వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడు.. ఆర్జీవీ రివ్యూ వైరల్ | Ram Gopal Varma Tweet On Animal Movie Review Goes Viral | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: యానిమల్ సినిమా కాదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన రివ్యూ

Published Sun, Dec 3 2023 5:59 PM | Last Updated on Sun, Dec 3 2023 7:24 PM

Ram Gopal Varma Tweet On Animal Movie Review Goes Viral - Sakshi

ఇటీవల థియేటర్లలో రిలీజైన చిత్రం యానిమల్. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 1న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ సంచలన డైరెక్టర్  తన రివ్యూను ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

ఆర్జీవీ తన ట్వీట్‌లో రాస్తూ.. 'యానిమల్  సినిమా మీద రాసిన చాలా  రివ్యూలు చదివిన తర్వాతే నేను సినిమాకి వెళ్లా. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా సినిమాలు తీసిన తర్వాత  నేను కేవలం ఒక ప్రేక్షకుడిగా ఏ సినిమానీ  చూడలేను. కానీ  ఈ సినిమాని వేరు వేరు కోణాల్లో చూడాలని డిసైడ్ అయ్యా. నైన్ అండ్ హాఫ్ వీక్స్ , ఫ్యాటల్ అట్రాక్షన్ లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్ యాడ్రియన్ లిన్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, సినిమా అన్నది ప్రేక్షకుడికి  నచ్చిందా? నచ్చలేదా। అన్నంత  సింపుల్‌గా ఉండకూడదు. సినిమా అనేది  ప్రేక్షకులు తీవ్రంగా డిస్కస్ చేసుకుని ఆర్గుమెంట్ చేసుకునేలా ఉండాలి. ఒక కొత్త తర్కానికి తెర తీయాలి. అదే సందేశాన్ని సందీప్ వంగ , యానిమల్ చిత్రంతో వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడు

అంతే కాకుండా ఈ సినిమా హిపోక్రసీ.. పూర్తి నగ్నమైన నిజాయితీనీ విశ్వరూపంతో చూపించడంతో ఎంతో కొంత మన సంస్కృతిని కూడా మార్చిపారేస్తుందని నా ప్రగఢ  నమ్మకం. ఎందుకంటే యానిమల్ అనేది ఒక సినిమా కాదు .. అది ఒక సోషల్ స్టేట్‌మెంట్‌.  నాకు  ఆ సినిమా కథ కానీ ,తండ్రి  కొడుకుల బంధం కానీ ఏమంతా  ఎక్కలేదు కానీ..  పాత  కథా వస్తువుల్ని  బేస్‌గా చేసుకుంటూ  సందీప్ మునుపెన్నడూ చూడని విధంగా సీన్లని అద్భుతంగా చూపించారు. సినిమా అంటే ఇలా ఉండాలి అనుకునే  డైరెక్టర్లందరికీ  ఫ్యూజులు  ఎగిరిపోయేలా కరెంట్  షాకిచ్చాడు సందీప్. వాళ్లు నమ్మే చాదస్తపు నైతిక విలువులన్నింటినీ తన చీపురు కట్టతో  ఊడ్చి ఎత్తి చెత్త  కుండీలో పడేశాడు.  'అని అన్నారు. 


సినిమా నెమ్మదిగా సాగినప్పటికీ చాలా సార్లు షాక్ అవుతాం. నా ఉద్దేశ్యం ఈ సినిమా మూడున్నర గంటలు కాకుండా నాలుగున్నర గంటలున్నా తక్కువే.  హీరో వెళ్లి  బేస్ బాల్ బ్యాట్ పట్టుకుని వస్తాడేమోనని..  ప్రేక్షకులందరూ ఊహించే టైంలో మెషీన్‌గన్‌తో రావటం థియేటర్లో మా అందరినీ కుర్చీలోనుంచి కింద పడినంత పనైంది. “హ్యాపీనెస్ ఈజ్ ఎ డెసిషన్" అని రణ్‌బీర్‌ సింపుల్‌గా  చెప్పిన డైలాగ్ తత్వవేత్తలందరినీ  ముక్కున వేలేసుకునేలా చేసింది. "ఇక మీ మీద ఈగ వాలినా సరే వాళ్లని  తగలబెట్టేస్తాను" అనే డైలాగ్‌ చెప్పినప్పుడు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ శైలి ఆ పాత్రను ఎలివేట్ చేయడానికి తీసుకున్న ఎక్కువ టైం కేక్ మొత్తం తయారీ చూపించి ఐసింగ్ పెట్టినట్టనిపించింది. ఇక ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫైట్‌లో వాడిన అర్జున్ వెల్లి పాట , మైకేల్ జాక్సన్ "బీట్ ఇట్" మ్యూజిక్ వీడియోని గుర్తు చేసింది. ట్రెడిషనల్ సినిమా రూల్స్‌ని కడుపులో గుద్దుతూ, తన కాళ్లతో తన్నినందుకు సందీప్‌ను జీర్ణించుకోలేక , కడుపు నొప్పితో నేల  మీద పడి దొర్లడం తప్ప విమర్శకులు ఇంకేం చెయ్యలేరు.  ఇక్కడ ఆర్ట్  ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈజ్ , ఆర్ట్ ఈజ్ అల్సో వాట్ ఇట్ కుడ్ బీ అని ఐయాన్ రాండ్ చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. నిజాన్ని దుమ్ము దులిపేసి దాని అసలు రూపాన్ని  ఏ  మాత్రం కలరింగ్ లేకుండా నిజంగా చూపించిన ఒక నిజమైన కళాకారుడు సందీప్ అంటూ ప్రశంసలు కురిపించారు. 

ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రాన్సిస్ కాప్పొల సందీప్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాలి.  ఇందులో విలన్  బాబీ పరిచయం  సినిమా చరిత్రలోనే అత్యంత ఒరిజినల్‌గా ఉంది .. ఎందుకంటే ఒక స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్‌లో అతన్ని ఒక పెళ్లి కూతురి మేని ముసుగు  తీసినట్టు ఆవిష్కరించడం జస్ట్ జీనియస్. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పటానికి హీరో తన ఫామిలీ, స్టాఫ్  ముందు నగ్నంగా నడిచే  సీన్  నెవర్  బిఫోర్ ఈవెన్ ఇన్  వరల్డ్  అనేలా ఉంది.  విజయ్ పాత్రకి సంభందించి నాకు నచ్చని ఒకే ఒక సన్నివేశం.. అమ్మాయిని విజయ్ తన బూట్లు నాకమని ఆర్డర్ ఇవ్వడం .. అది కూడా ఎందుకంటే ఆ నటిని ఎంచుకున్న తీరు, తనని చూస్తూనే నాకు కలిగిన సానుభూతి, తనని చూపించిన ప్రతి క్లోజ్ షాట్‌లో అది పెరుగుతూ రావడమే. నిరోధ్ వాడావా? అని హీరోని రష్మిక అడిగే సీన్. అది రాసిన  తీరు అద్భుతం. రష్మీక నటనకి నేను క్లీన్ బౌల్డ్ అయ్యా అని అన్నారు. 

ట్రైలర్ చూసినప్పటి నుంచి రణ్‌బీర్‌ ఏమైనా కొంచెం  ఓవర్‌గా వెళ్తున్నాడా అన్న ఫీలింగ్ కలిగింది. కానీ ఒక ఫిల్మ్ మేకర్‌గా, ప్రేక్షకుడి గా, మొదటిసారి హీరో నటన.. సందీప్ రాసిన  క్యారెక్టర్‌ను మోస్తోందా? లేదా సందీప్ క్రియేట్  చేసినా  క్యారెక్టర్ రణ్‌బీర్‌ నటనని మోస్తోందా? అన్న కన్ఫ్యూజన్‌లో పడేసింది. రణ్‌బీర్‌  నటన 1913లో వచ్చిన  రాజా హరిశ్చంద్ర  నుంచి ఇప్పుడు 2023 వరకు ఏ యాక్టర్‌  చూపించలేకపోయాడు. ఆ అమ్మాయిని తన బూటు నాకమనే ఒక్క సన్నివేశంలో తప్ప రణ్‌బీర్‌ లియోనార్డో డి కాప్రియోని కూడా మించిపోయాడు. హేయ్ సందీప్ దయచేసి నీ కాళ్ల ఫోటో నాకు వాట్సాప్‌లో పంపిస్తే  మొక్కుకుంటా.' అంటూ పోస్ట్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement