'నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ మీరే'.. సందీప్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! | Sandeep Reddy Vanga Tweet Goes Viral Animal Review By RGV | Sakshi
Sakshi News home page

Sandeep Reddy Vanga: 'మీలా మరే డైరెక్టర్ చేయలేదు'.. సందీప్ రెడ్డి ప్రశంసలు!

Published Tue, Dec 5 2023 6:52 PM | Last Updated on Tue, Dec 5 2023 7:10 PM

Sandeep Reddy Vanga Tweet Goes Viral Animal Review By RGV - Sakshi

టాలీవుడ్ డైరెక్టర్‌, అర్జున్ రెడ్డి ఫేమ్ తెరకెక్కించిన తాజా చిత్రం యానిమల్. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికే ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం చూసిన సంచలన డైరెక్టర్ ఆర్జీవీ సైతం పొగడ్తలతో ముంచెత్తారు. యానిమల్ మూవీతో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడంటూ ఏకంగా తన రివ్యూను వెల్లడించారు. అయితే తాజాగా తన మూవీ యానిమల్‌కు రాం గోపాల్ వర్మ రివ్యూ ఇవ్వడంపై  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

సందీప్ రెడ్డి తన ట్వీట్‌లో రాస్తూ... 'రామ్ గోపాల్ వర్మ చేసినంతలా మరే ఇతర దర్శకుడు భారతీయ సినిమాకి సేవలు అందించలేదని నేను నమ్ముతున్నా. నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ మీరే. మీ నుంచి నా ఫిల్మ్ యానిమల్ రివ్యూ రావడం సంతోషంగా ఉంది. తనదైన శైలిలో వ్రాసిన రెండు విషయాలు మినహాయించి ఆర్జీవీకి హృదయపూర్వక కృతజ్ఞతలు' తెలిపారు. రణ్‌బీర్‌ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. డిసెంబర్‌ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement