Rajat Patidar
-
IPL 2025: మెరుపు సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్!
మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ అద్భుత శతకం సాధించాడు. హర్యానాతో మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు శతకంతో ఆదుకున్నాడు. కేవలం 68 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఆఖరి రోజు ఆటలో మధ్యప్రదేశ్‌ను పటిష్ట స్థితిలో నిలపగలిగాడు.కాగా రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా తొలుత కర్ణాటకతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న మధ్యప్రదేశ్.. తదుపరి పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ ఫలితం తేల్చలేకపోయింది. ఈ క్రమంలో శనివారం ఇండోర్ వేదికగా హర్యానా జట్టుతో రెడ్‌బాల్ మ్యాచ్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 308ఓపెనర్ హిమాన్షు మంత్రి(97) సహా కెప్టెన్ శుభం శర్మ(44), హర్‌ప్రీత్ సింగ్(36) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానా 440 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ లక్ష్య దలాల్ సెంచరీ(105)తో చెలరేగగా.. హిమాన్షు రాణా 90, ధీరూ సింగ్ 94, హర్షల్ పటేల్ 81 పరుగులతో దుమ్ములేపారు. ఆధిక్యంలోకి హర్యానాదీంతో తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ కంటే 132 పరుగుల ఆధిక్యంలో నిలిచింది హర్యానా. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ ఆరంభంలోనే ఓపెనర్లు సాగర్ సోలంకి(32), వెంకటేశ్ అయ్యర్(28) వికెట్లు కోల్పోయింది.రజత్ మెరుపు శతకంఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన రజత్ పాటిదార్ 68 బంతుల్లోనే ధనాధన్ ఇన్నింగ్స్‌తో శతకం సాధించాడు. మరో ఎండ్‌లో హర్‌ప్రీత్ సింగ్(44), శుభం శర్మ(38 నాటౌట్) సహకారం అందించగా.. పట్టుదలగా క్రీజులో నిలబడి 102 బంతుల్లో 159 పరుగులు చేశాడు. టార్గెట్ 177ఈ క్రమంలో 48.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 308 పరుగుల వద్ద ఉండగా మధ్యప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాటిదార్ మెరుపు శతకం వల్ల మంగళవారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా హర్యానాకు 177 పరుగుల లక్ష్యం విధించగలిగింది.ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్ఇక ఐపీఎల్-2025 మెగా వేలం సమీపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబరు 31 నాటికి ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రజత్ పాటిదార్ సెంచరీ సాధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యాజమాన్యానికి రేసులో తానూ ఉన్నాననే సందేశం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొన్నేళ్లుగా ఆర్సీబీకి ఆడుతున్న రజత్ పాటిదార్.. ఈ ఏడాది 395 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు -
ఆవేశ్‌ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలం
Duleep Trophy 2024- Ind C vs Ind A అనంతపురం: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ ఆటగాడు అభిషేక్ పొరెల్ (113 బంతుల్లో 82; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఈ మేర స్కోరు చేయగలిగింది. నిజానికి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గ్రూప్ ‘సి’ జట్టు... చివరి మ్యాచ్‌లో అదే స్థాయి ప్రదర్శ కనబర్చడంలో తడబడింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)తో పాటు సాయి సుదర్శన్ (17), రజత్ పటిదార్ (0), ఇషాన్ కిషన్ (5), మానవ్ సుతార్ (2) విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ‘సి’ జట్టును బాబా ఇంద్రజిత్ (34)తో కలిసి అభిషేక్ ఆదుకున్నాడు. వరస విరామాల్లో వికెట్లు పడుతున్నా... ధాటిగా ఆడిన అభిషేక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మరోవైపు పులకిత్ నారంగ్ (114 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన భారత్ ‘సి’.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. భారత్ ‘ఎ’ జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు వెనుకబడి ఉంది.టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ఇదిలా ఉంటే.. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 224/7తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు చివరకు 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ (250 బంతుల్లో 124; 15 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... పేసర్ అవేశ్ ఖాన్ (68 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అనూహ్యంగా బ్యాట్‌తో అదరగొట్టాడు.టీ20 తరహాలో ఎడాపెడా భారీ షాట్లు ఆడిన అవేశ్ ఖాన్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (34; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టారు. -
డుప్లెసిస్పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్‌గా ఊహించని ఆటగాడు!
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటైన్ జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఇంకా రిటెన్షన్ పక్రియకు సంబంధించి ఎటువంటి గైడ్‌లైన్స్ రానిప్పటకి.. ఆయా జట్లు మాత్రం ఇప్పటినుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. మెగా వేలంకు ముందు ఎవరనీ విడిచిపెట్టాలి, ఎవరిని రిటైన్ చేసుకోవాలి అన్న ఆంశాలపై ఫ్రాంచైజీలు ఓ నిర్ణయంకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పలు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్పై వేటు వేయాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.డుప్లెసిస్‌తో పాటు ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను సైతం వేలంలోకి విడిచిపెట్టాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు వినికిడి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాటు రజత్ పటిదార్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను రిటైన్ చేసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించే ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పాటిదార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్‌లో నిరాశపరిచిన పాటిదార్.. సెకెండ్ హాఫ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 15 మ్యాచ్‌లు ఆడి 398 పరుగులు చేశాడు.గ్రీన్‌కు గుడ్ బై.. ?అదే విధంగా 2024 మినీ వేలం లో రూ.11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం వేలంలోకి వచ్చే అవకాశముంది.ఐపీఎల్-2024లో పర్వాలేదన్పించిన ఆర్సీబీ.. లిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. 2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. -
ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం.. వరుసగా ఐదో గెలుపు
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి గెలుపు జెండా ఎగురవేసింది. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. అయితే, మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు.యశ్ దయాల్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఫెర్గూసన్ రెండు, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో ఢిల్లీని 140 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ విజయం సాధించింది.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపురాణించిన విల్ జాక్స్, పాటిదార్.. ఆర్సీబీ స్కోరు ఎంతంటే! ఐపీఎల్- 2024 ప్లే ఆఫ్స్ రేసులో భాగంగా మరో రసవత్తర సమరం జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది.సొంతమైదానంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి(13 బంతుల్లో 27) ధాటిగా ఆరంభించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(6) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఈ క్రమంలో విల్ జాక్స్(29 బంతుల్లో 41), రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. వీరికి తోడు ఐదో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) కూడా రాణించాడు.అయితే, లోయర్ ఆర్డర్ మహిపాల్ లామ్రోర్(13) ఒక్కడు డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. దినేశ్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ డకౌట్ అయ్యారు. కరణ్ శర్మ ఆరు పరుగులు చేసి రనౌట్ కాగా.. మహ్మద్ సిరాజ్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు స్కోరు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలాం రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. -
RCB Vs PBKS: బెంగళూరు జోరు...
