VHT 2022: Gaikwad, Unadkat set up Maharashtra-Saurashtra finale - Sakshi
Sakshi News home page

VHT 2022 Final: ఒకరు బ్యాట్‌తో, మరొకరు బంతితో.. అదరగొట్టిన కెప్టెన్లు! ఫైనల్‌ ఎప్పుడంటే

Published Thu, Dec 1 2022 12:54 PM | Last Updated on Thu, Dec 1 2022 1:31 PM

VHT 2022: Ruturaj Maharashtra Unadkat Saurashtra To Face In FInal - Sakshi

అదరగొట్టిన రుతురాజ్‌, ఉనాద్కట్‌ (PC: The Hindu)

Vijay Hazare Trophy 2022 Final: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర, సౌరాష్ట్ర జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లలో మహారాష్ట్ర 12 పరుగుల తేడాతో అస్సాంపై గెలవగా.. సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది.

ఇక ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం ఫైనల్‌ జరుగుతుంది. కాగా ఈ సెమీస్‌ మ్యాచ్‌లలో మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, సౌరాష్ట్ర సారథి జయదేవ్‌ ఉనాద్కట్‌ అద్భుత ప్రదర్శన కనబరిచారు. జట్ల గెలుపులో కీలక పాత్ర పోషించి వీరిద్దరు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకోవడం విశేషం.

రుతు మరో సెంచరీ
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (126 బంతుల్లో 168; 18 ఫోర్లు, 6 సిక్స్‌లు) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మరో సెంచరీ సాధించగా, అంకిత్‌ బావ్నే (89 బంతుల్లో 110; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా శతకం బాదాడు. అనంతరం అస్సాం చివరి వరకు పోరాడి 50 ఓవర్లలో 8 వికెట్లకు 338 పరుగులు చేయగలిగింది.

చెలరేగిన ఉనాద్కట్‌
మరో సెమీస్‌లో ముందుగా కర్ణాటక 49.1 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. జయదేవ్‌ ఉనాద్కట్‌ 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌరాష్ట్ర 36.2  ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. 

చదవండి: ICC WC Super League: సిరీస్‌ సమం చేసిన శ్రీలంక.. ఇంకో రెండు మ్యాచ్‌లు గెలిస్తే నేరుగా..
Shikhar Dhawan: పంత్‌కు అండగా నిలబడాలి... సంజూ ఇంకొంత కాలం ఆగాల్సిందే.. ఎందుకంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement