4 వికెట్లతో చెలరేగిన అవేష్‌ ఖాన్‌.. ప్రత్యర్ధి 170 పరుగులకే ఆలౌట్‌ | Avesh Khan's four-wicket haul help MP to bowl out Vidarbha for 170 on Day 1 | Sakshi
Sakshi News home page

4 వికెట్లతో చెలరేగిన అవేష్‌ ఖాన్‌.. ప్రత్యర్ధి 170 పరుగులకే ఆలౌట్‌

Published Sat, Mar 2 2024 7:04 PM | Last Updated on Sat, Mar 2 2024 7:48 PM

Avesh Khans four-wicket haul help MP to bowl out Vidarbha for 170 on Day 1 - Sakshi

పేసర్‌ అవేష్‌ ఖాన్‌ కు 4 వికెట్లు

నాగ్‌పూర్‌ వేదికగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ తొలి సెమీఫైనల్లో విధర్బ, మధ్యప్రదేశ్‌ జట్లు తలపడతున్నాయి. ఈ క్రమంలో మొదటి రోజు ఆటలో మధ్యప్రదేశ్‌ బౌలర్లు చెలరేగారు. మధ్యప్రదేశ్‌ బౌలర్ల దాటికి విధర్బ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. ఎంపీ బౌలర్లలో పేసర్‌ అవేష్‌ ఖాన్‌ 4 వికెట్లతో ప్రత్యర్ధి జట్టు దెబ్బతీయగా.. కుల్వంత్ ఖేజ్రోలియా, వెంకటేశ్‌ అయ్యర్‌ తలా రెండు వికెట్లతో రాణించారు.

విధర్బ బ్యాటర్లలో కరుణ్‌ నాయర్‌(63) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్‌ టైడే(39) పరుగులతో పర్వాలేదన్పించాడు. ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో హిమాన్షు(26), హర్ష్‌ గౌలీ(10) ఉన్నారు.
చదవండి#BCCI: శ్రేయస్‌ అయ్యర్‌పై అగార్కర్ సీరియస్‌.. అసలు కారణమిదే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement