట్లుంటది మరి.. చెప్పి మరి ఔట్ చేశాడు! ధోనిలా
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత వికెట్ కీపర్ మరోసారి తన స్కిల్స్‌ను ప్రదర్శించాడు. తన సమయస్ఫూర్తితో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను జురెల్ బోల్తా కొట్టించాడు. ఏం జరిగిందంటే? భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రోజు లంచ్ విరామానికి ముందు 26 ఓవర్ వేసే బాధ్యతను కుల్దీప్ యాదవ్‌కు అప్పగించాడు. ఆ ఓవర్లో తొలి బంతిని జాక్ క్రాలే సింగిల్ తీసి ఓలీ పోప్‌కు ఇచ్చాడు. పోప్ రెండో బంతికి ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించగా.. అది మిస్స్ అయ్యి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ చేతికి వెళ్లింది. అయితే జురెల్ కుల్దీప్ వద్దకు వెళ్లి తర్వాతి బంతికి పోప్ క్రీజును వదిలి ఆడుతాడని చెప్పాడు. యాదృచ్ఛికంగా జురెల్ చెప్పటినట్లగానే పోప్ క్రీజును వదలి బయటకు వచ్చి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ధ్రువ్ సూచనతో కుల్దీప్ టర్న్ ఎక్కువగా చేయడంతో బంతి జురెల్ బ్యాట్‌కు మిస్స్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే జురెల్ బెయిల్స్‌ను పడగొట్టి స్టంపౌట్ చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జురెల్ స్కిల్స్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోనిని గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IND vs ENG: ఎంత పనిచేశావు రోహిత్? అంతా ధ్రువ్ వల్లే! పాపం సర్ఫరాజ్ -
ఎంత పనిచేశావు రోహిత్? అంతా ధ్రువ్ వల్లే! పాపం సర్ఫరాజ్
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ క్రాలే మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఓవరాల్‌గా 108 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో క్రాలీ 79 పరుగులు చేశాడు. అయితే 61 పరుగుల వద్ద క్రాలే ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం వల్ల క్రాలే బతికిపోయాడు. ఏం జరిగిందంటే? లంచ్ విరామం తర్వాత కుల్దీప్ యాదవ్ 26 ఓవర్ పూర్తి చేసేందుకు బౌలింగ్ ఎటాక్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో ఆ ఓవర్లో ఐదో బంతిని క్రాలే డౌన్ లెగ్ వైపు ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎక్కువగా టర్న్ అయ్యి బ్యాట్, ప్యాడ్‌కు దగ్గరకు వెళ్తూ వికెట్ కీపర్ దిశగా వెళ్లింది. అయితే బంతిని ధ్రువ్ జురెల్ సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. కానీ బంతి జురెల్ గ్లౌవ్కు తాకి కాస్త గాల్లోకి లేవగా.. షార్ట్ లెగ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ డైవ్ చేస్తూ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. వెంటనే సర్ఫరాజ్‌తో పాటు భారత ఆటగాళ్లు క్యాచ్‌కు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. వెంటనే సర్ఫరాజ్ పూర్తి నమ్మకంతో రివ్యూ తీసుకోమని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించాడు. రోహిత్ మాత్రం వికెట్ కీపక్ ధ్రువ్ జురెల్ సలహా తీసుకున్నాడు. జురెల్ బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తాకిందని చెప్పడంతో రోహిత్ రివ్యూకు వెళ్లలేదు. కానీ తర్వాత రిప్లేలో మాత్రం బంతి క్లియర్‌గా బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది. ఇది చూసిన రోహిత్ ఎంత పనిపోయిందని అన్నట్లు నవ్వుతూ రియాక్షన్ ఇచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా నేను చెప్పా కదా భయ్యా అన్నట్లు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Team India missed out on a big chance, but the skipper made sure that the feels were positive. ROHIT SHARMA IS A MOOD! 🤣 Watch Till End#INDvsENG #TeamIndia #RohitSharma pic.twitter.com/DGUJcobu8G — R.Sport (@republic_sports) March 7, 2024 -
ధోని ఒకే ఒక్కడు.. నా ఉద్దేశ్యం అది కాదు: గవాస్కర్
టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన అరంగేట్ర సిరీస్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ధ్రువ్ జురెల్.. తన రెండో టెస్టులోనే హీరోగా మారిపోయాడు. రాంఛీ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన నాలుగో టెస్టులో ధ్రువ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. భారత విజయంలో జురెల్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన వేళ తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైన 90 పరుగులు చేయడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో అతడిపై సర్వత్ర ప్రశంసల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ధ్రువ్ జురెల్ టీమిండియాకు మరో ధోని అంటూ ప్రశంసించాడు. అయితే రెండు మ్యాచ్‌లకే జురల్‌ను ధోనితో పోల్చడాన్ని చాలా మంది తప్పుబట్టారు. తాజాగా తను చేసిన వ్యాఖ్యలపై సన్నీ క్లారిటీ ఇచ్చాడు. ధోనితో జురెల్‌ను పోల్చలేదని, అతడి సమయస్పూర్తిని చూస్తే ధోని గుర్తు వచ్చాడని అన్నానని లిటిల్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. "భారత క్రికెట్‌కు ధోని లాంటి ఆటగాడు మరొకడు దొరకడు. భారత క్రికెట్లో ఒకే ఒక్క ధోని ఉన్నాడు. జురెల్‌ను నేను ధోనితో పోల్చలేదు. నా ఉద్దేశ్యం ప్రకారం జురెల్ ధోనితో సమానం అని కాదు. అటువంటి సమయస్పూర్తిని కలిగి ఉన్నాడని చెప్పా. అయితే ధోని సాధించిన దాంట్లో జురెల్ సగం సాధించినా భారత క్రికెట్‌కు చాలా మంచిది. ధ్రువ్ అద్బుతమైన ఆటగాడు. అతడికి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్ చేయగలడు. ఆఖరిలో వచ్చి బ్యాటింగ్‌కు వచ్చి ధోనిలా మ్యాచ్‌ను ఫినిష్ చేసే సత్తా కూడా ఉందని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గావస్కర్ పేర్కొన్నాడు. -
అతడిని ధోనితో పోల్చడమేంటి? : గంగూలీ
టీమిండియా నయా సంచలనం ధ్రువ్ జురెల్‌ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడే అతడిని మహేంద్ర సింగ్ ధోని వంటి దిగ్గజ ఆటగాడితో పోల్చకూడదని సరికాదన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో తాజా టెస్టు సిరీస్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో అరంగేట్ర మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. అయితే, రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన వేళ తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైన 90 పరుగులు చేయడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే జట్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ధ్రువ్ జురెల్ టీమిండియాకు మరో ధోని అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాత్రం భిన్నంగా స్పందించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని విభిన్నమైన ఆటగాడు. ధ్రువ్ జురెల్ టాలెంట్ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అయితే, ఇప్పుడే అతడిని ధోనితో పోల్చడం సరికాదు. అతడిని స్వేచ్ఛగా ఆడనిస్తే మంచిది. ధోని ఎంఎస్ ధోని అనే బ్రాండ్ సంపాదించుకోవడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఏదేమైనా జురెల్ స్పిన్, పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం సానుకూల అంశం. అంతేకాదు.. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడటం అతడి ప్రతిభ, పట్టుదలకు నిదర్శనం’’ అని సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్ గురించి ప్రస్తావన రాగా.. అతడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటగల క్రికెటర్ అని గంగూలీ కితాబులిచ్చాడు. -
సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్‌లకు జాక్‌పాట్
టీమిండియా బ్యాటింగ్ సంచలనాలు సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్‌లకు జాక్‌పాట్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇంగ్లండ్‌తో జరుగబోయే తదుపరి టెస్ట్‌లో ఈ ఇద్దరు తుది జట్టులో ఉంటే, వీరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు దక్కనున్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కాలంటే ఆటగాళ్లు టీమిండియా తరఫున కనీసం 3 టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే వీరిద్దరు ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లే ఆడారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వీరిద్దరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. మూడు మ్యాచ్‌ల అనంతరం వీరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల తాజా ఫామ్‌ను బట్టి చూస్తే వీరు ఐదో టెస్ట్‌కు తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖాయమేనని చెప్పాలి. దీంతో వీరికి గ్రేడ్ సి కింద బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడం దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. కాగా, 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్‌లను కోల్పోగా.. రింకూ సింగ్ (సి), తిలక్ వర్మ (సి), ప్రసిద్ద్ కృష్ణ (సి), అవేశ్ ఖాన్ (సి), రజత్ పాటిదార్ (సి), జితేశ్ శర్మ (సి), ముకేశ్ కుమార్ (సి), రవి బిష్ణోయ్‌కు (సి) కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్ (బి), ఇషాన్‌లతో (సి) పాటు యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
దూసుకొస్తున్న జైస్వాల్.. కెరీర్ బెస్ట్ సాధించిన జురెల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగో టెస్ట్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసిన యశస్వి జైస్వాల్ (73, 37), శుభ్‌మన్ గిల్ (38, 52 నాటౌట్), దృవ్ జురెల్ (90, 39 నాటౌట్) ర్యాంకింగ్స్ భారీ జంప్ కొట్టి కెరీర్ అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. యశస్వి మూడు స్థానాలను మెరుగుపర్చుకుని టాప్ 10 దిశగా (12వ స్థానం) దూసుకువస్తుండగా.. గిల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జురెల్ 31 స్థానాలు మెరుగుపర్చుకుని 69 స్థానానికి ఎగబాకారు. ఇదే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా.. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి టాప్-10లో విరాట్ కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌కు దూరంగా ఉండటంతో అతని ర్యాంక్ ఏడు నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానాన్ని కోల్పోయి 13వ ప్లేస్‌కు పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజా ఒకటి, రెండు, ఆరు స్థానాల్లో కొనసాగుతుండగా.. రబాడ, కమిన్స్, హాజిల్‌వుడ్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మరో భారత స్పిన్నర్ కుల్దీప్ రాంచీ టెస్ట్‌లో మెరుగైన ప్రదర్శన కారణంగా 10 స్థానాలు మెరుగపర్చుకుని కెరీర్ అత్యుత్తమ 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌తో నాలుగో టెస్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 80వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ పెద్దగా మార్పులేమీ జరగలేదు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ జో రూట్ మాత్రం మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో ప్లేస్‌కే చేరాడు. -
చరిత్ర సృష్టించిన దృవ్ జురెల్
టీమిండియా నయా సంచలనం దృవ్ జురెల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రాంచీ టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడం ద్వారా అరంగేట్రం సిరీస్‌లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జురెల్‌కు ముందు భారత వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అజయ్ రాత్రా ఈ ఘనత సాధించాడు. 2002 వెస్టిండీస్ పర్యటనలో రాత్రా.. తన డెబ్యూ సిరీస్‌లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జురెల్ అరంగేట్రం సిరీస్ రెండో మ్యాచ్‌లో ఈ అవార్డు అందుకుంటే.. రాత్రా తన డెబ్యూ సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆంటిగ్వా వేదికగా విండీస్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో రాత్రా సెంచరీ (115) చేసి ఈ అవార్డును దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే, ఆ సెంచరీ తర్వాత రాత్రా కనీసం ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్కును తాకలేకపోయాడు. రాత్రా ఆ ఘనత సాధించిన 22 ఏళ్ల తర్వాత జురెల్ మరోసారి ఆ ఫీట్‌ను రిపీట్ చేశాడు. ఓవరాల్‌గా చూస్తే.. భారత్ తరఫున టెస్ట్‌ల్లో కేవలం ఆరుగురు మాత్రమే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. వీరిలో ఎంఎస్ ధోని, రిషబ్ పంత్ రెండు సార్లు ఈ ఘనతను సాధించగా.. నయన్ మోంగియా, వృద్దిమాన్ సాహా, అజయ్ రాత్రా, దృవ్ జురెల్ చెరోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. కాగా, రాంచీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో అజేయమైన 39 పరుగులు చేసి జురెల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనలో (192) తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. జురెల్, శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. -
ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు.. ‘రాంచి హీరో’ భావోద్వేగం
India vs England, 4th Tes: రాంచి టెస్టు హీరో ధ్రువ్ జురెల్ భావోద్వేగానికి లోనయ్యాడు. తనపై నమ్మకం ఉంచినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా రాజ్‌కోట్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ధ్రువ్ జురెల్. వికెట్ కీపర్ బ్యాటర్‌గా తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఈ యూపీ ఆటగాడు.. అరంగేట్ర మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. రాజ్‌కోట్‌లో కీపింగ్ నైపుణ్యాలతో పాటు బ్యాటింగ్ మెరుపులనూ చూపించాడు 23 ఏళ్ల జురెల్. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో మెరవగా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే లేకుండా సహచరులు జట్టును గెలిపించారు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 ఇలా అరంగేట్రంలో అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయిన ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో మాత్రం అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో మునిగిపోయిన తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 90 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అంతకంటే గొప్ప ఇన్నింగ్సే ఆడాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్(52- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కీలక సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా.. 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా టీమిండియాను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ జురెల్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘రోహిత్ భయ్యా, రాహుల్ సర్.. ఈ కుర్రాడిని నమ్మినందుకు మీకు ధన్యవాదాలు’’ అంటూ వాళ్లిద్దరు తన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు పంచుకున్నాడు. కాగా ధ్రువ్ జురెల్ తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. Thank you Rohit bhaiya, Rahul sir for believing in this boy 🙏🇮🇳❤️ pic.twitter.com/pBlojvB10p — Dhruv Jurel (@dhruvjurel21) February 26, 2024 కొడుకును కూడా తనలాగే సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్ మాత్రం క్రికెట్‌పై మక్కువతో అనేక కష్టనష్టాలకోర్చి టీమిండియా తరఫున ఆడే స్థాయికి చేరుకున్నాడు. చదవండి: #Sarfaraz Khan: గోల్డెన్ డకౌట్.. అయినా సర్ఫరాజ్ అలా!.. -
#IndvsEng: కష్టపడాల్సి వచ్చింది.. అతడు అత్యద్భుతం: రోహిత్ శర్మ
India vs England, 4th Test- Rohit Sharma Comments After Series Win: భారత గడ్డపై కూడా తగ్గేదేలేదు అంటూ దూకుడు ప్రదర్శించాలనుకున్న ఇంగ్లండ్‌కు టీమిండియా కళ్లెం వేసింది. ఉపఖండంలో ఇలాంటి పప్పులు ఉడకవంటూ ‘బజ్‌బాల్’ పగిలేలా వరుస విజయాలతో మోత మోగించింది. నాలుగో మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలోనే ఫలితం తేల్చి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఆరంభ మ్యాచ్‌లో తడ‘బ్యా’టుకు గురైనా.. హ్యాట్రిక్ విజయాలతో సొంతగడ్డపై ఆధిపత్యాన్ని చాటుకుంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లు లేకపోయినా కుర్రాళ్లు ఆ లోటును తీర్చి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా బ్యాటర్లు ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తమదైన ముద్ర వేయగలిగారు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లే అధికంగా ఉన్న జట్టుతో ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ సిరీస్ ఆసాంతం గెలుపు కోసం మేము ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అయినా.. నాలుగో టెస్టులోనే సిరీస్ ఫలితం తేల్చగలిగాం. కుర్రాళ్ల ఆట తీరు పట్ల నాకు గర్వంగా ఉంది. మేము సాధించిన విజయాల పట్ల చాలా చాలా సంతోషంగా ఉన్నాను. స్థానిక, దేశవాళీ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లు ఇక్కడ ఇలాంటి అద్భుతాలు చేయగలరో చూపించారు టెస్టు క్రికెట్లో రాణించాలంటే కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీళ్లు అవన్నీ దాటుకుని ఇక్కడి దాకా వచ్చి తమను తాము నిరూపించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత పరిణతితో ఆడాడు. కూల్‌గా, కామ్‌గా తన పని పూర్తి చేశాడు’’ అని రోహిత్ శర్మ.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇది సమిష్టి విజయమని.. కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనా ఇలాంటి గెలుపు రుచి చూడటం ఎంతో ఆనందంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. డ్రెస్సింగ్‌రూం వాతావరణం బాగానే ఉన్నా.. బయట తమ జట్టు గురించి వచ్చే వార్తలు, చేసే వ్యాఖ్యలు కుర్రాళ్లపై కాస్త ఒత్తిడి పెంచాయని తెలిపాడు. అయితే, ఒత్తిడిని జయించి అద్బుత ప్రదర్శనలతో వారు తమను నిరూపించుక్ను తీరు అమోఘమని రోహిత్ శర్మ ఈ సందర్భంగా కొనియాడాడు. ఆఖరి టెస్టులోనూ గెలుపొంది 4-1తో ట్రోఫీని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మార్చి 7 నుంచి నామమాత్రపు ఐదో టెస్టు జరుగనుంది. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 -
టీమిండియా సరికొత్త చరిత్ర.. 11 ఏళ్ల తర్వాత!
స్వదేశంలో ఇంగ్లండ్‌ను మరోసారి భారత్ మట్టికరిపించింది. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. రాంఛీ టెస్టులో 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. అయితే 40/0 ఓవర్ నైట్ స్కోర్ నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఉచ్చులో చిక్కుకున్న భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన క్రమంలో భారత జట్టును యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(52), ధ్రువ్ జురెల్(39) అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 72 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. వీరిద్దరితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(55) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ.. కాగా టెస్టుల్లో భారత గడ్డపై 150 పైగా పరుగుల లక్ష్యాన్ని టీమిండియా విజయవంతంగా చేధించడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారత జట్టు చివరగా 2013లో ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 150 ప్లస్ టార్గెట్‌ను ఛేదించింది. తాజా విజయంతో చెత్త రికార్డును భారత్ చెరిపేసింది. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్టు స్కోర్లు ఇంగ్లండ్ - 353 & 145 ఇండియా- 307 & 192/5 ఫలితం- ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ధ్రువ్ జురెల్ -
#Ind vs Eng: టీమిండియాదే సిరీస్.. రసవత్తర మ్యాచ్‌లో ఆ ఇద్దరు ‘హీరోల’ వల్లే!
India vs England, 4th Test- India Beat England By 5 Wickets: రసవత్తరంగా సాగిన రాంచి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. గిల్, జురెల్ హీరోచిత ఇన్నింగ్స్ వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అద్భుత అజేయ అర్ధ శతకం(52)తో మెరవగా.. ధ్రువ్ జురెల్(39 నాటౌట్) మరో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయాలకు చేర్చాడు. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది భారత్. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ తొలి టెస్టులో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఆ మరుసటి మ్యాచ్‌లోనే తిరిగి పుంజుకున్న టీమిండియా.. వరుసగా విజయాలు సాధించింది. విశాఖపట్నం తర్వాత రాజ్‌కోట్.. తాజాగా రాంచి టెస్టులో గెలుపొంది ఇంగ్లండ్‌పై ఆధిపత్యాన్ని చాటుకుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, మిడిలార్డర్లో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ లేకున్నా యువ ఆటగాళ్లతోనే సిరీస్ గెలిచి సత్తా చాటింది రోహిత్ సేన. రాంచి టెస్టు రసవత్తరంగా సాగిందిలా.. రాంచి వేదికగా శుక్రవారం ఇంగ్లండ్‌తో మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. తొలిరోజు ఆట ఆరంభంలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ వరుసగా వికెట్లు పడగొట్టడంతో మొదటి సెషన్లో పైచేయి సాధించింది. ఆ తర్వాత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలా ఓ చెయ్యి వేయగా.. 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను జో రూట్ అజేయ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల చేసి పైచేయి సాధించింది. జురెల్ ‘జువెల్’ ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో భాగంగా ఇంకో 51 పరుగులు జతచేసి.. 353 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 2 పరుగులకే అవుట్ కాగా.. రజత్ పాటిదార్ (17), రవీంద్ర జడేజా(12), సర్ఫరాజ్ ఖాన్(14) విఫలమయ్యారు. వన్‌డౌన్‌బ్యాటర్ శుబ్‌మన్ గిల్(38) ఫర్వాలేదనపించాడు. అయితే, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో జట్టును ఆదుకోగా.. మూడో రోజు ఆటలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అదరగొట్టాడు. వికెట్లు పడుతున్నా కుల్దీప్ యాదవ్(28) సహకారంతో పట్టుదలగా నిలబడి 90 పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఆదివారం నాటి ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు పూర్తి చేయగలిగింది. అశూ దెబ్బకు ఇంగ్లండ్ కుదేలు ఇక అదే రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. 145 పరుగులకే ఆలౌట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. అయితే, నాలుగో రోజు ఆరంభంలోనే సీన్ రివర్స్ అయింది. ఇంగ్లండ్ పేసర్ యశస్వి జైస్వాల్(37)ను పెవిలియన్‌కు పంపగా.. స్పిన్నర్ టామ్ హార్లే రోహిత్ శర్మ(55)ను అవుట్ చేశాడు. బషీర్ భయపెట్టాడు.. గిల్, జురెల్ పూర్తి చేశారు ఇక రోహిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్‌ను యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. అతడి స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్‌నూ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఇలా షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న టీమిండియాను వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కలిసి గట్టెక్కించారు. ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి టీమిండియాను గెలిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో గిల్ అర్ధ శతకం(52), జురెల్ 39 పరుగులతో అజేయంగా నిలిచి హీరోలయ్యారు. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్టు స్కోర్లు ఇంగ్లండ్ - 353 & 145 ఇండియా- 307 & 192/5 ఫలితం- ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ధ్రువ్ జురెల్ -
