vidharbha
-
కరుణ్ నాయర్ సెంచరీ, దూబే మెరుపులు.. సెమీ ఫైనల్లో విదర్భ
రంజీ ట్రోఫీ 2024-25(Ranji Trophy)లో విదర్భ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్-2లో తమిళనాడుతో తలపడ్డ విదర్భ భారీ విజయం సాధించింది. నాగ్‌పూర్‌లో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఏకంగా 198 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.కరుణ్ నాయర్ శతకంకాగా సొంత మైదానం విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో శనివారం టాస్ గెలిచిన అక్షయ్ వాడ్కర్ బృందం తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు అథర్వ టైడే(0), ధ్రువ్ షోరే(26)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య ఠాక్రే(5) ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మిడిలార్డర్లో డానిశ్ మాలేవర్(75) అర్ధ శతకంతో రాణించగా.. కరుణ్ నాయర్(Karun Nair) శతక్కొట్టాడు.హర్ష్ దూబే హాఫ్ సెంచరీమొత్తంగా 243 బంతులు ఎదుర్కొన్న కరుణ్ 122 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడుగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే(Harsh Dube) హాఫ్ సెంచరీ(69)తో మెరిశాడు. ఈ క్రమంలో విదర్భ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ మూడేసి వికెట్లు దక్కించుకోగా.. మొహమ్మద్ రెండు, అజిత్ రామ్, మొహమద్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.తమిళనాడు బ్యాటర్లు విఫలంఅనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు మొహమద్ అలీ(4), నారాయణ్ జగదీశన్(22)తో పాటు.. సాయి సుదర్శన్(7), బూపతి కుమార్(0) విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆండ్రీ సిద్దార్థ్(65) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హర్ష్ దూబే అతడిని పెవిలియన్‌కు పంపాడు.మిగతావాళ్లలో ప్రదోష్ పాల్(48), సోనూ యాదవ్(32) మాత్రం ఫర్వాలేదనిపించగా.. తమిళనాడు 225 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. విదర్భ బౌలర్లలో ఆదిత్య ఠాక్రే ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్, నచికేత్ భూటే రెండేసి వికెట్లు, హర్ష్ దూబే ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కెప్టెన్ రాణించినా..ఈ క్రమంలో 128 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విదర్భ 272 పరుగులకు ఆలౌట్ అయింది. ఈసారి యశ్ రాథోడ్(112) శతకంతో చెలరేగగా.. హర్ష్ దూబే మరోసారి హాఫ్ సెంచరీ(64) సాధించాడు. ఇక తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయి కిషోర్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం 401 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు.. మంగళవారం నాటి ఆటలో భాగంగా 202 పరుగులకే కుప్పకూలింది. ప్రదోష్ పాల్(53), సోనూ యాదవ్(57) అర్ధ శతకాలతో రాణించగా.. మిగతా వాళ్లంతా కనీసం ఇరవై పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే, నచికేత్ భూటే మూడేసి వికెట్లతో చెలరేగి తమిళనాడు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. మరోవైపు ఆదిత్య ఠాక్రే, అక్షయ్ వాఖరే చెరో వికెట్ తీశారు.సెమీస్ పోరులో ముంబైతోఈ నేపథ్యంలో 198 పరుగులతో తమిళనాడును చిత్తుచేసిన విదర్భ సెమీస్ చేరుకుంది. శతక వీరుడు కరుణ్ నాయర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ సీజన్లో విదర్భ ఇప్పటికి ఎనిమిదింట ఏడు విజయాలు సాధించడం విశేషం. ఇక విదర్భ ఫైనల్ బెర్తు కోసం ముంబైతో తలపడుతుంది. మరోవైపు.. సౌరాష్ట్రపై గెలుపొందిన గుజరాత్ కూడా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. జమ్మూ కశ్మీర్- కేరళ జట్ల మధ్య మ్యాచ్‌లో విజేతతో గుజరాత్ అమీతుమీ తేల్చుకుంటుంది.చదవండి: శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్‌లో ముంబై119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్ ఘనత -
ఏడు ఇన్నింగ్స్‌లో 752 రన్స్.. అసాధారణం: సచిన్ టెండుల్కర్
భారత క్రికెటర్ కరుణ్ నాయర్(Karun Nair)పై టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ప్రశంసల వర్షం కురిపించాడు. ఏడు ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు శతకాలు బాదడం గాలివాటం కాదని.. కఠోర శ్రమ, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నాడు. కరుణ్ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని సచిన్ ఆకాంక్షించాడు.ఐదు సెంచరీల సాయంతోకాగా రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో చాలా కాలం పాటు కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, 2023-24 సీజన్ నుంచి అతడు విదర్భకు ఆడుతున్నాడు. ఈ క్రమంలో దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25(Vijay Hazare Trophy) సీజన్లో 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.