ధర్మశాల: ఐపీఎల్లో ఆరు వరుస ఓటముల తర్వాత ఒక్కసారిగా చెలరేగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పుడు వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఎనిమిదో ఓటమితో పంజాబ్ కింగ్స్ జట్టు వరుసగా పదో ఏడాది ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయింది. గురువారం జరిగిన పోరులో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసి ఆర్సీబీ భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రిలీ రోసో (27 బంతుల్లో 61; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారీ భాగస్వామ్యాలు... కొత్త బౌలర్ కావేరప్ప తక్కువ వ్యవధిలో డుప్లెసిస్ (9), జాక్స్ (12)లను అవుట్ చేసి పంజాబ్‌కు తగిన ఆరంభం అందించాడు. అయితే మరో ఎండ్‌లో కోహ్లి చెలరేగిపోగా, అతనికి పటిదార్ జత కలిశాక మరింత వేగంగా పరుగులు వచ్చాయి. చహర్ ఓవర్లో పటిదార్ 3 సిక్స్‌లు కొట్టాక జోరు పెరిగింది. 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పటిదార్ వెనుదిరిగాడు. ఈ దశలో వర్షంతో కొద్దిసేపు ఆట ఆగిపోయింది. మ్యాచ్ మళ్లీ మొదలయ్యాక 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న కోహ్లి దూకుడు పెంచాడు. స్యామ్ కరన్ బౌలింగ్‌లో అతను కొట్టిన భారీ సిక్సర్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి సెంచరీ చేజార్చుకున్నాడు. కోహ్లి, గ్రీన్ ఐదో వికెట్‌కు 46 బంతుల్లోనే 96 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 3 పరుగులే ఇచ్చి హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. పంజాబ్ భారీ ఛేదనలో బెయిర్‌స్టో (27) కొంత ధాటిగా ఆడగా... రోసో ఇన్నింగ్స్ మాత్రమే కొద్దిసేపు ఆశలు రేపింది. అతను వెనుదిరిగిన తర్వాత శశాంక్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది.క్యాచ్‌లు వదిలేసి...పంజాబ్ పేలవ ఫీల్డింగ్ కూడా బెంగళూరుకు కలిసొచ్చింది. ఆరంభంలోనే వచ్చిన మంచి అవకాశాలను పంజాబ్ ఫీల్డర్లు వృథా చేశారు. కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన కావేరప్ప మాత్రం తీవ్రంగా నిరాశ చెందాల్సి వచ్చింది. అతని బౌలింగ్‌లోనే కోహ్లి (0, 10 వద్ద) ఇచ్చిన క్యాచ్‌లను అశుతోష్, రోసో వదిలేయగా... పటిదార్ (0 వద్ద) ఇచ్చిన క్యాచ్‌ను హర్షల్ నేలపాలు చేశాడు. పటిదార్ 33 వద్ద ఉన్నప్పుడు చహర్ బౌలింగ్‌లో కొంత కష్టమైన క్యాచ్‌ను బెయిర్‌స్టో అందుకోలేకపోయాడు. ‘సున్నా’ వద్ద బతికిపోయిన కోహ్లి 92 వరకు చేరడం పంజాబ్‌ను అన్నింటికంటే బాగా దెబ్బ తీసింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రోసో (బి) అర్‡్షదీప్ 92; డుప్లెసిస్ (సి) శశాంక్ (బి) కావేరప్ప 9; జాక్స్ (సి) హర్షల్ (బి) కావేరప్ప 12; పటిదార్ (సి) బెయిర్‌స్టో (బి) స్యామ్ కరన్ 55; గ్రీన్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 46; దినేశ్ కార్తీక్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 18; లోమ్రోర్ (బి) హర్షల్ 0; స్వప్నిల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–19, 2–43, 3–119, 4–211, 5–238, 6–240, 7–241. బౌలింగ్: కావేరప్ప 4–0–36–2, అర్‡్షదీప్ 3–0–41–1, స్యామ్ కరన్ 3–0–50–1, హర్షల్ 4–0–38–3, రాహుల్ చహర్ 3–0–47–0, లివింగ్‌స్టోన్ 3–0–28–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 6; బెయిర్‌స్టో (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 27; రోసో (సి) జాక్స్ (బి) కరణ్ 61; శశాంక్ సింగ్ (రనౌట్) 37; జితేశ్ శర్మ (బి) కరణ్ 5; లివింగ్‌స్టోన్ (సి) కరణ్ (బి) స్వప్నిల్ 0; స్యామ్ కరన్ (బి) ఫెర్గూసన్ 22; అశుతోష్ శర్మ (ఎల్బీ) (బి) సిరాజ్ 8; హర్షల్ (సి) ఫెర్గూసన్ (బి) సిరాజ్ 0; చహర్ (నాటౌట్) 5; అర్‡్షదీప్ (సి) కరణ్ (బి) సిరాజ్ 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 181. వికెట్ల పతనం: 1–6, 2–71, 3–107, 4–125, 5–126, 6–151, 7–164, 8–170, 9–174, 10–181. బౌలింగ్: స్వప్నిల్ 3–0–28–2, సిరాజ్ 4–0–43–3, యశ్ దయాళ్ 2–0–22–0, ఫెర్గూసన్ 3–0–29–2, జాక్స్ 1–0–5–0, గ్రీన్ 1–0–16–0, కరణ్ శర్మ 3–0–36–2.ఐపీఎల్లో నేడుగుజరాత్ X చెన్నై వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కోహ్లి.. ఇలాగేనా ఆడేది?: టీమిండియా దిగ్గజం విమర్శలు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ పెదవి విరిచాడు. స్థాయికి తగ్గట్లు రాణించడంలో కోహ్లి విఫలమవుతున్నాడని విమర్శించాడు.ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్- ఆర్సీబీ మధ్య బుధవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి అర్ధ శతకం బాదిన విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా కోహ్లి 43 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు.ఈ క్రమంలో కోహ్లి స్ట్రైక్ రేటు 118.6గా నమోదైంది. ఇక రైజర్స్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లితో పాటు రజత్ పాటిదార్(20 బంతుల్లో 50) హాఫ్ సెంచరీ చేయగా.. కామెరాన్ గ్రీన్(20 బంతుల్లో 37 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇందులో కీలక పాత్ర మాత్రం 250 స్ట్రైక్‌రేటుతో అర్ధ శతకం సాధించిన పాటిదార్దే.ఇక లక్ష్య ఛేదనలో 171 పరుగులకే సన్‌రైజర్స్ పరిమితం కావడంతో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఆరంభంలో బాగానే ఆడినా మధ్యలో కాస్త వెనుకబడినట్లు కనిపించింది. నంబర్స్ గురించి స్పష్టంగా ప్రస్తావించలేకపోతున్నాను గానీ.. 31- 32 స్కోరు వరకు అతడు బౌండరీ బాదలేకపోయాడు.ఇన్నింగ్స్ తొలి బంతి నుంచి క్రీజులో ఉండి.. 14- 15 ఓవర్ వరకు బ్యాటింగ్ కొనసాగించాలనుకుంటే ఈ స్ట్రైక్‌రేటు మాత్రం సరిపోదు. ఫ్రాంఛైజీ కోహ్లి వంటి టాప్ క్లాస్ ప్లేయర్‌నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఆశించదు’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్ట్పోర్స్ షోలో వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లి ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో పరుగుల విధ్వంసం సృష్టించి ఆర్సీబీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన రజత్ పాటిదార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండో గెలుపు. ఈ విజయంతో ఆర్సీబీ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరినప్పటికీ పట్టికలో మాత్రం అట్టడుగున పదో స్థానంలోనే కొనసాగుతోంది.Lofted with perfection and style! 😎@RCBTweets move to 61/1 after 6 oversWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvRCB | @imVkohli pic.twitter.com/WdVkWT99yz— IndianPremierLeague (@IPL) April 25, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రైజింగ్‌కు బ్రేక్
హెడ్ విధ్వంసం సృష్టించలేదు... క్లాసెన్ కుమ్మేయలేదు... మార్క్రమ్ మెరుపుల్లేవు... అభిషేక్ ఆశించిన స్థాయిలో చెలరేగలేదు... వరుస మ్యాచ్‌లలో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడుకు సొంతగడ్డపై బ్రేక్ పడింది. 300 స్కోరు సంగతేమో కానీ ఛేదనలో ఒకదశలో 100 కూడా దాటడమే కష్టమనిపించింది.వరుసగా నాలుగు విజయాల తర్వాత హైదరాబాద్ జట్టు తలవంచింది. మరోవైపు వరుసగా ఆరు పరాజయాలు... మైదానంలో దిగేదే ఓడేందుకా అన్నట్లు ఆడుతూ ఒక్క గెలుపు కోసం తపించిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు భారీ ఊరట లభించింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించడంతో ఎట్టకేలకు ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో రెండో విజయం దక్కింది. సాక్షి, హైదరాబాద్: సీజన్లో తిరుగులేకుండా సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేయగా... కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు.అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓడిపోయింది. షహబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్యాట్ కమిన్స్ (15 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. పటిదార్ మెరుపులు... భువనేశ్వర్ ఓవర్లో 3 ఫోర్లతో డుప్లెసిస్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా... కమిన్స్ ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. డుప్లెసిస్, జాక్స్ (6) వెనుదిరిగిన తర్వాత కోహ్లి ఆశ్చర్యకర రీతిలో ఒక్కసారిగా నెమ్మదించాడు. తన 17వ బంతికి సిక్స్ కొట్టిన కోహ్లి... ఆ తర్వాత 25 బంతులపాటు బౌండరీ కొట్టలేకపోవడం అనూహ్యం.అయితే మరో ఎండ్‌లో పటిదార్ విధ్వంసం ఆర్సీబీ స్కోరును పరుగెత్తించింది. లెగ్‌స్పిన్నర్ మార్కండే లక్ష్యంగా అతను చెలరేగిపోయాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన పటిదార్... అతని తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6, 6, 6 బాదడం విశేషం. కోహ్లి, పటిదార్ తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... గ్రీన్ చక్కటి షాట్లతో స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 64 పరుగులు చేసింది. టపటపా... తొలి ఓవర్లోనే హెడ్ (1) అవుట్ కావడంతో రైజర్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. జాక్స్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన అభిషేక్ తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. అంతే... ఆ తర్వాత పరుగులు రావడం ఆగిపోవడంతో పాటు హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది.మార్క్రమ్ (8 బంతుల్లో 7; 1 ఫోర్), క్లాసెన్ (3 బంతుల్లో 7; 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 13; 1 సిక్స్) ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. దాంతో సన్‌రైజర్స్‌కు ఏ దశలోనూ గెలుపు అవకాశాలు కనిపించలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సమద్ (బి) ఉనాద్కట్ 51; డుప్లెసిస్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 25; జాక్స్ (బి) మార్కండే 6; పటిదార్ (సి) సమద్ (బి) ఉనాద్కట్ 50; గ్రీన్ (నాటౌట్) 37; లోమ్రోర్ (సి) కమిన్స్ (బి) ఉనాద్కట్ 7; కార్తీక్ (సి) సమద్ (బి) కమిన్స్ 11; స్వప్నిల్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–48, 2–65, 3–130, 4–140, 5–161, 6–193, 7–206. బౌలింగ్: అభిషేక్ శర్మ 1–0–10–0, భువనేశ్వర్ 1–0–14–0, కమిన్స్ 4–0–55–1, నటరాజన్ 4–0–39–2, షహబాజ్ 3–0–14–0, మార్కండే 3–0–42–1, జైదేవ్ ఉనాద్కట్ 4–0–30–3. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) కార్తీక్ (బి) యశ్ 31; హెడ్ (సి) కరణ్ (బి) జాక్స్ 1; మార్క్రమ్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 7; నితీశ్ కుమార్ రెడ్డి (బి) కరణ్ 13; క్లాసెన్ (సి) గ్రీన్ (బి) స్వప్నిల్ 7; షహబాజ్ (నాటౌట్) 40; సమద్ (సి అండ్ బి) శర్మ 10; కమిన్స్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 31; భువనేశ్వర్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 13; ఉనాద్కట్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–3, 2–37, 3–41, 4–56, 5–69, 6–85, 7–124, 8–141. బౌలింగ్: జాక్స్ 2–0–23–1, సిరాజ్ 4–0–20–0, యశ్ దయాళ్ 3–0–18–1, స్వప్నిల్ 3–0–40–2, కరణ్ శర్మ 4–0–29–2, ఫెర్గూసన్ 2–0–28–0, గ్రీన్ 2–0–12–2. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X పంజాబ్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రజిత్ పాటిదార్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 4 సిక్స్‌లు! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్ మరో అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పాటిదార్ అదరగొట్టాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విల్ జాక్స్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పాటిదార్.. ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ముఖ్యంగా స్పిన్నర్లను టార్గెట్ చేశాడు. స్పిన్నర్ మార్కండే వేసిన 11 ఓవర్లో పాటిదార్ వరుసుగా 4 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే పాటిదార్ తన హాప్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రాబిన్ ఉతప్ప సరసన రజిత్ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న పాటిదార్ 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50)తో పాటు విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు. Patidar ka 𝑹𝒂𝒋 🤌🫡#SRHvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/v1dzhJjKxZ— JioCinema (@JioCinema) April 25, 2024 -
#RCBvsKKR: చెత్త బ్యాటింగ్.. ఇంకా ఎన్ని ఛాన్స్‌లు?
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రజిత్ పాటిదార్ ఆట ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పాటిదార్ నిరాశపరిచాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాటిదార్.. రస్సెల్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడిని ఆర్సీబీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇకనైనా నీ ఆట తీరు మారదా’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఆర్సీబీ మెనెజ్‌మెంట్ తీరును తప్పుబడుతున్నారు. అతడు వరుసగా విఫలమవుతున్నప్పటికి అవకాశాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా రాబోయే మ్యాచ్‌ల్లో పాటిదార్‌పై ఆర్సీబీ వేటు వేసే ఛాన్స్ ఉంది. అతడి స్ధానంలో మహిపాల్ లామ్రోర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. కాగా ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పాటిదార్ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు అదే పేలవ ఫామ్‌ను పాటిదార్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. Rajat patidar 😭😭 pic.twitter.com/MXrogYrPNw — ADITYA 🇮🇳 (@troller_Adi18) March 29, 2024 -
RCB Vs PBKS: అన్న నీవు మారవా? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు! జట్టు నుంచి తీసిపడేయండి
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్. ఆర్సీబీ ఆటగాడు రజిత్ పాటిదార్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2024 తొలి మ్యాచ్‌లో విఫలమైన పాటిదార్.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతులు ఎదుర్కొన్న పాటిదార్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాటిదార్ తన ఆట తీరుతో నిరాశరిచాడు. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ హార్ప్రీత్ బరార్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి పాటిదార్ క్లీన్ బౌల్డయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్న నీవు మారవా ఇంకా ఎన్ని మ్యాచ్‌లు ఇలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌ను తప్పుబడుతున్నారు. ఫామ్‌లో లేని ఆటగాడికి ఎందుకు ఛాన్స్‌లు ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ పాటిదార్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లో విరాట్ కోహ్లి(49 బంతుల్లో 77, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరిలో దినేష్ కార్తీక్ మెరుపు మెరిపించి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందిచాడు. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. pic.twitter.com/LPuKzE4G0g — Sitaraman (@Sitaraman112971) March 25, 2024 -
పంజాబ్‌తో మ్యాచ్.. ఆర్సీబీ తుది జట్టు ఇదే? రూ.11 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం(మార్చి 25) చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీ మెనెజ్‌మెంట్ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్, అల్జారీ జోషఫ్పై వేటు వేయనున్నట్లు సమాచారం. పాటిదార్ స్ధానంలో సుయాష్ ప్రభుదేసాయి, జోషఫ్ స్ధానంలో కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాడు. కాగా సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాటిదార్ డకౌట్ కాగా.. పేసర్ జోషఫ్ దారుణంగా విఫలమయ్యాడు. 3. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ కరేబియన్ ఫాస్ట్ బౌలర్.. వికెట్ ఏమీ తీయకుండా 38 పరుగులిచ్చాడు. ఈ క్రమంలోనే పాటిదార్, జోషఫ్‌ను ఆర్సీబీ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 మినీవేలంలో జోషఫ్‌ను రూ.11. 50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో పేసర్ యాష్ దయాల్‌ను ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకునే అవకాశముంది. ఆర్సీబీ తుది జట్టు(అంచనా) విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, లాకీ ఫెర్గూసన్, మయాంక్ దాగర్, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్. -
టీమిండియాలోనే కాదు.. ఇక్కడా ఇంతేనా?! వీడియో వైరల్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాడు, ఆర్సీబీ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్.. ఇప్పుడు ఐపీఎల్-2024లోనూ అదే తీరును కనబరిచాడు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో పాటిదార్ దారుణంగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న పాటిదార్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి ఎటువంటి ఫుట్ మూమెంట్ లేకుండా ఆఫ్ సైడ్ వైపు ఆడటానికి పాటిదార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. ధోని ఎటువంటి తప్పిదం చేయకుండా రెగ్యులేషన్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేమి ఆటరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే(34 నాటౌట్), రవీంద్ర జడేజా(25 నాటౌట్) రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్ రావత్(48), దినేష్ కార్తీక్(38 నాటౌట్) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు. వీరితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(35) పరుగులతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
'వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం.. అయినా అతడికి ఛాన్స్ ఇవ్వాల్సిందే'
ఇంగ్లండ్‌తో ఇప్పటికే టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు నామమాత్రపు ఐదో టెస్టుకు సిద్దమవుతోంది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్ ఆటగాడు రజిత్ పాటిదార్‌పై వేటు వేయాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాతి రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు కేవలం 63 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే పాటిదార్‌ను పక్కన పెట్టాలని మెన్జ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాటిదార్‌కు మద్దతుగా దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ నిలిచాడు. పాటిదార్ అద్భుతమైన ఆటగాడని, అతడికి మరో అవకాశం ఇవ్వాలని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో రజిత్ పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. తనకు జీవిత కాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ను ఆడలేకపోయాడు. కానీ ప్రస్తుతం భారత జట్టులో ఉన్న మంచి విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం బాగా ఆడకున్నా ఫలితాలు జట్టుకు అనుకూలంగా వస్తున్నప్పుడు మనం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అతడి అటిట్యూడ్ బాగా ఉండి, డ్రెస్సింగ్ రూమ్‌లో అందరికి నచ్చితే కెప్టెన్ రోహిత్ శర్మ మెనెజ్‌మెంట్‌తో మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే పాటిదార్ మాత్రం అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతానికి అతడు పరుగులేమీ చేయకున్నా అతడికి మరిన్ని అవకాశాలిచ్చి చూడండి తన యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ పేర్కొన్నాడు. చదవండి: NZ vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి -
Ind vs Eng: తిరిగి వెళ్లమన్న సెలక్టర్లు.. పాటిదార్‌పై వేటు?
'Go back and play Ranji...': BCCI wants To: ఇంగ్లండ్‌తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ సందర్భంగా నలుగురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేయగా.. మరో ఆటగాడికీ ఛాన్స్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో స్టోక్స్ బృందంతో టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. హైదరాబాద్‌లో ఆరంభ మ్యాచ్‌లో ఓడినా.. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచిలలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సొంతగడ్డపై ఈ మేరకు ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక విశాఖ టెస్టులో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్.. రాజ్‌కోట్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. రాంచిలో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ టీమిండియా క్యాపులు అందుకున్నారు. వీరిలో రజత్ పాటిదార్‌కు వరుసగా మూడుసార్లు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో అతడు చేసిన పరుగులు 32,9,5,0,17,0. ఫలితంగా రజత్ పాటిదార్ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్‌లో లేని ఆటగాడిని జట్టులో కొనసాగించడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదో టెస్టు నుంచి పాటిదార్‌ను తప్పించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. రంజీ ట్రోఫీ 2023-24లో విదర్భతో మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో ఆడాల్సిందిగా బీసీసీఐ తొలుత ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ గురించి స్పష్టత రాకపోవడంతో పాటిదార్ విషయంలో నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. అయితే, రాహుల్ రాకపోయినా పాటిదార్‌ను తుదిజట్టు నుంచి తప్పించి.. అతడి స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదనపు బ్యాటర్‌గా అతడిని జట్టుతోనే కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కర్ణాటక బ్యాటర్ తాజా రంజీ సీజన్లో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. భారత్-ఏ తరఫున కూడా రాణించాడు. చదవండి: Rohit Sharma: ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా? -
Ind Vs Eng: ‘అక్కడ పులి.. ఇక్కడ పిల్లి’?.. ఖేల్ ఖతమే ఇక!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ మరోసారి విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో కూడా పూర్తిగా నిరాశపరిచి మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. కాగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రజత్ పాటిదార్.. దేశవాళీ క్రికెట్లో సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పాటిదార్ ఎట్టకేలకు 2023లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ముప్పై ఏళ్ల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు ఆడింది ఒకే ఒక్క వన్డే. సాధించిన స్కోరు 22. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ సందర్భంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి జట్టుకు దూరంగా ఉండటంతో అతడి స్థానంలో రజత్ పాటిదార్‌కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న పాటిదార్.. ఆ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 32, 9 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టులోనూ ఆడే అవకాశం దక్కించుకున్న అతడు రాజ్‌కోట్(5,0)లో పూర్తిగా విఫలమయ్యాడు. అయినప్పటికీ రాంచి టెస్టులో కూడా పాటిదార్‌కు ఛాన్స్ ఇచ్చింది మేనేజ్మెంట్. అయితే, ఇక్కడా పాత కథనే పునరావృతం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేయగలిగిన పాటిదార్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. తప్పక రాణించాల్సిన మ్యాచ్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి పాటిదార్ ఈ మేరకు విఫలమయ్యాడు. ఈ మూడు మ్యాచ్‌లలోనూ రజత్ పాటిదార్ స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకుని వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతడిపై విమర్శలు వస్తున్నాయి. ‘‘ఆర్సీబీలో పులి.. టీమిండియాలో పిల్లి’’ అన్న చందంగా పాటిదార్ ఆట తీరు ఉందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వరుస అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇకనైనా పాటిదార్‌ను తప్పించి అతడి స్థానంలో అర్హుడైన ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. Againnnnn😭😭 Patidar is promoting his edits more than anyone🤣pic.twitter.com/DY3x5d0yVO — unapologetic_analyst (@arham412003) February 26, 2024 Thank You Rajat Patidar 🦆 You will not be remembered #RajatPatidar #INDvENG pic.twitter.com/JNHOyYFkMF — sarcastic (@Sarcastic_broo) February 26, 2024 -
Ind Vs Eng: ఐదుసార్లూ వాళ్లకే చిక్కాడు.. ఇంకెన్ని అవకాశాలు?
India vs England, 4th Test- Rajat Patidar: టీమిండియా బ్యాటర్ రజత్ పాటిదార్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా అతడు మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు. వరుస ఇన్నింగ్స్‌లో వైఫల్యం చెంది టీమిండియా అభిమానుల విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టాడు. విరాట్ కోహ్లి జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో అతడి స్థానంలో ఎంట్రీ ఇచ్చిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ చేసిన పరుగులు 32, 9. రెండు ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లిష్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో పాటిదార్ అవుట్ కావడం విశేషం. ఏదేమైనా.. తొలి మ్యాచ్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా రాజ్‌కోట్ టెస్టులో మాత్రం పాటిదార్ పూర్తిగా విఫలమయ్యాడు. ఐదుసార్లూ వాళ్ల చేతికే చిక్కాడు తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే పరిమితమైన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో రెండు సందర్భాల్లోనూ అతడు ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లే చేతికే చిక్కడం గమనార్హం. తాజాగా నాలుగో టెస్టులోనూ 17 పరుగులకే అవుటయ్యాడు పాటిదార్. ఈసారి కూడా స్పిన్ బౌలింగ్ ఆడటంలో తన బలహీనతను మరోసారి బయటపెడుతూ 30 ఏళ్ల పాటిదార్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో రజత్ పాటిదార్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘‘టీమిండియాలో అరంగేట్రం తర్వాత వరుసగా విఫలమైనా.. తుదిజట్టులో అతడికి చోటు ఇస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మరోవైపు.. సంజూ శాంసన్ వంటి ఆటగాడికి 2015లో టీ20లో టీమిండియా తరఫున.. అదీ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయించారు. మళ్లీ అతడు మరో అంతర్జాతీయ టీ20 ఆడటానికి ఐదేళ్లు(2020) పట్టింది. ఎందుకింత వివక్ష? కేవలం ఐపీఎల్లో ఆడిన ఆటగాళ్లకే అవకాశాలు ఇస్తే ఇలాగే ఉంటుంది. కనీసం టెస్టు జట్టుకు ఎంపిక చేసే ఆటగాళ్లనైనా.. రంజీ ట్రోఫీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలో ప్రదర్శన ఆధారంగా ఎంచుకోండి’’ అని సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు. ఇక శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. చదవండి: IPL 2024- MI: అడ్జస్ట్ అవ్వాలా?.. ఇది ఎలా తింటాననుకున్నావు? పాండ్యా ఫైర్ -
ఏమో నాకైతే తెలియదు.. అతడికి మరో ఛాన్స్: భారత బ్యాటింగ్ కోచ్
రాంఛీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టుకు సర్వం సిద్దమైంది. శుక్రవారం ఉదయం 9:30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాలని భారత్ ప్రణాళికలను రచిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ సైతం ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమయ్యాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గాయపడిన రాహుల్.. వైజాగ్, రాజ్‌కోట్ టెస్టులకు దూరమయ్యాడు. కానీ రాంఛీ టెస్టుకు ముందు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడని, తిరిగి జట్టుతో చేరుతాడని వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం రాహుల్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదని, నాలుగో టెస్టుకు కూడా దూరమయ్యాడనిఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇదే విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "కెఎల్ రాహుల్ ఎంత శాతం ఫిట్నెస్ సాధించాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంతవరకు మ్యాచ్ ఆడే ఫిట్నెస్ అయితే అతడు సాధించలేదు అనుకుంటున్నాను. అతడి పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నదని రాథోర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఇక రాహుల్ గైర్హాజరు నేపథ్యంలో మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్‌ను తుది జట్టులో కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ.. "పాటిదార్ అద్బుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం అతడితో మేము చర్చలు జరుపుతున్నాం. అతడు తన ప్రతిభను నిరూపించుకుంటాడని భావిస్తున్నాము. అతడికి జట్టు మెనెజ్‌మెంట్ మొత్తం సపోర్ట్‌గా ఉందని చెప్పుకొచ్చాడు. కాగా వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. -
IND VS ENG 4th Test: పాటిదారా.. పడిక్కలా..?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్ ఓ అడుగు ముందుకేసి ఇదివరకే తుది జట్టును కూడా ప్రకటించింది. తుది జట్టు విషయంలో టీమిండియానే ఎటూ తేల్చుకోలేకపోతుంది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో నాలుగో టెస్ట్‌కు అర్హత కోల్పోయాడు. రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా రెండు, మూడు టెస్ట్‌లు ఆడిన రజత్ పాటిదార్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ ఒక్క స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. పాటిదార్‌కు మరో అవకాశం ఇవ్వాలా లేక దేవ్‌దత్ పడిక్కల్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ ఇవ్వాలా అని మేనేజ్మెంట్ జట్టు పీక్కుంటుంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ నోరు విప్పాడు. పాటిదార్ మంచి ప్లేయర్ అని, ఒకటి రెండు వైఫల్యాలకే ఏ ఆటగాడి నైపుణ్యాన్ని శంకించకూడదని పరోక్షంగా పాటిదార్‌ను వెనకేసుకొచ్చాడు. రాథోడ్‌కు పాటిదార్‌పై సదుద్దేశమే ఉన్నప్పటికీ టీమిండియా అభిమానులు మాత్రం దేవ్‌దత్ పడిక్కల్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పడిక్కల్ ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, పాటిదార్‌తో పోలిస్తే పడిక్కల్ చాలా బెటర్ అని వారభిప్రాయపడుతున్నారు. మరి నాలుగో స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి కొన్ని గంటలు వేచి చూస్తే కాని తెలీదు. మరోవైపు బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ఆకాశ్‌దీప్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. రేపటి మ్యాచ్‌లో ఆకాశ్ అరంగేట్రం చేయడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. నాలుగో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్/దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్ -
అతడి పని అయిపోయింది.. ఇక బెంచ్‌కే!
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత జట్టు.. ఇప్పుడు నాలుగో టెస్టుకు సన్నదమవుతోంది. ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు ముందు జట్టు నుంచి రిలీజ్ అయిన పేసర్ ముఖేష్ కుమార్ తిరిగి మళ్లీ రాంఛీ టెస్టుకు అందుబాటులో వచ్చే ఛాన్స్ ఉంది. పాటిదార్ పై వేటు.. ఇక వరుసగా వైజాగ్,రాజ్‌కోట్ టెస్టులకు గాయం కారణంగా దూరమైన భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు నాలుగో టెస్టు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్‌పై వేటు పడే సూచనలు కన్పిస్తున్నాయి. వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్.. పెద్దగా అకట్టుకోలేకపోయాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం రాజ్‌కోట్ టెస్టులో అయితే ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు దారుణంగా విఫలయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతడి వేటు వేయాలని భారత జట్టు మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అరంగేట్రంలోనే అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురల్ స్ధానాలకు ఎటువంటి ఢోకా లేదు. చదవండి: SL vs AFG: దుమ్ములేపుతున్న శ్రీలంక.. వరుసగా మూడో సిరీస్ విజయం -
అయ్యో రజత్.. బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో! వీడియో వైరల్
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కన్పించిన పాటిదార్ ఊహించని విధంగా ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ స్ధానంలో జట్టులోకి వచ్చిన పాటిదార్.. నాలుగో వికెట్‌కు ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే భారత ఇన్నింగ్స్‌లో 72 ఓవర్ వేసిన ఇంగ్లీష్ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో తొలి బంతిని పాటిదార్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ చివర భాగాన తగిలి బౌన్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అతడు తన కాలితో బంతిని అపడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో 32 పరుగులు చేసిన పాటిదార్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(179 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగాడు. చదవండి: IND vs ENG: అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన అశ్విన్.. Kohli ke team se aata hai to Luck bhi toh Kohli jaisa hi hoga na😭😭😭 Bad luck Rajat Patidar🤞 pic.twitter.com/IBCfrJwexj — Vahini🕊️ (@fairytaledust_) February 2, 2024 -
ఒకేరోజు ఎనిమిది మంది క్రికెటర్ల ఎంట్రీ!
క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివిధ ఫార్మాట్లలో ఇవాళ (2024, ఫిబ్రవరి 2న) ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ముందుగా విశాఖ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌తో భారత ఆటగాడు రజత్ పాటిదార్, ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశారు. వెస్టిండీస్‌తో ఇవాళ జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వన్డే అరంగేట్రం చేశారు. శ్రీలంకతో ఇవాళే మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. మొత్తంగా ఇవాళ ఎనిమిది మంది ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. క్రికెట్ చరిత్రలో ఇంతమంది ఒకే రోజు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఇవాళ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాళ్ల వివరాలు.. రజత్ పాటిదార్ (భారత్) షోయబ్ బషీర్ (ఇంగ్లండ్) జేవియర్ బార్ట్లెట్ (ఆస్ట్రేలియా) లాన్స్ మోరిస్ (ఆస్ట్రేలియా) నూర్ అలీ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) నవీద్ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ (ఆఫ్ఘనిస్తాన్) మొహమ్మద్ సలీం (ఆఫ్ఘనిస్తాన్) ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో ఇవాళ మొదలైన రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (125 నాటౌట్) కెరీర్లో మూడో సెంచరీతో కదంతొక్కగా.. అతనికి జతగా అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ (25) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాళ్లు రజత్ పాటిదార్, షోయబ్ బషీర్ పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ తొలి వన్డే విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి చేరువలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 48.4 ఓవరల్లో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 34 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 208 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. గ్రీన్ (68), స్టీవ్ స్మిత్ (65) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ గెలుపుకు మరో 24 పరుగులు మాత్రమే అవసరం ఉంది. అరంగేట్రం ఆటగాళ్లు జేవియర్ బార్ట్లెట్ (9-1-17-4) అద్భుత గణాంకాలతో విజృంభించగా.. లాన్స్ మోరిస్ (10-2-59-0) పర్వాలేదనిపించాడు. ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తొలి రోజు మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు (53 ఓవర్లు) చేసింది. కైస్ అహ్మద్ (16), జియా ఉర్ రెహ్మాన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. అరంగేట్రం ఆటగాళ్లలో నూర జద్రాన్ (31) కాస్త పర్వాలేదనించాడు. -
తుదిజట్టులో నో ఛాన్స్!.. సర్ఫరాజ్ ఖాన్ వ్యాఖ్యలు వైరల్
India vs England, 2nd Test- Sarfraz Khan: ‘‘టెస్టు క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపికగా ఉండాలి. జీవితంలో కొన్నిసార్లు మనం తొందరపాటులో పనులు చేసేస్తూ ఉంటాం. నేను కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టీమిండియాలో అడుగుపెట్టాలని ఎదురుచూసేవాడిని. ఒక్కోసారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యేవాడిని. అలాంటపుడు మా నాన్న నన్ను ఓదార్చేవారు. హార్డ్‌వర్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడో ఓసారి ఫలితం అదే వస్తుంది. అప్పుడు నిన్నెవరూ ఆపలేరని చెబుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం, ఓపిక కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని నేను తెలుసుకున్నా. ఇప్పుడు మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. కోట్లాది మంది జనాభా ఉన్న ఈ దేశంలో టీమిండియాలో భాగమయ్యే అవకాశం రావడం పట్ల నాకు గర్వంగా ఉంది’’.. ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో టెస్టు ఆరంభానికి ముందు యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్న మాటలివి. అలా తొలిసారి టీమిండియాకు ఎంపిక దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతూ.. భారత్-ఏ తరఫున కూడా అదరగొడుతున్న ఈ ముంబై బ్యాటర్‌కు వైజాగ్ టెస్టు సందర్భంగా బీసీసీఐ సెలక్టర్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్‌లతో పాటు సర్ఫరాజ్‌కు కూడా ప్రధాన జట్టులో చోటిచ్చింది. అయితే, అంతకంటే ముందే మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో చోటు కోసం పాటిదార్‌తో పోటీపడ్డ సర్ఫరాజ్‌కు నిరాశే మిగిలింది. తుదిజట్టులో పాటిదార్‌కు స్థానం ఇచ్చారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా.. బీసీసీఐకి అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ తెరమీదకు వచ్చింది. ఓపికగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమంటూ 26 ఏళ్ల సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) సిరాజ్ స్థానంలో అతడు కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను పరాజయంతో ప్రారంభించింది టీమిండియా. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. రజత్ పాటిదార్ టెస్టు క్యాప్ అందుకోగా.. మహ్మద్ సిరాజ్ స్థానంలో ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. చదవండి: SA20 2024: టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 462 పరుగులు -
Ind vs Eng: ‘ఇంత అన్యాయమా.. ఇంకెలా ఆడితే ఛాన్స్ ఇస్తారు?’
India vs England, 2nd Test- No Place For Sarfaraz Khan: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయమని అభిమానులతో పాటు భారత మాజీ క్రికెటర్లు కూడా భావించారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం అతడికి మరోసారి మొండిచేయి చూపింది. తుదిజట్టులో చోటు కోసం మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో పాటిదార్ వైపే మొగ్గుచూపింది. ఇప్పటికే టీమిండియా తరఫున వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన పాటిదార్‌కే టెస్టు క్యాప్ కూడా అందించింది. దీంతో సర్ఫరాజ్‌కు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘పాపం.. సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి అన్యాయం జరిగింది. ఇన్నాళ్లు జట్టుకు ఎంపికే చేయలేదు. ఈసారి ఛాన్స్ ఇచ్చారనుకుంటే తుదిజట్టులో ఆడించడం లేదు. అసలు అతడిని ఎందుకు పక్కనపెట్టారో కాస్త వివరించగలరా? మీ నిర్ణయాలు మాకైతే అంతుపట్టడం లేదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్-ఏ జట్టుపై భారత్- ఏ తరఫున సెంచరీ బాది ఫామ్‌లో ఉన్నా కూడా సర్ఫరాజ్ ఖాన్ ఆట తీరుపై మీకు నమ్మకం కుదరలేదా? ఇంకెన్నాళ్లు అతడు ఎదురుచూడాలి?’’ అంటూ సెలక్టర్లపై ఫైర్ అవుతున్నారు. No Sarfaraz..?? What..??? Please explain. Unbelievable...#INDvsENGTest #INDvsENG #INDvENG #IndianCricket #SarfarazKhan — Raghav Srinivasan (@RaghavSrinivas7) February 2, 2024 I hope India’s more main players get injured so that Sarfaraz ko chance mile https://t.co/vXVrS2n6ND — Akshayyyy (@AkshayyMahadik) February 2, 2024 కాగా తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు.. మొదటి టెస్టు తర్వాత రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో సౌరభ్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్‌లకు రెండో టెస్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఇక కేఎస్ భరత్‌కు సొంతమైదానంలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో.. ఇలాంటి అవకాశం రావడం తనకు గర్వకారణమంటూ భరత్ సంతోషం వ్యక్తం చేశాడు. 🗣️🗣️ It's a proud moment to be playing in front of your home crowd. Proud and focused @KonaBharat is geared up for the 2nd #INDvENG Test in Visakhapatnam 🙌#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/2eUkG5vDSN — BCCI (@BCCI) February 1, 2024 తుది జట్లు: టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్. చదవండి: IND VS ENG 2nd Test: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..? ఎందుకంత స్పెషల్ -
రజత్ పాటిదార్ అరంగేట్రం.. జహీర్ చేతుల మీదగా! ఫోటోలు వైరల్
మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ టీమిండియా తరపున టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత తుది జట్టులో పాటిదార్ చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత్ తరపున టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన 310 ఆటగాడిగా రజత్ నిలిచాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ చేతుల మీదగా పటిదార్ క్యాప్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆల్ ది బెస్ట్ రజత్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రజత్ పాటిదార్‌కు దేశీవాళీ క్రికెట్లో ఘనమైన రికార్డు ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్.. 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు నిరాశ ఎదురైంది. తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్.. అంతర్జాతీయ అరంగేట్రం కోసం మరి కొంత కాలం వేచి చూడల్సిందే. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ Congratulations to Rajat Patidar who is all set to make his Test Debut 👏👏 Go well 👌👌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/FNJPvFVROU — BCCI (@BCCI) February 2, 2024 -
IND Vs ENG 2nd Test: తొలిరోజు జైస్వాల్ సూపర్ ‘హిట్’..
India vs England, 2nd Test At Vizag Day 1 Update: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. వైజాగ్‌లో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి.. 93 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(14) నిరాశపరచగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఆట ముగిసే సరికి 179 పరుగులతో అశ్విన్(5)తో అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో శుబ్‌మన్ గిల్(34), అరంగేట్ర బ్యాటర్ రజత్ పాటిదార్(32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా నామమాత్రంగానే ఆడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లు షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్‌లకు రెండు చొప్పున వికెట్లు దక్కగా.. దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్, స్పిన్ బౌలర్ హార్లీ ఒక్కో వికెట్ పడగొట్టాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 90.6: శ్రీకర్ భరత్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో షోయబ్ బషీర్‌కు క్యాచ్ ఇచ్చి భరత్ (17) పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 330-6(91) 88వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు: 307/5 యశస్వి జైస్వాల్ 168, శ్రీకర్ భరత్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా ►85.3: షోయబ్ బషీర్ బౌలింగ్‌లో రెహాన్ క్యాచ్ ఇచ్చిన అక్షర్ పటేల్. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగిన ఆల్‌రౌండర్. లోకల్ స్టార్ శ్రీకర్ భరత్ క్రీజులోకి వచ్చాడు. టీమిండియా @ 300 ►84: మూడు వందల పరుగుల మార్కు అందుకున్న టీమిండియా 73 ఓవర్లలో టీమిండియా స్కోరు: 250-4 ►యశస్వి 142, అక్షర్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 71.1: ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్ బౌల్డ్(32). నాలుగో వికెట్ కోల్పోయిన భారత్. యశస్వి, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. 63 ఓవర్లలో టీమిండియా స్కోరు: 225/3 జైస్వాల్ 125, పాటిదార్ 25 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. టీ విరామ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. మూడో వికెట్ డౌన్.. శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. టామ్ హార్లీ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్‌కు ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్ వచ్చాడు. యశస్వీ జైశ్వాల్ సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 151 బంతుల్లో జైశ్వాల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జైశ్వాల్‌కు ఇది రెండో టెస్టు సెంచరీ. 50 ఓవర్లకు టీమిండియా స్కోర్: 175/2. క్రీజులో జైశ్వాల్(104), శ్రేయస్ అయ్యర్(23) పరుగులతో ఉన్నారు. 42 ఓవర్లకు టీమిండియా స్కోర్: 137/2 42 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ జైశ్వాల్(69) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(21) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 38 ఓవర్లకు భారత స్కోర్: 114/2 38 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(56), శ్రేయస్ అయ్యర్(14) పరుగులతో ఉన్నారు. లంచ్ విరామానికి భారత్ స్కోర్: 103/2 రెండో టెస్టు తొలి రోజు లంచ్ విరామానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(51), శ్రేయస్ అయ్యర్(4) పరుగులతో ఉన్నారు. జైశ్వాల్ హాఫ్ సెంచరీ ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 51 పరుగులతో జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. శుబ్‌మన్ గిల్ ఔట్.. 89 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. జేమ్స్ ఆండర్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 29 ఓవర్లకు భారత్ స్కోర్: 89/2, క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. జైశ్వాల్(41) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ అవుట్ 17.3: రోహిత్ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ మాయాజాలంలో చిక్కుకున్న టీమిండియా కెప్టెన్ ఒలీ పోప్‌నకు క్యాచ్ ఇచ్చి 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. గిల్ క్రీజులోకి వచ్చాడు. యశస్వి 26 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 41/1 (18) నిలకడగా ఆడుతున్న రోహిత్, జైశ్వాల్.. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్: 39/0, క్రీజులో యశస్వీ జైశ్వాల్(25), రోహిత్ శర్మ(14) పరుగులతో ఉన్నారు. పది ఓవర్లకు టీమిండియా స్కోరు: 23/0 యశస్వి, రోహిత్ ఆచితూచి ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి యశస్వి 13, రోహిత్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లకు టీమిండియా స్కోరు: 14/0 యశస్వి 9, రోహిత్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. ఖాతా తెరిచిన జైశ్వాల్.. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 9/0 తొలి ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(9), రోహిత్ శర్మ(0) ఉన్నారు. విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో రజిత్ పాటిదార్ భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌కు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరంగా కాగా.. పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలో పాటిదార్‌తో పాటు ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ అరంగేట్రం చేయగా.. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ 🚨 Toss Update 🚨 Captain @ImRo45 wins the toss and #TeamIndia elect to bat in Vizag 👌👌 Follow the match ▶️ https://t.co/UvEzFjxrS7 Zaheer Khan #TeamIndia | #INDvENG | #IDFCFIRSTBank pic.twitter.com/rpBJ1si3XM https://t.co/rpBJ1si3XM — Fatima Raza (@Fatima__ain) February 2, 2024