Sandeep Reddy Vanga
-
సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా
తీసింది తక్కువ సినిమాలే అయినా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశమంతా మార్మోగిపోయింది. ఆయన సినిమా తీస్తే హిట్టు కాదు ఏకంగా బ్లాక్‌బస్టర్ అవ్వాల్సిందే అన్న పేరు తెచ్చేసుకున్నాడు. తనను విమర్శించినా ఊరుకుంటాడేమో కానీ తన సినిమాల జోలికి వస్తే మాత్రం అస్సలు సహించడు. అవతలి వ్యక్తి ఎవరైనా సరే ఇచ్చిపడేస్తాడు. ఓ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి (IAS Vikas Divyakirti).. సందీప్ తెరకెక్కించిన యానిమల్ సినిమాపై గతేడాది విమర్శలు గుప్పించారు. యానిమల్ సినిమాలు ఎందుకు తీస్తారో!యానిమల్ (Animal Movie) వంటి చిత్రాలు మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తున్నాయి. ఇలాంటి సినిమాలు రూపుదిద్దుకోకూడదు. మీ సినిమాలో హీరో జంతువులా ప్రవర్తిస్తాడని చూపించారు. దీనివల్ల మీకు డబ్బు వచ్చి ఉండొచ్చు. కానీ కేవలం డబ్బు కోణంలోనే ఆలోచిస్తే ఎలా? సామాజిక విలువలు కాస్తైనా ఉండాల్సిన పని లేదా? అని విమర్శించారు. వికాస్.. 12th ఫెయిల్ సినిమా (12th Fail Movie)లో యూపీఎస్సీ ప్రొఫెసర్‌గా యాక్ట్ చేశాడు.అవనసరంగా విమర్శిస్తే..ఈ విమర్శలపై తాజాగా సందీప్‌రెడ్డి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఓ ఐఏఎస్ అధికారి యానిమల్ వంటి చిత్రాలు రాకూడదన్నారు. ఆయన చెప్పింది వింటే నేనేదో పెద్ద నేరం చేసినట్లుగా అనిపించింది. 'ఒకవైపు 12th ఫెయిల్ వంటి సినిమాలు తీస్తుంటే మరోవైపు యానిమల్ వంటివి తీసి సమాజాన్ని వెనక్కుతీసుకెళ్తున్నారు' అని వ్యాఖ్యానించారు. ఇలా ఎవరైనా అనవసరంగా నా సినిమాపై దాడి చేస్తే నాకు కచ్చితంగా కోపం వస్తుంది. ఆయన బాగా చదువుకుని ఐఏఎస్ అయ్యారు. యానిమల్ హీరోతో సందీప్ రెడ్డి వంగా, ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తిఎవరైనా ఐఏఎస్ అయిపోవచ్చునాకేమనిపిస్తోందంటే ఢిల్లీ వెళ్లి, ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి రెండుమూడేళ్ల జీవితాన్ని అక్కడే గడిపితే కచ్చితంగా ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవుతారు. పైగా అందుకోసం చదవాల్సిన పుస్తకాలు కూడా వేలకొద్దీ ఉండవు. 1500 పుస్తకాలు చదివితే ఐఏఎస్ అయిపోతారు. కానీ సినిమాలో అలా కాదు.. మీరు దర్శకరచయితలు అయ్యేందుకు ప్రత్యేకంగా ఏ కోర్సు ఉండదు.. ఏ టీచర్ కూడా మిమ్మల్ని దర్శకుడిగా, రచయితలుగా తీర్చిదిద్దలేరు అన్నాడు.సినిమాసందీప్రెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్ 2023లో రిలీజైంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది.చదవండి: హీరోయిన్ కియారా ప్రెగ్నెన్సీ.. వాళ్లకు టెన్షన్ -
'స్పిరిట్' టార్గెట్ రూ.2000 కోట్లు.. సందీప్ సమాధానమిదే
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తీసింది రెండు మూడు సినిమాలే గానీ దేశవ్యాప్తంగా యమ క్రేజ్ సంపాదించాడు. ఇతడి సినిమాలే అనుకుంటే ఇంటర్వ్యూలు కూడా ఆ రేంజులోనే ఉంటాయి. ప్రస్తుతం 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్న ఇతడు.. మూవీ టార్గెట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో చేయబోయే సినిమా 'స్పిరిట్'. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు కానీ డార్లింగ్ హీరో వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ మొదలుపెట్టడం ఆలస్యమవుతోంది. సరే ఈ విషయం పక్కనబెడితే రీసెంట్ గా సందీప్.. బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. బోలెడన్ని విషయాల్ని పంచుకున్నాడు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)అయితే సందీప్ చెప్పిన ఓ సమాధానం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. 'షాహిద్, రణ్ బీర్ సింగ్ కి వాళ్ల కెరీర్ లోనే పెద్ద హిట్స్ ఇచ్చారు. మరి ప్రభాస్ 'స్పిరిట్'కి మీ టార్గెట్ ఏంటి?' అని అడగ్గా.. ఒకవేళ నా సినిమా, బాహుబలిని దాటాలంటే రూ.2000 కోట్లు కలెక్షన్స్ రావాలి. ఇది చాలా పెద్ద టార్గెట్. ఇప్పటికైతే నేను మంచి సినిమా తీస్తా. బాక్సాఫీస్ దగ్గర అది ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి అని సందీప్ సమాధానమిచ్చాడు.బాహుబలి తర్వాత రెండు సినిమాల విషయంలో ప్రభాస్ కాస్త డౌన్ అయినట్లు కనిపించాడు. కానీ సలార్, కల్కి 2898 చిత్రాలతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మరి ముఖ్యంగా కల్కి మూవీ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మరోవైపు సందీప్ చివరగా తీసిన యానిమల్ కూడా వెయ్యి కోట్ల రూపాయలు సాధించింది. దీనిబట్టి చూస్తే 'స్పిరిట్'కి రూ.1000 కోట్లు రావడం పెద్ద విషయం కాదు. కానీ రూ.2000 వస్తే మాత్రం ఇద్దరూ రికార్డ్ సెట్ చేసినట్లే.(ఇదీ చదవండి: బన్నీ నెక్స్ట్ మూవీకి ఏంటి సమస్య?) -
నా సినిమాలో నటించాడని అతనికి ఛాన్సులే ఇవ్వలేదు: సందీప్ రెడ్డి వంగా
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు బాలీవుడ్ ఎప్పటికీ మరిచిపోదు. కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు. సందీప్ రెడ్డి టేకింగ్‌తో పాటు సీన్స్, స్క్రీన్ ప్లేకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద తన సినిమాలు భారీ వసూళ్లు కొల్లగొట్టాయి. దీంతో సందీప్‌పై అక్కడి ప్రొడక్షన్ హౌస్లే కాకుండా కొందరు దర్శకులు కూడా వారి కడుపు మంట చూపారు. అయితే, వారికి సరైన రీతిలో సందీప్ కౌంటర్స్ ఇచ్చారు. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.రణబీర్‌పై పొగడ్తలు సరే.. మరి దర్శకుడి సంగతేంటి..?హిందీ చిత్రపరిశ్రమపై మరోసారి సందీప్ రెడ్డి ఇలా కామెంట్లు చేశారు. 'బాలీవుడ్ ప్రముఖులు యానిమల్ సినిమాను తిట్టారు. కానీ, అందులో నటించిన హీరో రణబీర్ కపూర్‌ను మాత్రం విపరీతంగా పొగడటమే కాకుండా తన పాత్రను మెచ్చుకున్నారు. సినిమాను తిట్టిన వారే రణబీర్ కపూర్‌ను ఎలా అభినందిస్తారు.. ఇక్కడ రణబీర్ అంటే నాకు ఎలాంటి కోపం లేదు. కానీ, వారు చూపిన తేడా ఏంటో నాకు ఆ సమయంలో అర్ధం కాలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే..? నన్ను తిట్టినట్లు రణబీర్‌ను టార్గెట్ చేస్తే ఏమౌతుందో వారందరికీ తెలుసు. ఆయనతో మళ్లీ వారు సినిమాలు చేయలేరు. అందుకే నాపై సులభంగా కామెంట్లు చేశారు. బాలీవుడ్‌కు నేను కొత్త.. ఒక దర్శకుడు రెండు, మూడేళ్లకు ఒక సినిమా తీస్తాడు. కానీ, ఒక నటుడు అయితే ఏడాదికి పలుమార్లు కనిపిస్తూనే ఉంటాడు. నటుడితో వారికి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్లను ఏమీ అనలేరు.' అని సందీప్ స్పందించాడు.నా సినిమాలో నటించాడని అతనికి ఛాన్స్‌లు ఇవ్వలేదుషాహిద్ కపూర్‌తో తెరకెక్కించిన కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి రీమేక్) సినిమా గురించి సందీప్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. కబీర్ సింగ్ సినిమాలో నటించిన ఒక స్టార్ యాక్టర్ ముంబైలోని ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌కు ఆడిషన్స్ కోసం వెళ్తే వారు రిజక్ట్ చేశారని వంగా వెల్లడించాడు. 'కేవలం నా సినిమాలో ఆయన నటించిన పాపానికి వారు కాదని చెప్పారు. ఇంతటి వివక్ష బాలీవుడ్లో మాత్రమే ఉంది. ఇలాంటి నిర్ణయమే రణ్‌బీర్ సింగ్ విషయంలో తీసుకోవాలని బాలీవుడ్‌కు సవాల్ విసురుతున్నాను. కబీర్ సింగ్ సినిమా నటీనటులపై ప్రొడక్షన్ హౌస్ ఇంత కఠినమైన విధానాలను కలిగి ఉంటే ఎలా..? ఇదే విషయాన్ని ఒకసారి రణ్‌బీర్ కపూర్‌కి కూడా చెప్పాను. విభిన్న పాత్రల కోసం ఆడిషన్స్ చేస్తూ ఇండస్ట్రీలో ఎదగాలని ప్రయత్నిస్తున్న ఒక యంగ్ టాలెంటెడ్ నటుడిపై నా వల్ల వివక్ష చూపడం నాకు చాలా బాధగా అనిపించింది.' అని సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నటుడి ప్రతిభ కంటే అతని గత సినిమాను బట్టి ప్రొడక్షన్ హౌస్ తిరస్కరించడం చాలా దర్మార్గం అంటూ బాలీవుడ్‌ను విమర్శించాడు. కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ గురించే సందీప్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి రీమేక్‌గా బాలీవుడ్లో కబీర్ సింగ్ విడుదలైంది. అయితే, ఈ సినిమా తర్వాత షాహిద్ కపూర్‌కు ఛాన్సులు తగ్గాయి. సుమారు మూడేళ్లకు జెర్సీ సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చాడు. -
ప్రభాస్ కి కండీషన్స్ పెట్టిన సందీప్ రెడ్డి వంగా?
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. దాదాపు అందరూ హీరో ఒకటి తర్వాత ఒకటి అంటూ సినిమాలు చేస్తుంటే డార్లింగ్ హీరో మాత్రం ఒకేసారి రెండు మూడు మూవీస్ చేస్తున్నాడు. అయినా సరే టైమ్ సరిపోవట్లేదు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కొన్ని స్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టాడట!బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ వరస సినిమాలు చేస్తున్నాడు. అలా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాల్ని రిలీజ్ చేశాడు. దేశవ్యాప్తంగా వేలకోట్ల వసూళ్లు కొల్లగొట్టాడు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)మరోవైపు 'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో 'స్పిరిట్' చేయాలి. లెక్క ప్రకారం జనవరి నుంచే షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ ప్రభాస్ షూటింగ్స్ వల్ల స్పిరిట్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ మొదలుపెడితే మరొకటి చేయకూడదని సందీప్.. ప్రభాస్ కి చెప్పాడట.దీంతో చేతిలో ఉన్న రాజాసాబ్, ఫౌజీ చిత్రాల్ని పూర్తి చేసి.. మే నెల నుంచి ప్రభాస్ స్పిరిట్ సెట్స్ పైకి వస్తాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తయిందని.. ఒక్కసారి ప్రభాస్ వస్తే ఆపకుండా షూటింగ్ చేసి పూర్తి చేస్తారని టాక్. ఈ మూవీలో ప్రభాస్.. పోలీస్ గా కనిపించబోతున్నాడని ఇదివరకే సందీప్ చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
స్టార్ డైరెక్టర్ వద్ద శిక్షణ తీసుకుంటున్న త్రివిక్రమ్ కుమారుడు
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్వరలో ఆయన కుమారుడు రిషీ మనోజ్ కూడా మెగా ఫోన్ పట్టనున్నాడు. దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంతలో తన కుమారుడికి శిక్షణ ఇచ్చే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకోకుండా మరో ఇద్దరు దర్శకులకు ఆ పని అప్పజెప్పారు. ఇప్పటికే రిషీ ట్రైన్ అయి ఉన్నాడు. అయితే, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక పాన్ ఇండియా సినిమాకు పనిచేయబోతున్నాడు.జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్నానూరి వద్ద త్రివిక్రమ్ కుమారుడు ఇప్పటికే శిక్షణ తీసుకున్నాడు. విజయ్- గౌతమ్ తిన్ననూరి 'కింగ్డమ్' సినిమాకు అసిస్టెంట్‌గా త్రివిక్రమ్ కుమారుడు పనిచేస్తున్నాడు. దాదాపు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావస్తోంది. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా దగ్గరకు రిషీ వెళ్లనున్నాడు. ఇక్కడ త్రివిక్రమ్ ఫోన్ చేసి తన కుమారుడిని అసిస్టెంట్‌గా తీసుకోవాలని కోరితే ఎవరు వద్దంటారు..? అందుకే ప్రభాస్ స్పిరిట్ సినిమాకు రిషీ అసిస్టెంట్‌గా పనిచేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత రిషీ కూడా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.మరో రెండేళ్లలో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. అకీరా, రిషీ ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్‌తో పరిచయం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పవన్-త్రివిక్రమ్‌ల మధ్య ఉన్న స్నేహం ఈ ప్రాజెక్ట్ సులభంగా పట్టాలెక్కనుందని చెప్పవచ్చు. -
సందీప్ వంగాతో చెర్రీ మూవీ అప్పుడే..! ధూమ్ 4 లో రామ్ చరణ్..!
-
సందీప్ రెడ్డి వంగా చిత్రంలో సాయి పల్లవి.. కానీ..?
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన 'తండేల్' చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది యాక్టర్లను చూసిన వెంటనే ఇష్టం కలుగుతుంది. వారితో పరిచయం లేకపోయినా వాళ్ళని ప్రత్యేకంగా ఇష్టపడతాం. నేను కేడి చిత్ర షూటింగ్ సమయంలో నాగ చైతన్యని తొలిసారి చూశాను. అప్పటి నుంచే చైతు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ప్రేమమ్ చిత్రం దగ్గర నుంచి సాయి పల్లవి నటన అంటే నాకు ఇష్టం. నా అర్జున్ రెడ్డి చిత్రం మొదట తనని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నాను. కేరళలో సాయి పల్లవిని అప్రోచ్ కావాలని ఒక వ్యక్తిని అడిగాను. అతను స్టోరి ఎంటని అడిగితే లవ్ డెస్ట్రోయ్ అయిన వ్యక్తి స్టోరి అని, ఇది చాలా రొమాంటిక్ మూవీ అని చెప్పా. దానికి సమాధానంగా అతడు వెంటనే.. సార్ ఆ అమ్మాయి గురించి మీరు మరచిపోండి. ఎందుకంటే సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేసుకోదు అని తనతో చెప్పినట్లు సందీప్ రెడ్డి తెలిపారు. ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఒక పెద్ద ఆఫర్ వస్తే గ్లామర్ రోల్స్ చేద్దాం అని అనుకుంటారు. మొదట్లో అలా ఉండి ఆ తర్వాత అవకాశాల కోసం మారిపోతారు. కానీ సాయి పల్లవి వచ్చి ఇన్నేళ్లైనా ఆమె మాత్రం మారలేదు. అది సాయి పల్లవి గొప్పతనం అంటూ సందీప్ రెడ్డి ప్రశంసించారు. -
ప్రభాస్ 'స్పిరిట్' ఆరంభం ఎప్పుడంటే..?
‘స్పిరిట్’(Spirit) సినిమా సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది. ప్రభాస్(Prabhas) హీరోగా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా ప్రీప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను మేలో ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.దీంతో లుక్స్, ఫిజిక్ పరంగా స్పెషల్‌గా మేకోవర్ కానున్నారట. ‘స్పిరిట్’ చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యం కావడానికి ఇదొక కారణమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా... ఇలా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఫైనలేజ్ కాలేదట. టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా (సందీప్‌రెడ్డి వంగా సోదరుడు) భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్న ‘స్పిరిట్’ చిత్రం 2026 చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్. -
మీ తెలుగోడు నా జీవితాన్నే మార్చేశాడు.. డైరెక్టర్‌తో బాబీ డియోల్
బాబీ డియోల్(Bobby Deol) ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరో.. ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేసిన నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. 1995లో విడుదలైన 'బర్సాత్' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత సోల్జర్,రేస్ 3,ఓం శాంతి ఓం, క్రాంతి,దోస్తానా, కిస్మత్, హీరోస్, హౌస్‌ఫుల్ 4 వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. అయితే, కెరీర్ పరంగా ఒకానొక సమయంలో వరుస పరాజయాలు దక్కడంతో సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఎంతో కుంగుబాటుకు గురయ్యారు. చివరకు భార్య సంపాదన మీద ఆధారపడుతున్నాడు అనే మాటలు కూడా ఆయనపై వచ్చాయి. ఒక్క ఛాన్స్‌తో రీ ఎంట్రీ కోసం ఎన్నో నిర్మాణ సంస్థలను కలిశారు. కానీ, ఎవ్వరూ ఇవ్వలేదు. కానీ, ఒక్క సినిమాతో ఆయన జీవితం మారిపోయింది. ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపుగా 15 ఏళ్లు ఇంట్లోనే కూర్చున్న బాబీ డియోల్‌కు ఇప్పుడు మళ్లీ ఛాన్సులు వస్తున్నాయి. ఇదంతా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వల్లే జరిగిందని బాబీ డియోల్ అన్నట్లు ప్రముఖ తెలుగు దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) చెప్పారు.యానిమల్( Animal) సినిమా తర్వాత డాకు మహారాజ్‌తో బాబీ డియోల్ తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. అయితే, ఆయన జీవితానికి సంబంధించిన పలు విషయాలు డైరెక్టర్ బాబీ కొల్లి ఇలా చెప్పారు. 'యానిమల్ సినిమా తర్వాత బాబీ డియోల్ బిజీ అయిపోయాడు. మళ్లీ వరుస సినిమా ఛాన్సులతో స్పీడ్ పెంచాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని తెలిసిందే. ఇదే విషయాన్ని బాబీ డియోల్ కూడా బహిరంగంగానే ఒప్పుకున్నాడు. మీ తెలుగోడు నా జీవితాన్ని మార్చేశాడు అంటూ.. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనం ఆయన్ను టచ్ చేస్తే చాలు ఏడ్చేస్తున్నాడు. అంతలా మన తెలుగువారిని బాబీ డియోల్ ప్రేమిస్తున్నాడు.' అని డైరెక్టర్ బాబీ కొల్లి పంచుకున్నారు.బాబీ డియోల్ కన్నీళ్లకు కారణాలు కూడా ఉన్నాయి. 2012 తర్వాత ఆయనకు సరైన సినిమాలు లేవు. ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, పలితం దక్కలేదు. దీంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. తన భార్య సంపాదనతోనే ఉండేవాడని ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది. ఒక ఇంటర్వ్యూలో తన కుమారుడి మాటలను ఆయన ఇలా గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ' నేను ఇంట్లో ఉండగానే నా కుమారుడు తన తల్లి వద్దకు వెళ్లి నాన్న ఎప్పుడూ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు..? ఎలాంటి పని చేయడా..? అని ప్రశ్నించాడు. అప్పుడు చాలా బాధ అనిపించింది. వాడు పుట్టక ముందే నేనొక సూపర్‌స్టార్. కానీ, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫెయిల్యూ స్టార్‌ని అని నా మనసులో అనుకున్నా.' అని బాబీ డియోల్ గతంలో పంచుకున్నాడు. (ఇదీ చదవండి: మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్)సరిగ్గా అలాంటి సమయంలోనే ఆయనకు యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన దశ తిరిగింది. పాన్ ఇండియా రేంజ్లో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందుకే సందీప్ రెడ్డి అంటే బాబీ డియోల్‌కు చాలా ఇష్టం. యానిమల్ తర్వాత అతని లైఫే మారిపోయింది. హరిహర వీరమల్లు, హౌస్‌ఫుల్ 5, ఆల్ఫా, విజయ్ 69 ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝕍𝕠𝕟𝕘𝕠𝕕 𝕗𝕠𝕣𝕖𝕧𝕖𝕣 ♾️🛐 (@vongod_forever) -
స్పీడ్ పెంచిన మెగాస్టార్.. ‘యానిమల్’ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!
హీరో చిరంజీవి మెగా స్పీడ్‌తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వేసవిలో ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా ఆయన నెక్ట్స్ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుందని, షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించనున్నారని, వచ్చే ఏడాదిలో ఈ మూవీ సెట్స్‌కు వెళ్తుందని సమాచారం. ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోని సినిమా సెట్స్‌లో చిరంజీవి జాయిన్ అవుతారని తెలిసింది. అలాగే తనతో ‘గాడ్‌ఫాదర్’ సినిమా తీసిన దర్శకుడు మోహన్‌రాజాతో సినిమాకి కూడా చిరంజీవి పచ్చ జెండా ఉపారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇంకా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారని, ఆయన ప్రస్తుతానికి కమిటైన సినిమాల షూటింగ్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత, చిరంజీవి–సందీప్ కాంబో లోని సినిమా ప్రకటన ఉండొచ్చని సమాచారం. -
ప్రభాస్‌తో పూరి జగన్నాథ్ సినిమా... ఈ సారి డైరెక్షన్ కాదు!
హీరో ప్రభాస్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూడో సారి కలసి పని చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా ‘బుజ్జిగాడు’(2008), ‘ఏక్ నిరంజన్’(2009) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు పూరి జగన్నాథ్. అయితే మూడోసారి మాత్రం ప్రభాస్ చిత్రాన్ని డైరెక్షన్ చేయడం లేదు పూరి. ‘స్పిరిట్’ చిత్రానికి పూరి జగన్నాథ్ డైలాగులు అందించబోతున్నారని టాక్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ‘స్పిరిట్’ సినిమాకి డైలాగ్స్ రాసే బాధ్యతను పూరి జగన్నాథ్‌కు సందీప్ రెడ్డి అప్పగించినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. సందీప్ స్వయంగా అడగడంతో పూరి కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభాస్‌తో తనకున్న స్నేహ బంధం ఓ కారణం అయితే.. సందీప్ స్టోరీకి డైలాగులు రాస్తే అది మరింతగా రీచ్ అవుతుందన్నది మరో ఆలోచన అట. అందువల్లే ఆయన అంగీకరించి ఉంటారని భోగట్టా. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకూ వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే.. ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే సినిమాపై స్పష్టత రావాల్సి ఉంది. -
హీరోలకు మించిన ప్లానింగ్ లో స్టార్ దర్శకులు
-
ప్రభాస్ 'స్పిరిట్'.. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్..!
కల్కి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్లో నటిస్తున్నారు. ది రాజాసాబ్ పేరుతో రొమాంటిక్-హారర్ జానర్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.ఈ మూవీ తర్వాత ప్రభాస్.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో జతకట్టనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీలో ప్రభాస్ రోల్‌పై ఇటీవల ఓ ఈవెంట్లో సందీప్ క్లారిటీ ఇచ్చారు. పోలీస్ పాత్రలో కనిపించనున్నారని వెల్లడించారు. దీంతో ప్రభాస్ తొలిసారిగా ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్నారు. కాగా.. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.(ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)ఇవాళ దీపావళి సందర్భంగా స్పిరిట్ టీమ్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ పనులు మొదలయ్యాయని వెల్లడించింది. ఈ విషయాన్ని మ్యూజిక్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా మ్యూజిక్ వింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ జోడీ కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీటిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. View this post on Instagram A post shared by Harshavardhan Rameshwar (@harshavardhan_rameshwar) -
ట్రెండింగ్‌లో ‘స్పిరిట్’.. రూమర్సే నిజమయ్యాయి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన ఒకవైపు ‘రాజాసాబ్’, మరోవైపు ‘ఫౌజీ’సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే అటు సందీప్, ఇటు ప్రభాస్ ఇద్దరూ వేరు వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుంటే యానిమల్ సినిమాతో సందీప్ ట్రెండ్ సెట్ చేశాడు. ఆ సినిమా సక్సెస్‌లో ఎక్కువ శాతం సందీప్ కష్టమే ఉంది. ప్రభాస్‌తో సందీప్ సినిమా అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్‌తో పాటు సాదారణ సినీ ప్రేక్షకుల్లోనూ ‘స్పిరిట్’పై ఆసక్తి పెరిగింది. ప్రభాస్‌ను తెరపై ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ పెరిగింది.అప్డేట్ ఇచ్చిన సందీప్స్పిరిట్ స్టోరీ ఇదేనంటూ గత కొన్నాళ్లుగా రకరకాల కథలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసుగా నటించబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న చర్చే కానీ.. మేకర్స్ మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ అప్డేట్ ఇచ్చేశాడు. ప్రభాస్‌తో ఎలాంటి కథ చెప్పబోతున్నాడో చెప్పేశాడు.పోలీస్ స్టోరీతాజాగా ‘పొట్టేల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి సందీప్ రెడ్డి వంగా గెస్ట్‌గా వెళ్లారు. ఈ క్రమంలో యాంకర్ సుమ ‘స్పిరిట్’ సినిమా అప్డేట్ ఇవ్వాలని కోరింది. దీంతో సందీప్ పలకపై ‘పోలీస్ స్టోరీ’ అని రాసి చూపించాడు. అయితే స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీసుగా కనిపించబోతున్నాడని గత కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని సందీప్ ధ్రువీకరించడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులేకుండా పోయింది. ప్రభాస్ బర్త్‌డే(అక్టోబర్ 23) రోజు స్పిరిట్ అప్డేట్ రావడం సంతోషంగా ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం స్పిరిట్( #Spirit) ఎక్స్‌లో ట్రెండింగ్‌గా మారింది. దీంతో పాటు సలార్-2 (#Salaar2), ది రాజాసాబ్( #TheRajaSaab ) హాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. -
చాలా పెద్ద కథ అనిపించింది: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
‘‘΄పొట్టేల్’ సినిమా చూశాను.. చాలా బాగా నచ్చింది. కథ విన్నాక ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అనిపించింది. సాహిత్ ఇంత అద్భుతంగా తీస్తాడని ఊహించలేదు. నాకు చాలా పెద్ద బడ్జెట్ మూవీలా కనిపించింది. నిర్మాతలు చాలాఫ్యాషన్తో తీశారు. అజయ్, యువ, అనన్య, నోయల్, జీవా అందరూ సూపర్‌గా నటించారు. యువ దర్శకులు ఎవరూ ఇటీవల పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో సినిమా చేయలేదనుకుంటున్నాను. ఆ నేపథ్యంలో ‘రంగస్థలం’ చిత్రం తర్వాత నేను చూసిన సినిమా ‘΄పొట్టేల్’. ఈ సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కోరారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘΄పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ చంద్రకృష్ణ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి స్ఫూర్తితో మొదలైన నా జర్నీ ఇక్కడ వరకూ వచ్చింది.‘΄పొట్టేల్’లో చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇటీవల ఏ సినిమాకీ ΄పొందని అనుభూతిని ప్రేక్షకులు మా ‘΄పొట్టేల్’తో ΄పొందుతారు’’ అని సాహిత్ చెప్పారు. ‘‘చదువు విలువ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది’’ అన్నారు సురేష్ కుమార్. ‘‘΄పొట్టేల్’ లాంటి సినిమా తీసిన నా ఫ్రెండ్ సాహిత్ పేరు చాలా కాలం గుర్తుండిపోతుంది’’ అన్నారు నిశాంక్ రెడ్డి. -
‘పోటెల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఐఫా వేదికపై ఆర్జీవీకి కృతజ్ఞతలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards-2024) అవార్డుల కార్యక్రమం తాజాగా అబుదాబిలో జరిగింది. ఆ వేదికపై దర్శకులు రామ్‌గోపాల్ వర్మ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమాకు తొమ్మిది విభాగాల్లో ఐఫా నుంచి అవార్డులు అందాయి. దీంతో ఈ సినిమాను తెరకెక్కించిన సందీప్‌పై భారీగా ప్రశంసలు అందాయి.యానిమల్ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు సందీప్ థ్యాంక్స్ చెప్పారు. రామ్‌గోపాల్ వర్మ సినిమాలు చూసి తాను ఎడిటింగ్ నేర్చుకున్నానని అబుదాబి వేదికగా సందీప్ అన్నారు. వర్మ సినిమాలకు తాను పని చేయకపోయినప్పటికీ ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే 'థాంక్యూ ఆర్జీవీ సర్' అని సందీప్ చెప్పారు. ఇప్పటికే పలు వేదికల మీద ఆర్జీవీ పట్ల తనకున్న గౌరవాన్ని సందీప్ చాటుకున్నారు. తాజాగా మరోసారి తన అభిమానాన్ని ఇలా పంచుకున్నారు.సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన మాటలను రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తనదైన స్టైల్లో ఆయన ఇలా స్పందించారు. 'సార్.. సందీప్ రెడ్డి వంగా గారు. ఇప్పుడు మీ నుంచి నేను సినిమా తీయడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, అయాన్ రాండ్తో పాటు మీపై ఒట్టేసి చెబుతున్నా.' అని ఆర్టీవీ ట్వీట్ చేశారు.యానిమల్ చిత్రం 2023లో విడుదలైంది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్వీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి నటించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 917 కోట్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. యానిమల్ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గానూ సందీప్ తన ప్రతిభను చూపించారు. అలా బాలీవుడ్లో తన సత్తా ఏంటో చూపించారు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రానికి సందీప్ దర్శకత్వం వహించనున్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది.Sirrrrrrr @imvangasandeep I now want to LEARN film making from YOU and I SWEAR this on Mia Malkova, Dawood Ibrahim ,Ayn Rand and YOU pic.twitter.com/sY0MtdJ7KG— Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2024 -
దేవర రన్ టైం అడిగిన సందీప్ వంగకి కౌంటర్ ఇచ్చిన ఎన్టీఆర్
-
నిడివి గురించి అడిగిన సందీప్ రెడ్డి.. దేవర టీమ్ కౌంటర్
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించడానికి దేవర సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. దేవర మొదటి పార్ట్ ఈ నెల 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.యానిమల్ డైరెక్టర్‌తో దేవర టీమ్ చిట్చాట్ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో దేవర పవర్ చూపించేందుకు టీమ్ తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలో యానిమల్ మూవీతో సెన్సేషన్‌గా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దేవర టీమ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వదిలారు.(చదవండి: దేవర రికార్డ్)నిడివి ఎంత?ఈ సినిమా ఎలా ఉండబోతోంది? క్యారెక్టర్లు ఏంటి? నిడివి ఎంత? అని సందీప్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించాడు. వాటన్నింటికీ తారక్, కొరటాల తెలివిగా ఆన్సర్స్ ఇచ్చారు. దేవర నిడివి గురించి వంగా అడగడంతో.. ఏంటి? ఈ ప్రశ్న నువ్వు అడుగుతున్నావా? అని కొరటాల కౌంటర్ ఇచ్చాడు. దీంతో తారక్ మధ్యలో కలగజేసుకుంటూ యానిమల్ రన్‌టైమ్ ఎంత? అని ప్రశ్నించాడు. అందుకు సందీప్ రెడ్డి 3 గంటల 24 నిమిషాలు అని బదులిచ్చాడు.25 రోజులపాటు అండర్ వాటర్ సీన్స్..తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 25 రోజులపాటు అండర్ వాటర్ సీన్స్ షూటింగ్ చేశాం. ఈ యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని తెలిపాడు. జాన్వీ కపూర్ పాత్ర రాయడమే చాలా కష్టంగా అనిపించిందని కొరటాల పేర్కొన్నాడు. ఇక జాన్వీ మాట్లాడుతూ.. దేవర కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని జోస్యం పలికింది. ఇకపోతే దేవర రన్‌టైమ్ 2 గంటల 58 నిమిషాలు. Words as wild as the storm….Here’s the promo! 💥#Devara #DevaraOnSep27th pic.twitter.com/YHPNyCokDq— Devara (@DevaraMovie) September 14, 2024చదవండి: హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు -
ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్ చేశారు: బాబీ డియోల్
సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. సినిమా రిలీజ్ తర్వాత చాలామంది రణ్‌బీర్‌తో పాటు బాబీ డియోల్ నటనపై కూడా ప్రశంసలు కురిపించారు. తెరపై ఆయన కనిపించేది కాసేపయినా.. తనదైన నటనతో భయపెట్టాడు. అయితే పాత్ర కోసం బాబీ దాదాపు ఏడాదిన్నర వేచి చూశాడట. ఒకనొక దశలో సినిమాలో తన పాత్ర ఉంటుందో లేదో అని భయపడిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా బాబీ డియోలే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఒక రోజు నాకు సందీప్ వంగా నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను తీయబోతున్న కొత్త సినిమాలో విలన్ పాత్ర కోసం కలవాలని చెప్పారు. వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. కథ చెప్పేందకు నా దగ్గరకు వస్తూ.. ఓ ఫోటోని తీసుకొని వచ్చాడు. అది నేను సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్న ఫోటో. అందులో నా ఎక్స్ప్రెషన్స్ చూసి ఆ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నానని సందీప్ చెప్పడంతో ఆశ్చర్యపోయాను. కథ, నా పాత్ర నచ్చి వెంటనే ఒకే చెప్పేశాను. షూటింగ్ మొదలై నెలలు గడుస్తున్న నన్ను మాత్రం పిలవలేదు. దీంతో నాకు అనుమానం కలిగింది. సందీప్ మనసు మార్చుకొని నా పాత్రను వేరే వాళ్లకి ఇచ్చాడేమో అనుకున్నాను. దాదాపు ఏడాదిన్నర తర్వాత నాకు పిలుపొచ్చింది.రణ్‌బీర్‌తో కలిసి నేను 12 రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నాను. అయితే సినిమా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. నేను తెరపై కనిపించేది కాసేపే అయినా.. ప్రతి ఒక్కరు నా పాత్ర గురించి మాట్లాడుకోవడం సంతోషంగా అనిపించింది. సినిమా విడుదలకు ముందు తన అత్తయ్య చనిపోవడం వల్లే సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేకపోయాను’అని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబీ.. సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువా’ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ‘ఆల్ఫా’, బాలకృష్ణ 109వ చిత్రంలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. -
నాలుగేళ్ల షెడ్యూల్.. ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్‌పై సందీప్ ప్రకటన
అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ సినిమా వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రీసెంట్గా యానిమల్ సినిమాతో తన సత్తా ఏంటో బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఈ సినిమాతో ఆయన పేరు భారీగా ట్రెండ్ అయింది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్‌తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రభాస్‌తో హీరోగా తాను తెరకెక్కించనున్న 'స్పిరిట్'కు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా తెలిపారు.'ప్రస్తుతం తన చేతిలో రెండు కీలక ప్రాజెక్ట్‌లు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ సినిమాలకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి అయినట్లు తెలిపారు. వచ్చే నాలుగేళ్లు తన పూర్తి షెడ్యూల్ ఈ రెండు ప్రాజెక్ట్‌లకే సరిపోతుందని అన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే స్పిరిట్ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. అయితే, సినిమా విడుదలకు మాత్రం రెండేళ్లు పట్టవచ్చని తెలిపాడు. అంటే స్పిరిట్ 2026లో విడుదల కానుందని రివీల్ చేశాడు. స్పిరిట్ సినిమా తర్వాతనే 'యానిమల్ పార్క్'పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన చేతిలో ఈ రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయని సందీప్ రెడ్డి చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఖాకీ డ్రెస్‌లో తొలిసారి ప్రభాస్'స్పిరిట్' పాన్ ఇండియా రేంజ్లో టీ సిరీస్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశముందని ఇప్పటికే నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. ప్రభాస్ కెరీర్లో తొలిసారి ఈ సినిమాలో ఖాకీ డ్రెస్ వేసుకోబోతుండటంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని భారతీయ భాషలతోపాటు చైనీస్, కొరియన్ భాషలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సౌత్ కొరియన్ పాపులర్ యాక్టర్ మడాంగ్సియోక్ విలన్‌గా కనిపించబోతున్నాడని ప్రచారం ఉంది. 'యానిమల్ పార్క్' విషయానికి వస్తే.. గతేడాది విడుదలైన 'యానిమల్'కు సీక్వెల్‌గా రానున్న విషయం తెలిసిందే. -
'అర్జున్ రెడ్డి ఫుల్ కట్ చూపించు'.. డైరెక్టర్‌ను కోరిన విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డి. బాలీవుడ్ భామ షాలినీ పాండే హీరోయిన్గా నటించింది. 2017లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజై నేటికి ఏడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మూవీ స్టిల్స్ షేర్ చేశారు. అప్పుడే ఏడేళ్లు గడిచాయంటే నమ్మలేకుండా పోతున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓ రిక్వెస్ట్ చేశారు. విజయ్ తన ట్వీట్లో రాస్తూ.. 'పదో వార్షికోత్సవానికి అర్జున్‌రెడ్డి ఫుల్ కట్‌ను అందుబాటులోకి తీసుకురా. అర్జున్ రెడ్డి విడుదలై ఏడేళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నా. ఇదంతా గత సంవత్సరంలోనే జరిగినట్లుగా అనిపిస్తోంది' అంటూ మూవీ షూటింగ్ ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పదో వార్షికోత్సవానికి ఫుల్ వెర్షన్ విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.కాగా.. రొమాంటిక్ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో రన్ టైమ్ దాదాపు 3 గంటల 45 నిమిషాలుగా ఉంది. కానీ పలు కారణాల రీత్యా 3 గంటల 2 నిమిషాలకు కుదించారు. అభ్యంతరకర పదాలు, ముద్దు సన్నివేశాల నిడివిని తగ్గించాలని సెన్సార్ బోర్డు కట్ చెప్పింది. తెలుగులో సూపర్‌హిట్ నిలిచిన ఈ చిత్రాన్ని తమిళంలో ఆదిత్య వర్మగా , హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేశారు.Give the people 'The SandeepVanga #ArjunReddy full cut' for the 10 years anniversary @imvangasandeep!I cannot believe it is 7 years already, remember so many moments as if it was last year ❤️ pic.twitter.com/J8CmcByHae— Vijay Deverakonda (@TheDeverakonda) August 25, 2024 -
మహేష్ బాబుతో సినిమా క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
-
ప్రభాస్‌కు బెస్ట్ జోడీ.. 18 ఏళ్ల తర్వాత ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ
టాలీవుడ్లో హిట్ పెయిర్స్ లిస్ట్‌లో ప్రభాస్-త్రిష జోడీ ప్రముఖంగా ఉంటుంది. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి మూడు సినిమాల్లో కనిపించి మెప్పించారు. అయితే, మరోసారి వీరిద్దరూ వెండితెరపై మెరిసేందుకు సిద్ధంగా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో త్రిష పేరు ట్రెండ్‌లో ఉంది. 40 ఏళ్లు దాటినా కూడా ఇప్పుడొస్తున్న హీరోయిన్లుకు ఏమాత్రం తగ్గని గ్లామర్‌తో ఈ బ్యూటీ దూసుకుపోతుంది.ప్రభాస్-త్రిష జోడీ వర్షం, బుజ్జిగాడు, పౌర్ణమి సినిమాలతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను ఫిదా చేశారు. ముఖ్యంగా వర్షం సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. స్టార్ హీరోయిన్ స్థాయికి చేర్చింది. అయితే, ఇప్పుడు మరోసారి ఈ జోడీ ‘స్పిరిట్’ సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష అయితే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారట. ఈ అంశం గురించి ఇప్పటికే త్రిషతో చర్చలు కూడా జరిగాయని టాక్. ఈ భారీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని వార్తలు వస్తున్నాయి. సందీప్‌రెడ్డి వంగా నుంచి యానిమల్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రభాస్ అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పిరిట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తయినట్లు ఇటీవల సందీప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్ ఒక బలమైన పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. 'రాజాసాబ్'తో బిజీగా ఉన్న ఆయన ఈ చిత్రం తర్వాత స్పిరిట్ పట్టాలెక్కనుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. మరోవైపు త్రిష కూడా సౌత్ ఇండియాలో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. 'బృంద' వెబ్ సిరీస్‌తో ఆమె భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవి సరసన ‘విశ్వంభర’లో కూడా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. -
'రక్తపాతం, అశ్లీలత లేకుండా హిట్ కొట్టాం'.. సందీప్‌పై సెటైర్స్?
చిన్న చిత్రమైనా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా అయినా.. కంటెంట్ బాగుంటేనే థియేటర్‌కు వస్తామంటున్నారు ఆడియన్స్. లేదంటే మాత్రం చూసేదేలేదని తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలో 'హనుమాన్' వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవగా 'బడే మియా చోటే మియా' వంటి భారీ బడ్జెట్ సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయాయి.చాలా పెద్ద విషయంప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా రాబట్టింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఇంత గొప్ప కలెక్షన్స్ అందుకుని ఈ మైలురాయిని చేరుకోవడం మా యంగ్ టీమ్‌కు చాలా పెద్ద విషయం. సందీప్‌పై సెటైర్స్?అయితే విధ్వంసం, అరాచకం, రక్తపాతం, అశ్లీలత లేకుండా ఈ విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు సపోర్ట్ చేసిన నటీనటులకు, సినీ ప్రేక్షకులకు థాంక్యూ' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు. దానికి రేపటికోసం అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేశాడు. ఇది చూసిన కొందరు.. యానిమల్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేస్తూ పై కామెంట్స్ చేశాడా? అని నాగ్ అశ్విన్‌ను అనుమానిస్తున్నారు. పోలిక అవసరమా?సందీప్ తన సినిమాలను కొత్తగా ట్రై చేస్తున్నాడు. అతడిని కించపర్చాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్ వారికుంటుంది. పక్కవారిని ఎందుకు అనడం? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం కల్కి ఆల్రెడీ యానిమల్ సినిమా కలెక్షన్స్ దాటేసింది. నాగ్ అశ్విన్.. ఆ సినిమా డైరెక్టర్‌ను ఉద్దేశించి మాట్లాడలేదు. ఏదో సాధారణంగా చెప్పాడంతే! అని నాగిని వెనకేసుకొస్తున్నారు. Man literally attacked Sandeep vanga like nobody ever could 🏃🏻♂️#SandeepReddy #Kalki28989AD #nagashwin pic.twitter.com/p3E6f4sZPE— HARISH KS (@CinemaPaithiyom) July 14, 2024 చదవండి: బిగ్‌బీ కాళ్లకు నమస్కరించబోయిన రజనీకాంత్.. వీడియో వైరల్ -
ప్రభాస్ 'స్పిరిట్' కోసం కొరియన్ విలన్... సెట్ అయితే మాత్రం!
ప్రభాస్ రేంజు రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. 'కల్కి'తో ఓవర్సీస్లోనూ దుమ్మలేపుతున్నాడు. మొన్నటివరకు ప్రభాస్‌కి తగ్గ సినిమాలు రావట్లేదని బాధపడినోళ్లు కాస్త.. ఇప్పుడు 'కల్కి'కి వస్తున్న వసూళ్లు చూసి కుళ్లుకుంటున్నారు. ఈ ఊపులోనే ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రభాస్ 'స్పిరిట్' కోసం కొరియన్ స్టార్ నటుడు విలన్ అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత?'బాహుబలి' తర్వాత ప్రభాస్‌కి ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు వచ్చి పడింది. కాకపోతే దీని తర్వాత చేసిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. కానీ గతేడాది చివర్లో వచ్చిన 'సలార్', రీసెంట్ సెన్సేషన్ 'కల్కి'.. ప్రభాస్ అంటే ఏంటో నిరూపించాయి. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో సలార్ 2, కల్కి 2, హను రాఘవపూడితో మూవీ, స్పిరిట్ ఉన్నాయి.(ఇదీ చదవండి: OTT: ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్ హనీమూన్స్' ట్రైలర్)వీటిలో మిగతా వాటి సంగతి కాస్త పక్కనబెడితే 'స్పిరిట్'పై మాత్రం బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాబట్టి. 'యానిమల్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇతడు.. 'స్పిరిట్'లో ప్రభాస్‌ని పవర్ఫుల్ పోలీస్‌గా చూపించబోతున్నాడు. ఇందులోనే విలన్‌గా కొరియన్ నటుడు మా డాంగ్ సూక్ (డాన్ లీ)ని చేయబోతున్నాడని గాసిప్ బయటకొచ్చింది.మరి సోషల్ మీడియాలో అంటున్నట్లు ప్రభాస్‌ని ఢీకొట్టే విలన్‌గా కొరియన్ నటుడు డాన్ లీ కనిపిస్తే మాత్రం అంతర్జాతీయ స్థాయిలో మూవీకి గుర్తింపు వస్తుంది. ఒకవేళ సందీప్ ఇలాంటి ఆలోచన ఏమైనా చేస్తే గనక రచ్చ రచ్చే. ఇకపోతే డాన్ లీ.. ద గుడ్ ద బ్యాడ్ ద వీర్డ్, ద రౌండప్, ద ఔట్ లాస్ తదితర చిత్రాలతో నటుడిగా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు.(ఇదీ చదవండి: భోజనం చేస్తూ అస్సలు ఈ సినిమా చూడొద్దు.. డేర్ చేసి చూస్తే మాత్రం?) -
స్పిరిట్ మరో బాహుబలి కానుందా..
-
రూ.200 కోట్లు ఇచ్చినా యానిమల్ చేసేవాడిని కాదు: నటుడు
తొలి సినిమా 'అర్జున్ రెడ్డి'తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు మారుమోగిపోయింది. ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి బాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రం దాదాపు రూ.379 కోట్లు కొల్లగొట్టింది. తన మూడో సినిమా యానిమల్ ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.సిగ్గుతో తల దించుకున్నాఅయితే కబీర్ సింగ్ సినిమాలో నటించినందుకు గిల్టీగా ఫీలవుతున్నానని నటుడు అదిల్ హుస్సేన్ ఆ మధ్య సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. తన పాత్ర బానే ఉందని, కానీ రిలీజ్ తర్వాత సినిమా చూశాకే సిగ్గుతో తల దించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. దీనికి సందీప్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు. 30 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ బ్లాక్‌బస్టర్ మూవీతో వచ్చిందని చురకలంటించాడు.ఆయనకంటే ఫేమసా?తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదిల్.. సందీప్ వ్యాఖ్యలపై స్పందించాడు. 'ఆయనేమైనా తైవాన్ డైరెక్టర్ ఆంగ్ లీ కన్నా ఫేమస్ అనుకుంటున్నాడా? ఆయన అంతలా ఊహించుకుంటే నేనేం చేయలేను. కబీర్ సింగ్ కలెక్షన్స్ నాకంతగా తెలీదు కానీ, ఆంగ్ లీ తెరకెక్కించిన లైఫ్ ఆఫ్ పై మూవీ దాదాపు 5 వేల కోట్లపైన రాబట్టింది. ఈ లెక్కల్ని ఆయన సాధిస్తాడని నేననుకోవడం లేదు. కోట్లు ఇచ్చినా నోఅతడు ఆచితూచి మాట్లాడితే బాగుండేది. ఏదో ఆవేశంలో వాగేశాడు. దాన్ని నేను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు' వ్యాఖ్యానించాడు. యానిమల్ సినిమాలో ఏదైనా పాత్ర ఆఫర్ చేస్తే చేసేవారా? అన్న ప్రశ్నకు.. లేదని బదులిచ్చాడు. రూ.100-200 కోట్లు ఇచ్చినా చేసేవాడినే కాదు. అలాంటివి ఎప్పటికీ చేయనని అదిల్ తెలిపాడు. కాగా అదిల్ హుస్సేన్.. 2012లో వచ్చిన లైఫ్ ఆఫ్ పై సినిమాలో ఓ పాత్రలో నటించాడు.చదవండి: పెళ్లయ్యాక ఫస్ట్ ప్రెగ్నెన్సీ.. సంతోషం ఎంతోకాలం నిలవలేదు: నమిత -
సందీప్ వంగాకు ఒకలా భన్సాలీకి మరోలా ఇదేనా బాలీవుడ్ నీతి
-
ఛా.. నిన్ను తీసుకుని తప్పు చేశా.. నటుడిపై సెటైర్లు
కబీర్ సింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ఇందులో కాలేజీ డీన్‌గా నటించిన అదిల్ హుస్సేన్‌కు కూడా సినిమా నచ్చలేదట! తన సినీ కెరీర్లో ఎందుకు నటించాన్రా దేవుడా.. అని ఫీలైన సినిమా ఏదైనా ఉందంటే.. అదే కబీర్ సింగ్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 'అందులో యాక్ట్ చేయనని చెప్తే కేవలం ఒక్క రోజే రమ్మని అడిగారు. భారీ పారితోషికం డిమాండ్ చేస్తే వాళ్లే సైలెంట్‌గా ఉంటారనుకున్నాను. డబ్బులెక్కువ డిమాండ్ చేశా కానీ నేను డిమాండ్ చేసిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో తప్పనిపరిస్థితిలో నేను సినిమా చేశాను. నేను నటించిన సన్నివేశం బాగానే ఉంది. సినిమా అంతా కూడా అలాగే ఉంటుందనుకున్నాను. మూవీ రిలీజైన తర్వాత చూస్తే.. ఇలాంటి సినిమా చేశానా? అని సిగ్గుతో చచ్చిపోయాను. నా భార్యను కూడా సినిమా చూడమని అడగలేదు. తను చూసుంటే ఇలాంటి మూవీలో యాక్ట్ చేశావా? అని నాపై కోప్పడేది' అని చెప్పుకొచ్చాడు. ఒక్క బ్లాక్‌బస్టర్‌తో గుర్తింపు ఇది చూసిన కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో సదరు నటుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. 'మీరు గొప్పగా భావించి యాక్ట్ చేసిన 30 సినిమాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని బాధపడుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్ చిత్రంతోనే వచ్చింది. మిమ్మల్ని సినిమాలోకి తీసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. మీకు నటనపై అభిరుచి కంటే దురాశే ఎక్కువుందని అర్థమవుతోంది. మీరు బాధపడక్కర్లేదు మీరు సిగ్గుతో తలదించుకోకండి.. మీ ముఖాన్ని ఏఐ సాయంతో రీప్లేస్ చేస్తాను.. అప్పుడు మనసారా నవ్వుకోండి' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై అదిల్ హుస్సేన్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. కబీర్ సింగ్ సినిమా చూసి నేను షాకైన మాట వాస్తవం. ఇప్పటికీ ఆ మూవీలో నటించినందుకు రిగ్రెట్‌గా ఫీలవుతున్నాను. అభిప్రాయాన్ని మార్చుకునే ఉద్దేశ్యం నాకు లేదు అని చెప్పుకొచ్చాడు. Ur 'belief' in 30 art films didn't get as much fame to u as ur 'regret' of 1 BLOCKBUSTER film did 👏https://t.co/BiJIV3UeyO I regret casting u,knwing that ur greed is bigger than ur passion. NOW I'll save U from the shame by replacing Ur face with AI help👍 Now smile properly 🙂 — Sandeep Reddy Vanga (@imvangasandeep) April 18, 2024 చదవండి: డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం -
'యానిమల్' ఓ చెత్త సినిమా.. చూస్తుంటే చిరాకేసింది: 12th ఫెయిల్ నటుడు
'యానిమల్' సినిమాని ఎంతమందికి నచ్చిందో తెలీదు గానీ విమర్శలు మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి. చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాలోని సన్నివేశాలపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి కూడా చేశారు. ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని కౌంటర్స్ వేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) ''యానిమల్' లాంటి సినిమా మన సమజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటిది అసలు తీసి ఉండకూడదు. మీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు. కానీ హీరోని మీరు జంతువులా చూపించారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ ని హీరో తన కాలికి ఉన్న షూ నాకమనే సీన్ ఒకటి ఉంటుంది. దీన్ని చూసి రేప్పొద్దున యూత్ కూడా ఇలానే ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి కేర్ లెస్, బుద్ధిలేని సినిమాలు తీయడం చూస్తుంటే బాధేస్తోంది. మూవీ చూస్తుంటే చిరాకేసింది' అని వికాస్ దివ్యకృతి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక, తృప్తి దిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు. హింస, శృంగార సన్నివేశాలు కాస్త ఈ మూవీలో ఎక్కువగానే ఉన్నాయి. దీంతో యూత్ కి తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ చిత్రం నచ్చలేదని కామెంట్స్ వచ్చాయి. సినిమా వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ ఎవరో ఒకరు 'యానిమల్'పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) -
ప్రభాస్‌తో సినిమా.. తొలిరోజే రూ.150 కోట్లు వస్తాయ్!
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి' బిజీలో ఉన్నాడు. మే9న రిలీజ్ అనుకున్నారు గానీ వాయిదా పడొచ్చు. మరోవైపు ప్రభాస్ తర్వాత చేయబోయే మూవీస్ విషయంలో డైరెక్టర్స్ ఫుల్ స్పీడులో ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే మూవీ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) 'సలార్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్'లో యాంగ్రీ పోలీస్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ మూవీ 'యానిమల్' కంటే తీయాల్సింది కానీ ఆలస్యమైందని డైరెక్టర్ సందీప్ చెప్పుకొచ్చాడు. తొలుత హాలీవుడ్ రీమేక్ ప్లాన్ ఒకటి తన దగ్గరకొచ్చిందని, కానీ 'స్పిరిట్' కథ ప్రభాస్ కి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ బయటపెట్టాడు. ప్రభాస్ 'స్పిరిట్' మూవీ షూటింగ్ ఈ ఏడాది డిసెంబరులో మొదలవుతుందని సందీప్ రెడ్డి వంగా చెప్పాడు. అలానే తనకు, ప్రభాస్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా.. అలానే టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేస్తే.. తొలిరోజే ఈ మూవీ సులభంగా రూ.150 కోట్ల మార్క్ అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అలానే స్టోరీ రైటింగ్ దాదాపు 60 శాతం పూర్తయిందని చెప్పాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మాటలు విని తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) -
రూ.1000 కోట్ల హీరోతో దసరా భామకు ఛాన్స్.. వేరే లెవెల్ రేంజ్! (ఫొటోలు)
-
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టనున్న కోలీవుడ్ హీరో..!
కోలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. గతేడాది కార్తీ నటించిన 25వ చిత్రం జపాన్ పూర్తిగా నిరాశపరచడంతో ఆయన ఇప్పుడు స్పీడ్ పెంచారు. చిత్రాల విషయంలో జెడ్ స్పీడ్‌లో పరుగెడుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాద్ధియారే, 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి ఖైదీ 2, సర్ధార్ 2 చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటిలో సర్ధార్ -2 చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కాగా ఇలాంటి పరిస్థితుల్లో కార్తీ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా.. అర్జున్‌రెడ్డి, యానిమల్తో సంచలన హిట్స్ కొట్టిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో నటించనున్నారన్నదే లేటేస్ట్ టాక్. మరోవైపు ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సందీప్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ తరువాత నటుడు కార్తీ హీరోగా ఓ చిత్రం చేయనున్నట్లు ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు వైరలవుతోంది. అయితే ఈ క్రేజీ కాంబోలో రూపొందే చిత్రానికి ఇంకా చాలా టైమ్ ఉంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. -
డిసెంబరులో ఆరంభం
ఈ ఏడాది డిసెంబరులో పోలీసాఫీసర్‌గా ప్రభాస్ చార్జ్ తీసుకోనున్నారని తెలిసింది. హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ‘స్పిరిట్’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబరులో ఆరంభించేలా ప్లాన్ రెడీ చేస్తున్నారట సందీప్ రెడ్డి వంగా. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రష్మికా మందన్నా, కీర్తీ సురేష్, మృణాల్ ఠాకూర్ వంటివార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు. భూషణ్ కుమార్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో లేదా 2026 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. -
సందీప్ - జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
-
సిగ్గుండాలి అంటూ సందీప్ రెడ్డి వంగాపై విరుచుకుపడిన స్టార్ రైటర్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ మరోసారి కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను గతంలో తప్పుబట్టిన జావేద్‌కు సందీప్ రెడ్డి వంగా కూడా కౌంటర్ ఇచ్చారు. జావేద్ అక్తర్ కుమారుడు ఫర్హాన్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ను తెరపైకి తీసుకొచ్చి సందీప్ కూడా కడిగిపారేశారు. అంతా సద్దుమనిగింది అనుకుంటే తాజాగా మళ్లీ జావేద్ అక్తర్ ఇదే అంశంపై రియాక్ట్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగాపై ఆయన పలు కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని తీసిన డైరెక్టర్‌ను తాను ఏమీ అనలేదని జావేద్ అక్తర్ క్లారిటీ ఇచ్చారు. అది రాజ్యాంగం అతనికి ఇచ్చిన హక్కు అని.. అయితే ప్రేక్షకుల గురించే తనకు ఆందోళన అని అక్తర్ పేర్కొన్నారు. 'నేను ఫిల్మ్ మేకర్‌ను ఏమాత్రం నిందించలేదు. ప్రజాస్వామ్య సమాజంలో ఒక యానిమల్ చిత్రమే కాదు.. అలాంటివి ఎన్నో సినిమాలు తీసే హక్కు అతనికి ఉంది. కానీ నా ఆందోళనంతా ప్రేక్షకుల గురించి మాత్రమే.. ఈ సమాజంలో పరిమితి మేరకు ఎలాంటి సినిమా అయినా చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను యానిమల్ చిత్రాన్ని చూడలేదు. కొందరు మిత్రులు షేర్ చేసిన దానిని బట్టి యానిమల్ చిత్రంపై కామెంట్లు చేశాను.' అని జావేద్ అన్నారు. 'నా వ్యాఖ్యలకు సందీప్ రెడ్డి కూడా స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాటలో కూడా ఆయన అసభ్యత, తప్పును కనిపెట్టలేకపోయారు. ఇక చేసేది ఏమీ లేకపోవడంతో నా కుమారుడి ఆఫీస్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ను పట్టుకున్నారు. అందులో ఫర్హాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు. రాయలేదు. కేవలం అతని కంపెనీ ఎక్సెల్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ఆ సంస్థ నుంచి చాలా సిరీస్‌లు వచ్చాయి. అందులో ఇదీ ఒకటి. దాన్నే అతడు పట్టుకున్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క తప్పు కూడా వెతకలేకపోయావా.. చేసేది ఏమీ లేక నా కుమారుడి దగ్గరకు పోయావా సందీప్.. ఇదీ సిగ్గుచేటు.' అని జావెద్ అక్తర్ ఘాటుగా స్పందించారు. గతంలో జావేద్ అక్తర్‌పై సందీప్ చేసిన కామెంట్లు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా మీ కుమారుడు ఫర్హాన్ అక్తర్‌కు ఇవ్వాలి. మీ కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్‌లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్‌ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. -
టాలీవుడ్ డైరెక్టర్ గురించి విన్నా.. ఆ సినిమా తప్పకుండా చూస్తా: కిరణ్ రావు
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్‌రావు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల లపట్టా లేడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతని క్రాఫ్ట్ అద్భతంగా ఉంటుందని.. యానిమల్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తన సినిమా లపట్టా లేడీస్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపింది. కిరణ్ రావు మాట్లాడుతూ..'లాపట్టా లేడీస్ సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రాలనే ఇష్టపడుతున్నారు. యానిమల్ లాంటి సినిమాను నేను చూడాలనుకుంటున్నా. అది అవసరం. ప్రజలు ఇష్టపడినందున యానిమల్ హిట్‌గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ చాలా బాగుందని విన్నాను. రణబీర్ కపూర్ కూడా మంచి నటుడు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.' అని అన్నారు. -
గుండు బాస్ గా మారిన సందీప్ రెడ్డి
-
టాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్.. ఇలా సడన్ షాకిచ్చాడేంటి?
గతేడాది యానిమల్తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. యానిమల్ సూపర్ హిట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కాంబోలో రానున్న స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. యానిమల్ సినిమా సమయంలో స్టైలిష్ హెయిర్ లుక్‌తో కనిపించిన సందీప్ రెడ్డి ఒక్కసారిగా గుండు కొట్టించుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సందీప్ రెడ్డి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. యానిమల్ సూపర్ హిట్ కావడంతోనే మొక్కులు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. #TFNReels: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందీప్ రెడ్డి వంగా Sensational director @imvangasandeep visits Tirumala & seeks divine blessings of Lord Venkateshwara, reveals his next film with Rebel star #Prabhas is gonna start soon! 💫#SandeepReddyVanga #Spirit #TeluguFilmNagar pic.twitter.com/kpgWhJ9hMU — Telugu FilmNagar (@telugufilmnagar) March 6, 2024 -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
సందీప్ రెడ్డి సినిమాల కంటే ఆయనలో అదే నా ఫేవరెట్: స్టార్ హీరో
సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలే గుర్తొస్తాయి. డిఫరెంట్ హీరోయిజాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇతడు.. పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ సృష్టించాడు. అయితే ఇతడి లేటెస్ట్ మూవీ 'యానిమల్'ని ఎంతలా బాగుందని మెచ్చుకున్నారో అంతే ఘోరంగా విమర్శించారు. మరీ ముఖ్యంగా తమిళ సెలబ్రిటీలు అందరూ 'యానిమల్' చిత్రాన్ని, సందీప్ రెడ్డి వంగాపై దారుణమైన కామెంట్స్ చేశారు. స్టార్ హీరో శివ కార్తికేయన్ మాత్రం తాజాగా ఓ కార్యక్రమంలో వీళ్లందరితో పోలిస్తే భిన్నంగా మాట్లాడాడు. (ఇదీ చదవండి: సెట్లో ఎవరు అలా చేసిన బాలకృష్ణ తట్టుకోలేడు: ప్రముఖ తమిళ దర్శకుడు) రెండే సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం పలు ఈవెంట్స్‌కి అతిథిగా హాజరవుతూ బిజీగా ఉన్నాడు. ఇలానే తమిళనాడులో తాజాగా జరిగిన ఓ అవార్డు వేడుకకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. వీటిలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి మాట్లాడింది మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. 'సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ నాకా చాలా నచ్చుతుంది. సినిమాలో ఆయన మ్యూజిక్‌ని ఉపయోగించుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. 'యానిమల్' చూసేటప్పుడు నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆయన సినిమాల కంటే ఆయనిచ్చే ఇంటర్వ్యూలకే నేను అభిమానిని. సమాధానాలు చెప్పే విషయంలో చాలా ముక్కుసూటిగా ఉంటారు' అని శివకార్తికేయన్ స్టేజీపైనే చెప్పుకొచ్చాడు. దీంతో సందీప్‌పై విమర్శలు చేస్తున్న తమిళ సెలబ్రిటీలు అందరికీ చెప్పుతో కొట్టినట్లయింది. (ఇదీ చదవండి: పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు) #Sivakarthikeyan: Tamil actor Siva Karthikeyan expressed his love for Sandeep Reddy Vanga's work and music. Probably, the first actor outside telugu states to come front and appreciate the film, if I'm not wrong !pic.twitter.com/sycq7JxWwJ — Movies4u (@Movies4uOfficl) March 5, 2024 -
స్పిరిట్ కాదు మిర్చి 2..? స్పిరిట్ సీక్రెట్ చెప్పిన సందీప్
-
విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
గామి చాలా అరుదైన సినిమా
‘‘గామి’ ట్రైలర్ చాలా బాగుంది. ఇది చాలా అరుదైన సినిమా అనిపిస్తోంది. ఆరేళ్ల పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలాప్యాషన్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ మూవీ సౌండ్ డిజైన్, కలర్ గ్రేడింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసినప్పుడు మంచి అనుభూతి వస్తుంది’’ అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అన్నారు. విశ్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకుడు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకకి సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్ లాంచ్ చేశారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ప్రతి తెలుగు ఫిల్మ్ మేకర్ గర్వంగా చెప్పుకునే సినిమా ‘గామి’. మా మూవీ బాగా ఆడితే చాలామంది కొత్త ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీకి వస్తారు. తెలుగోళ్లు కాలర్ ఎత్తుకునేలా చేశారు సందీప్ రెడ్డిగారు’’ అన్నారు. ‘‘గామి’ చూస్తున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది’’ అన్నారు విద్యాధర్ కాగిత. ‘‘ఈ సినిమాకి ఫండింగ్ చేసి సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్’’ అన్నారు కార్తీక్ శబరీష్. ‘‘ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు చాందనీ చౌదరి. -
పోలీసుగా ప్రభాస్.. ‘స్పిరిట్’ స్టోరీ లైన్ చెప్పేసిన సందీప్ రెడ్డి
సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. సినిమాకి ‘స్పిరిట్’అనే టైటిల్ మాత్రం ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక రూమర్ మాత్రం వైరల్ అవుతోంది. స్పిరిట్ ఓ హారర్ మూవీ అని.. ఇందులో ప్రభాస్ మాంత్రికుడిగా కనిపించబోతున్నాడనే వార్తలు గత కొన్నాళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్‌పై తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి స్పందించాడు. ఓ బాలీవుడ్ సినిమా టీజర్ లాంచ్‌లో పాల్గొన్న సందీప్ స్పిరిట్ స్టోరీ లైన్ ఏంటో చెప్పేశాడు. ‘ప్రభాస్‌తో తెరకెక్కించబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ పనుల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి వెళ్లనుంది. అందరూ అనుకున్నట్లుగా ఇది హారర్ మూవీ కాదు. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ.తెరపై సరికొత్త ప్రభాస్‌ని చూస్తారు’అని చెప్పారు. తమ అభిమాన హీరో తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారని తెలిసి ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘స్పిరిట్’లో నటిస్తారు. ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘కల్కీ 2898 ఏడీ’ మే 9న రిలీజ్ కాబోతుంది. -
'యానిమల్' సక్సెస్‌ను ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదంటే.: రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన గత చిత్రం 'యానిమల్' సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా విజయంలో ఆమె పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. గీతాంజలిగా ఆమె అందరికి మెచ్చేలా నటించింది. యానిమల్ సినిమా విడుదలైన తర్వాత, తన తదుపరి చిత్రాలపై ఫోకస్ చేయడం ప్రారంభించిన ఈ బ్యూటీ.. యానిమల్ సక్సెస్ మీట్లో రష్మిక పెద్దగా కనిపించలేదు. యానిమల్కు మంచి పాపులారిటీ వచ్చినప్పటికీ, రష్మిక ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడకపోవడంపై అభిమానుల్లో పలు సందేహాలు ఏర్పడ్డాయి. ఈ విషయంపై ఆమె తాజాగా ఇలా మట్లాడారు. 'యానిమల్ విడుదల తర్వాత నా తదుపరి సినిమాల కోసం సెట్స్ పైకి వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ షెడ్యూల్స్ వెనువెంటనే ఉండటం వల్ల ఎలాంటి ఇంటర్వ్యూలలో పాల్గొనలేకపోయాను.. అందువల్ల పెద్దగా బహిరంగంగా కనిపించలేదు. నా పట్ల ఉన్న ప్రేమతోనే ఈ ఆందోళన అని నాకు తెలుసు. అందరూ అనుకుంటున్నట్టుగా నేనూ యానిమల్ విజయాన్ని ఆస్వాదించాలనుకున్నాను. అందుకు కొంత సమయం కేటాయించాలనుకుంటే ఆ అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతం నా కెరీర్లో అతి పెద్ద, కీలకమైన సినిమాల్లో నటిస్తున్నా. దీంతో రాత్రిళ్లూ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఈ కారణం వల్ల చాలా వేడుకల్లో పాల్గొనలేకపోయాను. మీరందరూ నన్ను మిస్ అవుతారని నాకు తెలుసు. త్వరలో నా నుంచి వచ్చే సినిమాలు ఆ లోటుని భర్తీ చేస్తాయని నమ్ముతున్నాను. ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.' అంటూ ఆమె చెప్పింది. రష్మిక పుష్ప పార్ట్2, ది గర్ల్‌ప్రెండ్, రెయిన్బో వంటి చిత్రాల్లో ఆమె బిజీగా ఉంది. తాజాగా తన ఇన్‌స్టాలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసిన రష్మిక లుక్ రివీల్ చేయలేదు. అది ఒక సినిమాకు సంబంధించినది కావడంతో రివీల్ చేయలేకపోయానని ఆమె చెప్పింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవం.. ఆ రెండు సినిమాలదే హవా
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవం.. మంగళవారం రాత్రి ముంబయిలో అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే అవార్డ్స్ సొంతం చేసుకునే విషయంలో 'జవాన్', 'యానిమల్' చిత్రాలు పోటీ పడ్డాయి. పలు విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. ఇంతకీ ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) దాదా సాహెబ్ ఫాల్కే-2024 అవార్డ్స్ లిస్ట్ ఉత్తమ నటుడు - షారుక్ ఖాన్ (జవాన్) ఉత్తమ నటి- నయనతార (జవాన్) ఉత్తమ దర్శకుడు - సందీప్ రెడ్డి వంగా (యానిమల్) ఉత్తమ నటుడు (నెగిటివ్ రోల్) - బాబీ డియోల్ (యానిమల్) క్రిటిక్స్ ఉత్తమ నటుడు - విక్కీ కౌశల్ (సామ్ బహదూర్) ఉత్తమ సంగీత దర్శకుడు - అనిరుధ్ రవిచందర్ (జవాన్) ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషులు) - వరుణ్ జైన్ ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళలు) - శిల్పా రావు ఉత్తమ గీత రచయిత - జావేద్ అక్తర్ (నిక్లే ది కభి హమ్ ఘర్సే దున్కీ) ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ - యేసుదాసు ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ - మౌషుమీ ఛటర్జీ టీవీ కేటగిరీ టీవీ సిరీస్ ఆఫ్ ది ఇయర్ - ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్ ఉత్తమ నటుడు - నీల్ భట్ (ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్) ఉత్తమ నటి - రూపా గంగూలీ (అనుపమ) ఓటీటీ క్రిటిక్స్ ఉత్తమ నటి - కరిష్మా తన్నా (స్కూప్ సిరీస్) (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!) Congratulations @iamsrk on winning the Best Actor Award for Jawan at the #DadasahebPhalkeAward pic.twitter.com/w1FVRL1UOt — Shah Rukh Khan Fc - Pune ( SRK Fc Pune ) (@SRKFC_PUNE) February 20, 2024 Nayanthara at Dadasaheb Phalke International Film Festival Awards 2024 💛🏆✨#Nayanthara #DadasahebPhalkeAward pic.twitter.com/xdKzunByQF — WV - Media (@wvmediaa) February 21, 2024 -
సందీప్ వంగా క్రేజీ ప్రాజెక్ట్.. ప్రభాస్ సరసన యానిమల్ హీరోయిన్!
ఇటీవలే యానిమల్తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన కన్నడ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ సరసన నటించింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ.. కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ప్రస్తుత యానిమల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా టాప్‌లో దూసుకెళ్తోంది. అయితే యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ అనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్నారు. ఈ నేపథ్యంలో స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన రష్మికను ఎంపిక చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కానీ సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వార్త నిజం కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే రష్మిక, ప్రభాస్ ఇప్పటివరకు వెండితెరపై కనిపించలేదు. దీంతో ఈ జంటను స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 2024లో ప్రారంభిస్తామని సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రభాస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి 2898 ఏడీ' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ సమ్మర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తర్వాత మారుతి డైరెక్షన్లో 'ది రాజా సాబ్' నటించనున్నారు. మరోవైపు రష్మిక మందన్నా పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. -
ఓటీటీలో యానిమల్.. ఆ రెండు సూపర్ హిట్ సినిమాలను దాటేసింది!
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే గతనెలలో ఓటీటీకి వచ్చేసిన యానిమల్.. అదే జోరుతో దూసుకెళ్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే టాప్ టైన్లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అంతే కాకుండా మొదటి వారంలోనే ప్రభాస్ సలార్ మూవీని వెనక్కి నెట్టి రికార్డును బ్రేక్ చేసింది. తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది యానిమల్. రెండోవారంలో ఏకంగా టాప్-1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం సలార్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. యానిమల్ మూవీకి మొదటి 10 రోజుల్లోనే ఏకంగా ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూయర్షిప్ నమోదు చేసింది. ఇప్పటికే ఆల్ టైమ్ అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా యానిమల్ నిలిచింది. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ ఆర్ఆర్ఆర్ మూవీ గతంలో తొలి 10 రోజుల్లో అత్యధిక వ్యూయర్షిప్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆ మూవీకి 2.55 కోట్ల గంటల వ్యూయర్షిప్ వచ్చింది. గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో నమోదైంది. తాజాగా ఈ రికార్డ్‌ను యానిమల్ అధిగమించింది. ఆర్ఆర్ఆర్, జవాన్ సినిమాల కంటే చాలా ఎక్కువ వ్యూయర్షిప్ను యానిమల్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన ఏ సినిమాకూ ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు. -
'యానిమల్'లో ఆ సీన్స్.. నా భార్యకు నచ్చలేదు: సందీప్ రెడ్డి
'యానిమల్' సినిమా రిలీజై రెండు నెలలకు పైనే అయిపోయింది. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం ఇప్పటికీ ఏదో ఓ ఇంటర్వ్యూ ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్గా తనపై విమర్శలు చేసిన హీరో ఆమిర్ భార్య కిరణ్ రావ్, దిగ్గజ రైటర్ జావేద్ అక్తర్‌కి ఇచ్చిపడేశాడు. అది అలా ఉంచితే తాజాగా 'యానిమల్' చూసిన తర్వాత తన భార్య, కొడుకు ఎలా రియాక్ట్ అయ్యారనేది బయటపెట్టాడు. (ఇదీ చదవండి: టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్‌బాస్ 7' బ్యాచ్‌తో కలిసి స్కిట్!) సందీప్ రెడ్డిని ఈ మధ్య ఇంటర్వ్యూ చేసిన సిద్ధార్థ్ కన్నన్.. ఈ సినిమా మీ ఏడేళ్ల కొడుక్కి చూపించారా? అతడి రియాక్షన్ ఏంటి? అని అడిగాడు. దీనికి సమాధానమిచ్చిన సందీప్.. 'చూపించకూడని కొన్ని సీన్స్ ఎడిట్ చేసి 'యానిమల్' మూవీని ఓ హార్ట్ డిస్క్‌లో ఉంచా. ఏ రేటింగ్స్ సన్నివేశాలు లేని వెర్షన్‌ని గోవాలో న్యూ ఇయర్ సందర్భంగా నా కొడుకు అర్జున్ రెడ్డికి చూపించాను. అది వాడికి బాగా నచ్చింది. అండర్వేర్ యాక్షన్ సీన్స్ చాలా కామెడీగా ఉన్నాయని చెప్పాడు' 'నా భార్య మనీషా మాత్రం ఈ సినిమాలోని రక్తపాతం సీన్స్ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయింది. స్త్రీ పాత్రలని చూపించిన విధానం గురించి మాత్రం పెద్దగా ఏం చెప్పలేదు. అయితే నేను తీసే చిత్రాలకు సరైన ఫీడ్ బ్యాక్ నా సోదరుడు ప్రణయ్ రెడ్డి నుంచి వస్తుంది' అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కనబెడితే సందీప్.. ప్రభాస్‌తో 'స్పిరిట్' తీస్తాడు. దీని తర్వాత 'యానిమల్' సీక్వెల్, అనంతరం అల్లు అర్జున్‌తో మూవీ ఉంది. (ఇదీ చదవండి: మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్) -
దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్
-
బాలీవుడ్లో సందీప్ వంగా కాంట్రవర్సీ.. వాళ్లందరికీ ఒకేసారి కౌంటర్స్
రణ్‌బీర్ కపూర్ - సందీప్ వంగా కాంబినేషన్లో వచ్చిన 'యానిమల్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 900 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఈ చిత్రంపై బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. దీంతో సందీప్ కూడా వారికి పలు ఇంటర్వ్యూలలో రివర్స్ ఎటాక్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో సందీప్ వంగా పేరు హాట్ టాపిక్‌గా మారిపోయింది. మీ కుమారుడి 'మీర్జాపుర్' కోసం సలహాలు ఇవ్వండి యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా ఆయన కుమారుడు జావేద్ కుమార్ ఫర్హాన్ అక్తర్‌కు ఇవ్వాలి. ఆయన కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్‌లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్‌ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. నీకు సరిపోయే పాత్ర ఉంటే ఇస్తా.. కంగనాకు కౌంటర్ బాలీవుడ్ హీరోయిన్ కంగనా కూడా యానిమల్ సినిమాపై విమర్శలు చేసింది. 'మహిళలను శృంగార వస్తువులుగా భావించి, బూట్లు నాకమని అడిగే హీరో చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నారు. మహిళా సాధికారత చిత్రాలను చేస్తున్న తనకు ఇది తీవ్రంగా నిరుత్సాహపరిచిందని ఆమె అన్నారు. దీంతో కంగనాపై కూడా సందీప్ రియాక్ట్ అయ్యాడు. 'కంగనా ఎలాంటి రివ్యూ ఇచ్చినా ఇబ్బంది లేదు. విమర్శించినా తప్పులేదు. నేను తీసే చిత్రాల్లో ఆమెకు సరిపోయే పాత్ర ఉంటే కచ్చితంగా స్టోరీ చెబుతాను.' అని సందీప్ అన్నారు. దీనిపై కంగనా కూడా మళ్లీ ఘాటుగానే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. సినిమాను సమీక్షించడానికి, విమర్శించడానికి ఎంతో తేడా ఉంది. ముందుగా అది తెలుసుకోండి 'యానిమల్'పై నా రివ్యూ గురించి మీరు నవ్వుతూ మాట్లాడారు. ఇక్కడ అర్థం అవుతుంది నాపై ఉన్న గౌరవం ఏంటో అని. కానీ, మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్ట్‌లు అవుతారు జాగ్రత్త. అది మీకే డేంజర్ కావచ్చు. కానీ సినీ ఇండస్ట్రీకి మీరు కావాలి, ఉండాలి' అంటూ కంగనా వ్యంగ్యంగానే సమాధానం ఇచ్చింది. నేను సందీప్ గురించి కామెంట్ చేయలేదు: ఆమిర్ ఖాన్ మాజీ భార్య యానిమల్ చిత్రంపై పరోక్షంగా బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అన్నారు. అందుకు సందీప్ కూడా ముందుగా తన భర్త నటించిన దిల్ సినిమా చూడాలని వ్యాఖ్యానించాడు. దీంతో ఆమె మళ్లీ ఇలా రియాక్ట్ అయింది. 'నేను ప్రత్యేకంగా సందీప్ వంగా సినిమాల గురించి కామెంట్ చేయలేదు. కొన్ని చిత్రాల్లో స్త్రీలను అగౌవపరిచేలా సీన్స్ షూట్ చేస్తున్నారని అన్నాను. ఇదే విషయం గతంలో కూడా అనేక సార్లు చెప్పాను. మరి ఆయన్నే నేను అన్నట్లు ఎందుకు ఊహించుకున్నారో నాకు తెలియదు.' అని ఆమె వ్యాఖ్యానించారు. -
'ముందు వెళ్లి మీ భర్తను అడగండి'.. స్టార్ హీరో భార్యకు స్ట్రాంగ్ కౌంటర్!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం యానిమల్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది ప్రముఖులు సైతం మండిపడ్డారు. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి-2, కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. అయితే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే చురకలంటించారు. ఒకసారి అమిర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చాడు. సందీప్ మాట్లాడుతూ.. 'నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్‌కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టించాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి అతనితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు' అని యానిమల్ దర్శకుడు తెలిపారు. కాగా..ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీలో యానిమల్ దూకుడు.. మూడు రోజుల్లోనే సలార్ రికార్డ్ బ్రేక్!
గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. థియేటర్లలో ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం జనవరి 26న ఓటీటీకి వచ్చేసింది. గణతంత్ర దినోత్సవం రోజు నుంచే సినీ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన యానిమల్ వారం రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది. అంతకుముందే రిలీజైన ప్రభాస్, ప్రశాంత్ నీల్ మూవీ సలార్‌ను అధిగమించింది. కేవలం టాప్ ట్రెండింగ్ ఉన్న సినిమాలే కాదు.. రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యానిమల్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ టెన్ మూవీస్ లిస్ట్‌లో మొదటిస్థానంలో కొనసాగుతోంది. అంతేకాకుండా ఇండియాతో పాటు దాదాపు 16 దేశాల్లో నంబర్‌వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కమర్షియల్ యాక్షన్ మూవీ సలార్ థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత జనవరి 20న ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కాగా.. ప్రస్తుతం సలార్ ఇండియా వ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. సలార్‌ను దాటేసిన యానిమల్.. టాప్ ట్రెండింగ్ మూవీస్‌లోనే కాదు.. వ్యూస్ విషయంలోనూ సలార్‌కు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. యానిమల్ నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి మూడు రోజుల్లోనే 62 లక్షల వ్యూస్‌తో పాటు.. 20.8 మిలియన్ల గంటల వ్యూయర్షిప్ను నమోదు చేసింది. కాగా.. సలార్ మొదటి 10 రోజుల్లో 35 లక్షల వ్యూస్‌తో పాటు 10.3 మిలియన్ గంటల వ్యూయర్షిప్ నమోదు చేసింది. దీంతో ఓటీటీలో సలార్‌కు రణ్‌బీర్ కపూర్ యానిమల్ గట్టి పోటీ ఇస్తోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.900 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. -
యానిమల్‌పై మండిపడ్డ స్టార్ హీరోయిన్.. ఆ విషయంలో నేనైతే!
సినీ ఇండస్ట్రీలో డేరింగ్ హీరోయిన్ ఎవరంటే తాప్సీనే. తనకు నచ్చకపోయినా.. తనకు తోచింది ఏదైనా బయటకు చెప్పే మనస్తత్వం ఆమెది. టాలీవుడ్లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతంలో తెలుగు దర్శకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాజాగా నటి రష్మిక మందన్నను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా బాలీవుడ్లో వసూళ్ల వర్షం కురిపించిన యానిమల్ చిత్రంపై విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా తాప్సీ సైతం తనదైన శైలిలో యానిమల్ చిత్రంపై విమర్శలు చేశారు. తానైతే ఈ చిత్రంలో నటించేదాన్ని కాదని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఒక పవర్ ఉంటుందని.. అదే విధంగా సమాజంపై బాధ్యత ఉంటుందని అన్నారు. అలాగని యానిమల్ తరహా చిత్రాల్లో నటించే.. ఇతర తారలు ఇలాంటివీ పట్టించుకుంటే బాగుంటుందని తాను చెప్పలేనన్నారు. అది వారి వ్యక్తిగత విషయమని తాప్సీ పేర్కొన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, నచ్చింది చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. అయితే తానైతే యానిమల్ చిత్రంలో నటించడానికి సమ్మతించేదాన్ని కాదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించి చిత్రం యానిమల్. అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయినప్పటికీ ఈ చిత్రంపై విమర్శలు సైతం అదేస్థాయిలో వచ్చాయి. మహిళల పట్ల హింసాత్మక సంఘటనలు, వ్యతిరేక సన్నివేశాలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటి రాధికా శరత్‌కుమార్ యానిమల్ అసలు చిత్రమే కాదంటూ తీసి పారేశారు. ప్రముఖ గాయకుడు శ్రీనివాస్ ఆది జంతువుల కోసం తీసిన చిత్రం అని పేర్కొన్నారు. -
ఓటీటీలో యానిమల్.. నెట్‌ఫ్లిక్స్‌పై నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే?
ఓటీటీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం 'యానిమల్'. ఈ సినిమా గణతంత్రం దినోత్సవం రోజునే ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసింది. సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తెగ చూసేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 1న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రంపై నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్ ద్వారా నెటిజన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకిలా యానిమల్ చిత్రంపై వ్యతిరేకత వస్తోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం. అయితే ఈ చిత్రంపై థియేటర్లో రిలీజ్ అయినప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సైతం తప్పుపట్టారు. ఈ సినిమా స్త్రీల పట్ల ద్వేషాన్ని పెంపొందించేలా ఉందంటూ పలు సందర్భాల్లో విమర్శించారు. తాజాగా ఓటీటీలో రిలీజ్ కాగా.. ఈ సినిమా చూసిన నెటిజన్స్ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిత్రాలను ఎలా ప్రసారం చేస్తారని నెట్‌ఫ్లిక్స్‌ను ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఓటీటీ నుంచి యానిమల్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక నెటిజన్ తన ట్వీట్లో రాస్తూ.. "నేను యానిమల్ చిత్రం చూసి కలత చెందా. ఈ సినిమా భారతీయ మహిళలను కించపరిచేలా ఉంది. ఇది భారతీయ వివాహా బంధాలపై వ్యతిరేక ప్రభావం చూపుతోంది. మన సంప్రదాయం, వారసత్వం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే భార్య అన్న భావనకు భంగం కలిగిస్తోంది. దయచేసి ఇలాంటి సినిమాపై చర్యలు తీసుకోండి.' అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నయనతార నటించిన అన్నపూరణి చిత్రం నెట్‌ఫ్లిక్స్ తొలగించిన విషయాన్ని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు. మరో నెటిజన్స్ రాస్తూ..'దయచేసి నెట్‌ఫ్లిక్స్ నుంచి యానిమల్ సినిమాని తీసేయండి. ఇది మహిళలపై ఘోరమైన హింసను ప్రతిబింబిస్తోంది. దీన్ని ఎంటర్టైన్మెంట్ అని ఎవరూ పిలవరు" అంటూ మండిపడ్డారు. కాగా.. గతంలో భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. యానిమల్‌లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, ట్రిప్తీ డిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. Remove annapoorani @NetflixIndia but promotes Misogyny and hatred. And you ma'am @NayantharaU have apologized to these vadakans. Shame on Netflix #AnimalOnNetflix #Animal https://t.co/ouKElRp1G7 — Andrew (@Noob_Diablo) January 28, 2024 Lol good one, I watched Annaporani wondering what was so offensive in the movie that Netflix removed it. It is an average movie just like Animal. It came to my mind that, why didn't @netflix remove Animal as well which has hurt sentiments of women. — Kushel Giriraj (@g_kushel) January 27, 2024 Hello @NetflixIndia @annamalai_k I’m an Indian Hindu woman disturbed by the movie Animal which shows an Indian man having affairs outside marriage. Cultural heritage what makes India & this movie disturbs the “one man one wife” concept of this country. Plz take action. — Ana De Friesmass 2.0 (@ka_fries2366) January 27, 2024 @NetflixIndia @netflix please remove Hindi movie ANIMAL from Netflix, it reflects gore violence and abuse against women, this isn’t called entertainment — JaganN (@JaganJ80470849) January 26, 2024 -
'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి
మూవీ లవర్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న 'యానిమల్' సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే అందరూ మూవీన చూసేస్తున్నారు. అయితే గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో గట్టిగా వినిపించిన ఓ విషయం మాత్రం జరగలేదు. దీంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ సృష్టించిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత బాలీవుడ్లో వరస సినిమాలు తీశాడు. 'అర్జున్ రెడ్డి' రీమేక్‌గా 'కబీర్ సింగ్' తీసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' మూవీ తీశాడు. ఫ్యామిలీ డ్రామాకు తోడు వయలెన్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ కొంతమందికి తెగ నచ్చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. అలా డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని.. జనవరి 26న ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. అయితే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా 'యానిమల్' గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తారని తెగ ఊరించారు. తీరా ఇప్పుడు చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వాళ్లు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
Animal OTT Release: నేడు అర్థరాత్రి నుంచి ఓటీటీలోకి 'యానిమల్'
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన సూపర్‌హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. యానిమల్ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని ఎదురు చూసిన ప్రేక్షకులకు తాజగా నెట్‌ఫ్లిక్స్ ఒక టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో యానిమల్ చిత్రం ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈమేరకు చిన్న గ్లింప్స్ వదిలింది. అయితే ఈ వీడియో చివర్లో 'రూ.199 చెల్లించి చూడండి' అని సూచించింది. అంటే ఇది నెలవారీ సబ్స్క్రిప్షన్ వివరాలా? లేదంటే అద్దె పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు హింటిచ్చిందా? అన్నది అర్థం కాక నెటిజన్లు అయోమయానికి లోనవుతున్నారు. యానిమల్ రన్‌టైమ్ 3:21 గంటలు కానీ ఓటీటీ కోసం అదనపు సీన్లు యాడ్ చేస్తున్నట్లు చిత్ర టీమ్ తెలిపింది. దీంతో ఈ సినిమా మూడున్నర గంటల నిడివి ఉండనుంది. 'యానిమల్ పార్క్' టైటిల్‌తో ఈ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మిస్తున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఓటీటీకి యానిమల్.. ఆ రోజే రిలీజ్?
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన సూపర్‌హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం అంతేస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు ఈ చిత్రాన్ని తప్పుబట్టారు. అయితే బాక్సాఫీస్ సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీకి రిలీజ్‌పై సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 26న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఊహించని విధంగా యానిమల్ మూవీపై వివాదం తలెత్తింది. ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని కోర్టులో దావా వేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన సినీ1 స్టూడియోస్. దీంతో రిపబ్లిక్ డే రోజున ఓటీటీ రిలీజ్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. (ఇది చదవండి: చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక) అసలేం జరిగిందంటే.. కాగా.. యానిమల్ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. ఇందులో సినీ1 స్టూడియోస్ 'యానిమల్' ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరిగింది. వివాదం తొలగినట్లే..! ఈ అంశంపై ఈ నెల 22న ఢిల్లీ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరైన సినీ1 స్టూడియోస్, టీ సిరీస్ సంయుక్తంగా ఓ అవగాహన ఒప్పందానికి ఓకే చెప్పినట్లు ఇరు పక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ ఒప్పందాన్ని కోర్టుకు సమర్పించేందుకు అంగీకరించారు. వారి మధ్య అవగాహన ఒప్పందం కుదరడంతో యానిమల్ ఓటీటీ రిలీజ్‌కు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును మరోసారి జనవరి 24న విచారించనున్నారు. కాగా.. ఈ సినిమాను ఓటీటీలో 3 గంటల 29 నిమిషాల రన్‌టైమ్ ఉండనుంది. థియేటర్ వర్షన్‌కు అదనంగా మరో 8 నుంచి 10 నిమిషాల పాటు సీన్స్ అదనంగా చేర్చారు. -
ఓటీటీలోకి 'యానిమల్'.. సమన్లు జారీ చేసిన కోర్టు
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన సూపర్‌హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట. జనవరి 26 నుంచి యానిమల్ స్ట్రీమింగ్ కానుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓటీటీ కోసం ఆ సీన్స్ యానిమల్ రన్‌టైమ్ మూడున్నర గంటలు ఉండటంతో ప్రేక్షకుల ఇబ్బంది పడుతారని భావించి సుమారు సుమారు తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్ చేసినట్లు సందీప్ రెడ్డి గతంలో చెప్పాడు. నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ కోసం ఎడిటింగ్ చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపాడు. థియేటర్ కోసం తొలగించిన కొన్ని షాట్స్‌ను ఓటీటీ వెర్షన్‌కు యాడ్ చేస్తున్నట్లు ఆయన చెప్పాడు. అందులో రష్మికతో రణ్‌బీర్ లిప్‌లాక్ సీన్స్ కూడా ఉన్నట్లు ప్రచారం ఉంది. యానిమల్ ఓటీటీ రిలీజ్‌కు చిక్కులు యానిమల్ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. ఇందులో సినీ1 స్టూడియోస్ 'యానిమల్' ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ అంశంపై నేడు (జనవరి20) వివరణ ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరగనుంది. -
డైరెక్టర్ టచ్ చేయనిచ్చేవాడే కాదు: యానిమల్ నటులు
యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు సిక్కులంటే ఎంతో అభిమానం, గౌరవమట. సిక్కులను సినిమాలో చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడట. ఈ విషయాన్ని యానిమల్ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన అమంజోత్ సింగ్, మంజోత్ సింగ్, విక్రమ్ బక్షి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ముగ్గురూ సినిమాలో రణ్‌బీర్ కపూర్ కజిన్లుగా నటించారు. బల్బీర్ సింగ్(అనిల్ కపూర్)కు ఆపదలో ఉన్నాడని తెలియగానే పంజాబ్ నుంచి ఢిల్లీ వెళ్లి ఆయనకు రక్షణగా నిలబడతారు. తాజాగా ఈ ముగ్గురు ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. సందీప్ స్వయంగా చెప్పాడు ఈ సందర్భంగా అమంజోత్ మాట్లాడుతూ.. 'సర్దార్లు కామెడీ పాత్రల కోసం పుట్టలేదు. వారి యాటిట్యూడ్, స్వభావం, పోరాట చరిత్ర.. అదంతా కామెడీ కాదు. వారిని నేను కమెడియన్లలా చూపించలేను అని దర్శకుడు సందీప్ స్వయంగా నాతో చెప్పాడు. హీరోలుగా చూపించాల్సిన వారిని కామెడీ పీసులుగా మార్చడం ఇష్టం లేదన్నాడు. కాలేజీలో తనకు పంజాబీ స్నేహితులు ఎక్కువగా ఉండేవారట. అలా సిక్కుల గురించి ఆయన బాగా తెలుసుకున్నాడు' అని చెప్పాడు. సీరియస్ పాత్రల్లో సిక్కులు కనిపించి ఎన్నాళ్లయిందో! విక్రమ్ బక్షి మాట్లాడుతూ.. 'సీరియస్‌గా కనిపించే సిక్కు పాత్రను చివరిసారిగా ఎప్పుడు చూశారో మీకేమైనా గుర్తుందా? గుర్తు రావడం లేదు కదూ.. సినిమాలో మేము పరిస్థితులను బట్టి అక్కడక్కడా సరదాగా కామెడీ పండించాము. అంతేకానీ వెకిలి కామెడీ మాత్రం చేయలేదు' అన్నాడు. ఇంతలో మంజోత్ సింగ్ మధ్యలో కల్పించుకుంటూ.. 'ఏదైనా సన్నివేశం షూట్ చేసేముందు చాలాసార్లు అతడు మా అనుమతి కోరేవారు. సినిమా లుక్ టెస్ట్ కోసం వెళ్లినప్పుడు అక్కడి మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్ రెబెకా.. నా ముఖం మీదున్న వెంట్రుకలు తీసేయాలన్నాడు. గడ్డం తీసేయమంటే.. అలాగే నా గడ్డం వైపు చూపిస్తూ అది కొంత తీసేయాలన్నాడు. సందీప్ అందుకు ఒప్పుకోలేదు. గడ్డాన్ని తాకడానికే వీల్లేదన్నాడు. దాన్ని అలాగే ఉండనీయమన్నాడు. మాకు చాలా స్వేచ్ఛను ఇచ్చాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా యానిమల్ విషయానికి వస్తే ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా రాబట్టింది. చదవండి: ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన మహేశ్.. డల్‌గా కనిపించిన సూపర్‌స్టార్ -
యానిమల్ వివాదం.. రచయితకు గడ్డి పెట్టిన మేకర్స్!
రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. దాదాపు రూ.800 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎంత హిట్ అయిందో.. అంతేస్థాయిలో విమర్శలకు గురైంది. ఆర్జీవీ లాంటి సంచలన డైరెక్టర్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ కొందరు మాత్రం సమాజంలో స్త్రీలను తక్కువ చేసి చూపేలా ఉందంటూ పలువురు మండిపడ్డారు. త తాజాగా యానిమల్ చిత్రంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను ఆయన తప్పుబట్టారు. ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్‌పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ ఆ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై యానిమల్ చిత్రబృందం స్పందించింది. జావేద్ అక్తర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్లో రాస్తూ..'జోయా, రణ్వీర్ మధ్య జరిగిన ద్రోహాన్ని రచయిత అర్థం చేసుకోలేకపోతే.. మీ కళ అంతా ఒక పెద్ద అబద్ధం. ఒక స్త్రీని ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేస్తే నా షూ నాకండి అని అనవచ్చు. అప్పుడు మీరు దానిని స్త్రీవాదం అనే పేరుతో గొప్పగా చెప్పుకుంటారు. లింగ భేదమనే రాజకీయాల్లో ప్రేమకు విముక్తి కల్పించండి. అప్పడే వారిని ప్రేమికులు అంటారు. ప్రియురాలు మోసం చేసి.. అతనికి అబద్ధం చెప్పింది. అందుకే ప్రియుడు షూ నాకమని అన్నాడు' అంటూ రిప్లై ఇచ్చింది. అయితే యానిమల్ చిత్రంలో త్రిప్తి డిమ్రీని ఉద్దేశించి.. రణ్‌బీర్ కపూర్ ఈ విధంగా డైలాగ్ చెప్పారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరొక సీన్లో హీరోయిన్‌పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్‌రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్‌రెడ్డి వంగానే. Writer of your calibre cannot understand the betrayal of a lover (Between Zoya & Ranvijay) then all your art form is big FALSE 🙃 & If a woman (betrayed and fooled by a man in the name of love) would have said "lick my shoe" then you guys would have celebrated it by calling it… — Animal The Film (@AnimalTheFilm) January 7, 2024 -
యానిమల్‌లో ఆ సీన్‌ను తప్పుబట్టిన ప్రముఖ రచయిత
రణబీర్ కపూర్ నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ వంటి సినిమాల విజయంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను జావేద్ నిందించారు. భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్ చేశారు. ఔరంగాబాద్‌లో జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన ప్రసంగంలో ప్రస్తుత చిత్రాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన యానిమల్ చిత్రం గురించి నేరుగా ప్రస్తావించకుండానే ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు. తాజాగా వచ్చిన ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆధరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యమనది కాదని ఆయన చెప్పారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరం అని ఆయన ఆందోళన చెందారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరోక సీన్లో హీరోయిన్‌పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్‌రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్‌రెడ్డి వంగా. పరోక్షంగా సందీప్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా జావేద్ ఇలాంటే వ్యాఖ్యలే చేశారు. ఆనంద్ బక్షి రాసిన సాహిత్యంపై కూడా వివాదస్పద వ్యాఖ్యలే చేశారు. 90ల నాటి చిత్రం ఖల్ నాయక్ నుంచి 'చోలీ కే పీచే' పాట భారీ విజయాన్ని అందుకుంది. ఆ పాట లిరిక్స్‌తో పాటు అందులో మగవారి వస్త్రధారణ కూడా మహిళల మాదిరి ఉండటం ఆయన తప్పుబట్టారు. కానీ ప్రేక్షకుల అఖండ మద్దతుతో ఇలాంటివి మరిన్నీ వస్తున్నాయిని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలి అనే విషయంలో కూడా బాధ్యత వహించాలి.. ఇలాంటి వాటిని మెచ్చుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఇలాంటి చిత్రాలే ఎక్కువ వస్తాయి. ఇప్పటికైనా ఇటువంటి చిత్రాలకు దూరంగా ఉండాలని జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘అర్జున్ రెడ్డి’ని అల్లు అర్జున్‌తో తీయాలకున్నా.. కుదరలేదు: సందీప్‌రెడ్డి
‘యానిమల్’మూవీతో సందీప్‌రెడ్డి వంగా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు పలువురు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే కెరీర్ ప్రారంభంలో మాత్రం సందీప్ చాలా ఇబ్బందులు పడ్డారట. తొలి సినిమా అర్జున్ రెడ్డిని స్టార్ హీరోలతో చేసేందుకు తెగ ప్రయత్నించాడట.అల్లు అర్జున్‌తో ఈ సినిమా చేస్తే బాగుంటందని భావించి..ఆయనకు కథ వినిపించేందుకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఒక్కసారి కూడా బన్నీని కలవలేకపోయాడట. చివరకు తన స్నేహితుడైన విజయ్ దేవరకొండతో ఈ సినిమా తెరకెక్కించాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి చెప్పారు. ‘2011లో ఒక్కసారి అల్లు అర్జున్‌ని కలిసి ఓ కథ చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి కథను రాసుకున్నాను. బన్నీని దృష్టిలో పెట్టుకొనే ఈ కథను రాశాను. అతన్ని కలిసి కథను వినిపించాలనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం లభించలేదు. దీంతో ఆ స్క్రిప్ట్ పట్టుకొని చాలా మంది హీరోలు, నిర్మాతలను కలిశాను. ఎవరూ ముందుకు రాలేదు. చివరకు నేనే నిర్మించాలని డిసైడ్ అయ్యాను. ఓ స్నేహితుడి ద్వారా విజయ్ పరిచయం కావడంతో అతన్ని హీరోగా సెలెక్ట్ చేసి సినిమాను తెరకెక్కించాను. విడుదల తర్వాత మా ఇద్దరికి మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది’అని సందీప్ అన్నారు. -
సందీప్ రెడ్డి యానిమల్.. ఆ సీన్ కూడా కాపీనేనా?
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీపై మొదట చాలామంది విమర్శలొచ్చాయి. అయితే విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అదేస్థాయిలో వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఫైట్ సీన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. (ఇది చదవండి: 'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్) అయితే తాజాగా బాబీ డియోల్, రణ్‌బీర్ కపూర్ క్లైమాక్స్ ఫైట్ సీన్‌పై కాపీ విమర్శలు వైరలవుతున్నాయి. 2001లో వచ్చిన ఆషిక్ మూవీలోని సీన్‌ను కాపీ కొట్టారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆషిక్ మూవీ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. నేను పొరపాటున రాంగ్ యానిమల్ మూవీ సీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఆషిక్ చిత్రంలో బాబీ డియోల్ హీరోగా నటించారు. అయితే గతంలోనూ యానిమల్‌పై కాపీ ఆరోపణలు వచ్చాయి. యానిమల్ ట్రైలర్‌ను విడుదలైన వెంటనే హువా మైన్ పాటలో రష్మిక, రణబీర్ ఫ్లైట్ సీన్‌ను 50 షేడ్స్ ఆఫ్ గ్రే చిత్రం కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ కొరియన్ చిత్రం నుండి కాపీ చేశారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్, ప్రేమ్ చోప్రా బాలీవుడ్ తారలు నటించారు. #Animal#AnimalReview #AnimalMovie #RanbirKapoor𓃵 #SandeepReddyVanga Ranbir and Bobby Fight Scene Glimpse 🔥🔥🔥🔥 pic.twitter.com/ylMpVhIZov — ASHISH kushwaha (@ASHISHk18033956) December 2, 2023 -
ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?
ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా చాలా అంటే చాలా మాట్లాడుకున్నారా అంటే అందరికీ గుర్తొచ్చేది 'యానిమల్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. కానీ ఒక్కసారి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేసిన తర్వాత ఆడియెన్స్‌కి ఎందుకో తెగ నచ్చేసింది. ఇప్పటికీ చాలాచోట్ల ఇంకా స్క్రీనింగ్ అవుతోంది. ఇలాంటి టైంలో ఓటీటీ న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి' గుర్తొస్తుంది. ఈ సినిమాతో ట్రెండ్ సృష్టించాడు. ఇప్పుడు 'యానిమల్'తో దీన్ని మించిపోయేలా చేశాడు. తీసింది బాలీవుడ్ హీరోతోనే అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చాలా ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలో మూవీ గురించి ఇప్పటికీ తెగ మాట్లాడుకుంటున్నారు. సీన్స్, సాంగ్స్, ఇందులోని యాక్టర్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) ఇకపోతే డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన 'యానిమల్' సినిమా డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. లెక్క ప్రకారం అయితే జనవరి 26న స్ట్రీమింగ్ చేస్తారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆలోచన మారినట్లు కనిపిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 15నే ఓటీటీలోకి తీసుకొచ్చేయాలని అనుకున్నారట. ఈ తేదీ ఫిక్స్ అని, కాకపోతే అధికారిక ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు. ఒకవేళ సంక్రాంతికి వస్తే మాత్రం 'యానిమల్'కి ప్లస్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. థియేటర్లలో కొత్త సినిమాలకు వెళ్లే ఇంట్రెస్ట్ లేని వాళ్లు.. ఈ బ్లాక్‌బస్టర్‌పై లుక్కేసే అవకాశముంటుంది. అయితే ఈ సినిమా ఓటీటీ వెర్షన్.. థియేటర్ కంటే కాస్త పెద్దగానే ఉంటుందని సమాచారం. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే.. కొన్నిరోజులు ఆగితే సరి. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) -
2023లో ఉత్తమ చిత్రం యానిమల్: స్టార్ డైరెక్టర్ ప్రశంసలు
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. గతేడాది డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం విడుదలై నెల రోజులవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీపై ఇప్పటికీ మరో డైరెక్టర్ కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించారు. 2023లో తాను చూసిన వాటిలో యానిమల్ బెస్ట్ మూవీ అంటూ కితాబిచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరణ్ జోహార్ యానిమల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. చాలామంది నా వద్దకు వచ్చి నువ్వు రాకీ ఔర్ రాణి సినిమా తీశారు కదా.. అది యానిమల్ వంటి చిత్రానికి టీకా లాంటిదేనా అని ప్రశ్నించారు. దీనిపై కరణ్ స్పందిస్తూ..'నేను మీతో విభేదించలేను. ఎందుకంటే యానిమల్ 2023లో నా ఉత్తమ చిత్రంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రకటన చేయడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మన చుట్టు ప్రజలు ఉన్నప్పుడు.. మనం చెప్పే తీర్పు గురించి భయం ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా యానిమల్ మూవీని తాను రెండుసార్లు చూశానని అన్నారు. మొదట ఆ సినిమాను ఒక ప్రేక్షకుడిగా.. రెండోసారి సినిమాను అధ్యయనం చేసేందుకు చూసినట్లు తెలిపారు. సినిమా సక్సెస్‌ని గేమ్ చేంజర్‌గా అభివర్ణించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోపాటు రాణీ ముఖర్జీ, తాప్సీ పన్నులాంటి వాళ్లు పాల్గొన్న రౌండ్ టేబుల్ మీట్లో కరణ్ ఇలాంటి కామెంట్స్ చేశారు. యానిమల్ చూసి తాను కంటతడి పెట్టినట్లు తెలిపాడు. ఈ మూవీ సక్సెస్ సందీప్ రెడ్డి వంగా ఎంచుకున్న కథపై నమ్మకమే ప్రధాన కారణమని కరణ్ జోహార్ ప్రశంసించారు. సినిమా క్లైమాక్స్ గురించి కరణ్ మాట్లాడుతూ..'చివర్లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వెనుక ఆ సాంగ్ వస్తుంటుంది. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కడంతా రక్తమే కనిపించింది. అప్పుడు నాకనిపించింది ఏంటంటే.. నాలో ఏదైనా లోపం ఉండాలి.. లేదంటే అతనిలో అయినా ఉండాలి. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. సందీప్ సినిమా చూసి నా దిమ్మదిరిగిపోయింది' అని అన్నారు. బంధాలను, సంప్రాదాయలను పక్కన పెట్టి తీసిన సినిమా యానిమల్ అని.. అందుకే తనకు నచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్,త్రిప్తి డిమ్రీ కీలకపాత్రల్లో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 850 కోట్ల మార్క్‌ను దాటేసింది. -
హీరోయిన్లను అలా ఎందుకు చూపించానంటే: సందీప్‌రెడ్డి వంగా
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో 'యానిమల్' సినిమాను తెరికెక్కించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి సందీప్‌రెడ్డి వంగా తెలిపాడు. ఇందులో రష్మిక మందన్నా నటనకు పాన్ ఇండియా ఫిదా అయింది. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సుమారు రూ. 900 కోట్ల కలెక్షన్స్ మార్క్‌కు దగ్గరగా ఉంది. సినిమా విడుదల సమయంలో ఈ మూవీపై విమర్శలు ఎన్ని ఉన్నా కలెక్షన్స్ సునామీ మాత్రం తగ్గలేదు. ఈ మూవీలో హింస ఎక్కువైందని.. మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. అలాగే అసభ్య పదజాలం వాడారు అని చాలా విమర్శలను ఎదుర్కొంది. అయినా కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో హిట్ కొట్టిన సందీప్.. 'యానిమల్' సినిమాతో కెరీర్లో మరో హిట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్‌రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని ప్రశ్న ఎదురైంది. తన సినిమాల్లో హీరోలను పెద్ద ఘనత సాధించిన వారిలా చూపించి.. మహిళలను మాత్రం ఇంటికే ఎందుకు పరిమితం చేస్తారు..? అనే ప్రశ్న సందీప్‌కు ఎదురైంది. దీంతో ఆయన 'ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే అందరూ ఉద్యోగం చేయడమో, బిజినెస్ చేయడమో, పోరాట యోధురాలిగా చేయడమో, టీచర్లను చూపిండమో చేస్తారు. కానీ వారందరూ కూడా హౌస్ వైఫ్‌ను ఉమెన్ ఎంపవర్మెంట్గా మాత్రం గుర్తించరు. కానీ, నా దృష్టిలో వాటి అన్నింటితో పోలిస్తే అదే అతిపెద్ద ఉద్యోగం. ఇంట్లో ఉంటూ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడంలో తల్లి పాత్ర ఎంతో పెద్దది. కొందరు నిజ జీవితంలో ఉద్యోగాలు చేస్తూనే తల్లి పాత్ర కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా పోషిస్తారు. వారు ఇంకా గొప్పవారు.' అని జవాబిచ్చారు. -
'యానిమల్' నుంచి సూపర్ హిట్ వీడియో సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్- రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమా కలెక్షన్లతో పాటు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గడం లేదు. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే కలెక్షన్స్ విషయంలో జోరు కొనసాగిస్తుంది. ఇప్పుటికే పలు రికార్డులు బద్దలు కొట్టంది. యానిమల్ సినిమా 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.797.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. డిసెంబర్ 16న ఎంత కలెక్ట్ చేసింది ఇంకా ప్రకటించలేదు. కానీ రూ. 800 కోట్ల క్లబ్లో యానిమల్ చేరిపోయింది అని చెప్పవచ్చు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కానీ యానిమల్లోని పాటలు కూడా ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'జమాల్ కుడు' అనే పాటకు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. బాబీ డియోల్ ఈ పాటతోనే ఎంట్రీ ఇస్తాడు. ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. బాబీ డియోల్ మాదిరి అందరూ తలపై ఒక గ్లాసు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోలు ఇంటర్నెట్లో దుమ్మురేపుతున్నాయి. ఈ పాటకు సంబంధించిన వీడియో తాజాగా యూట్యూబ్‌లో విడుదలైంది. కొన్ని గంటల్లోనే 1 మిలియన్‌కు పైగానే వ్యూస్‌తో దూసుకుపోతుంది. -
నెగెటివ్ అప్రోచ్.. కచ్చా బాదం..సందీప్ రెడ్డి సీక్రెట్ ఇదే!
ఇప్పుడు దేశవ్యాప్తంగా సందీప్‌రెడ్డి ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. అంతా కచ్చా బాదం. ఎలాంటి గోప్యత అవసరం లేదు. కుల్లం కుల్ల.. బూతు సీన్లు కూడా హీరో, హీరోయిన్లు చేయాల్సిందే. వ్యాంపు పాత్రలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇదేంటని చాదస్తంగా ఎవరయినా అడిగితే .. ఇదే ట్రెండ్ అంటున్నాడు. లిప్ లాక్‌లు, దుస్తులు విప్పడాలు, నేరుగా బెడ్రూమ్ సీన్లు.. ఇవన్నీ హాలీవుడ్‌ను తలపించేలా చేయడం సందీప్‌రెడ్డి సీక్రెట్‌గా మారింది. కథ, కథనం, దర్శకత్వం ఇవన్నీ పాత డైరెక్టర్లు నమ్మిన పద్ధతులు. జనానికి ఇప్పుడంతా యానిమల్ టైప్ కావాలట. అదే సందీప్‌రెడ్డి గుర్తించిన అంశం. ఎంత కచ్చాగా ఉంటే.. అంత రియాల్టీ అంటున్నాడు. తీసింది మూడు సినిమాలే అయినా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సందీప్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అర్జున్‌రెడ్డితో సంచలనం తొలి సినిమాకే ప్రత్యేక ముద్రను సంపాదించుకునే దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుల్లో సందీప్ రెడ్డి ఒకరు. తొలి సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు. టాలీవుడ్లో అప్పటి వరకు వచ్చిన సినిమా ఒకెత్తు. అర్జున్ రెడ్డి సినిమా మరో ఎత్తు. ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను బోల్డ్‌గా చూపించి సక్సెస్ అయ్యాడు. అర్జున్‌రెడ్డి సినిమా చూస్తున్నంతసేపు..ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ముందుకు సాగుతాడు. హీరోని వైల్డ్‌గా చూపించినా.. కథంతా బోల్డ్‌గా నడిపించినా కంటికి అది అసహ్యంగా కనిపించదు. హీరోకి కోపమొస్తే పచ్చి బూతులు తిడతాడు.. ప్రేమ పొంగుకొస్తే.. చుట్టూ ఉన్న పరిసరాలనే మర్చిపోతారు. శారీరక వాంఛ తీరకపోతే అండర్వేర్లో ఐస్ వేసుకుంటాడు. అయినా ఆ క్యారెక్టర్‌పై మనకు ప్రేమే కలుగుతుంది తప్పా ఎక్కడా నెగెటివ్ ఇంప్రెషన్ రాదు. అంతాలా తన కథతో కన్విన్స్ చేశాడు సందీప్ రెడ్డి. ఒక బోల్డ్ కంటెంట్ ను కరెక్ట్ వేలో చూపిస్తూ... ఆడియెన్స్ ను మెప్పించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమైంది. అదే కథను మరింత బోల్డ్‌గా బాలీవుడ్ ప్రేక్షకులను చూపించి.. సూపర్ హిట్ కొట్టాడు. ఇలా తన తొలి రెండు సినిమాలతో ఇటు విజయ్ దేవరకొండ..అటు షాహిద్ కపూర్ల హోదానే మార్చేశాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఆ తరహాలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి.ప్రస్తుతం వస్తూనే ఉన్నాయి. ‘యానిమల్’తో మరో ప్రయోగం సాధారణంగా సినిమా అంటే నిడివి ఇంత ఉండాలి.. ప్రారంభం ఇలా.. ఇక్కడ ఇంటర్వెల్.. క్లైమాక్స్ అలా అని కొన్ని పద్దతులు ఉంటాయి. కానీ అవేవి పట్టించుకోకుండా.. తండ్రి కొడుకుల ఎమోషన్ని బోల్డ్‌గా, వయోలెన్స్‌గా చూపిస్తూ..సినిమా ఇలా కూడా చెయ్యొచ్చు అని ‘యానిమల్’తో నిరూపించాడు సందీప్‌రెడ్డి. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ.. రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు అడుగు దూరంలో ఉంది. వాస్తవానికి ఈ కథ రొటీన్ రివేంజ్ డ్రామా. ఇందులోని సంఘర్షణ కూడా పాతదే. కానీ సందీప్ రెడ్డి కథనాన్ని నడిపించిన విధానం.. హీరో పాత్రని మలిచిన తీరు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు సంప్రదాయ ప్రవర్తనలకు విరుద్ధంగా ఉంటాయి. కానీ హీరో పాత్ర మనస్తత్వాన్ని అర్థం చేసుకొని సినిమా చూస్తే.. దర్శకుడు అంతర్లీనంగా చెప్పదలచుకున్న విషయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. సందీప్‌రెడ్డి చెప్పాలనుకే పాయింట్‌కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టే.. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. వంగాపై బాలీవుడ్ ఫోకస్ యానిమల్ సినిమాతో మరోసారి తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు సందీప్ రెడ్డి. ఇప్పుడీ సెన్సెషనల్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. రణ్‌బీర్ కపూర్ అయితే మరోసారి సందీప్‌తో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. షారుఖ్, సల్మాన్ కూడా సందీప్‌పై ఫోకస్ పెట్టారు. అలాగే బాలీవుడ్‌కి చెందిన బడా నిర్మాణ సంస్థలన్నీ సందీప్‌రెడ్డికి అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అయితే సందీప్ రెడ్డి మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. తన తదుపరి సినిమాను ప్రభాస్‌తో ప్లాన్ చేశాడు. దానికి స్పిరిట్ అనే టైటిల్‌ని కూడా ఖారారు చేశారు. ఆ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో మహేశ్‌బాబు, రామ్‌చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్స్ కూడా సందీప్ సినిమా సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి. -
సినీ నటితో 'యానిమల్' నటుడి వివాహం
బాలీవుడ్ నటుడు కునాల్ ఠాకూర్ తాజాగా వివాహం చేసుకున్నాడు. హిందీ చిత్రసీమకు చెందిన ముక్తి మోహన్‌ను ఆయన పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్లో ముక్తి మోహన్ మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు పొందింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరూ ఆ ఫోటోలను షేర్ చేశారు. అభిమానుల ఆశీస్సులు కోరారు. పలువురు సినీ ప్రముఖులు ఈ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కబీర్ సింగ్, యానిమల్ తదితర చిత్రాల్లో కునాల్ ఠాకూర్ నటించాడు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన యానిమల్ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్నతో నిశ్చితార్థం చేసుకునే అబ్బాయిగా కునాల్ కనిపించాడు. ముక్తి మోహన్ కూడా బాలీవుడ్లో నటనతోపాటు ఆమె మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రవితేజ 'దరువు' చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించింది. లస్ట్ స్టోరీస్ 2, థార్ వంటి సినిమాల్లో కూడా ఆమె మెప్పించింది. దిల్ హై హిందుస్తానీ 2 బుల్లితెర ప్రోగ్రామ్‌లో ఆమె హోస్ట్‌గా కనిపించింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల వసూళ్లు రాబట్టింది. View this post on Instagram A post shared by KUNAL THAKUR (@whokunalthakur) -
బాక్సాఫీస్ వద్ద యానిమల్ ప్రభంజనం.. 9 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 650కి పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో పఠాన్, జవాన్, గదర్-2 ఉన్నాయి. ఇదే స్థాయిలో కలెక్షన్స్ వస్తే త్వరలోనే వెయ్యి కోట్లకు చేరుకునేలా కనిపిస్తోంది. తొమ్మిది రోజుల్లో ఇండియావ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన యానిమల్.. ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. #Animal Roars Louder 🔥🪓 Book your Tickets 🎟️https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/rXLUe4SSod — Animal The Film (@AnimalTheFilm) December 10, 2023 -
మనలో ఎలాంటి జంతువులు ఉన్నాయో కనిపిస్తోంది: ఆర్జీవీ ట్వీట్
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించగా.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ సక్సెస్ కావడంతో డైరెక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్లో చేరిన యానిమల్ వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఆర్జీవీ సైతం సందీప్‌ను కొనియాడారు. యానిమల్ చిత్రంతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారంటూ ప్రశంసించారు. అయితే మరోసారి ఆర్జీవీ యానిమల్ చిత్రంపై మరోసారి ప్రశంసలు కురిపించారు. సినీ ప్రేక్షకులు, ప్రజలు, సినీ విమర్శకులను ఉద్దేశించి చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం. యానిమల్ చిత్రం నుంచి గ్రహించాల్సిన ఐదు ప్రధాన విషయాలివే అంటూ వరుస ట్వీట్లు చేశారు. సినీ ప్రేక్షకుల కోసం.. 1. ఈ రోజు నుంచి ఇంతకు ముందు అనుకున్న విధంగా భారతీయ చలనచిత్రాలు ఒకేలా ఉండవు. 2. సినిమాలో ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ఎవరికీ తెలియదు. 3. మంచి, చెడు, నైతికత, విశ్వసనీయత, ఇతర కుటుంబ, సామాజిక విలువలను యానిమల్ అనే ఫిల్ స్కూల్లో నేర్చుకోవాలి. 4. అన్ని ఫిల్మ్ స్కూల్స్ సిలబస్‌లను తక్షణమే రద్దు చేయాలి. భవిష్యత్ విద్యార్థులందరికీ యానిమల్‌లా సినిమా చేయడం ఎలా? అనేది నేర్పించాలి. ఎవరైనా సినిమా చెత్తగా ఉందని చెప్పినా సినీ నిర్మాతలందరూ ఎవరి మాట వినకూడదు. మీలోని యానిమల్(టాలెంట్)ను బయటకు తీసుకురావాలి. 5. యానిమల్ చూశాక ప్రేక్షకులు ఇకపై చిన్నపిల్లల చిత్రాలను చూడరని ఫిల్మ్ మేకర్స్ గ్రహించాలి. సినీ విమర్శల కోసం.. 1. భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన సినిమాకు అత్యంత అధ్వాన్నంగా రివ్యూలు ఇవ్వడం.. సినీ విమర్శకులకు, సినిమా బాక్సాఫీస్‌కు తేడా లేదని రుజువైంది. 2. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారో నిజంగా సినీ క్రిటిక్స్‌కు తెలియదు 3. అత్యధిక ప్రేక్షకులు వీక్షించడంతో మొదటిసారి ఫిల్మ్ మేకర్ కంటే విమర్శకులు అప్సెట్ అయ్యారు. 4. విమర్శకులు తమ ప్రమాణాలను మెరుగు పరచుకోవడానికి పదే పదే యానిమల్ చూడాల్సిందే. 5. ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్సులు నిర్వహించాలని సినీ విమర్శకులందరూ చేతులెత్తి సందీప్‌ను అభ్యర్థించాలి భారత ప్రజల కోసం.. 1. భారతీయులంత ఓకేలా ఉండరు. మరీ మునుపటి భారతీయులు ఏమనుకుంటున్నారో? 2. సినిమాలు ఒక కళారూపమని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయని విశ్వసిస్తే.. అంతకుముందు కళగా పిలవబడే దాన్నే యానిమల్ చిత్రం నాశనం చేసింది. 3. మనలో ఎలాంటి జంతువులు దాగి ఉన్నాయో ఇప్పుడు ప్రతి ఇండియన్‌కు మరొకరిలో కనిపిస్తోంది. 4. ఇప్పుడు ఇండియన్స్ దర్శకుడిని గౌరవిస్తారని మెగా బాక్సాఫీస్ నిరూపించింది. 5. ప్రస్తుతం భారతీయులందరూ ఎదిగారని అందరూ గ్రహించారు. అంతే కాకుండా ఇప్పటి నుంచి ఇండియన్ సినిమాను రెండు భాగాలుగా(ఎరా) విభజించాలని ట్వీట్లో ప్రస్తావించారు. డిసెంబర్ 1, 2023 కంటే ముందు.. డిసెంబర్ 1 తర్వాత అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 5 TAKE AWAYS for the CINEMA CRITICIS of INDIA from ANIMAL film 1. The WORST reviewed film becoming thd MOST watched film of INDIA proves that CRITICS make zero difference to a film’s BOX OFFICE 2. CRITICS don’t know Jack shit about why the audience will like in a film 3.… — Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2023 Now after the advent of ANIMAL, like B C and A D , the Entire Indian film industry can now be divided into 2 eras namely pre 1.12.2023 and post 1.12.2023 🙏 — Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2023 5 TAKE AWAYS for the CINEMA PEOPLE of INDIA from ANIMAL film 1. Indian Films can no longer be the same since Dec 10th 2023 , the way what one used to think earlier 2. Nobody knows a Jack shit about what the audience will like in a film 3. Good , bad , morality ,fidelity and… — Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2023 5 TAKE AWAYS for the PEOPLE of INDIA from ANIMAL film 1. Indians are not the same Indians , what the earlier Indians used to think 2. If films are believed to be an art form and reflect culture , ANIMAL has redefined culture and destroyed what was earlier called art 3. Every… — Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2023 -
'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్
రణ్‌బీర్ కపూర్ - రష్మిక కాంబినేషన్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం 'యానిమల్'. పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ఈ చిత్రం రన్ అవుతుంది. ఈ సినిమాలో సందీప్ మేకింగ్ స్టైల్, నటీనటుల ప్రదర్శనను ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు మెచ్చుకున్నారు. రేణు దేశాయ్, అల్లు అర్జున్, రామ్ గోపాల్ వర్మ వంటి వారందరూ కూడా ఈ చిత్రాన్ని అభినందించారు. ఇదిలా ఉంటే మరోవైపు యానిమల్ సినిమాపై విపరీతంగా ట్రోలింగ్ కూడా నడుస్తుంది. సమాజానికి ఈ సినిమా ఏ మేసేజ్‌ను ఇస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్న సమయంలో తాజాగా ఛత్తీస్ ఘడ్కు చెందిన ఓ మహిళా ఎంపీ యానిమల్ చిత్రంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రంజీత్ రంజన్ ఈ టాపిక్‌పై ఏకంగా రాజ్యసభలోనే మాట్లాడారు. సమాజానికి పట్టిన జబ్బుగా యానిమల్ సినిమాను ఆమె అభివర్ణించారు. యానిమల్ సినిమా చూసి తన కూతురు ఏడ్చిందంటూ ఆమె చెప్పుకొచ్చారు. యానిమల్ సినిమాలో మహిళల పట్ల హింస దారుణంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. 'సినిమా అనేది సమాజంలో చాలా ప్రభావం చూపించగలదు. మనం సినిమాను చూస్తూనే పెరిగాం. కాబట్టి సినిమా అనేది యువతను ప్రేరేపిస్తుంది. వారిపై సినిమా ప్రభావం కూడా పడుతుంది. నా కూతురు తన స్నేహితులతో కలిసి యానిమల్ చిత్రానికి వెళ్లింది. కానీ సినిమా మధ్యలోనే ఏడుస్తూ బయటకు వచ్చేసింది.' అని రాజ్యసభలో ఎంపీ రంజీత్ రంజన్ చెప్పారు. యానిమల్ సినిమాలో సిక్కుల యుద్ధ గీతం అయిన అర్జన్ వైలీని దారుణమైన ఓ హింసాత్మక సీన్ కోసం వాడుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. మొఘల్స్, బ్రిటీష్‌తో పోరాడిన సిక్కు యోధుల వీరగాధను ప్రపంచానికి తెలిపిన ఈ పాటను ఇలా వాడుకోవడం ఏ మాత్రం సహించలేని విషయం అని ఆమె తెలిపారు. -
యానిమల్తో అన్ని హద్దులను చెరిపేశారు: బన్నీ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల క్లబ్లో చేరింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అభిమానుల భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ చిత్ర దర్శకుడిని ఆకాశానికెత్తేశారు. ప్రత్యేకంగా ఆర్జీవీ రివ్యూ సైతం రిలీజ్ చేశారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యంగ్ హీరోయిన్ మృతి!) అయితే తాజాగా ఐకాన్ స్టార్ బన్నీ సైతం ఈ చిత్రంపై మనసు పారేసుకున్నారు. ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్, సినిమా బ్రిలియెన్స్ అద్భుతమన్నారు. రణ్‌బీర్ కపూర్ భారతీయ సినిమాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారని.. స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. రష్మిక నటన బ్రిలియంట్ అని.. అత్యుత్తమ నటన కనబరిచిందని శ్రీవల్లిని పొగిడారు. బాబీ డియోల్, అనిల్ కపూర్ అద్భుతంగా నటించారన్నారు. మరో నటి త్రిప్రి డిమ్రీ నటనతో ఎందరో హృదయాలను కొల్లగొట్టిందని ప్రశంసించారు. యానిమల్ చిత్రబృందానికి అభినందనలు ట్వీట్ చేశారు. సందీప్ గురించి రాస్తూ.. 'దర్శకుడు సందీప్ మీరు అన్ని సినిమా పరిమితులను అధిగమించారు. మీరు మరోసారి మా అందరినీ గర్వపడేలా చేశారు. మీ సినిమాలు భవిష్యత్తులో భారతీయ సినిమా ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది!' అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా యానిమల్ కచ్చితంగా ఇండియన్ సినిమా క్లాసిక్ మూవీస్ లిస్ట్‌లో చేరుతుందని పోస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ఆయన లేకుండా నా కెరీర్ ఊహించుకోలేను.. సిమ్రాన్ భావోద్వేగం) #Animal . Just mind blowing. Blown away by the cinematic brilliance. Congratulations! #RanbirKapoor ji just took Indian cinema performances to a whole new level. Very Inspiring . I am truly in loss of words to explain the magic you’ve created . My deep Respects to the highest… — Allu Arjun (@alluarjun) December 8, 2023 -
'అమ్మాయిలు చప్పట్లు కొడుతుంటే బయటకొచ్చేశా'.. యానిమల్ చిత్రంపై తీవ్ర విమర్శలు..!
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల చేరువలో కలెక్షన్స్ సాధించింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. అయితే మొదటి రోజే పాజిటివ్ రావడంతో విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రంపై అభిమానులతో సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రానికి ప్రశంసల కంటే విమర్శించే వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా ఈ లిస్ట్‌లో ప్రముఖ లిరిసిస్ట్ స్వానంద్ కిర్కిరే కూడా చేరిపోయారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్లో వరుస పోస్టులు చేశారు. స్వానంద్ కిర్కిరే తన ట్వీట్లో రాస్తూ.. 'యానిమల్ సినిమా చూశాక.. నేటి తరం మహిళలపై నాకు నిజంగా జాలి కలిగింది. మీకోసం కొత్త వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అంతే కాదు.. అతను మరింత భయంకరంగా ఉన్నాడు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. మిమ్మల్ని అణచివేసే వ్యక్తి గురించి నువ్వు గర్వపడుతున్నావు. నేటి తరం అమ్మాయిలు థియేటర్లో కూర్చోని రష్మికను చూసి చప్పట్లు కొడుతుంటే.. మనసులో సమానత్వం అనే ఆలోచనకు నివాళులు అర్పించి నిరాశ, నిస్పృహలతో బయటకు వచ్చేశా. ఈ సినిమా విపరీతంగా వసూళ్లు రాబట్టినప్పటికీ.. నా భారతీయ సినిమా ఉజ్వల చరిత్ర మాత్రం దారి తప్పుతోంది. యానిమల్ భారతీయ సినిమా భవిష్యత్తును నిర్దేశిస్తుంది. భయంకరమైన, ప్రమాదకరమైన దిశలో తీసుకెళ్తోంది.' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన యానిమల్ చిత్రబృందం స్పందించింది. అతని ట్వీట్లను ఉద్దేశించి తగిన రీతిలో కౌంటర్ ఇచ్చింది. ట్వీట్లో రాస్తూ.. "మీ మోకాళ్లను మీ కాలి ముందు పడనివ్వకండి. మీ భుజం, పాదాలు బ్యాలెన్స్ కోసం వేరు వేరుగా ఉంచండి. మీ పాదాలను సురక్షితంగా ల్యాండ్ చేయండి. అప్పుడు అది కచ్చితంగా ల్యాండ్ అవుతుంది' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది. కాగా.. యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, ట్రిప్తీ డిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు. शांतराम की - औरत , गुरुदुत्त की - साहब बीवी और ग़ुलाम , हृषीकेश मुखर्जी की - अनुपमा , श्याम बेनेगल की अंकुर और भूमिका , केतन मेहता की मिर्च मसाला , सुधीर मिश्रा की मैं ज़िंदा हूँ , गौरी शिंदे की इंगलिश विंगलिश , बहल की क्वीन सुजीत सरकार की पीकू आदि , हिंदुस्तानी सिनेमा — Swanand Kirkire (@swanandkirkire) December 2, 2023 Do not let your knees fall ahead of your toes or cave in towards each other. Keep feet shoulder-width apart to maintain a good base of support for balance. Land softly on the balls of the feet to help absorb the force of the landing. Yes.... now it landed perfectly 😘… pic.twitter.com/OxTOE0vlvI — Animal The Film (@AnimalTheFilm) December 6, 2023 -
'నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ మీరే'.. సందీప్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!
టాలీవుడ్ డైరెక్టర్, అర్జున్ రెడ్డి ఫేమ్ తెరకెక్కించిన తాజా చిత్రం యానిమల్. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికే ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం చూసిన సంచలన డైరెక్టర్ ఆర్జీవీ సైతం పొగడ్తలతో ముంచెత్తారు. యానిమల్ మూవీతో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడంటూ ఏకంగా తన రివ్యూను వెల్లడించారు. అయితే తాజాగా తన మూవీ యానిమల్కు రాం గోపాల్ వర్మ రివ్యూ ఇవ్వడంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సందీప్ రెడ్డి తన ట్వీట్లో రాస్తూ... 'రామ్ గోపాల్ వర్మ చేసినంతలా మరే ఇతర దర్శకుడు భారతీయ సినిమాకి సేవలు అందించలేదని నేను నమ్ముతున్నా. నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ మీరే. మీ నుంచి నా ఫిల్మ్ యానిమల్ రివ్యూ రావడం సంతోషంగా ఉంది. తనదైన శైలిలో వ్రాసిన రెండు విషయాలు మినహాయించి ఆర్జీవీకి హృదయపూర్వక కృతజ్ఞతలు' తెలిపారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. I believe no other director had contibuted to Indian cinema more than Mr Ram Gopal Varma did.... Film Animal review from my all time favorite director. Excluding couple of things written in his own style really grateful for all the ❤️ @RGVzoomin🙏🙏 🙏 https://t.co/wgRPEkxxMJ — Sandeep Reddy Vanga (@imvangasandeep) December 5, 2023 -
యానిమల్ చిత్రంపై త్రిష పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు తొలగింపు
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవల విడుదల చేసిన చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్- రష్మిక కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం ఈ చిత్రంలో హింసాత్మక, స్త్రీ ద్వేషపూరితమైన కంటెంట్ ఉందంటూ విస్తృతంగా విమర్శించబడింది. యానిమల్‌లో యాక్షన్ సన్నివేశాల్లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ అదరగొట్టారని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో ఎక్కువగా లైంగిక, గృహ హింసకు సంబంధించిన సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ తీవ్ర ప్రతిఘటనను ఈ చిత్రం ఎదుర్కొంది. (ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) ఈ నేపథ్యంలో నటి త్రిష కృష్ణన్ ఇటీవల యానిమల్ చిత్రాన్ని సోషల్ మీడియాలో సమీక్షించి, దానిని 'కల్ట్'గా అభివర్ణిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇది నెటిజన్లకు పెద్దగా నచ్చలేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై త్రిష చేసిన కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సినిమాపై 'కల్ట్... Pppppppaaaaaahhhhhh.' అని తన ఎక్స్ పేజీలో రాసింది. అయితే త్రిష కామెంట్‌పై సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు. దీంతో ఆమె తన పోస్ట్‌ను తొలగించింది. అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం దానిని స్క్రీన్‌షాట్‌ను తీశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Trisha's review on #Animal. Deleted the story now..!! pic.twitter.com/hDuwecUAps — AB George (@AbGeorge_) December 3, 2023 లియో చిత్రంలో త్రిషతో 'బెడ్రూమ్ సీన్' లేకపోవడంతో నిరాశ చెందాననని మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. అతను గతంలో ఇతర మహిళా నటీనటులతో అనేక 'రేప్ సన్నివేశాలలో' తన ప్రమేయం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అతని ప్రకటనపై త్రిష స్పందిస్తూ తన అసమ్మతిని ట్వీట్ చేసి భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేయడానికి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. పలువురు ప్రముఖులు కూడా త్రిషకు మద్దతుగా నిలిచారు. అయితే సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాపై త్రిష ప్రశంసలు కురిపించడంతో మరోసారి ఇంటర్నెట్ దద్దరిల్లింది. గృహ హింస, లైంగిక హింసను కలిగి ఉన్న సినిమాని త్రిష మెచ్చుకున్నారని చాలా మంది విమర్శించారు. అయితే, మరికొందరు త్రిషను సమర్థించారు. యానిమల్‌లో ఎక్కువగా బోల్డ్, హింసకు సంబంధించిన సీన్లే ఉన్నాయి. అలాంటి సినిమాను త్రిష ఎందుకు మెచ్చుకున్నారు. ఈ సినిమాను కొందరు పురుషులు కూడా విమర్శిస్తున్నారు.. అలాంటిది త్రిష ఎందుకు హైప్ చేస్తున్నారని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. ఒకవైపు మన్సూర్ వ్యాఖ్యలను ఆమె ఖండిస్తూనే మరోవైపు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే చిత్రానికి మద్దతిస్తున్నట్లు మరోక నెటిజన్ తెలిపాడు. అయితే, కొంతమంది త్రిషకు మద్దతుగా కామెంట్ చేశారు. మన్సూర్ అలీ ఖాన్‌తో ఆమెకు ఉన్న వివాదాన్ని తీసుకొచ్చి యానిమల్ చిత్రంపై ఆమెకు ఉన్న అభిప్రాయాన్ని పోల్చకూడదని వాదించారు. Trisha's review on #Animal. Deleted the story now..!! pic.twitter.com/hDuwecUAps — AB George (@AbGeorge_) December 3, 2023 Trisha praised #Animal movie and wokes started bullying her with hate Tweets. 😐 — . (@Midz13) December 3, 2023 Trisha’s comment on Animal does not invalidate that she does not like what happened to her. Her being verbally harassed matters and holds value regardless of her being a misogynist. — Lakshita Shankar (@lakshitposts) December 3, 2023 Trisha praised #Animal movie and wokes started bullying her with hate Tweets. 😐 — . (@Midz13) December 3, 2023 -
'యానిమల్' వైబ్‌లోనే ఆర్జీవీ.. డైరెక్టర్ గురించి అలాంటి ట్వీట్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. 'యానిమల్' సినిమా నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికే చిత్రాన్ని, డైరెక్టర్ సందీప్‌ని ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశాడు. ఇప్పుడు మరోసారి క్రేజీ కామెంట్స్ చేశాడు. అయితే ఈసారి దర్శకుడిని మెచ్చుకుంటూనే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ, ప్రేక్షకులపై కౌంటర్ వేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) 'అర్జున్ రెడ్డి' మూవీతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత ఇదే సినిమాని హిందీలో 'కబీర్ సింగ్'గా తీశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' మూవీ తీశాడు. ఈ డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం వందల కోట్లు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఆర్జీవీ.. సందీప్ గురించి క్రేజీ ట్వీట్ చేశాడు. 'సందీప్ రెడ్డి వంగా.. నిజ జీవితంలో ఫిజియోథెరపీ డాక్టర్. అయితే 'యానిమల్' సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి మెంటల్ థెరపీ చేశాడు. ప్రేక్షకులకు హిప్నోథెరపీ చేశాడు' అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు. అయితే వర్మ.. ఈ ట్వీట్లో సందీప్‌ని మెచ్చుకుంటూనే ఇండస్ట్రీ, ప్రేక్షకులపై సెటైర్స్ వేయడం విశేషం. (ఇదీ చదవండి: నేను మోసపోయానంటూ రైతుబిడ్డ ఫైర్.. కప్పు ఇచ్చేయండన్న అమర్!) . @imvangasandeep a qualified doctor in PHYSIOTHERAPY is now using ANIMAL to do MENTAL THERAPY to film industry and HYPNOTHERAPY to the audience — Ram Gopal Varma (@RGVzoomin) December 4, 2023