Avesh Khan
-
ఆవేశ్‌ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలం
Duleep Trophy 2024- Ind C vs Ind A అనంతపురం: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ ఆటగాడు అభిషేక్ పొరెల్ (113 బంతుల్లో 82; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఈ మేర స్కోరు చేయగలిగింది. నిజానికి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గ్రూప్ ‘సి’ జట్టు... చివరి మ్యాచ్‌లో అదే స్థాయి ప్రదర్శ కనబర్చడంలో తడబడింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)తో పాటు సాయి సుదర్శన్ (17), రజత్ పటిదార్ (0), ఇషాన్ కిషన్ (5), మానవ్ సుతార్ (2) విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ‘సి’ జట్టును బాబా ఇంద్రజిత్ (34)తో కలిసి అభిషేక్ ఆదుకున్నాడు. వరస విరామాల్లో వికెట్లు పడుతున్నా... ధాటిగా ఆడిన అభిషేక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మరోవైపు పులకిత్ నారంగ్ (114 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన భారత్ ‘సి’.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. భారత్ ‘ఎ’ జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు వెనుకబడి ఉంది.టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ఇదిలా ఉంటే.. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 224/7తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు చివరకు 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ (250 బంతుల్లో 124; 15 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... పేసర్ అవేశ్ ఖాన్ (68 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అనూహ్యంగా బ్యాట్‌తో అదరగొట్టాడు.టీ20 తరహాలో ఎడాపెడా భారీ షాట్లు ఆడిన అవేశ్ ఖాన్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (34; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టారు. -
నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్
దులిప్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా అనంతరపురం, బెంగళూరు వేదికలుగా దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ గురువారం ఆరంభమైంది.ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్విఇందులో భాగంగా ఇండియా-‘ఏ’ - ఇండియా- ‘బి’ జట్ల మధ్య తొలి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన ఇండియా- ‘ఏ’ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ తమ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి ఇండియా- ‘బి’ ఇన్నింగ్స్ ఆరంభించాడు.అనుభవజ్ఞుడైన అభిమన్యు ఈశ్వరన్‌కు ఇండియా- ‘ఏ’ పేసర్ ఆవేశ్ ఖాన్ అద్భుత బంతిని సంధించగా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిమన్యు నిష్క్రమించగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 59 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. హాట్ ఫేవరెట్‌గా దిగి.. విఫలంఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శశ్వత్ రావత్(సబ్‌స్టిట్యూట్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా తరఫున ఇప్పటికే మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు బాదిన యశస్వి జైస్వాల్ హాట్ ఫేవరెట్‌గా దులిప్ ట్రోఫీ బరిలో దిగాడు. అయితే, ఆరంభంలోనే ఇలా విఫలమై అభిమానులను నిరాశపరిచాడు. కాగా బంగ్లాదేశ్‌తో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో.. ఈ టోర్నీకి ప్రాధాన్యం ఏర్పడింది. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుంది. ఇదిలా ఉంటే.. తొలిరోజు 30 ఓవర్ల ఆట ముగిసే సరికి ఇండియా-‘బి’ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. అన్నదమ్ములు ముషీర్ ఖాన్ ఆరు, సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇండియా-‘ఏ’ వర్సెస్ ఇండియా- ‘బి’ తుదిజట్లుఇండియా-‘ఏ’శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్.ఇండియా- ‘బి’అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, ముకేష్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాల్.చదవండి: ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్.. వీడియో వైరల్ -
T20 WC: గిల్‌తో పాటు అతడు ఇంటికి! వాళ్లిద్దరు అక్కడే..
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు చేరుకున్న రోహిత్ సేన.. తదుపరి కెనడాతో తలపడనుంది.ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్లో ఇరు జట్ల మధ్య జూన్ 15న మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ తెరమీదకు వచ్చింది.వరల్డ్‌కప్-2024 జట్టులో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, యువ పేసర్ ఆవేశ్ ఖాన్ స్వదేశానికి తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే, వీరితో పాటు ఇదే కేటగిరిలో ఉన్న రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మాత్రం ప్రధాన జట్టుతో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వీరు నలుగురు టీమిండియాతో కలిసి చార్టెడ్ ఫ్లైట్‌లో ఫ్లోరిడాకు చేరుకున్నట్లు సమాచారం. అక్కడ కెనడాతో మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్, ఆవేశ్ ఖాన్ భారత్‌కు తిరిగి పయనం కానున్నట్లు తెలుస్తోంది. కారణం ఏమిటి?ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉన్నాడు. సంజూ శాంసన్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది.ఈ నేపథ్యంలో గ్రూప్ దశ ముగిసిన తర్వాత ఇక శుబ్‌మన్ గిల్‌తో అవసరం ఉండదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. గ్రూప్ దశలోని నాలుగు మ్యాచ్‌లు అమెరికాలో పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా.. మిగతా మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్‌కు వెళ్లనుంది.అవసరం లేదుఇక విండీస్ పిచ్‌లు స్లోగా.. స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదనపు పేసర్‌తో అవసరం లేదు.ఇప్పటికే పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎక్స్ట్రాగా ఆవేశ్ ఖాన్‌ను ఇంటికి పంపించాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే, హిట్టర్ రింకూ సింగ్‌తో పాటు బ్యాకప్ పేసర్‌గా ఖలీల్ అహ్మద్‌ను మాత్రం కొనసాగించనుందని సమాచారం. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఇప్పటి వరకు ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా జట్లపై విజయాలు సాధించింది. గ్రూప్- ఏ టాపర్‌గా సూపర్-8కు అర్హత సాధించింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
#Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్‌కు తొలిసారి ఓటమి ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలుపొంది జోరు మీదున్న సంజూ సేనకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. రాయల్స్‌ను వారి తమ సొంత మైదానంలోనే ఓడించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక తమ జైత్రయాత్రకు బ్రేక్ పడటంపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విచారం వ్యక్తం చేశాడు. ఆఖరి బంతికి ఫలితం తారుమారైందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకుందని పేర్కొన్నాడు. మాట్లాడలేకపోతున్నా.. అక్కడే ఓడిపోయాం ఈ మేరకు ఓటమి అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ చివరి బంతికి మ్యాచ్ మా చేజారింది. మ్యాచ్ ఓడిన కెప్టెన్‌గా ఇలాంటి సమయంలో మాట్లాడటం కష్టంగా ఉంది. భావోద్వేగాలు అదుపులోకి వస్తే గానీ నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేను. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాడటమనేది ఈ టోర్నీకి ఉన్న ప్రత్యేకత. ఇది మా బౌలర్ల తప్పే మేము తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన సమయం. నిజానికి నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 180 మంచి స్కోరే అనుకున్నా. అయితే, మేము లక్కీగా 196 పరుగులు చేశాం. కచ్చితంగా అది విన్నింగ్ స్కోరే. పిచ్‌పై తేమ లేదు కాబట్టి మా బౌలింగ్ విభాగం పనిపూర్తి చేయాల్సింది. జైపూర్‌లో 197.. తేమ లేని వికెట్‌పై డిఫెండ్ చేయడం అంత కష్టమేమీ కాదు’’ అంటూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపాడు. రాణించిన సంజూ, రియాన్ పరాగ్ కాగా జైపూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8) నామమాత్రపు స్కోర్లకు పరిమితం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 68 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్ మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్(48 బంతుల్లో 76)తో అదరగొట్టాడు. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 అంతా రషీద్ ఖాన్ వల్లే ఆఖర్లో హెట్మెయిర్ మెరుపులు(5 బంతుల్లో 13- నాటౌట్) మెరిపించగా.. రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డప్పటికీ గుజరాత్ ఆఖరి బంతి వరకు పోరాడి విజయాన్ని అందుకుంది. శుబ్‌మన్ గిల్(72) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రషీద్ ఖాన్(11 బంతుల్లో 24- నాటౌట్) రాజస్తాన్‌ను గెలుపునకు దూరం చేశాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. ఏకంగా ఫోర్ బాది గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 రాజస్తాన్ వర్సెస్ గుజరాత్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: IPL 2024: కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. గుజరాత్ సంచలన విజయం -
4 వికెట్లతో చెలరేగిన అవేష్ ఖాన్.. ప్రత్యర్ధి 170 పరుగులకే ఆలౌట్
నాగ్‌పూర్ వేదికగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ తొలి సెమీఫైనల్లో విధర్బ, మధ్యప్రదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ క్రమంలో మొదటి రోజు ఆటలో మధ్యప్రదేశ్ బౌలర్లు చెలరేగారు. మధ్యప్రదేశ్ బౌలర్ల దాటికి విధర్బ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. ఎంపీ బౌలర్లలో పేసర్ అవేష్ ఖాన్ 4 వికెట్లతో ప్రత్యర్ధి జట్టు దెబ్బతీయగా.. కుల్వంత్ ఖేజ్రోలియా, వెంకటేశ్ అయ్యర్ తలా రెండు వికెట్లతో రాణించారు. విధర్బ బ్యాటర్లలో కరుణ్ నాయర్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ టైడే(39) పరుగులతో పర్వాలేదన్పించాడు. ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో హిమాన్షు(26), హర్ష్ గౌలీ(10) ఉన్నారు. చదవండి: #BCCI: శ్రేయస్ అయ్యర్‌పై అగార్కర్ సీరియస్.. అసలు కారణమిదే? -
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. ఆ ఇద్దరిపై వేటు..?
కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే రెండో టెస్ట్‌లో టీమిండియా పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన ప్రసిద్ద్ కృష్ణ (1/93), శార్దూల్ ఠాకూర్ (1/101) స్థానంలో ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ తుది జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైంది. ప్రసిద్ద్ (0,0), శార్దూల్ (24, 2) తొలి టెస్ట్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు బ్యాటింగ్‌లో నామమాత్రంగా కూడా ప్రభావం చూపలేకపోయారు. దీంతో మేనేజ్మెంట్ ఈ ఇద్దరిని తప్పించి ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ ఇప్పటికే నెట్స్‌లో సాధన చేయడం కూడా మొదలుపెట్టారు. రెండో టెస్ట్ కోసం టీమిండియా ఆదివారం కేప్‌టౌన్‌కు బయల్దేరనుంది. రేపటి నుంచి భారత్ అక్కడే ప్రాక్టీస్ చేయనుంది. సిరీస్ కాపాడుకోవాలంటే రెండో టెస్ట్ తప్పక గెలవాల్సి ఉండటంతో టీమిండియా ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. వ్యక్తిగతంగానూ ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు చాలా కీలకంగా మారింది. టీమిండియా రెండో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాలని పట్టుదలగా ఉంది. కాగా, మొహమ్మద్ షమీ గైర్హాజరీలో ఆవేశ్ ఖాన్ భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్‌లో ఆవేశ్ ఖాన్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఆవేశ్ ఖాన్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 131 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (76) ఒక్కడే ఒంటరిపారాటం చేశాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేష్ ఖాన్ -
ఆవేశ్ ఖాన్‌కు 5 వికెట్లు: తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే
South Africa A vs India A, 2nd unofficial Test: సౌతాఫ్రికా-‘ఏ’ జట్టుతో అనధికారిక రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు తిలక్ వర్మ, అక్షర్ పటేల్ అర్ధ శతకాలతో రాణించారు. యూపీకి చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. కాగా ప్రొటిస్ యువ జట్టుతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్-ఏ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగియగా.. బెనోనీలో బాక్సింగ్ డే మొదలుకావాల్సిన రెండో టెస్టు వర్షం కారణంగా ఒకరోజు ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ పడకుండానే తొలి రోజు ముగిసిపోగా.. రెండో రోజు ఆట సందర్భంగా టాస్ గెలిచిన భారత్-ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆవేశ్ ఖాన్‌కు ఐదు వికెట్లు ఆతిథ్య సౌతాఫ్రికా-ఏ జట్టును 263 పరుగులకు పరిమితం చేసింది. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో టెయిలెండర్ షెపో మొరేకీ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత పేసర్లలో ఆవేశ్ ఖాన్ అత్యధికంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ ఒక వికెట్ పడగొట్టాడు. స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో చివరిదైన నాలుగో రోజు ఆటలో భాగంగా.. శుక్రవారం బ్యాటింగ్ కొనసాగించిన భారత్-ఏ.. 95.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ కూడా ముగిసిపోయింది. అక్షర్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఇక భారత్ ఇన్నింగ్స్‌లో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ 169 బంతులు ఎదుర్కొని 50 పరుగులు సాధించగా.. అక్షర్ పటేల్ 61 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాపార్డర్‌లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 18, సాయి సుదర్శన్ 30, వన్‌డౌన్‌లో దిగిన రజత్ పాటిదార్ 33 పరుగులు సాధించారు. మిగతా వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ 34, వాషింగ్టన్ సుందర్(9- నాటౌట్) రన్స్ చేశారు. రోహిత్ సేనతో చేరిన భరత్ కాగా ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో భారత్-ఏ జట్టు సౌతాఫ్రికాకు వెళ్లింది. అతడి కెప్టెన్సీలో తొలి టెస్టు డ్రా చేసుకుంది. అయితే, భరత్ టీమిండియాతో చేరే క్రమంలో ‘ఏ’ జట్టుకు దూరం కాగా.. అభిమన్యు ఈశ్వరన్ అతడి స్థానంలో రెండో టెస్టులో జట్టును ముందుండి నడిపించాడు. ఇక అనధికారిక టెస్టుల్లో మ్యాచ్‌లు నాలుగు రోజుల పాటే సాగుతాయన్న విషయం తెలిసిందే. -
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. టీమిండియాలోకి యువ పేసర్
జనవరి 3 నుంచి సౌతాఫ్రికాతో జరుగనున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా ఓ మార్పు చేసింది. టెస్ట్ సిరీస్ కోసం తొలుత ఎంపిక చేయబడిన మొహమ్మద్ షమీ.. ఫిట్నెస్ క్లియెరెన్స్ లభించని కారణంగా సిరీస్ మొత్తానికే దూరం కాగా.. 27 ఏళ్ల మధ్యప్రదేశ్ పేసర్ ఆవేశ్ ఖాన్ షమీ స్థానంలో రెండో టెస్ట్ కోసం టీమిండియాలోకి వచ్చాడు. ఈ విషయాన్ని భారత సెలెక్టర్లు ఇవాళ (డిసెంబర్ 29) అధికారికంగా ప్రకటించారు. ఆవేశ్ ఖాన్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 6 వికెట్లతో రాణించిన కారణంగా రెండో టెస్ట్ కోసం అతన్ని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు చెప్పారు. ఆవేశ్ ఖాన్ భారత టెస్ట్ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఆవేశ్.. టీమిండియా తరఫున ఇప్పటివరకు 8 వన్డేలు, 19 టీ20లు ఆడి ఓవరాల్‌గా 27 వికెట్లు పడగొట్టాడు. కాగా, సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత దారణంగా విఫలమై 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (76) ఒంటరిపారాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్‌తో పాటు కేవలం శుభ్‌మన్ గిల్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. వచ్చే ఏడాది (2024) జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), అభిమన్యు ఈశ్వరన్, అవేష్ ఖాన్ -
IND VS SA 1st ODI: సౌతాఫ్రికాపై టీమిండియా పేసర్ల చరిత్ర
దక్షిణాఫ్రికాపై టీమిండియా పేసర్లు చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత పేసర్లు ఓ మ్యాచ్‌లో (వన్డే) అత్యధికంగా 9 వికెట్లు పడగొట్టారు. 1993 మొహాలీలో, 2013 సెంచూరియన్‌లో జరిగిన వన్డేల్లో టీమిండియా పేస్ గన్స్ 8 వికెట్లు పడగొట్టగా.. తాజాగా భారత పేస్ ద్వయం అర్ష్‌దీప్ సింగ్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) ఆ రికార్డులను అధిగమించి, నయా రికార్డు నెలకొల్పింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు ఈ రికార్డు నెలకొల్పారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. భారత పేస్ ద్వయం అర్ష్‌దీప్, ఆవేశ్ ఖాన్ నిప్పులు చెరగడంతో 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్‌కు ఓ వికెట్ దక్కింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జి (28), ఫెహ్లుక్వాయో (33), మార్క్రమ్ (12), తబ్రేజ్ షంషి (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన భారత్.. ఆడుతూపాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 9 ఓవర్ల తర్వాత భారత్ రుతురాజ్ (5) వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే మరో 62 పరుగులు చేయాలి. రుతురాజ్ వికెట్ ముల్దర్‌కు దక్కింది. -
IPL 2024: రాజస్తాన్ రాయల్స్ కీలక ప్రకటన.. అతడిని వదిలేసి..
IPL 2024- Avesh Khan: ఐపీఎల్-2024 వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాపార్డర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్‌ను వదిలేసి.. అతడి స్థానంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంది. మరో ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో డైరెక్ట్ స్వాప్ పద్ధతిలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. లక్నోకు చెందిన ఆవేశ్‌ను తాము తీసుకుని.. బదులుగా పడిక్కల్‌ను ఆ ఫ్రాంఛైజీకి ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాజస్తాన్ రాయల్స్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. లక్నో 10 కోట్లకు కొంటే.. రాజస్తాన్ కూడా కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో లక్నో ఫ్రాంఛైజీ రూ. 10 కోట్లు వెచ్చించి ఆవేశ్ ఖాన్‌ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో లక్నో తరఫున 22 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ 26 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు అదే ధరకు రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ అయ్యాడు. పడిక్కల్‌కు అంతమొత్తం ఇవ్వనున్న లక్నో మరోవైపు.. గతంలో.. రాజస్తాన్ పడిక్కల్‌ను 7.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా.. లక్నో అంత మొత్తం అతడికి చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా 57 మ్యాచ్‌లు ఆడిన దేవ్‌దత్ పడిక్కల్.. 1521 పరుగులు చేశాడు. ఈ లెఫ్టాండర్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ శతకం, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక రాజస్తాన్ తరఫున పడిక్కల్ 28 మ్యాచ్‌లు ఆడి 637 పరుగులు సాధించాడు. కాగా ఆవేశ్ ఖాన్ ప్రస్తుతం టీమిండియాతో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో జట్టుకు ఎంపికైన అతడు.. నవంబరు 23న జరుగనున్న తొలి మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం? To all those hits and a smile we'll miss. Go well, DDP! 💗💗💗 pic.twitter.com/ONpXOULjNY — Rajasthan Royals (@rajasthanroyals) November 22, 2023 🚨Trade Alert: Right-arm quick Avesh Khan will now #HallaBol in Pink! 🔥 Devdutt Padikkal moves to LSG and we wish him the best for his new chapter. 💗 pic.twitter.com/ZiTzxB5f8o — Rajasthan Royals (@rajasthanroyals) November 22, 2023 -
ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌పై కన్నేసింది. ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే తొలి టీ20లో గెలుపొందిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక రెండో టీ20లో టీమిండియా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో విఫలమైన అర్ష్‌దీప్ సింగ్‌పై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో మరో పేసర్ అవేష్ ఖాన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ జితీష్ శర్మకు అవకాశం ఇవ్వాలనకుంటే శాంసన్‌ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్‌రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ! -
Ind vs WI T20s: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. తిలక్ వర్మ ఎంట్రీ ఖాయం!
IND vs WI T20 series 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా యువ ఆటగాళ్లు కరేబియన్ దీవికి పయనమయ్యారు. బౌలర్లు రవి బిష్ణోయి, ఆవేశ్ ఖాన్‌లతో పాటు తొలిసారి జట్టుకు ఎంపికైన తిలక్ వర్మ తదితరులు విమానంలో విండీస్‌కు బయల్దేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అడిడాస్ రూపొందించిన బ్లాక్ కలర్ ట్రెయినింగ్ జెర్సీలు ధరించిన రవి, ఆవేశ్, తిలక్.. విమానంలో చిల్ అవుతూ ఫొటోలకు పోజులిచ్చారు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. నెల రోజుల పర్యటన జూలై 12న మొదటి టెస్టుతో ఈ టూర్ మొదలైంది. ఇక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకోగా.. గురువారం(జూలై 27) నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే వైస్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్ తదితర ఆటగాళ్లు విండీస్‌కు చేరుకున్నారు. తిలక్ వర్మ ఎంట్రీ ఖాయం! ఇక ఆగష్టు 1న వన్డే సిరీస్ ముగియనుండగా.. 3 నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. విండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం డొమినికా మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. రెండో టెస్టు సందర్భంగా యువ పేసర్ ముకేశ్ కుమార్ సైతం ఎంట్రీ ఇచ్చాడు. బలహీన విండీస్‌పై ఇలా వరుసగా టీమిండియా యంగ్ క్రికెటర్ల అరంగేట్రాల నేపథ్యంలో టీ20 సిరీస్‌లోనూ కొత్త ముఖాలు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున మంచి హిట్టర్‌గా పేరొందిన హైదరాబాదీ తిలక్ వర్మ కూడా క్యాప్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఆగష్టు 3- 13 వరకు జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20కి హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనుండగా.. సూర్యకుమార్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్. చదవండి: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! -
మీకు ఓవరాక్షన్ స్టారే దొరికాడా.. చెత్త సెలక్షన్! వాళ్లు ఉండాల్సింది!
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాయి. అయితే విండీస్ సిరీస్‌కు సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా ఫామ్‌లో లేని ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్‌ను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అదే విధంగా ఐపీఎల్లో అదరగొట్టిన కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్‌ను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై కూడా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అవేష్ ఖాన్ విషయానికి వస్తే.. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా అవేష్ ఖాన్ దారుణంగా నిరాశపరిచాడు. ఐపీఎల్-2023లో 9 మ్యాచ్‌లు ఆడిన అవేష్.. 9.75 ఏకానమితో 9 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా జాతీయ జట్టు తరపున వచ్చిన అవకాశాలు కూడా అందుపోచ్చుకోలేకపోయాడు. గతేడాది భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అవేష్ ఖాన్.. పెద్దగా రాణించకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దాదాపు అతడు ఏడాది నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అనూహ్యంగా సెలక్టర్లు అతడికి పిలుపునివ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతడి స్ధానంలో ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన తుషార్ దేశ్ పాండే లేదా ఆకాష్ మధ్వాల్ అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది పలువురు ప్రాయపడుతున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. మీకు ఈ ఓవరాక్షన్ స్టారే దొరికాడా అంటూ సెలక్టర్లు ఉద్దేశించి పోస్ట్ చేశాడు. అవేష్ ఓవరాక్షన్.. ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలిసారి తలపడిన మ్యాచ్‌లో లక్నో అనూహ్య రీతిలో విజయం సాధించింది. ఓటమి తప్పదు అనుకున్న తరుణంలో ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో జయకేతనం ఎగురవేసింది. ఈ సమయంలో క్రీజులో ఉన్న ఆవేశ్ ఖాన్ ఓవర్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి దూకుడు ప్రదర్శించాడు. దీంతో ఆవేశ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. ఇక ఇప్పటివరకు టీమిండియా తరపున ఐదు వన్డేలు, 15 టీ20లు ఆడిన అవేష్ ఖాన్ వరుసగా 3, 13 వికెట్లు పడగొట్టాడు. చదవండి: తండ్రి కష్టం ఊరికే పోలేదు.. టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు -
ఆవేశ ఖాన్ ఆశ నెరవేరుతుందా ?
-
IPL 2023: నిజంగానే ఆరోజు ఓవరాక్షన్ చేశాను! నా ప్రవర్తన వల్ల..
IPL 2023 RCB Vs LSG: టీమిండియా క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆవేశ్ ఖాన్.. ఆర్సీబీతో మ్యాచ్‌లో తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను అలా హెల్మెట్ విసిరి ఉండాల్సింది కాదన్నాడు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని.. ఏదేమైనా అలా అతి చేయడం తప్పేనని అంగీకరించాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలిసారి తలపడిన మ్యాచ్‌లో లక్నో అనూహ్య రీతిలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి తప్పదు అనుకున్న తరుణంలో ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో జయకేతనం ఎగురవేసింది. హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి చిన్నస్వామి స్టేడియంలో ఈ దృశ్యాన్ని చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ హృదయాలు ముక్కలు కాగా.. ఆ సమయంలో క్రీజులో ఉన్న ఆవేశ్ ఖాన్ ఓవర్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి దూకుడు ప్రదర్శించాడు. దీంతో ఆవేశ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. ఇక బీసీసీఐ సైతం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మందలించింది. మొదటి తప్పిదం కాబట్టి ఈసారికి వదిలేస్తున్నామంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేశ్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. నా ప్రవర్తన వల్ల.. ఆ ఘటన తర్వాత తాను ఓవరాక్షన్ చేయకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపపడ్డాడు. ‘‘హెల్మెట్ విసరడం కాస్త ఓవర్ అయ్యింది. ఈ ఘటన కారణంగా సోషల్ మీడియాలో నాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. నిజానికి గెలిచామన్న సంతోషంలో నేనలా చేశానే తప్ప ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. ఆ క్షణంలో అలా జరిగిపోయిందంతే! కానీ మైదానం వీడిన తర్వాతే నేనేం చేశానో నాకు తెలిసి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ నేను చింతిస్తున్నాను. అలా ఎందుకు చేశానన్న బాధ వెంటాడుతూనే ఉంది’’ అని ఆవేశ్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్‌నకు చేరుకున్న లక్నో.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజా సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్‌గా నిలవగా.. గుజరాత్ టైటాన్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే.. 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
'వెస్టిండీస్ టూర్.. భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న'
టీమిండియా వచ్చే నెలలో విండీస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో భాగంగా భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12న డొమెనికా వేదికగా జరగునున్న తొలి టెస్టుతో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఇక విండీస్ టూర్‌కు భారత జట్టును బీసీసీఐ జూన్ 27న ప్రకటించనుంది. కాగా విండీస్ టూర్ ముగిసిన అనంతరం భారత జట్టు ఐర్లాండ్‌కు వెళ్లనుంది. అక్కడ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐరీష్ జట్టుతో భారత్ తలపడనుంది. మళ్లీ వస్తా.. ఇక వరుస సిరీస్‌ల నేపధ్యంలో మళ్లీ భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తానని యువ పేసర్ అవేశ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. "భారత జట్టులో ఉండాలని నేను ఆశిస్తున్నాను. కానీ అది నా చేతిలో లేదు. ప్రతీ ఒక్కరి కెరీర్లో ఎత్తు పల్లపల్లాలు ఉంటాయి. నేను రీ ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అవేశ్ ఖాన్ పేర్కొన్నాడు. గతేడాది భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అవేష్ ఖాన్.. పెద్దగా రాణించకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున ఐదు వన్డేలు, 15 టీ20లు ఆడిన అవేష్ ఖాన్ వరుసగా 3, 13 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కూడా అంతగా రాణించలేకపోయాడు ఐపీఎల్ 2023లో 9 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 8 వికెట్లు మాత్రమే సాధించాడు. చదవండి: CWC Qualifier 2023: కోహ్లి, బాబర్ ఆజమ్‌లను మించిపోయిన వెస్టిండీస్ కెప్టెన్ -
నేనెవరినీ స్లెడ్జ్ చేయను.. అది నా అలవాటు కాదు: కోహ్లితో గొడవపడ్డ నవీన్ ఉల్ హక్
IPL 2023: కొద్ది రోజుల క్రితం ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితో గొడవపడిన లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్, తాజాగా సహచరుడు ఆవేశ్ ఖాన్‌తో జరిగిన ఓ చాట్ షోలో (ఎక్దమ్ టైట్, ఎక్దమ్ రైట్ బై బాండ్ టైట్) ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. సరదాగా సాగిన ఆవేశ్-నవీన్ ఉల్ హక్ మధ్య సంభాషణను ఎల్ఎస్జీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరలవుతుంది. Avesh. Naveen. Too much fun 😂 Also, wait till 1.39 👀@AstralAdhesives | #bondtite pic.twitter.com/QlKnyZSgHu — Lucknow Super Giants (@LucknowIPL) May 12, 2023 ఆవేశ్-నవీన్ ఒకరినొకరు ప్రశ్నలు సంధించుకున్న ఈ షోలో స్లెడ్జింగ్ గురించిన ఓ ప్రశ్నను ఆవేశ్.. నవీన్‌ను అడిగాడు. ఫీల్డ్‌లో నువ్వు చేసిన లేదా ఎదుర్కొన్న ఫేవరెట్ స్లెడ్జ్ ఏంటని ఆవేశ్..నవీన్‌ను అడిగాడు. దీనికి నవీన్ ఠక్కున స్పందిస్తూ.. నేనెవరిని ముందుగా స్లెడ్జింగ్ చేయను.. అది నా అలవాటు కాదు అని అన్నాడు. దీనికి ఆవేశ్ కచ్చితంగా సమాధానం చెప్పాలన్నట్లుగా పట్టుబట్టడంతో నవీన్ ఏదో సొల్లు చెప్పే ప్రయత్నం చేశాడు. ఓ ఫస్ట్ క్లాస్ గేమ్ సందర్భంగా నాతో పాటు క్రీజ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఫీల్డర్ స్లెడ్జ్ చేశాడని, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ ఫీల్డర్.. ఇదే లాస్ట్ వికెట్, త్వరగా ఔట్ చేస్తే నేను ఇంటికి వెళ్లాలి, నాకు నిన్ననే పెళ్లైంది అని స్లెడ్జ్ చేశాడంటూ పస లేని విషయాన్ని స్లెడ్జింగ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మధ్యలో ఆవేశ్ కలగజేసుకుని.. ఇది ఫన్నీ ఇన్సిడెంట్, సీరియస్‌గా జరిగిన స్లెడ్జింగ్ గురించి చెప్పు అంటూ పట్టుబట్టాడు. దీనికి నవీస్ స్పందిస్తూ.. సీరియస్‌గా జరిగినవి ఏవీ లేవని బదులిచ్చాడు. నవీన్.. కోహ్లితో జరిగిన వివాదం ప్రస్తావన తేకపోవడంతో వీరి మధ్య సంధి కుదిరిందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే కోహ్లి-నవీన్-గంభీర్ల మధ్య గొడవ పూర్తయ్యాక చాలా రోజుల పాటు ఈ ముగ్గురి మధ్య (కోహ్లితో గంభీర్, నవీన్) సోషల్‌మీడియా వార్ జరిగిన విషయం తెలిసిందే. దూకుడుగా ఉండే కోహ్లి, గంభీర్‌లు ఎప్పుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో లక్నో, ఆర్సీబీల పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తదుపరి ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో (3) గెలవాల్సి ఉంది. ప్రస్తుతం లక్నో, ఆర్సీబీ 11, 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5, 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. రోహిత్, కోహ్లి పనైపోయింది: టీమిండియా మాజీ క్రికెటర్ -
నక్క తోక తొక్కిన పాండ్యా..
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నక్క తోక తొక్కాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతిని ఆవేశ్ ఖాన్ గుడ్‌లెంగ్త్ డెలివరీ వేశాడు. ఫ్లిక్ చేయడంతో మిస్ అయిన బంతి పాండ్యా ప్యాడ్లకు తాకి వికెట్ల వెనకాలకు వెళ్లింది. అయితే బంతి వేగంగా వెళ్లి వికెట్లను తాకినప్పటికి బెయిల్స్ మాత్రం కిందపడలేదు. ఒకవేళ బెయిల్స్ కింద పడి ఉంటే మాత్రం పాండ్యా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చేది. ఇంతలో ఆవేశ్ ఖాన్ పాండ్యా వైపు దూసుకురాగా.. అప్పటికే పాండ్యా బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. బంతిని అందుకున్న ఆవేశ్ ఖాన్ స్టంప్స్‌ను తాకించడంతో నవ్వులు విరపూశాయి.మొత్తానికి తొలి బంతికే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడినప్పటికి పాండ్యా ఆ చాన్స్‌ను ఉపయోగించుకోలేకపోయాడు. 25 పరుగులు చేసి మోసిన్ ఖాన్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Bails don't want to fall when Hardik Pandya is batting. Avesh Khan not happy with this character of the ball. 😂#GTvsLSG #LSGvsGT pic.twitter.com/t7uzfff6Ul — Vikram Rajput (@iVikramRajput) May 7, 2023 చదవండి: రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్! -
సారీ బ్రో.. నీలో ఇంత టాలెంట్ ఉందా? అస్సలు ఊహించలేదు
ఐపీఎల్-2023లో వరుసగా విఫలమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అవేష్ ఖాన్.. ఎట్టకేలకు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అవేష్ ఖాన్ అదరగొట్టాడు. అవేష్ ఖాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి 6.20 ఎకానమీ రేటుతో 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముఖ్యంగా హెట్‌మైర్, పడిక్కల్ వంటి కీలక వికెట్లు పడగొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. లక్నో కెప్టెన్ బంతిని అవేష్ ఖాన్ చేతికి ఇచ్చాడు. అవేష్ తొలి బంతికి ఫోర్ ఇచ్చినప్పటికీ.. తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. వెంటనే వరుసగా పడిక్కల్, జురెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. చివరి ఓవర్లో అవేష్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన అతడు 6 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇంతకుమందు ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో.. అవేష్ ఖాన్ తన హెల్మెట్‌ను నెలకేసి కొట్టి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అదే విధంగా అతడి బౌలింగ్ ప్రదర్శనపై కూడా నెటిజన్లు మీమ్స్ వర్షం కురిపించారు. సారీ బ్రో.. నీలో ఇంతా టాలెంట్ ఉందా? ఇక అవేష్‌ను విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి. డెత్ ఓవర్లలో అవేష్ అద్భుతంగా బౌలింగ్ చేసాడని కొనియాడుతున్నారు. సారీ బ్రో.. నీలో ఇంతా టాలెంట్ ఉందా? అస్సలు ఊహించలేదంటూ ఓ యూజర్ ట్విట్ చేశాడు. చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి.. -
IPL 2023: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్’ ఖాన్‌కు ఊహించని షాక్!
IPL 2023- Avesh Khan Throws Helmet To Celebrate: ఓటమి తప్పదనుకున్న వేళ అనూహ్యంగా విజయం వరిస్తే.. ఆనందంతో ఎగిరి గంతులేయడంలో తప్పులేదు. కానీ శ్రుతిమించి హద్దులు దాటితే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. టీమిండియా పేసర్, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్‌కు ఇలాంటి హెచ్చరికనే జారీ చేశారు ఐపీఎల్ నిర్వాహకులు. చెలరేగిన కోహ్లి, డుప్లెసిస్ ఐపీఎల్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్‌కు కోహ్లితో 96 పరుగులు (69 బంతుల్లో) జోడించిన డుప్లెసిస్, రెండో వికెట్‌కు మ్యాక్స్‌వెల్‌తో 115 పరుగులు (50 బంతుల్లో) జత చేశాడు. పూరన్ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు అనంతరం లక్నో 20 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు సాధించి గెలిచింది. స్టొయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (19 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగా, ఆయుష్ బదోని (24 బంతుల్లో 30; 4 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. ఆఖర్లో బై రూపంలో వచ్చిన పరుగు లక్నో గెలుపును ఖరారు చేసింది. వైల్డ్ సెలబ్రేషన్.. ఓవరాక్షన్ వద్దు ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. క్రీజులో ఉన్న ఆవేశ్ ఖాన్ అయితే మరీ దూకుడుగా ప్రవర్తించాడు. హెల్మెట్ నేలకేసి కొట్టి వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ అతడికి చురకలు అంటిస్తున్నారు. ఆవేశ్ ఖాన్‌కు మందలింపు తాజాగా.. ఐపీఎల్ నిర్వాహకులు సైతం మితిమీరి ప్రవర్తించిన ఆవేశ్ ఖాన్‌ను మందలిస్తూ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ లక్నో సూపర్ జెయింట్స్ ఆవేశ్ ఖాన్‌ను మందలింపుగా ఈ ప్రకటన. మిస్టర్ ఆవేశ్ ఐపీఎల్ కోడ్‌లోని 2.2 నిబంధనను అతిక్రమించాడు’’ అని పేర్కొన్నారు. మొదటి తప్పిదం కావున మందలింపుతో సరిపెడుతున్నట్లు వెల్లడించారు. చదవండి: IPL 2023: కాస్త హుందాగా ప్రవర్తించు గంభీర్! మీకు మా కోహ్లి చేతిలో ఉందిలే! RCB Vs LSG: ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో షాక్.. భారీ జరిమానా ఎంత పనిచేశావు కార్తీక్.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్ 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
RCB Vs LSG: కనీసం బంతిని టచ్ చేయలేదు.. మరీ అంత ఓవరాక్షన్ పనికిరాదు!
Royal Challengers Bangalore vs Lucknow Super Giants: లక్నో సూపర్ జెయింట్స్ పేసర్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ తన చర్యతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో లక్నో థ్రిల్గింగ్ విక్టరీ సాధించింది. అయితే లక్నో విజయానికి ఆఖరి ఓవర్లో 5 పరుగులు అవసరమయ్యాయి. కీలకమైన చివరి ఓవర్ వేసేందుకు ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బంతిని హర్షల్ పటేల్‌కు ఇచ్చాడు. తొలి బంతిని జయదేవ్ ఉనద్కట్ సింగిల్ తీసి వుడ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. రెండో బంతికి వుడ్ క్లీన్ బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. నాలుగో బంతికి బిష్ణోయ్ సింగిల్ తీసి ఉనద్కట్కు స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో స్కోర్లు లెవల్ అయ్యాయి. అయితే ఐదో బంతికి ఉనద్కట్ పెవిలియన్‌కు చేరాడు. చివరి వికెట్‌గా అవేష్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. ఆఖరి బంతికి లక్నో విజయానికి ఒక్క పరుగు అవసరమయ్యింది. హర్షల్ వేసిన ఆఖరి బంతిని వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అందుకోవడంలో విఫలమకావడంతో.. అవేష్-బిష్ణోయ్ బై రూపంలో పరుగు తీసి లక్నోకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆఖరి బంతికి విజయం సాధించగానే లక్నో డగౌట్ సంబరాల్లో మునిగి తేలిపోయింది. అవేష్ ఖాన్ ఓవరాక్షన్.. అయితే విన్నింగ్ సెలబ్రేషన్స్ జరుపుకొనే క్రమంలో అవేష్ ఖాన్ హద్దులు మితిమీరాడు. ఆఖరి బంతికి పరుగు తీసిన వెంటనే అవేష్ తన హెల్మెట్‌ను నెలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అవేష్ ఖాన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కనీసం బంతినే టచ్ చేయలేకపోయావు.. నీకు ఇంత ఓవరాక్షన్ అవసరమా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో అవేష్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: IPL 2023: అయ్యో హర్షల్ పటేల్.. ఆ పని ముందే చేయాల్సింది! అలా జరిగుంటేనా! వీడియో వైరల్ IPL 2023 Dinesh Karthik: ఎంత పనిచేశావు కార్తీక్.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్ Avesh khan - 130* runs in just 45 balls Greatest finisher ever!!!🔥☕ pic.twitter.com/NWaxeIpzUZ — 999rohi 🦂 (@rohithhh_69) April 10, 2023 Congratulations Avesh Khan Lovely 50 🤩 Welcome to the Academy pic.twitter.com/J8Fr43Vq72 — Dinda Academy (@academy_dinda) April 10, 2023 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
చరిత్ర సృష్టించిన భారత యువ కెరటం.. డెబ్యూలోనే డబుల్ సెంచరీ, సెంచరీ
Yashasvi Jaiswal: భారత యువ కెరటం, ఉత్తర్‌ప్రదేశ్ బార్న్ ముంబై క్రికెటర్ యశస్వి జైస్వాల్ దేశవాలీ టోర్నీ ఇరానీ కప్‌లో ఇరగదీశాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి.. అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు), సెంచరీతో (132 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టి, టీమిండియాలో చోటు కోసం దూసుకొస్తున్నాడు. ఇటీవలి కాలంలో దేశవాలీ క్రికెట్లో ఫార్మాట్లకతీతంగా విజృంభిస్తున్న యశస్వి.. పలు సంచలన ప్రదర్శనల నమోదు చేసి, నేను కూడా టీమిండియా ఓపెనర్ రేసులో ఉన్నానని భారత సెలక్టర్లకు సవాలు విసురుతున్నాడు. Yashasvi Jaiswal has 9 Hundred, including 3 double hundreds in just 15 first-class matches 😲#IraniCup | #CricketTwitter pic.twitter.com/9wvHwCCKIy — InsideSport (@InsideSportIND) March 4, 2023 మధ్యప్రదేశ్‌తో ఇరానీ కప్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యశస్వి.. ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించడం ద్వారా పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఇరానీ కప్‌లో ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైక బ్యాటర్‌గా.. శిఖర్ ధవన్ తర్వాత ఇరానీ కప్ మ్యాచ్‌లో 300 ప్లస్ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా.. ఒకే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ నమోదు చేసిన 11వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. Yashasvi Jaiswal is the first batter to record a double hundred and a hundred in the same Irani Cup match. He is also only the second player after Shikhar Dhawan to score more than 300 runs in one Irani Cup game. — Lalith Kalidas (@lal__kal) March 4, 2023 ప్రస్తుత దేశవాలీ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న యశస్వి.. కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మార్కును అందుకుని, ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్ నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల యశస్వికి అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదడం కొత్తేమి కాదు. దులీప్ ట్రోఫీ డబ్యూలోనూ యశస్వి ఇదే తరహాలో డబుల్ సెంచరీతో విజృంభించాడు. ఈ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన యశస్వి.. నార్త్ ఈస్ట్ జోన్‌పై 227 పరుగులు చేశాడు. అలాగే ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనూ యశస్వి సెంచరీతో చెలరేగాడు. 2022 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 146 పరుగులు స్కోర్ చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 484 పరుగులకు ఆలౌటైంది. యశస్వి (213) డబుల్ సెంచరీతో చెలరేగగా.. అభిమన్యు ఈశ్వరన్ (154) సెంచరీతో కదం తొక్కాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తీకేయ తలో 2 వికెట్లు, అంకిత్ కుష్వా ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్.. పుల్కిత్ నారంగ్ (4/65), నవ్‌దీప్ సైనీ (3/56), ముకేశ్ కుమార్ (2/44), సౌరభ్ కుమార్ (1/74) ధాటికి 294 పరుగులకే చాపచుట్టేసింది. యశ్ దూబే (109) సెంచరీతో రాణించగా.. హర్ష గవ్లీ (54), సరాన్ష్ జైన్ (66) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించారు. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. నాలుగో రోజు లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి, ఓవరాల్‌గా 391 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. యశస్వి (121) అజేయమైన సెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. మధ్యప్రదేశ్ బౌలర్లు ఆవేశ్ ఖాన్, అంకిత్ ఖుష్వా తలో 2 వికెట్లు, కుమార్ కార్తీకేయ, సరాన్ష్ జైన్ చెరో వికెట్ పడగొట్టారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నిప్పులు చెరిగిన ఆవేశ్ ఖాన్.. 7 వికెట్లతో సత్తా చాటిన టీమిండియా బౌలర్
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా జనవరి 3న ప్రారంభమైన గ్రూప్ మ్యాచ్‌ల్లో మిగతా జట్లతో పాటు విదర్భ-మధ్యప్రదేశ్ జట్లు కూడా పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలి బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రజత్ పాటిదార్ (121) శతకంతో, సరాన్ష్ జైన్ (61) హాఫ్ సెంచరీతో రాణించడంతో మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4, లలిత్ యాదవ్, సర్వటే చెరో 2 వికెట్లు, భుటే ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ.. మధ్యప్రదేశ్ పేసర్ ఆవేశ్ ఖాన్ ధాటికి చిగురుటాకులా వణికింది. ఆవేశ్.. తాను వేసిన 22 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి 7 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్ ధాటికి విదర్భ 160 పరుగులకే చేతులెత్తేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో సంజయ్ రఘునాథ్ (58) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. అతను మినహా మరో ముగ్గురు రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో ఉగ్రరూపం దాల్చిన ఆవేశ్ ఖాన్ టీమిండియాలో చోటే లక్ష్యంగా సాగాడు. అతనికి జతగా జి యాదవ్, కుమార్ కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఆవేశ్ ఖాన్.. టీమిండియా తరఫున 5 వన్డేలు, 15 టీ20లు ఆడిన విషయం తెలిసిందే. ఇందులో అతను మొత్తంగా 16 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లోకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఇండోర్ బౌలర్.. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌లో కొనసాగుతున్నాడు. ఆవేశ్.. తన ఐపీఎల్ కెరీర్లో 38 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. -
10 వికెట్లతో చెలరేగిన చైనామన్ స్పిన్నర్.. కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్
Madhya Pradesh vs Chandigarh: చండీఘడ్‌తో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ కెప్టెన్ కుమార్ కార్తికేయ అదరగొట్టాడు. ఏకంగా పది వికెట్లు కూల్చి జట్టుకు భారీ విజయం అందించాడు. కార్తికేయ అద్భుత ప్రదర్శనతో చండీఘడ్‌పై మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ మీద 125 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్ డిలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య ఇండోర్ వేదికగా డిసెంబరు 20న టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన మధ్యప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశ్ దూబే(44) ఫర్వాలేదనిపించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రజత్ పాటిదార్ 88 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో అక్షత్ రఘువంశీ 77 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో 309 పరుగులకు మధ్యప్రదేశ్ ఆలౌట్ అయింది. విలవిల్లాడిన చండీఘడ్ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చండీఘడ్‌కు మధ్యప్రదేశ్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. ఓపెనర్ అర్స్లాన్ ఖాన్ 34 పరుగులు చేయగా.. మిగతా ఆటగాళ్ల స్కోర్లు వరుసగా 1, 0, 1, 0, 4, 0, 1, 11(నాటౌట్), 0, 0. చైనామన్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ 6 వికెట్లు కూల్చగా.. సారాంశ్ జైన్, ఆవేశ్ ఖాన్ తలా ఒక వికెట్ తీయగా.. అనుభవ్ అగర్వాల్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా బౌలర్లు చెలరేగడంతో చండీఘడ్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. 57 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారీ ఆధిక్యంలో ఉన్న మధ్యప్రదేశ్.. చండీఘడ్ను ఫాలో ఆన్ ఆడించగా 127 పరుగులకే కథ ముగిసిపోయింది. ఈసారి సారాంశ్ జైన్ 5 వికెట్లు పడగొట్టగా.. కుమార్ కార్తికేయ 4 వికెట్లు తీశాడు. ఆవేశ్‌కు ఒక వికెట్ దక్కింది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో 10 వికెట్లతో చెలరేగిన కుమార్ కార్తికేయ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Ind VS Ban 2nd Test: టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్ను తప్పించి.. 12 ఏళ్ల తర్వాత.. Tymal Mills: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్.. లీగ్ నుంచి వైదొలిగిన క్రికెటర్ తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్! -
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న భారత్.. ఆవేశ్ స్థానంలో దీపక్ చాహర్ ఎంట్రీ..!
Deepak Chahar Replaces Avesh Khan: ఆసియా కప్ 2022లో టీమిండియా పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది. నిఖార్సైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేక సూపర్-4 దశలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న టీమిండియా.. అన్ని అయిపోయాక దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. అస్వస్థతతో జట్టుకు దూరంగా ఉన్న ఆవేశ్ ఖాన్ స్థానంలో తదుపరి ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడబోయే మ్యాచ్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే పని సూపర్-4 దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందే చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. లంక చేతిలో ఓటమితో టీమిండియా ఫైనల్‌కు చేరే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయిన దశలో ఈ మార్పు చేయడం వల్ల ప్రయోజనం ఏంటని ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. జట్టు ఎంపికలో మున్ముందైనా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని భారత సెలెక్టర్లను హెచ్చరిస్తున్నారు. జట్టులో కనీసం ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పుడు బ్యాటర్లు, బౌలర్లను కాకుండా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను కూడా సాన పట్టేలా ప్రణాళికలు రూపొందించాలని కోరుతున్నారు. త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు కనీసం ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, గాయం కారణంగా గత ఆరు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న దీపక్ చాహర్.. ఇటీవలే జింబాబ్వే సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లతో రాణించాడు. చాహర్ జింబాబ్వే సిరీస్‌లో పర్వాలేదనిపించినా ఆసియా కప్‌కు ఎంపిక చేయకపోవడంతో టీమిండియా తగిన మూల్యమే చెల్లించుకుంది. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు చాహర్‌ను జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యం భావిస్తుంది. కాగా, ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌లు స్టాండ్ బై ప్లేయర్లు ఎంపికైన విషయం తెలిసిందే. చదవండి: దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్ బాయ్‌కాట్ చేస్తేనే..! -
'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్‌ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి'
ఆసియాకప్-2022 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో కీలక పోరుకు సిద్దమైంది. దుబాయ్ వేదికగా మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా తాడోపేడో తేల్చుకోనుంది. సూపర్-4లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్‌కు ఎదురైన పరాజయం .. ఫైనల్ రేసును ఆసక్తికరంగా మార్చింది. భారత్ ఫైనల్‌కు చేరాలంటే తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా విజయం సాధించాలి. ఇక శ్రీలంకతో డూ ఆర్‌డై మ్యాచ్‌కు భారత జట్టులో మార్పులు చేయాలని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ సూచించాడు. దారుణంగా విఫలమవుతున్న యుజ్వేంద్ర చాహల్ స్థానంలో అవేశ్ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని గంభీర్ సలహా ఇచ్చాడు. అదే విధంగా భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అతడు తెలిపాడు. చాహల్‌ను పక్కన పెట్టి అవేష్ ఖాన్‌కు తిరిగి జట్టులోకి తీసుకురావాలి. అదే విధంగా రవి బిష్ణోయ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలి. అతడు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో చాహల్ అంతగా రాణించలేకపోయాడు. కాబట్టి లెగ్ స్పిన్నర్ బిష్ణోయ్‌కు మరిన్ని అవకాశాలు కల్పించే సమయం అసన్నమైంది అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ జరిగిన మ్యాచ్‌లో బిష్ణోయ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. చాహల్ మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ సాధించాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Asia Cup 2022 IND VS SL Super 4: శ్రీలంకతో కీలక పోరుకు భారత్ 'సై'.. అశ్విన్‌కు చాన్స్ ఉందా? -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. అవేష్ ఖాన్‌కు నో ఛాన్స్! భారత యువ పేసర్ ఎంట్రీ!
ఆసియాకప్-2022లో దాయాదుల పోరుకు మరి కొద్ది గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ సూపర్-4లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఈ మెగా ఈవెంట్ లీగ్ దశలో పాక్‌ను మట్టికరిపించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్ మధ్యలోనుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో స్టాండ్‌బైగా ఉన్న పేస్ బౌలర్ దీపక్ చహర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో దారుణంగా విఫలమవుతున్న అవేష్ ఖాన్ పక్కన బెట్టి చహర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజేమెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు చాహర్ నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. కాబట్టి పాక్‌తో మ్యాచ్‌కు చాహర్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. చాహర్ పవర్‌ప్లే కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు గాయపడిన చాహర్.. తిరిగి జింబాబ్వే సిరీస్‌తో పునరాగమనం చేశాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన చాహర్ 5 వికెట్లతో అదరగొట్టాడు. View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో మ్యాచ్.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ! -
పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. యువ పేసర్‌కు అనారోగ్యం
ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో ఇవాళ (సెప్టెంబర్ 4) భారత్-పాక్‌లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ హైఓల్టేజీ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ కీలక సమరానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత రెండు మ్యాచ్‌ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న యువ పేసర్ ఆవేశ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు జట్టు కోచ్ ద్రవిడే స్వయంగా ప్రకటించాడు. ఆవేశ్ జ్వరంతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం అతను డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడని, అందుకే అతను ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదని మీడియాకు వివరించాడు. అయితే హెడ్ కోచ్ మాటలను బట్టి చూస్తే పాక్‌తో కీలక సమరంలో ఆవేశ్ ఆడటం అనుమానమేనని స్పష్టంగా తెలుస్తోంది. ఆవేశ్.. పాక్‌తో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాకపోయినా, తదుపరి మ్యాచ్‌ల సమయానికి పూర్తిగా కోలుకుంటాడని ఈ సందర్భంగా ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ఆవేశ్ తుది జట్టులో ఉండడనడానికి పరోక్ష సంకేతంగా భావిస్తున్నారు టీమిండియా అభిమానులు. Rahul Dravid gives an update on Avesh Khan ahead of India's clash against Pakistan.#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/hB1PHLEFfk — CricTracker (@Cricketracker) September 3, 2022 ఒకవేళ ఆవేశ్ మ్యాచ్ సమయానికి కోలుకోలేకపోతే, తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారనే అంశంపై ఇప్పటికే క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆవేశ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమిండియాలో మరో స్పెషలిస్ట్ పేసర్ లేకపోవడంతో, అశ్విన్‌తో ఆ ప్లేస్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే పాక్‌తో మ్యాచ్‌లో పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా.. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో అశ్విన్, చహల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గాయపడి టోర్నీకి దూరమైన ఆల్‌రౌండర్ జడేజా స్థానాన్ని దీపక్ హుడా భర్తీ చేసే అవకాశం ఉంది. వికెట్‌కీపర్‌గా ఎవరిని ఆడించాలనే విషయమై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఫినిషర్ కోటాలో డీకేనే కొనసాగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ఇది జరిగితే పంత్ మళ్లీ పెవిలియన్‌కు పరిమితం కాక తప్పదు. భారత్ తుది జట్టు(అంచనా).. రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్/ దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్/ అశ్విన్, చహల్, అర్షదీప్ చదవండి: 'టీమిండియా 36 ఆలౌట్'.. భయ్యా మీకు అంత సీన్ లేదు! -
పాక్‌తో మ్యాచ్.. మూడు మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా..!
India Playing 11: ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా రేపు (సెప్టెంబర్ 4) భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు ఇదివరకే గ్రూప్ దశలో ఓసారి ఎదురెదురు పడగా.. ఆ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన నాటి మ్యాచ్‌లో హార్ధిక్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ( (18 బంతుల్లో 32 నాటౌట్; 3 వికెట్లు) చెలరేగడంతో భారత్ అపురూప విజయం సాధించింది. హాంగ్ కాంగ్‌పై గెలుపుతో గ్రూప్-ఏ నుంచి సూపర్-4 రెండో బెర్తును ఖరారు చేసుకున్న పాక్.. ఈ దశలో ఎలాగైనా భారత్‌ను మట్టికరించి గ్రూప్ స్టేజ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు టోర్నీలో ఇదివరకే పాక్‌ను దెబ్బకొట్టిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా సైతం ఉరకలేస్తుంది. ఇక పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. హాంగ్ కాంగ్‌పై ఆడిన రిషబ్ పంత్, గాయం కారణంగా టోర్నీని నుంచి వైదొలిగిన జడేజా, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని ఆవేశ్ ఖాన్ స్థానాల్లో హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్‌లు జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ తప్పనిసరిగా మూడో స్పెషలిస్ట్ పేసర్ అవసరం అనుకుంటే ఆవేశ్ ఖాన్‌కు మరో అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చు. దుబాయ్ పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశాలు ఉండటం, జట్టులో ఆవేశ్ ఖాన్‌కు ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతన్నే మరోసారి రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు వికెట్‌కీపర్‌గా డీకేనా.. లేక పంతా అన్న డిస్కషన్ కూడా టీమిండియా యాజమాన్యాన్ని సందిగ్ధంలో పడేసింది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉండటంతో ఫినిషర్ పాత్రలో కార్తీక్‌నే కొనసాగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓపెనర్లు కెప్టెన్ రోహిత్, కేఎల్ రాహుల్ స్థానాలకు ఎటువంటి ఢోకా లేదు. ఆతర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, సూర్యకుమార్, రిషబ్ పంత్/ దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్/ అశ్విన్, చహల్, అర్షదీప్ బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా, సూపర్-4 దశకు భారత్, పాక్‌తో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చేరుకున్న విషయం తెలిసిందే. భారత్ తుది జట్టు(అంచనా).. రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్/ దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్/ అశ్విన్, చహల్, అర్షదీప్ చదవండి: కోహ్లి ఎప్పటికీ రోహిత్ లేదంటే సూర్యకుమార్ కాలేడు: పాక్ మాజీ కెప్టెన్ -
Ind Vs Pak: చెత్త ప్రదర్శన.. అయినా వాళ్లిద్దరినీ పాక్‌తో మ్యాచ్‌లో ఆడించాల్సిందే!
Asia Cup 2022 Super 4 - India Vs Pakistan: ఆసియా కప్-2022 టోర్నీ తుది అంకానికి చేరుకుంటోంది. గ్రూప్- ఏ నుంచి టీమిండియా- పాకిస్తాన్, గ్రూప్- బి నుంచి అఫ్గనిస్తాన్- శ్రీలంక సూపర్-4కు చేరుకున్నాయి. ఈ క్రమంలో గ్రూప్- బిలోని అఫ్గన్- లంక జట్టు షార్జా వేదికగా సూపర్-4 స్టేజ్‌లో శనివారం మొదటి మ్యాచ్ ఆడనున్నాయి. మరో బిగ్ సండే ఆ మరుసటి రోజే మరో బిగ్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా ఇండియా- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మెగా ఈవెంట్ తాజా ఎడిషన్‌లో దాయాదులు ముఖాముఖి పోటీపడటం ఇది రెండోసారి. ఫైనల్‌కు చేరే క్రమంలో కీలకమైన పోరులో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా భారత తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందన్న అంశంపై క్రీడావర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సబా కరీం వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వాలి! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ బౌలర్లు ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌కు పాక్ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. కాగా హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరు యువ పేసర్లు తేలిపోయిన విషయం తెలిసిందే. పసికూనతో మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ ఏకంగా 53 పరుగులు ఇవ్వగా.. అర్ష్‌దీప్ 44 పరుగులు సమర్పించుకుని చెరో వికెట్ తీశారు. వీరిద్దరి బౌలింగ్‌లో హాంగ్ కాంగ్ బ్యాటర్లు ఏకంగా 97 పరుగులు రాబట్టారు. దీంతో వీళ్లిద్దరి ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వీళ్లను నమ్ముకుంటే కీలక మ్యాచ్‌లలో నట్టేట ముంచుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమస్య అదే! అందుకే మునుపటి జట్టుతోనే ఈ నేపథ్యంలో సబా కరీం మాత్రం ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు అండగా నిలిచాడు. ఇండియా న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఇప్పుడిప్పుడే తమను తాము నిరూపించుకుంటున్నారు. వాళ్లు మరింత అనుభవం గడించాల్సి ఉంది. అంతేగానీ.. ఒకటీ రెండు ప్రదర్శనల కారణంగా వారిని తుది జట్టు నుంచి తప్పించడం సరికాదు. ఫామ్‌తో సంబంధం లేకుండా జట్టులో కచ్చితంగా ముగ్గురు సీమర్లు ఉండాల్సిందే. కాబట్టి గత మ్యాచ్‌లో ఆడించిన జట్టుతోనే ముందుకు వెళ్లాలి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మునుపటి జట్టును కొనసాగించాలి. ఎందుకంటే.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే.. కచ్చితంగా ఒకరికి పవర్ ప్లేలో ఒకటీ లేదంటే రెండు ఓవర్లు ఇవ్వాలి. అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్ కాబట్టి రిస్క్ తీసుకోకూడదు. పాక్‌తో గత మ్యాచ్‌లో పేసర్లు అద్బుతంగా ఆడారు. అందుకే మార్పుల్లేకుండానే సూపర్-4 మొదటి మ్యాచ్ ఆడితే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్ 15 ఎడిషన్‌లో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్(ఫఖర్ జమాన్) తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. అర్ష్‌దీప్ సింగ్ 3.5 ఓవర్ల బౌలింగ్‌లో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. చదవండి: Asia Cup 2022: మరోసారి తలపడనున్న భారత్-పాక్.. సూపర్-4 షెడ్యూల్ ఇదే Asia Cup 2022: రోహిత్, బాబర్ సేనలకు భారీ షాక్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Ind Vs HK: మరీ హాంగ్ కాంగ్ చేతిలోనా? నిద్ర కూడా పట్టదు: భారత మాజీ క్రికెటర్
Asia Cup 2022- India Vs Hong Kong- Avesh Khan- Arshdeep Singh: ఆసియా కప్-2022లో భాగంగా హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో టీమిండియా యువ పేసర్లు ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్ రితీందర్ సోధి పెదవి విరిచాడు. వీరిద్దరి నుంచి మరీ ఇలాంటి ఘోరమైన ప్రదర్శనను ఊహించలేదన్నాడు. మరీ హాంగ్ కాంగ్ వంటి జట్టుతో మ్యాచ్‌లో ఇలా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం వారి కెరీర్లో పీడకలలా మిగిలిపోతాయని ఈ మాజీ ఆల్‌రౌండర్ అన్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో పోలిస్తే.. హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో మరీ దారుణంగా విఫలమయ్యారని ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌లను విమర్శించాడు. ఆసియా కప్-2022లో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్(ఫఖర్ జమాన్) తీశాడు. దంచి కొట్టిన హాంగ్ కాంగ్ బ్యాటర్లు! ఇక అర్ష్‌దీప్ సింగ్ 3.5 ఓవర్ల బౌలింగ్‌లో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, పాక్‌తో మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా పసికూన హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో మాత్రం.. వీరిద్దరి బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు దంచికొట్టారు. అర్ష్‌దీప్ 4 ఓవర్ల బౌలింగ్‌లో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరోవైపు.. ఆవేశ్ ఖాన్ తన బౌలింగ్ కోటా పూర్తి చేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఆవేశ్ ఖాన్ మరీ హాంగ్ కాంగ్ చేతిలోనా?! ఈ నేపథ్యంలో ఇండియా న్యూ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రితీందర్ సోధి.. ఇలాంటి చెత్త ప్రదర్శన యువ బౌలర్లు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నాడు. ‘‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మన పేస్ బౌలింగ్ మెరుగ్గానే అనిపించింది. కానీ ఈ మ్యాచ్‌లో మరీ ఘోరం. ముఖ్యంగా అర్ష్‌దీప్ లయ తప్పినట్టు కనిపించింది. ఇక ఆవేశ్ అయితే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. హాంగ్ కాంగ్ వంటి జట్టు చేతిలో ఇలాంటి ప్రదర్శన వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నిద్ర కూడా పట్టదు. ఇలాంటి వాటి వల్ల వారు ఆత్మవిశ్వాసం కోల్పోతారు’’ అని రితీందర్ సోధి పేర్కొన్నాడు. ఇక మాజీ సెలక్టర్ సబా కరీం సైతం.. ఆవేశ్, అర్ష్‌దీప్ ఇద్దరూ మెరుగ్గా రాణించలేకపోతున్నారని.. కోచ్ పారస్ మంబ్రే వారి ఆటపై దృష్టి సారించాలని సూచించాడు. ముఖ్యంగా ఆవేశ్ ఖాన్ లోపాలను వీలైనంత త్వరగా సరిదిద్దుకునేలా శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2022: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్‌గా! Asia Cup 2022: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. తొలి భారత ఆటగాడిగా! -
'నీ బౌలింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్'
Asia Cup 2022 India Vs Hong Kong: ఆసియా కప్-2022లో భాగంగా హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్ అవేశ్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ పడగొట్టి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో అవేశ్ ఖాన్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. "నీ బౌలింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియాకప్‌కు ప్రకటించిన భారత జట్టులో ముగ్గురు పేసర్లు మాత్రమే ఉన్నారు. కాబట్టి అవేశ్ ఖాన్‌కు ప్రత్నామ్యాయంగా మరో పేసర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఈ మ్యాచ్‌కు పార్ట్‌టైమ్ పేసర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతిని ఇవ్వడంతో అవేశ్ ఖాన్ తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాండ్యాతో నాలుగు ఓవర్లు వేయించిన రోహిత్.. అవేష్‌కు కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. భారత్ తదుపరి మ్యాచ్‌కు హార్ధిక్ జట్టులోకి వస్తే.. అవేష్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆవేశ్ ఖాన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. మీమ్స్‌తో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. హాంగ్ కాంగ్‌ను చిత్తు చేసిన భారత్ ఈ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌పై టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లోనే 68 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించగా.. కింగ్ కోహ్లి 59 పరుగులతో రాణించాడు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి హాంగ్ కాంగ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో జడేజా, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });చదవండి: Welcome to dinda academy avesh khan #INDvHK #IndvsHkg #aveshkhan pic.twitter.com/cqIUWRCuuk — Kashif_Khan331 🇮🇳 (@kashif_khan1212) August 31, 2022 Retweet for. Like for Avesh Khan Kohli Economy :- 13+. Eco :- 6#INDvHK #ViratKohli𓃵 #aveshkhan #IndvsHkg pic.twitter.com/QlGL8nn6Hi — Sanuj Lodhi (@sanuj_lodhi) August 31, 2022 చదవండి: Ind Vs HK: కోహ్లికి హాంగ్ కాంగ్ జట్టు స్పెషల్ గిఫ్ట్.. థాంక్యూ విరాట్ అంటూ! ఫిదా అయిన ‘కింగ్’! Asia Cup 2022 Ind Vs HK: ఆరేళ్ల తర్వాత కింగ్ కోహ్లి బౌలింగ్.. అభిమానులు ఫిదా -
ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం..
ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫఖర్ జమాన్ చూపిన క్రీడాస్పూర్తి విధానం అభిమానులను ఫిదా చేసింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఆ ఓవర్లో అప్పటికే రెండు ఫోర్లతో జోరు మీదున్న ఫఖర్ జమాన్ క్రీజులో ఉన్నాడు. ఓవర్ ఐదో బంతిని ఆవేవ్ షార్ట్‌పిచ్ వేయగా.. బంతి బౌన్స్ అయింది. అయితే ఫఖర్ జమాన్ షాట్ మిస్ చేసుకోగా బంతి కీపర్ కార్తిక్ చేతుల్లోకి వెళ్లింది. కానీ దినేశ్ కార్తిక్ ఎలాంటి అప్పీల్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఫఖర్ జమాన్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. కనీసం అంపైర్ సిగ్నల్ ఇచ్చే వరకు కూడా వేచి చూడకుండా పెవిలియన బాట పట్టాడు. మహ్మద్ రిజ్వాన్ ఆలోచించమని చెప్పినా వినకుండా ఫఖర్ వెళ్లిపోయాడు. రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను స్లిక్ చేస్తు వెళ్లినట్లు స్పైక్ వచ్చింది. అప్పటికి కార్తిక్ మాత్రం ఏం తగల్లేదు అని సైగ చేయడం కనిపించింది. Fakhar Zaman hats of to you for walking before the umpire lifts his finger. Cricket is a gentleman's game after all#INDvsPAK — SiLItIS (@SiLItIS1) August 28, 2022 Fakhar Zaman hats of to you for walking before the umpire lifts his finger. Cricket is a gentleman's game after all#INDvsPAK — SiLItIS (@SiLItIS1) August 28, 2022 Good Sportsman's Ship #FakharZaman#INDvPAK — Chintala Madhusudhan Reddy (@madhuc430) August 28, 2022 చదవండి: IND Vs PAK Asia Cup 2022: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ -
'అతడికి రోహిత్ సపోర్ట్‌గా నిలిచాడు.. మ్యాచ్‌లో అదరగొట్టాడు'
వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా యువ పేసర్ అవేష్ ఖాన్అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అవేష్ ఖాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అవేష్ ఖాన్‌ను భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అభినందిచాడు. కాగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అవేష్ ఖాన్ దారుణంగా విఫలమైనప్పటికీ.. అతడికి మళ్లీ ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మపై పార్థివ్ పటేల్ ప్రశసంల వర్షం కురిపించాడు. అవేష్ ఖాన్‌కు రోహిత్ శర్మ మద్దతుగా నిలవడంతోనే అతడు అద్భుతంగా రాణించడాని పటేల్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. " ఈ మ్యాచ్‌లో అవేష్ ఖాన్ తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంటాడు. అతడు తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేస్తాడని నేను ముందే ఉహించాను. ఈ క్రెడిట్ కెప్టెన్ రోహిత్ శర్మకి ఇవ్వాలి. ఎందుకంటే అతడు వరుసగా విఫలమవుతున్నా, మళ్లీ అవకాశం ఇచ్చి అవేష్లో ఆత్మవిశ్వాన్ని పెంచాడు. రోహిత్ ఇచ్చిన భరోసాతో అవేష్ అద్భుతంగా రాణించాడు. క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేసే తన సత్తాను అవేష్ ఖాను మరో సారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లకు చాలా సపోర్టుగా ఉంటున్నారు. భారత జట్టులోకి వచ్చే ప్రతీ ఆటగాడు ఇటువంటి వాతావరణాన్నే కోరుకుంటారు" అని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో 59 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగులూండగానే 3-1తో టీమిండియా కైవసం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో పంత్(440, రోహిత్ శర్మ(33), సంజు సామ్సన్(30) పరుగులతో రాణించారు. అనంతరం 192 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 19.1 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో పూరన్(24), పావెల్(24) పరుగులతో టాప స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు , అవేష్ ఖాన్, రవి బిష్ణోయి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య అఖరి టీ20 ఫ్లోరిడా వేదికగా ఆదివారం జరగనుంది. చదవండి: Rohit Sharma: ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు హీరో! -
Ind Vs WI: ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవడం సహజం.. అయితే: రోహిత్
India Vs West Indies 4th T20- Rohit Sharma- Avesh Khan: టీమిండియా యువ బౌలర్ ఆవేశ్ ఖాన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలు అతడి సొంతమని కొనియాడాడు. ఏ ఆటగాడైనా సరే ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలం కావడం సహజమేనని.. అయితే అతడి ప్రతిభ గురించి తెలుసు కాబట్టే మరో అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్- భారత జట్ల మధ్య శనివారం(ఆగష్టు 6) నాలుగో టీ20 జరిగిన విషయం తెలిసిందే. అదరగొట్టిన పంత్, అక్షర్.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(33), సూర్యకుమార్ యాదవ్(24) శుభారంభం అందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హుడా 21 పరుగులు చేశాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 44 పరుగులతో రాణించాడు. సంజూ శాంసన్ 30(నాటౌట్), దినేశ్ కార్తిక్(6), అక్షర్ పటేల్20 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఆవేశ్ దెబ్బ! ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు పూరన్ బృందానికి టీమిండియా యువ పేసర్ ఆవేశ్ ఖాన్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్‌ను 13 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరో యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సైతం కదం తొక్కాడు. మూడు వికెట్లతో రాణించాడు. బౌలర్లంతా.. అదే విధంగా స్పిన్నర్ అక్షర్ పటేల్ కైలీ మేయర్స్, రోవ్‌మన్ పావెల్ వంటి కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం రెండు వికెట్లు తీశాడు. ఇలా టీమిండియా బౌలర్లు విజృంభించడంతో 19.1 ఓవర్లలో 132 పరుగులకే విండీస్ కుప్పకూలింది. దీంతో 59 పరుగులతో టీమిండియా విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. సమిష్టి కృషి వల్లే.. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ జట్టు సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నాడు. తమ బ్యాటర్లు, బౌలర్లు అద్భుత ఆట తీరు కనబరిచారని ప్రశంసించాడు. ‘‘పిచ్ మరీ అంత అనుకూలంగా ఏమీ లేదు. బ్యాటింగ్ ఎలా చేయాలో ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. నిజానికి 190 అనేది మంచి స్కోరే! కానీ.. విండీస్ బ్యాటింగ్ లైనప్ దృష్ట్యా దీనిని మెరుగైన స్కోరుగా భావించలేం. ఏదేమైనా ఈరోజు మ్యా బ్యాటర్లు స్మార్ట్‌గా ఆడారు. బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ సత్తా చాటారు. వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టారు. పిచ్ కాస్త స్లో గానే ఉంది. మా బౌలర్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు’’ అని రోహిత్ శర్మ భారత జట్టు ఆట తీరును కొనియాడాడు. ఇక ఆవేశ్ ఖాన్‌కు ఛాన్స్ ఇవ్వడం గురించి... ‘‘ఆవేశ్ ప్రతిభ గురించి మాకు తెలుసు. ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో సరిగ్గా ఆడలేకపోవచ్చు. అయితే, తన నైపుణ్యం గురించి తెలుసు కాబట్టే అవకాశం ఇచ్చాము. అందుకు తగ్గట్టుగా పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా బౌలింగ్ చేశాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అప్పుడు దారుణంగా విఫలం.. ఇప్పుడు హీరోగా! కాగా విండీస్‌తో రెండో టీ20లో ఆవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 2.2 ఓవర్లు బౌలింగ్ వేసిన ఈ యువ ఫాస్ట్ బౌలర్ 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఆవేశ్ చేతికి బంతినివ్వగా.. డెవాన్ థామస్ వరుసగా సిక్స్, ఫోర్ బాది విండీస్‌ను గెలిపించాడు. దీంతో ఆవేశ్‌పై విమర్శల జడి కురిసింది. ఆ తర్వాతి మ్యాచ్‌లోనూ మూడు ఓవర్లు బౌలింగ్ వేసి ఏకంగా 47 పరుగులు ఇచ్చాడు. అయినప్పటికీ యాజమాన్యం.. ఆవేశ్‌ను నమ్మి నాలుగో టీ20లో అవకాశం ఇవ్వగా అతడు దీనిని సద్వినియోగం చేసుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. 2 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి సత్తా చాటాడు. చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు' -
McGrath: ఆ ఇద్దరు టీమిండియాకు ఆడుతుంటే గర్వంగా ఉంది..!
ఆసీస్ పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ టీమిండియా యువ పేసర్లు ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఇద్దరు టీమిండియాకు ఆడుతుంటే గర్వంగా ఉందని అన్నాడు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్లు చెన్నైలోని ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకున్న నేపథ్యంలో మెక్‌గ్రాత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరితో పాటు మరో 27 మంది ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో మెళకువలు నేర్చుకున్న బౌలర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇదే సందర్భంగా వన్డే క్రికెట్ మనుగడపై ప్రస్తుతం నడుస్తున్న చర్చపై కూడా మెక్‌గ్రాత్ స్పందించాడు. బ్యాటర్లు పరుగులు చేస్తున్నంత కాలం వన్డే ఫార్మాట్‌కు ఢోకా లేదని అభిప్రాయపడ్డాడు. డబ్బు, శారీరక ఒత్తిడి కారణంగా ఆటగాళ్లు వన్డేలపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారని అనుకోవట్లేదని అన్నాడు. తన మట్టుకు సంప్రదాయ టెస్ట్ క్రికెటే అత్యుత్తమమని చెప్పుకొచ్చాడు. టెస్ట్‌ల తర్వాత ఆటగాళ్ల సత్తా బయటపడేది వన్డే క్రికెట్లోనేనని తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్లోనే ఆటగాళ్లకు సరైన పరీక్ష ఎదురవుతుందని అన్నాడు. చదవండి: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
Ind Vs WI: అందుకే ఆఖరి ఓవర్లో ఆవేశ్ చేతికి బంతి! ఇదో గుణపాఠం... అయినా: రోహిత్
India Vs West Indies 2nd T20- Rohit Sharma Comments On Loss: కరీబియన్ గడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా జోరుకు ఆతిథ్య వెస్టిండీస్ జట్టు బ్రేకులు వేసింది. రెండో టీ20లో విజయం సాధించి ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పైచేయి సాధించి 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. టాస్ గెలిచి... సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్ వేదికగా సోమవారం విండీస్- టీమిండియా మధ్య రెండో టీ20 జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను.. విండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ దెబ్బకొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేయడం సహా.. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్‌ను 11 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 10 పరుగులకే పరిమితం కాగా.. రిషభ్ పంత్ 24 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా 31, రవీంద్ర జడేజా 27 పరుగులతో రాణించారు. బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన దినేశ్ కార్తిక్(7 పరుగులు) వికెట్ తీసి మరోసారి మెకాయ్.. దెబ్బతీశాడు. అశ్విన్ 10, భువనేశ్వర్ 1, ఆవేశ్ ఖాన్ 8, అర్ష్‌దీప్ 1(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 19.4 ఓవర్లలో రోహిత్ సేన 138 పరుగులు సాధించింది. అదరగొట్టిన బ్రాండన్! ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ బ్రాండన్ కింగ్(68 పరుగులు) అద్భుత ఆరంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ కైలీ మేయర్స్ మాత్రం 8 పరుగులకే పరిమితమయ్యాడు. కెప్టెన్ నికోలస్ పూరన్(14 పరుగులు) మరోసారి నిరాశపరిచాడు. షిమ్రన్ హెట్మెయిర్ 6 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్ 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. బౌండరీ బాది విండీస్ విజయం ఖరారు చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్టు భువనేశ్వర్ కుమార్‌ను కాదని.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యువ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్‌కు బంతిని ఇవ్వడం గమనార్హం. ఇక 19వ ఓవర్లో అర్ష్‌దీప్ కాస్త పొదుపుగానే బౌలింగ్ చేయగా(6 పరుగులు ఇచ్చాడు)... ఆఖరి ఓవర్లో ఆవేశ్ ఖాన్ తేలిపోయాడు. మొదటి బంతి నోబాల్ కాగా.. థామస్ వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో భారత్ భారీ మూల్యం చెల్లించకతప్పలేదు. మా బ్యాటింగ్ బాగాలేదు! ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. అదే విధంగా డెత్ ఓవర్లలో యువ ఆటగాళ్లను బరిలోకి దింపడంపై వివరణ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. పిచ్ చాలా బాగుంది. కానీ మేము దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాము. మెరుగైన స్కోరు నమోదు చేయలేకపోయాము. అందుకే వాళ్లకు అవకాశం! అప్పుడప్పుడూ ఇలా జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ప్రతిసారి అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. మాకు ఇదొక గుణపాఠం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఇక ఆఖరి ఓవర్ విషయానికొస్తే.. యువకులకు తప్పక అవకాశాలు ఇవ్వాలి. నిజానికి భువి మాకోసం ఏం చేయగలడో.. ఏమేం చేశాడో ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపితమైంది. గత కొన్నేళ్లుగా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే, ఆవేశ్, అర్ష్‌దీప్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇస్తేనే కదా! వాళ్లలోని నైపుణ్యాలు, ప్రతిభకు పదును పెట్టగలరు. అయినా కేవలం ఈ ఒక్క గేమ్‌తో ఒక అంచనాకు రాలేము. నా జట్టు పట్ల నేను గర్వపడుతున్నా. నిజానికి 13-14 ఓవర్లోనే ముగుస్తుందనుకున్న మ్యాచ్‌ను మా వాళ్లు చివరి ఓవర్ వరకు లాక్కొచ్చారు. మార్చే ప్రసక్తే లేదు! మా బౌలర్లు అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. అయితే, బ్యాటింగ్ పరంగా మేము మెరుగుపడాల్సి ఉంది. కానీ, ప్రయోగాలకు మాత్రం వెనుకాడబోము. ఒక్క ఓటమి కారణంగా మేము బెంబేలెత్తిపోము. ఎలాంటి మార్పులకు ఆస్కారం ఇవ్వము’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా ఇటీవల తరచుగా ఓపెనింగ్ జోడీని మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్- టీమిండియా మధ్య మంగళవారం(ఆగష్టు 2) మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా రెండో టీ20: లగేజీ సమయానికి రాని కారణంగా మ్యాచ్ ఆలస్యం ►వేదిక: వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్, వెస్టిండీస్ ►టాస్: వెస్టిండీస్- బౌలింగ్ ►ఇండియా స్కోరు: 138 (19.4) ►వెస్టిండీస్ స్కోరు: 141/5 (19.2) ►విజేత: 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు ►5 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఒబెడ్ మెకాయ్(4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు) చదవండి: Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్‌గా Watch as the #MenInMaroon celebrate clinching victory in the second match of the @goldmedalindia T20 Cup, presented by Kent Water Purifiers #WIvIND 🏏🌴 pic.twitter.com/UV5Sl2zfAc — Windies Cricket (@windiescricket) August 1, 2022 -
జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు అతడిని ఎందుకు ఎంపిక చేశారు..?
జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం (జూలై 30) ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో శిఖర్ ధావన్ మరోసారి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే విధంగా యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠికు తొలి సారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. ఇక గాయం కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్నచ యువ పేసర్ దీపక్ చాహర్ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. అదే సమయంలో అవేశ్ ఖాన్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అసక్తికర వాఖ్యలు చేశాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు పేసర్ అవేశ్ ఖాన్‌ను ఎంపిక చేయడాన్ని డానిష్ కనేరియా ప్రధానంగా తప్పుబట్టాడు. "అవేష్ ఖాన్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ అతడిని సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్దం కావడం లేదు. ఈ సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ పేసర్లకు భారత్ విశ్రాంతినిచ్చింది. ఇక భారత స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ తన ఆరంభ మ్యాచ్‌ల్లో అంతగా రాణించలేకపోయాడు. అయితే అవేశ్ ఖాన్ స్థానంలో ఉమ్రాన్‌కు మరో అవకాశం ఇవ్వాల్సింది. అదే విధంగా అద్భుతంగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. జట్టు మేనేజ్మెంట్ అర్ష్‌దీప్‌కు మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. తద్వారా అర్ష్‌దీప్ ఆటగాడిగా మరింత పరిణతి చెందుతాడు" అని కనేరియా పేర్కొన్నాడు. కాగా, అద్భుతంగా రాణిస్తున్న పేసర్ అర్షదీప్ సింగ్‌కు జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. చదవండి: భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించడమే నా అంతిమ లక్ష్యం: కార్తీక్ -
ప్రసిధ్ కృష్ణ ఔట్.. ఆవేశ్ ఖాన్‌కు ఛాన్స్..!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా విండీస్‌తో రేపు (జులై 24) జరుగబోయే రెండో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిధ్య జట్టును 3 పరుగుల తేడాతో ఓడించిన ధవన్ సేన.. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం టీమిండియా తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో వికెట్ లేకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిధ్ కృష్ణ స్థానంలో మరో పేసర్ ఆవేశ్ ఖాన్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డేలో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించే ఛాన్స్ ఉంది. ఓపెనర్లుగా ధవన్, గిల్, వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, మిడిలార్డర్లో సూర్యకుమార్, దీపక్ హుడా, సంజూ శాంసన్, ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, ఏకైక స్పిన్నర్‌గా చహల్, పేసర్లుగా ఆవేశ్ ఖాన్, సిరాజ్‌లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. మరోవైపు తొలి వన్డేలో దాదాపు విజయపు అంచుల వరకు వచ్చిన విండీస్ సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలగా ఉంది. భారత తుది జట్టు (అంచనా).. శిఖర్ ధవన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ చదవండి: అసలు అతడికి ఇక్కడ ఏం పని? ధావన్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు! -
ఆ క్రెడిట్ మొత్తం ద్రవిడ్ సార్కే దక్కుతుంది: ఆవేష్ ఖాన్
రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది. అయితే ఈ విజయంలో యువ పేసర్ అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆవేష్ ఖాన్ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. "నాలుగు మ్యాచ్‌ల్లో భారత జట్టులో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఈ క్రెడిట్ మొత్తం ద్రవిడ్ సార్కే దక్కుతుంది. అతను ప్రతీ ఒక్కరికి జట్టులో అవకాశాలు ఇస్తారు. ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబర్చినప్పటికీ.. తరువాత మ్యాచ్‌లకు కూడా మనకు ద్రవిడ్ అవకాశం ఇస్తాడు. ఎందుకుంటే ఆటగాడి ప్రతిభను ఒకటి రెండు మ్యాచ్‌లతో అంచనా వేయలేం కదా. ప్రతీ ఒక్కరికి తమను తాము నిరూపించుకోవడానికి తగినన్ని అవకాశాలు ద్రవిడ్ సార్ ఇస్తారు" అని ఆవేష్ ఖాన్ పేర్కొన్నాడు. స్కోర్లు టీమిండియా: 169/6 టాప్ స్కోరర్: దినేష్ కార్తీక్ దక్షిణాఫ్రికా: 87/10 ఫలితం: 82 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం చదవండి: Rishabh Pant: రోజురోజుకు మరింత బలంగా.. పంత్‌కు పొంచి ఉన్న ప్రమాదం -
దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..!
దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. జట్టు యువ పేసర్ ఆవేష్ ఖాన్ గాయం కారణంగా రాజ్‌కోట్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ వేదికగా జరగిన మూడో టీ20లో ఆవేష్ ఖాన్ కుడి చేతికి గాయమైంది. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్‌ను విడిచి పెట్టి వెళ్లాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి వారం రోజులు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు స్థానంలో డెత్ స్పెషలిస్ట్ ఆర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాజ్‌కోట్ వేదికగా నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది. చదవండి: అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డును తిరగరాసిన ఆఫ్ఘాన్ బౌలర్ -
వారెవ్వా ఏం స్పీడు భయ్యా.. బ్యాట్ రెండు ముక్కలయ్యింది
సౌతాఫ్రికా, భారత్‌ల మధ్య జరిగిన తొలి టి20లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో ఆవేశ్ ఖాన్ వేసిన ఒక బంతి బ్యాట్‌ను రెండు ముక్కలు చేసింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మూడో బంతిని ఆఫ్‌సైడ్ దిశగా యార్కర్ వేశాడు. క్రీజులో ఉన్న డుసెన్ బంతిని టచ్ చేసే ప్రయత్నం చేశాడు. అంతే మిడిల్లో తాకిన బంతి బ్యాట్‌ను రెండు ముక్కలుగా చీల్చుకుంటూ వెళ్లింది. ఇది చూసిన డుసెన్ తన బ్యాట్‌ను పరిశీలించగా.. ఆవేశ్‌ఖాన్ సహా టీమిండియా ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ 76 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శ్రేయాస్ అయ్యర్ 36, రిషబ్ పంత్ 29 పరుగులు చేశారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోర్ట్జే, పార్నెల్, ప్రిటోరియస్ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Rishabh Pant: టి20 కెప్టెన్‌గా రిషబ్ పంత్ అరుదైన రికార్డు -
దేవుడి దయ వల్ల అమ్మ ఇప్పుడు బాగుంది.. ఈ అవార్డు తనకే!
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అవేష్ ఖాన్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో సూపర్ జెయింట్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అవేష్ ఖాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో.. 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అవేష్ తన ఐపీఎల్ కెరీర్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అద్భత ప్రదర్శన చేసిన అవేష్ ఖాన్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. అయితే తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆసుపత్రిలో తన తల్లికి అవేష్ ఖాన్ అంకితం చేసాడు. "నాకు దక్కిన ఈ అవార్డును ఆసుపత్రిలో ఉన్న మా అమ్మకు అంకితం చేయాలనుకుంటున్నాను. ఆమె నాకు చాలా సపోర్ట్‌గా ఉండేది. మ్యాచ్ ముగిసిన తర్వాత, నేను మా అమ్మతో వీడియో కాల్లో మాట్లాడాను. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను ఆమెతో చెప్పాను. ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల ఆమె సంతోషించింది. దేవుని దయతో, ఆమె ఇప్పుడు క్షేమంగా ఉంది అని మ్యాచ్ అనంతరం ఇంటరాక్షన్‌లో అవేష్ ఖాన్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్‌కు లక్నో, గుజరాత్..! Stylish fifty 👌 Game-changing 4️⃣-wicket haul 💥 Special dedication 🤗@Avesh_6 & @HoodaOnFire - stars of the @LucknowIPL's win over #SRH - discuss their favourite moments from the #SRHvLSG clash. 👍👍 - By @ameyatilak Full interview 🎥 🔽 #TATAIPLhttps://t.co/C0nlc61PbZ pic.twitter.com/sUgmRaVTkU — IndianPremierLeague (@IPL) April 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Avesh Khan: ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి బాబూ! అయ్యర్‌తో స్టెప్పులు ఇరగదీసిన ఆవేశ్ ఖాన్
Avesh Khan- Venkatesh Iyer: టీమిండియా యువ పేసర్ ఆవేశ్ ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తనకు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటాడు. ఈ క్రమంలో నెటిజన్లను ఊపేస్తున్న అరబిక్ కుతూ పాటకు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. సహచర క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి డాన్స్ అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆవేశ్ ఖాన్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి బాబూ.. ఇద్దరు డాన్స్ చించేశారు. స్టెప్పులతో అదరగొట్టారు. మీ డాన్స్ విజయ్ ఫ్యాన్స్‌కు తప్పక నచ్చుతుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్'లోని అరబిక్ కుతూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ యువ క్రికెటర్ల విషయానికొస్తే.. ఐపీఎల్ మెగా వేలం- 2022లో భాగంగా కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ ఆవేశ్ ఖాన్‌ను 10 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు.. వెంకటేశ్ అయ్యర్ విషయానికొస్తే.. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు టీమిండియా తరఫున అరంగేట్రం చేశారు. పేసర్‌గా ఆవేశ్ ఖాన్, ఆల్‌రౌండర్‌గా అయ్యర్ తమ కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు. చదవండి: IPL 2022: కప్ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు View this post on Instagram A post shared by Avesh Khan (@aavi.khan) -
రవి బిష్ణోయ్‌కు బంపరాఫర్.. తొలి వన్డేకు రాహుల్ దూరం
ముంబై: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టి20ల కోసం భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ బుధవారం రాత్రి ప్రకటించింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌గా మారి జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లి తప్పుకున్న తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌కు ఇదే తొలి సిరీస్ కానుంది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. రెండో వన్డే నుంచి అతను జట్టుతో కలుస్తాడు. బుమ్రా, షమీలకు విశ్రాంతినిచ్చినట్లు ప్రకటించిన సెలక్షన్ కమిటీ... రవీంద్ర జడేజా గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతని పేరును పరిశీలించలేదని స్పష్టం చేసింది. 18 మంది సభ్యుల చొప్పున రెండు జట్లను ప్రకటించారు. సిరీస్ భారత్‌లోనే ఉండటంతో స్టాండ్‌బైలను ఎంపిక చేయలేదు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎలాంటి విరామం కోరుకోకుండా రెండు సిరీస్‌లకు అందుబాటులో ఉండటం విశేషం. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడిన వెంకటేశ్ అయ్యర్‌పై వేటు వేసి టి20లకే పరిమితం చేశారు. వాషింగ్టన్ సుందర్ జట్టులోకి పునరాగమనం చేశాడు. సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్‌కు రెండు టీమ్‌లలోనూ చోటు దక్కకపోగా... భువనేశ్వర్‌ను వన్డేల నుంచి తప్పించి టి20ల్లోకి మాత్రమే ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా గత కొంత కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేకపోయినా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రెండు జట్లలోనూ చూస్తే పూర్తిగా కొత్త ఆటగాళ్లు ముగ్గురు ఎంపికయ్యారు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అవేశ్ ఖాన్, ఆల్‌రౌండర్ దీపక్ హుడాలకు భారత జట్టు తరఫున ఇదే తొలి అవకాశం. భారత్, విండీస్ మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్‌లో మూడు వన్డేలు... ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా. టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దుల్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, అక్షర్ పటేల్, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్. -
రోహిత్‌కే టి20 పగ్గాలు.. జట్టులోకి వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్
Venkatesh Iyer, Ruturaj Gaikwad, Harshal Patel Picked For T20Is Against New Zealand: న్యూఢిల్లీ: ఊహించిందే జరిగింది. లాంఛనం ముగిసింది. భారత టి20 క్రికెట్ జట్టుకు పూర్తిస్థాయి నాయకత్వ మార్పిడి జరిగింది. టీమిండియా టి20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. యూఏఈలో జరిగిన ఐపీఎల్ టోర్నీ సందర్భంగా టి20 ప్రపంచకప్ తర్వాత తాను భారత టి20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని విరాట్ కోహ్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి స్థానంలో మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మను ఈ ఫార్మాట్లో కెప్టెన్‌గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మకే టి20 పగ్గాలు అప్పగించింది. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. టి20 ఫార్మాట్లో రోహిత్ శర్మకు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఐపీఎల్లో రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. గతంలో కోహ్లి గైర్హాజరీలో రోహిత్ శర్మ 19 మ్యాచ్‌ల్లో భారత టి20 జట్టుకు తాత్కాలికంగా నాయకత్వం వహించాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు 15 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడింది. 2017లో 3 మ్యాచ్‌ల్లో... 2018లో 9 మ్యాచ్‌ల్లో... 2019లో 6 మ్యాచ్‌ల్లో... 2020లో ఒక్క మ్యాచ్‌లో రోహిత్ భారత టి20 జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. హార్దిక్, వరుణ్‌లపై వేటు టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం... ఈనెల 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఉండటంతో మంగళవారం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. టి20 ప్రపంచకప్ బరిలో దిగిన 15 మంది జట్టులో ఏడుగురు మాత్రమే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యారు. ఫిట్నెస్ సమస్యలు.. ఫామ్‌లో లేకపోవడం కారణంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలపై సెలెక్టర్లు వేటు వేశారు. టి20 ప్రపంచకప్‌లో ఆడిన శార్దుల్ ఠాకూర్, రాహుల్ చహర్‌లను కూడా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కోహ్లి, బుమ్రా, షమీ, రవీంద్ర జడేజాలకు వారి కోరిక మేరకు విశ్రాంతి ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌లకు మళ్లీ పిలుపు వచ్చింది. మూడు కొత్త ముఖాలు... ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), హర్షల్ పటేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), అవేశ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్)లకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం దక్కింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్లో 370 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్లో హరియాణా జట్టుకు ఆడే గుజరాత్‌కు చెందిన 30 ఏళ్ల హర్షల్ పటేల్ ఐపీఎల్లో 32 వికెట్లు తీసి ‘పర్పుల్ క్యాప్’ గెల్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల అవేశ్ ఖాన్ ఈ ఐపీఎల్లో 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో 635 పరుగులు సాధించిన మహారాష్ట్ర ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన రుతురాజ్ భారత్ తరఫున రెండు టి20 మ్యాచ్‌ల్లో ఆడాడు. తొలి టెస్టుకు కూడా రోహితే కెప్టెన్! న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ముగిశాక రెండు టెస్టులు జరగనున్నాయి. తొలి టెస్టుకు కూడా కోహ్లి అందుబాటులో ఉండటంలేదని.. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తొలి టెస్టులో టీమిండియాకు నేతృత్వం వహిస్తాడని సమాచారం. డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబైలో జరిగే రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి జట్టుకు అందుబాటులో ఉంటాడని తెలిసింది. ఇక వన్డే ఫార్మాట్లోనూ కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకే పగ్గాలు ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే భారత జట్టు వచ్చే జనవరిలో దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ ఆడనుండటంతో అప్పుడే ఈ మార్పు జరిగే అవకాశముంది. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్. భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్ షెడ్యూల్ నవంబర్ 17: తొలి మ్యాచ్ (జైపూర్‌లో) నవంబర్ 19: రెండో మ్యాచ్ (రాంచీలో) నవంబర్ 21: మూడో మ్యాచ్ (కోల్‌కతాలో) NEWS - India’s squad for T20Is against New Zealand & India ‘A’ squad for South Africa tour announced.@ImRo45 named the T20I Captain for India. More details here - https://t.co/lt1airxgZS #TeamIndia pic.twitter.com/nqJFWhkuSB — BCCI (@BCCI) November 9, 2021 చదవండి: పొట్టి క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్ -
Avesh Khan: స్వదేశానికి తిరిగి వచ్చేసిన టీమిండియా నెట్ బౌలర్
Avesh Khan returns home from Dubai: ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ ఆవేశ్ ఖాన్ భారత్‌కు తిరిగి వచ్చేశాడు. దుబాయ్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. కాగా ఐపీఎల్-2021లో భాగంగా ఆవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్ ఆడి 24 వికెట్లు తీశాడు. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్(32 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడు టీ20 ప్రపంచకప్-2021కు టీమిండియా నెట్ బౌలర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 14 ఎడిషన్ ముగిసినప్పటికీ భారత జట్టుతో పాటు యూఏఈలోనే ఉండిపోయాడు. అత్యవసర పరిస్థితుల్లో జట్టులోకి తీసుకునే ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే, ఏమైందో తెలియదు కానీ... ఆవేశ్ ఖాన్ ప్రస్తుతం స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఈ మేరకు దుబాయ్ నుంచి ఢిల్లీకి పయనమైనట్లు ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే, ఇందుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు... ఆవేశ్ ఖాన్‌తో పాటు నెట్ బౌలర్లుగా సెలక్ట్ అయిన కరణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, వెంకటేశ్ అయ్యర్, క్రిష్ణప్ప గౌతం ఇప్పటికే యూఏఈని వీడి భారత్‌కు చేరారు. వీరంతా.. నవంబరు 4 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు. చదవండి: David Warner: ఓహో అక్కడే పెట్టాలా.. రొనాల్డోకు మంచిదైతే నాకూ మంచిదే కదా.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ 2021: సిరాజ్, ఆవేశ్ ఖాన్ సరికొత్త రికార్డు
Most Dot Balls In IPL 2021 Season.. ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ బౌలర్లు ఆవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్‌లు కొత్త రికార్డు సృష్టించారు. ఈ సీజన్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన జాబితాలో ఇద్దరు అగ్రస్థానంలో ఉన్నారు. ఆవేశ్ ఖాన్, సిరాజ్‌లు ఈ సీజన్లో 147 డాట్ బాల్స్ వేయగా.. ఆ తర్వాత మహ్మద్ షమీ(పంజాబ్ కింగ్స్) 145 డాట్ బాల్స్‌తో రెండో స్థానంలో, 142 డాట్ బాల్స్‌తో బుమ్రా మూడోస్థానంలో, ట్రెంట్ బౌల్ట్ 138 డాట్ బాల్స్‌తో నాలుగో స్థానంలో, 137 డాట్ బాల్స్‌తో వరుణ్ చక్రవర్తి ఐదో స్థానంలో ఉన్నాడు. ఇందులో ఆవేశ్ ఖాన్ ఇప్పటికే టాప్ పొజీషన్లో ఉండగా.. వరుణ్ చక్రవర్తి మినహా మిగతా బౌలర్లకు టాప్ స్థానానికి చేరుకునే అవకాశం లేదు. ఒకవేళ కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనున్న క్వాలిఫయర్ 2లో ఓడిన జట్టు ఇంటి బాట పట్టనుంది. కాగా ఇప్పటికే సీఎస్కే ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Gautam Gambhir: 'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు IPL 2022 Mega Auction: రైనా సహా ఆ ముగ్గురి ఖేల్ ఖతమైనట్టే..! -
T20 World Cup 2021: టీమిండియా నెట్ బౌలర్‌గా ఆవేశ్‌ఖాన్
Avesh Khan As Net Bowelr For Team India T20 WC 2021.. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ ముగిసిన తర్వాత యూఏఈలో ఉండనున్నాడు. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి ఆవేశ్ ఖాన్ టీమిండియా నెట్‌బౌలర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఆవేశ్‌ఖాన్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా నెట్ బౌలర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆవేశ్ ఖాన్ కూడా నెట్‌బౌలర్‌గా రావడంతో ఆ సంఖ్య రెండుకు చేరింది. అయితే ఆవేశ్ ఖాన్ స్టాండ్ బై లిస్ట్ ప్లేయర్‌గా కూడా పరిగణిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: T20 World Cup 2021: మెంటార్‌గా ధోని ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు Courtesy: IPL Twitter మధ్యప్రదేశ్‌కు చెందిన ఆవేశ్ ఖాన్ ఫాస్ట్ బౌలింగ్‌కు పెట్టింది పేరు. 140 నుంచి 145 కిమీ వేగంతో వైవిధ్యమైన బంతులు విసరడం ఆవేశ్ ఖాన్ స్పెషాలిటీ. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌కు వెన్నుముకలా మారిన ఆవేశ్ ఖాన్ ఆ జట్టు తరపున ఐపీఎల్ 2021 సీజన్లో 15 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. సీజన్లో అత్యధిక వికెట్ల పరంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండడంతో అత్యధిక వికెట్ల జాబితాలో తొలి స్థానానికి చేరే అవకాశం ఉంది. ఇక ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ 2021 తొలి అంచె పోటీల్లో అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మలతో సమానంగా మెరుగ్గా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ టూర్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కౌంటీ సెలెక్ట్ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో దురదృష్టవశాత్తూ టూర్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని యూఏఈకి చేరిన ఆవేశ్ ఖాన్ సెకండ్‌ఫేజ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన బౌలర్‌గా మారాడు. Courtesy: IPL Twitter -
భువీ స్థానంలో అతనికి అవకాశం ఇస్తే మంచిదేమో!
Bhuvaneswar Repalce By Any Of These 3 Bowlers.. టి20 క్రికెట్లో బ్యాటింగ్ ఎంత ముఖ్యమో.. బౌలింగ్ కూడా అంతే అవసరం. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి టీమిండియాకు ఎంపికైన 15 మంది ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నారు. బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించినప్పటికీ అక్టోబరు 10వరకు జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఆటగాళ్లు చేసే ప్రదర్శన బట్టి వారి స్థానాలు మారిపోయే అవకాశం ఉందంటూ సెలక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: T20 World Cup 2021: సూర్య, ఇషాన్‌లు ఫామ్‌లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్ ఇప్పటికే బ్యాటింగ్ విభాగంలో కీలకంగా భావిస్తున్న మిడిలార్డర్లోఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు ఫామ్ పేలవంగా ఉండడంతో వారి స్థానాల్లో శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, మయాంక్ అగర్వాల్ లాంటి బ్యాటర్స్‌కు అవకాశం ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా బౌలింగ్ విభాగంలోనూ ఆ కలవరం మొదలైంది. బుమ్రా, షమీలకు తోడుగా ఎంపిక చేసిన భువనేశ్వర్ కుమార్ అనుకున్నంత ఫామ్ కనబరచడం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న భువీ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 8.53 ఎకానమీ రేటుతో కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. పేస్ బౌలింగ్ విభాగంలో హార్దిక్ పాండ్యా ఉన్నప్పటకీ అతని ఫిట్‌నెస్‌పై నమ్మకం లేదు. మ్యాచ్ జరిగేవరకు అతను బౌలింగ్ చేస్తాడా లేదా అనేది అనుమానమే. దీంతో భువీకి ప్రత్యామ్నాయంగా మరో పేస్ బౌలర్ అవసరం కనిపిస్తుంది. స్టాండ్ బై ప్లేయర్లలో శార్ధూల్ ఠాకూర్, దీపక్ చహర్ లాంటి నాణ్యమైన బౌలర్లు కనిపిస్తున్నప్పటికీ ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్‌లాంటి బౌలర్లకు అవకాశమిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం. దీపక్ చహర్: వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం దీపక్ చహర్ ప్రత్యేకత. బ్యాటర్ పొరపాటున బంతి వదిలేశాడో క్లీన్ బౌల్డ్ అవడం ఖాయం. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరే దీపక్ ప్రస్తుతం ఐపీఎల్లో సీఎస్కేకు ప్రధాన బౌలర్‌గా వ్యవహరిస్తున్నాడు. టి20 ప్రపంచకప్‌కు సంబంధించి భువీ స్థానంలో సరిగ్గా సరిపోయే పేస్ బౌలర్‌గా దీపక్ కనిపిస్తున్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లు సంధించడంలో దీపక్ చహర్ స్పెషలిస్ట్. సీఎస్కే తరపున 10 మ్యాచ్‌లాడిన చహర్ 7.75 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు.అంతేగాక టీమిండియాకు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగలడు. చదవండి: Kohli-Rohit Rift: వాళ్లిద్దరి మధ్య విభేదాలా!.. మరోసారి నిరూపితమైంది మహ్మద్ సిరాజ్: టీమిండియా బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు. సిరాజ్ కెరీర్లో ఆసీస్ పర్యటన ఒక టర్నింగ్ పాయింట్. అక్కడినుంచి అతను టీమిండియాలో కీలక బౌలర్‌గా మారిపోయాడు. కానీ ఎందుకనో టి20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికచేయలేదు. ప్రస్తుత ఫామ్ దృశ్యా సిరాజ్ సేవలు టీమిండియాకు చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంది. టెస్టుల్లో స్థిరమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న సిరాజ్ అవకాశమొస్తే టి20ల్లోనూ చెలరేగే సత్తా ఉన్నవాడే. తన చూపులతో ప్రత్యర్థి బ్యాటర్స్‌ను భయపెట్టే సిరాజ్ ఆరంభ, డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు పరుగులు చేయకుండా అడ్డుపడుతూనే కీలక సమయంలో వికెట్లు తీయగలడు. ఇక ఐపీఎల్లో కోహ్లి సారధ్యంలోని ఆర్సీబీలో ఉన్న సిరాజ్‌పై కెప్టెన్ ఎంతో నమ్మకముంచాడు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లే తీసినప్పటికీ ఆర్సీబీ ప్రధాన బౌలర్‌గా కనిపిస్తున్నాడు. ఆవేశ్ ఖాన్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ప్రస్తుతం ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. ఇషాంత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆవేశ్ ఖాన్ వైవిధ్యమైన బౌలింగ్‌తో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో వికెట్లు రాబట్టడం ఆవేశ్ ఖాన్ ప్రత్యేకత. అదే అతన్ని ఢిల్లీకి ప్రధాన బౌలర్‌ను చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7.55 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. చదవండి: T20 World Cup: టీమిండియాలోకి శ్రేయస్..? ఆ నలుగురిపై వేటు పడనుందా..? -
‘ధోని కోసం పంత్‌తో కలిసి ప్లాన్ చేశా’
న్యూఢిల్లీ: అవేశ్ ఖాన్.. ఐపీఎల్-14 సీజన్లో అందర్నీ ఆకర్షించిన బౌలర్. మధ్యప్రదేశ్‌కు ఈ చెందిన ఈ పేస్‌బౌలర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో అవేశ్ ఖాన్ 8 మ్యాచ్‌లాడి 14 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ అర్థాంతరంగా నిరవధిక వాయిదా పడే సమయానికి అత్యధిక వికెట్ల జాబితాలో అవేశ్ ఖాన్ టాప్-2లో ఉన్నాడు. ఈ సీజన్లో 30 ఓవర్లు బౌలింగ్ వేసిన అవేశ్ ఖాన్ యావరేజ్ 16.50గా ఉండగా, ఎకానమీ 7.70గా నమోదైంది. కాగా, ఈ సీజన్లో సీఎస్కేతో జరిగిన రెండో మ్యాచ్‌లో ధోనిని అవేశ్ బౌల్డ్ చేయడం, అందులోనూ రెండో బంతికే పెవిలియన్‌కు పంపడం విశేషం. అయితే ధోని కోసం ప్రత్యేకంగా వ్యూహ రచన చేసే ఔట్ చేసిన విషయాన్ని అవేశ్ తాజాగా రివీల్ చేశాడు. అది కూడా తమ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ కలిసి ప్లాన్ చేసినట్లు తెలిపాడు. జాతీయ దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన అవేశ్.. పలు విషయాల్ని షేర్ చేసుకున్నాడు.అందులో ధోని ఔట్ కోసం కూడా వెల్లడించాడు. ‘ ధోని క్రీజ్‌లోకి వచ్చే సమయానికి కొన్ని ఓవర్లు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో ధోని హిట్ చేస్తాడనే విషయం పంత్‌కు తెలుసు. కానీ నాలుగు నెలల గ్యాప్ తర్వాత ధోని ఆడుతున్నాడు కాబట్టి హిట్ చేయడం కూడా కష్టమనే విషయం పంత్‌తో పాటు నాకు కూడా తెలుసు. ఆ సమయంలో పంత్ నాకు ఒకటే చెప్పాడు. బంతిని షార్ట్ ఆఫ్ లెంగ్త్‌లో వేయమన్నాడు. నేను అదే చేశాడు ధోని హిట్ చేయడానికి యత్నించాడు. కానీ అది ఎడ్జ్ తీసుకుని ధోని బౌల్డ్ అయ్యాడు’ అని అవేశ్ పేర్కొన్నాడు. తాను బౌలింగ్ రనప్ తీసుకునే సమయంలో పంత్ వైపు చూస్తానన్నాడు. అప్పుడు బ్యాట్స్‌మన్ తనవైపు చూస్తాడు కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదన్నాడు. యార్కర్ల విషయంలో కూడా పంత్ చేసే సంజ్ఞలతోనే జరుగుతుందన్నాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతుల్ని కూడా ఇలానే వేస్తానన్నాడు. పంత్ సంకేతాలు తనకు తెలుసని ఈ సందర్భంగా అవేశ్‌ఖాన్ పేర్కొన్నాడు. -
విహారి, షమీ, జడేజా పునరాగమనం
-
విహారి, షమీ, జడేజా పునరాగమనం
ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయం సాధించి, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆటగాళ్లపైనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్టర్లు నమ్మకం ఉంచారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు 20 మందితో కూడిన జట్టును ప్రకటించారు. భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయకపోవడం మినహా ఎలాంటి అనూహ్యత లేకుండా అంచనాల ప్రకారమే జట్టు ఎంపిక సాగింది. కరోనా నేపథ్యంలో అదనంగా మరో నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు ప్రధాన జట్టుతో పాటు ఇంగ్లండ్‌కు వెళతారు. ముంబై: సుమారు మూడు నెలల పాటు సాగే ఆరు టెస్టు మ్యాచ్‌ల ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లి నాయకత్వంలోని ఈ టీమ్‌కు అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మొత్తం 20 మందిని ఎంపిక చేసిన కమిటీ మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైలుగా ప్రకటించింది. ఈ టూర్లో జూన్ 18 నుంచి సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో తొలి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడే టీమిండియా... ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో పోటీపడుతుంది. క్వారంటైన్ తదితర నిబంధనలు దృష్టిలో ఉంచుకొని భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ బయలుదేరే అవకాశం ఉంది. ముగ్గురు వచ్చేశారు... ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ గాయపడగా... సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవీంద్ర జడేజా గాయపడ్డారు. ఈ ముగ్గురు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌కు దూరమయ్యారు. ఇప్పుడు వీరు తాజా పర్యటనతో టెస్టు టీమ్‌లోకి పునరాగమనం చేస్తున్నారు. విహారి ఇప్పటికే ఇంగ్లండ్‌లో ఉన్నాడు. వార్విక్షైర్ క్లబ్ జట్టు తరఫున అతను కౌంటీల్లో ఆడుతున్నాడు. ఉమేశ్‌కు మరో చాన్స్... పేస్ బౌలింగ్ విభాగంలో ప్రధాన బౌలర్లు ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, షమీలతో పాటు తాజా ఫామ్‌ను బట్టి మొహమ్మద్ సిరాజ్‌కు సహజంగానే చోటు లభించింది. మరో ఇద్దరు పేసర్లు కూడా టీమ్‌లో ఉన్నారు. మెల్బోర్న్ టెస్టు తర్వాత అవకాశం దక్కని ఉమేశ్ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అతనితో పాటు బ్రిస్బేన్ టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన శార్దుల్ ఠాకూర్‌కు కూడా చోటు లభించింది. వీరిద్దరు కూడా స్వదేశంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడలేదు. అయితే గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్ కుమార్‌ను మాత్రం సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఐపీఎల్‌కు ముందు అతను ఇంగ్లండ్‌తో టి20, వన్డేలు ఆడాడు. ఇంగ్లండ్‌లోని వాతావరణ పరిస్థితుల్లో భువీ తన స్వింగ్ బౌలింగ్‌తో మంచి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అతనికి స్థానం ఖాయమనిపించింది. అయితే సెలక్టర్లు మరోలా ఆలోచించారు. పదే పదే ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న భువీపై సెలక్టర్లు నమ్మకం ఉంచలేకపోయారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన నవదీప్ సైనీని కూడా ఎంపిక చేయలేదు. కుల్దీప్ యాదవ్‌పై వేటు... ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం ఫిట్‌గా ఉంచేందుకే హార్దిక్ పాండ్యాతో ఎక్కువగా బౌలింగ్ చేయనీయడం లేదని కెప్టెన్ కోహ్లి పదేపదే చెబుతూ వచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో మాత్రమే బౌలింగ్ చేసిన హార్దిక్ ఐపీఎల్లో ఒక్క బంతి కూడా వేయలేదు. అయితే చివరకు అతనికీ టెస్టు అవకాశం దక్కలేదు. తాజా ఫిట్నెస్తో హార్దిక్ బౌలింగ్ చేయడం కష్టమని సెలక్టర్లు భావించారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై కూడా వేటు పడింది. గత రెండేళ్లలో ఒకే ఒక టెస్టులో ఆడే అవకాశం లభించిన కుల్దీప్ (ఇంగ్లండ్‌తో రెండో టెస్టు) మొత్తం కలిపి 12.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. టాప్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ఉండగా అవసరమైతే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తనను తాను నిరూపించుకున్న అక్షర్ పటేల్ (27 వికెట్లు) కూడా ఎంపికయ్యాడు. కాబట్టి కుల్దీప్కు తుది జట్టులో స్థానం కష్టం కాబట్టి పరిగణనలోకి తీసుకోలేదు. దేశవాళీలో పరిమిత ఓవర్ల టోర్నీలతో పాటు ఐపీఎల్లో కూడా చెలరేగినా... పృథ్వీ షాను టెస్టుల కోసం సెలక్టర్లు పరిశీలనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఫిట్నెస్ నిరూపించుకుంటేనే... బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా 20 మంది సభ్యుల బృందంలోకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరు బయలుదేరేలోపు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రాహుల్‌కు ఇటీవలే అపెండిసైటిస్ ఆపరేషన్ జరగ్గా... సాహా కరోనా వైరస్ బారిన పడ్డాడు. సాహాకు ప్రస్తుతం కరోనా చికిత్స కొనసాగుతోంది. అతను ఇంకా కోలుకోలేదు. ఆ నలుగురు... ప్రసిధ్ కృష్ణ: ఐపీఎల్లో కోల్‌కతా జట్టు తరఫున ఆడినప్పుడు ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కర్ణాటక బౌలర్ ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. 3 వన్డేల్లో కలిపి 6 వికెట్లు తీసిన అతను 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 20.26 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్: మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల అవేశ్‌కు ఆరేళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఉంది. 26 మ్యాచ్‌లలో అతను 23.01 సగటుతో 100 వికెట్లు తీశాడు. ముఖ్యంగా గత రెండు సీజన్లలో అతని ఆట ఎంతో మెరుగుపడింది. తాజా ఐపీఎల్‌లోనూ అది కనిపించింది. అభిమన్యు ఈశ్వరన్: రంజీల్లో ప్రతీ సీజన్లో నిలకడగా రాణిస్తున్నా దురదృష్టవశాత్తూ ఈ బెంగాల్ ఓపెనర్‌కు ఇప్పటి వరకు టీమిండియా పిలుపు రాలేదు. 64 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో అతను 43.57 సగటుతో 4,401 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు ఉన్నాయి. అర్జాన్ నాగ్వాస్వాలా: గుజరాత్‌కు చెందిన లెఫ్టార్మ్ పేస్ బౌలర్. 16 మ్యాచ్‌లలో 22.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. 2019–20 రంజీ సీజన్లో 41 వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న ఏకైక ‘పార్సీ’ ఆటగాడు అతనే కావడం విశేషం. భారత జట్టు కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), రోహిత్, గిల్, మయాంక్, పుజారా, విహారి, పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్, సుందర్, బుమ్రా, ఇషాంత్, షమీ, సిరాజ్, శార్దుల్, ఉమేశ్, రాహుల్, సాహా. స్టాండ్‌బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాలా -
'నేను సూపర్ ఓవర్ వేయడం వెనుక కారణం అదే'
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ తరపున అక్షర్ పటేల్ సూపర్ ఓవర్ వేయగా.. అతని స్పిన్ ఆడడంలో విఫలమైన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్‌మన్ కేవలం 7 పరుగులు మాత్రమే నమోదు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ రషీద్ వేసిన ఆఖరి బంతికి సింగిల్ తీసి విజయం సాధించింది. మ్యాచ్ విజయం అనంతరం అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్లు ఒకరినొకరు ఇంటర్య్వూ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదట సూపర్ ఓవర్ తాను వేయాల్సిందని.. ఆఖరి క్షణంలో అక్షర్ పటేల్ చేతిలోకి బంతి వెళ్లిందని ఆవేశ్ ఖన్ పేర్కొన్నాడు. ''రిషబ్ పంత్ దగ్గరకు వెళ్లి ఏం చెప్పావని.. బంతి నీ చేతిలోకి ఎలా వచ్చిందో'' చెప్పాలని అక్షర్‌ను అడిగాడు. దీనికి అక్షర్ స్పందిస్తూ.. సూపర్ ఓవర్‌కు మొదట నీ పేరును పరిశీలించిన మాట వాస్తవం. అప్పటికే ఆ జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ కూడా ఆవేశ్ ఖాన్ సూపర్ ఓవర్ వేస్తాడని స్పష్టం చేశాడు. కానీ తాను పంత్ దగ్గరకు వెళ్లి.. ఈ పిచ్‌పై స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు రావడం కష్టంగా ఉందని.. బ్యాట్స్‌మన్ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో సూపర్ ఓవర్‌ను ఫాస్ట్ బౌలర్ కంటే స్పిన్ బౌలర్‌తో వేయడం సమంజసమని తెలిపా. అందులోనూ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వస్తే వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి నా బౌలింగ్‌లో ఆడడానికి కాస్త ఇబ్బంది పడుతాడు. అందుకే సూపర్ ఓవర్ నేను వేస్తా అని పంత్‌కు తెలిపా'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందే కరోనా బారీన పడిన అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఐసోలేషన్‌లో ఉన్న అక్షర్ క్వారంటైన్ గడువు పూర్తి చేసుకొని ఇటీవలే జట్టుతో కలిశాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 4 ఓవర్లు వేసి 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 27న ఆర్సీబీతో ఆడనుంది. చదవండి: బెయిర్‌స్టో అప్పుడు టాయిలెట్లో ఉంటే తప్ప: సెహ్వాగ్ One shone bright on his comeback & delivered the Super Over while the other has been amongst the wickets. 👌👌 Presenting the @DelhiCapitals' bowling aces: @akshar2026 & Avesh Khan 😎😎 - By @28anand #VIVOIPL #SRHvDC Watch the full interview 🎥 👇https://t.co/cbzKlVKG6t pic.twitter.com/EQNzo4bcMo — IndianPremierLeague (@IPL) April 26, 2021 -
'రోహిత్ నా ఫెవరెట్ ప్లేయర్.. అందుకే ఆ పని చేశా'
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో ఆవేశ్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ తరపున నాలుగు మ్యాచ్‌లాడిన అతను ఎనిమిది వికెట్లు తీసి లీడింగ్ వికెట్‌టేకర్ జాబితాలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ 2 ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కనపెడితే.. ఆవేశ్ ఖాన్‌కు రోహిత్ శర్మ అంటే విపరీతమైన అభిమానం. తనతో కలిసి ఆడేందుకు అవకాశం రాకపోయినా.. ప్రత్యర్థి జట్టు తరపున అతనికి బౌలింగ్ చేయడం ఆనందం కలిగించిందని మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. అందుకే మ్యాచ్ ముగిశాక రోహిత్‌ను కలిసిన ఆవేశ్ ఖాన్ తన జెర్సీని తీసి రోహిత్‌కు ఇచ్చి ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు. అతని అభిమానానికి ఫిదా అయిన రోహిత్ ముసిముసిగా నవ్వుతూ జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అమిత్ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. చదవండి: మా ఓటమికి అదే కారణం: రోహిత్ ఐపీఎల్ 2021: ఈసారి మాత్రం ఢిల్లీదే పైచేయి -
ఆర్సీబీ వదిలేసుకున్న ప్లేయర్.. ఇప్పుడు ఇరగదీస్తున్నాడు
చెన్నై: అవేశ్ ఖాన్.. ఈ ఐపీఎల్ సీజన్లో అందర్నీ ఆకర్షిస్తున్న ప్లేయర్. ఇప్పటివరకూ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఐదు వికెట్లు సాధించాడు. ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రెండు వికెట్లు సాధించిన అవేశ్ ఖాన్.. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లతో రాణించాడు. ఇప్పుడు ఢిల్లీకి ప్రధాన బౌలింగ్ ఆయుధంగా మారిపోయాడు అవేశ్ ఖాన్. ఈ సీజన్ ఆరంభం వరకూ అవేశ్ ఖాన్ స్థానానికి గ్యారంటీ లేదు. ఇషాంత్ శర్మ గాయం కావడంతో అవేశ్ ఖాన్‌కు అవకాశం కల్పించక తప్పలేదు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అవేశ్. ఇప్పుడు అవేశ్ ఖాన్ జట్టులో లేకుండా ఢిల్లీ మ్యాచ్‌లంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో 5.80 ఎకానమీతో బౌలింగ్ చేసిన అవేశ్ ఖాన్.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 8.00 ఎకానమీ నమోదు చేశాడు. ఇప్పుడు అవేశ్ ఖాన్ గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. రాజస్థాన్‌పై మ్యాచ్ తర్వాత అవేశ్ ఖాన్ హాట్ టాపిక్ అయ్యాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అవేశ్ ఖాన్..ఇండోర్‌లో 1996 డిసెంబర్ 13వ తేదీన జన్మించాడు. 2016లో అండర్-19 తరఫున వరల్డ్‌కప్ ఆడిన భారత జట్టులో సభ్యుడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను 2014లో ఆరంభించిన అవేశ్.. ఇప్పటివరకూ 26 మ్యాచ్‌లు ఆడాడు. ఆ 26 మ్యాచ్‌ల్లో కలిపి 100 వికెట్లను సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 7/24 కాగా, ఒక మ్యాచ్‌లో బెస్ట్ 12/54గా ఉంది. ఇక లిస్ట్-ఎలో 16 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీయగా, 20 టీ20 మ్యాచ్‌లు ఆడి 37 వికెట్లు సాధించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్లో 11 మ్యాచ్‌లు 10 వికెట్లు సాధించాడు. ఆర్సీబీతో అరంగేట్రం.. అవేశ్ ఖాన్ టీ20 అరంగేట్రం ఆర్సీబీతో జరిగింది. 2017 ఐపీఎల్లో అతన్ని ఆర్సీబీ తీసుకుంది. కాగా, ఆ ఐపీఎల్లో కేవలం ఒక మ్యాచే ఆడగా, ఆపై అతన్ని వదిలేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. 2018లో జరిగిన వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు వచ్చాడు అవేశ్. రూ. 75 లక్షలకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తీసుకోగా, ఆ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లే తీశాడు. ఆపై 2019లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కాస్తా ఢిల్లీ క్యాపిటల్స్ గా మారగా అప్పట్నుంచి అదే జట్టుకు అవేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2019 సీజన్లో అతనికి ఒక మ్యాచే ఆడే అవకాశం దక్కగా, 2020 సీజన్లో సైతం ఒక మ్యాచే ఆడాడు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఎంపిక చేసిన ఐదుగురు నెట్ బౌలర్లలో అవేశ్ ఖాన్ ఒకడు. ఇక 2018-19 సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఆ సీజన్లో 7 మ్యాచ్‌ల్లో అవేశ్ 35 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడ చదవండి: ఐపీఎల్ 2021: ఆరుగురు భారత క్రికెటర్లు.. ఒక్కడే విదేశీ క్రికెటర్ -
మూడేళ్ల క్రితం క్యాచ్ డ్రాప్ అయ్యింది.. కానీ ఇప్పుడు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని వికెట్ తీయాలన్న తన కల ఎట్టకేలకు నెరవేరిందని ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అవేశ్ ఖాన్ అన్నాడు. మూడేళ్ల క్రితం ఈ అవకాశం వచ్చినట్టే వచ్చే చేజారిందని, అయితే ఇప్పుడు ప్రణాళిక పక్కాగా అమలు చేయడం ద్వారా అనుకున్నది సాధించగలిగానని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అవేశ్, కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2021 సీజన్లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అవేశ్‌పై నమ్మకం ఉంచడంతో, తుదిజట్టులో అతడికి చోటు లభించింది. దీంతో డీసీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌లో, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని.. డుప్లెసిస్, ఎంఎస్ ధోని వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీసి కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు. జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ధోని వికెట్ తీయడం గురించి అవేశ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘మూడేళ్ల క్రితం మహి భాయ్ వికెట్ తీసే అవకాశం వచ్చింది. కానీ క్యాచ్ డ్రాప్ చేయడం(కోలిన్ మున్రో)తో నిరాశే ఎదురైంది. మహీ భాయ్ వికెట్ తీయాలన్న నా కల అలాగే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు.. మూడు సంవత్సరాల తర్వాత అది నెరవేరింది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ‘‘భాయ్ కొన్ని రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మ్యాచ్‌లు ఆడలేదు. కాబట్టి తనపై ఒత్తిడి మరింతగా పెంచి, వికెట్ తీయాలని ప్రణాళికలు రచించాం. అవి నేను అమలు చేయగలిగాను’’ అని ప్లానింగ్ గురించి చెప్పుకొచ్చాడు. కాగా రెండు బంతులు ఎదుర్కొన్న ధోని, పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన పంత్ సేన, ఏప్రిల్ 15న రాజస్తాన్ రాయల్స్‌తో ముంబైలో జరిగే మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. చదవండి: ‘నన్ను బాధించింది..ఇక ఆలోచించడం లేదు’ ఐపీఎల్ ఆడకుండా క్రికెటర్లను ఆపలేం.. ఎందుకంటే! He made the ball do talking and rose to the occasion 💙 📹 | Avesh Khan chats with us about his performance in #CSKvDC, getting the big wickets of Faf and MSD, and if DC has the best pace attack in the IPL 🔥#YehHaiNayiDilli #IPL2021 #CapitalsUnplugged @OctaFX @TajMahalMumbai pic.twitter.com/nxwPodlWtq — Delhi Capitals (@DelhiCapitals) April 11, 2021 -
ధోనిని చూసి కుర్రాళ్లు నేర్చుకోవాలి
పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధికారిక విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. గత సీజన్లలో ముంబై ఆరంభంలో తడబడి ఆ తర్వాత కోలుకొని చాంపియన్‌గా నిలిచిన సందర్భాలున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన అతను జట్టును విజయబాట పట్టించాడు. లీగ్ తొలి మ్యాచ్‌లోనే ముంబైను ఓడించి... ఇపుడు అదే జట్టు చేతిలో ఓటమి పాలైన చెన్నై నేడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం ఉంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాకతో ఢిల్లీ జట్టు పరాజయాల బాటను విడిచి విజయపథంలోకి వచ్చింది. మరోవైపు ఇద్దరు యువ బౌలర్లు అవేశ్ ఖాన్, శివమ్ మావి దుందుడుకు ప్రవర్తనకుగాను ఐపీఎల్ కౌన్సిల్ మందలించడం శుభపరిణామం. బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేశాక ఈ ఇద్దరు బౌలర్లు అభ్యంతరకర భాషను ప్రయోగించడం మంచిది కాదు. యువ క్రికెటర్లలో ఈ దూషణ పర్వం అలవాటును మొగ్గలోనే తుంచేయాలి. అయితే టీవీల్లో తమ సీనియర్ క్రికెటర్ల ప్రవర్తనను చూశాకే వీరు కూడా ఇలా చేసి ఉంటారనిపిస్తోంది. ఈ మందలింపు అనేది ఈ ఇద్దరితోపాటు మిగతా యువ ఆటగాళ్లకు హెచ్చరికలాంటిదే. వికెట్ తీసినపుడుగానీ, అర్ధ సెంచరీ చేసినపుడగానీ ఆవేశంతో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్ధం కావడంలేదు. ఆవేశం ప్రదర్శించే బదులు హాయిగా నవ్వుతూ ఆ క్షణాలను ఆస్వాదిస్తే అందరికీ బాగుంటుంది. మైదానంలో ఎలా ప్రవర్తించాలనే విషయంలో యువ క్రికెటర్లు ధోనిని చూసి నేర్చుకోవాలి. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించినా ధోని ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. విజయంలోనూ అతను హుందాతనం చూపిస్తాడు. -
‘లిక్కర్’కు నో చెప్పిన మరో క్రికెటర్
బెంగళూరు: ఐపీఎల్లో ఒక యువ క్రికెటర్ తమ జట్టు బ్రాండింగ్ కంటే తన మత విశ్వాసాలకే ప్రాధాన్యతనిచ్చాడు. మద్యం కంపెనీ బ్రాండింగ్‌తో ఉన్న దుస్తులను తాను ధరించనని రాయల్ చాలెంజర్స్ జట్టు క్రికెటర్ అవేశ్ ఖాన్ స్పష్టం చేశాడు. ఆర్సీబీ జట్టు ‘కింగ్ ఫిషర్’ తదితర మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది. 20 ఏళ్ల అవేశ్ విజ్ఞప్తిని అంగీకరించి ఆర్సీబీ ‘కింగ్ ఫిషర్’ బ్రాండింగ్ లేని టీమ్ జెర్సీని అతను ధరించేందుకు అనుమతించింది. బెంగళూరు జట్టు సభ్యులైన ఇక్బాల్ అబ్దుల్లా, సర్ఫరాజ్ ఖాన్, తబ్రేజ్ షమ్సీ (దక్షిణాఫ్రికా) ఇప్పటికే దీనిని పాటిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అందరికంటే ముందుగా హషీం ఆమ్లా ఈ తరహాలో లిక్కర్ ఉత్పత్తులకు ప్రచారం చేసేందుకు నిరాకరించగా, ఆ తర్వాత ఇమ్రాన్ తాహిర్, ఫవాద్ అహ్మద్ (ఆస్ట్రేలియా) అతడిని అనుసరించారు. 2016 అండర్–19 ప్రపంచకప్‌లో నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన 20 ఏళ్ల అవేశ్ ఖాన్, ఆ టోర్నీలో 12 వికెట్లతో భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.