
‘బ్యూటీ’ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డు
Mar 25 2025 5:25 PM | Updated on Mar 25 2025 5:25 PM

‘బ్యూటీ’ అనే చిత్రంతో నీలఖి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం, ‘హలో వరల్డ్’ ఫేమ్ వర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య హీరోగా, నీలఖి హీరోయిన్‌గా నటించారు.
నీలఖి తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టకముందే ఒడిశాలో తన ప్రతిభను చాటుకున్నారు. ఒడిశాలోని ప్రముఖ ఛానెల్ తరంగ్ టీవీ నిర్వహించిన ‘తరంగ్ సినీ ఉత్సవ్’ కార్యక్రమంలో ‘యంగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ - డెబ్యూ ఫీమేల్’ విభాగంలో నీలఖి అవార్డును గెలుచుకున్నారు. తెలుగు ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకుంటారని ‘బ్యూటీ’ టీమ్ గట్టి విశ్వాసంతో ఉంది.
ఇప్పటికే విడుదలైన ‘బ్యూటీ’ సినిమా పోస్టర్లు, టీజర్‌లో నీలఖి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె నటనలో భావోద్వేగాలను అద్భుతంగా పండించారని టీమ్ గతంలోనే వెల్లడించింది. ‘బ్యూటీ’ చిత్రంతో నీలఖి తెలుగు సినిమా పరిశ్రమలోకి ఘనంగా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.
వానరా సెల్యులాయిడ్ బ్యానర్‌పై మారుతి టీమ్‌తో కలిసి జీ స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Advertisement
Advertisement