యాభై ఓవర్ల ఫార్మాట్లో కరుణ్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా 752 పరుగులు రాబట్టాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. ఏడు ఇన్నింగ్స్‌లోనూ అజేయంగా నిలవడం మరో విశేషం. ఇక కెప్టెన్‌గానూ కరుణ్ నాయర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. బ్యాటర్‌గా ఆకట్టుకుంటూనే సారథిగానూ సరైన వ్యూహాలతో విదర్భను తొలిసారి ఈ వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేర్చాడు.ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్‌కు టీమిండియా సెలక్టర్లు పిలుపునివ్వాలని.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అతడిని ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ సైతం కరుణ్ నాయర్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో‘‘కేవలం ఏడు ఇన్నింగ్స్‌లో ఐదు శతకాల సాయంతో 752 పరుగులు.. ఇది అసాధారణ విషయం కరుణ్ నాయర్!.. ఇలాంటి ప్రదర్శనలు కేవలం ఒక్కరోజులోనే సాధ్యం కావు. ఇందుకు ఆట పట్ల అంకిత భావం, దృష్టి ఉండాలి. కఠిన శ్రమతోనే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇదే తీరుగా ధైర్యంగా ముందుకు వెళ్లు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో’’ అని సచిన్ టెండ్కులర్ ‘ఎక్స్’ వేదికగా కరుణ్ నాయర్‌ను అభినందించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శనివారం జట్టును ప్రకటించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టు వివరాలను వెల్లడించనున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీ ఆడతాడా? లేదా? అన్నది ఈ సందర్భంగా తేలనుంది.నా అంతిమ లక్ష్యం అదేఇక చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు కరుణ్ నాయర్‌కు అవకాశం ఇవ్వాలంటూ టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బలంగా తన గొంతును వినిపించాడు. అయితే, మరో భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మాత్రం కరుణ్‌ను మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం లేదంటూ కొట్టిపారేశాడు. ఇదిలా ఉంటే.. పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ మాత్రం తనకు మరోసారి భారత్ తరఫున ఆడాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టాడు.‘‘దేశం తరఫున ఆడాలని ప్రతి ఆటగాడికి ఉంటుంది. నా కల కూడా ఇంకా సజీవంగానే ఉంది. అందుకే నేను ఇంకా క్రికెట్లో కొనసాగుతున్నాను. ఏదో ఒకరోజు మళ్లీ టీమిండియాలో అడుగుపెడతా. నా ఏకైక, అంతిమ లక్ష్యం అదే’’ అని కరుణ్ నాయర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎనిమిదేళ్ల క్రితంకాగా 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ చివరగా 2017లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. భారత్ తరఫున ఆరు టెస్టులు ఆడిన కరుణ్ నాయర్ ఖాతాలో 374 పరుగులు ఉన్నాయి, ఇందులో త్రిబుల్ సెంచరీ(303) ఉంది. ఇక రెండు వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ కేవలం 46 పరుగులకే పరిమితమయ్యాడు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
వారెవ్వా!.. కరుణ్ నాయర్ ఐదో సెంచరీ.. సెమీస్‌లో విదర్భ
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో హరియాణా, విదర్భ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో విదర్భ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించగా... హరియాణా జట్టు 2 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టును ఓడించింది.విదర్భతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (62; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభమ్ గర్వాల్ (59; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలు సాధించగా... దీపక్ హుడా (45; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ చహర్ (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ మహిపాల్ లోమ్రోర్ (32) తలా కొన్ని పరుగులు చేశారు.విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అయితే సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ (82 బంతుల్లో 122 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు ముందు రాజస్తాన్ స్కోరు సరిపోలేదు. ‘శత’క్కొట్టిన ధ్రువ్ షోరేఈ సీజన్లో వరుస సెంచరీలతో రికార్డులు తిరగరాస్తున్న విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ రాజస్తాన్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నాడు. అతడితో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షోరే(Dhruv Shorey- 131 బంతుల్లో 118 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ‘శత’క్కొట్టడంతో విదర్భ జట్టు 43.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 292 పరుగులు చేసి గెలిచింది.కరుణ్ నాయర్ ఐదో సెంచరీటీమిండియా ప్లేయర్లు దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ హుడా(Deepak Hooda) బౌలింగ్‌లో ధ్రువ్, కరుణ్ జంట పరుగుల వరద పారించింది. యశ్ రాథోడ్ (39) త్వరగానే అవుటవ్వగా... ధ్రువ్, కరుణ్ అబేధ్యమైన రెండో వికెట్‌కు 200 పరుగులు జోడించారు. తాజా సీజన్లో వరుసగా నాలుగు (ఓవరాల్‌గా 5) శతకాలు బాదిన కరుణ్ నాయర్... విజయ్ హజారే టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నారాయణ్ జగదీశన్ (5 శతకాలు; 2022–23లో) సరసన చేరాడు.ఈ టోర్నీలో ఇప్పటి వరకు 664 పరుగులు చేసిన 33 ఏళ్ల కరుణ్ నాయర్ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్రతో విదర్భ తలపడుతుంది. హరియాణా ఆల్‌రౌండ్ షో గుజరాత్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 45.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. హేమంగ్ పటేల్ (54; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరవగా... చింతన్ గాజా (32; 4 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆర్య దేశాయ్ (23; 5 ఫోర్లు), సౌరవ్ చౌహాన్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు.కెప్టెన్ అక్షర్ పటేల్ (3) విఫలమయ్యాడు. హరియాణా బౌలర్లలో అనూజ్ ఠక్రాల్, నిశాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో హరియాణా 44.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. హిమాన్షు రాణా (66; 10 ఫోర్లు) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశాడు. అనూజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో కర్ణాటకతో హరియాణా జట్టు తలపడనుంది. చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్Karun Nair is the No 3 India deserves in ODI cricketThis was the reason Kohli never promoted him in cricket. pic.twitter.com/L9hmVtHGAE— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 12, 2025 -
మా జట్టులో తక్కువ పరుగులు చేసింది నేనే: రహానే
Ajinkya Rahane Comments After Guiding Mumbai to Ranji Trophy Title Win: ‘‘మా జట్టులో తక్కువ పరుగులు స్కోరు చేసిన బ్యాటర్‌ను నేనే.. అయినప్పటికీ అందరికంటే అత్యంత సంతోషడే వ్యక్తిని కూడా నేనే.. ట్రోఫీ గెలవడం ఆనందంగా ఉంది. ప్రతి ఆటగాడి కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఏదేమైనా డ్రెసింగ్ రూంలో అందరూ పరస్పరం ఒకరి విజయాలు మరొకరు సెలబ్రేట్ చేసుకునే వాతావరణం కల్పించడమే అత్యంత ముఖ్యమైనది. నా జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతేడాది ఒక్క పరుగు తేడాతో ఓడి.. నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయాం. అయితే, ఇప్పుడు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి పట్ల మరింత బాధ్యత తీసుకుని.. వారి ఆటిట్యూడ్, ఫిట్నెస్, సహచర సభ్యులతో మెలిగే విధానం.. ఇలా ప్రతి అంశంలోనూ మరింత శ్రద్ధ వహించాం. ముంబై క్రికెట్ అసోసియేషన్ అన్ని వేళలా మాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని రంజీ ట్రోఫీ 2023-24 టైటిల్ విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే హర్షం చేశాడు. అదే విధంగా.. విదర్భ సైతం ఆఖరి వరకు విజయం కోసం అద్భుతంగా పోరాడిందని కొనియాడాడు. కాగా వాంఖడే స్టేడియంలో గురువారం ముగిసిన రంజీ ట్రోఫీ 2023- 24 ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏకంగా 42వ సారి ట్రోఫీ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్(136) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రహానే 73 విలువైన పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 95 పరుగులతో అదరగొట్టాడు. షమ్స్ ములానీ సైతం అజేయ అర్ధ శతకంతో రాణించాడు. కాగా రంజీ తాజా ఎడిషన్‌లో అదరగొట్టి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న రహానే.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొత్తంగా పదమూడు ఇన్నింగ్స్ ఆడి కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 are WINNERS of the #RanjiTrophy 2023-24! 🙌 Mumbai Captain Ajinkya Rahane receives the coveted Trophy 🏆 from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#Final | #MUMvVID | @ShelarAshish | @ajinkyarahane88 | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/LPZTZW3IV4 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 For his superb hundred in the #RanjiTrophy #Final, Musheer Khan is named the Player of the Match. 👍 👍 He receives the award from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#MUMvVID | @ShelarAshish | @IDFCFIRSTBank pic.twitter.com/T3l6mLW6kP — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 Tanush Kotian bagged the Player of the Tournament award for brilliant all-round display 🙌 🙌 He receives the award from Mr Ajinkya Naik, Honorary Secretary, Mumbai Cricket Association. 👏 👏#RanjiTrophy | #Final | #MUMvVID | @ajinkyasnaik | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/eMbRcr4s24 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 -
Ranji Trophy: ఉత్కంఠ పోరులో ఘన విజయం.. మూడోసారి ఫైనల్‌కు
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో విదర్భ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఖరి రోజు వరకు రసవత్తరంగా సాగిన సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఆఖరి మెట్టుపై ముంబైతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. నాగ్‌పూర్ వేదికగా మధ్యప్రదేశ్- విదర్భ మధ్య రంజీ తాజా ఎడిషన్ తొలి సెమీ ఫైనల్ జరిగింది. శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మధ్యప్రదేశ్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 170 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ 252 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వికెట్ కీపర్ హిమాన్షు మంత్రి అద్భుత శతకం(126) కారణంగా ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. విదర్భపై 82 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరో నంబర్ బ్యాటర్ యశ్ రాథోడ్ సూపర్ సెంచరీ(141), కెప్టెన్, వికెట కీపర్ బ్యాటర్ అక్షయ్ వాడ్కర్ అద్భుత అర్ధ శతకం(77) కారణంగా మధ్యప్రదేశ్‌కు దీటుగా బదులివ్వగలిగింది. మధ్యప్రదేశ్‌కు 321 పరుగుల లక్ష్యం విధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. గెలుపు దక్కాలంటే మధ్యప్రదేశ్ మరో 93 పరుగులు చేయాల్సి ఉండగా... నాలుగు వికెట్లు పడగొడితే విదర్భ మూడోసారి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకునే స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటను 228/6 ఓవర్‌నైట్ స్కోరుతో మొదలుపెట్టిన మధ్యప్రదేశ్.. ఆరంభంలోనే కుమార్ కార్తికేయ(4), అతడి స్థానంలో వచ్చిన అనుభవ్ అగర్వాల్(6) వికెట్లు కోల్పోయింది. నైట్‌వాచ్ మన్ సారాంశ్ జైన్ ఆవేశ్ ఖాన్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు బౌల్డ్ కావడంతో.. మధ్యప్రదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో 81.3 ఓవర్ వద్ద ఖెజ్రోలియా(11) బౌల్డ్ అవడంతో మధ్యప్రదేశ్ ఓటమి ఖరారైంది. 𝐕𝐢𝐝𝐚𝐫𝐛𝐡𝐚 𝐚𝐫𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 🙌🙌 They beat Madhya Pradesh by 62 runs in a tightly fought contest. A terrific comeback from the Akshay Wadkar-led side 👌@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1 Scorecard ▶️ https://t.co/KsLiJPuqXr pic.twitter.com/YFY1kaO1x7 — BCCI Domestic (@BCCIdomestic) March 6, 2024 విదర్భ 62 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. అద్భుత శతకంతో విదర్భ విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ రాథోడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా అంతకుముందు మరో సెమీస్ మ్యాచ్‌లో ముంబై తమిళనాడుపై గెలిచి రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లో ప్రవేశించింది. ఇక విదర్భ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. మార్చి 10న ముంబై, విదర్భ టైటిల్ కోసం పోటీ మొదలుపెట్టనున్నాయి. Timber Strikes 🔥 Vidarbha wrapped it up early today, picking up the remaining 4️⃣ wickets to enter the final. 👌@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1 Scorecard ▶️ https://t.co/KsLiJPuYMZ pic.twitter.com/ny6DYBQ7bM — BCCI Domestic (@BCCIdomestic) March 6, 2024 -
4 వికెట్లతో చెలరేగిన అవేష్ ఖాన్.. ప్రత్యర్ధి 170 పరుగులకే ఆలౌట్
నాగ్‌పూర్ వేదికగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ తొలి సెమీఫైనల్లో విధర్బ, మధ్యప్రదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ క్రమంలో మొదటి రోజు ఆటలో మధ్యప్రదేశ్ బౌలర్లు చెలరేగారు. మధ్యప్రదేశ్ బౌలర్ల దాటికి విధర్బ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. ఎంపీ బౌలర్లలో పేసర్ అవేష్ ఖాన్ 4 వికెట్లతో ప్రత్యర్ధి జట్టు దెబ్బతీయగా.. కుల్వంత్ ఖేజ్రోలియా, వెంకటేశ్ అయ్యర్ తలా రెండు వికెట్లతో రాణించారు. విధర్బ బ్యాటర్లలో కరుణ్ నాయర్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ టైడే(39) పరుగులతో పర్వాలేదన్పించాడు. ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో హిమాన్షు(26), హర్ష్ గౌలీ(10) ఉన్నారు. చదవండి: #BCCI: శ్రేయస్ అయ్యర్‌పై అగార్కర్ సీరియస్.. అసలు కారణమిదే? -
చెలరేగిన ఆదిత్య.. 74 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన విదర్భ! రంజీ చరిత్రలో తొలిసారి
Ranji Trophy 2022-23 - Vidarbha vs Gujarat: రంజీ చరిత్రలో విదర్భ సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ స్కోరును డిఫెండ్ చేసుకుని ప్రత్యర్థిపై విజయం సాధించిన జట్టుగా ఘనత సాధించింది. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23 సీజన్లో భాగంగా ఎలైట్ గ్రూపు డిలో ఉన్న విదర్భ- గుజరాత్ మధ్య నాగ్‌పూర్ వేదికగా మంగళవారం టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. సొంతమైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులకే ఆలౌట్ అయి మొదటి రోజే చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో గుజరాత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో భాగంగా 256ల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగించి 182 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇందుకు సమాధానంగా, విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ 69 పరుగులతో రాణించడం సహా.. వన్‌డౌన్ బ్యాటర్ అథర్వ టైడే 44, నచికేత్ బూటే 42 పరుగులతో పర్వాలేదనిపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆదిత్య విశ్వరూపం దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 254 పరగులు స్కోర్ చేయగలిగింది విదర్భ. ఈ క్రమంలో ఓవర్ నైట్ 6/1తో మూడో రోజు ఆట మొదలుపెట్టిన గుజరాత్‌ను విదర్భ బౌలర్ ఆదిత్య సర్వాటే కోలుకోలేని దెబ్బకొట్టాడు. మొత్తంగా 15.3 ఓవర్ల బౌలింగ్‌లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆదిత్యకు తోడు హర్ష్ దూబే 3 వికెట్లతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే గుజరాత్ కుప్పకూలింది. దీంతో 18 పరుగుల తేడాతో విదర్భ విజయం సాధించింది. గ్రూప్-డిలో పంజాబ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. బిహార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు ఈ క్రమంలో రంజీల్లో ఓ ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరు చేసినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు ఈ రికార్డు బిహార్ పేరిట ఉండేది. 1948- 49 సీజన్లో 78 పరుగులు మాత్రమే చేసిన బిహార్.. ఢిల్లీని 48 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో 74 ఏళ్లుగా బిహార్ పేరిట ఉన్న రికార్డును విదర్భ తాజాగా బద్దలు కొట్టింది. ఇక ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో లార్డ్స్ ఓల్డ్ గ్రౌండ్లో 1794నాటి మ్యాచ్‌లో 41 పరుగులు చేసిన ఓల్డ్‌ఫీల్డ్.. ఎంసీసీని 34 పరుగులకు ఆలౌట్ చేసింది. విదర్భ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ స్కోర్లు విదర్భ- 74 & 254 గుజరాత్- 256 & 54 చదవండి: Michael Bracewell: కుటుంబంలో అంతా క్రికెటర్లే! లేట్ అయినా సంచలనాలు సృష్టిస్తూ! కానీ ‘ఈరోజు’ నీది కాదంతే! Hashim Amla Facts In Telugu: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు -
Ind Vs Aus: ‘ఆరెంజ్ సిటీ’లో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
India Vs Australia T20 Series- 2nd T20: ఆస్ట్రేలియాతో రెండో టీ20 నేపథ్యంలో టీమిండియా నాగ్‌పూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్డు నుంచి హోటల్‌కు చేరుకోగానే అక్కడి సిబ్బంది టీమిండియా క్రికెటర్ల మెడలో పూల మాలలు వేసి చప్పట్లతో ఆహ్వానం పలికారు. మరోవైపు.. తమ అభిమాన ఆటగాళ్ల కోసం వేచి ఉన్న ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. ఇక ఆరెంజ్ సిటీలో టీమిండియా ఆటగాళ్లకు లభించిన ఈ గ్రాండ్ వెల్కమ్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్ యజువేంద్ర చహల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ముందుగా ఎంట్రీ ఇవ్వగా.. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించారు. కాగా శుక్రవారం(సెప్టెంబరు 23) భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 జరుగనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ ఇందుకు వేదిక కానుంది. ఇక మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ పర్యాటక ఆసీస్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో టీ20 భారత్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా సిరీస్ రేసులో నిలుస్తుంది. టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. చదవండి: LLC 2022: జింబాబ్వే బ్యాటర్ల విధ్వంసం.. ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం Pro Kabaddi League 2022: ప్రొ కబడ్డీ లీగ్ మొదటి దశ షెడ్యూల్ విడుదల! వేదికలు, ఇతర వివరాలు Touchdown Nagpur 📍🧡#TeamIndia | #INDvAUS pic.twitter.com/Odt7nFjlTe — BCCI (@BCCI) September 21, 2022 -
Ranji Trophy: 3.80 కోట్లు పలికిన ఆటగాడు 5 వికెట్లతో అదరగొట్టాడు.. కానీ అంతలోనే!
రంజీ ట్రోఫీలో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో అసోం ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 48 పరుగులతో రాణించడం సహా 5 వికెట్లు కూల్చి ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టాడు. వరుస విరామాల్లో వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. 25 ఓవర్లు బౌలింగ్ వేసిన అతడు 68 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కొరకరాని కొయ్యగా తయారైన విదర్భ ఓపెనర్, కెప్టెన్ ఫాజల్(86)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన రియాన్.. ఆ తర్వాత అథర్వ తైడే, సతీశ్, అక్షయ్‌ను వరుసగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆదిత్య వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రియాన్ దెబ్బతో విలవిల్లాడిన విదర్భ 85 ఓవర్లలో 271 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. అంతకు ముందు టాస్ గెలిచిన విదర్భ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన అసోం 316 పరుగులకు ఆలౌట్ అయింది. అసోం బ్యాటర్లలో స్వరూప్ 113 పరుగులతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అసోంను కోలుకోలేని దెబ్బ కొట్టారు విదర్భ బౌలర్లు. రజనీశ్ 4, లలిత్ యాదవ్ 5 వికెట్లు కూల్చి సత్తా చాటారు. దీంతో 110 పరుగులకే అసోం జట్టు చాపచుట్టేసింది. ప్రస్తుతం ఓవరాల్‌గా 155 ఆధిక్యంలో ఉంది. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా రియాన్ పరాగ్‌ను రాజస్తాన్ రాయల్స్ 3.80 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎలైట్ గ్రూప్ జీ విదర్భ వర్సెస్ అసోం అసోం- తొలి ఇన్నింగ్స్ : 316-10 (92.1 ఓవర్లు) రెండో ఇన్నింగ్స్ : 110-10 (37.4 ఓవర్లు) విదర్భ- తొలి ఇన్నింగ్స్ : 271-10 (85 ఓవర్లు) చదవండి: IND vs SL: 35 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన జడేజా.. తొలి భారత ఆటగాడిగా! 2⃣5⃣-3⃣-6⃣8⃣-5⃣! 👌 👌 Sit back & relive @ParagRiyan's five-wicket haul for Assam against Vidarbha 🎥 🔽 #RanjiTrophy | #VIDvASM | @Paytm pic.twitter.com/PUR2uNAAPm — BCCI Domestic (@BCCIdomestic) March 5, 2022 -
Vijay Hazare Trophy: ప్రేరక్ మన్కడ్ అద్భుత ఇన్నింగ్స్.. సెమీస్‌లో సౌరాష్ట్ర
Saurashtra Won: విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో సౌరాష్ట్ర అదరగొట్టింది. జయదేవ్ ఉనద్కట్ సారథ్యంలోని జట్టు... విదర్భను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ప్రేరక్ మన్కడ్ హాఫ్ సెంచరీ(72 బంతుల్లో 77 పరుగులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా సౌరాష్ట్ర- విదర్భ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర.... 150 పరుగులకే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసింది. జట్టులోని ప్రతి బౌలర్ కనీసం ఒక వికెట్ తీయడం విశేషం. ఈ క్రమంలో 151 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌరాష్ట్ర... ఆదిలోనే విశ్వరాజ్ జడేజా వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ హర్విక్ దేశాయ్(9 పరుగులు) సైతం పూర్తిగా నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షెల్డన్ జాక్సన్ కూడా 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ప్రేరక్ మన్కడ్, అర్పిత్ వాసవడా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వరుసగా 77, 41 పరుగులతో అజేయంగా నిలిచి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర విదర్భపై విజయం సాధించి సెమీస్ చేరుకుంది. విదర్భ బౌలర్లలో ఆదిత్య ఠాక్రేకు రెండు, లలిత్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. అంతకుముందుబ్యాటర్ అపూర్వ్ వాంఖడే హాఫ్ సెంచరీ(72 పరుగులు) చేయడంతో విదర్భ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్కోర్లు: విదర్భ- 150 (40.3) సౌరాష్ట్ర- 151/3 (29.5) DO NOT MISS: Prerak Mankad's match-winning 77* (72) against Vidarbha 👍 👍 The Saurashtra right-hander creamed 10 fours & 2 sixes to power his side to a convincing 7-wicket win in the #QF3 of the #VijayHazareTrophy. 👏 👏 #SAUvVID Watch his knock 🎥 🔽https://t.co/EVS1KXWGgV pic.twitter.com/iAQU5i8iJ9 — BCCI Domestic (@BCCIdomestic) December 22, 2021 -
Vijay Hazare Trophy: 23,1,1,1,18,14,1,0,5,0.. అందరూ చేతులెత్తేశారు.. ఒక్కడే 72!
Sheldon Jackson Super Diving Catch Video Viral: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. సూపర్డైవ్తో విదర్భ బ్యాటర్ అథర్వ టైడ్ పెవిలియన్ చేరేలా చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ-2021 మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా సౌరాష్ట్ర- విదర్భ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విదర్భకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ ఫాజల్ 23 పరుగులు చేయగా.. అతడికి జోడీగా ఓపెనింగ్‌కు దిగిన అథర్వ కేవలం ఒకే ఒక్క పరుగు తీసి వెనుదిరిగాడు. మూడో ఓవర్ మూడో బంతికి జయదేవ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ పాదరసంలా కదిలి డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. ఆ తర్వాత విదర్భ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే అపూర్వ్ వాంఖడే హాఫ్ సెంచరీ(72 పరుగులు)తో రాణించడంతో 40.3 ఓవర్లలో 150 పరుగులు చేసి విదర్భ ఆలౌట్ అయింది. విదర్భ బ్యాటర్ల స్కోర్లు వరుసగా.. 23,1,1,1,18,14,72,1,0,5,0. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్కు 2, చేతన్ సకారియాకు ఒకటి, చిరాగ్ జానీకి 2, ప్రేరక్ మన్కడ్‌కు ఒకటి, డీఏ జడేజాకు రెండు, యువరాజ్ చౌడసమాకు 2 వికెట్లు దక్కాయి. సౌరాష్ట్ర బ్యాటింగ్ కొనసాగిస్తోంది. చదవండి: Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం! ఆ టీమిండియా బ్యాటర్‌కి బౌలింగ్ చేయడం చాలా కష్టం: పాక్ బౌలర్ .@ShelJackson27's superb diving catch 👌 👌 Jackson, keeping the wickets, flew towards his left & completed a stunning catch off @saucricket captain @JUnadkat to dismiss Atharva Taide. 👍 👍 #SAUvVID #VijayHazareTrophy #QF3 Watch that catch 🎥 🔽https://t.co/aqsiKMv4A8 pic.twitter.com/Z0Rah3D6P5 — BCCI Domestic (@BCCIdomestic) December 22, 2021 -
‘యశ్’లు అదరగొట్టారు... ఒకరు 4 వికెట్లు తీస్తే.. మరొకరు 57 పరుగులు చేసి..
Yash Thakur: విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో విదర్భ జట్టు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో విదర్భ 34 పరుగులతో త్రిపురపై నెగ్గింది. విదర్భ 50 ఓవర్లలో 7 వికెట్లకు 258 పరుగులు చేయగా... త్రిపుర జట్టు 224 పరుగులకు ఆలౌటైంది. విదర్భ పేసర్ యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యశ్ రాథోడ్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రాజస్తాన్‌పై కర్ణాటక... మధ్యప్రదేశ్‌పై ఉత్తరప్రదేశ్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. స్కోర్లు: విదర్భ: 258/7 (50) త్రిపుర: 224 (49.3) చదవండి: IND Vs SA: ఓవర్‌లోడ్ బ్యాగ్ మోసుకుని వెళ్లిన కోహ్లి.. దాంట్లో ఏముంది! Rishabh Pant: రిషభ్‌పంత్‌కు లక్కీ ఛాన్స్.. ఫోన్ చేసి చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి DO NOT MISS: Yash Thakur's match-winning 4/45 👏 👏 The pacer was the pick of the Vidarbha bowlers and guided his team to a victory over Tripura. 👍 👍 #VIDvTPA #PQF1 #VijayHazareTrophy Watch his 4⃣-wicket haul 🎥 🔽https://t.co/b1aNytDoRW pic.twitter.com/DDwK8aMQI6 — BCCI Domestic (@BCCIdomestic) December 19, 2021 -
విజయ్ హజారే ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ లక్ష్యంగా...
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ సమరానికి వేళయింది. లీగ్ దశలో ప్రతి గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఐదు జట్లు (విదర్భ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్)... ప్లేట్ గ్రూప్ టాపర్ త్రిపుర మధ్య నేడు మూడు ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో త్రిపురతో విదర్భ... రెండో మ్యాచ్‌లో కర్ణాటకతో రాజస్తాన్... మూడో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో ఉత్తర్‌ప్రదేశ్ ఆడతాయి. విజేత జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన వెంకటేశ్ అయ్యర్ మధ్యప్రదేశ్ తరఫున ఆడనున్నాడు. లీగ్ దశలో గ్రూప్ టాపర్లుగా నిలిచిన హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, సౌరాష్ట్ర, కేరళ, సర్వీసెస్ జట్లు నేరుగా క్వార్టర్స్ చేరుకున్నాయి. -
విదర్భకు భారీ ఆధిక్యం
మూలపాడు (విజయవాడ): మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సతీశ్ గణేశ్ (397 బంతుల్లో 237; 25 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత డబుల్ సెంచరీ చేయడంతో... ఆంధ్ర జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 268/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు 147.3 ఓవర్లలో 441 పరుగులకు ఆలౌటైంది. 230 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. వినయ్ ఖాతాలో 400 వికెట్లు... రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో భాగంగా బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో పుదుచ్చేరి జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. పుదుచ్చేరికి ఆడుతున్న భారత జట్టు మాజీ బౌలర్, కర్ణాటకకు చెందిన వినయ్ కుమార్ ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయడంద్వారా రంజీల్లో 400 వికెట్లు పడగొట్టిన రెండో పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. పంకజ్ సింగ్ (409 వికెట్లు) మాత్రమే వినయ్‌కంటే ముందున్నాడు. ఓవరాల్‌గా రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజిందర్ గోయల్ (637 వికెట్లు) పేరిట ఉంది. పృథ్వీ షా డబుల్ సెంచరీ... డోపింగ్ నిషేధం పూర్తయ్యాక పునరాగమనంలో ముంబై యువ ఆటగాడు పృథ్వీ షా అదరగొడుతున్నాడు. బరోడాతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లోపృథ్వీ షా (179 బంతుల్లో 202; 19 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెండో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ఫలితంగా ముంబై రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 409 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. బరోడాకు 534 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. -
బౌన్సర్ తాకి విలవిల్లాడుతుంటే..
న్యూఢిల్లీ : రంజీ ట్రోఫీ 2017-18 ఫైనల్ మ్యాచ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ జట్టు బౌలర్ వేసిన ఓ బౌన్సర్ ఛాతిని బలంగా తాకడంతో బ్యాట్స్‌మన్ నొప్పిని భరించలేక కుప్పకూలిపోయాడు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న అతన్ని ఓదార్చేందుకు ప్రత్యర్థి జట్టులోని ఒక్కరూ వెళ్లకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. క్రికెట్ నిజంగానే జెంటిల్మెన్ గేమేనా అనే ఆలోచనను రేకెత్తిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సహచర బ్యాట్స్‌మన్ బాధను చూడలేకపోయిన మరో బ్యాట్స్‌మన్ మెడికల్ హెల్ప్ కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు చేయి చూపించారు. ఇదే సమయంలో కుప్పకూలిన క్రికెటర్ నొప్పితో విలవిల్లాడుతున్నా అతని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు ఢిల్లీ ఆటగాళ్లు. ఈ వీడియోను తిలకించిన నెటిజన్లు ఢిల్లీ జట్టు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్‌మన్‌షిప్‌ను మరచి ఢిల్లీ ఆటగాళ్లు ప్రవర్తించారని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఢిల్లీతో జరిగిన ఫైనల్లో విదర్భ జట్టు అద్భుత విజయం సాధించి తొలిసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. Sportsmanship ?! 🤔 A post shared by mahi7781 🔵 (@bleed.dhonism) on Dec 31, 2017 at 12:03am PST -
చరిత్ర సృష్టించిన విదర్భ
సాక్షి, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ జట్టు చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో జరిగిన రంజీ ట్రోఫీ 2017-18 సీజన్ ఫైనల్లో ఢిల్లీ జట్టును మట్టికరిపించింది. తద్వారా 83 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 295 పరుగులు సాధించగా.. అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు అక్షయ్ వినోద్ వాడ్కర్ అజేయ శతకంతో 547 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఢిల్లీ 280 పరుగులు సాధించింది. ఆపై స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ ఒక వికెట్ కోల్పోయి అలవోక విజయాన్ని, తొలిసారి రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ప్రారంభం నుంచే సమిష్టి కృషితో విదర్భ జట్టు తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తోంది. -
మహిళల వన్డే మ్యాచ్‌లో అద్భుతం
సాక్షి, స్పోర్ట్స్ : మహిళల వన్డే మ్యాచ్‌లో అద్భుతం చోటుచేసుకుంది. విదర్భ జట్టు మీడియం పేస్ బౌలర్ కోమల్ జన్జాద్ బంతితో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఎనిమిది పరుగులిచ్చి ఏకంగా 9 వికెట్లు నేలకూల్చారు. గురువారం విదర్భ-హరియాణా జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొంది. మొత్తం 9.4 ఓవర్లలో 5 మెయిడెన్లు కాగా.. 8 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకున్నారు. కోమల్ దెబ్బకు హరియాణా బ్యాట్స్‌విమెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. ఆ జట్టు కెప్టెన్ ఎస్ఎం ఖత్రి చేసిన ఏడు పరుగులే అత్యధికం కావడం గమనార్హం. హరియాణా జట్టు 18.4 ఓవర్లలో 31 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 32 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు కేవలం 4.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. 32 పరుగుల్లో ఓపెనర్ ఎల్ఎం ఇనామ్దార్ 30 పరుగులు(18 బంతుల్లో ఏడు ఫోర్లు) సాధించగా.. మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్ ఉమన్ రెండు పరుగులు సాధించారు. -
రైతుల వద్దకు రాహుల్ గాంధీ
నాగ్‌పూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం కిసాన్ పాదయాత్ర ప్రారంభించారు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకునే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని గ్రామాల గుండా రోజుకు పది హేను కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. తొలుత గంజి అనే గ్రామానికి చేరుకున్న ఆయన అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు. రాహుల్ తోపాటు పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రైతులను చిన్నచూపు చూస్తున్నారని, ఆత్మహత్యలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తీవ్రంగా బుధవారం పార్లమెంటులో విమర్శించిన విషయం తెలిసిందే. రైతులు దేశాన్ని నిర్మించలేరా అని ఆయన మోదీని నిలదీశారు కూడా. -
'టి’ బిల్లుకు మద్ధతిస్తాం : మాయావతి