RGV Shocking Comments on Bollywood Industry Over KGF 2 Big Openings - Sakshi
Sakshi News home page

RGV: బాలీవుడ్‌కు 'కేజీఎఫ్‌ 2' ఒక హారర్‌ మూవీ: రామ్‌ గోపాల్‌ వర్మ

Apr 16 2022 7:46 AM | Updated on Apr 16 2022 8:47 AM

Ram Gopal Varma On KGF 2 Says Its A Horror Movie To Bollywood - Sakshi

'కేజీఎఫ్ 2'పై సినీ ప్రముఖులు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలనాల డైరెక్టర్‌ రామ్‌గోపాల్ వర్మ 'కేజీఎఫ్‌ 2' మూవీని మెచ్చుకుంటూ వరుస ట్వీట్లు పెట్టారు. 

Ram Gopal Varma On KGF 2 Says Its A Horror Movie To Bollywood: సినీ ఇండస్ట్రీలో మొన్నటివరకు 'ఆర్ఆర్ఆర్' మేనియా నడిచింది. ఇప్పుడు 'కేజీఎఫ్‌ 2' హవా నడుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్‌. భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కు, యశ్‌ యాక్టింగ్‌, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్‌లోనూ ఈ విశేష స్పందన లభిస్తోంది. విడుదలైన తొలిరోజే సుమారు రూ. 135 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇందులో ఒక్క బాలీవుడ్‌లోనే దాదాపుగా రూ. 50 కోట్లను రాబట్టడం విశేషం. దీంతీ ఈ చిత్రంపై సినీ ప్రముఖులు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలనాల డైరెక్టర్‌ రామ్‌గోపాల్ వర్మ 'కేజీఎఫ్‌ 2' మూవీని మెచ్చుకుంటూ వరుస ట్వీట్లు పెట్టారు. 

'ప్రశాంత్ నీల్‌ డైరెక్ట్‌ చేసిన కేజీఎఫ్‌ 2 చిత్రం గ్యాంగ్‌స్టర్‌ సినిమా కాదు. బాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఇది ఒక హారర్‌ మూవీ.కేజీఎఫ్‌ విజయం నుంచి బాలీవుడ్‌ తేరుకోవాలంటే కొన్నేళ్లు పడుతుంది. రాఖీ భాయ్‌ ముంబైకి వచ్చి గ్యాంగ్‌స్టర్స్‌పై మెషిన్‌ గన్‌తో దాడి చేసినట్లు యశ్‌ బాలీవుడ్‌ స్టార్స్‌ ఓపెనింగ్ కలెక్షన్లపై మెషిన్‌ గన్‌తో దండెత్తాడు. ఇక చివరి కలెక్షన్లతో శాండల్‌వుడ్‌ నుంచి బాలీవుడ్‌పైకి అణుబాంబుతో దాడి చేస్తాడు. కేజీఎఫ్‌ విడుదలయ్యే వరకు బీటౌన్‌ మాత్రమే కాదు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు కూడా కన్నడ సినీ ఇండస్ట్రీని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ప్రశాంత్‌ నీల్‌ ఆ ఇండస్ట్రీని ప్రపంచ మ్యాప్‌లో నిలబెట్టాడు.' అంటూ వరుసగా ప్రశంసలు కురిపించాడు రామ్‌ గోపాల్ వర్మ. కేజీఎఫ్‌ 2లో బాలీవుడ్‌ స్టార్స్‌ సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌ నటించిన విషయం తెలిసిందే. 

చదవండి: సాక్షి ఆడియన్స్‌ పోల్‌.. 'కేజీఎఫ్‌-2'పై ప్రేక్షకుల రివ్వ్యూ


చదవండి: కేజీయఫ్‌-2 ఎఫెక్ట్‌.. స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌పై వర్మ షాకింగ్‌ ట్వీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement