Vijay Hazare Trophy: Vidarbha Defeat Tripura By 34 Runs To Enters Quarter Final - Sakshi
Sakshi News home page

Vijay Hazare Trophy: ‘యశ్‌’లు అదరగొట్టారు... ఒకరు 4 వికెట్లు తీస్తే.. మరొకరు 57 పరుగులు చేసి..

Published Mon, Dec 20 2021 10:11 AM | Last Updated on Mon, Dec 20 2021 1:20 PM

Vijay Hazare Trophy: Vidarbha Defeat Tripura Enters Quarter Final - Sakshi

యశ్‌ ఠాకూర్‌(PC: BCCI)

Yash Thakur: విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో విదర్భ జట్టు క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో విదర్భ 34 పరుగులతో త్రిపురపై నెగ్గింది. విదర్భ 50 ఓవర్లలో 7 వికెట్లకు 258 పరుగులు చేయగా... త్రిపుర జట్టు 224 పరుగులకు ఆలౌటైంది.

విదర్భ పేసర్‌ యశ్‌ ఠాకూర్‌ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యశ్‌ రాథోడ్‌ 57 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో రాజస్తాన్‌పై కర్ణాటక... మధ్యప్రదేశ్‌పై ఉత్తరప్రదేశ్‌ విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి.  

స్కోర్లు: 
విదర్భ: 258/7 (50)
త్రిపుర: 224 (49.3)

చదవండి: IND Vs SA: ఓవర్‌లోడ్ బ్యాగ్ మోసుకుని వెళ్లిన కోహ్లి.. దాంట్లో ఏముంది!
Rishabh Pant: రిషభ్‌పంత్‌కు లక్కీ ఛాన్స్‌.. ఫోన్‌ చేసి చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement