Madhya Pradesh vs Chandigarh: చండీఘడ్‌తో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ కెప్టెన్ కుమార్ కార్తికేయ అదరగొట్టాడు. ఏకంగా పది వికెట్లు కూల్చి జట్టుకు భారీ విజయం అందించాడు. కార్తికేయ అద్భుత ప్రదర్శనతో చండీఘడ్‌పై మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ మీద 125 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్ డిలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య ఇండోర్ వేదికగా డిసెంబరు 20న టెస్టు మ్యాచ్ ఆరంభమైంది.
ఈ క్రమంలో టాస్ గెలిచిన మధ్యప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశ్ దూబే(44) ఫర్వాలేదనిపించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రజత్ పాటిదార్ 88 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో అక్షత్ రఘువంశీ 77 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో 309 పరుగులకు మధ్యప్రదేశ్ ఆలౌట్ అయింది.
విలవిల్లాడిన చండీఘడ్
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చండీఘడ్‌కు మధ్యప్రదేశ్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. ఓపెనర్ అర్‌స్లాన్ ఖాన్ 34 పరుగులు చేయగా.. మిగతా ఆటగాళ్ల స్కోర్లు వరుసగా 1, 0, 1, 0, 4, 0, 1, 11(నాటౌట్), 0, 0.
చైనామన్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ 6 వికెట్లు కూల్చగా.. సారాంశ్ జైన్, ఆవేశ్ ఖాన్ తలా ఒక వికెట్ తీయగా.. అనుభవ్ అగర్వాల్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా బౌలర్లు చెలరేగడంతో చండీఘడ్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. 57 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో భారీ ఆధిక్యంలో ఉన్న మధ్యప్రదేశ్.. చండీఘడ్‌ను ఫాలో ఆన్ ఆడించగా 127 పరుగులకే కథ ముగిసిపోయింది. ఈసారి సారాంశ్ జైన్ 5 వికెట్లు పడగొట్టగా.. కుమార్ కార్తికేయ 4 వికెట్లు తీశాడు. ఆవేశ్‌కు ఒక వికెట్ దక్కింది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో 10 వికెట్లతో చెలరేగిన కుమార్ కార్తికేయ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: Ind VS Ban 2nd Test: టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్‌ను తప్పించి.. 12 ఏళ్ల తర్వాత..
Tymal Mills: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్.. లీగ్ నుంచి వైదొలిగిన క్రికెటర్
తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్!
Comments
Please login to add a commentAdd a comment