టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన అరంగేట్ర సిరీస్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ధ్రువ్ జురెల్.. తన రెండో టెస్టులోనే హీరోగా మారిపోయాడు. రాంఛీ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన నాలుగో టెస్టులో ధ్రువ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. భారత విజయంలో జురెల్ కీలక పాత్ర పోషించాడు.
టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన వేళ తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైన 90 పరుగులు చేయడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో అతడిపై సర్వత్ర ప్రశంసల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ధ్రువ్ జురెల్ టీమిండియాకు మరో ధోని అంటూ ప్రశంసించాడు.
అయితే రెండు మ్యాచ్‌లకే జురల్‌ను ధోనితో పోల్చడాన్ని చాలా మంది తప్పుబట్టారు. తాజాగా తను చేసిన వ్యాఖ్యలపై సన్నీ క్లారిటీ ఇచ్చాడు. ధోనితో జురెల్‌ను పోల్చలేదని, అతడి సమయస్పూర్తిని చూస్తే ధోని గుర్తు వచ్చాడని అన్నానని లిటిల్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.
"భారత క్రికెట్‌కు ధోని లాంటి ఆటగాడు మరొకడు దొరకడు. భారత క్రికెట్‌లో ఒకే ఒక్క ధోని ఉన్నాడు. జురెల్‌ను నేను ధోనితో పోల్చలేదు. నా ఉద్దేశ్యం ప్రకారం జురెల్ ధోనితో సమానం అని కాదు. అటువంటి సమయస్పూర్తిని కలిగి ఉన్నాడని చెప్పా. అయితే ధోని సాధించిన దాంట్లో జురెల్ సగం సాధించినా భారత క్రికెట్‌కు చాలా మంచిది.
ధ్రువ్ అద్బుతమైన ఆటగాడు. అతడికి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్ చేయగలడు. ఆఖరిలో వచ్చి బ్యాటింగ్‌కు వచ్చి ధోనిలా మ్యాచ్‌ను ఫినిష్ చేసే సత్తా కూడా ఉందని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గావస్కర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment