Prashanth Neel
-
ఎన్టీఆర్ డ్రాగన్‌లో టొవినో?
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించనున్నారు. అలాగే ఈ సినిమాలోని ఇతర కీలకపాత్రల్లో మలయాళ నటులు టొవినో థామస్, జోజూ జార్జ్ నటించనున్నట్లు తెలిసింది. ఆల్రెడీ రుక్మిణీ వసంత్, టొవినో థామస్‌ల లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఈ సినిమా చిత్రీకరణ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందని తెలిసింది. తొలి షెడ్యూల్‌ను కర్ణాటకలో ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. ‘డ్రాగన్’ మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక... కెరీర్లో యాభైకిపైగా సినిమాల్లో నటించిన టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 2023లో వచ్చిన ‘2018: ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో, 2024లో వచ్చిన ‘ఏఆర్ఎమ్’ చిత్రాల్లో టొవినో థామస్ హీరోగా నటించగా, ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై హిట్ మూవీస్‌గా నిలిచాయి. -
Salaar@1 Year: 6 రోజుల్లో 500 కోట్లు.. టెండ్రింగ్‌లో 300 రోజులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ ‘సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్’ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరడం విశేషం. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా 300 రోజులు కంటిన్యూగా ట్రెండింగ్ లో కొనసాగి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఓవరాల్ పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి."సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా..భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. ప్రస్తుతం "సలార్ 2, శౌర్యంగపర్వ" చిత్రీకరణ జరుపుకుంటోంది. -
'సలార్' రిజల్ట్‌తో నేను హ్యాపీగా లేను: ప్రశాంత్ నీల్
ప్రభాస్ 'సలార్' సినిమా రిలీజై అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. గతేడాది సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 22) థియేటర్లన్నీ సందడిగా మారిపోయింది. ఇప్పుడు అభిమానులు.. 'సలార్' గుర్తుల్ని నెమరవేసుకుంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బోలెడన్ని సంగతులు చెప్పాడు.'సలార్ ఫలితంతో నేను సంతోషంగా లేను. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఎక్కడో కేజీఎఫ్ 2 ఛాయలు కనిపించాయి. అయితే 'సలార్ 2' సినిమాని మాత్రం నా కెరీర్లో బెస్ట్ మూవీగా తీస్తాను. ప్రేక్షకులు ఊహలకు మించిపోయేలా ఆ మూవీ తీస్తాను. జీవితంలో కొన్ని విషయాలపై కాన్ఫిడెంట్‌గా ఉంటాను. 'సలార్ 2' అందులో ఒకటి' అని ప్రశాంత్ నీల్ చెప్పాడు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' చూసేసిన సుకుమార్.. ఫస్ట్ రివ్యూ)ప్రశాంత్ నీల్ చెప్పింది కరెక్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే గతేడాది 'సలార్' మూవీ చూసిన చాలామంది 'కేజీఎఫ్'తో పోలికలు పెట్టారు. కానీ తర్వాత ఓటీటీలో మాత్రం బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. మరీ ముఖ్యంగా కాటేరమ్మ ఫైట్‌ని అయితే డార్లింగ్ ఫ్యాన్స్ రోజుకోకసారైనా చూడందే నిద్రపోరు.'సలార్ 2' విషయానికొస్తే కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో మూవీ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుంది. లెక్క ప్రకారం 2026 సంక్రాంతికి రిలీజ్ అని చెప్పారు గానీ ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువ. అంటే 2026 వేసవి తర్వాత 'సలార్ 2' షూటింగ్ మొదలవ్వొచ్చు. ఎలా లేదన్నా 2027-28లోనే ఇది వచ్చే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)I'm not completely happy with #Salaar’s performance in theatres, says Prashanth Neel pic.twitter.com/WXIBkdgMh5— Aakashavaani (@TheAakashavaani) December 22, 2024 -
ఫిబ్రవరిలో ప్రారంభం
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుందని తెలిసింది. ముందు ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆరంభించే కొత్త షెడ్యూల్లో ఎన్టీఆర్ కూడా జాయిన్ అవుతారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని, డిఫరెంట్ గెటప్స్‌లో ఎన్టీఆర్ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. -
మూడు వారాల్లోనే ఓటీటీకి భారీ బడ్జెట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల ఆయన 'బఘీరా' అనే సినిమాకు స్టోరీ అందించాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. డాక్టర్. సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఫుల్ యాక్షన్ మూవీగా వచ్చి బఘీరా ఓటీటీ ప్రియులను ఏ మాత్రం అలరిస్తుందో వేచి చూడాల్సిందే. Veeraru inna kalpanikaralla. Ooralli ondu hosa veera bandidane, avana hesare…Bagheera 🐆⚡️Watch Bagheera on Netflix, out 21 November in Kannada, Tamil, Telugu and Malayalam!#BagheeraOnNetflix pic.twitter.com/xxYzLzF0qD— Netflix India South (@Netflix_INSouth) November 20, 2024 -
హీరోలకు మించిన ప్లానింగ్ లో స్టార్ దర్శకులు
-
'బఘీర' మూవీ రివ్యూ
టైటిల్: బఘీరనటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, అచ్యుత్, గరుడ రామ్, ప్రకాశ్ రాజ్ తదితరులుదర్శకుడు: డాక్టర్ సూరినిర్మాతలు: హోంబలే ఫిలింస్సంగీత దర్శకుడు: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టివిడుదల: 31 అక్టోబర్, 2024ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం హీరో శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బఘీర. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ చిత్రంతో డాక్టర్ సూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. దీపావళి కానుకగా కన్నడతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథవేదాంత్ (శ్రీ మురళి)కి చిన్నప్పటి నుంచే ప్రజలను కాపాడే ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. సూపర్ హీరోలకు పవర్ ఉంది కాబట్టి వాళ్లు జనాన్ని కాపాడుతున్నారు కానీ ఏ పవర్ లేకపోయినా పోలీసులు కూడా జనాన్ని కాపాడుతున్నారని తల్లి చెప్పడంతో వేదాంత్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. కొన్నాళ్లపాటు సిన్సియర్ పోలీసాఫీసర్‌గా పని చేస్తాడు. కానీ పై నుంచి ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. తనకు పరిమితులు విధిస్తారు. అంతేకాదు, తన పోలీసు ఉద్యోగం కోసం తండ్రి రూ.50 లక్షలు లంచం ఇచ్చాడని తెలిసి కుంగిపోతాడు. తన స్టేషన్ ముందు జరిగిన ఓ ఘటన వల్ల అతడు బఘీరగా అవతారమెత్తుతాడు. రాత్రిపూట బఘీరగా మారి క్రిమినల్స్‌ను వేటాడుతుంటాడు. అలా బఘీరకి జనాల్లో మంచి క్రేజ్ వస్తుంది. ఓ క్రిమినల్ రానా( గరుడ రామ్) అన్ని వ్యాపారాలకు బఘీర అడ్డొస్తాడు. ఈ ప్రయాణంలో బఘీరకు ఎదురైన సవాళ్లేంటి? వేదాంతే బఘీర అని సీబీఐ పసిగడుతుందా? వేదాంత్ ప్రేమకథ సుఖాంతమైందా? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే!విశ్లేషణప్రశాంత్ నీల్ నుంచి వచ్చే సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది. బఘీర కూడా ఆ కోవకు చెందినదే.. కాకపోతే కేజీఎఫ్‌లో అమ్మ సెంటిమెంట్, సలార్‌లో స్నేహం.. బాగా పండాయి. అలాంటి ఓ బలమైన ఎమోషన్ ఈ సినిమాలో పండలేదు. ప్రజల్ని నేరస్థుల బారి నుంచి రక్షించేందుకు హీరోలు ముసుగ వేసుకుని సూపర్ హీరోలా మారడం ఇదివరకే చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఈ మూవీలో హీరో పోలీస్ కావడం.. పోలీస్‌గా ఏదీ చేయలేకపోతున్నానన్న బాధతో సూపర్ హీరోగా మారడం కొత్త పాయింట్.ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా మొదలవుతాయి. అయితే హీరో లవ్ ట్రాక్ కథకు స్పీడ్ బ్రేకులు వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. హీరో బఘీరగా మారాక కథనం మరింత రంజుగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. సిబిఐ ఆఫీసర్‌గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఈ బఘీర ఎవరు? అని తెలుసుకునేందుకు ప్రకాష్ రాజ్ పడే తిప్పలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ వరకు హీరోకు, విలన్‌కు మధ్య బలమైన ఫైట్ ఉండదు. క్లైమాక్స్ కొత్తగా ఏమీ ఉండదు.ఎవరెలా చేశారంటే?వేదాంత్ అనే ఐపీఎస్ అధికారిగా, సూపర్ హీరో బఘీరగా శ్రీ మురళి రెండు షేడ్స్ లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. రుక్మిణి వసంత్ పాత్రకు కథలో ప్రాధాన్యతే లేదు. ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, రంగనాయనా వంటివాళ్లు స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ భలే అనిపిస్తుంది.టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కథ రొటీన్ కావడంతో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కొత్తదనం ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఏ సీన్ చూసినా ఎక్కడో చూశానే అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలిచింది.(కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రేటింగ్: 2.75 /5 -
దేవర హిట్ తో సలార్ ని పక్కన పెట్టిన నీల్..
-
ప్రశాంత్ నీల్ కథతో సినిమా.. 'బఘీర' ట్రైలర్ చూశారా?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం రెడీ అవుతున్నాడు. డైరెక్టర్‌గా పుల్ ఫామ్‌లో ఉన్న నీల్.. 'బఘీరా' సినిమాకు స్టోరీ అందించాడు. తాజాగా ఆ చిత్ర తెలుగు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బఘీరా' సినిమాను.. 'కేజీఎఫ్', 'సలార్' నిర్మించిన హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. డాక్టర్. సూరి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ ఫీస్ట్‌లా అనిపించింది. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకుని విలన్లని చంపడం లాంటివి 'కేజీఎఫ్' చిత్రాన్ని గుర్తుచేస్తున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ట్రెలర్ బట్టి చూస్తే.. చిన్నప్పుడు తల్లిని పోగొట్టుకున్న ఓ పిల్లాడు.. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని, ముసుగు వేసుకుని 'బఘీరా' గెటప్‌లో విలన్లని చంపుతుంటాడు. చివరకు బఘీరాని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.కన్నడతో పాటు తెలుగులోనూ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే 'లక్కీ భాస్కర్', 'క' లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్, 'అమరన్' అనే డబ్బింగ్ దీపావళికి రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి మరీ తెలుగులో 'బఘీరా' ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో) -
ప్రశాంత్ నీల్ తో చేతులు కలిపిన రామ్ చరణ్
-
ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్డేట్..
-
ఎన్టీఆర్ కోసం 'సప్త సాగరాలు దాటి'వచ్చేస్తోన్న హీరోయిన్! (ఫొటోలు)
-
ఎన్టీఆర్-నీల్ మూవీ కోసం 'సాగరాలు' బ్యూటీ?
'దేవర' హిట్‌తో ఎన్టీఆర్ మంచి జోష్‌లో ఉన్నాడు. త్వరలోనే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్గా కన్నడ బ్యూటీని పరిశీలిస్తున్నారని, స్టోరీ కూడా ఇదేనని తెగ మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇద్దరూ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల ఇన్నాళ్లు పట్టింది. నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డిసెంబరు నుంచి తారక్ సెట్స్‌లోకి వస్తాడని తెలుస్తోంది. ఇకపోతే 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్.. హీరోయిన్గా అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది రుక్మిణి. ప్రస్తుతానికి తమిళంలో ఒకటి, కన్నడలో రెండు చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు తారక్ సరసన అనేసరికి ఈమె ఫ్యాన్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ సినిమా స్టోరీ బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఎన్టీఆర్.. కారణం ఇదే!
‘దేవర’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్రీ అవుతారు. సో... ఇక తదుపరి చిత్రం షూటింగ్‌తో బిజీ అవుతారనుకోవచ్చు. అయితే ఓ మూడు నెలల తర్వాతే నెక్ట్స్ మూవీ షూట్లో పాల్గొంటారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 21న ఆరంభమవుతుంది. (చదవండి: శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు)అయితే అప్పుడు ఎన్టీఆర్ పాల్గొనరట. ఈ హీరో లేని సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెడతారు. 21 నుంచి దాదాపు 40 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనరు. జనవరిలోనే ఈ చిత్రం సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఎన్టీఆర్. ఈ మూడు నెలల సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తారట. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఇదేనా?సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఫుల్ ఫోకస్ ఎన్టీఆర్ సినిమాపైనే పెట్టేశాడు. కేజీయఫ్, సలార్ మాదిరే ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండగే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ రెండు భాగాలుగా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. అలాగే సలార్ పార్ట్ 2 కూడా రాబోతుంది. ఈ రెండు చిత్రాల మాదిరే ఎన్టీఆర్ మూవీ కూడా కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మైత్రీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. -
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన ‘దేవర'.!
-
పురాతన ఆలయంలో ఎన్టీఆర్ దంపతుల పూజలు.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ జూనియర ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలో బిజీగా ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల అమ్మతో కలిసి ప్రముఖ శ్రీకృష్ణుని ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పర్యటనలో తన తల్లి షాలిని, భార్య లక్ష్మిప్రణతీ కూడా వెంట ఉన్నారు. ఈ ఆలయం దర్శనంతో తన తల్లి కల నెరవేరిందని జూనియర్ వెల్లడించారు.తాజాగా తన కుటుంబంతో కలిసి మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాంతార రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ దంపతులతో కలిసి ఎన్టీఆర్, ప్రణతీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అడవుల్లోని ఉన్న గుహల్లో ఉన్న మూడగల్లులోని కేశవనాథేశ్వర ఆలయాన్ని సందర్శించటారు. అక్కడే ఉన్న ఆలయ గుహల్లో ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను రిషబ్ శెట్టి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.తండ్రి జయంతిని స్మరించుకుంటూ..ఇవాళ నందమూరి హరికృష్ణ 68వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రిని స్మరించుకున్నారు. ఆయన ఫోటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. మీ 68వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ... pic.twitter.com/yIi5pgFMQI— Jr NTR (@tarak9999) September 2, 2024 ಮೂಡುಗಲ್ಲು ಕೇಶವನಾಥೇಶ್ವರನ ದರ್ಶನ ಪಡೆದಾಗ.. ✨🙏🏼A blessed journey to Keshavanatheshwara Temple Moodagallu ✨🙏🏼@tarak9999 #PrashanthNeel pic.twitter.com/SWfP2TAWrk— Rishab Shetty (@shetty_rishab) September 2, 2024 -
మా అమ్మ కల నెరవేరింది : ఎన్టీఆర్
‘‘మా అమ్మ (శాలినీ) స్వగ్రామం కుందాపురానికి నన్ను తీసుకొచ్చి ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనం చేసుకోవాలనేది ఆమె చిరకాల కల.. అది ఎట్టకేలకు నెరవేరింది’’ అన్నారు హీరో ఎన్టీఆర్. కర్ణాటకలోని ప్రసిద్ధి చెందిన ఉడుపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని ఎన్టీఆర్ శ్రావణ శనివారం సందర్భంగా దర్శించుకున్నారు. ఆయన వెంట తల్లి శాలినీ, భార్య లక్ష్మీ ప్రణతి, కన్నడ హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు భక్త కనకదాసు దర్శించుకున్న కనక కిటికీ ద్వారా అందరూ నల్లనయ్య (శ్రీ కృష్ణుడు) విగ్రహాన్ని దర్శించారు.దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... ‘‘ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించడంతో అమ్మ (శాలినీ) కల ఎట్టకేలకు నెరవేరింది. అమ్మ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఆమె బర్త్‌డేకి రెండు రోజుల ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆమెకు నేనిచ్చిన అత్యుత్తమ బహుమతి.విజయ్ కిరగందూర్ సార్‌కి (హోంబలే ఫిలింస్ అధినేత) థ్యాంక్స్. నా ప్రియ మిత్రుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే నా ప్రియ మిత్రుడు రిషబ్ శెట్టి కూడా నాతో వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అంటూ తన ఆనందం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర’ మొదటి భాగం ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. -
అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్
జూ.ఎన్టీఆర్ మళ్లీ చాలారోజుల తర్వాత కుటుంబం గురించి పోస్ట్ పెట్టాడు. ఎప్పటిలా భార్య గురించి కాకుండా తల్లి గురించి, ఆమెకు ఎప్పటినుంచో ఉన్న కోరిక గురించి చెప్పాడు. ఇదే పోస్టులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, 'కాంతార' హీరో రిషభ్ శెట్టి గురించి ప్రస్తావించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎన్టీఆర్ తల్లి పేరు శాలిని. ఆమెది కర్ణాటకలోని కుందపుర అనే ఊరు. గతంలో పలు సందర్భాల్లో తారక్ ఈ విషయాన్ని చెప్పాడు. అయితే కొడుకుని తన సొంతూరికి తీసుకెళ్లాలని ఎప్పటినుంచో ఈమె అనుకుంటోందట. తాజాగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ బయటపెట్టాడు. ఇన్ స్టాలో క్యూట్ పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి)'తన సొంతూరు కుందపురకి నన్ను తీసుకొచ్చి, ఉడుపిలోని శ్రీకృష్ణ మఠం దర్శనం చేయించాలనేది మా అమ్మకు చిరకాల కోరిక. అది ఇన్నాళ్లకు నెరవేరింది. ఆమె కల నిజమైంది. సెప్టెంబరు 2న అమ్మ పుట్టినరోజు. ఆమె కోరికని నిజం చేయడం ఆమెకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. దీన్ని సాధ్యమయ్యేలా చేసిన మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్‌కి థ్యాంక్యూ. అలానే రిషభ్ శెట్టికి స్పెషల్ థ్యాంక్స్. అతడి మాతో పాటు వచ్చి దీన్ని మరింత ప్రత్యేకం చేశాడు' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్ కూడా శ్రీ కృష్ణుడి మఠం దర్శనం చేసుకున్న 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టిది కూడా కుందపుర ఊరే. గతంలో ఇదే విషయాన్ని చెప్పాడు. అలానే తాను ఎన్టీఆర్‌కి పెద్ద ఫ్యాన్ అని కూడా అన్నాడు. ఇకపోతే తారక్ ప్రస్తుతం 'దేవర' చేస్తున్నాడు. ఇది సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేస్తాడు. ఈ డిసెంబరు నుంచి షూటింగ్ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
#NTRNeel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
అట్టహాసంగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
అనుకున్నదే జరిగింది. మూడు రోజుల క్రితం రూమర్ ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడే అదే నిజమైంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ షురూ అయింది. ఈ వేడుకలో తారక్, ప్రశాంత్ నీల్ కుటుంబాలతో పాటు నిర్మాతలు కూడా పాల్గొన్నారు.(ఇదీ చదవండి: థియేటర్లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్!)చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ ఎన్టీఆర్ 'దేవర'తో బిజీ అయిపోయాడు. ప్రశాంత్ నీల్ 'సలార్' చేస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఇద్దరు ఫ్రీ అయిపోవడంతో మూవీ పట్టాలెక్కించారు. ప్రారంభోత్సవం నాడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. 2026 జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.వీళ్ల చెప్పిన దాని బట్టి చూస్తే దాదాపు 16 నెలల సమయముంది. ఇదే టైంలో ప్రశాంత్ నీల్ 'సలార్ 2' కూడా చేస్తాడని అన్నారు. కానీ ఇప్పుడు తారక్ సినిమా మొదలైంది. కాబట్టి ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి పనిచేయడమంటే అదీ 2026లో అవుతుంది. సో అదన్నమాట విషయం.(ఇదీ చదవండి: సినిమా హీరోలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు) Massive Launch Ntr and Neel next project,#TheDragon #NTRNeel pic.twitter.com/kXApJ7GcJS— చందు (@NBK_9999) August 9, 2024This time, the earth will tremble under his reign! 🔥#NTRNeel will step onto the soil on January 9th, 2026 ❤️🔥MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial pic.twitter.com/sWDVCs60bO— NTR Arts (@NTRArtsOfficial) August 9, 2024 -
అజిత్, ప్రశాంత్ నీల్ సినిమాపై మేనేజర్ క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక సినిమా ప్లాన్ చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. 'కె.జి.ఎఫ్' కథకు కనెక్ట్ అయ్యేలా మరో స్టోరీని ప్రశాంత్ రెడీ చేశాడాని, అందులో అజిత్ హీరోగా నటించనున్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయం గురించి తాజాగా అజిత్ మేనేజర్ మాట్లాడుతూ.. అదంతా ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు.అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఈ వాదనలను ఇలా ఖండించారు.. 'ఈ పుకార్లు ఆన్లైన్లో వచ్చాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. అజిత్, ప్రశాంత్ నీల్ కలిశారనేది మాత్రం నిజమే.. కానీ, వారు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా మాత్రమే కలుసుకున్నారు. ఒకరినొకరు అత్యున్నత గౌరవం కలిగి ఉంటారు. అయితే, వారు కలిసినప్పుడు ఏ సినిమా గురించి చర్చించలేదు. ప్రశాంత్ డైరెక్షన్లో అజిత్ సినిమా వస్తే చూడటానికి నేనూ ఇష్టపడతాను. కానీ, భవిష్యత్తులో అయినా వీరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు.' అని సురేష్ చంద్ర తెలిపారు.మగిళ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ విడాముయర్చి సినిమాలో నటించారు. కొద్దిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి అయింది. దీపావళికి ఈ సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో అజిత్ తర్వాతి సినిమా ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్రశాంత్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. -
పెద్ద ప్లానే వేస్తున్న నీల్...
-
శౌర్యంగపర్వం ఎప్పుడు మొదలౌతుంది అంటే..
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎక్కడ చూసిన కల్కి ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే రూ. 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన కల్కి లాంగ్ రన్లో రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగింది. దీంతో ఆయన నుంచి రాబోయే సినిమాలకు మంచి మార్కెట్ ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.గతేడాదిలో విడుదలైన సలార్ సినిమాకు సంబంధించి ఇప్పుడు సీక్వెల్ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘శౌర్యంగపర్వం’ రానుంది. దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సుమారు 20 శాతం షూటింగ్ పూర్తిచేశారని తెలుస్తోంది. ఆగష్టు 10 నుంచి సలార్ సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభం కాట్లు సమాచరం. ఇదే సమయంలో డైరెక్టర్ మారుతి- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'రాజాసాబ్'. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరడంతో ఇప్పుడు శౌర్యంగపర్వం వైపు ప్రభాస్ అడుగులు వేస్తున్నారట. ప్రశాంత్ నీల్ - జూ ఎన్టీఆర్ కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాంటి క్లాష్ రాకుండా శౌర్యంగపర్వం చిత్రాన్ని తెరకెక్కిస్తానని మైత్రి మూవీస్ సంస్థకు ప్రశాంత్ మాట ఇచ్చారట. -
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. మూడు సినిమాలు ఒకేసారి!
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ బరిలో మాత్రం ఇతర పెద్ద సినిమాలు లేకుండా ప్లాన్ చేసుకొని సినిమాను విడుదల చేస్తున్నారు. కల్కి 2898 మూవీ కూడా ఇక్కడ సోలోగానే విడుదలై హిట్ కొట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలు కూడా దాదాపు సోలోగానే రిలీజ్ కాబోతున్నాయి. కానీ వీటి తర్వాత ఈ స్టార్ హీరోలు నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య 2026లో బక్సాఫీస్ వార్ జరిగే అవకాశం మెండుగా ఉంది.(చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్ హీరో!)కల్కి 2898 తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’గా రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది. 2025 చివరల్లో లేదా 2026 సంకాంత్రికి విడుదలయ్యే అవకాశం ఉంది. (చదవండి: నా బిడ్డను పైకి పంపించేయాలనుకున్నా.. ఏడుస్తూ భర్తకు చెప్పా: పాక్ నటి)మరోవైపు గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్..బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కలేదు. సెప్టెంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం రెహమాన్ కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరిలో ఈ చిత్రం రీలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేవర తర్వాత ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభంలో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దాదాపు ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఒకేసారి ప్రారంభం అవుతున్నాయి. పెద్ద సినిమాలు కాబట్టి ఏడాది వరకు నిర్మాణంలో ఉండడం సర్వసాధారణం. ఈ లెక్కన చూస్తే..మూడు సినిమాలు వారం అటు ఇటుగా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురు బాక్సాఫీస్ వార్‌లో ఉంటారా లేదా సోలోగానే వచ్చి హిట్ కొడతారా అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే. -
చలో మెక్సికో
మెక్సికోలో యాక్షన్ చేయనున్నారట ఎన్టీఆర్. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది.ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ మెక్సిక్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరుగుతుందని, దాదాపు పదిహేను దేశాల్లో చిత్రీకరణ జరిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.