Vijay Hazare Trophy
-
Karun Nair: ఇంత గొప్పగా ఆడినా టీమిండియాలో చోటివ్వరా..? మతి పోయే గణాంకాలు..!
ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బారత జట్లను కొద్ది రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్ల ప్రకటనకు ముందు భారత క్రికెట్ సర్కిల్స్‌లో ఓ పేరు బలంగా వినపడింది. అదే కరుణ్ నాయర్. ఈ విదర్భ ఆటగాడు తాజాగా ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో నమ్మశక్యం కాని రీతిలో పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో కరుణ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 389.50 సగటున, 124.04 స్ట్రయిక్‌రేట్‌తో 779 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇంత గొప్ప ప్రదర్శన తర్వాత ఏ ఆటగాడైనా జాతీయ జట్టులో చోటు ఆశించడం సహజం. అయితే భారత సెలెక్టర్లు కరుణ్ అద్భుత ప్రదర్శనను పక్కకు పెట్టి ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు కానీ, ఛాంపియన్స్ ట్రోఫీకి కానీ అతన్ని ఎంపిక చేయలేదు.కరుణ్ కేవలం విజయ్ హజారే ట్రోఫీ ప్రదర్శనలతోనే భారత జట్టులో చోటు ఆశించాడనుకుంటే పొరబడినట్లే. కరుణ్ గతేడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీతో కరుణ్ పరుగుల ప్రవాహం మొదలైంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గత సీజన్ రంజీ ట్రోఫీలోనూ రెచ్చిపోయి ఆడాడు. గడిచిన ఎడిషన్‌లో కరుణ్ 17 ఇన్నింగ్స్‌ల్లో 40.58 సగటున 690 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉన్నాయి.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ విశేషంగా రాణించాడు. ఇంగ్లండ్ దేశవాలీ సీజన్లో కరుణ్ 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ విధ్వంసం కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.గతేడాది ఇంత ఘన ప్రదర్శనలు చేసిన కరుణ్ భారత జట్టులో చోటు ఆశించడం సహజమే. అయితే కరుణ్ కలలు కన్నట్లు భారత జట్టులో చోటు లభించకపోగా ఎలాంటి ముందస్తు హామీ కూడా లభించలేదు. ఇప్పుడు కాకపోతే త్వరలోనైనా సెలెక్టర్లు అతన్ని కరుణిస్తారా అంటే అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి జాతీయ జట్టుకు ఎంపిక కాని క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది కరుణ్ నాయరే అని చెప్పాలి. టీమిండియాకు ఆడిన అనుభవం లేక అతన్ని పరిగణలోని తీసుకోవడం లేదా అంటే అలాంటదేమీ లేదు. కరుణ్ ఎనిమిదేళ్ల కిందట టీమిండియా తరఫున ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్, కరుణ్ మాత్రమే ట్రిపుల్ సాధించారు. ఇంత టాలెంట్ కలిగి ఉండి కూడా కరుణ్ జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడం నిజంగా చింతించాల్సిన విషయమే. -
చాంపియన్ కర్ణాటక
వడోదర: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు విజేతగా నిలిచింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన కర్ణాటక... తుది పోరులోనూ భారీ స్కోరు చేసి టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఐదోసారి ఫైనల్‌కు చేరిన కర్ణాటక ఐదు సార్లూ టైటిల్ సొంతం చేసుకోవడం మరో విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక 36 పరుగుల తేడాతో విదర్భను చిత్తుచేసింది. ఈ సీజన్లో పరుగుల వరద పారించిన విదర్భ సారథి కరుణ్ నాయర్ (31 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఆఖరి పోరులో ఎక్కువసేపు నిలవకపోవడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. రవిచంద్రన్ స్మరణ్ (92 బంతుల్లో 101; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... క్రిష్ణన్ శ్రీజిత్ (74 బంతుల్లో 78; 9 ఫోర్లు, ఒక సిక్స్), అభినవ్ మనోహర్ (42 బంతుల్లో 79; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో విజృంభించారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32; 5 ఫోర్లు), టీమిండియా ఆటగాడు దేవదత్ పడిక్కల్ (8), అనీశ్ (21) విఫలమయ్యారు. 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో శ్రీజిత్‌తో కలిసి స్మరణ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ జంట నాలుగో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఇక చివర్లో అభినవ్ మనోహర్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కర్ణాటక భారీ స్కోరు చేయగలిగింది. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, నచికేత్ భూటె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో విదర్భ జట్టు 48.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ధ్రువ్ షోరే (111 బంతుల్లో 110; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో పోరాడగా... హర్ష్ దూబే (30 బంతుల్లో 63; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్లోనూ సెంచరీలు చేసిన ధ్రువ్ షోరే తుది పోరులోనూ అదే జోరు కొనసాగించగా... అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. కెపె్టన్ కరుణ్ నాయర్, యశ్ రాథోడ్ (22), యష్ కదమ్ (15); జితేశ్ శర్మ (34), శుభమ్ దూబే (8), అపూర్వ వాంఖడే (12) విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో వాసుకి కౌషీక్, ప్రసిద్ధ్ కృష్ణ, అభిలాశ్ శెట్టి తలా 3 వికెట్లు పడగొట్టారు. సెంచరీతో చెలరేగిన కర్ణాటక బ్యాటర్ స్మరణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తాజా టోర్నిలో 389.5 సగటుతో 779 పరుగులు చేసి ‘టాప్ స్కోరర్’గా నిలిచిన కరుణ్ నాయర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు లభించింది. -
కనికరం లేని కరుణ్ నాయర్.. విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ
వడోదర: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ జట్టు తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిన విదర్భ తుది పోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో విదర్భ 69 పరుగుల తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశ్ రాథోడ్ (101 బంతుల్లో 116; 14 ఫోర్లు, 1 సిక్స్), ధ్రువ్ షోరే (120 బంతుల్లో 114; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 34.4 ఓవర్లలో 224 పరుగులు జోడించారు. అనంతరం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కరుణ్ నాయర్ (44 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరో దూకుడైన ఇన్నింగ్స్‌తో చెలరేగగా... జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు. 40 ఓవర్లు ముగిసేసరికి విదర్భ స్కోరు 254 కాగా... చివరి 10 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 126 పరుగులు సాధించింది! ముఖ్యంగా ముకేశ్ వేసిన 47వ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ కొట్టిన కరుణ్ నాయర్... రజనీశ్ గుర్బానీ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 4, 0, 6, 4, 4, 6 బాదాడు. ఒకదశలో 35 బంతుల్లో 51 వద్ద ఉన్న కరుణ్ తర్వాతి 9 బంతుల్లో 37 పరుగులు రాబట్టాడు. అనంతరం మహారాష్ట్ర కొంత పోరాడగలిగినా చివరకు ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో మహారాష్ట్ర 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. అర్షిన్ కులకర్ణి (101 బంతుల్లో 90; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకోగా... అంకిత్ బావ్నే (49 బంతుల్లో 50; 5 ఫోర్లు), నిఖిల్ నాయక్ (26 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. దర్శన్ నల్కండే, నచికేత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కర్ణాటక జట్టు ఇప్పటికే నాలుగుసార్లు విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. ఈ నాలుగు సందర్భాల్లోనూ కర్ణాటక జట్టులో కరుణ్ నాయర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఫైనల్లో ప్రత్యర్థి జట్టు విదర్భ కెప్టెన్‌గా తన పాత జట్టుపై సమరానికి సిద్ధమయ్యాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు, 1 అర్ధ సెంచరీతో ఏకంగా 752 పరుగులు సాధించిన నాయర్ తన టీమ్‌ను విజేతగా నిలుపుతాడా అనేది ఆసక్తికరం! -
కరుణ్ నాయర్ ఐపీఎల్ ఆడుతున్నాడా..?
దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో పరుగుల వరద పారిస్తున్న విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ఏ ఇద్దరు భారత క్రికెట్ అభిమానులు కలిసినా కరుణ్ నాయర్ గురించిన చర్చే నడుస్తుంది. 2022 డిసెంబర్లో డియర్ క్రికెట్.. మరో ఛాన్స్ ఇవ్వు అని ప్రాధేయ పడిన కరుణ్, ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ గణాంకాలు చూస్తే ఎంతటి వారైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ టోర్నీలో కరుణ్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 752 సగటున 752 పరుగులు (112*, 44*, 163*, 111*, 112, 122*, 88*) చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ అర్ద సెంచరీ ఉన్నాయి. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో కరుణ్ కేవలం ఒక్క సారి మాత్రమే ఔటయ్యాడు.కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ చూసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు ఇతని గురించి లోతుగా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతటి విధ్వంసకర బ్యాటర్ అయిన కరుణ్ అసలు ఐపీఎల్ ఆడుతున్నాడా లేదా అని గూగుల్ చేస్తున్నారు. ఆసక్తికరంగా కరుణ్‌ను ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో డీసీ కరుణ్‌ను 50 లక్షలకు సొంతం చేసుకుంది. కరుణ్ గతంలోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. కరుణ్‌కు 2013-22 వరకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. ఈ మధ్యకాలంలో అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 76 మ్యాచ్‌లు ఆడి 10 అర్ద సెంచరీల సాయంతో 1496 పరుగులు చేశాడు.వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్‌ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్ అయిన కరుణ్ కేవలం కొంతకాలం మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగాడు. తన మూడో మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తిరిగి ఏడేళ్ల తర్వాత కరుణ్ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్‌కు అవకాశాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం కరుణ్ ఉన్న ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తే మూడు ఫార్మాట్లలో భారత జట్టులో పాగా వేయడం ఖాయం. కరుణ్ 2016-17 మధ్యలో భారత్ తరఫున 6 టెస్ట్‌లు, రెండు వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ మినహాయించి కరుణ్‌కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు.కాగా, విజయ్ హజారే ట్రోఫీలో ఇవాళ (జనవరి 16) జరుగుతున్న మ్యాచ్‌లో కరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడు. మహారాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కరుణ్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విదర్భకు ఇదే అత్యధిక స్కోర్.మహారాష్ట్రతో మ్యాచ్‌లో కరుణ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. విదర్భ ఓపెనర్లు దృవ్ షోరే (120 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు), యశ్ రాథోడ్ (101 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 116 పరుగులు) సెంచరీలు చేశారు. దృవ్, యశ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగులు జోడించారు. తదనంతరం కరుణ్ నాయర్‌తో పాటు జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. -
మరోసారి రెచ్చిపోయిన కరుణ్ నాయర్.. ఈసారి..!
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నాడు. ఈ టోర్నీలో కరుణ్ ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో రికార్డు స్థాయిలో 752 సగటున 752 పరుగులు (112*, 44*, 163*, 111*, 112, 122*, 88*) చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ అర్ద సెంచరీ ఉన్నాయి. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో కరుణ్ కేవలం ఒక్క సారి మాత్రమే ఔటయ్యాడు.పేట్రేగిపోయిన కరుణ్మహారాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కరుణ్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విదర్భకు ఇదే అత్యధిక స్కోర్.ఓపెనర్ల శతకాలుఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర టాస్ గెలిచి విదర్భను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మహారాష్ట్ర ప్రత్యర్దిని బ్యాటింగ్ ఆహ్వానించి ఎంత తప్పు చేసిందో కొద్ది సేపటికే గ్రహించింది. విదర్భ ఓపెనర్లు మహారాష్ట్ర బౌలర్లను నింపాదిగా ఎదుర్కొంటూ సెంచరీలు చేశారు. దృవ్ షోరే 120 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు.. యశ్ రాథోడ్ 101 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 116 పరుగులు చేశారు. దృవ్, యశ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగులు జోడించారు. యశ్ ఔటైన తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ఆదిలో నిదానంగా బ్యాటింగ్ చేశాడు.45 ఓవర్ తర్వాత కరుణ్.. జితేశ్ శర్మతో కలిసి గేర్ మార్చాడు. వీరిద్దరూ చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 97 పరుగులు పిండుకున్నారు. జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాక కరుణ్ మహోగ్రరూపం దాల్చాడు. తానెదుర్కొన్న చివరి 9 బంతుల్లో కరుణ్ 4 సిక్సర్లు, 3 బౌండరీలు బాదాడు. అంతకుముందు కరుణ్ 47వ ఓవర్లోనూ చెలరేగి ఆడాడు. ముకేశ్ చౌదరీ వేసిన ఈ ఓవర్లో కరుణ్ మూడు బౌండరీలు, ఓ సిక్సర్ కొట్టాడు. మొత్తానికి విదర్భ బ్యాటర్ల ధాటికి మహారాష్ట్ర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముకేశ్ చౌదరీ 9 ఓవర్లు వేసి ఏకంగా 80 పరుగులు సమర్పించుకుని రెండు వికెట్లు పడగొట్టాడు. సత్యజిత్ 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి వికెట్ తీసుకున్నాడు. -
సత్తా చాటిన పడిక్కల్.. ఫైనల్లో కర్ణాటక
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కర్ణాటక ఫైనల్‌కు చేరింది. నిన్న (జనవరి 15) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు హర్యానాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్ అంకిత్ కుమార్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హిమాన్షు రాణా (44), అనుజ్ థక్రాల్ (23 నాటౌట్), రాహుల్ తెవాటియా (22), సుమిత్ కుమార్ (21), దినేశ్ బనా (20), అమిత్ రాణా (15 నాటౌట్), ఆర్ష్ రంగా (10), నిషాంత్ సంధు (10) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో అభిలాష్ శెట్టి నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో రెండు, హార్దిక్ రాజ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ మూడు క్యాచ్‌లు పట్టాడు.238 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫీల్డర్‌గా రాణించిన దేవ్‌దత్ పడిక్కల్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. పడిక్కల్ 113 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 86 పరుగులు చేశాడు. పడిక్కల్‌కు జతగా స్మరణ్ రవిచంద్రన్ కూడా రాణించాడు. స్మరణ్ 94 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేశాడు. ఈ టోర్నీ ప్రారంభం నుంచి భీకర ఫామ్‌లో ఉండిన కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. అనీశ్ 22, కృష్ణణ్ శ్రీజిత్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. శ్రేయస్ గోపాల్ (23 నాటౌట్), అభినవ్ మనోహర్ (2 నాటౌట్) కర్ణాటకను విజయతీరాలకు చేర్చారు. హర్యానా బౌలర్లలో నిషాంత్ సంధు రెండు వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్, అమిత్ రాణా, పార్త్ వట్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. వరుసగా రెండో మ్యాచ్‌లో సత్తా చాటిన పడిక్కల్కర్ణాటక ఓపెనర్ దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో మ్యాచ్‌లో సత్తా చాటాడు. సెమీస్‌కు ముందు క్వార్టర్ ఫైనల్లోనూ పడిక్కల్ ఇరగదీశాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ (102) సూపర్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. ఈ ప్రదర్శనకు గానూ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. హర్యానాతో జరిగిన సెమీస్‌లోనూ పడిక్కల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మహారాష్ట్రతో విదర్భ 'ఢీ'ఇవాళ జరుగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర, విదర్భ జట్లు ఢీకొంటాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు జనవరి 18న జరిగే ఫైనల్లో కర్ణాటకతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?
విజయ్ హజారే ట్రోఫీ-2025లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు సాయంతో 664 పరుగులు చేశాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఒంటిచేత్తో తన జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఈ ప్రదర్శనల అనంతరం కరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు ఆశిస్తున్నాడు. కరుణ్ ఫామ్ చూస్తే అతన్ని తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉంది. ఇలాంటి ప్రదర్శనలు కరున్ ఇటీవలి కాలంలో చాలా చేశాడు. కరుణ్ ఫార్మాట్లకతీతంగా ఇరగదీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, రంజీ ట్రోఫీల్లో, కౌంటీ క్రికెట్లోనూ కరుణ్ అద్బుత ప్రదర్శనలు చేశాడు. ఇలాంటి ప్రదర్శనల తర్వాత కూడా భారత సెలెక్టర్లు కరుణ్‌ను పట్టించుకోకపోతే పెద్ద అపరాధమే అవుతుంది. మిడిలార్డర్లో కరుణ్ చాలా ఉపయోగకరమైన బ్యాటర్‌గా ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే కరుణ్.. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ ముగ్గురిలో ఫిల్టర్ చేయడం సెలెక్టర్లకు కత్తి మీద సామే అవుతుంది. కరుణ్ ప్రదర్శనలు చూస్తే తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉన్నాయి. రాహుల్, శ్రేయస్‌లను పక్కకు పెట్టే సాహసాన్ని టీమిండియా సెలెక్టర్లు చేయలేరు. సెలెక్టర్లు ఏం చేయనున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టును జనవరి 19వ తేదీ ప్రకటించే అవకాశం ఉంది. కరుణ్‌తో పాటు మరో ఆటగాడు కూడా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కర్ణాటక సారధి మయాంక్ అగర్వాల్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో ఇంచుమించు కరుణ్ ఉన్న ఫామ్‌లోనే ఉన్నాడు. వీహెచ్‌టీలో మయాంక్ 8 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీల సాయంతో 619 పరుగులు చేశాడు. మయాంక్ ఓపెనర్ స్థానం కోసం అంతగా ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్‌తో పోటీ పడతాడు. భారత సెలెక్టర్లు కరణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కరుణ్ విషయానికొస్తే.. వీహెచ్‌టీ-2025లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా (112*, 44*, 163*, 111*, 112*, 122*) నిలిచి ఐదు శతకాలు బాదాడు. ఈ టోర్నీలో కరుణ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 600కు పైగా పరుగులు స్కోర్ చేశాడు.లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు స్కోర్ చేసిన రికార్డును కరుణ్ తన ఖాతాలో వేసుకున్నాడు.వీహెచ్‌టీ సింగిల్ ఎడిషన్‌లో తమిళనాడుకు చెందిన ఎన్ జగదీశన్ తర్వాత ఐదు సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్ తన అరివీర భయంక ఫామ్‌తో టీమిండియాలో పాగా వేయాలని భావిస్తున్నాడు. కరుణ్ విదర్భ జట్టుకు రాక ముందు గడ్డు రోజులు ఎదుర్కొన్నాడు. అతనికి తన సొంత రాష్ట్రం తరఫున ఆడే అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డాడు. 33 ఏళ్ల కరుణ్ ఎనిమిదేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. కరుణ్.. సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కరుణ్ తన మూడో ఇన్నింగ్స్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ట్రిపుల్ సెంచరీ చేశాక కరుణ్ కేవలం నాలుగు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తాజా ప్రదర్శన తర్వాత కరుణ్ మళ్లీ ఫ్రేమ్‌లోకి వచ్చాడు. కరుణ్ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. -
సెమీస్‌లో మహారాష్ట్ర, కర్ణాటక
వడోదర: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర, కర్ణాటక జట్లు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో పంజాబ్‌పై మహారాష్ట్ర 70 పరుగుల తేడాతో విజయం సాధించగా... బరోడాపై కర్ణాటక 5 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (137 బంతుల్లో 107; 14 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... అంకిత్ బావ్నె (85 బంతుల్లో 60; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేశాడు. ఆఖర్లో వికెట్ కీపర్ నిఖిల్ (29 బంతుల్లో 52 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకం సాధించడంతో మహారాష్ట్ర మంచి స్కోరు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (5), సిద్ధేశ్ వీర్ (0), రాహుల్ త్రిపాఠి (15) విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో టీమిండియా పేసర్ అర్‡్షదీప్ సింగ్ 3, నమన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ జట్టు 44.4 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. తాజా సీజన్లో రికార్డు స్కోర్లు తిరగరాసిన పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (14), అభిõÙక్ శర్మ (19) ఎక్కువసేపు నిలవకపోవడంతో పంజాబ్‌కు మెరుగైన ఆరంభం లభించలేదు. అన్మోల్ప్రీత్ సింగ్ (77 బంతుల్లో 48; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. రమణ్‌దీప్ సింగ్ (2), నేహల్ వధేర (6), విఫలమయ్యారు. చివర్లో అర్‡్షదీప్ సింగ్ (39 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేశ్ చౌధరీ 3 వికెట్లు, ప్రదీప్ రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీతో పాటు ఒక వికెట్ తీసిన అర్షిన్ కులకరి్ణకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కర్ణాటకను గెలిపించిన పడిక్కల్ విజయ్ హజారే టోర్నీలో నాలుగుసార్లు టైటిల్ గెలిచిన కర్ణాటక జట్టు... హోరాహోరీగా సాగిన నాలుగో క్వార్టర్ ఫైనల్లో బరోడాను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. కెప్టన్ మయాంక్ అగర్వాల్ (6) విఫలం కాగా... దేవదత్ పడిక్కల్ (99 బంతుల్లో 102; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. అనీశ్ (64 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీతో మెరిశాడు. బరోడా బౌలర్లలో రాజ్ లింబానీ, అతిత్ సేత్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో తుదికంటా పోరాడిన బరోడా... చివరకు 49.5 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఓపెనర్ శాశ్వత్ రావత్ (126 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా... అతిత్ సేత్ (56; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించాడు. కెప్టెన్ కృనాల్ పాండ్యా (30) ఫర్వాలేదనిపించాడు. బరోడా విజయానికి చివరి 5 ఓవర్లలో 44 పరుగులు అవసరం కాగా... ప్రధాన ఆటగాళ్లు క్రీజులో ఉండటంతో విజయం ఖాయమనిపించింది. అయితే టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ కట్టుదిట్టమైన బంతులతో బరోడా బ్యాటర్లను కట్టడి చేశాడు. 47వ ఓవర్లో సెంచరీ హీరో శాశ్వత్ రావత్‌తో పాటు మహేశ్ పిటియా (1)ను ఔట్ చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరం కాగా... బరోడా 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, వాసుకి కౌషిక్, అభిలాశ్, శ్రేయస్ గోపాల్ తలా 2 వికెట్లు పడగొట్టారు. పడిక్కల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదివారం జరగనున్న క్వార్టర్ ఫైనల్స్‌లో గుజరాత్‌తో హర్యానా, విదర్భతో రాజస్థాన్ తలపడతాయి. -
వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన వృధా.. క్వార్టర్ ఫైనల్లో రాజస్థాన్, హర్యానా
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో రాజస్థాన్, హర్యానా జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. ఇవాళ (జనవరి 9) జరిగిన ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్స్‌లో రాజస్థాన్, హర్యానా జట్లు విజయం సాధించాయి. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 19 పరుగుల తేడాతో గెలుపొందగా.. బెంగాల్‌పై హర్యానా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన వృధాప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్-2లో రాజస్థాన్, హర్యానా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు (9-0-52-5) తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు.రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్‌తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 47.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లు తలో చేయి వేసి తమిళనాడు ఇంటికి పంపించారు. అమన్ సింగ్ షెకావత్ మూడు వికెట్లు పడగొట్టగా.. అనికేత్ చౌదరీ, అజయ్ సింగ్ తలో రెండు, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో ఎన్ జగదీశన్ (65) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బాబా ఇంద్రజిత్ (37), విజయ్ శంకర్ (49), మహ్మద్ అలీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.బెంగాల్ భరతం పట్టిన హర్యానాబెంగాల్తో జరిగిన మ్యాచ్‌లో (ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్-1) హర్యానా ఆటగాళ్లు కలిసికట్టుగా పోరాడారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో క్రమశిక్షణతో వ్యవహరించారు. ఫలితంగా సునాయాస విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో పార్థ్ వట్స్ (62), నిషాంత్ సంధు (64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ రెండు, సుయాన్ ఘోష్, ప్రదిప్త ప్రమాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగాల్ 43.1 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ సుదిప్ కుమార్ ఘరామీ (36), మజుందార్ (36), కరణ్ లాల్‌కు (28) ఓ మోస్తరు ఆరంభాలు లభించినప్పటికీ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. పార్థ్ వట్స్ 3, నిషాంత్ సంధు, అన్షుల్ కంబోజ్ చెరో 2, అమన్ కుమార్, సుమిత్ కుమార్, అమిత్ రాణా తలో వికెట్ పడగొట్టి బెంగాల్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. -
విజయ్ హజారే ట్రోఫీలో ధోని శిష్యుడి విధ్వంసం
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని శిష్యుడు, మాజీ సీఎస్కే ప్లేయర్ ఎన్ జగదీశన్ (తమిళనాడు) అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో జగదీశన్ ఒకే ఓవర్లో వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. రాజస్థాన్ పేసర్ అమన్ సింగ్ షెకావత్ బౌలింగ్‌లో జగదీశన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన షెకావత్.. తొలి బంతిని వైడ్‌గా వేశాడు. ఈ బంతిని వికెట్ కీపర్ పట్టుకోలేకపోవడంతో బౌండరీకి వెళ్లింది. దీంతో రెండో ఓవర్లో బంతి పడకుండానే తమిళనాడు ఖాతాలో ఐదు పరుగులు చేరాయి. అనంతరం షెకావత్ వేసిన ఆరు బంతులను ఆరు బౌండరీలుగా మలిచాడు జగదీశన్. ఫలితంగా రెండో ఓవర్లో తమిళనాడుకు 29 పరుగులు వచ్చాయి. జగదీశన్ షెకావత్‌కు సినిమా చూపించిన వీడియో (ఆరు బౌండరీలు) సోషల్‌మీడియాలో వైరలవుతుంది.4⃣wd,4⃣,4⃣,4⃣,4⃣,4⃣,4⃣29-run over! 😮N Jagadeesan smashed 6⃣ fours off 6⃣ balls in the second over to provide a blistering start for Tamil Nadu 🔥#VijayHazareTrophy | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/pSVoNE63b2 pic.twitter.com/JzXIAUaoJt— BCCI Domestic (@BCCIdomestic) January 9, 2025తమిళనాడు వికెట్‌కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన జగదీశన్ 2018 నుంచి 2022 వరకు ధోని అండర్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277) చేసిన రికార్డు జగదీశన్ పేరిటే ఉంది. జగదీశన్‌ను 2023 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ 90 లక్షలకు సొంతం చేసుకుంది. 2024, 2025 ఎడిషన్లలో జగదీశన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన జగదీశన్ 110.20 స్ట్రయిక్‌రేట్‌తో 162 పరుగులు మాత్రమే చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్‌తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0), ఎన్ జగదీశన్ (65; 10 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (37) ఔట్ కాగా.. విజయ్ శంకర్ (18), మొహమ్మద్ అలీ (23) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీ, అమన్ సింగ్ షెకావత్, అజయ్ సింగ్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 104 పరుగులు చేయాలి. -
వరుణ్ చక్రవర్తి మాయాజాలం.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఖాయం
మిస్టరీ స్పిన్నర్, తమిళనాడు ఆటగాడు వరుణ్ చక్రవర్తి విజయ్ హజారే ట్రోఫీ రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ మాయాజాలం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ తన ఐదు వికెట్ల ప్రదర్శనలో ఏకంగా ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ ఓ క్యాచ్ కూడా పట్టాడు. వరుణ్‌తో పాటు సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) కూడా వికెట్లు తీయడంతో రాజస్థాన్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్ అభిజీత్ తోమర్ (111) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (60) అర్ద సెంచరీతో కదం తొక్కడంతో రాజస్థాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో వీరిద్దరితో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అభిజీత్ తోమార్ 125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో బాధ్యతాయుతమైన సెంచరీ చేయగా.. లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకం బాదాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో సచిన్ యాదవ్ 4, దీపక్ హూడా 7, అజయ్ సింగ్ 2, మానవ్ సుతార్ 1, అనికేత్ చౌదరీ 2, ఖలీల్ అహ్మద్ 1, అమన్ షెకావత్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.Varun Chakravarthy with a peach of a delivery. 🤯🔥 pic.twitter.com/kL0BfOHH5m— Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2025అనంతరం 268 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0) ఔట్ కాగా.. నారాయణ్ జగదీశన్ (37 బంతుల్లో 52; 9 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (13) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీకి తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 183 పరుగులు చేయాలి.ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఖాయంఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటించడానికి ముందు వరుణ్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ ప్రదర్శన అనంతరం వరుణ్ టీమిండియాకు ఎంపిక కావడం ఖాయమని తెలుస్తుంది. భారత జట్టులో చోటు విషయంలో వరుణ్‌కు రవి భిష్ణోయ్ నుంచి పోటీ ఉండింది. అయితే తాజా ప్రదర్శన నేపథ్యంలో సెలెక్టర్లు ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వరుణ్ ఇటీవల టీమిండియా తరఫున టీ20ల్లోనూ అదరగొట్టాడు. గతేడాది నవంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుణ్ 12 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో వరుణ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది.ఇదిలా ఉంటే, ఇవాళే జరుగుతున్న మరో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో (మొదటిది) హర్యానా, బెంగాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో పార్థ్ వట్స్ (62), నిషాంత్ సంధు (64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ రెండు, సుయాన్ ఘోష్, ప్రదిప్త ప్రమాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
విజయ్ హజారే టోర్నీ బరిలో ప్రసిధ్ కృష్ణ, పడిక్కల్, సుందర్
బెంగళూరు: ‘అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుంటే ప్రతి ఒక్కరూ దేశవాళీల్లో ఆడాల్సిందే’ అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్న మాటలను భారత ఆటగాళ్లు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరాజయం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లలో పలువురు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నారు. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరుగనున్న ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌తో తమిళనాడు, హరియాణాతో బెంగాల్ తలపడనున్నాయి. వీటితో పాటు ఇక మీద జరగనున్న మ్యాచ్‌ల్లో పలువురు భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన ప్రసిధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, సుందర్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆడిన కేఎల్ రాహుల్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే ఆ తర్వాత ఈ నెలాఖరున తిరిగి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌ల్లో రాహుల్ పాల్గొనే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆటగాళ్లు రేపటి నుంచి వారివారి రాష్ట్రాల జట్లతో కలవనున్నారు. తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరితే స్పిన్ ఆల్‌రౌండర్ సుందర్ బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌లాడిన సుందర్ 114 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సిడ్నీ వేదికగా కంగారూలతో జరిగిన చివరి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన ప్రసిధ్ కృష్ణ కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.రంజీ ట్రోఫీలో నితీశ్ రెడ్డి...‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో అద్వితీయ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి... రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఆడనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోవడంతో అతడికి వన్డే టోర్నీలో ఆడే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశలో పోటీల్లో ఆంధ్ర జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. వాటిలో నితీశ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ప్రతికూల పరిస్థితుల మధ్య చక్కటి సెంచరీతో సత్తా చాటిన నితీశ్ రెడ్డి... ఈ నెల 23 నుంచి పుదుచ్చేరితో, 30 నుంచి రాజస్తాన్‌తో ఆంధ్ర జట్టు ఆడే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆంధ్ర జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. -
తనయ్, అనికేత్ మాయాజాలం
అహ్మదాబాద్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌ను హైదరాబాద్ జట్టు విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో అరుణాచల్ ప్రదేశ్ జట్టును ఓడించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 28.3 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ఎడంచేతి వాటం స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్ 32 పరుగులిచ్చి 5 వికెట్లు... గంగం అనికేత్ రెడ్డి 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి అరుణాచల్ ప్రదేశ్‌ను దెబ్బ కొట్టారు. మరో వికెట్ పేసర్ చామా మిలింద్కు లభించింది. అరుణాచల్ జట్టుతో సిద్ధార్త్ బలోడి (29; 5 ఫోర్లు), ధ్రువ్ సోని (20; 3 ఫోర్లు), బిక్కీ కుమార్ (15; 3 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసి గెలిచింది. తన్మయ్ అగర్వాల్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), కనాలా నితేశ్ రెడ్డి (16 బంతుల్లో 15; 2 ఫోర్లు) అవుటయ్యారు. పట్కూరి నితేశ్ రెడ్డి (31 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), హిమతేజ (12 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచారు. తనయ్ త్యాగరాజన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగో స్థానంతో సరి ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘సి’లో హైదరాబాద్ జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. నాగాలాండ్, పుదుచ్చేరి, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్ జట్లపై నెగ్గిన హైదరాబాద్... ముంబై, సౌరాష్ట్ర, పంజాబ్ జట్ల చేతుల్లో ఓడిపోయింది.ఓవరాల్‌గా ఈ టోర్నీలో హైదరాబాద్ తరఫున బ్యాటింగ్ విభాగంలో అరవెల్లి అవనీశ్ రావు (7 మ్యాచ్‌ల్లో 241 పరుగులు; 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీలు), తన్మయ్ అగర్వాల్ (7 మ్యాచ్‌ల్లో 227 పరుగులు; 2 అర్ధ సెంచరీలు), వరుణ్ గౌడ్ (7 మ్యాచ్‌ల్లో 203 పరుగులు; 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ) ఆకట్టుకున్నారు. బౌలింగ్ విషయానికొస్తే చామా మిలింద్ 7 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు... తనయ్ త్యాగరాజన్ 7 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు పడగొట్టారు. అనికేత్ రెడ్డి, శరణు నిశాంత్, ముదస్సిర్ 7 వికెట్ల చొప్పున తీశారు. -
అరివీర భయంకర ఫామ్‌లో మయాంక్ అగర్వాల్.. ఐదింట నాలుగు శతకాలు
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా ఆటగాడు, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో మయాంక్ గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాదాడు. ఇందులో హ్యాట్రిక్ సెంచరీలు సహా ఓ హాఫ్ సెంచరీ ఉంది.పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్.. ఆతర్వాత అరుణాచల్ ప్రదేశ్‌పై 100 నాటౌట్‌గా నిలిచాడు. దీని తర్వాత హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగులు చేసిన మయాంక్ హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. అనంతరం సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీ (69) చేసిన మయాంక్.. తాజాగా నాగాలాండ్‌పై 116 నాటౌట్‌గా నిలిచాడు.విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత ఎడిషన్‌లో మయాంక్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 613 పరుగులు చేశాడు. వీహెచ్‌టీ 2024-25లో మయాంక్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో మయాంక్ 153.25 సగటున 111.66 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఇందులో 66 బౌండరీలు, 18 సిక్సర్లు ఉన్నాయి.నాగాలాండ్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక నాగాలాండ్‌ను 48.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్ చేసింది. శ్రేయస్ గోపాల్ 4, అభిలాశ్ షెట్టి 2, కౌశిక్, హార్దిక్ రాజ్, విద్యాధర్ పాటిల్, నికిన్ జోస్ తలో వికెట్ తీసి నాగాలాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో చేతన్ బిస్త్ (77 నాటౌట్), కెప్టెన్ జోనాథన్ (51) అర్ద సెంచరీలు సాధించారు. వీరిద్దరు మినహా నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవు.207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 37.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మయాంక్ సూపర్ సెంచరీతో అలరించగా.. అనీశ్ కేవీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. కర్ణాటక ఇన్నింగ్స్‌లో నికిన్ జోస్ 13 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. నికిన్ జోస్ వికెట్ లెమ్టూర్కు దక్కింది. ఈ గెలుపుతో కర్ణాటక గ్రూప్-సిలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో కర్ణాటక ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించింది. -
మొహమ్మద్ షమీ విధ్వంసం.. సెలెక్టర్లకు సవాల్
విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బౌలర్, బెంగాల్ ఆటగాడు మొహమ్మద్ షమీ చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షమీ.. 34 బంతుల్లో 5 బౌండరీలు, సిక్సర్ సాయంతో అజేయమైన 42 పరుగులు చేశాడు. షమీ బ్యాట్ ఝులిపించడంతో ఈ మ్యాచ్‌లో బెంగాల్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.సెలెక్టర్లకు సవాల్..తాజాగా ఇన్నింగ్స్‌తో షమీ భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. గాయం కారణంగా చాలాకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. ఇప్పుడిప్పుడే దేశవాలీ క్రికెట్ ఆడుతున్నాడు. షమీ ఫిట్‌గా ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు అతన్ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోలేదు. త్వరలో భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఆతర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లు తప్పించినా.. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలో భాగం కావాలని షమీ భావిస్తున్నాడు. తాజా ఇన్నింగ్స్ షమీని టీమిండియా తలుపులు తట్టేలా చేస్తాయేమో వేచి చూడాలి.పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న కెప్టెన్ఈ మ్యాచ్‌లో బెంగాల్ కెప్టెన్ సుదీప్ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఘరామీ 125 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బెంగాల్ ఇన్నింగ్స్‌లో ఘరామీతో పాటు సుదీప్ ఛటర్జీ (47), షమీ (42 నాటౌట్), కౌశిక్ మైతి (20 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. షమీ-మైతీ జోడి ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 64 పరుగులు జోడించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్యన్ పాండే, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్ జైన్, సాగర్ సోలంకీ చెరో వికెట్ దక్కించుకున్నారు.270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 23 ఓవర్ల అనంతరం 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మధ్య ప్రదేశ్ ఓపెనర్లు హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి డకౌట్లయ్యారు. శుభమ్ శ్యామ్ సుందర్ శర్మ (53), కెప్టెన్ రజత్ పాటిదార్ (49) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 27 ఓవర్లలో 162 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. -
శశికాంత్ మెరిపించినా...
ముంబై: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆంధ్ర జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 5 వికెట్ల తేడాతో మహారాష్ట్ర చేతిలో ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శశికాంత్ (25 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ షాట్లతో అజేయ అర్ధశతకం సాధించాడు. అశ్విన్ హెబర్ (85 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (75 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్), రికీ భుయ్ (47 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్), వినయ్ కుమార్ (40 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రీకర్ భరత్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో ఆంధ్ర జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఆఖర్లో శశికాంత్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో పోరాడే స్కోరు చేయగలిగింది. మహారాష్ట్ర బౌలర్లలో రజనీశ్ గుర్బానీ 3, ముకేశ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మహారాష్ట్ర 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిద్ధేశ్ వీర్ (124 బంతుల్లో 115 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా... రాహుల్ త్రిపాఠి (78 బంతుల్లో 69; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. ఆంధ్ర బౌలర్లలో సందీప్ 2 వికెట్లు తీశాడు. గ్రూప్‌లో 6 మ్యాచ్‌లాడిన ఆంధ్ర 4 విజయాలు, 2 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో ఉంది. -
చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్.. ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్, విదర్భ జట్టు సారధి కరుణ్ నాయర్ (Karun Nair) విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో ఇవాళ (జనవరి 3) జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ చేసిన కరుణ్ (101 బంతుల్లో 112; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) లిస్ట్-ఏ (50 ఓవర్ల ఫార్మాట్) క్రికెట్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. కరుణ్ లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా 541 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ పేరిట ఉండేది. ఫ్రాంక్లిన్ లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా 527 పరుగులు చేశాడు. కరుణ్, ఫ్రాంక్లిన్ తర్వాత ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వాన్ హీర్డెన్ (512) ఉన్నాడు.ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు..యూపీతో మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన కరుణ్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు చేశాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అజేయ సెంచరీ (112) చేసిన కరుణ్.. ఆతర్వాత చత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఆతర్వాత కరుణ్ వరుసగా చంఢీఘడ్ (163 నాటౌట్), తమిళనాడు (111 నాటౌట్), ఉత్తర్‌ప్రదేశ్‌లపై (112) హ్యాట్రిక్ సెంచరీలు చేశాడు. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కరుణ్ 5 ఇన్నింగ్స్‌ల్లో 542 సగటున 542 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కరుణ్ 115.07 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.కరుణ్ సూపర్ సెంచరీతో మెరవడంతో యూపీపై విదర్భ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో విదర్భకు ఇది వరుసగా ఐదో విజయం. విదర్భతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. సమీర్ రిజ్వి (82 బంతుల్లో 105; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు శతకం బాదాడు. కెప్టెన్ రింకూ సింగ్ (6) విఫలమయ్యాడు. విదర్భ బౌలర్లలో నచికేత్ భూటే నాలుగు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బరిలోకి దిగిన విదర్భ 47.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరుణ్ నాయర్‌తో పాటు యశ్ రాథోడ్ సెంచరీ చేశాడు. యశ్ 140 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్ సాయంతో 138 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యూపీ బౌలర్లలో రింకూ సింగ్, బిహారీ రాయ్ తలో వికెట్ పడగొట్టారు. -
అన్ని ఫార్మాట్లలో ఆడటమే లక్ష్యం
భారత టి20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్‌ను ఒప్పించి దక్షిణాఫ్రికా గడ్డపై మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టి భారత టి20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న తిలక్ వర్మ... మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన భవిష్యత్ లక్ష్యమని అంటున్నాడు. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా దేశవాళీల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయిన తిలక్ వర్మ... అవకాశం వస్తే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా... బౌలింగ్‌పై కూడా దృష్టి సారించడంతో జట్టులో సమతుల్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ... కర్ణాటకపై రికార్డు ఛేదన తర్వాత తన భవిష్యత్తు లక్ష్యాలను వివరించాడు. తిలక్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... » విజయ్ హజారే టోర్నీలో భాగంగా కర్ణాటకతో మ్యాచ్‌లో 99 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్న అనే విషయాన్ని పట్టించుకోలేదు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ ఓవర్లో భారీ షాట్లు ఆడాలని అనుకున్నా... అది కాస్త ఫలించలేదు. ఒక ఆటగాడు 45వ ఓవర్ వరకు క్రీజులో నిలిస్తే 380–400 స్కోరు కూడా ఛేదించగలమని జట్టు సమావేశాల్లో ఎన్నోసార్లు చెప్పాను. జట్టును గెలిపించేంత వరకు క్రీజులో ఉండాలనుకున్నా కానీ దురదృష్టవశాత్తు అది సాధ్యపడలేదు. » కీలక సమయంలో రాణించి జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. అంతిమంగా జట్టు విజయం సాధించడమే ముఖ్యం. నా ఇన్నింగ్స్‌తో అది సాధ్యమైనందుకు ఆనందం రెండింతలైంది. » దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో చర్చించా. నాలుగో స్థానంలో సూర్యకు మెరుగైన రికార్డు ఉందనే విషయం గుర్తుచేశా. ఆ ప్లేస్‌లో అతడు గతంలో సెంచరీలు సాధించాడు. నాకు మూడో స్థానంలో అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను అని చెప్పా. దానికి సూర్యకుమార్ ఒప్పుకోవడంతో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ దక్కింది. » వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బలంగా భావించా. అందుకు తగ్గట్లే దక్షిణాఫ్రికాపై వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించా. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఎంతో బాగుంటుంది. » అండర్–19 స్థాయికి ముందు వరకు నేను ఓపెనర్‌గానే బరిలోకి దిగే వాడిని. స్వింగ్ అవుతున్న బంతులను ఆడేందుకు ఇష్టపడతా. పరిస్థితులు సవాలు విసురుతున్నప్పుడు నాలోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. ముందుగా క్రీజులో అడుగు పెడితే... అదనపు సమయం లభించడంతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. » భారత్ ‘ఎ’తరఫున, దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేశా. అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా రంజీ ట్రోఫీలో నిరూపించుకునేందుకు తగినన్ని అవకాశాలు లభించలేదు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ కోసం సిద్ధంగా ఉన్నా. నా వరకు శక్తివంచన లేకుండా ప్రయతి్నస్తున్నా. » మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలని అనుకుంటున్నా. జట్టుకు వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించి పెట్టడమే నా లక్ష్యం. గతేడాది ఐపీఎల్ నుంచే బౌలింగ్‌పై మరింత దృష్టి సారించా. ఎర్ర బంతితో ఎక్కువ బౌలింగ్ సాధన చేస్తున్నా. దాని వల్ల టి20, వన్డే క్రికెట్లో ఆఫ్ స్పిన్నర్‌గా మరింత ప్రభావం చూపగలనని నమ్ముతున్నా. » జట్టును సమతుల్యంగా ఉంచేందుకు నా వంతు కృషి చేస్తా. అందుకోసం బౌలింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నా. బౌలింగ్ చేయగల బ్యాటర్ ఉంటే మేనేజ్మెంట్కు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. రానున్న మ్యాచ్‌ల్లో మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది అనుకుంటున్నా. పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరును మార్చుకోవడం ముఖ్యం. అందుకు నేను సిద్ధం. -
కరుణ్ నాయర్ 430 నాటౌట్
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో విదర్భ కెప్టెన్, టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్ (టెస్ట్‌ల్లో) కరుణ్ నాయర్ (Karun Nair) అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో కరుణ్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు సెంచరీల సాయంతో 430 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కరుణ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఔట్ కాకపోవడం విశేషం. ప్రస్తుతం కరుణ్ విజయ్ హజారే ట్రోఫీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే ఈ టోర్నీలో అత్యధిక బౌండరీలు (56) బాదిన ఘనత కూడా కరుణ్‌కే దక్కుతుంది. కరుణ్ ఈ సీజన్లో విదర్భను ప్రతి మ్యాచ్‌లో (4) గెలిపించాడు. విదర్భ ఈ సీజన్లో ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచి గ్రూప్-డి టాపర్‌గా కొనసాగుతుంది.ఈ సీజన్లో కరుణ్ నాయర్ స్కోర్లు.. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో కరుణ్ 108 బంతుల్లో 17 బౌండరీల సాయంతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విదర్భను విజయతీరాలకు చేర్చిన కరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.చత్తీస్‌ఘడ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కరుణ్ 52 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విదర్భ 8 వికెట్ల తేడాతో చత్తీస్‌ఘడ్‌ను చిత్తు చేసింది.చండీఘడ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో కరుణ్ 107 బంతుల్లో 20 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 163 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విదర్భను విజయతీరలకు చేర్చిన కరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.ఇవాళ (డిసెంబర్ 31) తమిళనాడుతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో కరుణ్ మరోసారి శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 103 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 111 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ సీజన్లో కరుణ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు కూడా గెలుచుకున్నాడు.తమిళనాడు-విదర్భ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు.. దర్శన్ నల్కండే (6/55) విజృంభించడంతో 48.4 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే 2, యశ్ ఠాకూర్, భూటే తలో వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో తుషార్ రహేజా (75) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మొహమ్మద్ అలీ (48), ఆండ్రే సిద్దార్థ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన విదర్భ.. కరుణ్ శతక్కొట్టడంతో 43.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విదర్భ ఇన్నింగ్స్‌లో దృవ్ షోరే 31, యశ్ రాథోడ్ 14, యశ్ కడెం 31, జితేశ్ శర్మ 23, శుభమ్ దూబే 39 (నాటౌట్) పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో సాయికిషోర్ 2, వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ తలో వికెట్ పడగొట్టారు. -
99 పరుగుల వద్ద ఔటైన తిలక్ వర్మ
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో తిలక్ 99 పరుగుల (106 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్) వద్ద ఔటయ్యాడు. కర్ణాటక నిర్దేశించిన 321 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తిలక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ ఔటైనా వరుణ్ గౌడ్ సూపర్ సెంచరీతో (109 నాటౌట్) హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. తిలక్ ఔటయ్యాక హైదరాబాద్ గెలుపుపై ఆశలు వదులుకుంది. ఈ దశలో వరుణ్ గౌడ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. వరుణ్ 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. వరుణ్ చెలరేగడంతో హైదరాబాద్ మరో రెండు బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో నికిన్ జోస్ 37, కేవీ అనీశ్ 11, స్మరణ్ రవిచంద్రన్ 83, అభినవ్ మనోహర్ 1, కృష్ణణ్ శ్రీజిత్ 5, ప్రవీణ్ దూబే 24, విద్యాధర్ పాటిల్ 1, శ్రేయస్ గోపాల్ 19 (నాటౌట్), అభిలాశ్ షెట్టి 4 (నాటౌట్) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి 2, ముదస్సిర్, రోహిత్ రాయుడు తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ తిలక్ వర్మ పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. వరుణ్ గౌడ్ అద్భుతమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో తన్మయ్ అగర్వాల్ 35, రోహిత్ రాయుడు 0, హిమతేజ 15, నితేశ్ రెడ్డి 0, అరవెల్లి అవనీశ్ 17, తనయ్ త్యాగరాజన్ 25, చామ మిలింద్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే, నికిన్ జోస్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. అభిలాశ్ శెట్టి, విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.మయాంక్ హ్యాట్రిక్ సెంచరీస్ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు. డిసెంబర్ 26న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్.. డిసెంబర్ 28న అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ మరో సెంచరీ చేసి హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. -
శార్దూల్ ఠాకూర్ ఊచకోత.. 28 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో..!
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) విశ్వరూపం ప్రదర్శించాడు. నాగాలాండ్‌తో ఇవాళ (డిసెంబర్ 31) జరుగుతున్న మ్యాచ్‌లో శార్దూల్ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. 28 బంతుల్లో రెండు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.సిక్సర్ల సునామీ సృష్టించిన శార్దూల్ 260.71 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. శార్దూల్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై అతి భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 403 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది.ఆయుశ్ మాత్రే రికార్డు శతకంఈ మ్యాచ్‌లో ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్.భారీ భాగస్వామ్యంఈ మ్యాచ్‌లో మాత్రే.. అంగ్‌క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్‌కు 156 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం మాత్రే.. సిద్దేశ్ లాడ్‌తో కలిసి మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. డబుల్ సెంచరీకి చేరువైన మాత్రే మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.మాత్రే, శార్దూల్ మినహా చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవుముంబై ఇన్నింగ్స్‌లో మాత్రే, శార్దూల్ ఠాకూర్ మినహా చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవు. బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన నాగాలాండ్404 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఏదో అద్భుతం జరిగేతే తప్ప ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ గెలవలేదు. 36.4 ఓవర్ల అనంతరం నాగాలాండ్ స్కోర్ 115/6గా ఉంది. జగదీష సుచిత (46), లెమ్టూర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ రుపేరో (53) అర్ద సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో నాగలాండ్ గెలవాలంటే 80 బంతుల్లో 289 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.బంతితోనూ రాణించిన శార్దూల్బ్యాట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్ ఈ మ్యాచ్‌లో బంతితోనూ రాణించాడు. బౌలింగ్ అటాక్‌ను మొదలుపెట్టిన శార్దూల్ నాలుగు ఓవర్లలో 12 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఓవర్ ఉంది.స్టార్లకు విశ్రాంతిఈ మ్యాచ్‌లో ముంబై యాజమాన్యం స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
చరిత్ర సృష్టించిన ముంబై యువ సంచలనం.. యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు బద్దలు
ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ భారీ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో 150 ప్లస్ చేసిన ఆటగాళ్లుఆయుశ్ మాత్రే 17 ఏళ్ల 168 రోజులుయశస్వి జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజులురాబిన్ ఉతప్ప 19 ఏళ్ల 63 రోజులుటామ్ ప్రెస్ట్ 19 ఏళ్ల 136 రోజులుమాత్రే ఇన్నింగ్స్ విషయానికొస్తే.. నాగాలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్‌లో మాత్రే.. అంగ్‌క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్ (28 బంతుల్లో 73 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడటంతో ముంబై భారీ స్కోర్ చేసింది. శార్దూల్ సిక్సర్ల సునామీ ధాటికి ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 403 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 42 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. బ్యాట్‌తో మెరిసిన శార్దూల్ ఠాకూర్ (4-1-12-2) బంతితోనూ సత్తా చాటాడు. రాయ్స్టన్ డయాస్ రెండు, సుయాన్ష్ షేడ్గే ఓ వికెట్ దక్కించుకున్నారు. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో డేగా నిశ్చల్ (5), హేమ్ చెత్రి (2), యుగంధర్ సింగ్ (0), కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ (0), చేతన్ బిస్త్ (0) ఔట్ కాగా.. రుపేరో (22), జే సుచిత్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ గెలవాలంటే 36 ఓవర్లలో 362 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు, టీమిండియా స్టార్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ముంబై మేనేజ్మెంట్ పై ముగ్గురికి విశ్రాంతినిచ్చింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
వరుసగా మూడో సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్
విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2024-25లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో మయాంక్ హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు. డిసెంబర్ 26న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్.. డిసెంబర్ 28న అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ 112 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేసి హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మయాంక్ సూపర్ సెంచరీతో విరుచుకుపడటంతో కర్ణాటక భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.ఓపెనర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ నికిన్ జోస్ 37, వన్‌డౌన్‌లో వచ్చిన కేవీ అనీశ్ 11, ఆతర్వాత వచ్చి న స్మరణ్ రవిచంద్రన్ 83, అభినవ్ మనోహర్ 1, కృష్ణణ్ శ్రీజిత్ 5, ప్రవీణ్ దూబే 24, విద్యాధర్ పాటిల్ 1, శ్రేయస్ గోపాల్ 19 (నాటౌట్), అభిలాశ్ షెట్టి 4 (నాటౌట్) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి 2, ముదస్సిర్, రోహిత్ రాయుడు తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్ రాయుడు డకౌటయ్యాడు. అభిలాశ్ షెట్టి రోహిత్ రాయుడును క్లీన్ బౌల్డ్ చేశాడు. తన్మయ్ అగర్వాల్ (30), కెప్టెన్ తిలక్ వర్మ (25) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలవాలంటే 37 ఓవర్లలో మరో 263 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.గ్రూప్ టాపర్‌గా కర్ణాటకవిజయ్ హజారే ట్రోఫీ పాయింట్ల పట్టికలో కర్ణాటక గ్రూప్ టాపర్‌గా నిలిచింది. గ్రూప్-సిలో కర్ణాటక ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. గ్రూప్-సిలో పంజాబ్, సౌరాష్ట్ర, ముంబై వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో ఉండగా.. హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. గ్రూప్-ఏలో గుజరాత్.. గ్రూప్-బి నుంచి మహారాష్ట్ర, గ్రూప్-డి నుంచి విదర్భ, గ్రూప్-ఈ నుంచి మధ్యప్రదేశ్ టాపర్లుగా ఉన్నాయి. -
మిలింద్ మ్యాజిక్
అహ్మదాబాద్: లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ (5/13) నిప్పులు చెరగడంతో... విజయ్ హజారే టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో పుదుచ్చేరిని మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి 31.5 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటైంది. పారస్ (57 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్ స్కోరర్... కాగా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. మొత్తం జట్టులో ముగ్గురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. హైదరాబాద్ బౌలర్లలో మిలింద్ 9.5 ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లు తీయగా... మొహమ్మద్ ముదస్సిర్, నిశాంత్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యం చిన్నదే అయినా హైదరాబాద్ జట్టు తడబడింది. చివరకు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. హిమతేజ (61 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మిలింద్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం కర్ణాటకతో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. భరత్, హెబర్ మెరుపులుబౌలర్ల క్రమశిక్షణకు ఓపెనర్ల దూకుడు తోడవడంతో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు మూడో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 10 వికెట్ల తేడాతో సర్వీసెస్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్ 36.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ శర్మ (39; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... అన్షుల్ గుప్తా (23), వినీత్ (23), అరుణ్ (22) తలా కొన్ని పరుగులు చేశారు. ఆంధ్ర బౌలర్లలో పిన్నింటి తపస్వి 4 వికెట్లు పడగొట్టగా... పృథ్వి రాజ్, శశికాంత్ చెరో రెండు వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 28.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 163 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రీకర్ భరత్ (90 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అశ్విన్ హెబర్ (66 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధశతకాలతో రాణించారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 3 విజయాలు, ఒక ‘డ్రా’తో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. తపస్వికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం మేఘాలయతో ఆంధ్ర జట్టు తలపడనుంది. -
పంజాబ్ ఓపెనర్ విధ్వంసం.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో
విజయ్ హజారే ట్రోఫీ-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై జట్టుకు పంజాబ్ ఊహించని షాకిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 48.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే వంటి కీలక వికెట్లను అర్షదీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై బ్యాటర్లలో అంకోలేకర్(66) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యన్ష్ షెగ్దే(44), శార్ధూల్ ఠాకూర్(43) రాణించారు.ప్రభసిమ్రాన్ ఊచకోత..అనంతరం 249 పరుగుల లక్ష్య చేధనలో ప్రభసిమ్రాన్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ప్రభసిమ్రాన్ ఊచకోత కోశాడు. కేవలం 101 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు అభిషేక్ శర్మ(66) హాఫ్ సెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, అయూష్ మాత్రే తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఐపీఎల్-2025కు ముందు ప్రభసిమ్రాన్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంది.చదవండి: 'భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి'.. రోహిత్‌పై ఎమ్ఎస్కే ఫైర్ -
సచిన్ తనయుడికి భారీ షాక్.. జట్టు నుంచి తీసేశారు!
భారత క్రికెట్ దిగ్గజం తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు గోవా క్రికెట్ అసోసియేషన్ ఊహించని షాకిచ్చింది. విజయ్ హజారే ట్రోఫీ 2024-25 మధ్యలోనే గోవా జట్టు నుంచి అర్జున్ టెండూల్కర్‌ను జీసీఎ తప్పించింది. దీంతో అతడు శనివారం ఉత్తరఖాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమమయ్యాడు.25 ఏళ్ల అర్జున్ గోవా రెడ్ బాల్ జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నప్పటికి వైట్ బాట్ స్వ్కాడ్‌లో మాత్రం తన స్ధానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. కాగా అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో కూడా కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతడిపై జీసీఎ వేటు వేసింది.మళ్లీ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో సరిగ్గా మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాతే సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఒడిశాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్జున్ 3 వికెట్లు పడగొట్టినప్పటికి.. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు.ఆతర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చెరో వికెట్ సాధించినప్పటకి ఆరుకు పైగా ఏకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతడిపై గోవా క్రికెట్ ఆసోసియేషన్ వేటు వేసింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్లో అర్జున్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.మరోసారి ముంబైతో..కాగా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో మరోసారి ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 20 లక్షల కనీస ధరకు అర్జున్ను ముంబై సొంతం చేసుకుంది. ఈ మెగా వేలంలో అర్జున్ను తొలుత ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు.కానీ ఆఖరికి యాక్సిలరేటెడ్ రౌండ్లో ముంబై దక్కించుకుంది. జూనియర్ టెండూల్కర్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు. అతడు 5 మ్యాచ్‌లలో 9.37 ఎకానమీ రేటుతో 3 వికెట్లు పడగొట్టాడు. అర్జున్ కనీసం ఈసారైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి.చదవండి: IND Vs AUS: స్టుపిడ్.. స్టుపిడ్! భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు: పంత్‌పై సన్నీ ఫైర్ -
నిప్పులు చెరిగిన అర్షదీప్.. బెంబేలెత్తిపోయిన శ్రేయస్, సూర్యకుమార్, దూబే
విజయ్ హజారే వన్డే ట్రోఫీలో టీమిండియా టీ20 స్పెషలిస్ట్, పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ రెచ్చిపోయాడు. ముంబైతో ఇవాళ (డిసెంబర్ 28) జరుగుతున్న మ్యాచ్‌లో అర్షదీప్ నిప్పులు చెరిగాడు. ఫలితంగా ముంబై టాపార్డర్ కకావికలమైంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అర్షదీప్ ధాటికి ముంబై 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అర్షదీప్ ముంబై టాపార్డర్ మొత్తాన్ని నేలకూల్చాడు. టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే సహా దేశవాలీ సంచలనాలు రఘువంశీ, ఆయుశ్ మాత్రే వికెట్లు పడగొట్టాడు. 23.5 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 119/7గా ఉంది. అథర్వ అంకోలేకర్ (17), శార్దూల్ ఠాకూర్ (5) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 5, సన్వీర్ సింగ్, రఘు శర్మ తలో వికెట్ పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో రఘువంశీ 1, ఆయుశ్ మాత్రే 7, హార్దిక్ తామోర్ 0, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 17, సూర్యకుమార్ యాదవ్ 0, శివమ్ దూబే 17, సూర్యాంశ్ షేడ్గే 44 పరుగులు చేసి ఔటయ్యారు. -
ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీ.. 16 ఫోర్లు, 6 సిక్సర్లతో
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశీవాళీ క్రికెట్లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన కిషన్.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో జార్ఖండ్‌కు సారథ్యం వహిస్తున్న కిషన్.. సోమవారం మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.255 పరుగుల లక్ష్య చేధనలో కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ది బౌలర్లను ఈ జార్ఖండ్ డైనమెట్ ఊచకోత కోశాడు. కేవలం 78 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా జార్ఖండ్ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్ల మాత్రమే కోల్పోయి 28.3 ఓవర్లలో చేధించింది. కిషన్‌తో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(68) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. మణిపూర్ బ్యాటర్లలో ప్రియోజిత్ సింగ్(43), జాన్సెన్ సింగ్(69) పరుగులతో రాణించారు. జార్ఖండ్ బౌలర్లలో అనుకుల్ రాయ్, ఉత్కర్ష్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వికాస్ సింగ్,సుప్రీయో చక్రవర్తి తలా వికెట్ సాధించారు.కాగా ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు బీసీసీఐ అతడిపై వేటు వేసింది. ఇప్పుడు దేశీవాళీ క్రికెట్లో రాణిస్తూ రీఎంట్రీ దిశగా ఇషాన్ అడుగులు వేస్తున్నాడు. -
నాగాలాండ్‌పై హైదరాబాద్ ఘనవిజయం
అహ్మదాబాద్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం జరిగిన తమ తొలి పోరులో హైదరాబాద్ 42 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 48.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవనీశ్ (82 బంతుల్లో 100; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఆకట్టుకోగా... ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), వరుణ్ గౌడ్ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ (0) విఫలమయ్యాడు. నాగాలాండ్ బౌలర్లలో ఇమ్లీవతి లెమ్టర్ 4, జొనాథన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నాగాలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. యుగంధర్ సింగ్ (80; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జగదీశ సుచిత్ (66; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడినా లాభం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో నిశాంత్, ముదస్సిర్ రెండేసి వికెట్లు తీశారు. అవనీశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో సోమవారం ముంబైతో హైదరాబాద్ తలపడనుంది. -
అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన కర్ణాటక
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కర్ణాటక జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కర్ణాటక ఘన విజయం సాధించింది. 383 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 46.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. కర్ణాటక బ్యాటర్లలో కృష్ణన్ శ్రీజిత్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.లక్ష్య చేధనలో శ్రీజిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 101 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అనీష్ కేవీ(82), ప్రవీణ్ దూబే(65) హాఫ్ సెంచరీతో రాణించారు. ముంబై బౌలర్లలో జునేద్ ఖాన్ రెండు వికెట్లతో సత్తాచాటాడు.అయ్యర్ సెంచరీ వృథా..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 4 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(114) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు అయాష్ మాత్రే(78), హార్దిక్ తమోర్(84), శివమ్ దూబే(63) హాఫ్ సెంచరీలతో రాణించారు.కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే రెండు, విధ్యాదర్ పటేల్, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు. ముంబై ఓటమి పాలవ్వడంతో శ్రేయస్ అయ్యర్ సెంచరీ వృథా అయిపోయింది. కర్ణాటక రికార్డు..కాగా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ చేసిన రెండో జట్టుగా కర్ణాటక నిలిచింది. ఈ జాబితాలో ఆంధ్ర జట్టు తొలి స్ధానంలో ఉంది. 2011/12 సీజన్లో గోవాపై 384 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర ఛేజ్ చేసింది.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
'ఛాంపియన్స్ ట్రోఫీ.. అతడికి భారత జట్టులో నో ఛాన్స్'
విజయ్ హజారే వన్డే ట్రోఫీ 2024-25 కోసం ఎంపిక చేసిన కేరళ జట్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ కోసం కేరళ క్రికెట్ ఆసోషియేషన్ నిర్వహించిన శిక్షణా శిబిరానికి గైర్హాజరైనందున అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతడి స్ధానంలో తమ జట్టు పగ్గాలను సల్మాన్ నజీర్‌కు కేసీఎ అప్పగించింది. ఈ నేపథ్యంలో శాంసన్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ దేశవాళీ టోర్నీలో సంజూ భాగం కాకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి కోసం వెళ్లే భారత జట్టులో ఛాన్స్ దక్కపోవచ్చు అని సంజూ అభిప్రాయపడ్డాడు."విజయ్ హజారే ట్రోఫీలో పాల్గోనే కేరళ జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకు ఆర్ధం కావడం లేదు. వాయనాడ్‌లో నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంపులో సంజూ పాల్గోలేదని, అందుకే కెసీఎ సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదని కొంత మంది చెబుతున్నారు.కాలి గాయం కారణంగా శిక్షణా శిబిరానికి ఎంపిక కాలేనని సంజూ కెసీఎకు ముందే తెలియజేసినట్లు మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కారణం ఏదమైనప్పటకి విజయ్ హజారే ట్రోఫీలో సంజూ భాగం కాలేకపోయాడు.ఈ టోర్నీని సంజూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సింది. ఎందుకంటే టీ20ల్లో అతడు అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అటువంటిప్పుడు వన్డే క్రికెట్‌ను కూడా శాంసన్ దృష్టిలో పెట్టుకోవాలి. రిషబ్ పంత్ ఇంకా వన్డేల్లో పూర్తి స్ధాయిలో తన మార్క్‌ను చూపించలేకపోయాడు.మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగనుంది. ఈ టోర్నీ కోసమైన విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడాల్సింది. బహుశా శాంసన్‌ను ఛాంపియన్స్ కోసం భారత సెలక్టర్లు ఎంపిక చేయకపోవచ్చు" అనిచోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS 4th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం!? -
ఫైనల్లో రాజస్తాన్ ఓటమి.. విజయ్ హజారే ట్రోఫీ హరియాణాదే
Vijay Hazare Trophy 2023 Title Winner: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2023 టైటిల్‌ను హరియాణా గెలుచుకుంది. రాజ్‌కోట్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. కాగా విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో టాస్ గెలిచిన హరియాణా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అర్ధ శతకాలతో అదరగొట్టారు ఓపెనర్ అంకిత్ కుమార్(88), కెప్టెన్ అశోక్ మెనేరియా(70) అర్ధ శతకాలు సాధించారు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోరుకే పరిమితమైన వేళ హరియాణా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 287 పరుగులు సాధించింది. పోరాడి ఓడిన రాజస్తాన్ ఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్ అభిజిత్ తోమర్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా ఆడి సెంచరీ(129 బంతుల్లో 106 పరుగులు) సాధించాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ కునాల్ సింగ్ రాథోడ్ 79 పరుగులతో రాణించాడు. అయితే, మిగిలిన బ్యాటర్లంతా విఫలం కావడం రాజస్తాన్ జట్టుపై ప్రభావం చూపింది. ఆఖరి వరకు పట్టుదలగా పోరాడినా హరియాణా బౌలర్లే పైచేయి సాధించారు. ఈ క్రమంలో 48 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌట్ అయిన రాజస్తాన్.. హరియాణా చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక హరియాణా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ రెండు, హర్షల్ పటేల్, సుమిత్ కుమార్ మూడేసి వికెట్లు దక్కించుకోగా.. రాహుల్ తెవాటియా రెండు వికెట్లు తీశాడు. -
దీపక్ హుడా సంచలన ఇన్నింగ్స్.. రికార్డులివే! మాక్స్‌వెల్‌తో పాటు..
Deepak Hooda 180- VHT 2023 semi-final: టీమిండియా బ్యాటర్ దీపక్ హుడా దేశవాళీ వన్డే టోర్నీలో దుమ్ములేపాడు. విజయ్ హజారే ట్రోఫీ-2023 సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కర్ణాటకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 128 బంతుల్లో 19 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 180 పరుగులు సాధించాడు. లక్ష్య ఛేదనలో రెండో బ్యాటర్‌గా తద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో అరుదైన ఘనతలు సాధించాడు. భారత్ తరఫున లిస్ట్- ఏ క్రికెట్లో లక్ష్య ఛేదనలో పృథ్వీ షా(123 బంతుల్లో 185 పరుగులు- నాటౌట్) తర్వాత అత్యధిక స్కోరు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అదే విధంగా.. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(220), రవికుమార్ సమర్థ్(192), పృథ్వీ షా(185) తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా దీపక్ హుడా చరిత్రకెక్కాడు. మాక్స్‌వెల్‌తో పాటు ఆ జాబితాలో అంతేగాక.. లిస్ట్-ఏ చరిత్రలో ఛేజింగ్‌లో నంబర్ 4లో వచ్చి అత్యధిక స్కోరు చేసిన నాలుగో క్రికెటర్‌గా దీపక్ హుడా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెప్ మాక్స్వెల్(201*), అఫ్గనిస్తాన్ బ్యాటర్ సమీఉల్లా షెన్వారీ(192), బంగ్లాదేశ్‌కు చెందిన రకీబుల్ హసన్(190) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. హరియాణాతో ఫైనల్లో రాజస్తాన్ అమీతుమీ కాగా దీపక్ హుడా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో రాజస్తాన్ జట్టు ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. కర్ణాటకతో రెండో సెమీఫైనల్లో రాజస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కర్ణాటక నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ దీపక్ హుడా (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాజస్తాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. కరణ్ లాంబా (73 నాటౌట్; 7 ఫోర్లు)తో కలిసి దీపక్ నాలుగో వికెట్‌కు 255 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. శనివారం జరిగే ఫైనల్లో హరియాణాతో రాజస్తాన్ తలపడుతుంది. 1⃣5⃣0⃣ up for Deepak Hooda 👏👏 He brings it up off just 108 balls. He's played some fabulous shots. 👌👌 Follow the match ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/8qJ53nLmA6 — BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023 𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 𝐜𝐫𝐮𝐢𝐬𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 👏👏 A special partnership of 255 between Deepak Hooda (180) & Karan Lamba (73*) helps Rajasthan chase down 283 after being reduced to 23/3 👌 Scorecard ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/CQEIGoErM9 — BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023 -
భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించిన దీపక్ హుడా
కర్ణాటకతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2023 రెండో సెమీఫైనల్లో రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా భారీ సెంచరీతో (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్స్‌కు చేరింది. డిసెంబర్ 16న జరిగే తుది సమరంలో రాజస్థాన్.. హర్యానాతో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆరు, ఏడు నంబర్ ఆటగాళ్లు అభినవ్ మనోహర్ (91), మనోజ్ భాండగే (63) రాణించడంతో కర్ణాటక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సమర్థ్ (8), మయాంక్ అగర్వాల్ (13) విఫలం కాగా.. నికిన్ జోస్ (21), శ్రీజిత్ (37), మనీశ్ పాండే (28) ఓ మోస్తరు స్కోర్లు చేయగలిగారు. రాజస్థాన్ బౌలర్లలో అనికేత్ చౌదరీ, అజయ్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మద్, అరాఫత్ ఖాన్, రాహుల్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్.. ఒక్క పరుగుకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత వన్‌డౌన్ బ్యాటర్ మహిపాల్ లోమ్రార్ (14) కూడా తక్కువ స్కోర్‌కే ఔట్ కావడంతో రాజస్థాన్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ దశలో బరిలోకి దిగిన దీపక్ హుడా.. కరణ్ లాంబా (73 నాటౌట్) సహకారంతో రాజస్థాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపు ఖాయం అనుకున్న దశలో హుడా డబుల్ సెంచరీ చేరువలో ఔటయ్యాడు. హుడా, కరణ్ చెలరేగడంతో రాజస్థాన్ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కర్ణాటక బౌలర్లలో కౌశిక్, వైశాక్, భాండగే, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ పడగొట్టారు. -
VHT 2023: రాణా అజేయ శతకం.. ఫైనల్లో హర్యానా
విజయ్ హజారే ట్రోఫీ 2023లో హర్యానా ఫైనల్స్‌కు చేరింది. తమిళనాడుతో ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు 63 పరుగుల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. హిమాన్షు రాణా (118 బంతుల్లో 116 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), అన్షుల్ కంబోజ్ (9-0-30-4) హర్యానా గెలుపులో కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా.. హిమాన్షు అజేయ శతకంతో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగుల చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో హిమాన్షుతో పాటు యువరాజ్ సింగ్ (65), సుమిత్ కుమార్ (48) ఓ మోస్తరుగా రాణించారు. తమిళనాడు బౌలర్లలో టి నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సాయికిషోర్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన తమిళనాడు.. మీడియం పేసర్ అన్షుల్ కంబోజ్ చెలరేగడంతో 47.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై, ఓటమిపాలైంది. హర్యానా బౌలర్లలో రాహుల్ తెవాటియా 2, సుమిత కుమార్, నిషాంత్ సింధు, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో బాబా ఇంద్రజిత్ (64) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. టోర్నీలో భాగంగా కర్ణాటక, రాజస్థాన్ జట్ల మధ్య రేపు (డిసెంబర్ 14) రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో హర్యానా ఈనెల 16న ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. -
Vijay Hazare Trophy 2023: సెమీఫైనల్లో హరియాణా
రాజ్‌కోట్: లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (4/37) మాయాజాలం... అంకిత్ కుమార్ (102; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం... వెరసి విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోరీ్నలో 12 ఏళ్ల తర్వాత హరియాణా జట్టు మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగాల్ జట్టుతో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బెంగాల్ 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. షహబాజ్ అహ్మద్ (100; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో రాణించాడు. అనంతరం హరియాణా 45.1 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు సాధించి విజయం సాధించింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో రాజస్తాన్ 200 పరుగుల తేడాతో కేరళపై, కర్ణాటక ఏడు వికెట్ల తేడాతో విదర్భపై, తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొంది సెమీఫైనల్ చేరుకున్నాయి. -
చహల్ మ్యాజిక్.. శతక్కొట్టిన లోమ్రార్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్ జట్లు విదర్భ, ముంబై, బెంగాల్, కేరళ జట్లపై విజయాలు సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు చెందిన మహిపాల్ లోమ్రార్ (122 నాటౌట్, కేరళపై), బెంగాల్‌కు చెందిన షాబాజ్ అహ్మద్ (100, హర్యానా), హర్యానాకు చెందిన అంకిత్ కుమార్ (102, బెంగాల్‌పై), తమిళనాడు చెందిన బాబా ఇంద్రజిత్ (103 నాటౌట్, ముంబైపై) శతకాలతో చెలరేగగా.. హర్యానాను చెందిన యుజ్వేంద్ర చహల్ (10-0-37-4, బెంగాల్‌పై), కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్ వైశాక్ (8.5-2-44-4, విదర్భపై), రాజస్థాన్‌కు చెందిన అనికేత్ చౌదరీ (7-1-26-4, కేరళపై) బంతితో రాణించారు. డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో హర్యానా, తమిళనాడు.. డిసెంబర్ 14న జరిగే రెండో సెమీఫైనల్లో రాజస్థాన్, కర్ణాటక జట్లు తలపడనున్నాయి. రెండు సెమీఫైనల్స్‌లో విజేతలు డిసెంబర్ 16న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల స్కోర్ల వివరాలు.. తొలి క్వార్టర్ ఫైనల్: బెంగాల్ 225 (50 ఓవర్లు) హర్యానా 226/6 (45.1 ఓవర్లు) 4 వికెట్ల తేడాతో హర్యానా విజయం రెండో క్వార్టర్ ఫైనల్: రాజస్థాన్ 267/8 (50 ఓవర్లు) కేరళ 67/9 (21 ఓవర్లు) 200 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం మూడో క్వార్టర్ ఫైనల్: విదర్భ 173 (42 ఓవర్లు) కర్ణాటక 177/3 (40.3 ఓవర్లు) 7 వికెట్ల తేడాతో కర్ణాటక విజయం నాలుగో క్వార్టర్ ఫైనల్: ముంబై 227 (48.3 ఓవర్లు) తమిళనాడు 229/3 (43.2 ఓవర్లు) 7 వికెట్ల తేడాతో తమిళనాడు విజయం -
షాబాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ.. ఆర్సీబీని వీడితేనే బాగుపడతారంటున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో భాగంగా హర్యానాతో ఇవాళ (డిసెంబర్ 11) జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ ఆటగాడు, ఆర్సీబీ మాజీ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ సూపర్ సెంచరీతో (118 బంతుల్లో 100; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా షాబాజ్ ఒంటరిపోరాటం చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. Shahbaz Ahmed - 100 (118).Next best - 24 (41).One of the best innings in the Quarter Final of Vijay Hazare Trophy by Shahbaz...!!!pic.twitter.com/pO2bILZvhf— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2023 షాబాజ్ ఒంటరిపోరాటం చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌటైంది. షాజాబ్ తర్వాత బెంగాల్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ చేసిన 24 పరుగులే అత్యధికం. కెప్టెన్ సుదీప్ ఘరామీ (21), ప్రదిప్త ప్రమానిక్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్ (4/37), సుమిత్ కుమార్ (2/27), రాహుల్ తెవాటియా (2/32) బెంగాల్ పతనాన్ని శాశించారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన హర్యానా 30 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. అంకిత్ కుమార్ (82 నాటౌట్) హర్యానాను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాడు. "Shahbaz Ahmed's sensational 💯 under immense pressure in the Vijay Hazare Trophy Knockout game is cricket brilliance at its finest! Single-handedly steering Bengal with a stunning innings, while others faltered. 🏏🔥 #ShahbazAhmed #VijayHazareTrophy" pic.twitter.com/2PJVktLXCH — Hemant ( Sports Active ) (@hemantbhavsar86) December 11, 2023 ఈ మ్యాచ్‌లో షాబాజ్ అహ్మద్ బాధ్యతాయుతమై సెంచరీతో రాణించడంతో బెంగాల్ అభిమానులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ ట్రేడింగ్‌లో షాబాజ్‌ను సన్‌రైజర్స్‌కు వదిలిపెట్టినందుకు గాను ఆర్సీబీపై దుమ్మెత్తిపోస్తున్నారు. షాబాజ్‌ను ఆర్సీబీ వదిలిపెట్టడమే మంచిదైందని వారు కామెంట్లు చేస్తున్నారు. ఆర్సీబీని వీడితేనే ఆటగాళ్లు బాగుపడతారంటూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. you leave rcb and you become successful. https://t.co/1UhwUzIdkB — munka in kalimpong (@messymunka) December 11, 2023 కాగా, అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ మయాంక్ డాగర్ కోసం ఆర్సీబీ షాబాజ్ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌కు వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ట్రేడింగ్ పద్దతిలో షాబాజ్‌ను వదిలేసిన ఆర్సీబీ.. వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్‌లను కూడా వేలానికి వదిలిపెట్టింది. ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు సంబంధించిన వేలం ఈనెల 19న దుబాయ్‌లో జరుగనుంది. -
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అరుదైన ఘనత.. రికార్డు గణాంకాలు నమోదు
విజయ్ హజారే ట్రోఫీ 2023లో భాగంగా నిన్న (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌ల్లో రెండు ప్రధాన రికార్డులు నమోదయ్యాయి. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు టోర్నీ మూడో అత్యధిక స్కోర్ (427) నమోదు చేయగా.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ బౌలర్ అర్పిత్ గులేరియా 8 వికెట్ల ప్రదర్శనతో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. అర్పిత్ నమోదు చేసిన ఈ గణాంకాలు (9-0-50-8) లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే 11వ అత్యుత్తమ గణాంకాలుగా రికార్డు కాగా.. భారత్ తరఫున 8 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అర్పిత్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల అర్పిత్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అర్పిత్‌కు ముందు షాబాజ్ నదీం (8-10), రాహుల్ సింఘ్వి (8-15) లిస్ట్-ఏ క్రికెట్లో భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లుగా ఉన్నారు. ఓవరాల్‌గా కూడా లిస్ట్-ఏ క్రికెట్లో వీరిద్దరివే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. అర్పిత్ గులేరియా 8 వికెట్లతో విజృంభించినా హిమాచల్ ప్రదేశ్ ఓటమిపాలైంది. గుజరాత్ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో హిమాచల్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గులేరియా ధాటికి 49 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో అద్బుతంగా పోరాడిన హిమాచల్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (49.5 ఓవర్లలో 319 ఆలౌట్) నిలిచిపోయింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఉర్విల్ పటేల్ (116) సీజన్ రెండో సెంచరీతో విజృంభించగా.. మరో ఓపెనర్ ప్రయాంక్ పంచల్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హిమాచల్ ఇన్నింగ్స్‌లో ప్రశాంత్ చోప్రా (96) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. ఆఖర్లో సుమీత్ వర్మ (47 బంతుల్లో 82; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో హిమాచల్ గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. -
మెరుపు అర్ధశతకాలు.. విధ్వంసకర శతకం.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోర్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో పరుగుల వరద పారుతుంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఆరుకు పైగా రన్‌రేట్‌తో పరుగులు నమోదవుతున్నాయి. నిన్న (డిసెంబర్ 5) మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు రికార్డు స్థాయిలో 427 పరుగులు చేసింది. అంకిత్ బావ్నే విధ్వంసకర శతకంతో (105 బంతుల్లో 167; 17 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడగా.. ఓమ్ బోస్లే (60), కౌశల్ తాంబే (51), రుషబ్ రాథోడ్ (65) మెరుపు అర్ధసెంచరీలు సాధించారు. పై పేర్కొన్న నలుగురు ఆటగాళ్లతో పాటు అజిమ్ ఖాజీ (36), కెప్టెన్ నిఖిల్ నాయక్ (33 నాటౌట్) కూడా మెరుపు వేగంతో పరుగులు చేయడంతో మహారాష్ట్ర జట్టు విజయ్ హజారే టోర్నీ చరిత్రలోనే మూడో అత్యధిక టీమ్ స్కోర్‌ను నమోదు చేసింది. ఈ టోర్నీలో అత్యధిక స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022 సీజన్లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 506 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అదే సీజన్లో పాండిచ్చేరిపై ముంబై చేసిన 457 పరుగుల స్కోర్ రెండో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డైంది. మ్యాయ్ విషయానికొస్తే.. మహా బ్యాటర్ల విధ్వంసం ధాటికి మణిపూర్ బౌలర్ రెక్స్ సింగ్ 10 ఓవర్లలో 101 పరుగులు సమర్పించుకున్నాడు. మరో బౌలర్ ప్రియ్‌జ్యోత్ సింగ్ 9 ఓవర్లలో ఏకంగా 94 పరుగులు సమర్పించుకున్నాడు. భిష్వోర్జిత్ 2, కిషన్ సింఘా, రెక్స్ సింగ్, ప్రియ్‌జ్యోత్ తలో వికెట్ పడగొట్టారు. లక్ష్యం పెద్దది కావడంతో.. 428 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపూర్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. లక్ష్యం పెద్దది కావడంతో మణిపూర్ బ్యాటర్లు ఆదిలో ఓటమిని ఒప్పేసుకున్నారు. ప్రియ్‌జ్యోత్ (62), జాన్సన్ సింగ్ (62), కెప్టెన్ లాంగ్లోన్యాంబా (76 నాటౌట్) ఓటమి మార్జిన్‌ను తగ్గించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. మహా బౌలర్లలో రామకృష్ణ ఘోష్ 2, సత్యజిత్, అజిమ్ ఖాజీ, కౌశల్ తాంబే తలో వికెట్ పడగొట్టారు. -
రాహుల్ సింగ్ మెరుపు శతకం
జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌ను హైదరాబాద్ జట్టు విజయంతో ముగించింది. మేఘాలయ జట్టుతో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ 41.1 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. కార్తికేయ కక్ 36 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి మేఘాలయను కట్టడి చేశాడు. రోహిత్ రాయుడు రెండు వికెట్లు తీశాడు. అనంతరం హైదరాబాద్ కేవలం 18.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 161 పరుగులు సాధించి గెలిచింది. కెపె్టన్ గహ్లోత్ రాహుల్ సింగ్ (56 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ మెరుపు శతకం సాధించి హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్ రాయుడు (0) డకౌట్‌కాగా... మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (54 బంతుల్లో 49 నాటౌట్; 8 ఫోర్లు)తో కలిసి రాహుల్ సింగ్ రెండో వికెట్‌కు అజేయంగా 159 పరుగులు జోడించాడు. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ తమ ఏడు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించడంలో విఫలమైంది. గ్రూప్ ‘డి’లో పోటీపడ్డ ఆంధ్ర జట్టు ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మంగళవారంతో విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. హరియాణా, రాజస్తాన్, విదర్భ, కర్ణాటక, ముంబై, తమిళనాడు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. మిగిలిన రెండు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ల కోసం ఈనెల 9న ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో బెంగాల్‌తో గుజరాత్; కేరళతో మహారాష్ట్ర తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్లో నెగ్గిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిస్తాయి. -
సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!
Vijay Hazare Trophy 2023 - Kerala vs Railways: విజయ్ హజారే ట్రోఫీ-2023లో కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. బెంగళూరు వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 128 పరుగులు సాధించాడు. తద్వారా సౌతాఫ్రికాతో సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా సెలక్టర్లకు తన ఫామ్ గురించి గట్టి సందేశం పంపాడు. కాగా ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్‌కప్-2023 జట్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఐసీసీ టోర్నీకి సంజూను కాదని.. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. వన్డేల్లో మంచి రికార్డు ఉన్నా సంజూను పక్కన పెట్టి టీ20 స్టార్ సూర్యకు పెద్దపీట వేసి ఫలితం అనుభవించింది. ఈ నేపథ్యంలో సంజూకు మద్దతుగా అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా గళమెత్తారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే జట్టులో సంజూ శాంసన్‌కు స్థానమిచ్చారు సెలక్టర్లు. అయితే, ఈ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కెప్టెన్ కావడంతో.. సంజూకు తుదిజట్టులో చోటు దక్కడం అనుమానమే! ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రైల్వేస్‌తో మ్యాచ్‌లో అతడు సెంచరీ బాదడం హైలైట్‌గా నిలిచింది. బెంగళూరులో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది కేరళ. రైల్వేస్ వికెట్ కీపర్ బ్యాటర్ సహాబ్ యువరాజ్ అజేయ శతకం(121)తో మెరవగా.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కేరళ తడబడింది. ఓపెనర్ రోహన్ కన్నుమ్మల్ డకౌట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ సచిన్ బేబి 9, ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సల్మాన్ నిజార్ 2 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో మరో ఓపెనర్ క్రిష్ణ ప్రసాద్(29)తో కలిసి కెప్టెన్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తం 139 బంతులు ఎదుర్కొన్న సంజూ ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 128 పరుగులు సాధించాడు. శ్రేయస్ గోపాల్ సైతం అర్ధ శతకం(53)తో రాణించాడు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో కేరళకు రైల్వేస్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. రైల్వేస్ బౌలర్లలో రైటార్మ్ పేసర్ రాహుల్ శర్మ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. సంజూ రూపంలో కీలక వికెట్ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టూర్‌కు ముందు సంజూ శాంసన్ సెంచరీ చేయడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. సఫారీ గడ్డపై ఆడే అవకాశం ఈ కేరళ బ్యాటర్‌కు కల్పించాలంటూ సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటినా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడే జట్టుకు మాత్రం సంజూను ఎంపిక చేయలేదు. చదవండి: Test Captain: రోహిత్ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్ అతడే! గిల్‌కు కూడా ఛాన్స్! -
మిస్టరీ స్పిన్నర్ మాయాజాలం.. 69 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి
విజయ్ హజారే ట్రోఫీ 2023లో తమిళనాడు బౌలర్, ఐపీఎల్ మిస్టరీ స్పిన్నర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) వరుణ్ చక్రవర్తి చెలరేగిపోయాడు. నాగాలాండ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. వరుణ్ స్పిన్ మాయాజాలం ధాటికి నాగాలాండ్ 19.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసిన వరుణ్.. 3 మెయిడిన్లు వేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. Varun Chakravarthy took 5 wickets for 9 runs against Nagaland...!!!! - he has taken 14 wickets from just 6 games in Vijay Hazare 2023. pic.twitter.com/Ex5PI2XRpB — Johns. (@CricCrazyJohns) December 5, 2023 ప్రస్తుత సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న వరుణ్.. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి టోర్నీ లీడింగ్ వికెట్‌టేకర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. వరుణ్‌తో పాటు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ (5.4-0-21-3), సందీప్ వారియర్ (6-1-21-1), టి నటరాజన్ (3-0-15-1) కూడా రాణించడంతో నాగాలాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సుమిత్ కుమార్ 20, జాషువ ఒజుకుమ్ 13 పరుగులు చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన పరుగులు (15) నాగాలండ్ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. గ్రూప్-ఈలో ఇప్పటికే ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలు ఎదుర్కొన్న నాగాలాండ్ మరో ఓటమి దిశగా సాగుతుంది. -
పరాజయంతో ముగించిన ఆంధ్ర
చండీగఢ్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌ను ఆంధ్ర జట్టు పరాజయంతో ముగించింది. ఉత్తరప్రదేశ్ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 46.5 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కరణ్ షిండే (67; 7 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రెడ్డి (37 బంతుల్లో 60 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోన శ్రీకర్ భరత్ (50 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... పృథ్వి రాజ్ (35; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. షేక్ రషీద్, రికీ భుయ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో కార్తీక్ త్యాగి, శివా సింగ్ మూడు వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం ఉత్తరప్రదేశ్ జట్టు 41.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించి గెలిచింది. ఆర్యన్ జుయల్ (55; 7 ఫోర్లు), సమీర్ రిజ్వీ (61 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధ్రువ్ జురెల్ (57 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేసి ఉత్తరప్రదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఏడు జట్లున్న గ్రూప్ ‘డి’లో ఆంధ్ర తమ ఆరు మ్యాచ్‌లను పూర్తి చేసుకొని ఆరు పాయింట్ల తో ఐదో స్థానంలో నిలిచింది. ఒక మ్యాచ్‌లో నెగ్గిన ఆంధ్ర, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. మరో మ్యాచ్ వర్షంవల్ల రద్దయింది. -
హైదరాబాద్ జట్టుకు మూడో విజయం
జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు ఖాతాలో మూడో విజయం చేరింది. విదర్భ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ వీజేడీ పద్ధతిలో 30 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (98 బంతుల్లో 102 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించగా... ధ్రువ్ షోరే (83; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ, నితిన్‌సాయి యాదవ్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 29 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు సాధించింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. వీజేడీ పద్ధతి ఆధారంగా హైదరాబాద్ విజయసమీకరణాన్ని లెక్కించగా హైదరాబాద్ 30 పరుగులు ఎక్కువే చేసింది. దాంతో హైదరాబాద్‌ను విజేతగా ప్రకటించారు. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (77 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ సింగ్ (62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీలు సాధించారు. హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మంగళవారం మేఘాలయ జట్టుతో ఆడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. -
హైదరాబాద్ ఓటమి.. కేదార్ జాదవ్ కెప్టెన్సీలో మహారాష్ట్ర గెలుపు
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు ‘హ్యాట్రిక్’ పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 3 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ వన్డే టోర్నీలో తొలి 2 మ్యాచ్‌లు నెగ్గిన హైదరాబాద్ ఆపై వరుసగా మూడు మ్యాచ్‌లలో పరాజయంపాలైంది. మహారాష్ట్రతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (117 బంతుల్లో 103; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా... కెప్టెన్ రాహుల్ సింగ్ (69), రాహుల్ బుద్ధి (58 నాటౌట్), రవితేజ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అండగా నిలిచారు. అనంతరం మహారాష్ట్ర 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 316 పరుగులు సాధించింది. అంకిత్ బావ్నే (108 బంతుల్లో 113; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకానికి తోడు అజీమ్ కాజీ (80), కౌశల్ తాంబే (38), కెప్టెన్ కేదార్ జాదవ్ (32 నాటౌట్) రాణించి జట్టును గెలిపించారు. మరోవైపు చండీగఢ్‌లో ఆంధ్ర, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ ‘డి’ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
దినేష్ కార్తీక్ విధ్వంసం.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో! అయినా పాపం
విజయ్ హజారే ట్రోఫీ-2023లో తమిళనాడు తొలి ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జరిగిన పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో తమిళనాడు పరాజయం పాలైంది. తమిళనాడు కెప్టెన్, టీమిండియా వెటరన్ దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 252 పరుగుల లక్ష్య ఛేదనలో 40 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తమిళనాడు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కార్తీక్ జట్టును అదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికీ కార్తీక్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 82 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. ఆఖరికి సిద్దార్ద్ కౌల్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో కార్తీక్ పోరాటం ముగిసింది. కార్తీక్ ఔటైన తర్వాత వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తమిళనాడు.. 175 పరుగులకే చాపచుట్టేసింది. పంజాబ్ బౌలర్లలో సిద్దార్ద్ కౌల్ ఐదు వికెట్లతో చెలరేగాడు. కాగా ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న డికే.. ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కార్తీక్‌ను రిటైన్ చేసుకుంది. చదవండి: ఐపీఎల్-2024 షెడ్యూల్ విషయంలో బీసీసీఐకి తలనొప్పులు! ఈసారి ఇక్కడ కష్టమే? -
ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పడిక్కల్.. మరో సెంచరీ
విజయ్ హాజరే ట్రోఫీ 2023లో కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే సెంచరీ (117), మూడు మెరుపు హాఫ్ సెంచరీలు (71 నాటౌట్, 70 నాటౌట్, 93 నాటౌట్) సాధించిన అతను.. తాజాగా మరో శతకంతో విరుచుకుపడ్డాడు. చండీఘడ్‌తో ఇవాళ (డిసెంబర్ 1) జరుగుతున్న మ్యాచ్‌లో 103 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 114 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్.. 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 434 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024కు సంబంధించి ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడింగ్ అయిన పడిక్కల్.. తన లిస్ట్-ఏ కెరీర్లో 29 ఇన్నింగ్స్‌లు ఆడి 5 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు సాధించి విజయవంతమైన దేశవాలీ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌తో పాటు నికిన్ జోస్ (96), మనీశ్ పాండే (53 నాటౌట్) రాణించారు. మయాంక్ అగర్వాల్ (19) మరో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన కర్ణాటక అన్నింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. -
మళ్లీ ఓడిన హైదరాబాద్, ఆంధ్ర.. విహారి, హెబ్బర్ రాణించినా..!
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మరో పరాజయాన్ని చవిచూసింది. బుధవారం గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో సర్వీసెస్ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 210 పరుగుల వద్ద ఆలౌటైంది. రాహుల్ బుద్ధి (87 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్ అగర్వాల్ (45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సర్వీసెస్ 40.5 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పలివాల్ (101 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు), వినీత్ ధన్కర్ (76 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో సర్వీసెస్‌ను గెలిపించారు. విహారి, హెబ్బర్ రాణించినా.. చండీగఢ్: గ్రూప్ ‘డి’లో ఆంధ్ర జట్టు కూడా వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడింది. రాజస్తాన్ 38 పరుగుల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. ముందుగా రాజస్తాన్ 50 ఓవర్లలో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. అభిజిత్ తోమర్ (115 బంతుల్లో 124; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, రామ్ చౌహాన్ (68 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. పిన్నింటి తపస్వికి 4 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఆంధ్ర 47.4 ఓవర్లలో 252 పరుగుల వద్ద ఆలౌటైంది. హనుమ విహారి (80 బంతుల్లో 60; 9 ఫోర్లు), అశ్విన్ హెబ్బర్ (89 బంతుల్లో 68; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా... మిడిలార్డర్ వైఫల్యంతో ఆంధ్ర ఓటమిపాలయ్యింది. అనికేత్ చౌదరి 4 వికెట్లతో దెబ్బ తీసాడు. -
మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన పడిక్కల్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ప్లేయర్, కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే సెంచరీ (117), రెండు మెరుపు హాఫ్ సెంచరీలు (71 నాటౌట్, 70) చేసిన అతను.. తాజాగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 320 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 80.04 సగటుతో 351 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. బీహార్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. పడిక్కల్‌తో పాటు నికిన్ జోస్ (69) కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో కర్ణాటక 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్.. సకీబుల్ గనీ అజేయ సెంచరీతో (113 నాటౌట్) కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. బీహార్ ఇన్నింగ్స్‌లో గనీ మినహా అందరూ విఫలమయ్యారు. ముగ్గురు డకౌట్లు, ఇద్దరు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. షర్మన్ నిగ్రోద్ (21), అమన్ (33 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కర్ణాటక బౌలర్లలో సుచిత్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప, విజయ్‌కుమార్ వైశాక్, సమర్థ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. పడిక్కల్, నికిన్ జోస్ రాణించడంతో 33.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో రవికుమార్ సమర్థ్ 4, కెప్టెన్ మయాంక్ అగార్వల్ 28, మనీశ్ పాండే 17 పరుగులు చేశారు. బీహార్ బౌలర్లలో వీర్ ప్రతాప్ సింగ్, రఘువేంద్ర ప్రతాప్ సింగ్, అశుతోష్ అమన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో కర్ణాటక పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (4 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఎగబాకింది. -
ఐదు వికెట్లతో చెలరేగిన జడేజా.. ప్రత్యర్ధి 99 పరుగులకు ఆలౌట్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో సౌరాష్ట్ర బౌలర్ ధరేంద్రసిన్హ్ జడేజా ఐదు వికెట్ల ఘనతతో చెలరేగాడు. ఒడిశాతో ఇవాళ (నవంబర్ 29) జరుగుతున్న మ్యాచ్‌లో 5.1 ఓవర్లలో 16 పరుగులిచ్చి ఈ ఫీట్‌ను సాధించాడు. జడేజా ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా 29.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర బౌలర్లలో జడేజాతో పాటు అంకుర్ పన్వార్ (7-1-28-2), ప్రేరక్ మన్కడ్ (5-1-13-2), కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ (5-0-11-1) కూడా రాణించారు. ఒడిశా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సందీప్ పట్నాయక్ (42), వన్‌డౌన్ బ్యాటర్ సుభ్రాన్షు సేనాపతి (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర 11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (11), షెల్డన్ జాక్సన్ (4), జయ్ గోహిల్ (9) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. చతేశ్వర్ పుజారా (2), విశ్వరాజ్ జడేజా (13) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా దేశవాలీ టోర్నీల్లో సౌరాష్ట్ర జట్టుకే ఆడతాడన్న విషయం తెలిసిందే. -
IPL 2024: గుజరాత్ టైటాన్స్ వదిలేసింది.. కసితో సుడిగాలి శతకం
ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ ప్రక్రియ నవంబర్ 26తో ముగిసింది. అన్ని ఫ్రాంచైజీలు తాము వదిలేసిన, నిలుపుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీలలాగే గుజరాత్ టైటాన్స్ కూడా పలువురు ఆటగాళ్లను రిలీజ్ చేసింది. కాగా, గుజరాత్ వేలానికి వదిలేసిన ఆటగాళ్ల జాబితాలోని ఓ బ్యాటర్ ఫ్రాంచైజీ తనను వదిలేసిందన్న కసితో చెలరేగిపోయాడు. విజయ్ హజారే ట్రోఫీ 2023లో తన ప్రతాపాన్ని చూపించాడు. టైటాన్స్ తనను వదిలేసిన మరుసటి రోజే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. టైటాన్స్ తనను వదిలేసి తప్పు చేసిందని పశ్చాత్తాపపడేలా చేశాడు. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరంటే.. గుజరాత్‌కు చెందిన వికెట్‌కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ను గుజరాత్ టైటాన్స్ 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు వేలానికి వదిలేసింది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాని ఉర్విల్‌ను టైటాన్స్ రిలీజ్ చేసింది. టైటాన్స్ తనను వద్దనుకుందన్న కసితో రెచ్చిపోయిన ఉర్విల్.. ఆ మరుసటి రోజే విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఉర్విల్ కేవలం 41 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన శతకం (100) బాదాడు. ఈ శతకం లిస్ట్-ఏ క్రికెట్లో రెండో వేగవంతమైన శతకంగా రికార్డైంది. 2018 తర్వాత తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ఉర్విల్.. ఈ మ్యాచ్‌లోనే మెరుపు శతకంతో విరుచుకుపడటం విశేషం. ఇదిలా ఉంటే, అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్.. గుజరాత్ బౌలర్ల ధాటికి 35.1 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఉర్విల్ పటేల్ సెంచరీతో చెలరేగడంతో కేవలం 13 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
Vijay Hazare Trophy 2023: ఆంధ్ర, హైదరాబాద్ ఓటమి
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో ఆంధ్ర, హైదరాబాద్ జట్లకు పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది. హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. రోహిత్ రాయుడు (130 బంతుల్లో 102; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. ఛత్తీస్‌గఢ్ 48.1 ఓవర్లలో 4 వికెట్లకు 273 పరుగులు సాధించింది. రిషభ్ తివారి (65), సంజీత్ దేశాయ్ (47), అశుతోష్ సింగ్ (45 నాటౌట్), ఏక్నాథ్ (43 నాటౌట్) రాణించారు. చండీగఢ్: మరో మ్యాచ్‌లో అస్సాం 5 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించింది. ఆంధ్ర 31.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. అశి్వన్ హెబర్ (68 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... హనుమ విహారి (23), రికీ భయ్ (20) విఫలమయ్యారు. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో ఐదుగురు ‘డకౌట్’ కావడం విశేషం. ఆకాశ్ సేన్ గుప్తా (5/20) ఐదు వికెట్లతో ఆంధ్రను దెబ్బ తీశాడు. అస్సాం 24.2 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెరీర్లో తొలి వన్డే ఆడిన మాధవ్ రాయుడు (4/36) రాణించాడు. -
భారత జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడ మాత్రం 6 వికెట్లతో
విజయ్ హజారే ట్రోఫీ 2023 టీమిండియా యువ పేసర్, రాజస్తాన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లతో దీపక్ చాహర్ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన 10 ఓవర్ల కోటాలో 41 పరుగులిచ్చి 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి బౌలింగ్ దాటికి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 29 ఓవర్లలో కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో చిరాగ్ గాంధీ(43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో చాహర్‌తో పాటు ఖాలీల్ అహ్మద్ రెండు, అంకిత్ చౌదరీ, ధావన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి రాజస్తాన్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ దీపక్ హుడా(76 నాటౌట్) పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. దీపక్ చాహర్ విషయానికి వస్తే.. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. మిండియా తరపున చివరగా గతేడాది ఆక్టోబర్‌లో సౌతాఫ్రికాపై టీ20 సిరీస్‌లో ఆడాడు. ఇప్పటివరకు భారత్ తరపున 37 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన చాహర్.. 45 వికెట్లు పడగొట్టాడు. చదవండి: కుర్చీ కదపడం కాదు.. ఎత్తి కిందపడేస్తా.. ఇకపై యూపీకి ఆడొద్దు: గతాన్ని తలచుకున్న షమీ -
వరుసగా 5 సెంచరీలు బాదిన జగదీశన్ ఖాతాలో మరో మెరుపు సెంచరీ
Ranji Trohy 2022-23: విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో వరుసగా 5 సెంచరీలు (114 నాటౌట్, 107, 168, 128, 277) బాది పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన తమిళనాడు విధ్వంసకర బ్యాటర్ ఎన్ జగదీశన్.. తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ సీఎస్కే మాజీ ప్లేయర్ మరోసారి జూలు విదిల్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 277 పరుగులు (141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదిన జగదీశన్.. ఇవాళ హైదరాబాద్‌పై 97 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జగదీశన్‌కు ఇది ఐదో సెంచరీ. జగదీశన్ పార్ట్నర్, తమిళనాడు ఓపెనర్ సాయి సుదర్శన్ (179), అపరాజిత్ (115) కూడా సెంచరీలతో కదం తొక్కడంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా ఆ జట్టుకు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 87 పరుగులు వెనకంజతో ఉంది. అంతకుముందు తన్మయ్ అగర్వాల్ (135), మికిల్ జైస్వాల్ (137 నాటౌట్) శతకాలతో చెలరేగడంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 5 సెంచరీలు బాదిన చిచ్చరపిడుగును వదులుకున్నామా.. ధోని పశ్చాత్తాపం చదవండి: 38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు -
షెల్డన్ జాక్సన్ వీరోచిత సెంచరీ.. విజయ్ హజారే ట్రోఫీ విజేత సౌరాష్ట్ర
దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. శుక్రవారం మహారాష్ట్రతో జరిగిన ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. షెల్డన్ జాక్సన్(136 బంతుల్లో 133 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలబడి వీరోచిత సెంచరీతో జట్టును గెలిపించాడు. హార్విక్ దేశాయ్ 50 పరుగులు చేశాడు. ఆఖర్లో చిరాగ్ జానీ 25 బంతుల్లో 30 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 108 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సెంచరీతో జట్టును గెలిపించిన షెల్డన్ జాక్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 2002-03 సీజన్ నుంచి విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తుండగా 2007-08 సీజన్లో సౌరాష్ట్ర తొలిసారి ఈ ట్రోపీని గెలుచుకుంది. తర్వాత 2017-18 సీజన్ లో ఫైనల్ చేరినా తుదిపోరులో కర్నాటక చేతిలో ఓడింది. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన జయదేవ్ ఉనాద్కట్ సారథ్యంలోని సౌరాష్ట్ర.. అన్ని విభాగాల్లో రాణించి లక్ష్యాన్ని అందుకుంది. ఈ ట్రోఫీని గతంలో తమిళనాడు 5 సార్లు గెలుచుకోగా .. ముంబై నాలుగు సార్లు నెగ్గింది. WHAT. A. WIN! 🙌 🙌 Those celebrations! 👏 👏 The @JUnadkat-led Saurashtra beat the spirited Maharashtra side to bag the #VijayHazareTrophy title 🏆 Scorecard 👉 https://t.co/CGhKsFzC4g #Final | #SAUvMAH | @mastercardindia | @saucricket pic.twitter.com/2aPwxHkcPD — BCCI Domestic (@BCCIdomestic) December 2, 2022 చదవండి: Pak Vs Eng: పాక్ బౌలర్ అత్యంత చెత్త రికార్డు! లిస్టులో భారత క్రికెటర్ కూడా మారడోనా, మెస్సీలను మించినోడు.. జెర్సీ నెంబర్-10 ఆ ఆటగాడిదే -
VHT 2022: ఒకరు బ్యాట్‌తో, మరొకరు బంతితో.. అదరగొట్టిన కెప్టెన్లు!
Vijay Hazare Trophy 2022 Final: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర, సౌరాష్ట్ర జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లలో మహారాష్ట్ర 12 పరుగుల తేడాతో అస్సాంపై గెలవగా.. సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం ఫైనల్ జరుగుతుంది. కాగా ఈ సెమీస్ మ్యాచ్‌లలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సౌరాష్ట్ర సారథి జయదేవ్ ఉనాద్కట్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. జట్ల గెలుపులో కీలక పాత్ర పోషించి వీరిద్దరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోవడం విశేషం. రుతు మరో సెంచరీ ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (126 బంతుల్లో 168; 18 ఫోర్లు, 6 సిక్స్‌లు) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మరో సెంచరీ సాధించగా, అంకిత్ బావ్నే (89 బంతుల్లో 110; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా శతకం బాదాడు. అనంతరం అస్సాం చివరి వరకు పోరాడి 50 ఓవర్లలో 8 వికెట్లకు 338 పరుగులు చేయగలిగింది. చెలరేగిన ఉనాద్కట్ మరో సెమీస్‌లో ముందుగా కర్ణాటక 49.1 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. జయదేవ్ ఉనాద్కట్ 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌరాష్ట్ర 36.2 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. చదవండి: ICC WC Super League: సిరీస్ సమం చేసిన శ్రీలంక.. ఇంకో రెండు మ్యాచ్‌లు గెలిస్తే నేరుగా.. Shikhar Dhawan: పంత్‌కు అండగా నిలబడాలి... సంజూ ఇంకొంత కాలం ఆగాల్సిందే.. ఎందుకంటే! -
'ఐదో సిక్సర్ కొట్టగానే యువరాజ్ గుర్తుకువచ్చాడు'
దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హాజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఉత్తర్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఏడు బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లే కష్టసాధ్యమనుకుంటే.. రుతురాజ్ మాత్రం ఏకంగా ఏడు బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రుతురాజ్ ధాటికి శివ సింగ్ ఏకంగా ఒకే ఓవర్లో 43 పరుగులిచ్చుకోవాల్సి వచ్చింది. ఇక రుతురాజ్ తాను ఏడు సిక్సర్లు కొట్టిన సందర్భంలో యువరాజ్ సింగ్ గుర్తుకు వచ్చాడంటూ పేర్కొన్నాడు. ''వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత నాకు ఒక వ్యక్తి గుర్తుకువచ్చాడు. అతనే టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వరల్డ్‌కప్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం దగ్గరి నుంచి చూశా.నేను కూడా అలా దిగ్గజం సరసన చేరాలని భావించా. అందుకోసమే ఆరో సిక్స్ కొట్టాను. కానీ ఇలా ఒకే ఓవర్లో ఎక్కువ సిక్సర్లు కొడుతానని కలలో కూడా ఊహించలేదు'' అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఉత్తర్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 220 పరుగులు సాధించాడు. తాజాగా అస్సాంతో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో 126 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్.. 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు స్కోర్ చేశాడు. ఈ శతకంతో రుతురాజ్ ప్రస్తుత టోర్నీలో 4 మ్యాచ్‌ల్లో 3 శతకాలు (552 పరుగులు) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీలో (2021, 2022) రుతరాజ్ గత 9 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 7 శతకాలు (168, 220 నాటౌట్, 40, 124 నాటౌట్, 168, 21, 124, 154 నాటౌట్, 136) బాది లిస్ట్-ఏ క్రికెట్లో మరో రికార్డు నెలకొల్పాడు. ఇక అస్సాంపై విజయం అందుకున్న మహారాష్ట్ర ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక డిసెంబర్ 2న జరగనున్న ఫైనల్లో సౌరాష్ట్ర, మహారాష్ట్రలు అమితుమీ తేల్చుకోనున్నాయి. 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 చదవండి: మరోసారి విధ్వంసం సృష్టించిన రుతురాజ్.. ఈసారి భారీ శతకంతో..! సచిన్, డివిలియర్స్ వంటి దిగ్గజాల సరసన రుతురాజ్.. రోహిత్‌తో పాటుగా -
VHT 2022: సాహో రుతురాజ్.. 220 పరుగులతో విధ్వంసం! గొప్ప, ‘చెత్త’ రికార్డు.. రెండూ...
Vijay Hazare Trophy 2022 - Maharashtra vs Uttar Pradesh, 2nd quarter final- అహ్మదాబాద్: భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో గత సోమవారం నారాయణ్ జగదీశన్ ప్రపంచ రికార్డులతో హోరెత్తించాడు. ఇప్పుడు సరిగ్గా వారం రోజుల తర్వాత ఇదే టోర్నీలో మరో బ్యాటర్ కొత్త ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మహారాష్ట్ర కెప్టెన్, భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆరు రెగ్యులర్ బంతులతో పాటు ఒక నోబాల్ ఈ ఓవర్లో రాగా, దానిని కూడా సిక్స్‌గా మలచి రుతురాజ్ మొత్తం 43 పరుగులు రాబట్టాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదైంది. పాపం శివ సింగ్ దీంతో ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా సమమైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ శివ సింగ్ బాధిత బౌలర్‌గా నిలిచాడు. 48 ఓవర్లో ముగిసేసరికి మహారాష్ట్ర 272/5గా ఉంది. 49వ ఓవర్ తర్వాత స్కోరు 315/5గా మారింది. ఆ ఓవర్లో రుతురాజ్ వరుసగా 6, 6, 6, 6, 6 (నోబాల్), 6, 6 బాదాడు. వరుసగా వైడ్ లాంగాన్, లాంగాన్, డీప్ స్క్వేర్ లెగ్, లాంగాఫ్ మీదుగా తొలి నాలుగు సిక్సర్లు వెళ్లాయి. ఐదో బంతిని లాంగాఫ్ మీదుగా సిక్సర్ కొట్టగా, బౌలర్ గీత దాటడంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత లాంగాన్, డీప్ మిడ్‌వికెట్ మీదుగా తర్వాతి రెండు సిక్సర్లను గైక్వాడ్ మలిచాడు. ఇందులో ఆరో సిక్సర్‌తో రుతురాజ్ డబుల్ సెంచరీ పూర్తయింది. చివరకు 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో అతను 220 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సెమీస్‌లో మహారాష్ట్ర ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసి సవాల్ విసరగా... 47.4 ఓవర్లలో 272 పరుగులకే ఉత్తరప్రదేశ్ ఆలౌటైంది. 58 పరుగులతో గెలిచిన మహారాష్ట్ర సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు FIFA World Cup Qatar 2022: జర్మనీ... డ్రాతో గట్టెక్కింది 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 -
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ఒకే ఓవర్లో 7 సిక్స్‌లు!
Vijay Hazare Trophy 2022 - Maharashtra vs Uttar Pradesh, 2nd quarter final: టీమిండియా యువ ఆటగాడు రుత్‌రాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు సారథ్యం వహిస్తున్న రుత్‌రాజ్ ఏకంగా ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదాడు. ఈ టోర్నీ క్వార్టర్స్ ఫైనల్స్‌లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. శివసింగ్ మైండ్ బ్లాక్ మహారాష్ట్ర ఇన్నింగ్స్ 49 ఓవర్ వేసిన శివ సింగ్ బౌలింగ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. వరుసగా నాలుగు బంతులను రుతురాజ్ సిక్సర్లు బాదగా.. ఐదో బంతిని బౌలర్ నోబాల్‌గా వేసాడు. ఆ బంతిని కూడా సిక్స్ బాదిన రుతురాజ్ తర్వాతి రెండు బంతులను కూడా స్టాండ్స్‌కు తరిలించాడు. ప్రపంచ రికార్డు ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదడం లిస్ట్- ఏ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్‌లో 159 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 16 సిక్సులు, 10 ఫోర్లతో 220 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రుత్‌రాజ్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 330 పరుగులు చేసింది. 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 చదవండి: Indian Captain: హార్దిక్‌తో పాటు టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ యువ ప్లేయర్ కూడా! జట్టులో చోటుకే దిక్కులేదు! -
జగదీశన్ విధ్వంసం.. చెలరేగిన సిద్దార్థ! ఏకంగా 435 పరుగుల తేడాతో..
Vijay Hazare Trophy 2022- Narayan Jagadeesan: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో తమిళనాడు సంచలన విజయం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో సోమవారం తలపడ్డ తమిళనాడు జట్టు ఏకంగా 435 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా లిస్ట్ ‘ఏ’ క్రికెట్(పరిమిత ఓవర్లు)లో అత్యంత భారీ తేడాతో గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఎలైట్ గ్రూప్- సీలో ఉన్న తమిళనాడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న అరుణాచల్ జట్టుకు తమిళనాడు ఓపెనర్లు సాయి సుదర్శన్, నారయణ్ జగదీశన్ చుక్కలు చూపించారు. బౌండరీలు, సిక్సర్ల వర్షం సాయి 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో 154 పరుగులు సాధించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ చేశాడు. 277 పరుగులతో రాణించి జట్టు 506 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చెలరేగిన సిద్ధార్థ కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్‌కు ఆదిలోనే షాకిచ్చారు తమిళనాడు బౌలర్లు. ఓపెనర్లు నీలమ్ ఓబి(4), రోషన్ శర్మ(2)ను సిలంబరసన్ ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపాడు. ఇక తర్వాత సాయి కిషోర్(ఒక వికెట్), సిద్దార్థ్(7.4 ఓవర్లలో 12 మాత్రమే పరుగులు ఇచ్చి 5 వికెట్లు), మహ్మద్(2 వికెట్లు) మిగతా బ్యాటర్ల పనిపట్టారు. 71 పరుగులకే కుప్పకూలిన అరుణాచల్ తమిళనాడు బౌలర్ల విజృంభణతో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దారుణ వైఫల్యం మూటగట్టుకున్నారు. వరుసగా 4, 2, 11, 14, 17, 0, 6, 3(నాటౌట్), 0,0,0 స్కోర్లు నమోదు చేశారు. దీంతో 28. 4 ఓవర్లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి అరుణాచల్ జట్టు ఆలౌట్ అయింది. 435 పరుగుల తేడాతో బాబా అపరాజిత్ బృందం జయభేరి మోగించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.. సమిష్టి కృషితో సంచలన విజయం అందుకుంది. చదవండి: Narayan Jagadeesan: 38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు క్రీడల చరిత్రలో క్రికెట్, ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లు ఆడిన ఆసీస్ ప్లేయర్ ఎవరో తెలుసా..? #Jagadeesan (277) misses out on triple hundred. Gets a big ovation from teammates after world record List A score. @sportstarweb #VijayHazareTrophy2022 pic.twitter.com/s8CKYgUXsc — Ashwin Achal (@AshwinAchal) November 21, 2022 -
38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు
విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా తమిళనాడు-అరుణాచల్‌ప్రదేశ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 21) జరిగిన గ్రూప్-సి మ్యాచ్ కనీవినీ ఎరుగని రికార్డులకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) డబుల్ సెంచరీతో శివాలెత్తడంతో తమిళనాడు 435 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లిస్ట్-ఏ (అంతర్జాతీయ వన్డేలతో పాటు దేశవాలీ వన్డేలు) క్రికెట్లో ఇదే అత్యంత భారీ విజయంగా రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు.. ఓపెనర్లు జగదీశన్, సాయ్ సుదర్శన్ (102 బంతుల్లో 154; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ శతకాలతో వీరవిహారం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. అనంతరం ఆసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అరుణాచల్‌ప్రదేశ్.. 28.4 ఓవర్లలో కేవలం 71 పరుగులకే ఆలౌటై, లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మణిమారన్ సిద్ధార్థ్ (5/12) అరుణాచల్‌ప్రదేశ్ పతనాన్ని శాశించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన జగదీశన్ వ్యక్తిగతంతా పలు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇదే టోర్నీలో 4 వరుస శతకాలు బాదిన (114 నాటౌట్, 107, 168, 128) జగదీశన్.. తాజాగా డబుల్ సెంచరీతో వరుసగా ఐదో శతకాన్ని నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఇలా వరుసగా ఐదు సెంచరీలు చేయడం ప్రపంచ రికార్డు. గతంలో శ్రీలంక దిగ్గజం సంగక్కర, సౌతాఫ్రికా ఆటగాడు అల్విరో పీటర్సన్, భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ వరుసగా 4 శతాకలు బాదారు. ఈ మ్యాచ్‌లో డబుల్ సాధించే క్రమంలో జగదీశన్ ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డునే బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో రోహిత్ (శ్రీలంకపై 264 పరుగులు) అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. జగదీశన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ విభాగంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇంగ్లీష్ క్రికెటర్ అలిస్టర్ బ్రౌన్ (268) పేరిట ఉండేది. డబుల్ సాధించే క్రమంలో జగదీశన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి శతకాన్ని సాధించేందుకు 76 బంతులు తీసుకున్న అతను.. రెండో సెంచరీని కేవలం 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. డబుల్ సెంచరీలో రెండో అర్ధభాగాన్ని ఇన్ని తక్కువ బంతుల్లో పూర్తి చేయడం కూడా లిస్ట్-ఏ క్రికెట్లో రికార్డే. మొత్తానికి నారాయణ్ జగదీశన్ ధాటికి లిస్ట్-ఏ రికార్డులు చాలావరకు బద్ధలయ్యాయి. అతను సృష్టించిన విధ్వంసం ధాటికి పలు ప్రపంచ రికార్డులు సైతం తునాతునకలయ్యాయి. అతని సిక్సర్ల సునామీలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కొట్టుకుపోయింది. -
ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
తమిళనాడు స్టార్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో నారాయణ్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. ఇది ఈ టోర్నీలో అతడికి వరుసగా ఐదో సెంచరీ. తద్వారా జగదీశన్ ప్రపంచరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు 2014-15 సీజన్లో నాలుగు సెంచరీలు చేసిన శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరిట ఈ రికార్డు ఉంది. తాజా మ్యాచ్‌లో సెంచరీ సాధించిన జగదీశన్ సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో 141 బంతులు ఎదుర్కొన్న జగదీశన్.. 15 సిక్స్‌లు, 25 ఫోర్లతో 277 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ రికార్డు బద్దలు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా జగదీశన్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లీష్ క్రికెటర్ అలిస్టర్ బ్రౌన్(268) పేరిట ఉండేది. అదే విధంగా భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రోహిత్ శర్మ(264) రికార్డును జగదీశన్ బ్రేక్ చేశాడు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ 264 పరుగులు సాధించాడు. తమిళనాడు స్కోర్ ఎంతంటే? ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. జగదీశన్‌తో పాటు మరో ఓపెనర్ సాయి సుదర్శన్(154) పరుగులతో రాణించాడు. లిస్ట్-ఏ క్రికెట్ అంటే? అంతర్జాతీయ వన్డేలతో పాటు దీశీవాళీ వన్డేటోర్నీలు కూడా లిస్ట్-ఏ క్రికెట్ పరిగణలోకి వస్తాయి. లిస్ట్-ఏ క్రికెట్లో ఓవర్ల సంఖ్య నలభై నుంచి అరవై వరకు ఉంటుంది. అదే విధంగా అధికారిక వన్డే హోదాను సాధించని దేశాలు పాల్గొనే అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా లిస్ట్-ఏ క్రికెట్ పరిగణలోకి వస్తాయి. చదవండి: IND vs NZ: వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్! -
68 బంతుల్లోనే సెంచరీ.. టీమిండియాలో అవకాశమివ్వండి
విజయ్ హజారే ట్రోఫీలోనూ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తన జోరును కనబరుస్తున్నాడు. టోర్నీలో రెండో శతకం సాధించిన తిలక్ వర్మ హైదరాబాద్‌ను నాకౌట్ స్టేజీకి మరింత దగ్గర చేశాడు. శనివారం మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో తిలక్ వర్మ(77 బంతుల్లో 126 నాటౌట్, 14 ఫోర్లు, ఏడు సిక్సర్లు), రోహిత్ రాయుడు(51 బంతుల్లో 39 నాటౌట్) నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 164 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఇందులో తిలక్ వర్మవే 126 పరుగులు ఉన్నాయంటే అతనెంత ఎంత ధాటిగా ఆడాడో అర్థమవుతుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. తొమ్మిదో నెంబర్ బ్యాటర్ బికాష్ సింగ్ 44 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. రెక్స్ సింగ్ 36 పరుగులు సాధించాడు. హైదరాబాద్ బౌలర్లలో ఎం. శశాంక్ 3, తిలక్ వర్మ, రోహిత్ రాయుడు చెరో రెండు వికెటక్లు తీశారు. ఇప్పటివరకు లిస్ట్ ఏ క్రికెట్లో 23 మ్యాచ్‌లు ఆడిన తిలక్‌వర్మకు ఇది ఐదో సెంచరీ కావడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబాయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు తిలక్‌వర్మ. 14 మ్యాచుల్లో 397 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ముంబాయి ఇండియన్స్ అతడిని రిటైన్ చేసుకుంది. Tilak Verma - The Young Champ 🥰 #mumbaiindians #IPL2022 #TilakVarma pic.twitter.com/juEpRWVf9S — Oh My Cricket (@OhMyCric) April 6, 2022 చదవండి: FIFA: సాకర్ సమరం.. దిగ్గజాలపై కన్ను వేయాల్సిందే కోహ్లిని మించిన కెప్టెన్ లేడు.. కింగ్‌ను ఆకాశానికెత్తిన రైజింగ్ స్టార్ -
అరుదైన రికార్డు సాధించిన జగదీశన్.. కోహ్లి రికార్డు సమం!
విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు బ్యాటర్ నారాయణ్ జగదీశన్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. శనివారం హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో జగదీశన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 123 బంతులు ఎదుర్కొన్న జగదీశన్ 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 128 పరుగులు చేశాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు జగదీశన్‌కు ఇది నాలుగో సెంచరీ. తద్వారా జగదీశన్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. విజయ్ ట్రోఫీలో ఒకే ఎడిషన్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా జగదీశన్ నిలిచాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితో పాటు రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ ఉన్నారు. 2008-09 సీజన్లో ఢిల్లీ తరపున ఆడిన కోహ్లి నాలుగు సెంచరీలు సాధించాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా కూడా నారాయణ్ నిలిచాడు. చదవండి: ఓపెనర్‌గా పంత్ వద్దు.. అతడిని పంపండి! విధ్వంసం సృష్టిస్తాడు -
ఆర్యన్ అద్భుత శతకం.. హైదరాబాద్‌పై ఉత్తరప్రదేశ్ ఘన విజయం
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ (59 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ బుద్ధి (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేయగా...శివమ్ మావి 3, సౌరభ్ కుమార్ 2 వికెట్లు తీశారు. అనంతరం యూపీ 48.4 ఓవర్లలో 3 వికెట్లకు 262 పరుగులు సాధించింది. ఆర్యన్ జుయాల్ (136 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) శతకం బాదగా...రింకూ సింగ్ (48 బంతుల్లో 78 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాధవ్ కౌశిక్ (92 బంతుల్లో 70; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రోహిత్ రాయుడుకే 3 వికెట్లు దక్కాయి. చదవండి: IND Vs NZ 1st T20: ఆగని వర్షం.. భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 రద్దు -
మ్యాచ్‌ను గెలిపించలేకపోయిన జైశ్వాల్ వీరొచిత సెంచరీ
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గురువారం ముంబై, మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీస్కోర్లు నమోదయ్యాయి. ఇక మ్యాచ్‌లో మహారాష్ట్ర 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ముంబై ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (135 బంతుల్లో 142, 14 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడినప్పటికి లాభం లేకుండా పోయింది. జైశ్వాల్ మినహా మిగతావారు విఫలం కావడంతో 49 ఓవర్లలో 321 పరుగులకు ఆలౌటైంది. ఆర్మాన్ జాఫర్ 36, అజింక్యా రహానే 31 పరుగులు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో సత్యజిత్ బచావ్ ఆరు వికెట్లతో చెలరేగగా.. షామ్షుజ్మా రెండు వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(137 బంతుల్లో 156 నాటౌట్) అజేయ శతకంతో మెరవగా.. పవన్ షా 84 పరుగులు చేశాడు. చివర్లో అజిమ్ కాజీ 32 బంతుల్లో 50 పరుగులు నాటౌట్ రాణించాడు. -
తెలుగు ఆటగాళ్ల సెంచరీల మోత.. ఒకే రోజు ముగ్గురు శతక్కొట్టుడు
బెంగళూరు: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర తొలి విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 261 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (133 బంతుల్లో 136; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), కోన శ్రీకర్ భరత్ (84 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ 38 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. కమ్ష(18)దే అత్యధిక స్కోరు. అయ్యప్ప 3 వికెట్లు పడగొట్టగా... షోయబ్, హరిశంకర్, ఆశిష్ తలా 2 వికెట్లు తీశారు. పరుగుల పరంగా ఈ టోర్నీ చరిత్రలో ఆంధ్రకిదే పెద్ద విజయం. తన్మయ్ అగర్వాల్ శతకం... న్యూఢిల్లీ: సౌరాష్ట్రతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా సౌరాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (120 బంతుల్లో 102; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం సాధించాడు. సంకేత్ 4 వికెట్లు పడగొట్టగా, అనికేత్ రెడ్డికి 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత హైదరాబాద్ 48.5 ఓవర్లలో 5 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (119 బంతుల్లో 124; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ రాయుడు (97 బంతుల్లో 83; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 214 పరుగులు జోడించి హైదరాబాద్ విజయాన్ని సులువుగా మార్చగా, తిలక్ వర్మ (45; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. -
ఆసుపత్రిలో చేరిన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్
ఇటీవలే దేశవాలీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విజయ్ హజారే ట్రోఫీ నుంచి వైదొలిగాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌కు ముందు సర్ఫరాజ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కిడ్నీలో రాళ్ల కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుఉతున్న సర్ఫారాజ్ ప్రస్తుతం రాంచీలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ''కొన్నిరోజులు కిందట కిడ్నీలో తీవ్రమైన నొప్పి రావడంతో స్కానింగ్ చేయగా స్టోన్స్ ఉన్నట్లు తేలింది. అయితే ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడు'' అంటూ సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ వెల్లడించాడు. ఇక 25 ఏళ్ల సర్ఫారాజ్ ఖాన్ ఇటీవలే ముంబై సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కుతుందని భావించినప్పటికి నిరాశే ఎదురైంది. అయితే బంగ్లాదేశ్-ఏ టూర్‌కు మాత్రం సర్ఫరాజ్‌ను ఎంపిక చేశారు. ఇక విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతున్న ముంబై జట్టుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఫ్రంట్‌లైన్ పేసర్ శివమ్ దూబే గాయంతో దూరమవడం.. తాజగా సర్ఫరాజ్ ఖాన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో టోర్నీకి దూరం కావడం జట్టును దెబ్బతీసింది. ఇక శ్రేయాస్ అయ్యర్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుండడంతో జట్టు బలహీనంగా మారిపోయింది. చదవండి: Ben Stokes: ఆలస్యమైనా కుంభస్థలాన్ని గట్టిగా బద్దలు కొట్టాడు ఇంగ్లండ్ గెలుపులో మూల స్తంభాలు.. -
Vijay Hazare Trophy: తమిళనాడు చేతిలో ఆంధ్ర ఓటమి
ఆలూర్ (కర్ణాటక): విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు తొమ్మిది వికెట్ల తేడాతో ఆంధ్ర జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిషేక్ రెడ్డి (85; 9 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ శ్రీకర్ భరత్ (51; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. తమిళనాడు బౌలర్లలో సిలాంబరాసన్ మూడు వికెట్లు తీయగా... సందీప్ వారియర్, సాయికిశోర్, సంజయ్ యాదవ్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం తమిళనాడు ధాటిగా ఆడి 32.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 206 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ జగదీశన్ (114 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ (73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి జగదీశన్ తొలి వికెట్‌కు 177 పరుగులు జత చేశాడు. -
Vijay Hazare Trophy: సమర్థ్ 200
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. ఇక్కడి జామియా మిలియా యూనివర్సిటీ మైదానంలో మణిపూర్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు పరుగుల వరద పారించింది. ఏకంగా 282 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ సమర్థ్ వ్యాస్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 131 బంతులు ఆడిన సమర్థ్ 20 ఫోర్లు, 9 సిక్స్‌లతో సరిగ్గా 200 పరుగులు సాధించి అవుటయ్యాడు. మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 36.3 ఓవర్లలో 282 పరుగులు జోడించడం విశేషం. సమర్థ్, హార్విక్ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపూర్‌ను సౌరాష్ట్ర ఎడంచేతి వాటం స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా తిప్పేశాడు. 32 ఏళ్ల ధర్మేంద్రసింగ్ 10 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో మణిపూర్ 41.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. -
Vijay Hazare Trophy: రోహిత్ రాయుడు, తిలక్ వర్మ సెంచరీలు
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ వీజేడీ పద్ధతిలో 17 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. రోహిత్ రాయుడు (156; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు), తిలక్ వర్మ (132; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో... తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 360 పరుగులు సాధించింది. అనంతరం హిమాచల్ 48 ఓ వర్లలో 9 వికెట్లకు 335 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురు మందగించడంతో ఆటను నిలిపి వేశారు. వీజేడీ పద్ధతిలో హిమాచల్ లక్ష్యాన్ని లెక్కించగా 353 పరుగులుగా వచ్చింది. దాంతో హైదరాబాద్ 17 పరుగులతో విజయాన్ని ఖాయం చేసుకుంది. బెంగళూరులో ఆంధ్ర, గోవా జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
సెంచరీతో జట్టును గెలిపించిన రుతురాజ్ గైక్వాడ్
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో మెరిశాడు. విషయంలోకి వెళితే.. శనివారం రైల్వేస్, మహారాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 38.2 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ శతకంతో జట్టును గెలిపించాడు. 123 బంతుల్లో 124 పరుగులు చేసిన రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అతనికి తోడుగా మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(80 బంతుల్లో 75 పరుగులు, 10 ఫోర్లు, ఒక సిక్స్) రాణించాడు. ఈ ఇద్దరి మధ్య తొలి వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. శివమ్ చౌదరీ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కర్ణ్ శర్మ 40 పరుగులు చేశాడు. మహారాష్ట్ర బౌలర్లలో కాజీ రెండు వికెట్లు తీయగా.. ముఖేశ్ చౌదరీ, మనో ఇంగాలే, ఎస్ఎస్ బచావ్, అజిమ్ కాజీలు తలా ఒక వికెట్ తీశారు. -
Ind Vs WI: ఆ ఇద్దరికి బంపరాఫర్.. ఒకరు వన్డే, మరొకరు టీ20 సిరీస్‌కు ఎంపిక!
India Vs West Indies Series 2022: దక్షిణాఫ్రికా పర్యటనతో పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానుండగా.. దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. సౌతాఫ్రికాతో టూర్లో తుది జట్టు కూర్పు.. తదనంతర ఫలితాలు దృష్టిలో పెట్టుకుని సమతౌల్యమైన జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఆల్‌రౌండర్ రిషి ధావన్, షారుఖ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 458 పరుగులు.. 17 వికెట్లు.. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ అద్భుత ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే. బ్యాటర్‌గా.. బౌలర్‌గా రిషి ధావన్ అత్యుత్తమంగా రాణించాడు.ఈ టోర్నీలో మొత్తంగా 458 పరుగులు చేయడంతో పాటుగా 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలతో పాటు ఒక 4 వికెట్ హాల్ కూడా ఉండటం విశేషం. ఇలా ఆటగాడిగా.. సారథిగా హిమాచల్ ప్రదేశ్ మొట్టమొదటి సారిగా ఈ మెగా ఈవెంట్లో విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రిషి సుదీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. విండీస్‌తో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #VijayHazareTrophy winners. 🏆 Congratulations and a round of applause for Himachal Pradesh on their triumph. 👏 👏#HPvTN #Final pic.twitter.com/bkixGf6CUc — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. మరోవైపు... తమిళనాడు ఆటగాడు షారుఖ్ ఖాన్ సైతం దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రాణించాడు. ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి తమిళనాడును విజేతగా నిలిపి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఈ ప్రదర్శన దృష్ట్యా విండీస్ టీ20 సిరీస్‌కు షారుఖ్‌ను సెలక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా... దక్షిణాఫ్రికా టూర్లో ఘోరంగా వైఫల్యం చెందిన వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ తదితరులపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గాయం కారణంగా టూర్‌కు దూరమైన అక్షర్ పటేల్, కరోనా కారణంగా వన్డే సిరీస్ మిస్సైన వాషింగ్టన్ సుందర్.. వీరితో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 చదవండి: రాహుల్, పంత్‌కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్! -
సెంచరీతో మెరిశాడు.. వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీపడతాయి!
విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ తొలిసారి ఛాంఫియన్‌గా నిలిచింది. జైపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో తమిళనాడును ఓడించి హిమాచల్ ప్రదేశ్ టైటిల్‌ను ముద్దాడింది. కాగా ఈ మ్యాచ్‌లో తమిళనాడు ఓటమి చెందినప్పటకీ.. ఆ జట్టు బ్యాటర్ దినేష్ కార్తీక్ విరోచిత ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కార్తీక్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 103 బంతుల్లో 116 పరుగులు సాధించాడు. జట్టు 315 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కార్తీక్ కీలకపాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. అదే విధంగా బెంగాల్, పుదుచ్చేరి జట్లుపైన వరుసగా 87,65 పరుగులు సాధించాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం ముందు కేకేఆర్ దినేష్ కార్తీక్‌ని రీటైన్ చేసుకోలేదు. దీంతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కార్తీక్‌ని సొంతం చేసుకునేందుకు రానున్న వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడతాయని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: Ashes 2021: 13 సార్లు 200లోపూ.. 20 మంది ఆటగాళ్లు డకౌట్; ఇంగ్లండ్ చెత్త రికార్డు -
IPL Auction: 13 ఫోర్లు, సిక్స్.. 136 పరుగులు నాటౌట్.. శుభమ్‌తో పాటు ఆ ముగ్గురు కూడా!
IPL 2022 Auction- Vijay Hazare Trophy Winner Himachal Pradesh Players: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో తొలిసారి చాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించింది హిమాచల్ ప్రదేశ్. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా విజేతగా నిలిచింది. ఆరుసార్లు చాంపియన్ అయిన తమిళనాడుకు షాకిచ్చి ట్రోఫీని ముద్దాడింది. ముఖ్యంగా కెప్టెన్ రిషి ధావన్, పంకజ్పవన్ జైస్వాల్, ప్రశాంత్ చోప్రా, శుభమ్ అరోరా హిమాచల్ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించారు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం ఆసన్నమైన నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. ఈ నలుగురిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు తప్పక ఆసక్తి కనబరుస్తాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీలో వీరి ప్రయాణాన్ని గమనిద్దాం. రిషి ధావన్(ఆల్‌రౌండర్) విజయ్ హజారే ట్రోఫీ ఆసాంతం కెప్టెన్‌గా, బ్యాటర్‌గా.. బౌలర్‌గా రిషి ధావన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. టోర్నీలో మొత్తంగా 458 పరుగులు చేయడంతో పాటుగా 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలతో పాటు ఒక 4 వికెట్ హాల్ కూడా ఉంది. తాజా ప్రదర్శనతో మెగా వేలం నేపథ్యంలో క్యాష్ రిచ్‌లీగ్‌లో రీఎంట్రీ ఇవ్వడంతో పాటు మంచి ధరకు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి. పంకజ్ జైస్వాల్ తమిళనాడుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హిమాచల్ బౌలర్ పంకజ్ జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. టోర్నీలో మొత్తంగా 4 మ్యాచ్‌లు ఆడిన పంకజ్ ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రశాంత్ చోప్రా(బ్యాటర్) విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు ప్రశాంత్ చోప్రా. ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 99. మొత్తంగా టోర్నీలో 12 సిక్సర్లు బాదాడు. ఇలాంటి హిట్టర్ పట్ల ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేహం లేదు. శుభమ్ అరోరా(బ్యాటర్) ఉత్కంఠ రేపిన ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ విజేతగా నిలవడంలో శుభమ్దే కీలక పాత్ర. మ్యాచ్ ఆరంభం నుంచి చివరిదాకా క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 136 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టోర్నీలో మొత్తంగా 313 పరుగులతో రాణించాడు. సగటు 44+. చదవండి: Virat Kohli Dismissal: 94 బంతులు.. 35 పరుగులు.. మరీ అలా అవుట్ అవడం ఏంటి!.. ఫ్రస్ట్రేషన్‌తో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో! #VijayHazareTrophy winners. 🏆 Congratulations and a round of applause for Himachal Pradesh on their triumph. 👏 👏#HPvTN #Final pic.twitter.com/bkixGf6CUc — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 1⃣3⃣6⃣* Runs 1⃣3⃣1⃣ Balls 1⃣3⃣ Fours 1⃣ Six Shubham Arora scored a fantastic unbeaten ton & powered Himachal Pradesh to their first-ever #VijayHazareTrophy triumph. 👏 👏 #HPvTN #Final Watch his superb knock 🎥 🔽https://t.co/cRZh6TjyVh pic.twitter.com/7YEwih1oTs — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 THAT. WINNING. FEELING! 👏 👏 The @rishid100-led Himachal Pradesh beat Tamil Nadu to clinch their maiden #VijayHazareTrophy title. 🏆 👍#HPvTN #Final Scorecard ▶️ https://t.co/QdnEKxJB58 pic.twitter.com/MeUxTjxaI1 — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 A fine hundred in the chase by Shubham Arora! 👍 👍 The Himachal Pradesh opener is doing a fantastic job with the bat in the #VijayHazareTrophy #Final. 👌👌 #HPvTN Follow the match ▶️ https://t.co/QdnEKxJB58 pic.twitter.com/q1LtOrZ0Im — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 -
Vijay Hazare Trophy: తమిళనాడుకు షాక్.. హిమాచల్ ప్రదేశ్ కొత్త చరిత్ర.. తొలిసారి విజేతగా
Himachal Pradesh Created History with their first-ever domestic title: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో హిమాచల్ ప్రదేశ్ చరిత్ర సృష్టించింది. విజయ్ హజారే ట్రోఫీలో మొట్టమొదటిసారి చాంపియన్‌గా అవతరించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో తమిళనాడును ఓడించి ట్రోఫీని ముద్దాడింది. ఓపెనర్ శుభమ్ అరోరా 136 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు తీర్చాడు. అమిత్ కుమార్ 74 పరుగులతో రాణించాడు. ఇక కెప్టెన్ రిషి ధావన్ 42 పరుగులు సాధించి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో భాగంగా జైపూర్‌లో జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హిమాచల్ ప్రదేశ్.. తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలో తడబడినా దినేశ్ కార్తిక్, షారుక్ ఖాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో తమిళనాడు జట్టు మంచి స్కోరు నమోదు చేసింది. 49.4 ఓవర్లలో 314 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్‌కు శుభమ్ శుభారంభం అందించాడు. ఇక వెలుతురు లేమి కారణంగా వీజేడీ మెథడ్ ద్వారా.. 47.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసిన హిమాచల్ ప్రదేశ్‌ను అంపైర్లు విజేతగా ప్రకటించారు. దీంతో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. 131 బంతుల్లో 136 పరుగులు చేసిన శుభమ్ అరోరా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తమిళనాడు బౌలర్లలో సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్, మురుగన్ అశ్విన్, బాబా అపరాజిత్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. THAT. WINNING. FEELING! 👏 👏 The @rishid100-led Himachal Pradesh beat Tamil Nadu to clinch their maiden #VijayHazareTrophy title. 🏆 👍#HPvTN #Final Scorecard ▶️ https://t.co/QdnEKxJB58 pic.twitter.com/MeUxTjxaI1 — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 A fine hundred in the chase by Shubham Arora! 👍 👍 The Himachal Pradesh opener is doing a fantastic job with the bat in the #VijayHazareTrophy #Final. 👌👌 #HPvTN Follow the match ▶️ https://t.co/QdnEKxJB58 pic.twitter.com/q1LtOrZ0Im — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 -
Vijay Hazare Trophy Final: వారెవ్వా.. డీకే సెంచరీ... షారుక్ 21 బంతుల్లో 42!
Vijay Hazare Trophy Final HP Vs TN- Dinesh Karthik Century: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు బ్యాటర్ దినేశ్ కార్తిక్ అదరగొట్టాడు. 103 బంతుల్లో 116 పరుగులు సాధించి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును ఊపిరినిచ్చి ప్రత్యర్థికి గట్టి సవాల్ విసరడంలో తన వంతు పాత్ర పోషించాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ దేశవాళీ టోర్నమెంట్ తుదిపోరులో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది హిమాచల్ ప్రదేశ్ జట్టు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు అపరాజిత్(2 పరుగులు), జగదీశన్(9) సహా సాయి కిషోర్(18), అశ్విన్(7) ఘోరంగా విఫలమయ్యారు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్ అద్భుతమైన సెంచరీతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అతడికి తోడుగా ఇంద్రజిత్ సైతం 80 పరుగులతో రాణించాడు. ఇక షారుఖ్ ఖాన్ సైతం 21 బంతుల్లోనే 42 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఈ క్రమంలో తమిళనాడు 10 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో పంకజ్ జైస్వాల్‌కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కాయి. 💯 for @DineshKarthik! 👏 👏 What a knock this has been from the Tamil Nadu veteran! 🙌 🙌 #HPvTN #VijayHazareTrophy #Final Follow the match ▶️ https://t.co/QdnEKxJB58 pic.twitter.com/8YCXG5aQIy — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 -
అర్ధ సెంచరీతో మెరిసిన దినేష్ కార్తీక్..
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు దినేష్ కార్తీక్ అర్ధసెంచరీతో మెరిశాడు. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు ఆరంభంలో తడబడింది. 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో దినేష్ కార్తీక్, బాబా అపరిజిత్ తమిళనాడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 36 ఓవర్లు ముగిసే సరికి తమిళనాడు 4వికెట్లు కోల్పోయి 163 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో దినేష్ కార్తీక్(68), అపరిజిత్(49) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోంది. చదవండి: SA Vs IND: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. నాలుగేళ్ల తర్వాత అశ్విన్ రీ ఎంట్రీ! -
తమిళనాడుతో హిమాచల్ ప్రదేశ్ ఫైనల్ పోరు... ధావన్ మళ్లీ మెరిసేనా!
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తొలిసారి చాంపియన్‌గా అవతరించాలనే పట్టుదలతో హిమాచల్‌ప్రదేశ్... ఆరోసారి విజేతగా నిలవాలనే లక్ష్యంతో తమిళనాడు... జైపూర్‌లో నేడు జరిగే టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత క్రికెటర్ రిషి ధావన్ నాయకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఫైనల్ చేరిన హిమాచల్ ప్రదేశ్ ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందో లేదో చూడాలి. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ టైటిల్ నెగ్గిన తమిళనాడు మరో టైటిల్‌పై గురి పెట్టింది. బాబా అపరాజిత్, వాషింగ్టన్ సుందర్లతోపాటు చివర్లో మెరుపులు మెరిపించే షారుఖ్‌ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉండటం తమిళనాడుకు సానుకూల అంశం. ఉదయం 9 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి: IND-19 Vs PAK-19: పాక్‌పై చివరి బంతికి ఓడిన భారత్.. -
ధావన్ ఆల్‌రౌండ్ షో.. తొలిసారి ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్
జైపూర్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ జట్టు తొలిసారి... ఐదుసార్లు చాంపియన్ తమిళనాడు జట్టు ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్‌లో హిమాచల్ ప్రదేశ్ 77 పరుగుల ఆధిక్యంతో సర్వీసెస్ జట్టుపై... తమిళనాడు రెండు వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై గెలుపొందాయి. ఫైనల్ రేపు జరుగుతుంది. సర్వీసెస్‌తో జరిగిన సెమీఫైనల్లో హిమాచల్ కెప్టెన్ రిషి ధావన్ ఆల్‌రౌండ్ షో (84; 9 ఫోర్లు, 1 సిక్స్; 4/27) కనబరిచాడు. మొదట హిమాచల్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 281 పరుగులు చేసింది. సర్వీసెస్ 46.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మరో సెమీస్‌లో సౌరాష్ట్ర నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. WHAT. A. WIN!👏 👏 Captain @rishid100 stars with bat and ball as Himachal Pradesh beat Services by 77 runs to march into the #VijayHazareTrophy #Final. 👍 👍 #SF1 #HPvSER Scorecard ▶️ https://t.co/MWsWAq2Q2B pic.twitter.com/tsK7Ua08Mr — BCCI Domestic (@BCCIdomestic) December 24, 2021 -
'సూపర్' వాషింగ్టన్ సుందర్.. ఫైనల్‌కు తమిళనాడు
Tamil Nadu Enters Final Beating Saurashtra In Semi Final-2.. విజయ్ హజారే ట్రోఫీ 2021లో తమిళనాడు ఫైనల్‌కు చేరింది. సౌరాష్ట్రతో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో తమిళనాడు 2 వికెట్లతో విజయాన్ని అందుకుంది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు ఇన్నింగ్ ఆఖరి బంతికి 8 వికెట్లు కోల్పోయి చేధించింది. తమిళనాడు బ్యాటింగ్‌లో ఓపెనర్ బాబా అపరాజిత్(122 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (61 బంతుల్లో 70, 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 5 వికెట్లు తీశాడు. చదవండి: ఆరోన్ ఫించ్ సరికొత్త రికార్డు.. టి20 చరిత్రలో ఆరో బ్యాటర్‌గా ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. వికెట్ కీపన్ షెల్డన్ జాక్సన్(125 బంతుల్లో 134 పరుగులు, 11 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగగా.. వసవదా 57, ప్రేరక్ మన్కడ్ 37 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్ 4, సిలింబరాసన్ 3 వికెట్లు తీశారు. ఇక హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్ మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 77 పరుగులతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్ 26న జరగనున్న ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: Harbhajan Singh Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్ -
సెమీస్‌లో సౌరాష్ట్ర, సర్వీసెస్
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర 7 వికెట్ల తేడాతో విదర్భపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 40.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. అపూర్వ్ వాంఖడే (69 బంతుల్లో 72; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. కెప్టెన్ ఉనాద్కట్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీశాడు. అనంతరం సౌరాష్ట్ర 29.5 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు సాధించింది. సౌరాష్ట్ర 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా... ప్రేరక్ మన్కడ్ (72 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అర్పిత్ వాసవదా (41 నాటౌట్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 116 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. గెలిపించిన రవి చౌహాన్... కేరళతో జరిగిన మరో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన సర్వీసెస్ సెమీస్‌లోకి అడుగు పెట్టింది. ముందుగా కేరళ 40.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. రోహన్ కన్నుమ్మల్ (106 బంతుల్లో 85; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం సర్వీసెస్ 30.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవి చౌహాన్ (90 బంతుల్లో 95; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, రజత్ పలివాల్ (86 బంతుల్లో 65 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. చదవండి: భారత బౌలర్‌పై సచిన్ ప్రశంసల జల్లు.. -
Vijay Hazare Trophy: ప్రేరక్ మన్కడ్ అద్భుత ఇన్నింగ్స్.. సెమీస్‌లో సౌరాష్ట్ర
Saurashtra Won: విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో సౌరాష్ట్ర అదరగొట్టింది. జయదేవ్ ఉనద్కట్ సారథ్యంలోని జట్టు... విదర్భను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ప్రేరక్ మన్కడ్ హాఫ్ సెంచరీ(72 బంతుల్లో 77 పరుగులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా సౌరాష్ట్ర- విదర్భ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర.... 150 పరుగులకే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసింది. జట్టులోని ప్రతి బౌలర్ కనీసం ఒక వికెట్ తీయడం విశేషం. ఈ క్రమంలో 151 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌరాష్ట్ర... ఆదిలోనే విశ్వరాజ్ జడేజా వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ హర్విక్ దేశాయ్(9 పరుగులు) సైతం పూర్తిగా నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షెల్డన్ జాక్సన్ కూడా 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ప్రేరక్ మన్కడ్, అర్పిత్ వాసవడా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వరుసగా 77, 41 పరుగులతో అజేయంగా నిలిచి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర విదర్భపై విజయం సాధించి సెమీస్ చేరుకుంది. విదర్భ బౌలర్లలో ఆదిత్య ఠాక్రేకు రెండు, లలిత్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. అంతకుముందుబ్యాటర్ అపూర్వ్ వాంఖడే హాఫ్ సెంచరీ(72 పరుగులు) చేయడంతో విదర్భ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్కోర్లు: విదర్భ- 150 (40.3) సౌరాష్ట్ర- 151/3 (29.5) DO NOT MISS: Prerak Mankad's match-winning 77* (72) against Vidarbha 👍 👍 The Saurashtra right-hander creamed 10 fours & 2 sixes to power his side to a convincing 7-wicket win in the #QF3 of the #VijayHazareTrophy. 👏 👏 #SAUvVID Watch his knock 🎥 🔽https://t.co/EVS1KXWGgV pic.twitter.com/iAQU5i8iJ9 — BCCI Domestic (@BCCIdomestic) December 22, 2021 -
Vijay Hazare Trophy: 23,1,1,1,18,14,1,0,5,0.. అందరూ చేతులెత్తేశారు.. ఒక్కడే 72!
Sheldon Jackson Super Diving Catch Video Viral: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. సూపర్డైవ్తో విదర్భ బ్యాటర్ అథర్వ టైడ్ పెవిలియన్ చేరేలా చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ-2021 మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా సౌరాష్ట్ర- విదర్భ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విదర్భకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ ఫాజల్ 23 పరుగులు చేయగా.. అతడికి జోడీగా ఓపెనింగ్‌కు దిగిన అథర్వ కేవలం ఒకే ఒక్క పరుగు తీసి వెనుదిరిగాడు. మూడో ఓవర్ మూడో బంతికి జయదేవ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ పాదరసంలా కదిలి డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. ఆ తర్వాత విదర్భ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే అపూర్వ్ వాంఖడే హాఫ్ సెంచరీ(72 పరుగులు)తో రాణించడంతో 40.3 ఓవర్లలో 150 పరుగులు చేసి విదర్భ ఆలౌట్ అయింది. విదర్భ బ్యాటర్ల స్కోర్లు వరుసగా.. 23,1,1,1,18,14,72,1,0,5,0. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్కు 2, చేతన్ సకారియాకు ఒకటి, చిరాగ్ జానీకి 2, ప్రేరక్ మన్కడ్‌కు ఒకటి, డీఏ జడేజాకు రెండు, యువరాజ్ చౌడసమాకు 2 వికెట్లు దక్కాయి. సౌరాష్ట్ర బ్యాటింగ్ కొనసాగిస్తోంది. చదవండి: Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం! ఆ టీమిండియా బ్యాటర్‌కి బౌలింగ్ చేయడం చాలా కష్టం: పాక్ బౌలర్ .@ShelJackson27's superb diving catch 👌 👌 Jackson, keeping the wickets, flew towards his left & completed a stunning catch off @saucricket captain @JUnadkat to dismiss Atharva Taide. 👍 👍 #SAUvVID #VijayHazareTrophy #QF3 Watch that catch 🎥 🔽https://t.co/aqsiKMv4A8 pic.twitter.com/Z0Rah3D6P5 — BCCI Domestic (@BCCIdomestic) December 22, 2021 -
పాపం ప్రశాంత్ చోప్రా 99 అవుట్.. షారుఖ్ 79 నాటౌట్... సెమీస్‌లో ఆ రెండు జట్లు
Vijay Hazare Trophy: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జట్లు సెమీఫైనల్లో ప్రవేశించాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో తమిళనాడు 151 పరుగుల తేడాతో కర్ణాటకపై... హిమాచల్ ప్రదేశ్ ఐదు వికెట్లతో ఉత్తర ప్రదేశ్‌పై గెలిచాయి. కర్ణాటకతో మ్యాచ్‌లో తొలుత తమిళనాడు 50 ఓవర్లలో 8 వికెట్లకు 354 పరుగులు చేసింది. జగదీశన్ (102; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. షారుఖ్ ఖాన్ (39 బంతుల్లో 79 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. మరో క్వార్టర్ ఫైనల్లో ఉత్తర ప్రదేశ్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని హిమాచల్ 45.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రశాంత్ చోప్రా (99; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), హిమాచల్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. చదవండి: ఐపీఎల్-2022కు స్టార్ బౌలర్ దూరం! WHAT. A. WIN! 👍 👍 The @rishid100-led Himachal Pradesh beat Uttar Pradesh by 5 wickets in the #QF1 of the #VijayHazareTrophy & seal a place in the semifinals. 👏 👏 #HPvUP Scorecard ▶️ https://t.co/gXfyqMBD2N pic.twitter.com/MW6Yl0XYkw — BCCI Domestic (@BCCIdomestic) December 21, 2021 -
39 బంతుల్లో 79.. పంజాబ్ కింగ్స్ వదులుకొని తప్పుచేసింది
విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో భాగంగా తమిళనాడు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. 355 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలి 151 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. ఓపెనర్ ఎన్ జగదీషన్ (102 పరుగులు) సెంచరీ సాధించగా.. చివర్లో షారుక్ ఖాన్ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు.39 బంతుల్లోనే 79 పరుగులు చేసిన షారుక్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. చదవండి: LPL 2021: ఆమిర్.. ఎక్కడున్నా ఇవే కవ్వింపు చర్యలా! తాజాగా షారుక్ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తన్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం తెగ బాధపడిపోతుంది. ఎందుకంటే ఇటీవలే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ రిటైన్ జాబితాలో షారుక్ ఖాన్‌కు అవకాశం లభించలేదు. కానీ షారుక్ ఖాన్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో వరుస అర్థశతకాలతో తన విలువేంటో చూపించాడు. షారుక్ ఖాన్ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్‌ను వదులుకొని పంజాబ్ కింగ్స్ తప్పుచేసిందని క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఇక ఫిబ్రవరిలో జరగనున్న మెగా వేలంలో షారుక్ ఖాన్‌ను దక్కించుకోవడానికి ఆయా ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది. చదవండి: Vijay Hazare Trophy 2021: జట్టు మొత్తం స్కోరు 200.. ఒక్కడే 109 బాదాడు -
‘యశ్’లు అదరగొట్టారు... ఒకరు 4 వికెట్లు తీస్తే.. మరొకరు 57 పరుగులు చేసి..
Yash Thakur: విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో విదర్భ జట్టు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో విదర్భ 34 పరుగులతో త్రిపురపై నెగ్గింది. విదర్భ 50 ఓవర్లలో 7 వికెట్లకు 258 పరుగులు చేయగా... త్రిపుర జట్టు 224 పరుగులకు ఆలౌటైంది. విదర్భ పేసర్ యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యశ్ రాథోడ్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రాజస్తాన్‌పై కర్ణాటక... మధ్యప్రదేశ్‌పై ఉత్తరప్రదేశ్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. స్కోర్లు: విదర్భ: 258/7 (50) త్రిపుర: 224 (49.3) చదవండి: IND Vs SA: ఓవర్‌లోడ్ బ్యాగ్ మోసుకుని వెళ్లిన కోహ్లి.. దాంట్లో ఏముంది! Rishabh Pant: రిషభ్‌పంత్‌కు లక్కీ ఛాన్స్.. ఫోన్ చేసి చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి DO NOT MISS: Yash Thakur's match-winning 4/45 👏 👏 The pacer was the pick of the Vidarbha bowlers and guided his team to a victory over Tripura. 👍 👍 #VIDvTPA #PQF1 #VijayHazareTrophy Watch his 4⃣-wicket haul 🎥 🔽https://t.co/b1aNytDoRW pic.twitter.com/DDwK8aMQI6 — BCCI Domestic (@BCCIdomestic) December 19, 2021 -
ఒడిశా ఆటగాడికి బంఫర్ ఆఫర్.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు!
ఒడిశా ఆటగాడు సుభ్రాంశు సేనాపతికి బంఫర్ ఆఫర్ తగిలింది. ఢిపిండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వచ్చే సీజన్‌కు ముందు ట్రయల్స్ కోసం ఒడిశా బ్యాటర్ సుభ్రాంశు సేనాపతికి పిలుపునిచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో సుభ్రాంశు సేనాపతి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన 7మ్యాచ్‌ల్లో 275 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో ఒడిశా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా అంతకుముందు జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలోను అద్బుతంగా రాణించాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన సేనాపతి 138 పరుగులు సాధించాడు. ఇక సీఎస్కే విషయానికి వస్తే.. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను రీటైన్ చేసుకుంది. జట్టులో అత్యధికంగా రవీంద్ర జడేజాను 16 కోట్లకు రిటైన్ చేసుకుంది. కెప్టెన్ ఎంఎస్ ధోనిని 12 కోట్లకు, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ, భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌లను 8 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. చదవండి: Ashes Series 2021: వార్నర్ నువ్వు గ్రేట్.. నొప్పి బాదిస్తున్నా -
జట్టు మొత్తం స్కోరు 200.. ఒక్కడే 109 బాదాడు
జైపూర్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కర్ణాటక, రాజస్తాన్ మధ్య జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ పోరులో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లు ఆడకుండానే 41.4 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. ఇక్కడ విశేషమేమిటంటే జట్టు మొత్తం కలిపి 199 పరుగులు చేస్తే అందులో కెప్టెన్ అయిన దీపక్ హుడా ఒక్కడే 109 పరుగులు బాదాడు. దీన్ని బట్టే రాజస్తాన్ బ్యాటింగ్ వైఫల్యం ఏంటనేది స్పష్టంగా తెలుస్తోంది. దీపక్ హుడా తర్వాత సమర్పిత్ జోషి 33 పరుగులు చేశాడు. మిగతావారిలో ఏడుగురు బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కర్ణాటక బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, కృష్ణప్ప గౌతమ్ 2 వికెట్లు తీశారు. ఇక కర్ణాటక విజయలక్ష్యం 201 పరుగులు కాగా ప్రస్తుతం 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. -
విజయ్ హజారే ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ లక్ష్యంగా...
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ సమరానికి వేళయింది. లీగ్ దశలో ప్రతి గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఐదు జట్లు (విదర్భ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్)... ప్లేట్ గ్రూప్ టాపర్ త్రిపుర మధ్య నేడు మూడు ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో త్రిపురతో విదర్భ... రెండో మ్యాచ్‌లో కర్ణాటకతో రాజస్తాన్... మూడో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో ఉత్తర్‌ప్రదేశ్ ఆడతాయి. విజేత జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన వెంకటేశ్ అయ్యర్ మధ్యప్రదేశ్ తరఫున ఆడనున్నాడు. లీగ్ దశలో గ్రూప్ టాపర్లుగా నిలిచిన హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, సౌరాష్ట్ర, కేరళ, సర్వీసెస్ జట్లు నేరుగా క్వార్టర్స్ చేరుకున్నాయి. -
4 సెంచరీలు... 603 పరుగులు... సంచలన ఇన్నింగ్స్.. అయినా దురదృష్టమే!
Ruturaj Gaikwad: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. వరుస సెంచరీలతో రికార్డు సృష్టించి దిగ్గజాల సరసన చేరాడు. ఈ టోర్నీలో మొత్తంగా ఐదు ఇన్నింగ్స్‌లో 603 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. సారథిగా కూడా మంచి మార్కులే కొట్టేసినా.. జట్టును ఫైనల్ వరకు చేర్చలేకపోయాడు. ఐదింట నాలుగు విజయాలు సాధించినప్పటికీ... రన్‌రేటు తక్కువగా ఉన్న కారణంగా ఎలైట్ గ్రూపు డీలో మూడో స్థానానికే పరిమితమైంది మహారాష్ట్ర. దీంతో... నాకౌట్ దశకు చేరుకుండానే నిష్క్రమించింది. ఈ విషయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్ విచారం వ్యక్తం చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘నాకౌట్ దశకు క్వాలిఫై కూడా కాకపోవడం తీవ్రంగా బాధించింది. ఐదింట నాలుగు మ్యాచ్‌లలో గెలిచాం. మిగతా గ్రూపులలో ఐదింట మూడు మాత్రమే గెలిచిన జట్లు (హిమాచల్, విదర్భ, తమిళనాడు, కర్ణాటక) కూడా తదుపరి రౌండ్‌కు చేరుకున్నాయి’’ అని రుతు పేర్కొన్నాడు. అదే విధంగా కేరళ చేతిలో ఓటమి గురించి చెబుతూ... ‘‘క్రికెట్లో ఇలాంటివి సహజం. కేరళ బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ఏడో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేశారు. వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. రన్‌రేటు పరంగా మేము వెనుకబడ్డాం. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ ఎంచుకోవాల్సింది. కానీ అలా జరగలేదు. దురదృష్టవశాత్తూ కొన్నిసార్లు ఇలాంటి జరుగుతూ ఉంటాయి’’ అని రుతురాజ్ పేర్కొన్నాడు. ఇక తన సూపర్ ఫామ్ గురించి మాట్లాడుతూ... ‘‘ఇందులో సీక్రెట్ ఏమీ లేదు. కేవలం ఆటపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నాను’’ అని నవ్వులు చిందించాడు. చదవండి: కోహ్లికే కాదు.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. కపిల్‌దేవ్ సంచలన వాఖ్యలు Ruturaj gaikwad brings his 150 Highest individual score in Vijay hazare 2021#VijayHazareTrophy #VijayHazareTrophy2021 #RuturajGaikwad #csk #IndvsSA pic.twitter.com/5rE8QFMrDl — WORLD TEST CHAMPIONSHIP NEWS (@RISHItweets123) December 9, 2021 1⃣5⃣4⃣* Runs 1⃣4⃣3⃣ Balls 1⃣4⃣ Fours 5⃣ Sixes@Ruutu1331 was at his fluent best and scored his second successive hundred of #VijayHazareTrophy. 👏 👏 #CHHvMAH Watch his fantastic knock 🎥 🔽https://t.co/GcN3lB3gKC pic.twitter.com/wQ1GDPHeWf — BCCI Domestic (@BCCIdomestic) December 9, 2021 -
ఆడిన 5 మ్యాచ్‌లలో రెండే విజయాలు.. టోర్నీ నుంచి అవుట్!
Hyderabad Out Of Vijay Hazare Trophy: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌లలో 2 మాత్రమే గెలిచింది. తద్వారా ఎలైట్ గ్రూప్ ‘సి’లో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించింది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో జార్ఖండ్ చేతిలో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ జట్టు 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ పేసర్ సీవీ మిలింద్ 63 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం హైదరాబాద్ 48.4 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. తద్వారా ఓటమి మూటగట్టుకుని పరాజయంతోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: Srikar Bharat: 138 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్స్‌లతో 156.. ప్చ్.. గెలిచినా నిరాశే! -
Srikar Bharat: 16 ఫోర్లు, 7 సిక్స్‌లతో 156.. ప్చ్.. గెలిచినా నిరాశే!
Srikar Bharat Scored 156 Runs In 138 Balls: కెప్టెన్ కోన శ్రీకర్ భరత్ మరో అద్భుత సెంచరీతో జట్టుకు విజయం అందించినా... రన్‌రేట్‌లో వెనుకబడటంతో విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు పోరాటం ముగిసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గుజరాత్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 81 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 253 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్స్‌లతో 158 పరుగులు సాధించి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. గిరినాథ్ రెడ్డి (34; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి భరత్ ఏడో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. అనంతరం గుజరాత్ జట్టు 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆంధ్ర బౌలర్లలో జి.మనీశ్ నాలుగు, గిరినాథ్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. ఆరు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక హిమాచల్‌ప్రదేశ్, విదర్భ, ఆంధ్ర, ఒడిశా జట్లు మూడు విజయాలతో 12 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధా రంగా హిమాచల్‌ప్రదేశ్ (+0.551), విదర్భ (+0.210) నాకౌట్ దశకు అర్హత పొందాయి. ఆంధ్ర (+0.042) మూడో స్థానంలో, ఒడిశా (–0.200) నాలుగో స్థానంలో నిలిచాయి. చదవండి: LPL 2021: 6 బంతుల్లో ఐదు సిక్సర్లు.. వీడియో వైరల్ Ruturaj Gaikwad: సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్.. తాజా ఫీట్‌తో కోహ్లి సరసన -
సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్.. తాజా ఫీట్‌తో కోహ్లి సరసన
Ruturaj Gaikwad Smashes 4th Century Vijay Hazare Trophy 2021.. సీఎస్కే స్టార్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. మహారాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు బాదిన రుతురాజ్ తాజాగా చండీఘర్‌తో ముగిసిన లీగ్ మ్యాచ్‌లో మరో సెంచరీతో మెరిశాడు. 95 బంతుల్లో 100 పరుగులు చేసిన రుతురాజ్‌కు.. తాను ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. చదవండి: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం... ఈ సెంచరీతో విజయ్ హజారే ట్రోఫీలో 500 పరుగులు పూర్తి చేసిన రుతురాజ్ ఒక రికార్డును అందుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు చేసిన వారిలో విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, పృథ్వీ షాలు మాత్రమే ఉన్నారు. తాజాగా వీరి సరసన రుతురాజ్ గైక్వాడ్ చేరాడు. విజయ్ హజారే ట్రోఫీ ద్వారా తన పరుగుల దాహాన్ని తర్చుకుంటున్న రుతురాజ్ ప్రస్తుతం సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారాడు. రుతురాజ్‌ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న కోరుతున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసేలోపు రుతురాజ్ పేరును టీమిండియాలో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చదవండి: Martin Coetzee: 21 బంతుల్లోనే సెంచరీ.. టీమిండియా బతికిపోయింది మ్యాచ్ విషయానికి వస్తే.. లీగ్‌లో మహారాష్ట్ర మరో విజయాన్ని దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చంఢీఘర్ నిర్ణతీ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. కెప్టెన్ మనన్ వోహ్రా (139 బంతుల్లో 141, 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత సెంచరీతో మెరవగా.. అర్స్లాన్ ఖాన్ 87, అంకిత్ కౌషిక్ 56 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 48.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రుతురాజ్ గైక్వాడ్(132 బంతుల్లో 168 పరుగులు, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) మరో అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో అజిమ్ కాజీ 73 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం రుతురాజ్ 5 మ్యాచ్‌ల్లో 603 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. -
విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం..
KS Bharat Slams Century In Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో దేశీయ ఐపీఎల్ స్టార్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఈ దేశవాళీ టోర్నీలో ఐపీఎల్ 2021 ఆరెంజ్ క్యాప్ హోల్డర్, మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(సీఎస్కే) హ్యాట్రిక్ సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు, మధ్యప్రదేశ్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ రెండు సూపర్ శతకాలతో శివాలెత్తాడు. తాజాగా ఆర్సీబీ ఆటగాడు, ఆంధ్రా బ్యాటర్ కేఎస్ భరత్ సైతం భారీ శతకం(161) సాధించి.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు సత్తా చాటాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్ 109 బంతుల్లో 16 బౌండరీలు, 8 సిక్సర్ల సాయంతో 161 పరుగులు సాధించాడు. భరత్ తాజా ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అతనిపై కన్నేశాయి. గత ఐపీఎల్ వేలంలో బేస్ ధర రూ.20 లక్షలు మాత్రమే పలికిన భరత్(ఆర్సీబీ).. తాజా ప్రదర్శనతో భారీ ధర పలికే అవకాశం ఉంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రసవత్తర పోరులో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టుకు విజయాన్నందించిన ఈ ఆంధ్రా కుర్రాడు ఒక్క మ్యాచ్‌తో హీరోగా మారిపోయాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ అయిన భరత్.. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సాహా గైర్హాజరీలో టీమిండియా తాత్కాలిక వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టాడు. చదవండి: Venkatesh Iyer: శతక్కొట్టాక రజనీ స్టైల్లో ఇరగదీశాడు.. -
Venkatesh Iyer: శతక్కొట్టాక రజనీ స్టైల్లో ఇరగదీశాడు..
Rajinikanth Birthday: సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ జన్మదినాన్ని(డిసెంబర్ 12) పురస్కరించుకుని టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఛాతీపై టాటూ వేసుకుని వినూత్న శైలిలో శుభాకాంక్షలు తెలుపగా.. ఐపీఎల్ 2021 స్టార్ వెంకటేశ్ అయ్యర్ తనదైన శైలిలో తలైవాకు బర్త్ డే విషెస్ చెప్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో భాగంగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన(151) అయ్యర్.. ఆ ఫీట్‌ను సాధించగానే రజనీ స్టైల్లో సెల్యూట్ చేసి, గ్లాసెస్ పెట్టుకున్నట్లు ఇమిటేట్ చేశాడు. Our Sunday couldn't get any better! 😍 Can you decode @ivenkyiyer2512's celebration? 🤔#VijayHazareTrophy #MPvUTCA #KKR #AmiKKR #CricketTwitterpic.twitter.com/7wpLMKEJ44 — KolkataKnightRiders (@KKRiders) December 12, 2021 ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, బాషా సినిమాలో రజనీ కళ్లద్దాలను స్టైల్ గా తిప్పుతూ పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. ఇది రజనీకి ఐకానిక్ స్టైల్‌గా మారడమే కాకుండా.. సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ చేసింది. నేను తలైవా వీరాభిమానిననే.. వెంకటేశ్ అయ్యర్ రజనీకాంత్‌కు వీరాభిమాననంటూ గతంలో ఓ సందర్భంగా చెప్పాడు. తాను తలైవా భక్తుడినని.. ఆయన సినిమాలన్నీ తప్పక చూస్తానని.. రజనీ ఓ లెజెండ్ అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ చెప్పాడు. ఇదిలా ఉంటే, విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తాజాగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ 113 బంతుల్లో 151 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో వెంకటేశ్ అయ్యర్‌కు భారత వన్డే జట్టు(దక్షిణాఫ్రికా పర్యటన) నుంచి పిలుపు రావడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: టీమిండియా క్రికెటర్ ఛాతిపై రజనీకాంత్ టాటూ.. -
India tour of South Africa: వన్డే జట్టులోకి వెంకటేశ్ అయ్యర్!
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు మరో బంపరాఫర్ తగిలే అవకాశం ఉంది. దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్ అయ్యర్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో మెరిసిన అయ్యర్ తాజాగా నాలుగో మ్యాచ్‌లో మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. చత్తీస్‌ఘర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ 133 బంతుల్లో 151 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. చదవండి: Vijay Hazare Trophy: రుతురాజ్ హ్యాట్రిక్ సెంచరీ.. దుమ్మురేపుతున్న మహారాష్ట్ర తాజా ప్రదర్శనతో వెంకటేశ్ అయ్యర్.. సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో బీసీసీఐ త్వరలో ఎంపిక చేయనున్న వన్డే టీమ్‌లో ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ద్వారా టీమిండియాలో అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ త్వరలో వన్డే జట్టులోనూ ఆడే అవకాశం లభించనుంది. ఒకవేళ వెంకటేశ్ అయ్యర్ దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపికై రాణిస్తే ఆల్‌రౌండర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నట్లే. ఇక ఇటీవలీ కాలంలో వెంకటేశ్ అయ్యర్ ప్రదర్శన చూసుకుంటే.. ►ఐపీఎల్ 2021 సీజన్: 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు, 3 వికెట్లు ►సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: 5 మ్యాచ్‌లు 155 పరుగులు.. 5 వికెట్లు ►ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టి20 సిరీస్: 3 మ్యాచ్‌ల్లో 36 పరుగులు.. 1 వికెట్ ►విజయ్ హజారే ట్రోఫీ: ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 348 పరుగులు.. 6 వికెట్లు 1⃣0⃣0⃣ up & going strong! 💪 💪@ivenkyiyer2512 continues his superb run of form. 👏 👏 #MPvUTCA #VijayHazareTrophy pic.twitter.com/iiow2ATC2n — BCCI Domestic (@BCCIdomestic) December 12, 2021 -
ధోని తర్వాత సీఎస్కేకు కెప్టెన్ అయ్యేది ఆ ఆటగాడే!
CSK Next Captain Ruturaj Gaikwad After MS Dhoni: రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే హాట్రిక్ సెంచరీలు బాదిన రుతురాజ్.. అటు కెప్టెన్‌గానూ మహారాష్ట్రను విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే ఫ్యాన్స్ రుతురాజ్ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తూ ధోని తర్వాత కెప్టెన్‌గా రుతురాజ్ సరైనోడని అభిప్రాయపడుతున్నారు. చదవండి: రుతురాజ్ హ్యాట్రిక్ సెంచరీ.. దుమ్మురేపుతున్న మహారాష్ట్ర ''రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ధోని బాయ్ తర్వాత సీఎస్కేకు రుతురాజ్ కెప్టెన్ అయితే బాగుంటుంది.. మహారాష్ట్రను విజయవంతంగా నడుపుతున్న రుతురాజ్.. సీఎస్కేకు కెప్టెన్‌గా వ్యవహరిస్తే అదే ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. సౌతాఫ్రికా టూర్‌కు రుతురాజ్‌ను ఎంపికచేస్తే చూడాలనుంది'' అంటూ కామెంట్స్ చేశారు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 136, 154*, 124 పరుగులు చేసి 435 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో రుతురాజ్ టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 16 మ్యాచ్‌లాడిన రుతురాజ్ 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలవడంతో సీఎస్కే నాలుగో ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: BBL 2021: కొలిన్ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 27వ సెంచరీ Wake Up ✅ Pad Up ✅ R🦁AR ✅ RUTeen Status: 💯#VijayHazareTrophy #WhistlePodu 💛 pic.twitter.com/HirbDAhDEm — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) December 11, 2021 RUTU RAAJ.!#WhistlePodu #Yellove 🦁💛 — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) December 11, 2021 Want to see Ruturaj Gaikwad in the SA tour.!He has been sensational since the IPL.!And excited to see him open the innings with Rohit atleast one innings.! — Deep Point (@ittzz_spidey) December 11, 2021 -
Vijay Hazare Trophy: రుతురాజ్ హ్యాట్రిక్ సెంచరీ.. దుమ్మురేపుతున్న మహారాష్ట్ర
రాజ్‌కోట్: మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా మూడో శతకం బాదాడు. కేరళతో మ్యాచ్‌లో అతను సెంచరీ (124; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సాధించాడు. రుతురాజ్ తొలి మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై (136)... రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌పై (154 నాటౌట్) సెంచరీలు చేశాడు. కేరళతో మ్యాచ్‌లో రుతురాజ్ ప్రదర్శన మహారాష్ట్ర గెలవడానికి సరిపోలేదు. ఈ మ్యాచ్‌లో కేరళ నాలుగు వికెట్లతో నెగ్గింది. తొలుత మహారాష్ట్ర 8 వికెట్లకు 291 పరుగులు చేయగా... కేరళ 48.5 ఓవర్లలో 6 వికెట్లకు 294 పరుగులు సాధించింది. విష్ణు వినోద్ (100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కేరళను గెలిపించాడు. మొహాలి: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో రెండు వరుస విజయాల తర్వాత హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 49 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. టి.రవితేజ (86 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. కొల్లా సుమంత్ (32) ఫర్వాలేదనిపించాడు. సౌరాష్ట్ర బౌలర్ ప్రేరక్ మన్కడ్ (4/54) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం సౌరాష్ట్ర 39 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు సాధించింది. హార్విక్ దేశాయ్ (108 బంతుల్లో 101 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, షెల్డన్ జాక్సన్ (64 బంతుల్లో 65; 10 ఫోర్లు, 1 సిక్స్), ప్రేరక్ మన్కడ్ (50 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచారు. -
సెంచరీల మోత మోగిస్తున్న రుతురాజ్ గైక్వాడ్
సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు నాయకత్వం వహిస్తున్న రుతురాజ్ వరుసగా మూడో సెంచరీ సాధించాడు. కేరళతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రుతురాజ్ 110 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 129 పరుగులు చేసిన రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రుతురాజ్‌కు తోడుగా రాహుల్ త్రిపాఠి(108 బంతుల్లో 99 పరుగులు , 11 ఫోర్లు) రాణించడంతో మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కేరళ ముందు 292 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా రుతురాజ్ ఇంతకముందు మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (112 బంతుల్లో 136 పరుగులు), చత్తీస్‌ఘర్‌తో మ్యాచ్‌లో (143 బంతుల్లో 154 పరుగులు నాటౌట్) మెరిశాడు. చదవండి: Vijay Hazare Trophy: సెంచరీలతో చెలరేగిన రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్ కాగా రుతురాజ్ ఇంతకముందు మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (112 బంతుల్లో 136 పరుగులు), చత్తీస్‌ఘర్‌తో మ్యాచ్‌లో (143 బంతుల్లో 154 పరుగులు నాటౌట్) మెరిశాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో 635 పరుగులతో రుతురాజ్ టాప్ స్కోరర్‌గా నిలిచి సీఎస్కే టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ మెగావేలానికి ముందు సీఎస్కే తన రిటైన్ జాబితాలో జడేజా, ధోని, మొయిన్ అలీలతో పాటు రుతురాజ్‌ను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు -
'విజయ్ హజారే, బీబీఎల్, ఎల్పీఎల్పై కన్నేసి ఉంచండి'
IPL Scouts Keep Eyes On Vijay Hazare, BBL 2021 & LPL 2021.. జనవరిలో ఐపీఎల్ మెగావేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్ జాబితాను కూడా ప్రకటించాయి. ఇక వచ్చే ఐపీఎల్‌కు అహ్మదాబాద్, లక్నోల రూపంలో కొత్త ఫ్రాంచైజీలు రానుండడంతో మెగావేలంపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయా ఫ్రాంచైజీలు తమకు సమాచారం అందించే స్కౌట్స్‌కు పెద్ద పని అప్పజెప్పింది. మెగావేలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ, బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021), లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)పై ఒక కన్నేసి ఉంచాలని తెలిపాయి. జై రిచర్డ్సన్(రూ.14 కోట్లు, పంజాబ్ కింగ్స్) భారీ హిట్టింగ్ చేస్తూ మ్యాచ్‌లను గెలిపించే యువ ఆటగాళ్లను వెతికి పట్టుకోవాలని.. వారిని వేలంలో దక్కించుకోవడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు రచించాలని ఆయా ఫ్రాంచైజీలు కోరాయి. ఇంతకముందు కూడా జై రిచర్డ్సన్, రిలే మెరిడిత్ లాంటి ఆటగాళ్లు బీబీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. ఇక విజయ్ హజారే ట్రోపీ ద్వారా పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ లాంటి వారికి గుర్తింపు రావడం.. ఆ తర్వాత ఐపీఎల్లో దుమ్మురేపడం చూశాం. ఇక టి20 ప్రపంచకప్ 2021లో హ్యాట్రిక్‌తో మెరిసిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ ప్రస్తుతం ఎల్పీఎల్లో బిజీగా ఉన్నాడు. అతనితో పాటు మరికొంతమంది ఆటగాళ్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. -
సెంచరీలతో చెలరేగిన రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్
Ruturaj Gaikwad And Venkatesh Iyer Smash Centuries Vijay Hazare Trophy.. దేశవాలీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్లు దుమ్మురేపారు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరపున కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ మెరుపు సెంచరీతో ఆకట్టుకోగా.. మహారాష్ట్ర తరపున కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాధించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ 2021 సీజన్లో రుతురాజ్ సీఎస్కే తరపున ఆడగా.. వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రుతురాజ్‌ను(రూ.6 కోట్లు) సీఎస్కే రిటైన్ చేసుకోగా.. వెంకటేశ్ అయ్యర్‌ను(రూ.8 కోట్లు) కేకేఆర్ తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. చదవండి: Rohit Sharma: ఒకప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్.. త్వరలోనే టెస్టులకు కూడా! మ్యాచ్‌ల విషయానికి వస్తే.. మహారాష్ట్ర, చత్తీస్‌ఘర్ పోరులో.. తొలుత బ్యాటింగ్ చేసిన చత్తీస్‌ఘర్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మహారాష్ట్రను రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో నడించాఇ మ్యాచ్‌లో రుతురాజ్ 143 బంతుల్లో 154 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతని దాటికి మహారాష్ట్ర 47 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. కాగా రుతురాజ్‌కు ఈ సీజన్లో రెండో సెంచరీ కావడం విశేషం. మరోవైపు కేరళతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ ఇన్నింగ్స్‌లో వెంకటేశ్ అయ్యర్(84 బంతుల్లో 112, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభమ్ శర్మ(67 బంతుల్లో 82, 9 ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కేరళ 49.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: Vijay Hazare Trophy: హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం.. ఆంధ్రకు మాత్రం -
హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం.. ఆంధ్రకు మాత్రం
మొహాలీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ సెంచరీ (123 బంతుల్లో 139; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు)తో కదం తొక్కాడు. ఫలితంగా గురువారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీపై 79 పరుగుల భారీ తేడాతో హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. టోర్నీలో హైదరాబాద్‌కు వరుసగా ఇది రెండో విజయం. ఎనిమిది పాయింట్లతో హైదరాబాద్ గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 325 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ ఢల్లీ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించాడు. అతడికి చందన్ సహాని (74 బంతుల్లో 87; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కూడా భారీ సిక్సర్లతో చెలరేగారు. తిలక్, సహాని నాలుగో వికెట్‌కు 152 పరుగులు జోడించడంతో హైదరాబాద్ భారీ స్కోరును అందుకుంది. ఛేదనలో ఢిల్లీ 50 ఓవర్లలో 9 వికెట్లకు 246 పరు గులు చేసి ఓడింది. హిమ్మత్ సింగ్ (65 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. శిఖర్ ధావన్ (12) విఫలమయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లు తీశాడు. ముంబై: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఆంధ్రపై 8 వికెట్ల తేడాతో విదర్భ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. ఓపెనర్ సీఆర్ జ్ఞానేశ్వర్ (126 బంతుల్లో 93; 7 ఫోర్లు) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అంబటి రాయుడు (49 బంతుల్లో 53; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... చివర్లో పిన్నింటి తపస్వి (25 బంతుల్లో 45; 6 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ శ్రీకర్ భరత్ (18), రికీ భుయ్ (21) భారీ స్కోర్లు సాధించలేకపోయారు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్, ఆదిత్య సర్వతే చెరో మూడు వికెట్లు తీశారు. ఛేదనలో విదర్భ 41.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ అథర్వ (123 బంతుల్లో 164 నాటౌట్; 15 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడు గణేశ్ సతీశ్ (53 బంతుల్లో 43; 3 ఫోర్లు)తో రెండో వికెట్‌కు 118 పరుగులు... యశ్ రాథోడ్ (48 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు మరో 118 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించాడు. -
Vijay Hazare Trophy: తన్మయ్ అగర్వాల్ మెరుపులు. హైదరాబాద్ శుభారంభం
మొహాలీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. హరియాణాతో బుధవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (4/23), రవితేజ (3/23) ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హరియాణా 39.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్ 41 ఓవర్లలో ఐదు వికెట్లకు 167 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (77 నాటౌట్; 5 ఫోర్లు), కొల్లా సుమంత్ (20), తనయ్ (18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్ ఆడుతుంది. -
దేశవాళీ వన్డే విజేతను తేల్చేందుకు...
ముంబై: భారత క్రికెట్ దేశవాళీ సీజన్ 2021–22లో మరో ప్రధాన టోర్నీకి రంగం సిద్ధమైంది. ఇటీవలే ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టి20ల్లో సత్తా చాటిన ఆటగాళ్లు ఇప్పుడు వన్డే క్రికెట్లో తమ విలువేంటో చూపించేందుకు సన్నద్ధమయ్యారు. నేటి నుంచి జరిగే వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం 38 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. దేశంలోనే ఏడు వేదికల్లో (ముంబై, జైపూర్, రాంచీ, చండీగఢ్, రాజ్‌కోట్, తిరువనంతపురం, గువహటి)లలో మ్యాచ్‌లు జరుగుతాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై, మరో పెద్ద జట్టు తమిళనాడు మధ్య జరిగే తొలి పోరుతో టోర్నీ మొదలవుతుంది. కొన్నాళ్ల క్రితమే ముస్తాక్ అలీ టి20 టోర్నీని నెగ్గిన తమిళనాడు అమితోత్సాహంతో ఉంది. భారత సీనియర్ జట్టులో సభ్యులుగా ఉన్నవారు కాకుండా పలువురు గుర్తింపు పొందిన క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీలో ఆయా జట్ల తరఫున కీలకపాత్ర పోషించనున్నారు. హర్షల్ పటేల్, రాహుల్ చహర్, దీపక్ చహర్, యశస్వి జైస్వాల్, దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, అంబటి తిరుపతి రాయుడు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 38 జట్లను ఎలైట్.. ప్లేట్ గ్రూప్‌లుగా విభజించారు. ఎలైట్ ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’, ‘ఇ’ గ్రూప్‌లలో ఆరు జట్లు చొప్పున ఉన్నాయి. మరో ఎనిమిది జట్లతో ప్లేట్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఐదు ఎలైట్ గ్రూప్‌ల నుంచి ‘టాప్’లో నిలిచిన ఐదు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇవే గ్రూప్‌లలో రెండో స్థానంలో నిలిచిన ఐదు జట్లు... ప్లేట్ గ్రూప్ టాపర్ (మొత్తం ఆరు జట్లు) మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. డిసెంబర్ 27న ఫైనల్ జరుగుతుంది. ఎలైట్ ‘ఎ’ గ్రూప్‌లో ఆంధ్ర... ఎలైట్ ‘సి’ గ్రూప్‌లో హైదరాబాద్ ఉన్నాయి. హైదరాబాద్ జట్టు: తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హిమాలయ్, అలంకృత్, అతుల్ వ్యాస్, భవేశ్ సేథ్, మికిల్ జైస్వాల్, కవిన్ గుప్తా, త్రిషాంక్ గుప్తా, చందన్ సహాని, తనయ్ త్యాగరాజన్, అజయ్‌దేవ్ గౌడ్, గౌతమ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, టి. రవితేజ, అక్షత్ రెడ్డి, కొల్లా సుమంత్, తిలక్ వర్మ, సీవీ మిలింద్, రాహుల్ బుద్ధి, అబ్దుల్ ఖురేషీ, అద్నాన్ అహ్మద్, మొహమ్మద్ అఫ్రిది. -
T.Natarajan: అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా
T.Natarajan Ruled Out Of Vijay Hazare Trophy Due To Knee Injury.. తమిళనాడు ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా కనిపిస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి గాయాల బెడద అతన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా మోకాలి గాయం మరోసారి తిరగబెట్టడంతో దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ కి నటరాజన్ దూరమయ్యాడు. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ గెలిచిన తమిళనాడు జట్టులో సభ్యుడిగా ఉన్న నటరాజన్ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్‌కు దూరంగా ఉన్నప్పటికి.. ఫైనల్లో ఆడాడు. తమిళనాడు టైటిల్ గెలిచిన అనంతరం అతను చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. '' మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టడంతో టోర్నీకి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నటరాజన్ రీహాబిటేషన్ కోసం ఎన్సీఏ అకాడమీకి వెళ్లనున్నాడు. చదవండి: Dinesh Karthik: మళ్లీ తిరిగి జట్టులోకి దినేష్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్ ఇక తమిళనాడు పేసర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన నటరాజన్.. 2020-21 ఆసీస్ టూర్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న నట్టూ ఆసీస్ గడ్డపై అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. ఇక నట్టూ తనదైన ప్రదర్శనతో మెప్పించాడు. యార్కర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అతను స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కీలకమవుతాడని భావించారు. ఇంగ్లండ్‌తో తొలివన్డే ఆడిన తర్వాత మొకాలి గాయం నటరాజన్‌ను టీమిండియాకు దూరం చేసింది. అంతే అప్పటినుంచి నటరాజన్ మళ్లీ టీమిండియాకు ఆడలేకపోయాడు. మోకాలి సర్జరీ అనంతరం మళ్లీ మైదానంలో అడుగుపెట్టినప్పటికీ గాయాల బెడద మాత్రం వీడలేదు. ఐపీఎల్ 2021 సీజన్ తొలి అంచె పోటీలకు దూరంగా ఉన్న నట్టూ ఆ తర్వాత రెండో అంచె పోటీల్లోనే పెద్దగా ఆడలేకపోయాడు. అలా ఒక టోర్నీలో ఆడాడో లేదో మళ్లీ గాయపడడం అతని అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. చదవండి: ICC T20 Rankings: విరాట్ కోహ్లి ఔట్.. కేఎల్ రాహుల్ ఒక్కడే -
పృథ్వీ షాను ఆపతరమా!
న్యూఢిల్లీ: ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ అంటేనే బాగా గుర్తుకువచ్చే ప్రదర్శన పృథ్వీ షాదే. ఈ ముంబై కుర్రాడు దేశవాళీ టోర్నీలో (105 నాటౌట్, 227 నాటౌట్, 185 నాటౌట్, 165)... ఇలా ‘శత’చితగ్గొట్టి 754 పరుగులు చేశాడు. ఇలాంటి విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఫైనల్లో మాత్రం ఊరుకుంటాడా! అందుకే ఆదివారం జరిగే ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు అతని రూపంలో పెద్ద సవాల్ ఎదురవుతోంది. ముంబై జట్టునంతటిని ఎదుర్కోవడం కంటే పృథ్వీ షాను నిలువరించడంపైనే దృష్టి పెట్టింది. ఆస్ట్రేలియా పర్యటనలో వైఫల్యం దరిమిలా ఫిట్నెస్ సమస్యలతో తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయిన పృథ్వీ షా విజయ్ హజారే టోర్నీని తన పునరాగమన వేదికగా చేసుకున్నట్లున్నాడు. అందుకే ఎదురైన ప్రత్యర్థులపై చెలరేగిపోయాడు. మరోవైపు ఉత్తరప్రదేశ్ (యూపీ) కోచ్ జ్ఞానేంద్ర పాండే మార్గదర్శనంలో జట్టు నిలకడైన విజయాలతో మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. యువ కెప్టెన్ కరణ్ శర్మ జట్టును నడిపిస్తున్న తీరు బాగానే ఉన్నా... ముంబై ఓపెనర్ కట్టడే లక్ష్యంగా ఫైనల్ బరిలోకి దిగాల్సి ఉంది. కెప్టెన్‌తో పాటు వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్, అ„Š దీప్ నాథ్ ఈ జాతీయ టోర్నీలో ఆకట్టుకున్నారు. యూపీ బౌలర్లు శ్రమించి పృథ్వీ షాతో పాటు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్, ఆదిత్య తారేలను తక్కువ స్కోర్లకే అవుట్ చేస్తే ఫామ్‌లో ఉన్న యూపీ బ్యాట్స్‌మెన్ పరుగుల నావను నడిపించగలరు. ఏదేమైనా నేటి ఫైనల్లో ముంబై జట్టే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. -
వరుస సెంచరీలతో చెలరేగుతున్న పృథ్వీ షా
ఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీలో ముంబై కెప్టెన్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే టోర్నీలో మూడు సెంచరీలు బాదిన పృథ్వీ తాజాగా మరో సెంచరీ బాదేశాడు. ఈ నాలుగు సెంచరీల్లో మూడుసార్లు 150కి పైగా స్కోరు నమోదు చేయడం విశేషం. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో 227 నాటౌట్, 185 పరుగులు నాటౌట్‌తో చెలరేగాడు. తాజాగా కర్ణాటకతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో కేవలం 122 బంతుల్లో 167 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే కర్ణాటకతో జరగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలో ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభించిన పృథ్వీ షా తర్వాత వేగం పెంచాడు. 79 బంతుల్లోనే టోర్నీలో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దారుణమైన ప్రదర్శనతో జట్టులో చోటు పోగొట్టున్న షా.. విజయ్ హజారే ట్రోపీలో మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడు విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే టోర్నీలో 725 పరుగులు చేసిన పృథ్వీ.. 723 పరుగులతో మయాంక్ అగర్వాల్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్ధలుకొట్టాడు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 49.2 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కర్ణాటక 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. -
6 మ్యాచ్‌లు 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు..
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్లో కర్ణాటక ఆటగాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) యువ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ దుమ్మురేపుతున్నాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. సోమవారం కేరళతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సీజన్లో నాలుగో సెంచరీ బాది.. టీమిండియాలో స్థానం కోసం దూసుకొస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో పడిక్కల్ 119 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి మరో ఓపెనర్, కర్ణాటక కెప్టెన్ సమర్థ్ (22 ఫోర్లు, 3 సిక్స్‌లతో 192) విధ్వంసం తోడవడంతో కర్ణాటక 80 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గతేడాది ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన పడిక్కల్.. సూపర్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకొన్నాడు. ఆ సీజన్లో పడిక్కల్ 15 మ్యాచ్‌ల్లో 124 స్ట్రైక్ రేట్‌తో 473 పరుగులు సాధించి, ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న అనుభవంతో అతను ప్రస్తుత దేశవాళీ సీజన్లో రెచ్చిపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 6 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత సీజన్లో వరుసగా 52, 97, 152, 126*, 145*, 101 స్కోర్లు సాధించి పడిక్కల్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో పడిక్కల్ మొత్తం 673 పరుగులు సాధించి.. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా తయారవుతన్నాడు. -
22 ఫోర్లు.. 3 సిక్సర్లతో చెడుగుడు ఆడేశాడు
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కేరళతో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక 80 పరుగుల తేడాతో నెగ్గి సెమీస్ చేరింది. ఓపెనర్లు సమర్థ్ (192; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు), దేవ్‌దత్ పడిక్కల్ (101; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. తొలి వికెట్‌కు 249 పరుగులు జోడించారు. కాగా ఓపెనర్ సమర్థ్ ఇన్నింగ్స్ ఆసాంతం ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడేశాడు. అయితే తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. ఇక టోర్నీలో దేవదత్కిది వరుసగా నాలుగో సెంచరీ. కర్ణాటక 50 ఓవర్లలో 3 వికెట్లకు 338 పరుగులు చేసింది. అనంతరం కేరళ 43.4 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్ రోణిత్ మోరే 5 వికెట్లతో విజృంభించాడు. ఆంధ్ర జట్టుకు నిరాశ ఢిల్లీ: ఇక లీగ్ దశలో తమ గ్రూప్‌లో ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచిన ఆంధ్ర జట్టు నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. గుజరాత్ జట్టుతో సోమ వారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర జట్టు 117 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత గుజరాత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 299 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (134; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఆంధ్ర 41.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. చదవండి: WTC: ఫైనల్ జరిగేది ఎక్కడో తెలుసా? అదిరిపోయే క్యాచ్.. విండీస్‌దే టీ20 సిరీస్! -
శార్దూల్ మెరుపులు.. సెంచరీ మిస్!
జైపూర్: విజయ్ హజరా ట్రోఫీలో ముంబైకి ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ రెచ్చిపోయి ఆడాడు. హిమచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ బ్యాటింగ్‌లో విజృంభించాడు. శ్రేయస్ అయ్యర్(2), పృథ్వీ షా(2)లు విఫలమైనప్పటికీ శార్దూల్ మాత్రం బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగి పోయిన శార్దూల్.. ఈ వన్డే మ్యాచ్‌లో శార్దూల్ 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు సాధించాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కాగా, సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో శార్దూల్ పెవిలియన్ చేరాడు. ఫలితంగా లిస్గ్-ఎ క్రికెట్లో తొలి సెంచరీ చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇది శార్దూల్‌కు లిస్ట్-ఎ క్రికెట్లో తొలి హాఫ్ సెంచరీగా నమోదైంది, శార్దూల్ మెరుపులతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అతనికి జతగా సూర్యకుమార్ యాదవ్(91; 75 బంతుల్లో 15 ఫోర్లు), ఆదిత్యా తారే(83; 98 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో ముంబై మూడొందలకు పైగా స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్ 24.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. హిమాచల్ ప్రదేశ్ జట్టులో మయాంక్ దాగర్(38 నాటౌట్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేదు.ముంబై బౌలర్లలో స్పిన్నర్ ప్రశాంత్ సోలంకీ నాలుగు వికెట్లతో రాణించి హిమాచల్ ప్రదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ములాని మూడు వికెట్లు సాధించగా, ధావల్ కులకర్ణి రెండు వికెట్లు తీశాడు. ఇక్కడ చదవండి: పిచ్ ఎలా ఉంటదో: టెన్షన్ అవసరం లేదు రోహిత్! -
ఆంధ్ర అదరహో
ఇండోర్: ఇతర సమీకరణాలపై ఆధారపడకుండా ఆంధ్ర క్రికెట్ జట్టు దర్జాగా విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. జార్ఖండ్‌తో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో గాదె హనుమ విహారి నాయకత్వంలోని ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జార్ఖండ్ నిర్దేశించిన 140 పరుగుల విజయలక్ష్యాన్ని ఆంధ్ర జట్టు కేవలం 9.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ఓపెనర్లు అశ్విన్ హెబ్బర్ (18 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికీ భుయ్ (27 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి బంతి నుంచే జార్ఖండ్ బౌలర్ల భరతం పట్టారు. దాంతో 5.5 ఓవర్లలో తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించాక అశ్విన్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విహారి (2 బంతుల్లో 4; ఫోర్), నితీశ్ కుమార్ రెడ్డి (5 బంతుల్లో 15; 2 సిక్స్‌లు), నరేన్‌రెడ్డి (7 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఏమాత్రం దూకుడు తగ్గించకుండా ఆడటంతో ఆంధ్ర లక్ష్యం దిశగా బుల్లెట్ వేగంతో దూసుకుపోయింది. జార్ఖండ్ జట్టులోని భారత బౌలర్లు వరుణ్ ఆరోన్ 2 ఓవర్లలో 30 పరుగులు... షాబాజ్ నదీమ్ 2 ఓవర్లలో 26 పరుగులు సమర్పించుకున్నారు. అంతకుముందు జార్ఖండ్ జట్టు 46.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు హరిశంకర్ రెడ్డి (4/30), షోయబ్ మొహమ్మద్ ఖాన్ (2/30), కార్తీక్ రామన్ (2/38) జార్ఖండ్ పతనాన్ని శాసించారు. ప్రణాళిక ప్రకారం... ఈ మ్యాచ్‌కు ముందు ఆంధ్ర ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. క్వార్టర్ ఫైనల్ బెర్త్ నేరుగా దక్కాలంటే గ్రూప్ ‘టాపర్’గా నిలవాలి. ఈ నేపథ్యంలో రన్‌రేట్ మెరుగు పర్చుకోవడానికి ఆంధ్ర జట్టు టాస్ నెగ్గగానే ఛేజింగ్ చేయడానికే మొగ్గు చూపింది. జార్ఖండ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత ఆఫ్ స్పిన్నర్ షోయబ్ మొహమ్మద్ ఖాన్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్ (19; 3 ఫోర్లు)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత జార్ఖండ్ 11 పరుగుల తేడాలో మరో మూడు వికెట్లను కోల్పోయింది. దాంతో 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జార్ఖండ్ కష్టాల్లో పడింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (38; 3 ఫోర్లు) నిలదొక్కుకుంటున్న దశలో షోయబ్ అతడిని అవుట్ చేయడంతో జార్ఖండ్ కోలుకోలేకపోయింది. అనంతరం మీడియం పేసర్లు హరిశంకర్ రెడ్డి, కార్తీక్ రామన్ విజృంభించడంతో జార్ఖండ్ ఇన్నింగ్స్ 139 పరుగులవద్ద ముగిసింది. లక్ష్యం చిన్నది కావడంతో ఆంధ్ర బ్యాట్స్‌మెన్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. పది ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించి రన్‌రేట్‌ను మెరుగుపర్చుకున్నారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆరు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆంధ్ర, తమిళనాడు, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆంధ్ర జట్టు (0.73) ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది. తమిళనాడు (0.65), జార్ఖండ్ (0.29), మధ్యప్రదేశ్ (–0.46) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి గుజరాత్... గ్రూప్ ‘సి’ నుంచి కర్ణాటక క్వార్టర్ ఫైనల్ చేరాయి. గ్రూప్ ‘డి’ నుంచి ముంబై, ఢిల్లీ... గ్రూప్ ‘ఇ’ నుంచి సౌరాష్ట్ర, చండీగఢ్ క్వార్టర్ ఫైనల్ రేసులో ఉన్నాయి. వెంకటేశ్ అయ్యర్ 198 పంజాబ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 105 పరుగుల తేడాతో గెలిచింది. మధ్యప్రదేశ్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (146 బంతుల్లో 198; 20 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెండు పరుగుల తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. మధ్యప్రదేశ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 402 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 42.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (49 బంతుల్లో 104; 8 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీ చేశాడు. తన్మయ్, తిలక్ వర్మ సెంచరీలు సూరత్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు విజయంతో లీగ్ దశను ముగించినా నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. గోవా తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా హైదరాబాద్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 345 పరుగులు సాధించింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (150; 19 ఫోర్లు, సిక్స్), తిలక్ వర్మ (128, 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 264 పరుగులు జతచేయడం విశేషం. లిస్ట్–ఎ క్రికెట్లో హైదరాబాద్ తరఫున తొలి వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2002లో గోవాపై అంబటి రాయుడు, వినయ్ కుమార్ తొలి వికెట్‌కు 196 పరుగులు జతచేశారు. 346 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 343 పరుగులు సాధించి ఓడిపోయింది. ఓపెనర్ ఏక్నాథ్ కేర్కర్ (169 నాటౌట్; 19 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్నేహల్ (112 బంతుల్లో 116; 15 ఫోర్లు) రెండో వికెట్‌కు 225 పరుగులు జోడించారు. ఏక్నాథ్ చివరిదాకా అజేయంగా ఉన్నా గోవాను గెలిపించలేకపోయాడు. 12 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ‘శత’క్కొట్టిన దేవ్‌దత్, సమర్థ్ రైల్వేస్‌తో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో కర్ణాటక 10 వికెట్ల తేడాతో నెగ్గింది. 285 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 40.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. లిస్ట్–ఎ క్రికెట్ లో భారత గడ్డపై ఇదే అత్యధిక ఛేదన. దేవ్‌దత్ పడిక్కల్ (145 నాటౌట్; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు), సమర్థ్ (130 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ శతకాలు సాధించారు. అంతకుముందు ప్రథమ్ సింగ్ (129; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేయడం తో రైల్వేస్ 9 వికెట్లకు 284 పరుగులు చేసింది. ఢిల్లీలో 7 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లు ఈనెల 7 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి. మొత్తం ఐదు ఎలైట్ గ్రూప్‌ల్లో ‘టాప్’లో నిలిచిన ఐదు జట్లు... ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. చివరిదైన ఎనిమిదో బెర్త్ కోసం ఓవరాల్ ఎలైట్ గ్రూప్‌ల్లో ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్టు, ప్లేట్ గ్రూప్ విజేత జట్టుతో 7న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు చివరి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఈనెల 8, 9 తేదీల్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు... 11న సెమీఫైనల్స్... 14న ఫైనల్ జరుగుతాయి. -
169 నాటౌట్.. అయినా గెలిపించలేకపోయాడు
సూరత్: దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోపీలో లీగ్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగుతుండగా.. మరికొన్ని మాత్రం ఉత్కంఠను రేపుతున్నాయి. తాజాగా ఆదివారం ఎలైట్ గ్రూఫ్ ఏలో భాగంగా హైదరాబాద్, గోవాల మధ్య లీగ్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. బంతి బంతికి ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో గోవా విజయానికి కేవలం రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. ఓపెనర్‌గా వచ్చిన గోవా ఓపెనర్ ఏక్నాథ్ కేర్కర్ 169 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కూడా మ్యాచ్‌ను గెలిపించకలేకపోయాడు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(150 పరుగులు), తిలక్ వర్మ( 128 పరుగులు) సెంచరీలతో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 345 పరగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా జట్టును ఓపెనర్ కేర్కర్ విజయం దిశగా నడిపించాడు. అతనికి వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ స్నేహాల్ సుహాస్ (116 పరుగులతో) చక్కని సహకారం అందించాడు. అయితే సుహాస్ ఔటైన తర్వాత కేర్కర్ ఒంటరిపోరాటం చేస్తూ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే ఆఖరి ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఉత్కంఠ చోటుచేసుకుంది. దీంతో గోవా విజయానికి రెండు పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలయింది. చదవండి: రెండు రన్స్‌తో డబుల్ సెంచరీ మిస్.. కేకేఆర్‌లో జోష్ దుమ్మురేపిన అశ్విన్.. కెరీర్ బెస్ట్‌కు రోహిత్ -
రెండు రన్స్‌తో డబుల్ సెంచరీ మిస్.. కేకేఆర్‌లో జోష్
ఇండోర్: దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోపీలో బ్యాట్స్‌మెన్ పరగుల వరద పారిస్తున్నారు.ఈ టోర్నీలో పలువురు దేశవాళీ ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నారు. ఐపీఎల్‌కు సెలక్ట్ అయ్యామన్న ఆనందమేమో కానీ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగుతూ సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నారు. మొన్న ఇషాన్ కిషన్ సిక్సర్లతో వీరవిహారం చేయగా.. తాజాగా వెంకటేశ్ అయ్యర్ సునామీ సృష్టించాడు. 146 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 198 పరుగులతో విధ్వంసం సృష్టించిన అయ్యర్ కేవలం రెండు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆదివారం గ్రూఫ్-బిలో భాగంగా మధ్యప్రదేశ్, పంజాబ్ మధ్య లీగ్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. మొదట మధ్యప్రదేశ్ బ్యాటింగ్ చేయగా, ఆ జట్టు ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ మెరుపులతో 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయ్యర్‌కు ఆదిత్య శ్రీ వాత్సవ 84* పరుగులు,రాజత్ పాటిదార్ 54 సహకరించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 2.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బ్యాటింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(104 పరుగులు) సెంచరీతో మెరవగా.. మిగతావారు విఫలమయ్యారు. అయితే అయ్యర్ డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నందుకు బాధగా ఉన్నా కేకేఆర్ మాత్రం అతని ఇన్నింగ్స్‌తో మంచి జోష్‌లో ఉంది. ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్‌ను ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో రూ. 20లక్షలతో కొనుగోలు చేసింది. ఈ జోష్‌తో కేకేఆర్ అతని ఇన్నింగ్స్‌ను మెచ్చకుంటూ అతని ఇన్నింగ్స్‌తో పాటు ఫోటోను షేర్ చేస్తూ కంగ్రాట్స్ తెలిపింది. చదవండి: శ్రేయస్ అయ్యర్ మరో సెంచరీ 1⃣9⃣8⃣ reasons to celebrate our new knight 💜 2⃣0⃣ Boundaries and 7⃣ Sixes in a top notch inning against Punjab Venkatesh Iyer #HaiTaiyaar#KKR #VijayHazareTrophy #MPvPUN pic.twitter.com/DIiAK3HkNS — KolkataKnightRiders (@KKRiders) February 28, 2021 -
శ్రేయస్ అయ్యర్ మరో సెంచరీ
జైపూర్: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన ముంబై జట్టు... దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం అదరగొడుతోంది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో ఉన్న ముంబై జట్టు వరుసగా నాలుగో విజయం సాధించి నాకౌట్ దశకు చేరువైంది. రాజస్తాన్ జట్టుతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 67 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 317 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (103 బంతుల్లో 116; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఈ టోర్నీలో రెండో సెంచరీ చేశాడు. ఇక్కడ చదవండి: ‘పిచ్ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలి’ 318 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగిన రాజస్తాన్ 42.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. మహిపాల్ (69 బంతు ల్లో 76; 6 ఫోర్లు, 4 సిక్స్ లు) మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. ముంబై పేసర్లు శార్దుల్ ఠాకూర్ (4/50), ధవళ్ కులకర్ణి (3/26) రాజస్తాన్‌ను దెబ్బతీశారు. ఇతర మ్యాచ్‌ల్లో సౌరాష్ట్ర 62 పరుగుల తేడాతో చండీగఢ్‌పై; బెంగాల్ 82 పరుగుల తేడాతో జమ్మూ కశ్మీర్ జట్టుపై; పుదుచ్చేరి 104 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై; ఢిల్లీ మూడు వికెట్ల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందాయి. -
డబుల్ సెంచరీ... పృథ్వీ షా సరికొత్త రికార్డు
-
డబుల్ సెంచరీ... పృథ్వీ షా సరికొత్త రికార్డు
జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో ముంబై ఓపెనర్ పృథ్వీ షా భీకర ఫామ్ కొనసాగుతోంది. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు శతకంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుదుచ్చేరితో నేడు జైపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 152 బంతుల్లో 227 పరుగులు చేసి సంజూ శాంసన్ (212) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బ్రేక్ చేశాడు. అంతేగాక లిస్టు ఏ క్రికెట్ (పురుషులు)లో ఈ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్‌గా కూడా నిలిచాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో పృథ్వీ షా ముంబై జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, కేవీ కౌశల్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ ద్విశతకాలు సాధించారు. కాగా గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పుదుచ్చేరి ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ముంబై ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 10 పరుగులకే పెవిలియన్ చేరగా, ఆదిత్య తారే హాఫ్ సెంచరీ (56)తో ఆకట్టుకున్నాడు. ఇక సూర్యకుమార్ 50 బంతుల్లోనే సెంచరీ (133) పూర్తి చేసుకోగా, పృథ్వీ షా (నాటౌట్) ఐదు సిక్సర్లు, 31 ఫోర్లతో చెలరేగి ఆడటంతో ముంబై జట్టు ప్రత్యర్థికి భారీ టార్గెట్ విధించింది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 457 పరుగులు చేసి, పుదుచ్చేరికి 458 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. విజయ్ హజారే ట్రోఫీలో ఒక జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. చదవండి: తొలి సెంచరీ.. లవ్ యూ అన్నయ్య: పాండ్యా -
తొలి సెంచరీ.. లవ్ యూ అన్నయ్య: పాండ్యా
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ-2021 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా తొలిసారిగా సెంచరీ నమోదు చేశాడు. బరోడా జట్టు తరఫున ఆడుతున్న అతడు 90 బంతుల్లో 127 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు త్రిపురపై 6 వికెట్ల తేడాతో బరోడా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా తన తండ్రి హిమాన్షు పాండ్యాను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఒకవేళ ఇప్పుడు ఆయన బతికి ఉంటే ఎంతో సంతోషించే వారని, తను గతంలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసినప్పుడు తనను అభినందించిన తీరును జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు... ‘‘గత నెలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నేను 76 పరుగులు చేసినపుడు, నాన్న నాతో చివరిసారిగా క్రికెట్ గురించి మాట్లాడారు. ‘‘నా ప్రియమైన కుమారుడా.. ఇప్పుడు నీ టైం స్టార్ట్ అయ్యింది’’ అని నన్ను ప్రోత్సహించారు. ఇక ఇప్పుడు నేను తొలిసారి సెంచరీ చేశాను. కానీ భౌతికంగా ఆయన మాతో లేరు. అయితే, నిన్న నేను పరుగు తీస్తున్న ప్రతిసారీ ఆయన నన్ను చీర్ చేసి ఉంటారని నా హృదయం బలంగా నమ్ముతోంది. ‘‘శభాష్ కృనాల్ శభాష్’’ అని ఆయన అని ఉంటారు! నా ఈ ప్రత్యేక ఇన్నింగ్స్ నాన్నకే అంకితం. నా కలలు నిజం చేసకునే క్రమంలో క్షణక్షణం తోడున్న నీకు ధన్యవాదాలు. లవ్ యూ పప్పా’’అంటూ కృనాల్ ఇన్‌స్టాలో ఎమోషల్ పోస్టు షేర్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన అతడి సోదరుడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ‘‘నాన్న నిన్ను చూసి గర్వపడుతూనే ఉంటాడు అన్నయ్యా.. లవ్ యూ’’అని ప్రేమ చాటుకున్నాడు. కాగా జనవరి 16న హార్దిక్ తండ్రి హిమాన్షు పాండ్యా గుండెపోటుకు గురై మరణించిన విషయం విదితమే. View this post on Instagram A post shared by Krunal Pandya (@krunalpandya_official) -
హైదరాబాద్ గెలుపు
సూరత్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చత్తీస్‌గఢ్‌తో సోమవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. చత్తీస్‌గఢ్ నిర్దేశించిన 243 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 40.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (116 బంతుల్లో 122; 15 ఫోర్లు, సిక్స్) సెంచరీ చేయగా... తిలక్ వర్మ (78 బంతుల్లో 60; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. తొలి వికెట్‌కు వీరిద్దరు 131 పరుగులు జోడించారు. హిమాలయ్ అగర్వాల్ (36 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగు తేడాతో అర్ధ సెంచరీని కోల్పోయాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 242 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ భాటియా (63; 6 ఫోర్లు), అశుతోష్ సింగ్ (51; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్ (3/32), రవితేజ (2/60) రాణించారు. -
‘శత’క్కొట్టిన పృథ్వీ షా
జైపూర్: ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న ముంబై యువ ఓపెనర్ పృథ్వీషా (89 బంతుల్లో 105 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో టచ్‌లోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఢిల్లీ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. హిమ్మత్ సింగ్ (145 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత పోరాటం చేశాడు. లోయర్ ఆర్డర్లో వశిష్ట్ (70 బంతుల్లో 55; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 31.5 ఓవర్లలోనే మూడు వికెట్లే కోల్పోయి 216 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (39; 6 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. తర్వాత పృథ్వీకి జతయిన సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధసెంచరీ బాదాడు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో ముంబై విజయం సులువైంది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ► బెంగాల్: 315/6 (కైఫ్ అహ్మద్ 75, అనుస్తుప్ 58); సర్వీసెస్: 245 (రజత్ 90, పుల్కిత్ 53; ఇషాన్ పొరెల్ 2/31). ► జమ్మూకశ్మీర్: 279/9 (శుభమ్ 68, వివ్రత్ శర్మ 66); సౌరాష్ట్ర: 283/7 (చిరాగ్ జానీ 93 నాటౌట్, అర్పిత్ 66). ► హరియాణా: 299/9 (హిమాన్షు రాణా 102, రాహుల్ తెవాటియా 73); చండీగఢ్: 300/7 (మనన్ వొహ్రా 117, అంకిత్ 78). ► మహారాష్ట్ర: 295/8 (రుతురాజ్ గైక్వాడ్ 102; వైభవ్ అరోరా 4/45); హిమాచల్ ప్రదేశ్: 236 (అభిమన్యు రాణా 46, రాజ్వర్ధన్ 4/42). ► పుదుచ్చేరి: 273/6 (పారస్ డోగ్రా 101, ); రాజస్తాన్: 274/4 (మనేందర్ సింగ్ 115). -
ఇషాన్ కిషన్ విశ్వరూపం
ఇండోర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే సంచలన ప్రదర్శన నమోదైంది. కెప్టెన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (94 బంతుల్లో 173; 19 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగడంతో జార్ఖండ్ 324 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ను చిత్తుగా ఓడించింది. హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 422 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనుకూల్ రాయ్ (39 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), విరాట్ సింగ్ (49 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సుమీత్ కుమార్ (58 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో కిషన్‌కు అండగా నిలిచారు. ఐపీఎల్లో ఈ ఏడాది ముంబై తరఫున సత్తా చాటిన కిషన్ సొంత రాష్ట్రం తరఫున వన్డేల్లో తన మెరుపులు చూపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 142 పరుగు లు బౌండరీల ద్వారానే రావడం విశేషం. తన అర్ధ సెంచరీని 42 బంతుల్లో అందుకున్న కిషన్, 74 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై 150 పరుగుల మార్క్‌ను దాటేందుకు మరో 12 బంతులు సరిపోయాయి. శతకం మైలురాయిని చేరిన తర్వాత వచ్చిన 71 పరుగులను అతను 20 బంతుల్లోనే సాధించడం అతని బ్యాటింగ్ జోరును చూపిస్తోంది. అనంతరం మధ్యప్రదేశ్ 18.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ భండారి (42) టాప్ స్కోరర్‌గా నిలవగా, పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ (6/37) ప్రత్యర్థిని పడగొట్టాడు. కీపర్‌గానూ సత్తా చాటిన కిషన్ మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 క్యాచ్‌లు అందుకోవడం మరో విశేషం. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ♦ఛత్తీస్‌గఢ్ 231 (శశాంక్ 92, అర్జన్ 6/54)పై 3 వికెట్లతో గుజరాత్ 232/7 (ధ్రువ్ రావల్ 38) విజయం. ♦గోవా 263 (స్నేహల్ 81, కృనాల్ పాండ్యా 3/10)పై 5 వికెట్లతో బరోడా 264/5 (విష్ణు సోలంకి 108, కృనాల్ పాండ్యా 71, స్మిత్ పటేల్ 58) విజయం. ♦పంజాబ్ 288/4 (గుర్కీరత్ మన్ 139 నాటౌట్, ప్రభ్‌సిమ్రన్ 71, సన్వీర్ 58)పై 6 వికెట్లతో తమిళనాడు 289/4 (జగదీశన్ 101, బాబా అపరాజిత్ 88, షారుఖ్ ఖాన్ 55 నాటౌట్) విజయం. ♦కర్ణాటక 246/8 (అనిరుధ 68, దేవదత్ పడిక్కల్ 52)పై 9 పరుగులతో (వీజేడీ పద్ధతి) ఉత్తరప్రదేశ్ 215/4 (రింకూ సింగ్ 62, అభిషేక్ 54) విజయం. ♦ఒడిషా 258/8 (సందీప్ 66, గౌరవ్ 57)పై 34 పరుగులతో (వీజేడీ పద్ధతి) కేరళ 233/4 (రాబిన్ ఉతప్ప 107) విజయం. ♦బిహార్ 189 (అనూజ్ రాజ్ 72)పై 10 వికెట్లతో రైల్వేస్ (మృనాల్ దేవధర్ 105 నాటౌట్, ప్రథమ్ సింగ్ 72 నాటౌట్) విజయం. చదవండి: 'అనుకున్నది సాధించాం.. సంతోషంగా ఉన్నా' -
నేటినుంచి విజయ్‌హజారే ట్రోఫీ
ముంబై: భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి రంగం సిద్ధమైంది. దేశంలోని వేర్వేరు వేదికల్లో నేటినుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మొత్తం జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించి టోర్నీని నిర్వహిస్తున్నారు. 2020–21 సీజన్లో రంజీ ట్రోఫీని రద్దు చేసిన బీసీసీఐ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీని ఇప్పటికే నిర్వహించింది. ఇప్పుడు విజయ్ హజారే టోర్నీలో తమ సత్తా చాటి భారత వన్డే జట్టులో చోటు కోసం సెలక్టర్లను ఆకర్షించాలని యువ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇప్పటికే టీమిండియా వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడైన శ్రేయస్ అయ్యర్ ముంబై కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండగా... గాయాలనుంచి కోలుకొని శిఖర్ ధావన్ (ఢిల్లీ), భువనేశ్వర్ కుమార్ (యూపీ) పునరాగమనం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. పృథ్వీ షా కూడా తన ఫామ్‌ను అందుకునేందుకు ఈ టోర్నీ తగిన అవకాశం కల్పిస్తోంది. దినేశ్ కార్తీక్ తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా...ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్న నటరాజన్‌పై ఇప్పుడు అందరి దృష్టీ నిలిచింది. మార్చి 14న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
ముంబై కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..
ముంబై: ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం కాబోయే విజయ్ హజారే టోర్నీలో ముంబై జట్టు నాయకత్వ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ చేపట్టనున్నాడు. భుజం గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి దూరమైన ఈ టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు.. విజయ్ హజారే టోర్నీలో జట్టుతో చేరి, నాయకత్వ బాధ్యతలను చేపట్టనున్నాడు. టీమిండియా మరో ఆటగాడు పృథ్వీ షా ముంబై జట్టుకు ఉపనాయకుడిగా వ్యవహరించనున్నాడు. జట్టు ఎంపిక నిమిత్తమై బుధవారం సమావేశమైన సెలెక్షన్ కమిటీ.. 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. జట్టులో ఐపీఎల్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఆదిత్య తారే, సీనియర్ బౌలర్ ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే తదితర ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కాగా, ఈ టోర్నీ కోసం భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పవార్‌ను ముంబై ప్రధాన కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. -
నాయర్ నుంచి సారధ్య బాధ్యతలు చేజిక్కించుకున్న సమర్ధ్
సాక్షి, బెంగళూరు: త్వరలో ప్రారంభం కాబోయే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో కర్ణాటక కెప్టెన్‌గా ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆర్ సమర్ధ్ వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల సమర్ధ్.. ఫామ్ లేమితో బాధపడుతున్న కరుణ్ నాయర్ నుంచి సారధ్య బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఫజల్ ఖలీల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సోమవారం సమావేశమై 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా, తాజాగా ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సమర్ధ్‌కు జట్టులో స్ధానం దక్కకపోవడం విశేషం. ఈ టోర్నీలో కర్ణాటక జట్టు క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. తాజాగా ప్రకటించిన కర్ణాటక జట్టులో ఇటీవలి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున రాణించిన దేవ్‌దత్ పడిక్కల్ కీలక సభ్యుడిగా ఉండగా, గాయం కారణంగా సీనియర్ ఆటగాడు మనీష్ పాండే టోర్నీకి దూరమయ్యాడు. -
రంజీ సమరానికి వేళాయె
మూలపాడు (విజయవాడ): విజయ్ హజారే వన్డే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ వంటి పరిమిత ఓవర్ల క్రికెట్లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అలరించిన భారత యువ క్రికెటర్లను ఇక నాలుగు రోజులపాటు సాగే మ్యాచ్‌లు సవాళ్లు విసరనున్నాయి. వారిలోని నిజమైన టెక్నిక్‌ను, ఓపికను, ఫిట్నెస్ను పరీక్షించేందుకు నేటి నుంచి రంజీ ట్రోఫీ వేదిక కానుంది. ఇప్పటికే పరిమిత ఓవర్ల దేశవాళీ టోర్నీల్లో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లు ఇక్కడ కూడా మెరిసి భారత టెస్టు జట్టులో స్థానం సంపాదించాలని చూస్తుండగా... పునరాగమనం కోసం మరికొందరు ఈ రంజీ సీజన్‌ను ఉపయోగించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక గత రెండు సీజన్‌ల్లో టైటిల్ గెలిచి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న విదర్భ మరోసారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్‌ను పూర్తి చేయాలని చూస్తోంది. అదే గనుక జరిగితే ముంబై తర్వాత హ్యాట్రిక్ టైటిల్స్‌ను గెలిచిన జట్టుగా నిలుస్తుంది. తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఆంధ్రతో విదర్భ... హైదరాబాద్‌తో గుజరాత్ జట్లు తలపడనున్నాయి. సీజన్ జరిగే తీరు... గత సీజన్లో 37 జట్లు బరిలో దిగగా... ఈసారి చండీగఢ్ రూపంలో కొత్త జట్టు ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో మొత్తం 38 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక గ్రూప్ ‘ఎ’–‘బి’లను కలిపి ‘టాప్–5’ స్థానాల్లో నిలిచిన జట్లు, గ్రూప్ ‘సి’ నుంచి ‘టాప్–2’ జట్లు, ప్లేట్ గ్రూప్ నుంచి ఒక జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 9 నుంచి ఫైనల్ జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’: ఆంధ్ర, హైదరాబాద్, విదర్భ, కేరళ, ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, బెంగాల్. ఎలైట్ గ్రూప్ ‘బి’: ముంబై, బరోడా, హిమాచల్ ప్రదేశ్, సౌరాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రైల్వేస్, మధ్యప్రదేశ్. ఎలైట్ గ్రూప్ ‘సి’: త్రిపుర, జమ్మూ కశీ్మర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశా, సరీ్వసెస్, హరియాణా, జార్ఖండ్, అస్సాం. ప్లేట్ గ్రూప్: గోవా, మేఘాలయ, మణిపూర్, మిజోరం, చండీగఢ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, బిహార్. -
విజేత కర్ణాటక
బెంగళూరు: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక జట్టు నాలుగోసారి కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ (5/34) హ్యాట్రిక్ తీయగా... బ్యాటింగ్‌లో రాహుల్ (52 నాటౌట్; 5 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ ( 69 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. దీంతో కర్ణాటక వీజేడీ పద్ధతి ప్రకారం 60 పరుగుల తేడాతో తమిళనాడుపై గెలుపొందింది. ముందుగా తమిళనాడు జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన మిథున్ 3, 4, 5 బంతుల్లో వరుసగా షారుక్ ఖాన్ (27), మొహమ్మద్ (10), అశ్విన్ (0) వికెట్లను పడగొట్టడంతో తమిళనాడు ఆలౌటైంది. అనంతరం కర్ణాటక 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 146 పరుగులు చేసిన దశలో వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో చేసేదేమీ లేక 23 ఓవర్లలో 87 పరుగులుగా లక్ష్యాన్ని సవరించగా... అప్పటికే దీన్ని కర్ణాటక అధిగమించడంతో విజేతగా ప్రకటించారు. -
టైటిల్ వేటలో మెరిసిన రాహుల్, అగర్వాల్
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక(వీజేడీ పద్ధతిలో) 60 పరుగుల తేడాతో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 253 పరుగులు సాధించగా, అందుకు ధీటుగా బ్యాటింగ్ చేసింది కర్ణాటక. 23 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 146 పరుగులతో ఉన్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆపై ఫలితం కోసం వీజేడీ పద్ధతిని అవలంభించి కర్ణాటకను విజేతగా తేల్చారు. కర్ణాటక ఓపెనర్ కేఎల్ రాహుల్(52 నాటౌట్; 72 బంతుల్లో 5ఫోర్లు), మయాంక్ అగర్వాల్(69 నాటౌట్; 55 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరిశారు. వీరిద్దరూ అజేయంగా 112 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి కర్ణాటకను పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ టోర్నీలో కేఎల్ రాహుల్ 598 పరుగులు సాధించాడు. భారత ఇంజనీర్ వి జయదేవన్ రూపొందించిన వీజేడీ పద్ధతిని మ్యాచ్ రద్దయిన పరిస్థితుల్లో ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా భారత్‌లో జరిగే దేశవాళీ టోర్నీలో వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో అభినవ్ ముకుంద్- మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు అయితే మురళీ విజయ్ డకౌట్‌గా పెవిలియన్ చేరితే ముకుంద్(85) రాణించాడు. అటు తర్వాత బాబా అపరాజిత్(66), విజయ్ శంకర్(38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి తమిళనాడును దెబ్బకొట్టాడు. మొత్తంగా ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. కర్ణాటక బౌలర్లలు మిథున్ ఐదు వికెట్లకు జతగా, కౌశిక్ రెండు వికెట్లు సాధించాడు. ప్రతీక్ జైన్, కృష్ణప్ప గౌతమ్‌లకు తలో వికెట్ లభించింది. (ఇక్కడ చదవండి: హ్యాట్రిక్ వికెట్లతో ఇరగదీశాడు..!) -
హ్యాట్రిక్ వికెట్లతో ఇరగదీశాడు..!
బెంగళూరు: కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ వికెట్లతో ఇరగదీశాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో మిథున్ ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. ఈ ఐదు వికెట్లలో హ్యాట్రిక్ సాధించడంతో అరుదైన ఘనతను నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో హ్యాటిక్ర్ వికెట్లు సాధించిన తొలి కర్ణాటక బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మిథున్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. చివరి ఓవర్ మూడో బంతికి షారుఖ్(27) వికెట్ సాధించిన మిథున్.. ఆపై వరుస రెండు బంతుల్లో ఎమ్ మహ్మద్((10), మురుగన్ అశ్విన్(0)లను పెవిలియన్‌కు పంపించాడు. ఫలితంగా హ్యాట్రిక్ వికెట్ ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో అభినవ్ ముకుంద్- మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు అయితే మురళీ విజయ్ డకౌట్‌గా పెవిలియన్ చేరితే ముకుంద్(85) రాణించాడు. అటు తర్వాత బాబా అపరాజిత్(66), విజయ్ శంకర్(38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కర్ణాటక బౌలర్లలు మిథున్ ఐదు వికెట్లకు జతగా, కౌశిక్ రెండు వికెట్లు సాధించాడు. ప్రతీక్ జైన్, కృష్ణప్ప గౌతమ్‌లకు తలో వికెట్ లభించింది. -
తమిళనాడుతో కర్ణాటక ‘ఢీ’
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో కర్ణాటక తుదిసమరానికి సిద్దమైంది. బుధవారం జరిగిన రెండు సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో తమిళనాడు, కర్ణాటక జట్లు విజయాలు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఛత్తీస్‌గడ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో కర్ణాటక 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఛత్తీస్గడ్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 40 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్ (92; 98 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్(88 నాటౌట్; 111 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్)లు ఆద్వితీయ ఇన్నింగ్స్ నిర్మించగా.. మయాంక్ అగర్వాల్(47 నాటౌట్, 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు)మెరుపులు మెరిపించడంతో కర్ణాటక సులువుగా విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్గడ్ కర్ణాటక బౌలర్ల ధాటికి 49.4 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. అమన్‌దీప్(78) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. ఒకానొక దశలో ఛత్తీస్గడ్ 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో సుమిత్(40), అజయ్ జాదవ్(26)లతో కలిసి అమన్‌దీప్ పోరాడు. దీంతో కర్ణాటక ముందు ఛత్తీస్గడ్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచింది. కన్నడ బౌలర్లలో కౌశిక్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మిథున్, గౌతమ్, ప్రవీణ్ దుబేలు తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక బుధవారమే జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో తమిళనాడు విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ధృవ్ రావల్(40), అక్షర్ పటేల్(37)లు మాత్రమే పర్వాలేదనిపించారు. ప్రధాన బ్యాట్స్‌మెన్ పార్థీవ్ పటేల్(13), ప్రియాంక్ పాంచల్(3) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో స్వల్స స్కోర్‌కే గుజరాత్ పరిమితమైంది. కాగా, తమిళనాడు బౌలర్లలో మహమ్మద్ 3 వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్, నటరాజన్, ఆర్ అశ్విన్, మురుగన్ అశ్విన్, అపరజిత్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు. గుజరాత్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభినవ్ ముకుంద్(32) విజయానికి పునాది వేయగా.. షారుఖ్ ఖాన్(56 నాటౌట్) తమిళనాడును విజయతీరాలకు చేర్చాడు. వీరికితోడు దినేశ్ కార్తీక్(47) కూడా తోడ్పాటునందించడంతో తమిళనాడు గెలుపును సొంతం చేసుకుంది. ఇక విజయ్ హజరే ట్రోఫీలో భాగంగా తమిళనాడు, కర్ణాటక జట్లు శనివారం ఫైనల్లో తలపడనున్నాయి. -
బీసీసీఐపై యువీ, భజ్జీ అసంతృప్తి
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పంజాబ్- తమిళనాడు జట్ల మధ్య జరిగిన క్వార్టర్స్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే నిబంధనల ప్రకారం లీగ్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన తమిళనాడు సెమీస్‌కు చేరింది. దీంతో పంజాబ్ సెమీస్ ఆశలకు గండిపడింది. అయితే సెమీస్ స్థానం కోసం జరిగే కీలక మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయించకపోవడంపై టీమిండియా సీనియర్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లు బీసీసీఐని తప్పుబట్టారు. ‘ఇదొక చెత్త నిబంధన. ఇలాంటి టోర్నీలలో కీలక మ్యాచ్‌లకు రిజర్వ్‌డేను ఎందుకు కేటాయించకూడదు. బీసీసీఐ తన నిబంధలనపై ఓ సారి పునరాలోచించుకోవాలి’ అని భజ్జీ సూచించాడు. ‘విజయ్‌హజారే ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. రిజర్వ్‌డే లేని కారణంగా పంజాబ్ సెమీస్‌కు వెళ్లలేదు. ఎందుకు రిజర్వ్‌డే కేటాయించలేదో అర్థం కావడం లేదు? దేశవాళీ టోర్నీ అని రిజర్వ్‌డే ఆడించలేదా?’అంటూ బీసీసీఐని యువీ ప్రశ్నించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 39 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన సమయంలో వాన కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వీజేడీ పద్ధతి ద్వారా పంజాబ్ లక్ష్యాన్ని 195 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్యఛేదనలో పంజాబ్ 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసిన సమయంలో మరోమారు వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దుచేశారు. అయితే లీగ్‌లో తమిళనాడు(9) పంజాబ్(5) కంటే అత్యధిక విజయాలు నమోదు చేయడంతో సెమీస్‌కు చేరింది. ఇక ముంబై, ఛత్తీస్‌గఢ్ మధ్య జరగాల్సిన మరో క్వార్టర్స్ మ్యాచ్‌కూడా వర్షం కారణంగా రద్దయింది. దీంతో లీగ్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన ఛత్తీస్గడ్ సెమీస్‌కు చేరింది. ఇలా రెండు ప్రధాన జట్లు వర్షం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించడం, రిజర్వ్‌డే లేకపోవడం పట్ల క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు పెదవి విరుస్తున్నారు. -
నా సెంచరీని దోచుకున్నారు: క్రికెటర్ ఆవేదన
కోహిమా: ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాడు సెంచరీ సాధిస్తే ఆ సంతోషమే వేరు. సెంచరీ చేసినా తన జట్టు ఓటమి పాలైతే ఆ బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి సెంచరీ వర్షార్పణం అయితే ఆవేదన మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు అదే ఆవేదనతో రగిలిపోతున్నాడు నాగాలాండ్ కెప్టెన్ రోంగ్సేన్ జోనాథన్. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రౌండ్-1లో మణిపూర్ జట్టుతో సెప్టెంబర్ 24వ తేదీన జరిగిన తొలి మ్యాచ్‌లో జోనాథన్ శతకం సాధించాడు. ఇది లిస్ట్-ఏ క్రికెట్లో జోనాథన్‌కు తొలి సెంచరీ. అయితే కుండపోతగా కురిసిన వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయ్యింది. నాగాలాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మణిపూర్ 8.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 44 పరుగుల వద్ద ఉండగా భారీ వర్షం కురిసింది. దాంతో మ్యాచ్‌ను కొనసాగించడం సాధ్యం కాలేదు.అదే సమయంలో ఆ మ్యాచ్‌తో పాటు వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రీ షెడ్యూల్ చేసింది. ఈ క్రమంలోనే తన సెంచరీ లెక్కల్లోకి రాకపోవడంతో జోనాథన్ తీవ్రంగా మధనపడుతున్నాడు. ‘ఇది నన్ను తీవ్రంగా వేధిస్తుంది. నా మనసుకు గాయం చేసింది. నా సెంచరీని దోచుకున్నారు’ అంటూ ఉద్వేగభరితమయ్యాడు. ‘ దాదాపు 60 శాతం మ్యాచ్ పూర్తయిన తరుణంలో మ్యాచ్‌ను రీ షెడ్యూల్ ఎలా చేస్తారు. రీ షెడ్యూల్‌పై నా అవగాహన అవగాహన ఉంది. కానీ మ్యాచ్‌లో ఫలితం రానప్పుడు ఆటగాళ్ల రికార్డులను రీ షెడ్యూల్ పేరుతో ఎలా దోచుకుంటారు. ప్లేయర్స్‌గా మేము చాలా కష్టపడతాం. కఠినంగా శ్రమిస్తాం. సీజన్లో తొలి మ్యాచ్‌లో సాధించిన రికార్డు ఇలా వృథా కావాల్సిందేనా. ఈ విషయం నన్ను కలిచి వేస్తోంది. నేను దీనిపై బీసీసీఐకి లేఖ రాశా. బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్‌కు జనరల్ మేనేజర్‌గా ఉన్న సాబా కరీంను వివరణ అడిగా. కానీ ఇంతవరకూ ఎటువంటి స్పందనా లేదు. మా వ్యక్తిగత రికార్డులు ప్రయోజనం లేకుండా మిగిలి పోవడం బాధిస్తోంది. నార్త్-ఈస్ట్ నుంచి వచ్చిన క్రికెటర్లపై చులకన భావం ఉంది. అందుచేతే నేను రాసిన లేఖకు వివరణ ఇవ్వలేదు’ అని జోనాథన్ తన ఆవేదనను మీడియాకు తెలిపాడు. -
హైదరాబాద్‌కు మూడో ఓటమి
ఆలూర్ (బెంగళూరు): కీలక సమయంలో బ్యాట్స్‌మెన్ బోల్తా పడటంతో విజయ్‌హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు మూడో ఓటమి ఎదురైంది. సోమవారం ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన హైదరాబాద్ 4 మ్యాచ్‌ల్లో గెలుపొంది మూడింటిలో ఓడింది. ముంబైతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరులోని ఆలూరు క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించి ఆడించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ 23 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. అశుతోష్ సింగ్ (50 బంతుల్లో 66; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అతను అమన్‌దీప్ (24)తో నాలుగో వికెట్‌కు 53 పరుగులు, శశాంక్ సింగ్ (31 నాటౌట్)తో 50 పరుగులు జోడించి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 2 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, రవికిరణ్, మెహదీ హసన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం హైదరాబాద్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. తన్మయ్ అగర్వాల్ (6), అక్షత్ రెడ్డి (14), హిమాలయ్ అగర్వాల్ (3), కెప్టెన్ అంబటి రాయుడు (22; 1 ఫోర్, 1సిక్స్) రాణించలేకపోయారు. తిలక్ వర్మ (37 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడు కనబరిచాడు. చివర్లో మిలింద్ (7)తో కలిసి బావనక సందీప్ (39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడటంతో జట్టు స్కోరు 18.4 ఓవర్లలో 147/6 నిలిచింది. అయితే చివరి 26 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా హైదరాబాద్ వరుస బంతుల్లో సందీప్, మిలింద్ వికెట్లను కోల్పోయింది. తర్వాత మెహదీ హసన్ (0), సిరాజ్ (0)లు కూడా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్ చేరడంతో అదే స్కోరు వద్ద హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు ఛత్తీస్‌గఢ్ ఇన్నింగ్స్: రిషభ్ తివారి (సి) మల్లికార్జున్ (బి) సిరాజ్ 2; శశాంక్ చంద్రకర్ (ఎల్బీడబ్ల్యూ) మెహదీ హసన్ 18; అశుతోష్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 66; హర్‌ప్రీత్ సింగ్ భాటియా (బి) మిలింద్ 16; అమన్‌దీప్ ఖరే (సి) సందీప్ (బి) రవికిరణ్ 24; శశాంక్ సింగ్ (నాటౌట్) 31; అజయ్ మండల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (23 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–3, 2–31, 3–58, 4–111, 5–161. బౌలింగ్: సిరాజ్ 5–0–27–1, రవికిరణ్ 5–0–36–1, మిలింద్ 5–0–46–2, మెహదీహసన్ 4–0–16–1, సందీప్ 3–0–30–0, తిలక్ వర్మ 1–0–11–0. హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) శశాంక్ (బి) వీర్ ప్రతాప్ సింగ్ 6; అక్షత్ రెడ్డి (సి) అమన్‌దీప్ (బి) పంకజ్ రావు 14; తిలక్ వర్మ (సి) రిషభ్ తివారీ (బి) వీర్ ప్రతాప్ సింగ్ 41; హిమాలయ్ అగర్వాల్ (సి) పునీత్ (బి) పంకజ్ రావు 3; అంబటి రాయుడు (సి) హర్‌ప్రీత్ సింగ్ (బి) అజయ్ మండల్ 22; సందీప్ (సి) అశుతోష్ సింగ్ (బి) శశాంక్ సింగ్ 39; మల్లికార్జున్ (సి) శశాంక్ సింగ్ (బి) అజయ్ మండల్ 11; మిలింద్ (బి) శశాంక్ సింగ్ 7; మెహదీహసన్ (సి) అమన్‌దీప్ (బి) వీర్ ప్రతాప్ సింగ్ 0; సిరాజ్ (సి) అశుతోష్ సింగ్ (బి) వీర్ ప్రతాప్ సింగ్ 0; రవికిరణ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–7, 2–30, 3–34, 4–86, 5–91, 6–107, 7–147, 8–147, 9–147, 10–147. బౌలింగ్: పంకజ్ రావు 4–0–13–2, వీర్ ప్రతాప్ సింగ్ 3.5–0–23–4, పునీత్ 3–0–23–0, అజయ్ 5–0–24–2, శశాంక్ సింగ్ 4–0–61–2. -
సంజూ శాంసన్ ప్రపంచ రికార్డు
అలూర్: భారత్ తరఫున కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 ఆడిన అనుభవం ఉన్న యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తనను మరొకసారి భారత జట్టులోకి తీసుకోవాలనే సంకేతాలు పంపుతూ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గుర్తింపు కల్గిన లిస్ట్-ఏ క్రికెట్లో ద్విశతకంతో మెరిశాడు. ఫలితంగా ప్రపంచ రికార్డు సాధించాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా విజయ్ హజారే ట్రోఫీలో కేరళకు ప్రాతినిథ్యం వహిస్తున్న శాంసన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. గోవాతో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ 129 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 212 పరుగులు చేశాడు. దాంతో తొలి డబుల్ సెంచరీ ని ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో లిస్ట్-ఏ క్రికెట్లో ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు పాకిస్తాన్‌కు చెందిన అబిద్ అలీ(209 నాటౌట్) పేరిట ఉండగా, దాన్ని సంజూ శాంసన్ బ్రేక్ చేశాడు. గతంలో పాకిస్తాన్ నేషనల్ వన్డే కప్‌లో భాగంగా ఇస్లామాబాద్ తరఫున ఆడిన సందర్భంలో పెషావర్‌తో జరిగిన మ్యాచ్‌లో అబిద్ వికెట్ కీపర్‌గా అత్యధిక పరుగుల రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ఆ రికార్డును సంజూ శాంసన్ బద్ధలు కొట్టి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేరళ 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. సంజూ శాంసన్ డబుల్ సెంచరీకి తోడు సచిన్ బేబీ(127) సెంచరీ నమోదు చేశాడు. ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గోవా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్లానికి 273 పరుగులు చేసి ఓటమి పాలైంది. -
విజయ్ హజారే ట్రోఫీ: ఆంధ్రపై హైదరాబాద్ విజయం
ఆలూరు(కర్ణాటక): దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైద రాబాద్ మరో విజ యాన్ని ఖాతాలో వేసుకుంది. గురు వారం ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. యువ ఆటగాడు తిలక్ వర్మ (83: 59 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీతో మెరిశాడు. మిగిలిన వారిలో తన్మయ్ అగర్వాల్(18), అంబటి రాయుడు(17), భవనాక సందీప్(28), హిమాలయ్ అగర్వాల్(11) రెండంకెల స్కోరు చేశారు. అక్షత్ రెడ్డి(3), సీవీ మిలింద్(5) నిరాశపరిచారు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్ 2 వికెట్లు పడగొట్టగా, షోయబ్ ఎండీ ఖాన్, కేవీ శశికాంత్, దాసరి స్వరూప్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో శ్రీకర్ భరత్(2) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగ్గా, ప్రణీత్(1) స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. ఈ దశలో ప్రశాంత్ కుమార్(57: 42బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ రికీ భుయ్(58: 40 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించడంతో ఆంధ్ర విజయం దిశగా దూసుకెళుతున్నట్లు కనిపించింది. అయితే, వీరిద్దరూ వెనుదిరిగాక తడబడిన మిగిలిన వారు రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 3, రవికిరణ్ 2 వికెట్లు పడగొట్టారు. -
హైదరాబాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బౌలింగ్‌లో మొహమ్మద్ సిరాజ్, సందీప్ అదరగొట్టగా... అనంతరం బ్యాటింగ్‌లో తన్మయ్ అగర్వాల్ అర్ధ శతకంతో కదం తొక్కడంతో హైదరాబాద్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. బెంగళూరు వేదికగా గోవాతో సోమవారం జరిగిన ఎలైట్ గ్రూప్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గోవాను సిరాజ్ (4/20), బావనక సందీప్ (4/13) బెంబేలెత్తించారు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి రెండు బంతుల్లో సగుణ్ కామత్ (0), స్నేహల్ (0)లను ఔట్ చేసి ప్రత్యర్థి పతనానికి బాటలు వేశాడు. కాసేపటి తర్వాత హైదరాబాద్ బౌలర్లు మరో రెండు వికెట్లు తీయడంతో గోవా 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ సునీల్ దేశాయ్ (87 బంతుల్లో 55; 4 ఫోర్లు, సిక్స్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అతను అమిత్ వర్మ (46 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్)తో కలిసి ఐదో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. దీంతో గోవా 100 పరుగుల మార్కును దాటింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను రోహిత్ రాయుడు విడదీశాడు. రోహిత్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన అమిత్ వర్మ మిలింద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఇక్కడి నుంచి సందీప్ మాయాజాలం ప్రారంభమైంది. అర్ధ శతకంతో కుదురుకున్న సునీల్ దేశాయ్‌తో పాటు మరో ముగ్గురిని ఔట్ చేయడంతో... గోవా 37.4 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినా... ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (71 బంతుల్లో 66 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్) అండతో హైదరాబాద్ 22.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. రెండో ఓవర్ మూడో బంతికి పరుగు కోసం ప్రయత్నించిన ఓపెనర్ అక్షత్ రెడ్డి (0) రనౌట్ కాగా... రోహిత్ రాయుడు (1) కాసేపటికే పెవిలియన్ చేరడంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తన్మయ్ అగర్వాల్ , సారథి అంబటి రాయుడు (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) జట్టును ఆదుకున్నారు. వీరు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు మూడో వికెట్‌కు 44 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. రాయుడు ఔటైనా... మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న తన్మయ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతను మల్లికార్జున్ (28 బంతుల్లో 30; 4 పోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. అయితే చివర్లో గోవా బౌలర్లు వెంట వెంటనే రెండు వికెట్లు తీసినా... తన్మయ్ లాంఛనం పూర్తి చేశాడు. స్కోర్ వివరాలు గోవా ఇన్నింగ్స్: సగున్ కామత్ (సి) తన్మయ్ (బి) సిరాజ్ 0; సునీల్ దేశాయ్ (సి) మల్లికార్జున్ (బి) సందీప్ 55; స్నేహల్ (సి) మల్లికార్జున్ (బి) సిరాజ్ 0; కౌశిక్ (సి) తన్మయ్ (బి) సిరాజ్ 11; ప్రభు దేశాయ్ (సి) మల్లికార్జున్ (బి) మిలింద్ 8; అమిత్ వర్మ (సి) మిలింద్ (బి) రోహిత్ రాయుడు 29; గౌతం (ఎల్బీ) (బి) సందీప్ 0; మిసాల్ (సి) మల్లికార్జున్ (బి) సిరాజ్ 8; గార్గ్ (బి) సందీప్ 0; శుభం దేశాయ్ (నాటౌట్) 4; పరబ్ (సి) హిమాలయ్ అగర్వాల్ (బి) సందీప్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (37.4 ఓవర్లలో ఆలౌట్) 122. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–17, 4–42, 5–110, 6–110, 7–117, 8–117, 9–121, 10–122. బౌలింగ్: సిరాజ్ 9–2–20–4, మిలింద్ 6–1–18–1, మెహదీ హసన్ 5–0–14–0, సాకేత్ సాయిరామ్ 5–0–33–0, సందీప్ 7.4–2–13–4, రోహిత్ రాయుడు 5–0–23–1. హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (నాటౌట్) 66; అక్షత్ (రనౌట్) 0; రోహిత్ రాయుడు (సి) మిసాల్ (బి) పరబ్ 1; అంబటి రాయుడు (సి) అమిత్ వర్మ (బి) మిసాల్ 21; మల్లికార్జున్ (సి) గౌతం (బి) గార్గ్ 30; సందీప్ (బి) శుభం దేశాయ్ 2; హిమాలయ్ అగర్వాల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (22.2 ఓవర్లలో 5 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–4, 2–15, 3–59, 4–114, 5–117. బౌలింగ్: గార్గ్ 6–0–38–1, పరబ్ 6–1–21–1, మిసాల్ 6–0–36–1, శుభం దేశాయ్ 3.2–0–25–1, అమిత్ వర్మ 1–0–5–0. -
హైదరాబాద్ విజయం
బెంగళూరు: కర్ణాటకతో మంగళవారం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ వన్డే మ్యాచ్‌లో రాయుడు స్ఫూర్తిదాయక అర్ధ సెంచరీ (111 బంతుల్లో 87 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కదం తొక్కాడు. దీంతో హైదరాబాద్ 21 పరుగుల తేడాతో హేమాహేమీలున్న కర్ణాటకపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో హైదరాబాద్‌కిది రెండో గెలుపు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. హైదరాబాద్ ఒకదశలో 121/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడు ఓర్పుతో బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. అతను సీవీ మిలింద్ (36; 4 ఫోర్లు)తో కలిసి ఏడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం బెంగళూరు 45.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటై ఓడింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ (4/35), సిరాజ్ (2/38) ఆకట్టుకున్నారు. కర్ణాటక జట్టులో దేవదత్ పడిక్కల్ (60; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
హైదరాబాద్ బోణీ
ఆలూరు (బెంగళూరు): దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ బోణీ కొట్టింది. శనివారం సౌరాష్ట్రతో మ్యాచ్‌లో 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (98 బంతుల్లో 75; 5 ఫోర్లు, సిక్స్), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ (74 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. సారథి అంబటి రాయుడు (17) నిరాశపరిచాడు. చివర్లో బవనక సందీప్ (38; 2 ఫోర్లు, సిక్స్) దూకుడుతో జట్టు 250 పరుగుల మార్కు దాటింది. అనంతరం సందీప్ బౌలింగ్‌తో సౌరాష్ట్రను కుప్పకూల్చాడు. 9.1 ఓవర్లు వేసిన అతడు 26 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో సౌరాష్ట్ర 39.1 ఓవర్లలో 131 పరుగులకు పరిమితమైంది. కేఎల్ రాహుల్భారీ శతకం బెంగళూరు వేదికగా కేరళతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ భారీ శతకం (122 బంతుల్లో 133; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కదంతొక్కాడు. మొదట కర్ణాటక రాహుల్, మనీశ్ పాండే (50) రాణించడంతో 49.5 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. కేరళ 46.4 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ విష్ణు వినోద్ (104), సంజూ శామ్సన్ (67) మినహా మరెవరూ నిలవకపోవడంతో 123 పరుగుల తేడాతో ఓడింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై చత్తీస్‌గఢ్ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత ముంబై 50 ఓవర్లలో 317 పరుగులు చేయగా... చత్తీస్‌గఢ్ బంతి మిగిలి ఉండగానే 318 పరుగులు చేసింది. -
రంజీ ట్రోఫీకి రంగం సిద్ధం
న్యూఢిల్లీ: 4 గ్రూపులు... 37 జట్లు... 50 మైదానాలు... 160 మ్యాచ్‌లు. దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 2018–19 సీజన్‌కు నేటి నుంచి తెరలేవనుంది. 84 ఏళ్ల రంజీ చరిత్రలో ఇంత సుదీర్ఘ షెడ్యూల్, ఇన్ని జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. 18 ఏళ్ల విరామం అనంతరం బిహార్ జట్టు తిరిగి దేశవాళీ బరిలో దిగనుండగా... మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, పుదుచ్చేరి జట్లు తొలిసారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న ఈ జట్లు సంప్రదాయ ఫార్మాట్లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి. అయితే... ఆస్ట్రేలియా పర్యటనతో పాటు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు భారత్ ‘ఎ’ జట్లను ఇప్పటికే ప్రకటించడంతో... కొత్త కుర్రాళ్లు ఈ సీజన్లో సత్తాచాటినా వెనువెంటనే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం లేదు. కానీ తమ ప్రదర్శనతో ఆకట్టుకొని సెలెక్టర్ల దృష్టిలో పడటానికి ఇది మంచి చాన్స్. ఆంధ్ర, హైదరాబాద్ గ్రూప్ ‘బి’లో... 37 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’, ‘బి’ల్లో తొమ్మిదేసి జట్లు ఉండగా... గ్రూప్ ‘సి’లో పది జట్లు పాల్గొంటున్నాయి. ఇక కొత్తగా వచ్చిన జట్లు ప్లేట్ గ్రూప్‌లో బరిలో దిగనున్నాయి. ముంబై, కర్ణాటక, మహారాష్ట్ర, సౌరాష్ట్ర, రైల్వేస్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, బరోడా, గుజరాత్‌లతో గ్రూప్ ‘ఎ’... ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు మధ్యప్రదేశ్‌లతో గ్రూప్ ‘బి’ పటిష్టంగా ఉన్నాయి. ‘ఎ’, ‘బి’గ్రూపుల నుంచి కలిపి అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఐదు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. గ్రూప్ ‘సి’ నుంచి రెండు జట్లు, ప్లేట్ గ్రూప్ నుంచి ఓ జట్టు క్వార్టర్స్‌కు చేరతాయి. సీనియర్లు దూరం కావడంతో ఆయా జట్ల తరఫున కొత్త కుర్రాళ్లు బరిలో దిగనున్నారు. భారత్ ‘ఎ’ జట్టుకు ఎంపికవడంతో విహారి, సిరాజ్ లేకుండానే ఆంధ్ర, హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ►రంజీ ట్రోఫీని ఇప్పటివరకూ ముంబై (బాంబే) అత్యధికంగా 41 సార్లు గెలుచుకుంది. ►హైదరాబాద్(vs)కేరళ (తిరువనంతపురంలో) ►ఆంధ్రప్రదేశ్(vs)పంజాబ్ (విశాఖపట్నంలో) -
విజేతకు ఇంకా డబ్బులు అందలేదు!
ముంబై: పుష్కర కాలం తర్వాత విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న ముంబై జట్టు సభ్యులకు ఇప్పటి వరకు టోర్నీకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా లభించలేదు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)లో పరిపాలన స్తంభించిపోవడంతో వారికి ఈ పరిస్థితి ఎదురైంది. నిబంధనల ప్రకారం బీసీసీఐ నేరుగా ఆటగాళ్లకు డబ్బు లు ఇవ్వకుండా సదరు సంఘం ద్వారానే చెల్లింపులు జరుపుతుంది. ఒక్కో ఆటగాడికి రోజూవారీ భత్యం కింద రూ.1500 లభిస్తుంది. దాదాపు నెల రోజులు సాగిన ఈ టోర్నీ ద్వారా ఒక్కో ఆటగాడికి రూ. 45 వేల వరకు రావాల్సి ఉంది. విజేతగా నిలిచిన జట్టుకు లభించే రూ. 20 లక్షల ప్రైజ్‌మనీ కూడా ముంబై ఆటగాళ్లకు దక్కలేదు. దీంతో పాటు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్ ఫీజు కింద రూ. 35 వేల వంతున కూడా ఇవ్వాల్సి ఉంది. ఎంసీఏలో చెక్‌లపై సంతకం పెట్టే అధికారం కూడా ప్రస్తుతం ఎవరికీ లేకపోవడంతో ఆటగాళ్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
‘విజయ్ హజారే’ విజేత ముంబై
బెంగళూరు: ఆద్యంతం ఆధిపత్యం చలాయించి అజేయంగా నిలిచిన ముంబై జట్టు 12 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీని గెల్చుకుంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. పేసర్లు ధవల్ కులకర్ణి (3/30), శివమ్ దూబే (3/29) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 45.4 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్య ఛేదనలో కీలక బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా(8), అజింక్య రహానే(10), శ్రేయస్ అయ్యర్ (7), సూర్యకుమార్ యాదవ్(4) విఫలమైనా... ఆదిత్య తరే అద్భుత అర్ధశతకంతో (89 బంతుల్లో 71; 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో ముంబై 35 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి గెలిచింది. ఓవరాల్‌గా విజయ్ హజారే ట్రోఫీని ముంబై దక్కించుకోవడం ఇది పదోసారి. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆదిత్య తరేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. -
తారె విజృంభణ.. గంభీర్ టీమ్‌కు షాక్
సాక్షి, బెంగళూరు : ముంబై మరో సారి మెరిసింది. విజయ్ హజారే 2018 ట్రోఫీని ముంబై వశం చేసుకుంది. శనివారం ఢిల్లీతో జరిగిన ఫైనల్లో టాపార్డర్ విఫలమైన మిడిలార్డర్ రాణించడంతో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 178 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ముంబై జట్టు ఇబ్బందులు పడింది. చివరకు 35.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. నవదీప్ సైనీ(3/53) దెబ్బకు శ్రేయస్ సేన 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు పృథ్వీ షా(8), రహానే(10), సారథి శ్రేయస్ అయ్యర్ (7), సూర్యకుమార్ యాదవ్(4) విఫలమయ్యారు. ఈ క్రమంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఆదిత్య తారె (71), సిద్దేశ్ లాడ్(48)లు క్లిష్ట సమయంలో జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించిన అనంతరం తారె వెనుదిరిగాడు. ఇక చివర్లో శివం దుబె(19 నాటౌట్) మెరిసి ముంబై గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి అనుకున్న ఆరంభం లభించలేదు. గంభీర్ సేన 45.4 ఓవర్లలో 177 పరుగుల స్వల్పస్కోర్‌కే ఆలౌటైంది. స్టార్ బ్యాట్స్‌మ్‌న్ గౌతమ గంభీర్(1), ఉన్ముక్త్ చంద్ (13) దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో జట్టును ధ్రువ్ షోరె(41), హిమ్మన్ సింగ్(31), పవన్ నేగి(21) రాణించడంతో ఢిల్లీ జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ముంబై బౌలర్లలో ధావల్ కులకర్ణి(3/30), శివం దుబే(3/29), తుషార్(2/30)లు రాణించారు. -
పృథ్వీ షా మెరుపులు.. రోహిత్ శర్మ ఫిదా
బెంగళూరు: భారత యువ ఓపెనర్ పృథ్వీ షా సంచలన బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటున్నాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో (134, 70, 33 నాటౌట్ ) పరుగులు సాధించి అరంగేట్రంలో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పృథ్వీ షా.. దేశవాళీ మ్యాచ్‌ల్లో భాగంగా విజయ్ హజారే ట్రోఫీలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. బుధవారం బెంగళూరు వేదికగా హైదరాబాద్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పృథ్వీ షా (61; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం బాదాడు. దాంతో ముంబై అలవోకగా ఫైనల్‌కు చేరింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అంబటి రాయుడు (11) విఫలమైనా.. రోహిత్ రాయుడు (121 నాటౌట్: 132 బంతుల్లో 8x4, 3x6) అజేయ శతకం బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 6 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకి దిగిన ముంబై జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ (17: 24 బంతుల్లో 2x4)తో నెమ్మదిగా ఆడినా.. పృథ్వీ షా మాత్రం భారీ షాట్లతో చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వరుస బౌన్సర్లతో పృథ్వీ షాని పరీక్షించేందుకు ప్రయత్నించి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. బౌన్సర్‌గా వచ్చిన ఆ ఓవర్లోని నాలుగో బంతిని అప్పర్ కట్ ద్వారా థర్డ్ మ్యాన్ దిశగా సిక్స్ బాదిన పృథ్వీ షా.. ఐదో బంతినీ ఫైన్ లెగ్ దిశగా బౌండరీ అవల పడేలా బాదేశాడు. దీంతో ఒత్తిడికి గురైన సిరాజ్.. చివరి బంతిని శరీరంపైకి వచ్చేలా విసిరినా.. దాన్నీ లెగ్ సైడ్ బౌండరీకి తరలించి 34 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. పృథ్వీ షా బ్యాటింగ్‌ని నాన్‌స్ట్రైక్ ఎండ్‌ని చూసిన రోహిత్ శర్మ ఫిదా అయిపోయాడు. రోహిత్ రాయుడు సెంచరీ వృథా -
రోహిత్ రాయుడు సెంచరీ వృథా
సీజన్ మొత్తం నిలకడగా రాణించిన హైదరాబాద్ జట్టుకు కీలకపోరులో నిరాశే ఎదురైంది. హేమాహేమీలతో కూడిన ముంబై జోరు ముందు నిలవలేక సెమీఫైనల్లో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించి గౌరవప్రద స్కోరు చేసినా... పటిష్ట ముంబై లైనప్ ముందు అది సరిపోలేదు. స్టార్ బ్యాట్స్‌మెన్ జోరుకు తోడు వరుణుడు కూడా సహకరించడంతో విజయ్ హజారే టోర్నీలో ముంబై ఫైనల్‌కు దూసుకెళ్లింది. బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో హైదరాబాద్ జట్టు పోరాటం ముగిసింది. సంచలనాలు సృష్టిస్తూ తొలిసారి సెమీస్ చేరిన హైదరాబాద్ పటిష్ట ముంబైని నిలవరించలేక ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో ఆంధ్రపై గెలిచి మంచి జోరు మీదున్న హైదరాబాద్ సెమీస్‌లో ముంబై దూకుడు ముందు నిలువలేకపోయింది. రోహిత్ రాయుడు (132 బంతుల్లో 121 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగడంతో... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ తుషార్ దేశ్‌పాండే (3/55) రాణించాడు. అనంతరం యువ సంచలనం పృథ్వీ షా (44 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (53 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో సత్తా చాటడంతో ముంబై 60 పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష్యఛేదనలో 25 ఓవర్లలో 155/2తో ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. వర్షం తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతి ప్రకారం ముంబైను విజేతగా ప్రకటించారు. వీజీడీ పద్ధతి ప్రకారం 25 ఓవర్లలో ముంబై విజయం ఖరారు కావాలంటే 95 పరుగులు చేయాల్సింది. అయితే ఆ స్కోరుకంటే ముంబై 60 పరుగులు ఎక్కువగానే చేసి విజయాన్ని దక్కించుకుంది. అతనొక్కడే... ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్న కెప్టెన్ అంబటి రాయుడు నిర్ణయం హైదరాబాద్‌కు కలిసిరాలేదు. ఈ టోర్నీలో ఇప్పటివరకు జట్టుకు శుభారంభాలు అందించిన ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (11), అక్షత్ రెడ్డి (7) విఫలమయ్యారు. తుషార్ చెలరేగడంతో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. అనంతరం బావనక సందీప్ (29; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రోహిత్ రాయుడు ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించాక సందీప్ ఔటయ్యాడు. ఆ తర్వాత అంబటి రాయుడు (11), సుమంత్ (3), సీవీ మిలింద్ (10) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో రోహిత్ రాయుడు ఆకాశ్ భండారి (19; 2 ఫోర్లు)తో కలిసి ఏడో వికెట్‌కు 57 పరుగులు... మెహదీ హసన్ (17 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 58 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోరు అందించాడు. లక్ష్యం చిన్నబోయింది... ఓ మోస్తరు లక్ష్యఛేదనలో బరిలో దిగిన ముంబైకి ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. రోహిత్ శర్మ (24 బంతుల్లో 17; 2 ఫోర్లు) అండగా పృథ్వీ షా రెచ్చిపోయాడు. హైదరాబాద్ కెప్టెన్ అంబటి రాయుడు లెగ్ స్పిన్నర్ ఆకాశ్ భండారితో తొలి ఓవర్ వేసే అవకాశం ఇచ్చాడు. అయితే భండారి బౌలింగ్‌లో బౌండరీలతో పృథ్వీ షా విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 73 పరుగులు జోడించారు. షా ధాటికి హైదరాబాద్ ప్రధాన పేసర్ సిరాజ్ 3 ఓవర్లలోనే 33 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం మెహదీ హసన్ వరుస ఓవర్లలో వీరిద్దరినీ ఔట్ చేసినా... కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే (17 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 73 పరుగులు జోడించాడు. దీంతో ముంబై 25 ఓవర్లలోనే 155/2తో నిలిచింది. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో జార్ఖండ్‌తో ఢిల్లీ తలపడనుంది. గెలిచిన జట్టుతో శనివారం జరిగే ఫైనల్లో ముంబై ఆడుతుంది. -
సెమీఫైనల్లో హైదరాబాద్
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్... 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర స్కోరు 36.3 ఓవర్లు ముగిసేసరికి 198/2... అప్పటికే హనుమ విహారి (99 బంతుల్లో 95; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రికీ భుయ్ (71 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 112 పరుగులు జోడించి జోరు మీదుండటంతో ఆంధ్ర గెలుపు దిశగా సాగుతోంది. ఈ స్థితిలో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (3/50) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. తన వరుస ఓవర్లలో భుయ్, విహారిలను ఔట్ చేసి ఆంధ్ర ఆశలపై నీళ్లు చల్లాడు. చివరకు 14 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా, ఆంధ్ర నిష్క్రమించింది. ముందుగా హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బావనక సందీప్ (97 బంతుల్లో 96; 7 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, తన్మయ్ అగర్వాల్ (31; 2 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (28; ఫోర్, సిక్స్), సుమంత్ (27; 2 ఫోర్లు, సిక్స్), సీవీ మిలింద్ (7 బంతుల్లో 15; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో అయ్యప్ప, గిరినాథ్ రెడ్డి, పృథ్వీరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆంధ్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 267 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ హనుమ విహారి శతకం కోల్పోగా, అశ్విన్ హెబర్ (38) రాణించాడు. రేపు జరిగే తొలి సెమీఫైనల్లో ముంబైతో హైదరాబాద్, గురువారం జరిగే రెండో సెమీస్‌లో ఢిల్లీతో జార్ఖండ్ ఆడతాయి. -
అభిమాని ముద్దు.. ఈ సారి రోహిత్ వంతు
ముంబై: అభిమానులు తమ అభిమాన క్రికెటర్ కనిపిస్తే ఆటోగ్రాఫ్.. వీలుంటే సెల్ఫీలు తీసుకోవడం కామన్. కానీ తమ అభిమాన క్రికెటర్‌ను కలిసిన ఆనందంలో ముద్దులు పెడుతూ ట్రెండ్ మార్చుతున్నారు. అయితే మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో సెక్యూరిటీ కళ్లు కప్పి మైదానంలోకి దూసుకరావడం ఇబ్బంది కలిగించే అంశం. ఇక మ్యాచ్ మధ్యలో తరుచుగా అభిమానులు మైదానంలోకి వస్తుండటంపై సెక్యూరిటీ వైఫల్యాలపై అందరూ వేలేత్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా-వెస్టిండీస్‌ల మధ్య జరిగిన రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కెప్టెన్ విరాట్ కోహ్లితో సెల్ఫీ దిగి, ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. అంపైర్లు, సెక్యూరిటీ అప్రమత్తవడంతో అభిమానిని బయటకి పంపించారు. అభిమానుల నుంచి ఊహించని ఇలాంటి ఘటనే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఎదురైంది. (ముద్దు మీరిన అభిమానం) ఆదివారం విజయ్‌హజారే ట్రోఫి తొలి క్వార్టర్ ఫైనల్లో భాగంగా ముంబై-బిహార్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. బిహార్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై బ్యాటింగ్‌కు దిగింది. అయితే రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నసమయంలో ఓ అభిమాని అకస్మాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. రోహిత్‌కు ముద్దు పెట్టే ప్రయత్నం చేసి, పాదాలను తాకబోయాడు. అనంతరం అభిమాని ఎగిరిగంతేసుకుంటూ మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం రోహిత్‌కు అభిమాని ముద్దుపెడుతున్న వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. రోహిత్‌ను అభిమాని ముద్దుపెట్టుకుంటే రితికా అసూయ పడుతున్నారు కావచ్చని అభిమానులు ఫన్నీగా స్పందించారు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. (మూడు సెక్షన్ల కింద కేసు నమోదు...) -
అభిమాని ముద్దు.. ఈ సారి రోహిత్ వంతు
-
ఆంధ్రకు తొలి పరాజయం
న్యూఢిల్లీ: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గౌతమ్ గంభీర్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు 73 పరుగుల తేడాతో ఆంధ్రపై గెలుపొందింది. గ్రూప్ ‘బి’లో మంగళవారం జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హిమ్మత్ సింగ్ (75 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్ ఉన్ముక్త్ చంద్ (62), నితీశ్ రాణా (52) అర్ధ సెంచరీలు సాధించారు. గంభీర్ 37 పరుగులు చేశాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి 2, షోయబ్ ఖాన్, కరణ్ శర్మ చెరో వికెట్ తీశారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర 49.5 ఓవర్లలో 241 పరుగుల వద్ద ఆలౌటైంది. ప్రశాంత్ (54), రికీ భుయ్ (48) రాణించారు. రవితేజ (35), కరణ్ శర్మ (25) కాస్త మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్లలో కెజ్రోలియా, పవన్ నేగి, నితీశ్ రాణా తలా 2 వికెట్లు పడగొట్టారు. ఆరు మ్యాచ్‌లాడిన ఆంధ్ర నాలుగింట గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఈ గ్రూప్‌లోనే జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో కేరళపై గెలిచింది. 7 మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌కు ఇది నాలుగో గెలుపు కాగా... రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. -
హైదరాబాద్ ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన హైదరాబాద్ జట్టు విజయ్ హజారే వన్డే టోర్నీలో మూడో విజయాన్ని అందుకుంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌పై 101 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (16), అక్షత్ రెడ్డి (25; 4 ఫోర్లు) త్వరగానే పెవిలియన్ చేరినా... వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ కె. రోహిత్ రాయుడు (102 బంతుల్లో 75; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. బావనక సందీప్ (44; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్‌కు 77 పరుగుల్ని జోడించాడు. జట్టు స్కోరు 172 పరుగుల వద్ద అశుతోష్ సింగ్ బౌలింగ్‌లో సుమిత్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో 222 పరుగుల వద్ద హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. ప్రత్యర్థి బౌలర్లలో పంకజ్ రావు 3, సుమిత్ 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 223 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఛత్తీస్‌గఢ్‌ను బౌలర్లు మెహదీ (3/19), సాకేత్ (3/28), ఆకాశ్ భండారి (2/31) కట్టడి చేశారు. వీరి ధాటికి ఛత్తీస్‌గఢ్ 33.3 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. తొమ్మిది జట్లున్న గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆరు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచి, రెండింటిలో ఓడింది. మరో మ్యాచ్ రద్దయింది. ప్రస్తుతం హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో 2న కేరళతో... 6న ఒడిశాతో ఆడనుంది. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ ఎల్బీడబ్ల్యూ (బి) జతిన్ 16; అక్షత్ రెడ్డి (సి) హర్‌ప్రీత్ (బి) సుమిత్ 25; రోహిత్ రాయుడు (సి) సుమిత్ (బి) అశుతోష్ 75; సుమంత్ (సి) హర్‌ప్రీత్ (బి) అజయ్ 13; సందీప్ (సి) అశుతోష్ (బి) పంకజ్ 44; ఆశిష్ (సి) జతిన్ (బి) పంకజ్ 14; ఆకాశ్ భండారి (సి) జతిన్ (బి) పంకజ్ 9; మిలింద్ రనౌట్ 8; సిరాజ్ (సి) అశుతోష్ (బి) సుమిత్ 4; మెహదీ హసన్ నాటౌట్ 3; సాకేత్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–44, 2–54, 3–95, 4–172, 5–195, 6–195, 7–213, 8–217, 9–217. బౌలింగ్: పంకజ్ 10–0–41–3, విశాల్ సింగ్: 10–0–61–0, సుమిత్ 9–0–41–2, జతిన్ 10–0–34–1, అజయ్ 6–0–19–1, అశుతోష్ 5–0–21–1. ఛత్తీస్‌గఢ్ ఇన్నింగ్స్: రిషభ్ (సి) సుమంత్ (బి) మెహదీ హసన్ 7; అశుతోష్ (బి) ఆకాశ్ భండారి 38; హర్‌ప్రీత్ (సి) మిలింద్ 2; అమన్‌దీప్ రనౌట్ 10; సంజీత్ (సి)భండారి (బి) సాకేత్ 2; మనోజ్ ఎల్బీడబ్ల్యూ (బి) సాకేత్ 5; అజయ్ (బి) ఆకాశ్ 3; విశాల్ (సి) సుమంత్ (బి) సాకేత్ 1; జతిన్ (సి) మిలింద్ (బి) మెహదీ హసన్ 37; సుమిత్ ఎల్బీడబ్ల్యూ (బి) మెహదీ హసన్ 11; పంకజ్ రావు నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (33.3 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1–34, 2–37, 3–60, 4–62, 5–64, 6–70, 7–73, 8–73, 9–94, 10–121. బౌలింగ్: సిరాజ్ 4–0–23–0, మిలింద్ 5–0– 20–1, మెహదీ హసన్ 7.3–1–19–3, సాకేత్ 8–1–28–3, ఆకాశ్ భండారి 9–0–31–2. -
ఎదురులేని ఆంధ్ర
న్యూఢిల్లీ: మరోసారి సమష్టి ప్రదర్శన చేసిన ఆంధ్ర జట్టు విజయ్ హజారే దేశవాళీ వన్డే టోర్నమెంట్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సౌరాష్ట్రతో ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచి 18 పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 214 పరుగులు సాధించింది. అర్పిత్ (55; 2 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి, కరణ్ శర్మ రెండేసి వికెట్లు తీయగా... బండారు అయ్యప్ప, మనీశ్, షోయబ్‌లకు ఒక్కో వికెట్ లభించింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 48.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ప్రశాంత్ కుమార్ (81 బంతుల్లో 73; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బోడపాటి సుమంత్ (49 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు), రవితేజ (26 బంతుల్లో 29 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించారు.