
Photo Courtesy: BCCI
ఆర్సీబీపై పంజాబ్ విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్‌లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
బ్రార్ వేసిన ఆఖరి ఓవర్‌లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నేహల్ వధేరా (33 నాటౌట్) ఏమాత్రం జంక కుండా బ్యాటింగ్ చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. యశ్ దయాల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది స్టోయినిస్ (7 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లిస్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
2.4వ ఓవర్- 22 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ప్రభ్‌సిమ్రన్ (13) ఔటయ్యాడు.
పంజాబ్ బౌలర్ల విజృంభణ.. 95 పరుగులకే పరిమితమైన ఆర్సీబీ
వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్‌లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు.
ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బ్రార్ వేసిన ఆఖరి ఓవర్‌లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.
33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ సింగ్ 2, బార్ట్‌లెట్, జన్సెన్, చహల్ తలో వికెట్ తీశారు. పాటిదార్ (21), టిమ్ డేవిడ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. 6.3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 38/5గా ఉంది.
కోహ్లి ఔట్.. 21 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
2.4వ ఓవర్- 21 పరుగులకే ఆర్సీబీ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి (1) ఔటయ్యాడు.
తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో తొలి బంతికే బౌండరీ బాదిన సాల్ట్ నాలుగో బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ రెండు మార్పులు చేసింది. మ్యాక్స్‌వెల్ స్థానంలో స్టోయినిస్ జట్టులోకి వచ్చాడు. హర్ప్రీత్ బ్రార్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
తుది జట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్
ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, నేహాల్ వధేరా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్జ్, గ్లెన్ మాక్స్‌వెల్, ప్రవీణ్ దూబే
9:30 గంటలకు టాస్.. 14 ఓవర్ల మ్యాచ్
టాస్ 9:30 గంటలకు పడనుంది. 9:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ ప్లే 4 ఓవర్లుగా తేల్చారు. ముగ్గురు బౌలర్లు నాలుగు ఓవర్లు, ఓ బౌలర్ మిగతా రెండు ఓవర్లు బౌల్ చేయవచ్చు.
తగ్గిన వర్షం.. తొలిగిన కవర్లు
9:05 గంటలు- ఎట్టకేలకు వర్షం తగ్గుముఖం పట్టడంతో మైదాన సిబ్బంది కవర్లను తొలగించారు. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి వార్మప్ మొదలుపెట్టారు.
ఎంతకీ తగ్గని వర్షం.. ఓవర్ల కోత మొదలైంది
8:30 గంటలు-సాయంత్రం ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గడం లేదు. ఇకపై మ్యాచ్ ప్రారంభమైనా ఓవర్ల కోత తప్పదని తెలుస్తుంది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ హెం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. టాస్ ఆలస్యమయ్యే అవకాశముంది. గత రెండు, మూడు గంటల నుంచి వర్షం పడుతుండటంతో స్టేడియం మొత్తం కవర్లు కప్పి ఉంచారు. మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదమేమీ లేనప్పటి.. ఓవర్ల కోత ఉండవచ్చని తెలుస్తుంది.