నా సహోదరుడా.. అంటూ రింకూ సింగ్ భావోద్వేగం
India vs England, 4th Test- Rinku Singh's Emotional Post: టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. దురదృష్టవశాత్తూ సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయితేనేం.. అతడు సాధించిన ఆ 90 పరుగులు భారత ఇన్నింగ్స్‌లో అత్యంత ముఖ్యమైనవి. టీమిండియా 307 పరుగులు మార్కును అందుకుందంటే అందుకు జురెలే కారణం. ముఖ్యంగా మూడో రోజు ఆటలో భాగంగా కుల్దీప్ యాదవ్(28)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 విలువైన పరుగులు జోడించిన తీరు అద్భుతం. అలా తొలి ఇన్నింగ్స్‌లో 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ జురెల్.. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్.. జురెల్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాశాడు. జురెల్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘నా సహోదరుడా... కలలు నిజమయ్యే తరుణం ఇది’’ అంటూ సహచర ఆటగాడిపై ప్రేమను కురిపించాడు. కాగా రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్‌కు ఆడతారన్న విషయం తెలిసిందే. అలా పరిచయమైన వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇదిలా ఉంటే.. మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ధ్రువ్ జురెల్ నైపుణ్యాలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు. ఇక ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్.. రాంచి మ్యాచ్‌లో తాను సాధించిన విలువైన అర్ధ శతకాన్ని తన తండ్రికి అంకితమిచ్చాడు. మరోవైపు.. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో అద్బుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న రింకూ సింగ్.. గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. టీ20 ఫార్మాట్లో నయా ఫినిషర్‌గా అవతరించిన ఈ యూపీ బ్యాటర్.. వన్డేల్లోనూ తనదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు. చదవండి: ఏంటి సర్ఫరాజ్.. హీరో అవ్వాలనుకుంటున్నావా? రోహిత్ సీరియస్! View this post on Instagram A post shared by Rinku 🧿🇮🇳 (@rinkukumar12) -
'అతడేం తప్పు చేశాడు.. ధ్రువ్ జురెల్‌కు తీవ్ర అన్యాయం'
ధ్రువ్ జురెల్.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో మారు మ్రోగుతున్న పేరు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ జురెల్.. ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో జురెల్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అయితే మరో ఎంఎస్ ధోని దొరికాడంటూ దృవ్ను కొనియాడాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ విరోచిత పోరాటం కనబరిచాడు. టీమిండియా 307 పరుగుల మెరుగైన స్కోర్ చేయడంలో జురెల్ ముఖ్య పాత్ర పోషించాడు. లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవ శాత్తూ జురెల్ తన తొలి అంతర్జాతీయ సెంచరీని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో జురెల్‌ను భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు. జురెల్‌కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయని సెహ్వాగ్ కొనియాడు. అయితే ధ్రువ్ ఇన్నింగ్స్‌కు మీడియాలో సరైన గుర్తింపు లభించలేదని, తీవ్ర అన్యాయం జరిగిందని వీరూ ఆరోపించాడు. "ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో ఉన్న జట్టును అదుకున్నాడు. కానీ మీడియాలో ధ్రువ్ ఇన్నింగ్స్‌కు అంత హైప్ దక్కలేదు. కనీసం ఆ చర్చే లేదు. ఏదేమైనప్పటికీ చాలా బాగా ఆడావు. ధ్రువ్‌కు శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. కాగా సానుకూలంగా స్పందిస్తున్నారు. అవున్ సర్ మీరు చెప్పిందే నిజమే అంటూ కామెట్లు చేస్తున్నారు. ఆ తర్వాత మొదటి పోస్ట్‌కు వివరణ ఇస్తూ సెహ్వాగ్ మరో ట్వీట్ చేశాడు. "ఎవరినీ కించపరచాలి లేదా అవమానించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆటగాళ్ల ప్రదర్శనపై సమానమైన హైప్ ఉండాలి. ఈ మ్యాచ్‌లో ఆకాష్ దీప్ వంటి డెబ్యూ బౌలర్ సంచలన ప్రదర్శన చేశాడు. కానీ అతడికి కూడా అంత ఆదరణ దక్కలేదు. ధ్రువ్ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ ట్వీట్(ఎక్స్) చేశాడు. -
'అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో ధోని దొరికేశాడు'
రాంఛీ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఆటగాడు ధృవ్ జురెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. క్లిష్ట పరిస్ధితుల్లో తన విరోచిత పోరాటంతో జట్టును దృవ్ అదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గించాడు. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగుల మెరుగైన స్కోర్ చేయడంలో దృవ్ది కీలక పాత్ర. ఈ క్రమంలో ధృవ్ జురెల్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో జురెల్‌ను లిటిల్ మాస్టర్ పోల్చాడు. "ధృవ్ జురెల్ ఒక అద్బుతమైన ఆటగాడు. అతడి ఏకాగ్రత, అంకిత భావం చూస్తుంటే మరో ఎంఎస్ ధోని అవుతాడని నాకు అన్పిస్తోంది. ఈ మ్యాచ్‌లో జురెల్ తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ ఇదే ఏకగ్రాతతో ఆడితే భవిష్యత్తులో ఎన్నో సెంచరీలు సాధిస్తాడని" స్పోర్ట్స్ 18లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సన్నీ పేర్కొన్నాడు. కాగా ఓవరాల్‌గా 149 బంతులు ఆడిన ధ్రువ్ రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేశాడు. సెంచరీ చేయడం ఖాయం అనుకునే దశలో టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిదో వికెట్‌కు కుల్దీప్ యాదవ్‌తో కలిసి ధ్రువ్ 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇక రాంఛీ టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది.192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(24), యశస్వీ జైశ్వాల్ ఉన్నారు. చదవండి: IND vs ENG: ఏంటి సర్ఫరాజ్.. హీరో అవ్వాలనుకుంటున్నావా? రోహిత్ సీరియస్! వీడియో వైరల్ -
సొంతమా... సమమా!
అటో...ఇటో... కాదు! స్పిన్ ఎటు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. దీంతో రాంచీ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. మూడో రోజు ఆటలో 13 వికెట్లు రాలితే... ఇందులో 12 స్పిన్ వలలోనే చిక్కాయి. ఈ నేపథ్యంలో భారత్ ముందు ఊరించే 192 పరుగుల లక్ష్యం ఉన్నప్పటికీ... ఇంకా 152 పరుగుల దూరం స్పిన్ టర్న్ దృష్ట్యా భారత్‌కు అంత సులభం కాదు. భారత బ్యాటర్లు స్పిన్‌కు నిలబడితే సిరీస్ 3–1తో మన సొంతమవుతుంది. ఇంగ్లండ్ స్పిన్నర్లు 10 వికెట్లు తీస్తే మాత్రం సిరీస్ 2–2తో సమమవుతుంది. రాంచీ: మూడో రోజు పూర్తిగా స్పిన్ మలుపు తీసుకున్న నాలుగో టెస్టులో భారత్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయిన టీమిండియా... ప్రత్యర్థి రెండో ఇన్నింగ్స్‌ను 150 పరుగుల్లోపే కూల్చేసింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు, సిరీస్ చేజిక్కించుకొనేందుకు 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ (24 బ్యాటింగ్), యశస్వి (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయానికి భారత్ 152 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు ఆట సాగిందిలా... ఓవర్‌నైట్ స్కోరు 219/7తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 103.2 ఓవర్లలో 307 పరుగుల వద్ద ఆలౌటైంది. ధ్రువ్ జురెల్ (149 బంతుల్లో 90; 6 ఫోర్లు, 4 సిక్స్) అద్భుతమైన పోరాటం చేశాడు. ఓవర్‌నైట్ సహచరుడు కుల్దీప్ (131 బంతుల్లో 28; 2 ఫోర్లు)తో ఎనిమిదో వికెట్‌కు 76 పరుగులు జోడించిన జురెల్ తొలి అర్ధసెంచరీ సాధించాడు. వెంటనే జురెల్ సెల్యూట్ చేసి మాజీ సైనికుడు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తన నాన్నకు ఈ అర్ధ సెంచరీ అంకితమిచ్చాడు. 253 స్కోరు వద్ద కుల్దీప్ అవుటైనా... అప్పు డే జట్టు ఆలౌట్ కాలేదు. ఆకాశ్‌దీప్ (9)తో తొమ్మి దో వికెట్‌కు 40 పరుగులు జతచేసి జట్టు స్కోరు 300 దాటాకే జురెల్ అవుటయ్యాడు. మూడో రోజు భారత్ 88 పరుగులు చేస్తే అందులో 68 పరుగులు జురెలే సాధించి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ కూలిందిలా... తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు ఆధిక్యం పొందిన ఇంగ్లండ్ లంచ్ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే తొలి ఓవర్ నుంచే కెపె్టన్ రోహిత్ ఇంగ్లండ్ మెడకు అశ్విన్‌తో స్పిన్ ఉచ్చు బిగించాడు. ఇది ఐదో ఓవర్ నుంచి ఫలితాల్ని ఇవ్వడంతో ఇంగ్లండ్ కుదేలైంది. ఐదో ఓవర్లో అశ్విన్ ఓపెనర్ డకెట్ (15), పోప్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ క్రాలీ (91 బంతుల్లో 60; 7 ఫోర్లు) అశ్విన్, జడేజా, కుల్దీప్ల స్పిన్ త్రయానికి కాసేపు ఎదురునిలిచాడు. కానీ ఈ లోపే రూట్ (11)ను అశ్విన్, అర్ధ శతకం తర్వాత క్రాలీ, స్టోక్స్ (4) వికెట్లను కుల్దీప్ పడేశాడు. జడేజా కూడా బెయిర్ స్టో (30)ను అవుట్ చేయడం ద్వారా 120/6 స్కోరు వద్ద ఇంగ్లండ్ బ్యాటింగ్ బలగమంతా పెవిలియన్‌లో కూర్చుంది. మిగిలిన టెయిలెండర్లలో హార్ట్లీ (7), రాబిన్సన్ (0)లను కుల్దీప్ వెనక్కి పంపగా, అండర్సన్ (0)ను అవుట్ చేసిన అశ్విన్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌కు 145 పరుగుల వద్ద తెరదించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు భారత స్పిన్నర్లకే (అశ్విన్ 5/51; కుల్దీప్ 4/22; జడేజా 1/56) దక్కడం విశేషం. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353; భారత్ తొలి ఇన్నింగ్స్: 307; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) కుల్దీప్ 60; డకెట్ 15; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 0; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 11; బెయిర్స్టోక్ (సి) పటిదార్ (బి) జడేజా 30; స్టోక్స్ (బి) కుల్దీప్ 4; ఫోక్స్ (సి అండ్ బి) అశ్విన్ 17; హార్ట్లీ (సి) సర్ఫరాజ్ (బి) కుల్దీప్ 7; రాబిన్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 0; బషీర్ (నాటౌట్) 1; అండర్సన్ (సి) జురెల్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (53.5 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–19, 2–19, 3–65, 4–110, 5–120, 6–120, 7–133, 8–133, 9–145, 10–145. బౌలింగ్: అశ్విన్ 15.5–0–51–5, జడేజా 20–5–56–1, సిరాజ్ 3–0–16–0, కుల్దీప్ 15–2–22–4. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బ్యాటింగ్) 24; యశస్వి (బ్యాటింగ్) 16; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 40. బౌలింగ్: రూట్ 4–0–17–0, హార్ట్లీ 3–0–22–0, బషీర్ 1–0–1–0. -
పాపం దృవ్.. జస్ట్ సెంచరీ మిస్! అయినా హీరోనే
అరంగేట్ర మ్యాచ్‌లో సత్తాచాటిన టీమిండియా యువ వికెట్ కీపర్ దృవ్ జురల్.. తన రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో దృవ్ జురల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రోహిత్ శర్మ, జడేజా, గిల్ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట జురల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన జురల్ ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. తన విరోచిత పోరాటాన్ని మాత్రం కొనసాగించాడు. లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్‌తో కలిసి భారత జట్టును ఈ యూపీ ఆటగాడు అదుకున్నాడు. కుల్దీప్తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని దృవ్ నెలకొల్పాడు. అయితే జురల్ దురదృష్టవశాత్తూ తృటిలో తన తొలి సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో దృవ్ 90 పరుగులు చేశాడు. సెంచరీకి చేరువలో టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. సెంచరీ చేయకపోయనప్పటికీ తన అద్బుత ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసును ఈ యువ వికెట్ కీపర్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక దృవ్ జురల్ విరోచిత పోరాటం ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగుల మార్క్‌ను దాటింది. మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు భారత్ ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 149 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: PSL 2024: పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్‌లో షాహీన్ -
దృవ్ జురల్ సూపర్ ఇన్నింగ్స్.. 307 పరుగులకు భారత్ ఆలౌట్
రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. 219/7 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా 88 పరుగులు జోడించి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక భారత బ్యాటర్లలో దృవ్ జురల్ అద్బుతమైన పోరాట పటిమను కనబరిచాడు. తృటిలో తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని జురల్ కోల్పోయాడు. 149 బంతులు ఎదుర్కొన్న జురల్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు జైశ్వాల్(73), కుల్దీప్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు టామ్ హార్ట్లీ 3 వికెట్లు, జేమ్స్ ఆండర్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. కాగా అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలలో వెటరన్ ఆటగాడు జో రూట్(122) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తాచాటగా.. ఆకాష్ దీప్ 3 వికెట్లు, సిరాజ్ రెండు, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: IND vs ENG: మీకు రూట్ ఉంటే.. మాకు కుల్దీప్ సార్ ఉన్నారు! అంతేగా? -
Day 2: చెలరేగిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. ఆదుకున్న జైస్వాల్
India vs England, 4th Test Day 2 Score: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలిరోజు ఆటలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో చెలరేగగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అయితే, జో రూట్ రాకతో సీన్ మారిపోయింది. ‘బజ్‌బాల్’ కాన్సెప్ట్నకుకు విరుద్ధంగా అచ్చమైన సంప్రదాయ క్రికెట్ ఆడుతూ రూట్ అజేయ సెంచరీతో చెలరేగిన కారణంగా.. తొలి రోజు ఇంగ్లండ్ తిరిగి పుంజుకోగలిగింది. ఆట పూర్తయ్యే సరికి 300 పరుగుల మార్కు దాటేసింది.ఈ క్రమంలో 302/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవరాల్‌గా భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. 𝙅𝙖𝙖𝙙𝙪𝙞 𝙅𝙖𝙙𝙙𝙪 weaving magic with the ball 🪄 Three quick wickets helped #TeamIndia bowl out the visitors early! 💪🏻#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/iiWyPgAn4C — JioCinema (@JioCinema) February 24, 2024 ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సర్ ఆదిలోనే షాకిచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మను 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత యువ బౌలర్ షోయబ్ బషీర్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. పాక్ మూలాలున్న ఈ రైటార్మ్ స్పిన్నర్ దెబ్బకు శుబ్‌మన్ గిల్(38), రజత్ పాటిదార్(17) లెగ్ బిఫోర్ వికెట్లుగా వెనుదిరిగారు. ఇక జట్టును ఆదుకుంటాడనుకున్న రవీంద్ర జడేజా(12)ను కూడా బషీరే పెవిలియన్‌కు పంపడం గమనార్హం. Bashir breaks the crucial partnership between Gill and Jaiswal! 🥲 #INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/hCKcWdJq5A — JioCinema (@JioCinema) February 24, 2024 ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకుని దానిని సెంచరీగా మలిచే ప్రయత్నం చేయగా.. బషీర్ అద్బుత రీతిలో అతడి బౌల్డ్ చేశాడు. దీంతో 73 పరుగులకే జైస్వాల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 ఇక సర్ఫరాజ్ ఖాన్(14), రవిచంద్రన్ అశ్విన్(1)లను మరో స్పిన్నర్ టామ్ హార్లే పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఈ క్రమంలో జైస్వాల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, అశూ స్థానంలో వచ్చిన కుల్దీప్ యాదవ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట ముగిసే టీమిండియా 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుబడి ఉంది. చేతిలో ఇంకా మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఆట పూర్తయ్యే సరికి జురెల్ 30, కుల్దీప్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ టీమిండియాపై పైచేయి సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. చదవండి: బంతితో చెలరేగిన బషీర్.. అంతకంటే ముందు సర్ఫరాజ్‌కు షాకిచ్చాడిలా! Kuldeep Yadav spinning surprises with both bat & ball! 🤩#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSport pic.twitter.com/D7hDjNf04x — JioCinema (@JioCinema) February 24, 2024 -
పంత్ వారసుడు దొరికేశాడు.. అరంగేట్రంలోనే అదుర్స్!?
ప్రస్తుతం తరంలో భారత టెస్టు వికెట్ కీపర్ బ్యాటర్లంటే మనకు టక్కున గుర్తు వచ్చేది డాషింగ్ ఆటగాడు రిషబ్ పంత్‌నే. ఒంటి చేత్తో భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. ప్రత్యర్ధి బౌలర్ ఎంత మొనగాడైనా ఊచకోత కోయడమే అతడి నైజం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై మూడు చెరువుల నీరు తాగించిన ఘనత ఈ ఢిల్లీ చిచ్చర పిడుగుది. కానీ ఇదంతా 2022 ఏడాదికి ముందు. ఆ తర్వాత కథ వేరు. 2022 ఏడాదిలో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత పంత్ మెరుపులను టీమిండియా మిస్స్ అయ్యింది. ఎంతమంది వికెట్ల కీపర్లను మార్చినా అతడి లోటును ఎవరూ తీర్చలేకపోయారు. పంత్ రీ ఎంట్రీ వెయ్యికళ్లుతో ఎదురుచూస్తున్న తరుణంలో అతడినే మైమరిపించేలా ఒక యువ సంచలనం ఎంట్రీ ఇచ్చాడు. అతడే ఉత్తర్ ప్రదేశ్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్ అరంగేట్రంలోనే అదుర్స్.. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో 23 ఏళ్ల దృవ్ జురల్ అడుగుపెట్టాడు. తన కంటే సీనియర్ అయిన శ్రీకర్ భరత్‌ను కాదని జురల్‌కు మేనెజ్మెంట్ అవకాశమిచ్చింది. మేనెజ్మెంట్ నమ్మకాన్ని దృవ్ వమ్ముచేయలేదు. తన అరంగేట్ర మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో 46 పరుగులు చేసిన ఈ యూపీ ఆటగాడు. వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అందరిని మంత్రముగ్ధులను చేశాడు. ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ సెంచరీ హీరో బెన్ డకెట్‌ను దృవ్ రనౌట్ చేసిన విధానం కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. అదే విధంగా కుల్దీప్, అశ్విన్, జడ్డూ వంటి వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ల బౌలింగ్‌ను వికెట్ల వెనుక అతడు ఎదుర్కొన్న విధానం అద్బుతం. ఈ క్రమంలో రిషబ్ పంత్ వారసుడు దొరికేశాని అభిమానులు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. పంత్ ప్రస్తుతం శరవేగంతో కోలుకుంటున్నప్పటికీ భారత జట్టులోకి రీ ఎంట్రీకి మరి కొంత సమయం పడుతుంది. ఒక వేళ వచ్చినా గానీ వికెట్ కీపింగ్ చేయగలడన్నది అనుమానమే. భరత్ కథ ముగిసినట్లేనా..? శ్రీకర్ భరత్.. రిషబ్ పంత్ వారసుడిగా భారత టెస్టుక్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఎన్నో అంచనాలతో జట్టులోకి వచ్చిన ఇప్పటివరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరుసగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఈ ఆంధ్ర ఆటగాడు విఫలమయ్యాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భరత్‌కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్‌లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ క్రమంలో జురల్ తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టడంతో భరత్‌కు ఇకపై జట్టులో చోటు కష్టమేనని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఈ పిల్లలు ఉన్నారే.. వారెవ్వా!.. ఎవ్వరూ తగ్గేదేలే!
ఒకరు డబుల్ సెంచరీతో చెలరేగితే.. మరొకరు ధనాధన్ ఇన్నింగ్స్‌తో.. ఇంకొకరేమో అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో అదరగొట్టారు. జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించి అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ ముగ్గురు మరెవరో కాదు టీమిండియా యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్. 22 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ యశస్వి ఇప్పటికే భారత టెస్టు జట్టు ఓపెనర్‌గా పాతుకుపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో భాగంగా వైజాగ్ టెస్టులో ద్విశతకం బాదిన ఈ ముంబై బ్యాటర్.. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి 214 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు రాజ్‌కోట్ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 48 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన ఈ 26 ఏళ్ల రైట్‌హ్యాండర్.. 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 68 పరుగులతో అజేయంగా నిలిచాడు సర్ఫరాజ్ ఖాన్. మరో ఎండ్‌లో ఉన్న యశస్విని ఆద్యంతం ప్రోత్సహిస్తూ.. అతడు ద్విశతకం పూర్తి చేసుకోగానే తానే ఆ ఇన్నింగ్స్ ఆడినంత సంబరంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇన్నింగ్స్ డిక్లరేషన్ తర్వాత యశస్విని ముందుండి నడవమంటూ డ్రెసింగ్‌రూం వైపు దారి చూపాడు. ఇక 23 ఏళ్ల ధ్రువ్ జురెల్ సైతం ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేశాడు. కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్‌గా స్థానం దక్కించుకున్న అతడు.. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఈ యూపీ ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే, అద్భుత రనౌట్ చేసి సత్తా చాటాడు. ఇంగ్లండ్ డేంజరస్ బ్యాటర్ బెన్ డకెట్‌ను పెవిలియన్‌కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఈ ముగ్గురు టీమిండియా చారిత్రాత్మక విజయంలో తమ వంతు భూమిక పోషించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ తరం పిల్లలు ఉన్నారే’’ అంటూ ప్రశంసలు కురిపిస్తూ.. ఒకే ఫ్రేములో ముగ్గురూ కనిపించేలా ఉన్న ఫొటోను హిట్‌మ్యాన్ ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. చప్పట్లు కొడుతున్న ఎమోజీని ఇందుకు జతచేశాడు రోహిత్ శర్మ. కాగా మూడో టెస్టులో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజ వేసింది. తదుపరి.. రాంచి వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లండ్‌తో మొదలుకానున్న నాలుగో టెస్టుకు సన్నద్ధం కానుంది. -
రెప్పపాటులో జరిగిన అద్భుతం.. జురెల్ స్కిల్ చూడాల్సిందే!
India Wicket-Keeper Dhruv Jurel Inflicts Stunning Run-Out: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమి గాయాలను చెరిపేసేలా టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి విశాఖపట్నంలో బదులు తీర్చుకున్న రోహిత్ సేన.. రాజ్‌కోట్‌లో చారిత్రాత్మక గెలుపుతో అభిమానులను ఖుషీ చేసింది. ఇంగ్లండ్‌ను ఏకంగా 434 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత టెస్టు చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(214)కు తోడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(5 వికెట్లు) బంతితో మాయాజాలం చేయడంతో ఈ గెలుపు సాధ్యమైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా భారత్ తరఫున ఇద్దరు యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వరుస అర్ధ శతకాలతో(62, 68) సత్తా చాటితే.. ఉత్తరప్రదేశ్ క్రికెటర్ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్(తొలి ఇన్నింగ్స్‌లో- 46), వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకర బ్యాటర్, ఓపెనర్ బెన్ డకెట్(4)ను రనౌట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను గట్టెక్కించాలని కంకణం కట్టుకున్న డకెట్.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6.1వ ఓవర్లో) బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించగా.. మహ్మద్ సిరాజ్ బాల్‌ను ఆపాడు. Super Jurel 🦸♂️ with some 🔝glove-work 🔥👌#IDFCFirstBankTestSeries #INDvENG #BazBowled #JioCinemaSports pic.twitter.com/dTlzQZXKAn — JioCinema (@JioCinema) February 18, 2024 ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న జాక్ క్రాలే పరుగుకు నిరాకరించగా.. డకెట్ వెంటనే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే సిరాజ్ వేసిన బంతిని అందుకున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మెరుపు వేగంతో స్టంప్‌ను ఎగురగొట్టాడు. రెప్పపాటులో జరిగిన ఈ అద్భుతం కారణంగా డకెట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జురెల్ స్కిల్స్‌కు అద్దం పట్టే వీడియోను అభిమానులు నెట్టింట షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డకెట్ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర శతకం(153)తో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. చదవండి: సర్ఫరాజ్ ఒక్కడేనా.. ఈ ‘వజ్రాన్ని’ చూడండి! (ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి) -
#Dhruv Jurel: ‘తోపు బౌలర్ అయితే.. నాకేంటి?’.. వీడియో
India vs England, 3rd Test- #Dhruv Jurel: రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురెల్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా భారత తుదిజట్టులో స్థానం సంపాదించిన అతడు.. ఎనిమిదో స్థానంలో ఆడాడు. రెండోరోజు ఆటలో భాగంగా శుక్రవారం కుల్దీప్ యాదవ్ అవుటైన తర్వాత.. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు జురెల్. వెంటనే రవీంద్ర జడేజా(112) వికెట్ కూడా పడటంతో రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి రాగా అతడితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. సింగిల్‌తో ఖాతా తెరిచి.. సిక్సర్‌తో సత్తా చాటి ఈ క్రమంలో కాస్త డిఫెన్సివ్‌గా ఆడిన ధ్రువ్ జురెల్.. తాను ఎదుర్కొన్న పదకొండో బంతికి పరుగుల ఖాతా తెరిచాడు. తొలుత రెండు సింగిల్స్ తీసిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. ఆ తర్వాత ఆడిన షాట్ తొలి సెషన్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ మార్క్ వుడ్ గంటకు 146 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని.. ధ్రువ్ జురెల్ అద్భుత రీతిలో సిక్సర్‌గా మలిచాడు. ఆఫ్ స్టంప్‌నకు ఆవల పడిన బంతిని ర్యాంప్ షాట్‌తో స్టాండ్స్‌కు తరలించాడు. తోపు బౌలర్ అయితే నాకేంటి? ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. బౌన్సర్లు వేయడంలో దిట్ట అయిన మార్క్ వుడ్ బౌలింగ్‌లో స్టార్ బ్యాటర్లు సైతం షాట్లు ఆడేందుకు వెనుకాడితే.. జురెల్ మాత్రం ..‘‘నువ్వు ఎంత తోపు బౌలర్ అయినా.. నేను సరైన రీతిలో షాట్ కొడితే సిక్సరే’’ అన్నట్లు అదరగొట్టాడంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా మూడో టెస్టులో మొత్తంగా 104 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ జురెల్ 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. అరంగేట్ర హాఫ్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా జురెల్‌తో పాటు అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 62 రన్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అర్థ శతకం బాదిన విషయం తెలిసిందే. కాగా రాజ్‌కోట్ టెస్టులో రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(112) సెంచరీలు.. సర్ఫరాజ్ హాఫ్ సెంచరీలు.. జురెల్(46), అశ్విన్(37) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగులు చేసింది. చదవండి: Dhruv Jurel Life Story In Telugu: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! Nerveless Jurel 🥶#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/nYn053BM5I — JioCinema (@JioCinema) February 16, 2024 -
కొంపముంచిన జడ్డూ, అశూ.. టీమిండియాకు షాక్! రోహిత్ రియాక్షన్
India vs England, 3rd Test Day 2: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత బ్యాటర్లు ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంగా అంపైర్ ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. కాగా రాజ్‌కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రెండో రోజు ఆట మొదలైంది. 326/5 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన భారత్ ఆదిలోనే కుల్దీప్ యాదవ్(4) రవీంద్ర జడేజా(112) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్ ఆచితూచి ఆడుతూ మెరుగైన భాగస్వామ్యం నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్ 102వ ఓవర్లో ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ వేసిన బంతిని అశ్విన్ అవుట్ సైడ్ ఆఫ్ దిశగా షాట్ ఆడి.. పరుగు తీద్దామని భావించాడు. ఇంగ్లండ్‌కు ఐదు పరుగులు అయితే, జురెల్ అతడిని వెనక్కి వెళ్లమని సైగ చేశాడు. ఇంతలో ఫీల్డ్ అంపైర్ టీమిండియాకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ.. ఇంగ్లండ్‌కు 5 రన్స్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అశ్విన్ పిచ్ మధ్య భాగం(ప్రొటెక్టడ్) గుండా పరిగెత్తేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణం. కారణం ఇదే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ రూల్స్ ప్రకారం.. ‘‘ఉద్దేశపూర్వకంగా లేదంటే అనుకోకుండానైనా సరే పిచ్ పాడయ్యేలా ఆటగాడు వ్యవహరించడం తప్పు. ప్రొటెక్టడ్ ఏరియాలోకి స్ట్రైకర్ గనుక ప్రవేశిస్తే వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించాలి. పిచ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితే గనుక వస్తే అంపైర్ వెంటనే జోక్యం చేసుకుని అతడు/ఆమెను కారణం చెప్పకుండానే బయటకు పంపే వీలు ఉంటుంది. ఎంసీసీ నిబంధన 41.15 ప్రకారం.. తొలిసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడితే బ్యాటర్లను అంపైర్ హెచ్చరిస్తాడు. ఇదే మొదటి.. చివరి తప్పిదం కావాలి. ఇన్నింగ్స్ మొత్తానికి ఒక్కసారి మాత్రమే మినహాయింపు ఉంటుంది. తొలుత జడ్డూ.. ఇప్పుడు అశూ రెండోసారి కూడా ఇలాంటి చర్యకు పాల్పడితే పెనాల్టీ విధిస్తారు. కాగా టీమిండియా రాజ్‌కోట్ టెస్టులో ఇలాంటి చర్యకు పాల్పడటం ఇది రెండోసారి. మొదటిరోజు ఆటలో రవీంద్ర జడేజా కూడా ఇలాగే పిచ్ సురక్షిత భాగంలోకి వచ్చాడు. తాజాగా అశ్విన్ కూడా ఇదే తప్పు పునరావృతం చేయడంతో అంపైర్ 5 పరుగుల పెనాల్టీ విధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌ను 5/0తో మొదలుపెట్టనుంది. కాగా అంపైర్ తనను మధ్యలోనే వెళ్లిపొమ్మని చెప్పగా అశూ(37) అతడితో వాగ్వాదానికి దిగేందుకు సిద్ధం కాగా.. మరో ఎండ్‌లో ఉన్న ధ్రువ్ జురెల్ వచ్చి అతడిని సముదాయించాడు. ఇక ఇదంతా చూస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. నిరాశగా చూస్తూ ఇచ్చిన రియాక్షన్ హైలైట్‌గా నిలిచింది. Ravi Ashwin got a warning for running down in the middle of the pitch, which resulted in five penalty runs for India. England will start with 5/0 This was the second warning for Team India. 📸: Jio Cinema pic.twitter.com/79hwNciyKA — CricTracker (@Cricketracker) February 16, 2024 చదవండి: Ind Vs Eng: ఎంత పని చేశావు జడ్డూ! పాపం సర్ఫరాజ్.. రోహిత్ శర్మ ఆగ్రహం -
#Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం
Ind vs Eng 3rd Test- Sarfaraz Khan Debut- Beautiful moment: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలని ఆశగా ఎదురుచూస్తున్న అతడి నిరీక్షణకు గురువారం(ఫిబ్రవరి 15) తెరపడింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ భారత తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో తండ్రి నౌషధ్ ఖాన్, సర్ఫరాజ్ భార్య రొమానా జహూర్ అతడి పక్కనే ఉన్నారు. ఈ క్రమంలో తన క్యాప్‌ను తండ్రికి చూపించగా.. అతడు దానిని ఆప్యాయంగా ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. వెంటనే సర్ఫరాజ్ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఇక రొమానా సైతం కంటతడి పెట్టగా.. సర్ఫరాజ్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్నాదమ్ముళిద్దరూ క్రికెటర్లే మహారాష్ట్రలో 1997లో జన్మించిన సర్ఫరాజ్ ఖాన్ క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తండ్రి నౌషద్ ఖాన్‌ది కీలక పాత్ర. సర్ఫరాజ్‌తో పాటు అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా క్రికెటరే. ఇటీవలే అతడు అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆడాడు. యువ భారత్ ఫైనల్ చేరుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అందుకే ఆలస్యం! ఇక సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో ముఖ్యంగా రంజీల్లో అద్భుతంగా రాణించినప్పటికీ టీమిండియా ఎంట్రీ ఆలస్యమైంది. అతడి దూకుడు, ఆటిట్యూడ్ కారణంగానే టీమిండియా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనపెట్టారనే వార్తలు వినిపించాయి. అయితే, అభిమానులు మాత్రం ప్రతిభావంతుడైన ఆటగాడికి అన్యాయం జరుగుతోందంటూ అనేక సందర్భాల్లో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రానికి మార్గం సుగమమైంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ద్వారా ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. చదవండి: Dhruv Jurel: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి బంగారు గొలుసు అమ్మి మరీ! From The Huddle! 🔊 A Test cap is special! 🫡 Words of wisdom from Anil Kumble & Dinesh Karthik that Sarfaraz Khan & Dhruv Jurel will remember for a long time 🗣️ 🗣️ You Can Not Miss This! Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @dhruvjurel21 |… pic.twitter.com/mVptzhW1v7 — BCCI (@BCCI) February 15, 2024 -
సర్ఫరాజ్, జురెల్ అరంగేట్రం!
రాజ్‌కోట్: కీలక ఆటగాళ్లు గాయాల పాలవడం... కోహ్లి విశ్రాంతి కొనసాగిస్తుండటం... యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లకు వరంగా మారనుంది. మూడో టెస్టులో వీరిద్దరు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో వీరిద్దరు మాత్రం గంటల తరబడి చెమటోడ్చడం చూస్తుంటే వారి అరంగేట్రానికి సూచనగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ వారి ప్రాక్టీస్‌ను దగ్గరుండి పరిశీలించాడు. శ్రేయస్ అయ్యర్‌ను మిగతా మూడు టెస్టుల నుంచి తప్పించగా, ఎంపిక చేసిన కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతనూ రాజ్‌కోట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇవన్నీ కూడా సర్ఫరాజ్, జురెల్‌లకు రాచబాటను పరిచింది. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ వరుసగా విఫలమవడం కీపర్ జురెల్‌కు కలిసి రానుంది. గత మ్యాచ్ ఆడిన రజత్ పటిదార్‌తోపాటు సర్ఫరాజ్, జురెల్ మిడిలార్డర్లో బరిలోకి దిగుతారు. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ ప్రాక్టీస్ చేయలేదు. అతని కుడిచేతి చూపుడు వేలు నొప్పి కారణంగా ట్రెయినింగ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే అతని గాయం ఏమాత్రం తీవ్రమైంది కాదని జట్టు వర్గాలు వెల్లడించాయి. ఆల్‌రౌండర్ జడేజా స్పిన్ బౌలింగ్ కంటే బ్యాటింగ్ ప్రాక్టీసే ఎక్కువ చేశాడు. పేసర్లు బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు బౌలింగ్‌లో శ్రమించారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు జరుగుతుంది. -
Ind vs Eng 3rd Test: భరత్‌నే ఆడించండి.. అతడు వద్దు!
India vs England, 3rd Test: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో శ్రీకర్ భరత్‌నే టీమిండియా వికెట్ కీపర్‌గా కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. బ్యాటింగ్ విషయాన్ని పక్కనపెడితే.. కీపర్‌గా భరత్ రాణిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తుచేశాడు. పిచ్‌లు కఠినంగా ఉన్న కారణంగానే కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా కాకుండా బ్యాటర్‌గా ఆడిస్తున్నారన్న ఆకాశ్ చోప్రా.. కాబట్టి భరత్ బ్యాటింగ్ వైఫల్యాన్ని భూతద్దంతో చూడద్దని విజ్ఞప్తి చేశాడు. కాగా సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించడంతో మరోసారి ఆంధ్ర క్రికెటర్ టీమిండియాలో భాగమయ్యాడు. ప్రొటిస్‌తో టెస్టుల తర్వాత ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఆడుతున్న సిరీస్‌లోనూ కీపర్‌గా భరత్‌కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో అతడు 69 పరుగులు చేశాడు. అయితే, సొంతమైదానం విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం భరత్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 23 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ధ్రువ్ జురెల్ అరంగేట్రానికి మేనేజ్మెంట్ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. భరత్ స్థానంలో వికెట్ కీపర్‌గా అతడికి ఛాన్స్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాత్రం భరత్‌నే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ధ్రువ్ జురెల్ అరంగేట్రం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నా అభిప్రాయం ప్రకారం.. భరత్‌నే కొనసాగించడం మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది రెండే టెస్టులు. అతడు వికెట్ కీపింగ్ బాగానే చేస్తున్నాడు. కానీ అందరూ అతడి బ్యాటింగ్ వైఫల్యాన్నే ఎత్తి చూపుతున్నారు. పిచ్‌లు కఠినంగా ఉంటాయనే కారణంగానే రాహుల్‌ను ప్యూర్ బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దించారు కదా. మరి భరత్‌ను స్పెషలిస్టు కీపర్‌గానే చూడాలి కదా. హైదరాబాద్ టెస్టులో అతడు బ్యాటింగ్ కూడా బాగానే చేశాడు. అయినా కూడా.. బ్యాటర్‌గానే అతడి సేవలు కావాలనుకుంటే.. కనీసం మరొక్క మ్యాచ్‌లోనైనా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడే తొందరపడకూడదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. భరత్‌పై వేటు! సర్ఫరాజ్, దృవ్ అరంగేట్రం?
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు పర్యాటక జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈమ్యాచ్‌లో గెలిచి సిరీస ఆధిక్యాన్ని పెంచుకోవాలని రోహిత్ సేన భావిస్తుంటే.. మరోవైపు ఇంగ్లండ్ సైతం తమ ఆస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే భారత జట్టు రాజ్‌కోట్‌కు చేరుకోగా.. దుబాయ్‌లో ఉన్న ఇంగ్లీష్ జట్టు మంగళవారం రాజ్‌కోట్‌కు రానుంది. అయితే చివరి మూడు టెస్టులకు తాజాగా భారత జట్టును ప్రకటించిన సెలక్టర్లు కొన్ని అనూహ్య మార్పులు చేశారు. శ్రేయస్ అయ్యర్, అవేష్ ఖాన్‌ను జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు.. ఆకాష్ దీప్‌ను తొలిసారి టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. అదే విధంగా రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ మూడో టెస్టుకు అందుబాటులో ఉండేది అనుమానమే. ఈ తుది జట్టు సెలక్షన్‌కు ముందు వారిద్దరూ తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు రెండో టెస్టుకు భారత జట్టులో కలిసిన సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్‌లను ఆఖరి మ్యాచ్‌ల దృవ్, సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం ఇక రాజ్‌కోట్ టెస్టుతో వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్, సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్‌పై వేటు వేసి, దృవ్ జురల్‌ను జట్టులోకి తీసుకోవాలని మేన్‌జ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. తొలి రెండు టెస్టుల్లో భరత్ నిరాశపరిచాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో భరత్.. 41, 28, 17, 6 చేసిన స్కోర్లు ఇవి. ఇప్పటివరకు తన కెరీర్లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భరత్‌కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్‌లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. మరోవైపు వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన రజిత్ పాటిదార్‌ను కూడా పక్కన పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా రెండో టెస్టుకు దూరమైన పేసర్ సిరాజ్ కూడా తుది జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో ముఖేష్ కుమార్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ -
భరత్‌కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు!
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పునరాగమనంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో వికెట్ కీపర్‌గా ప్రస్తుతం కేఎస్ భరత్‌కే మేనేజ్మెంట్ పెద్దపీట వేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఏదేని కారణాల చేత భరత్ జట్టుకు దూరమైతే.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ లేదంటే జగదీశన్ వంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తారని అభిప్రాయపడ్డాడు. అంతేగానీ.. ఇషాన్ కిషన్‌కు మాత్రం రీఎంట్రీ అంత సులువుకాదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. బ్రేక్ తీసుకున్న ఇషాన్ కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంతో సమయం గడుపుతూనే.. వర్కౌట్లతో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో ఇషాన్ కిషన్‌కు విభేదాలు తలెత్తాయన్న వార్తల నడుమ.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే ఇషాన్ తిరిగి జట్టులోకి వస్తాడని పేర్కొన్నాడు. అయితే, రంజీ ట్రోఫీ-2024 రూపంలో అవకాశం ఉన్నా.. ఇషాన్ మాత్రం దానిని పక్కనపెట్టాడు. భరత్‌కు అవకాశం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్వాగతం పలికినా జట్టుతో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇషాన్ తిరిగి వచ్చిన తర్వాత సౌతాఫ్రికాతో టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసిన ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టుల్లోనూ ఆడుతున్నాడు. అయితే, వికెట్ కీపింగ్ పరంగా అతడికి మంచి మార్కులే పడుతున్నా.. బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇషాన్ కిషన్ మేనేజ్మెంట్ను అడిగి మరీ విరామం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. తన బ్రేక్‌ను పొడిగిస్తూనే ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ కనిపించడం లేదు. మానసికంగా అలసిపోయానంటూ అతడు సెలవు తీసుకున్నాడు. తను బాగుండాలని కోరుకుంటున్నా. అయితే, ఇప్పట్లో అతడు నేరుగా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉన్నాడు. అతడి గైర్హాజరీలో ధ్రువ్ జురెల్ లేదంటే.. జగదీశన్ కూడా జట్టులోకి వస్తారేమో కూడా తెలియదు. కానీ.. ఇషాన్ కిషన్‌కు మాత్రం పిలుపునివ్వరు. అతడు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే మళ్లీ జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఆ విషయంలో కోహ్లితో పోల్చవద్దు ఈ సందర్భంగా.. ‘‘విరాట్ కోహ్లి కూడా కాంపిటేటివ్ క్రికెట్ ఆడటం లేదు కదా అంటూ ప్రశ్నలు వేయద్దు. ఎందుకంటే.. కోహ్లి, ఇషాన్‌ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి.. దయచేసి ఇద్దరినీ పోల్చే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ ట్రోల్ చేసే వాళ్లకు చురకలు అంటించాడు ఆకాశ్ చోప్రా. చదవండి: Virat Kohli: అంతా అబద్ధం.. కోహ్లి విషయంలో మాట మార్చిన డివిలియర్స్ -
IND vs ENG: భరత్‌కు బైబై?.. యువ వికెట్ కీపర్ అరంగేట్రం పక్కా!?
వికెట్ కీపింగ్.. టెస్టు క్రికెట్లో టీమిండియాను వేదుస్తున్న ప్రధాన సమస్యలలో ఒకటి. రిషబ్ పంత్ కారు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైనప్పటి నుంచి టీమిండియాలో తన లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. లోయర్డర్లో వచ్చి మెరుపులు మెరిపించే పంత్ స్ధానాన్ని ఇప్పటివరకు ఎవరూ భర్తీ చేయలేకపోయారు. భరత్ అట్టర్ ప్లాప్ రిషబ్ పంత్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్.. వరుసగా విఫలమవుతున్నాడు. వికెట్ కీపింగ్ పరంగా కాస్త పర్వాలేదనప్పిస్తున్నప్పటికీ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవతున్నాడు. కీలక సమయాల్లో బ్యాటింగ్‌కు వస్తున్న భరత్ ఒత్తడిని తట్టుకోలేక త్వరగా పెవిలియన్‌కు చేరుతున్నాడు. ఇటీవలే తన హోం గ్రౌండ్లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులోనూ అదే ఆటతీరును భరత్ కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. కాగా ఇప్పటివరకు తన కెరీర్లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భరత్‌కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్‌లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దృవ్ జురల్ అరంగేట్రం!? అతడి స్ధానంలో యవ వికెట్ కీపర్ దృవ్ జురల్‌కు అవకాశమివ్వాలని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాడు. జురల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లోయార్డర్‌లో వచ్చి బ్యాటింగ్ చేసే సత్తా దృవ్కు ఉంది. జురల్ 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 790 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ -
Ind vs Eng: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ..
Dhruv Jurel Story Mother sold gold chain for cricket kit: తన 23వ పుట్టినరోజు(జనవరి 21)కు సరిగ్గా పది రోజుల ముందు ధ్రువ్ జురెల్ జీవితంలో అద్భుతం చోటుచేసుకుంది. టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేరేందుకు పునాది పడింది. అవును.. పటిష్ట ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై తలపడే భారత జట్టులో తొలిసారిగా అతడికి చోటు దక్కింది. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే టెస్టు జట్టును వీడిన ఇషాన్ కిషన్‌పై వేటు వేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడికి జట్టులో స్థానం ఇచ్చింది. కేఎల్ రాహుల్, కేఎస్ భరత్‌తో పాటు తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్‌గా చోటిచ్చింది. రాహుల్ గాయం, కేఎస్ భరత్ నిలకడలేమి ప్రదర్శన నేపథ్యంలో మూడో టెస్టు ద్వారా ధ్రువ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తండ్రి కార్గిల్ యుద్ధంలో.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధ్రువ్ జురేల్ తండ్రి నీమ్ సింగ్ జురేల్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. తనలాగే కొడుకు కూడా ఆర్మీలో చేరాలి.. అలా కుదరకపోతే.. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తీరాలని ఆయన బలంగా కోరుకున్నారు. అంతేతప్ప స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఏనాడూ ఆశించలేదు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేయమని కుమారుడికి చెప్పనూలేదు. కానీ.. ధ్రువ్ మనసంతా క్రికెట్ మీదే ఉంది. ఇంట్లో నుంచి పారిపోతా అయితే, ఆ మాటను పెదవి దాటించి తండ్రితో చెప్పాలంటే భయం. అయినా.. ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసి.. ‘నాకు క్రికెట్ బ్యాట్ కొనివ్వు నాన్నా’’ అని నోరు తెరిచి అడిగాడు. అప్పటికే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.. పైగా ఆర్మీ కాకుండా ఆటగాడిని అవుతానంటూ కొడుకు చెప్పడం నీమ్ సింగ్‌కు ఎంతమాత్రం నచ్చలేదు. అందుకే వెంటనే నో చెప్పేశారు. ధ్రువ్‌కు మాత్రం క్రికెటర్ కావాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ఇంట్లో పరిస్థితులు చూశాక.. నాన్న మాటలు విన్న తర్వాత ఇంట్లో నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. క్రికెట్ ఆడనివ్వకపోతే దూరంగా వెళ్లిపోతా అని తల్లితో చెప్పాడు. బంగారు గొలుసు అమ్మి క్రికెట్ కిట్ కొని ‘‘అయ్యో.. వీడు అన్నంత పని చేస్తాడేమో’’నన్న భయం ఆ తల్లిని వెంటాడింది. కొడుకును కాపాడుకోవడం.. అతడి కలలను నిజం చేయడం కోసం శ్రమించడం కంటే ఇంకే విషయంలో తనకు సంతోషం దొరుకుతుందని భావించిన ఆమె.. తన బంగారు గొలుసు అమ్మేసి ధ్రువ్ కోసం ఆ డబ్బుతో క్రికెట్ కిట్ కొనిచ్చింది. అమ్మ తన కోసం త్యాగాలు చేయడం చూసిన ఆ చిన్నారి కొడుకు.. ఆట పట్ల మరింత అంకితభావం, నిబద్ధతతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. జూనియర్ క్రికెట్లో ఆగ్రా, ఉత్తరప్రదేశ్ జట్లకు ఆడిన ధ్రువ్ జురెల్.. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు నోయిడా వెళ్లాడు. కొడుకుతో పాటే తానూ మెరుగైన శిక్షణ కోసం నోయిడాకు పయనమయ్యాడు. కానీ ఆగ్రా నుంచి నోయిడా వరకు తరచూ ప్రయాణం చేయడం మానసికంగానూ, శారీరకంగానూ ఇబ్బందికరంగా మారింది. మళ్లీ తానున్నానంటూ ధ్రువ్ తల్లి రంగంలోకి దిగింది. కొడుకు కెరీర్లో ముందుకు వెళ్లేందుకు వీలుగా అతడితో నోయిడాలో నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అలా అలా అంచెలంచెలుగా ఎదిగిన ధ్రువ్ జురెల్ ఇండియ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. తన అద్భుత ప్రదర్శనలతో 2020 అండర్-19 వరల్డ్‌కప్ వైస్ కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. ఆ టోర్నీలో భారత యువ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తండ్రి మనసు కరిగింది ధ్రువ్ పట్టుదల, అంకితభావం చూసి అతడి తండ్రి మనసు కూడా కరిగింది. కొడుకు అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు తన వంతు బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు త్యాగాలు చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అండర్ 19కు ఆడుతున్న సమయంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు నిర్వహించే క్యాంపులకు స్వయంగా కొడుకును తీసువెళ్లేవారు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఎంట్రీ అప్పటికే తన తోటి ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయి, ప్రియం గార్గ్ లాంటి వాళ్లు క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వడం.. తనకు మాత్రం ఇంకా అవకాశం రాకపోవడంతో డీలా పడ్డ ధ్రువ్‌కు నైతిక మద్దతునిచ్చారు. ఎట్టకేలకు 2022లో రాజస్తాన్ రాయల్స్ ధ్రువ్ జురెల్‌ను కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, రియాన్ పరాగ్‌కు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, రియాన్ పూర్తిగా విఫలం కావడం.. ఆ ఏడాది ఫైనల్లో ఓడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో.. వచ్చే సీజన్లో ధ్రువ్‌ను ఆడించాలని ఆర్ఆర్ మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. అరంగేట్రంలోనే పరుగుల విధ్వంసం బ్యాటింగ్ ఆర్డర్లో ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడిస్తామనే హామీ ఇచ్చింది. ఐపీఎల్-2023లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా రాజస్తాన్ రాయల్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్ జురెల్. అరంగేట్రంలోనే సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 32 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓడినప్పటికీ తన ప్రదర్శనతో ధ్రువ్ జురెల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుస మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తంగా 13 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధ్రువ్ 11 ఇన్నింగ్స్‌లలో 152 పరుగులు సాధించాడు. భారత్-ఏ జట్టు తరఫున కూడా ప్రాతినిథ్య వహించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇలా తొలిసారి ప్రధాన జట్టుకు ఎంపికయ్యాడు. నీ గోల్డ్చైన్కు రీపే చేశాడు ఇక రాజస్తాన్‌కు ఆడే సమయంలో జైపూర్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ధ్రువ్ జురెల్ తండ్రి భార్యను ఉద్దేశించి.. ‘‘నీ బంగారు గొలుసు అమ్మినందుకు నీ కొడుకు మూల్యం చెల్లించేశాడోయ్’’ అని పుత్రోత్సాహంతో పొంగిపోయారట!! మరి ఇప్పుడు టీమిండియాకు సెలక్ట్ అయిన తర్వాత ఇంకెంతగా మురిసిపోతున్నారో!! - సాక్షి స్పోర్ట్స్, వెబ్ ప్రత్యేకం (ఇన్పుట్స్: హిందుస్తాన్ టైమ్స్) చదవండి: షమీ తమ్ముడి దెబ్బ.. 60 పరుగులకే యూపీ ఆలౌట్! భువీ కూడా తగ్గేదేలే.. 5 వికెట్లు కూల్చి -
ఆవేశ్ ఖాన్‌కు 5 వికెట్లు: తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే
South Africa A vs India A, 2nd unofficial Test: సౌతాఫ్రికా-‘ఏ’ జట్టుతో అనధికారిక రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు తిలక్ వర్మ, అక్షర్ పటేల్ అర్ధ శతకాలతో రాణించారు. యూపీకి చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. కాగా ప్రొటిస్ యువ జట్టుతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్-ఏ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగియగా.. బెనోనీలో బాక్సింగ్ డే మొదలుకావాల్సిన రెండో టెస్టు వర్షం కారణంగా ఒకరోజు ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ పడకుండానే తొలి రోజు ముగిసిపోగా.. రెండో రోజు ఆట సందర్భంగా టాస్ గెలిచిన భారత్-ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆవేశ్ ఖాన్‌కు ఐదు వికెట్లు ఆతిథ్య సౌతాఫ్రికా-ఏ జట్టును 263 పరుగులకు పరిమితం చేసింది. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో టెయిలెండర్ షెపో మొరేకీ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత పేసర్లలో ఆవేశ్ ఖాన్ అత్యధికంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ ఒక వికెట్ పడగొట్టాడు. స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో చివరిదైన నాలుగో రోజు ఆటలో భాగంగా.. శుక్రవారం బ్యాటింగ్ కొనసాగించిన భారత్-ఏ.. 95.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ కూడా ముగిసిపోయింది. అక్షర్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఇక భారత్ ఇన్నింగ్స్‌లో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ 169 బంతులు ఎదుర్కొని 50 పరుగులు సాధించగా.. అక్షర్ పటేల్ 61 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాపార్డర్‌లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 18, సాయి సుదర్శన్ 30, వన్‌డౌన్‌లో దిగిన రజత్ పాటిదార్ 33 పరుగులు సాధించారు. మిగతా వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ 34, వాషింగ్టన్ సుందర్(9- నాటౌట్) రన్స్ చేశారు. రోహిత్ సేనతో చేరిన భరత్ కాగా ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో భారత్-ఏ జట్టు సౌతాఫ్రికాకు వెళ్లింది. అతడి కెప్టెన్సీలో తొలి టెస్టు డ్రా చేసుకుంది. అయితే, భరత్ టీమిండియాతో చేరే క్రమంలో ‘ఏ’ జట్టుకు దూరం కాగా.. అభిమన్యు ఈశ్వరన్ అతడి స్థానంలో రెండో టెస్టులో జట్టును ముందుండి నడిపించాడు. ఇక అనధికారిక టెస్టుల్లో మ్యాచ్‌లు నాలుగు రోజుల పాటే సాగుతాయన్న విషయం తెలిసిందే. -
IPL 2023: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జరిగిందిదే! అందుకే ఇలా!
IPL 2023- Impact Player- ముంబై: గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్–2023 మరింత ఆసక్తికరంగా సాగుతోందని భారత మాజీ క్రికెటర్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అన్నింటికంటే ముఖ్యంగా లీగ్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటడం మంచి పరిణామమని ఆయన అన్నారు. ఎమ్మెస్కే ఈ ఐపీఎల్ సీజన్లో స్టార్ స్పోర్ట్స్–తెలుగు చానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘స్టార్’ కార్యక్రమంలో ఆయన తాజా సీజన్ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘సగం టోర్నమెంట్ ముగిసేసరికే ఈ ఐపీఎల్ గత సీజన్ల రికార్డులను అధిగమించింది. 200కు పైగా స్కోర్లు పెద్ద సంఖ్యలో నమోదు కాగా, సిక్సర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఇది లీగ్ ఎంతగా విజయవంతం అయిందో చూపిస్తోంది’ అని ప్రసాద్ అన్నారు. సానుకూలమే.. అందుకే ఇలా కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ అంశం మంచి ప్రభావం చూపిస్తోందని ప్రసామద్ చెప్పారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఈ సీజన్లో ఐపీఎల్ టీమ్ హోమ్ అడ్వాంటేజ్ పోయింది. ప్రత్యర్థి జట్టు వ్యూహాన్ని మార్చుకునే అవకాశం కలుగుతోంది. అందుకే చాలా మ్యాచ్‌లలో సొంత మైదానాల్లో జట్లు ఓడిపోతున్నాయి’ అని ఎమ్మెస్కే విశ్లేషించారు. యువ ఆటగాళ్లు అదుర్స్ ప్రధానంగా భారత యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శనలు ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశమని ఈ భారత మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యానించారు. ‘ఇది భారత క్రికెట్‌కు మేలు చేసే అంశం. తిలక్‌వర్మ, సాయిసుదర్శన్, రింకూ సింగ్, యశస్వి, ధ్రువ్ జురేల్ తమ ఆటతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం సానుకూలాంశం.’ అని ప్రసాద్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే చాలా జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సద్వినియోగం చేసుకున్న విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఆయుష్ బదోనిని, బెంగళూరు హర్షల్ పటేల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్లుగా దింపాయి. చదవండి: పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్ -
బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. రాజస్తాన్‌కు దొరికిన ఆణిముత్యం!
ఐపీఎల్-2023లో భాగంగా జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(77) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దృవ్ జురల్ అద్భుత ఇన్నింగ్స్ ఇక యశస్వి జైశ్వాల్‌తో పాటు దృవ్ జురల్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో క్రీజులోకి వచ్చిన దృవ్ జురల్ సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దృవ్ జురల్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లోనే కాకుండా టోర్నీ ఆసాంతం దృవ్ జురల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన దృవ్ జురల్ 130 పరుగులు సాధించాడు. ఇక రాజస్తాన్‌కు అదిరిపోయే ఫినిషింగ్ ఇస్తున్న దృవ్ జురల్ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జురల్ రాజస్తాన్‌కు దొరికిన అణిముత్యం అని కొనియాడుతున్నారు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు రాజస్తాన్ రాయల్స్ ధ్రువ్ జురెల్‌ను కొనుగోలు చేసింది. కానీ ఆసీజన్లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది సీజన్లో తనకు వచ్చిన మాత్రం అతడు సద్వినియోగం చేసుకున్నాడు. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్ -
#MSDhoni: హెట్‌మైర్ మిస్సయ్యాడు.. జురేల్ చిక్కాడు
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన అద్బుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. తాను డైరెక్ట్ త్రో వేశాడంటే ప్రత్యర్థి బ్యాటర్ ఔట్ అవ్వాల్సిందే అన్నట్లుగా గురి ఉంటుంది. తాజాగా గురువారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని సూపర్ రనౌట్‌తో మెరిశాడు. హెట్మైర్ను రనౌట్ చేసే చాన్స్ మిస్సయినప్పటికి ద్రువ్ జురేల్‌ను స్టన్నింగ్ త్రో విసిరి రనౌట్ చేసి ఆ లెక్కను సరిచేశాడు ధోని. విషయంలోకి వెళితే.. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నాలుగో బంతిని పతీరానా వైడ్ వేశాడు. అయితే లో ఫుల్‌టాస్ అయిన బంతి లెగ్‌స్టంప్ అవతల పడగా పడిక్కల్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ మిస్ అయింది. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి ద్రువ్ జురేల్ పరిగెత్తుకురావడంతో పడిక్కల్ కూడా ముందుకు కదిలాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న ధోని అక్కడినుంచే నేరుగా డైరెక్ట్ త్రో వేశాడు. అంతే జురేల్ క్రీజుకు చాలా దూరంలో ఉన్నప్పుడే బంతి వికెట్లను గిరాటేసింది. అంపైర్ డౌట్‌తో థర్డ్ అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చాడు. కానీ జురేల్ తన ఔట్ విషయంలో క్లారిటీ ఉండడంతో నిర్ణయం వచ్చేలోపే డగౌట్‌కు వెళ్లిపోయాడు. Cheetah ki chaal, baaz ki nazar aur MS Dhoni ki throw par kabhi sandeh nahi karte, Kabhi bhi maat de sakte hai..🔥#MSDhoni #RRvCSKpic.twitter.com/yq7Dr5z21F — 𝐒 𝐰 𝐚 𝐫 𝐚 (@SwaraMSDian) April 27, 2023 WHAT A THROW BY DHONI. AGE IS JUST A NUMBER FOR MS. pic.twitter.com/umut4GPWqs — Johns. (@CricCrazyJohns) April 27, 2023 చదవండి: రనౌట్ చాన్స్ మిస్.. ధోని అసహనం -
అన్నా.. ప్రతిసారీ గిట్లనే అయితాంది.. ఎందుకంటావ్?! సంజూ ట్వీట్ వైరల్
IPL 2023- RR Vs PBKS: పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. సంజూతో పాటు శిఖర్ ధావన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్- పంజాబ్ అసోంలోని గువాహటి వేదికగా బుధవారం తలపడ్డాయి. పంజాబ్ ఓపెనర్లు సూపర్ హిట్ రాయల్స్‌కు హోం గ్రౌండ్ అయిన బర్సపరా స్టేడియంలో టాస్ గెలిచిన సంజూ.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్ సింగ్(60), కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మిగిలిన వాళ్లలో జితేశ్ శర్మ(27) ఒక్కడు 20 పరుగుల మార్కు దాటాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పంజాబ్ 197 పరుగులు చేసింది. ఇక ఫీల్డింగ్ సమయంలో రాజస్తాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ వేలికి గాయం కావడంతో.. యశస్వి జైశ్వాల్(11)కు జతగా ఓపెనింగ్‌కు దిగిన అశ్విన్ డకౌట్ అయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన బట్లర్ సైతం తక్కువ స్కోరుకే పరిమితం కాగా కెప్టెన్ సంజూ 25 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. ఆశలు పెంచిన హెట్మెయిర్, ధ్రువ్.. కానీ పడిక్కల్ 21 , రియాన్ పరాగ్ 20 పరుగులు చేయగా.. ఆఖర్లో షిమ్రన్ హెట్మెయిర్(18 బంతుల్లో 36 పరుగులు), ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి పోరాటంతో గెలుపు అంచుల వరకు వచ్చిన రాజస్తాన్ ఆఖరికి ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గెలిచే మ్యాచ్‌లో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో సంజూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. పంజాబ్ కెప్టెన్, టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో ఉన్న ఫొటోను పంచుకున్న ఈ కేరళ బ్యాటర్.. ‘‘పాజీ(అన్నా).. మన మధ్య ప్రతిసారీ ఇలాంటి ఉత్కంఠ రేపే మ్యాచ్‌లే ఎందుకు జరుగుతాయంటావు?’’ అని చమత్కరించాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఆటగాళ్ల ప్రేమాభిమానాలు, క్రీడాస్ఫూర్తి ఇలా శాశ్వతం’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు రాజస్తాన్- పంజాబ్ ఐపీఎల్లో 25 మ్యాచ్‌లలో తలపడగా.. రాయల్స్ 14, కింగ్స్ 11 మ్యాచ్‌లలో గెలిచాయి. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. టీమిండియాలోకి ఆంధ్ర ఆటగాడు తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్ “Paaji, har baar itne tight matches kyun?” 🫢 pic.twitter.com/Fn6zrc9La9 — Sanju Samson (@IamSanjuSamson) April 6, 2023 That's that from Match 8. @PunjabKingsIPL win their second game on the trot as they beat #RR by 5 runs. Scorecard - https://t.co/Cmk3rElYKu #TATAIPL #RRvPBKS #IPL2023 pic.twitter.com/R9j1jFpt5C — IndianPremierLeague (@IPL) April 5, 2023 -
తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎంతో మంది యువ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. తాజాగా ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి మరో యువ సంచలనం పుట్టుకొచ్చాడు. అతడే రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు ధ్రువ్ జురెల్. ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓటమిపాలైనప్పటికీ ధ్రువ్ మాత్రం తన సంచలన ఇన్నింగ్స్‌తో అందరి అకట్టుకున్నాడు. కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధ్రువ్ జురెల్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఆర్ష్‌దీప్ సింగ్ వేసిన 19 ఓవర్లో ధ్రువ్ ఆడిన షాట్లు వేరే లెవల్ అని చెప్పుకోవాలి. ఇక ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన జురెల్ కోసం ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ ధ్రువ్ జురెల్? 22 ఏళ్ల ధ్రువ్ జురెల్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించాడు. దేశీవాళీ క్రికెట్లో ధ్రువ్ ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే విధంగా అతడు 2020 అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన ధ్రువ్ జురెల్ 89 పరుగులు సాధించాడు. ఇక తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 587 పరుగులు సాధిచాడు. ముఖ్యంగా 2022-23 రంజీ సీజన్లో నాగాలండ్తో జరిగిన మ్యాచ్‌లో జురెల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వచ్చిన అతడు 329 బంతులు ఎదుర్కొని 249 పరుగులు చేశాడు. ఇక టీ20ల విషయానికి వస్తే.. ఇప్పటివరకు 4 టీ20లు మాత్రమే ఆడిన ధ్రువ్ 89 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు రాజస్తాన్ రాయల్స్ ధ్రువ్ జురెల్‌ను కొనుగోలు చేసింది. కానీ ఆసీజన్లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది సీజన్లో తనకు వచ్చిన మాత్రం అతడు సద్వినియోగం చేసుకున్నాడు. చదవండి: IPL 2023-DC vs RR: రాజస్తాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం! ఇక కష్టమే Late to Twitter but woke up to so many notifications and messages. Thank you for the love, promise this is just the start 🙏🏻❤️ — dhruvjurel (@dhruvjurel21) April 6, 2023 *Dhruv jurel* 🔥🏏#DhruvJurel @dhruvjurel21 #RRvPBKS Best Shot By A Debutant IPL Players So Far...😍 pic.twitter.com/i1BstP4PCY — RR True Fans 💗 🔥 🏏 Royal Family 👑 (@MeenaRamkishan0) April 6, 2023 -
బట్లర్‌ను కాదని అందుకే అశూతో ఓపెనింగ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం: సంజూ
IPL 2023- Rajasthan Royals vs Punjab Kings: ‘‘నిజం చెప్పాలంటే ఇది బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్. అయినప్పటికీ మా బౌలర్లు వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు. పంజాబ్ కింగ్స్ ఆది నుంచే అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా పంజాబ్ బ్యాటర్లు పవర్‌ప్లేను బాగా వినియోగించుకున్నారు. ఏదేమైనా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పంజాబ్‌ను 197 పరుగులకు కట్టడి చేశారంటే మా బౌలర్లు మెరుగ్గానే రాణించినట్లు లెక్క!’’ అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా గువాహటి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఆఖరి వరకు పోరాడి 5 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ సారథి సంజూ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దంచికొట్టిన ప్రబ్‌సిమ్రన్, ధావన్ ఈ క్రమంలో పంజాబ్ ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్(60), శిఖర్ ధావన్(86 నాటౌట్) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఇక ‘హోం గ్రౌండ్’లో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 192 పరుగులకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సంజూ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. దేవ్‌దత్ పడిక్కల్‌ను మిడిలార్డర్లో ఆడించాలన్న నిర్ణయం బెడిసికొట్టిందని చెప్పుకొచ్చాడు. అదే విధంగా తమ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను కాదని.. స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్ర అశ్విన్‌ను ఓపెనర్‌గా పంపడానికి గల కారణం వెల్లడించాడు. అందుకే అశూతో ఓపెనింగ్ ఈ మేరకు.. ‘‘ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో క్యాచ్ అందుకునే క్రమంలో బట్లర్ వేలికి గాయమైంది. జాస్ పూర్తి ఫిట్‌గా లేడు. అందుకే అశ్విన్‌ను ముందు పంపి పడిక్కల్‌ను మిడిలార్డర్లో ఆడించాలనుకున్నాం. తనైతే స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడన్న ఉద్దేశంతో ఇలా చేశాం’’ అని సంజూ తెలిపాడు. అతడు అద్భుతం.. ఇక ఆఖర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్‌పై స్పందిస్తూ.. ‘‘ఐపీఎల్ ఆరంభానికి ముందు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ధ్రువ్ జురెల్ పాల్గొన్నాడు. కోచ్‌లు అతడి నైపుణ్యాలు మెరుగుపడేలా రెట్టింపు శ్రద్ధ వహించారు. ధ్రువ్ తన ప్రాక్టీస్‌లో దాదాపు వెయ్యి బంతులు ఎదుర్కొన్నాడు. తన బ్యాటింగ్‌లో పురోగతి పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నాను’’ అని ప్రశంసలు కురిపించాడు. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వికెట్ మరింత అనుకూలిస్తుందని భావించానని.. అయితే, ఆరంభంలోనే దెబ్బ పడటంతో ఆఖరి వరకు పోరాడిన ఫలితం లేకుండా పోయిందని సంజూ పేర్కొన్నాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. తదుపరి మ్యాచ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని రాజస్తాన్ సారథి అన్నాడు. సంజూ మినహా కాగా తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్తాన్ భారీ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో ఇలా పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. బట్లర్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన అశ్విన్ డకౌట్ కావడం.. కెప్టెన్ సంజూ(42) మినహా టాపార్డర్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఆఖర్లో షిమ్రన్ హెట్మెయిర్(18 బంతుల్లో 36 పరుగులు), ధ్రువ్ జురెల్(15 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చదవండి: Sam Curran: పర్లేదు.. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు..! That's that from Match 8. @PunjabKingsIPL win their second game on the trot as they beat #RR by 5 runs. Scorecard - https://t.co/Cmk3rElYKu #TATAIPL #RRvPBKS #IPL2023 pic.twitter.com/R9j1jFpt5C — IndianPremierLeague (@IPL) April 5, 2023 ICYMI - Nathan Ellis grabs a stunner to get the in form batter, Jos Buttler. Watch it here 👇👇#TATAIPL #RRvPBKS pic.twitter.com/rbt0CJRyLe — IndianPremierLeague (@IPL) April 5, 2023