బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో యానిమల్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా కానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం తన రివ్యూను ప్రకటించారు.
(ఇది చదవండి: 'నా సామిరంగ'.. వరలక్ష్మి ఎలా ఉందో చూశారా?)
అయితే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ బిగ్ డిజాస్టర్ అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా చూసి అవసరంగా మూడు గంటల టైమ్ వృథా చేశానని రాసుకొచ్చారు. సినిమా వాళ్లకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సూచించారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించే వారిపై ప్రశంసలు కురిపించడం తనకు బాధ కలిగించిందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'మనమేమీ అడవుల్లో నివసించటం లేదు. ప్రస్తుతం యుద్దాలు చేస్తూ వేటాడే సమాజంలో బతకడం లేదు. యాక్టింగ్ ఎంత గొప్పగా ఉన్నా సరే మితిమీరిన వయోలెన్స్ చూపించడం మంచిదికాదు. ఇలాంటి హింసను ప్రేరేపించే వారిని ఆదరించి ప్రశంసలు కురిపించడం బాధ కలిగించింది. లక్షల మంది సినిమాలు చూస్తారు. మీకు కూడా కనీస సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సినిమా వల్ల మూడు గంటల సమయం వేస్ట్ చేసుకున్నా' అని పోస్ట్ పెట్టారు.
(ఇది చదవండి: కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..)
Comments
Please login to add a commentAdd a comment