
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ సమరానికి వేళయింది. లీగ్ దశలో ప్రతి గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఐదు జట్లు (విదర్భ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్)... ప్లేట్ గ్రూప్ టాపర్ త్రిపుర మధ్య నేడు మూడు ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో త్రిపురతో విదర్భ... రెండో మ్యాచ్‌లో కర్ణాటకతో రాజస్తాన్... మూడో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో ఉత్తర్‌ప్రదేశ్ ఆడతాయి.
విజేత జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన వెంకటేశ్ అయ్యర్ మధ్యప్రదేశ్ తరఫున ఆడనున్నాడు. లీగ్ దశలో గ్రూప్ టాపర్లుగా నిలిచిన హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, సౌరాష్ట్ర, కేరళ, సర్వీసెస్ జట్లు నేరుగా క్వార్టర్స్ చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment