Jaydev Unadkat
-
నరాలు తెగే ఉత్కంఠ: ఆఖరి ఓవర్లో ‘భయపెట్టిన’ ఉనాద్కట్! వీడియో
ఆఖరి ఓవర్.. మ్యాచ్ గెలవాలంటే ఆరు బంతుల్లో 29 పరుగులు కావాలి.. ఇదీ సమీకరణం.. ఇంతలో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు బౌలర్.. విజయావకాశం మీకే అన్నట్లుగా.. మొదటి బంతికే సిక్సర్.. ఆ తర్వాత వైడ్.. మళ్లీ వైడ్.. ఇప్పుడు గెలుపు సమీకరణం ఐదు బంతుల్లో 21 పరుగులు... ఫీల్డర్ తప్పిదం కారణంగా మళ్లీ సిక్సర్.. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు... ఫలితంగా గెలుపు సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులు... ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు.. మిగిలినవి ఆఖరి రెండు బంతులు.. ఇందులో మొదటిది వైడ్... రెండో బంతికి ఒక్క పరుగు.. ఇప్పటిదాకా డ్రామా నడిపించిన బ్యాటర్ కథ అప్పుడే ముగిసిపోవాల్సింది.. కానీ ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అతడు బతికిపోయాడు. గెలవడానికి ఒక్క బంతికి తొమ్మిది పరుగులు కావాలి.. ఏమో మళ్లీ వైడ్ బాల్స్ పడతాయేమోనన్న ఉత్కంఠ.. కానీ ఈసారి అలా జరుగలేదు.. ఆఖరి బంతికి సిక్స్ బాదడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెండు పరుగుల తేడాతో ప్రత్యర్థి విజయం సాధించింది. A Fantastic Finish 🔥 Plenty happened in this nail-biter of a finish where the two teams battled till the end🤜🤛 Relive 📽️ some of the drama from the final over ft. Jaydev Unadkat, Ashutosh Sharma & Shashank Singh 👌 Watch the match LIVE on @starsportsindia and @JioCinema… pic.twitter.com/NohAD2fdnI — IndianPremierLeague (@IPL) April 9, 2024 ఓడిపోతామేమో.. భయపెట్టిన ఉనాద్కట్.. ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ మధ్య ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన ఈ హోరాహోరీ పోరులో విజయం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది. ఆఖరి ఓవర్లో రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. జయదేవ్ ఉనాద్కట్ చేతికి బంతినివ్వగా.. పంజాబ్ బ్యాటర్ అశుతోశ్ శర్మ వరుసగా.. 6, వైడ్, వైడ్, 6, 2, 2, వైడ్, 1.. ఇలా 20 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి శశాంక్ సింగ్ సిక్స్ బాది స్కోరుకు మరో ఆరు పరుగులు జత చేశాడు. మధ్యలో రాహుల్ త్రిపాఠి ఓసారి క్యాచ్ జారవిడిచాడు. ఇలా సన్‌రైజర్స్ బౌలర్, ఫీల్డర్ తప్పిదాలు చేసినా ఆఖరికి విజయం వారినే వరించింది. ఫలితంగా తాజా ఎడిషన్‌లో హైదరాబాద్ జట్టు ఖాతాలో మూడో గెలుపు చేరింది. అదరగొట్టిన నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్ కాగా ముల్లన్‌పూర్‌లో మంగళవారం జరిగిన పంజాబ్- సన్‌రైజర్స్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి రేపింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (37 బంతుల్లో 64), అబ్దుల్ సమద్(12 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 189 రన్స్ స్కోరు చేసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇక లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడిన పంజాబ్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ధనాధన్ ఇన్నింగ్స్‌తో పాటు ఒక వికెట్ తీసిన నితీశ్ రెడ్డిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక అభిమానులకు అసలైన టీ20 మజా అందించిన పంజాబ్- సన్‌రైజర్స్ ఆఖరి ఓవర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. So close, yet so far for Shashank and #PBKS 💔#IPLonJioCinema #TATAIPL #PBKSvSRH pic.twitter.com/F51V0OzroY — JioCinema (@JioCinema) April 9, 2024 -
IPL 2024 SRH VS MI: ఐపీఎల్లో టాప్-2 స్కోర్లు.. కామన్‌గా ఒకే ఆటగాడు..!
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్.. లీగ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ ఈ రికార్డును నెలకొల్పే క్రమంలో ఆర్సీబీ పేరిట ఉండిన పాత రికార్డును బద్దలు కొట్టింది. 11 ఏళ్ల కిందట 2013 సీజన్లో ఆర్సీబీ.. పూణే వారియర్స్‌పై చేసిన 263 పరుగులే నిన్నటి మ్యాచ్‌కు ముందు వరకు ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్‌గా ఉండింది. ఐపీఎల్లో టాప్-2 స్కోర్లు నమోదైన సందర్భాల్లో ఓ ఆటగాడు కామన్‌గా ఉండటం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుత సన్‌రైజర్స్ ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ 2013లో ఆర్సీబీతో.. ప్రస్తుతం సన్‌రైజర్స్‌లో ఉన్నాడు. ఈ విషయం గురించి తెలిసి నెటిజన్లు ఉనద్కత్‌ను లక్కీ లెగ్గా పరిగణిస్తున్నారు. భారీ స్కోర్లు నమోదు కావాలంటే ఉనద్కత్ ఉండాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. రెండు మ్యాచ్‌ల్లో ఉనద్కత్ ప్రత్యర్దులపై రెండేసి వికెట్లు పడగొట్టాడు. Jaydev Unadkat is the only player who has been part of two of the highest totals in IPL history. 📸: IPL/BCCI pic.twitter.com/y0sU753Ovc — CricTracker (@Cricketracker) March 28, 2024 ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), మార్క్రమ్ (28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 42 నాటౌట్) విధ్వంసం సృష్టించడంతో సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), నమన్ ధిర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సన్‌రైజర్స్‌కు దడ పుట్టించారు. -
యానిమల్ ఓ బిగ్ డిజాస్టర్.. మండిపడ్డ టీమిండియా ఫాస్ట్ బౌలర్!
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో యానిమల్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా కానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం తన రివ్యూను ప్రకటించారు. (ఇది చదవండి: 'నా సామిరంగ'.. వరలక్ష్మి ఎలా ఉందో చూశారా?) అయితే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ బిగ్ డిజాస్టర్ అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా చూసి అవసరంగా మూడు గంటల టైమ్ వృథా చేశానని రాసుకొచ్చారు. సినిమా వాళ్లకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సూచించారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించే వారిపై ప్రశంసలు కురిపించడం తనకు బాధ కలిగించిందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'మనమేమీ అడవుల్లో నివసించటం లేదు. ప్రస్తుతం యుద్దాలు చేస్తూ వేటాడే సమాజంలో బతకడం లేదు. యాక్టింగ్ ఎంత గొప్పగా ఉన్నా సరే మితిమీరిన వయోలెన్స్ చూపించడం మంచిదికాదు. ఇలాంటి హింసను ప్రేరేపించే వారిని ఆదరించి ప్రశంసలు కురిపించడం బాధ కలిగించింది. లక్షల మంది సినిమాలు చూస్తారు. మీకు కూడా కనీస సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సినిమా వల్ల మూడు గంటల సమయం వేస్ట్ చేసుకున్నా' అని పోస్ట్ పెట్టారు. (ఇది చదవండి: కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..) -
ఇరానీ ట్రోఫీ 2023 విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
2023 ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. డిఫెండింగ్ రంజీ ఛాంపియన్స్ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 175 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 214, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 79 పరుగులకు ఆలౌటైంది. రాణించిన సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 5 వికెట్లు పడగొట్టగా.. ధరేంద్ర జడేజా 3, యువరాజ్ సింగ్ దోడియా 2 వికెట్లు తీశారు. చెలరేగిన సౌరభ్ కుమార్.. అనంతరం బరిలోకి దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది. అర్పిత్ వసవద (54) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (4/65), షమ్స్ ములానీ (2/47), పుల్కిత్ నారంగ్ (1/56) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. తిప్పేసిన పార్థ్ భట్.. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియాను పార్థ్ భట్ (7/53) తిప్పేశాడు. అతనికి జడేజా (3/65) కూడా తోడవ్వడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే చాపచుట్టేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (49) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్ (43), హనుమ విహారి (22), సర్ఫరాజ్ ఖాన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మరోసారి విజృంభించిన సౌరభ్ కుమార్.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ సౌరభ్ కుమార్ రెండో ఇన్నింగ్స్‌లోనూ విజృంభించడంతో (6/43) సారాష్ట్ర తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇరానీ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. సౌరభ్‌కు జతగా షమ్స్ ములానీ (3/22), పుల్కిత్ నారంగ్ (1/1) వికెట్లు పడగొట్టారు. -
Irani Trophy 2023: రాణించిన సాయి సుదర్శన్.. తొలి రోజు బౌలర్ల హవా
ఇరానీ ట్రోఫీ 2023లో తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం నడిచింది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర బౌలర్లు హవా కొనసాగించారు. పార్థ్ భట్ (4/85), ధరేంద్ర సింగ్ జడేజా (2/89), యువరాజ్ సింగ్ దోడియా (2/74) రాణించారు. వీరి ధాటికి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి రోజే 8 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రాణించిన సాయి సుదర్శన్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఓపెనర్లు సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం మాయంక్ ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన హనుమ విహారి (33) సైతం ఓ మోస్తరు స్కోర్ చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (17), యశ్ ధుల్ (10), పుల్కిత్ నారంగ్ (12) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరభ్ కుమార్ (30), నవదీప్ సైనీ (8) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఇరానీ ట్రోఫీ రంజీ ఛాంపియన్ టీమ్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుతుందన్న విషయం తెలిసిందే. -
రాణించిన ఉనాద్కట్, జయంత్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో బరిలోకి దిగిన భారత క్రికెటర్లు జైదేవ్ ఉనాద్కట్, జయంత్ యాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. లెస్టర్‌షైర్ క్లబ్‌తో జరిగిన డివిజన్–2 మ్యాచ్‌లో ససెక్స్ జట్టు తరఫున ఆడిన ఉనాద్కట్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఉనాద్కట్ 23 పరుగులిచ్చి 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ససెక్స్ జట్టు 15 పరుగుల తేడాతో గెలిచింది. లాంకషైర్‌తో జరిగిన డివిజన్–1 మ్యాచ్‌లో మిడిల్సెక్స్ జట్టుకు ఆడిన జయంత్ యాదవ్ 131 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ‘డ్రా’ అయింది. తొలిసారి కౌంటీ క్రికెట్లో ఆడుతున్న భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (3/63, 2/43) కెంట్ తరఫున ఐదు వికెట్లు తీసుకున్నాడు. -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీసిన జయదేవ్ ఉనద్కత్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా బౌలర్, భారత దేశవాలీ స్టార్ జయదేవ్ ఉనద్కత్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో తన రెండో మ్యాచ్‌లోనే 9 వికెట్లతో చెలరేగాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2-2023 సెకెండ్ లెగ్‌లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఉనద్కత్.. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్ ప్రదర్శన కారణంగా ససెక్స్ 15 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 12.4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి 32.4 ఓవర్లలో 94 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. హడ్సన్ ప్రెంటిస్ (65) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ కోల్స్ (44), టామ్ హెయిన్స్ (39), పుజారా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో శాలిస్బరీ 5 వికెట్టు పడగొట్టగా.. స్కాట్ కర్రీ, టామ్ స్క్రీవెన్ తలో 2 వికెట్లు, రైట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. "He's bowled him! He's bowled him! Unadkat takes the final wicket and Sussex have won!" 😁 The highlights from a thrilling final day against Leicestershire. 🙌 #GOSBTS pic.twitter.com/KSmW7qFySu — Sussex Cricket (@SussexCCC) September 14, 2023 అనంతరం బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్.. ఉనద్కత్ (3/23), కార్వెలాస్ (4/14), హడ్సన్ (2/30), హెయిన్స్ (1/33) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే కుప్పకూలింది. లీసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో రిషి పటేల్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ససెక్స్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టామ్ క్లార్క్ (69), జేమ్స్ కోల్స్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో స్క్రీవెన్ 4, రెహాన్ అహ్మద్ 2, రైట్, స్కాట్ కర్రీ తలో వికెట్ దక్కించుకున్నారు. 499 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్.. ఉనద్కత్ (6/94), కార్వెలాస్ (2/58), జాక్ కార్సన్ (2/98) ధాటికి 483 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ససెక్స్ 15 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఉనద్కత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
కౌంటీల్లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా బౌలర్.. పుజారాతో పాటు..!
విండీస్‌తో తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్‌తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెరటన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇంగ్లండ్ కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ససెక్స్ కౌంటీ ఉనద్కత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ కౌంటీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఉనద్కత్.. సెప్టెంబర్‌లో పునఃప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో తమతో జతకట్టనున్నాడని వారు పేర్కొన్నారు. ఈ స్టింక్ట్లో ఉనద్కత్ ససెక్స్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా తర్వాత ససెక్స్‌కు ఆడే అరుదైన అవకాశం ఉనద్కత్ దక్కింది. భారత దేశవాలీ అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన ఉనద్కత్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్‌లు ఆడి 382 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రాక్ రికార్డు చూసే ససెక్స్ ఉనద్కత్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ససెక్స్‌కు ఆడుతున్న ఇద్దరు భారతీయ క్రికెటర్లు సౌరాష్ట్రకు చెందిన వారే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ససెక్స్‌కు ప్రస్తుత కౌంటీ సీజన్ చెత్త సీజన్‌గా సాగింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లను డ్రా చేసుకుని కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా ఏప్రిల్‌లో జరిగిన తమ సీజన్ తొలి మ్యాచ్‌లో. మరోవైపు ఇంగ్లండ్‌లో ప్రస్తుతం దేశవాలీ వన్డే కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ససెక్స్ గ్రూప్-బిలో ఆఖరి నుంచి రెండో స్థానంతో చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంది. అయితే ఈ టోర్నీలో ససెక్స్ ఆటగాడు పుజారా మాత్రం చెలరేగిపోయాడు. పుజారా తానాడిన 5 మ్యాచ్‌ల్లో 2 శతకాలు బాదాడు. ఇదే టోర్నీలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా చెలరేగిపోయాడు. ఈ సీజన్‌తోనే కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన షా.. నార్తంప్టన్‌షైర్ తరఫున ఓ మెరుపు ద్విశతం, ఓ సుడిగాలి శతకం బాదాడు. అయితే షా అనూహ్యంగా గాయం బారిన పడి అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
విండీస్‌తో టెస్టుల్లో విఫలం! ఖరీదైన కారు కొన్న టీమిండియా క్రికెటర్.. ధర ఎంతంటే!
టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. విలాసంతమైన మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ ఎస్‌యూవీకి యజమాని అయ్యాడు. కాగా 2010లో ఐపీఎల్లో అడుగుపెట్టిన సౌరాష్ట్ర క్రికెటర్ ఉనాద్కట్.. అదే ఏడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు కెరీర్లో టీమిండియా తరఫున 4 టెస్టులు, 8 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఉనాద్కట్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3, 9, 14 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ టూర్-2023లో భాగంగా టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన ఈ రైట్ ఆర్మ్ ఫాప్ట్బౌలర్.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం దక్కించుకున్నాడు. రూ. కోటి! విండీస్‌తో ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో కేసీ కార్టీ వికెట్ తీసి రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక కరేబియన్ దీవి పర్యటన తర్వాత జయదేవ్ ఉనాద్కట్ తాజాగా కాస్ట్లీ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ. కోటి వరకు Mercedes-Benz GLE SUVని అతడు సొంతం చేసుకున్నట్లు సమాచారం. బ్లాక్ ఫినిషింగ్‌తో మెరిసిపోతున్న కారును ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో ఉనాద్కట్ క్రికెట్బాల్పై సంతకం చేసి షో రూం నిర్వాహకులకు ఇవ్వడం విశేషం. ఈ అత్యాధునిక కారులో పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు ఏడు ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. ఇక SUV కొనుగోలు చేసిన సందర్భంగా.. భార్యతో కలిసి కారు వద్ద ఉనాద్కట్ దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో 11.50 కోట్లు! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2018 వేలం సందర్భంగా జయదేవ్ ఉనాద్కట్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయిన విషయం తెలిసిందే. ఈ పేసర్ కోసం రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఏకంగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఆ సీజన్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉనాద్కట్ రికార్డు సృష్టించాడు. చదవండి: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! -
Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్
Ind Vs WI Test Series 2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ అనంతరం టీమిండియా.. దాదాపు 20 రోజుల విశ్రాంతి తర్వాత కరేబియన్ దీవికి చేరుకుంది. జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో మొదలుకానున్న టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా టెస్టులకు ఎంపికైన జట్టు మొత్తం ఇప్పటికే విండీస్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఇందులో భాగంగా రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీసులో తలమునకలయ్యారు. బార్బడోస్ వేదికగా సాగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. విఫలమైన కోహ్లి టీమిండియా లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారగా.. ‘‘కోహ్లి.. మరీ ఇంత ఈజీగా అవుట్ అయ్యాడా?’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా టెస్టుల్లో మంచి రికార్డు కలిగి ఉన్న కోహ్లి.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 ముందు వరకు సెంచరీ సాధించలేకపోయాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో మ్యాచ్ సందర్భంగా మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ వెయ్యి రోజుల తర్వాత శతకం బాది తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, ఆ తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. విండీస్ గడ్డపై ఎలా ఆడతాడో? ఇక ఇటీవల ఇంగ్లండ్ వేదికగా ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా.. 14, 49 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో భాగంగా మొట్టమొదటి మ్యాచ్(విండీస్‌తో)లో ఎలా ఆడతాడో అన్న ఆసక్తి నెలకొంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: ఎలక్ట్రీషియన్ కుటుంబంలో పుట్టి టీమిండియాలోకి.. హ్యాట్సాఫ్ తిలక్ వర్మ! టెస్టుల్లో స్టీవ్ స్మిత్‌ను మించినోడే లేడు.. బౌలర్‌గా మొదలుపెట్టి అత్యున్నత శిఖరాలకు! Virat Kohli's dismissal in the practice match in Barbados today. Jaydev Unadkat claimed his wicket. #WIvIND Video courtesy: Vimal Kumar pic.twitter.com/IltleUGgwy — Farid Khan (@_FaridKhan) July 5, 2023 -
లక్నో జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ సూర్యన్ష్?
ఐపీఎల్-2023 సీజన్ మధ్య నుంచి లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ గాయం కారణంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతడి స్థానాన్ని ముంబైకు చెందిన యువ క్రికెటర్ సూర్యన్ష్ షెడ్జ్తో లక్నో భర్తీ చేసింది. ఈ ఆల్‌రౌండర్‌ను కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా 20 ఏళ్ల సూర్యన్ష్ 2022-23 రంజీ సీజన్‌కు ఎంపిక చేసిన 16 మంది సభ్యుల ముంబై జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ టోర్నీలో అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే విధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకు కూడా ముంబై జట్టులో చోటు దక్కింది. ఇక్కడ కూడా సూర్యన్ష్కి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటి వరకు అతడికి ముంబై సీనియర్ జట్టు తరపున ఆడే అవకాశం రాలేదు. కానీ గతేడాది డిసెంబర్లో జరిగిన బీసీసీఐ మెన్స్ అండర్ 25 స్టేట్-ఏ ట్రోఫీలో సూర్యన్ష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 184 పరుగులు చేశాడు. ఇక లక్నో విషయానికి వస్తే.. ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. మే 20న కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సూపర్ జెయింట్స్ ఫ్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. కాగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్యలో వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా జట్టును నడిపిస్తున్నాడు. చదవండి: #Virat Kohli: కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్‌రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ అదుర్స్.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by SURYANSH SHEDGE (@suryanshshedge) -
WTC Final: రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్.. బీసీసీఐ ప్రకటన
#WTC Final 2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. కేఎల్ రాహుల్ స్థానంలో అతడిని జట్టుకు ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 గెలిచిన టీమిండియా.. ఆసీస్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా తుదిపోరులో పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్ వేదికగా ఇరు జట్లు టైటిల్ వేటలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఆసీస్‌తో తలపడే భారత జట్టును ప్రకటించింది. రాహుల్ అవుట్ అయితే, ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. కుడి తొడ పైభాగంలో నొప్పి తీవ్రమైన నేపథ్యంలో సర్జరీ చేయించుకునేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు తెలిపింది. వాళ్లిద్దరి సంగతి ఏంటి? ఇక ఎడమ భుజానికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్న పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. అతడి గాయం తీవ్రతపై పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాతే డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో కొనసాగే అంశంపై క్లారిటీ వస్తుందని తెలిపింది. ముగ్గురికి ఛాన్స్ అదే విధంగా మరో పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా కేకేఆర్ వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడన్న బీసీసీఐ.. తమ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటోందని తెలిపింది. ఇక శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాండ్‌బై ప్లేయర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు బౌలర్ ముకేశ్ కుమార్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క టెస్టు కూడా ఆడని ఇషాన్ ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
టీమ్ ఇండియాకి భారీ ఎదురుదెబ్బ
-
టీమిండియాకు బిగ్ షాక్
అనుకున్నదే అయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2023తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు (జూన్ 7 నుంచి) కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. అతి త్వరలో తాను తొడ భాగంలో శస్త్ర చికిత్స చేయించుకుంటున్నట్లు రాహుల్ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్-2023తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి అర్ధంతరంగా వైదొలగాల్సి వస్తున్నందుకు నిరాశ వ్యక్తం చేశాడు. గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి జట్టులో చేరేందుకు తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తానని తెలిపాడు. కాగా, కొద్ది రోజుల ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో సభ్యుడు జయదేవ్ ఉనద్కత్ కూడా గాయం కారణంగా అధికారికంగా ఐపీఎల్-2023 నుంచి వైదొలిగాడు. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) ఉనద్కత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. రాహుల్, ఉనద్కత్‌లు గాయాల కారణంగా ఒకేసారి వైదొలగడంతో లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఒకవేళ ఉనద్కత్ డబ్ల్యూటీసీ ఫైనల్ సమయానికి కూడా కోలుకోకపోతే అది టీమిండియాకు కూడా భారీ ఎదురుదెబ్బగా పరిగణించాల్సి ఉంటుంది. గాయాల కారణంగా ఇప్పటికే బుమ్రా, శ్రేయస్ అయ్యర్ జట్టుకు (డబ్ల్యూటీసీ ఫైనల్) దూరం కాగా.. తాజాగా రాహుల్ కూడా గాయం కారణంగా వైదొలగడం టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్, అదే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా ఉనద్కత్ గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (ఔట్), పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్. -
టీమిండియా బౌలర్‌కు గాయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతాడా?
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్ గాయపడ్డాడు. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ వేస్తుండగా స్లిప్ అయ్యాడు. దీంతో ఉనాద్కట్ ఎడమ భుజానికి గాయమైంది. ఆ తర్వాత ఆర్సీబీతో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. రిపోర్డ్స్ వచ్చాకా కానీ ఉనాద్కట్ ఆడుతాడా లేదా అనేది తేలనుంది. అయితే ఐపీఎల్ కంటే మరొక విషయం కలవరపెడుతుంది. ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా జరగనుంది. ఇక జైదేవ్ ఉనాద్కట్ 15 మందితో కూడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఉనాద్కట్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమైనప్పటికి మేజర్ మ్యాచ్ కావడం టీమిండియా ఆందోళనకు కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే బుమ్రా దూరం కాగా.. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఉనాద్కట్ గాయపడిన వీడియోనూ ఐపీఎల్ వెబ్సైట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ''గాయపడిన ఉనాద్కట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. భారత టెస్టు జట్టు WTC ఫైనల్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. See you back on the field soon @JDUnadkat Wishing a quick recovery to the left-arm pacer 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/w57d7DMadN — IndianPremierLeague (@IPL) May 1, 2023 చదవండి: టెన్నిస్ స్టార్ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి -
ఐపీఎల్లో జయదేవ్ ఉనద్కట్ సరికొత్త రికార్డు! ఏకైక భారత క్రికెటర్‌గా
టీమిండియా వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధిక జట్ల తరపున బరిలోకి దిగిన భారత ఆటగాడిగా ఉనద్కట్ అవతరించాడు. ఐపీఎల్-202లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన జయదేవ్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఉనద్కట్ ఐపీఎల్లో ఇప్పటివరకు 7 జట్ల తరపున ఆడాడు. 2010లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఉనద్కట్.. అనంతరం 2013లో ఆర్సీబీ, 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2017లో పుణే సూపర్ జెయింట్స్, 2018లో రాజస్తాన్ రాయల్స్‌కు పప్రాతినిథ్యం వహించాడు. అయితే నాలుగు సీజన్లకు పాటు రాజస్తాన్ తరపున ఆడిన జయదేవ్‌ను.. ఐపీఎల్-2022కు ముందు రాయల్స్ విడిచిపెట్టింది. అనంతరం మెగా వేలంలోకి వచ్చిన అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ముంబై కూడా అతడిని ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు విడిచిపెట్టింది. ఐపీఎల్-2023 మినీవేలంలో లక్నో సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఫించ్ ఐపీఎల్లో 8 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: పగ తీర్చుకున్న శ్రీలంక.. షాక్‌లో న్యూజిలాండ్! సూపర్ ఓవర్లో -
బీసీసీఐని ఒప్పించాడు.. సౌ'స్వ'రాష్ట్రను గెలిపించాడు
టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర జట్టు అవతరించింది. గత 3 సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండోసారి. 2019-20 సీజన్లో సైతం ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సౌరాష్ట్ర.. బెంగాల్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఓవరాల్‌గా నాలుగోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సౌరాష్ట్ర తొలిసారి 1935-37 సీజన్లో.. ఆతర్వాత 1943-44 సీజన్లో రంజీ టైటిల్‌ను సాధించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో తొలి రెండు టెస్ట్‌ల కోసం ఎంపిక చేసిన టీమిండియాలో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్‌కు చోటు లభించిన విషయం తెలిసిందే. అయితే వివిధ సమీకరణల దృష్ట్యా రెండు మ్యాచ్‌ల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. ఈ మధ్యలో తన సొంత జట్టు సౌరాష్ట్ర రంజీ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి మూడో థాట్ పెట్టుకోని ఉనద్కత్.. తనను టీమిండియా నుంచి రిలీవ్ చేయాల్సిందిగా బీసీసీఐ పెద్దలను అభ్యర్ధించాడు. తనను రిలీవ్ చేస్తే, తన సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొంటానని కోరాడు. ఉనద్కత్ విన్నపాన్ని మన్నించిన బీసీసీఐ.. అతను కోరిన విధంగానే టీమిండియా నుంచి రిలీవ్ చేసింది. దీంతో సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు మ్యాచ్‌కు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్‌లో రెక్కలు కట్టుకుని వాలిపోయాడు ఉనద్కత్. తన సారధ్యంలో సౌరాష్ట్రను రెండోసారి ఛాంపియన్‌గా నిలపడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అతను.. అనుకున్న విధంగానే అన్నీ తానై సౌరాష్ట్రను గెలిపించుకున్నాడు. ఫైనల్లో ఏకంగా 9 వికెట్లు (3/44, 6/85) పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం గెలిచాడు. ఉనద్కత్‌కు తన జట్టును గెలిపించుకోవాలన్న తపన, ఆకాంక్షను చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం రాకపోతేనేం, తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన జట్టుకు ఆడాలన్న అతని కమిట్మెంట్కు జేజేలు పలుకుతున్నారు. ఈ సీజన్లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఉనద్కత్.. 13.88 సగటున 26 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు.. బెంగాల్: 174 & 241 సౌరాష్ట్ర: 404 & 14/1 9 వికెట్ తేడాతో సౌరాష్ట్ర విజయం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: జయదేవ్ ఉనద్కత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: అర్పిత్ వసవద (ఉనద్కత్ గైర్హాజరీలో సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరించాడు, ఈ సీజన్లో రెండో లీడింగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు, 10 మ్యాచ్‌ల్లో 75.58 సగటున 3 సెంచరీల సాయంతో 907 పరుగులు చేశాడు, ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా మయాంక్ అగర్వాల్ నిలిచాడు, మయాంక్ 9 మ్యాచ్‌ల్లో 82.50 సగటున 3 సెంచరీల సాయంతో 990 పరుగులు చేశాడు) -
ఉనద్కత్ ఉగ్రరూపం.. రంజీ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర అవతరించింది. గత మూడో సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండో సారి. 2019-20 సీజన్లో సైతం జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గత నాలుగు రోజులుగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర.. లోకల్ టీమ్ బెంగాల్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆఖరి రోజు (ఫిబ్రవరి 19) లోకల్ హీరో, బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (68) జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. That Winning Feeling 🏆 😊 Congratulations to the @JUnadkat-led Saurashtra on their #RanjiTrophy title triumph 🙌 🙌 #BENvSAU | #Final | @saucricket | @mastercardindia Scorecard 👉 https://t.co/hwbkaDeBSj pic.twitter.com/m2PQKqsPOG — BCCI Domestic (@BCCIdomestic) February 19, 2023 ఉనద్కత్ ఉగ్రరూపం దాల్చడంతో బెంగాల్ టీమ్ చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింతగా రెచ్చిపోయి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్‌కు జతగా చేతన్ సకారియా (3/76) కూడా రాణించడంతో సౌరాష్ట్ర.. బెంగాల్‌ను సెకెండ్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. కేవలం 2.4 ఓవర్లలో జై గోహిల్ (0) వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జై వికెట్‌ను ఆకాశ్‌దీప్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర.. తొలుత బెంగాల్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఉనద్కత్ (3/44), చేతన్ సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), డి జడేజా (2/19) చెలరేగడంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ ఆహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వసవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీలతో రాణించడంతో 404 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్‌దీప్, ఇషాన్ పోరెల్ తలో 3 వికెట్లు పడగొట్టారు. 230 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే ఆలౌటైంది. మజుందార్ (61), మనోజ్ తివారి (68) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉనద్కత్ (6/85), సకారియా (3/76) బెంగాల్ పతనాన్ని శాశించారు. 12 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర.. వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది. -
రంజీ ఫైనల్.. బెంగాల్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న మంత్రి
బెంగాల్-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ-2023 ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 61 పరుగులు వెనుకపడి ఉంది. బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (57) షాబాజ్ అహ్మద్ (13) సాయంతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అనుస్తుప్ మజుందార్ (61) హాఫ్‌సెంచరీతో రాణించగా.. సుమంత గుప్తా (1), అభిమన్యు ఈశ్వరన్ (16), సుదీప్ కుమార్ గరామీ (14) నిరాశపరిచారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కత్ (2/47), చేతన్ సకారియా (2/50) నిప్పులు చెరుగుతున్నారు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైంది. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వనవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీతో రాణించారు. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్‌దీప్, ఇషాన్ పోరెల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీనికి ముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే చాపచుట్టేసింది. ఉనద్కత్ (3/44), సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), జడేజా (2/19) చెలరేగారు. షాబాజ్ అహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
రవీంద్ర జడేజా వచ్చేశాడు.. చెన్నై మ్యాచ్‌లో కెప్టెన్‌గా..
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Saurashtra: మోకాలి గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం చేశాడు. రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా తమిళనాడుతో పోటీపడుతున్న సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా 34 ఏళ్ల జడేజా గత ఏడాది ఆగస్టు నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఆసీస్‌తో మ్యాచ్ కోసం..! ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా సౌరాష్ట్ర జట్టుకు దాదాపుగా నాకౌట్ బెర్త్ ఖరారు కావడంతో చివరి మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్, సీనియర్ స్టార్ చతేశ్వర్ పుజారాలకు విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో జడ్డూ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఆస్ట్రేలియాతో టీమిండియా స్వదేశంలో సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో జడేజాకు చోటు ఇచ్చింది బీసీసీఐ. అయితే అతడు తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రంజీ ఆడేందుకు జడ్డూ సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మంగళవారం (జనవరి 24) మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు: సౌరాష్ట్ర హార్విక్ దేశాయ్(వికెట్ కీపర్), చిరాగ్ జానీ, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవాడ, రవీంద్ర జడేజా(కెప్టెన్), సమర్థ్ వ్యాస్, ప్రేరక్ మన్కడ్, ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, యువరాజ్‌సిన్హ్ దోడియా, జే గోహిల్. తమిళనాడు: సాయి సుదర్శన్, నారాయణ్ జగదీశన్(వికెట్ కీపర్), బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, ప్రదోష్ పాల్(కెప్టెన్), విజయ్ శంకర్, షారుక్ ఖాన్, ఎస్ అజిత్ రామ్, సందీప్ వారియర్, త్రిలోక్ నాగ్, మణిమారన్ సిద్ధార్థ్. చదవండి: Australian Open: సంచలనం సృష్టించిన అన్‌సీడెడ్ క్రీడాకారులు.. జొకోవిచ్‌తో పాటు.. Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? -
ఆరేసిన ఉనద్కత్.. హైదరాబాద్‌కు మరో ఘోర పరాభవం
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో జయదేవ్ ఉనద్కత్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. గత ఏడాది చివర్లో మొదలైన ఈ జట్టు జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2022 డిసెంబర్లో ముంబైపై 48 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌరాష్ట్ర.. గత వారం ఢిల్లీని ఇన్నింగ్స్ 214 పరుగుల తేడాతో, తాజాగా హైదరాబాద్‌ను ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో మట్టికరిపించి ప్రస్తుత సీజన్లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (8/39, 70) చెలరేగిన ఉనద్కత్.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ ఆరు వికెట్లు (3/28, 3/62) పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఉనద్కత్‌కు జతగా ధరేంద్రసిన్హ్ జడేజా (3/8, 4/34, 40 పరుగులు) కూడా రాణించడంతో సౌరాష్ట్ర ప్రస్తుత రంజీ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. ఉనద్కత్ (3/28), డి జడేజా (3/8), యువ్‌రాజ్‌సింగ్ దోడియా (2/23), చేతన్ సకారియా (1/8) చిరాగ్ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికేత్ రెడ్డి (10 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. చిరాగ్ జానీ (68), హార్విక్ దేశాయ్ (81), షెల్డన్ జాక్సన్ (59) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 7 వికెట్లు పడగొట్టగా.. రోహిత్ రాయుడు 2, అబ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నారు. హైదరాబాద్ బ్యాటింగ్ తీరు రెండో ఇన్నింగ్స్‌లోనూ మారలేదు. జడేజా (4/34), ఉనద్కత్ (3/62), దోడియా (2/76), సకారియా (1/13) విజృంభించడంతో ఆ జట్టు 191 పరుగులకే కుప్పకూలింది. సంతోష్ గౌడ్ (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబద్ సీజన్లో వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. గతేడాది డిసెంబర్లో ముంబై చేతిలో ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఓటమిపాలైన ఈ జట్టు.. ఆ తర్వాత అస్సాం చేతిలో (18 పరుగుల తేడాతో), ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ చేతిలో (154 పరుగుల తేడాతో), తాజాగా సౌరాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది. -
విజృంభించిన ఉనద్కత్, జడేజా.. 79 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్
Ranji Trophy 2022-23 SAU VS HYD: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర-హైదరాబాద్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్‌లో సౌరాష్ట్ర బౌలర్లు రెచ్చిపోయారు. జయదేవ్ ఉనద్కత్ (3/28), డి జడేజా (3/8), యువ్‌రాజ్‌సింగ్ దోడియా (2/23), చేతన్ సకారియా (1/8) చిరాగ్ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికేత్ రెడ్డి (10 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (2), అలంక్రిత్ అగర్వాల్ (7), తొలకంటి గౌడ్ (4), చందన్ సహాని (2) భవేశ్ సేథ్ (3), టి రవితేజ (8), మెహరోత్ర శశాంక్ (5), మహ్మద్ అబ్రార్ నిరాశపరిచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర.. 24 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. ఓపెనర్లు చిరాగ్ జానీ (55), హార్విక్ దేశాయ్ (49) క్రీజ్‌లో ఉన్నారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో ఇంకా చతేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవద, ప్రేరక్ మన్కడ్, ధరేంద్రసిన్హ్ జడేజా, చేతన్ సకారియా, సమర్థ్ వ్యాస్, జయదేవ్ ఉనద్కత్, యువ్రాజ్సిన్హ్ దోడియా బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 214 పరుగుల తేడాతొ ఘన విజయం సాధించింది. ఉనద్కత్ (8/39, 70) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. మరోవైపు హైదరాబాద్ గత మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ చేతిలో 154 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. -
చారిత్రక బౌలింగ్ ప్రదర్శన అనంతరం బ్యాట్‌తోనూ ఇరగదీసిన ఉనద్కత్
Jaydev Unadkat: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్, భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇరగదీస్తున్నాడు. తొలి ఓవర్లో హ్యాట్రిక్‌తో పాటు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి చారిత్రక ప్రదర్శన కనబర్చిన ఉనద్కత్.. ఆతర్వాత బ్యాట్‌తోనూ విజృంభించి ఆల్‌రౌండర్‌గా, సమర్ధవంత నాయకుడిగా తన పాత్రకు న్యాయం చేశాడు. అప్పటికే (మూడో రోజు ఆటలో) హార్విక్ దేశాయ్ (107), వసవద (152 నాటౌట్) సెంచరీలతో.. చిరాగ్ జానీ (75), సమర్థ్ వ్యాస్ (54), ప్రేరక్ మన్కడ్ (64) అర్ధసెంచరీలతో అలరించగా, 8వ స్థానంలో బరిలోకి దిగిన ఉనద్కత్ తాను సైతం అంటూ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో 68 బంతులు ఎదుర్కొన్న ఉనద్కత్.. 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత 2 బంతులకే మరో వికెట్ పడటంతో ఉనద్కత్.. 574/8 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా సౌరాష్ట్రకు 441 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ.. మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి కేవలం 188 పరుగులు మాత్రమే చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో బంతితో చుక్కలు చూపించిన ఉనద్కత్.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్ట లేకపోవడం విశేషం. యువరాజ్‌సింగ్ దోడియ 4 వికెట్లు పడగొట్టగా.. పార్థ్ బట్, చిరాగ్ జానీ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్సలో 9వ స్థానంలో అర్ధసెంచరీతో ఢిల్లీ పరువు కాపాడిన హృతిక్ షోకీన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేసి ఆ జట్టు మరోసారి పేకమేడలా కూలకుండా కాపాడాడు. జాంటీ సిద్దు (17), లక్ష్యయ్ తరేజా (0) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఉనద్కత్ ధాటికి 10 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి రంజీ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ దిశగా సాగిన ఢిల్లీ జట్టు పరువును ప్రాణ్షు విజయరన్ (15), షోకీన్ (68 నాటౌట్), శివాంక్ వశిష్ట్ (38) కాపాడారు. ఈ ముగ్గురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్ చేయడంతో ఢిల్లీ 133 పరుగులు చేసి ఆలౌటైంది. ఉనద్కత్ (8/39)కు జతగా చిరాగ్ జానీ (1/14), ప్రేరక్ మన్కడ్ (1/2) రాణించారు. -
Ranji Trophy: ఉనాద్కట్ సంచలనం.. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్‌గా
Ranji Trophy 2022-23- Saurashtra vs Delhi: భారత లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ రంజీ ట్రోఫీ టోర్నీలో సంచలనం సృష్టించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో వేసిన మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు కూల్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు ఈ సౌరాష్ట్ర కెప్టెన్. మూడు, నాలుగు, ఐదో బంతికి వరుసగా ఢిల్లీ ఓపెనర్ ధ్రువ్ షోరే, వన్‌డౌన్ బ్యాటర్ వైభవ్ రావల్ సహా యశ్ ధుల్‌లను పెవిలియన్‌కు పంపాడు. ముగ్గురినీ డకౌట్ చేశాడు. రంజీ చరిత్రలోనే తొలిసారి కాగా రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి ఓవర్లోనే ఇలా హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇలా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న జయదేవ్.. రెండో ఓవర్లోనూ విజృంభించాడు. వెంటనే మరో రెండు వికెట్లు తీశాడు. ఢిల్లీ బ్యాటర్లు లలిత్ యాదవ్(0), లక్ష్యయ్ తరేజా(1)లను అవుట్ చేశాడు. అంతేకాదు.. తద్వారా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 21వ సారి.. ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చిన ఘనత సాధించాడు ఉనాద్కట్. ఆ తర్వాత జాంటీ సిద్ధు(4)ను కూడా పెవిలియన్‌కు పంపి మొత్తంగా ఆట మొదలైన గంటలోనే ఆరు వికెట్లు(మూడు ఓవర్లలో) తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతలాకుతలం చేశాడు. కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో జయదేవ్ ఇటీవలే భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కుదేలైన ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ రంజీ ట్రోఫీ టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్- బిలో ఉన్న సౌరాష్ట్ర- ఢిల్లీ మధ్య మంగళవారం (జనవరి 3) మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ యశ్ ధుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఉనాద్కట్ దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఇందుకు తోడు, చిరాగ్ జానీ ఒక వికెట్, ప్రేరక్ మన్కడ్ ఒక వికెట్ తీశారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఢిల్లీ 8 వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. చదవండి: Hardik Pandya: స్లెడ్జింగ్‌తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు! మాట ఇస్తున్నా.. BCCI: బిగ్ ట్విస్ట్.. రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? చీఫ్ సెలక్టర్‌గా మళ్లీ అతడే! -
IPL 2023: మిస్టర్ ఐపీఎల్ ‘సూపర్‌స్టార్’ లెక్క తప్పింది! వాళ్లను పట్టించుకోనేలేదు!
IPL 2023 Mini Auction- Suresh Raina: ఐపీఎల్ మినీ వేలం-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అంచనా తలకిందులైంది. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడతాయంటూ మిస్టర్ ఐపీఎల్ చెప్పిన జోస్యం తప్పింది. రైనా అంచనా వేసిన యువ ఆటగాళ్లలో సౌరాష్ట్ర క్రికెటర్ సమర్థ్ వ్యాస్ తప్ప మిగతా ఇద్దరూ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా ఐపీఎల్ మినీ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన జియో సినిమా షోలో.. ఆక్షన్ ఆరంభానికి ముందు రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన జయదేవ్ ఉనాద్కట్, నారాయణ్ జగదీశన్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయని అతడు పేర్కొన్నాడు. వీళ్ల విషయంలో నిజమైంది అందుకు తగ్గట్లుగానే లక్నో సూపర్ జెయింట్స్ ఉనాద్కట్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేయగా.. నారాయణ్ జగదీశన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ 90 లక్షలు ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిస్ కోసం పోటీ నెలకొంటుందని రైనా అంచనా వేయగా.. గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. లెక్క తప్పాడు! వీరితో పాటు.. బెన్ స్టోక్స్, సామ్ కరన్ విషయంలో అందరిలానే రైనా అంచనాలూ నిజమయ్యాయి. కానీ అన్క్యాప్డ్ ఆటగాళ్ల విషయంలో మాత్రం మిస్టర్ ఐపీఎల్ లెక్క తప్పింది. జమ్మూ కశ్మీర్ ఆల్‌రౌండర్ ముజ్తాబా యూసఫ్ అమ్ముడుపోకుండా మిగిలి పోయాడు. అంతేగాక ఈ వేలంలో సూపర్‌స్టార్‌గా నిలవగల సత్తా ఉందని రైనా అంచనా వేసిన అల్లా అహ్మద్‌ను ఎవరూ పట్టించుకోలేదు. మిస్టర్ ఐపీఎల్ జోస్యంపై కామెంట్లు వేలంలో పేరు నమోదు చేసుకున్న అత్యంత పిన్న వయస్కుడైన 15 ఏళ్ల ఈ అఫ్గనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇక సమర్థ్ వ్యాస్‌ను 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రైనా జోస్యంపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘వాళ్ల విషయంలో మిస్టర్ ఐపీఎల్ అంచనాలు నిజమయ్యాయి. కానీ సూపర్‌స్టార్ అన్న విషయంలో మాత్రం లెక్క తప్పాడు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: IPL Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు, పదింటిలో ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట Ind Vs Ban: అయ్యో పంత్.. సెంచరీ మిస్! అయితేనేం ధోని 15 ఏళ్ల రికార్డు బద్దలు! సాహా తర్వాత..