
ప్రభాస్ 'సలార్' సినిమా రిలీజై అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. గతేడాది సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 22) థియేటర్లన్నీ సందడిగా మారిపోయింది. ఇప్పుడు అభిమానులు.. 'సలార్' గుర్తుల్ని నెమరవేసుకుంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బోలెడన్ని సంగతులు చెప్పాడు.
'సలార్ ఫలితంతో నేను సంతోషంగా లేను. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఎక్కడో కేజీఎఫ్ 2 ఛాయలు కనిపించాయి. అయితే 'సలార్ 2' సినిమాని మాత్రం నా కెరీర్‌లో బెస్ట్ మూవీగా తీస్తాను. ప్రేక్షకులు ఊహలకు మించిపోయేలా ఆ మూవీ తీస్తాను. జీవితంలో కొన్ని విషయాలపై కాన్ఫిడెంట్‌గా ఉంటాను. 'సలార్ 2' అందులో ఒకటి' అని ప్రశాంత్ నీల్ చెప్పాడు.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' చూసేసిన సుకుమార్.. ఫస్ట్ రివ్యూ)
ప్రశాంత్ నీల్ చెప్పింది కరెక్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే గతేడాది 'సలార్' మూవీ చూసిన చాలామంది 'కేజీఎఫ్'తో పోలికలు పెట్టారు. కానీ తర్వాత ఓటీటీలో మాత్రం బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. మరీ ముఖ్యంగా కాటేరమ్మ ఫైట్‌ని అయితే డార్లింగ్ ఫ్యాన్స్ రోజుకోకసారైనా చూడందే నిద్రపోరు.
'సలార్ 2' విషయానికొస్తే కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో మూవీ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుంది. లెక్క ప్రకారం 2026 సంక్రాంతికి రిలీజ్ అని చెప్పారు గానీ ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువ. అంటే 2026 వేసవి తర్వాత 'సలార్ 2' షూటింగ్ మొదలవ్వొచ్చు. ఎలా లేదన్నా 2027-28లోనే ఇది వచ్చే అవకాశాలున్నాయి.
(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)
I'm not completely happy with #Salaar’s performance in theatres, says Prashanth Neel pic.twitter.com/WXIBkdgMh5
— Aakashavaani (@TheAakashavaani) December 22, 2024