salaar movie
-
మలయాళ చిత్రాలకు కలెక్షన్స్.. అదే ప్రధాన కారణం: సలార్ నటుడు
సలార్ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రంతో తెలుగులోనూ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఎల్2 ఎంపురాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. మరో సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019లో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే తాజాగా మలయాళ చిత్రాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ఎదురవుతున్న ఒత్తిడిపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మలయాళ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందని అన్నారు. అందువల్లే మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు దోహద పడుతోందని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. మలయాళ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద పోటీ గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు.పృథ్వీరాజ్ మాట్లాడుతూ..'మాకు కూడా బాక్సాఫీస్ చాలా ముఖ్యం. సినిమాలు ఆర్థికంగా లాభాలు ఉండేలా చూసుకోవడానికి మాపై కూడా చాలా ఒత్తిడి ఉంది. కానీ మలయాళ సినిమా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే బాగాలేని సినిమాలకు కలెక్షన్స్ రావని వారంతా క్లారిటీగా చెప్పారు. ఇటీవల కాలంలో నటుడు ఎవరో, దర్శకత్వం ఎవరనే అనే దానితో సంబంధం లేకుండానే కొన్ని మంచి సినిమాలు వసూళ్లు రాబట్టాయి. ప్రేక్షకుల ఆదరణ దక్కాలంటే మనం కథ పట్ల నిజాయితీగా ఉండటం చాలా అవసరం. చిత్ర నిర్మాతలు, నటులు మనం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే కథను ఎంచుకుంటే.. ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని మాకు తెలుసు' అని అన్నారు. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తోన్న ఎల్2: ఎంపురాన్ మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
'పుష్ప కంటే కాటేరమ్మే నయం'.. ఆ విషయంలో నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతంలో ఎప్పుడులేని విధంగా పలు రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్పరాజ్ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా కలెక్షన్స్‌లో మొదటిస్థానంలో ఉంది.అయితే పుష్ప-2 తాజాగా ఓటీటీకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుడా ఇటీవల అదనంగా యాడ్ చేసిన సన్నివేశాలను ఓటీటీలో చూసే అవకాశాన్ని ఫ్యాన్స్‌కు కల్పించారు. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఓటీటీలో పుష్ప-2 చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ రప్పా రప్పా గురించి నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. గాల్లో తేలుతూ అల్లు అర్జున్ ఫైట్ చేసిన సన్నివేశాలైతే ఆడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.అయితే క్లైమాక్స్ సీన్‌పై ఒక పక్క ప్రశంసలు కురుస్తుంటే.. మరోవైపు విమర్శలు కూడా చేస్తున్నారు. ఆ ఫైట్స్ సీక్వెన్స్‌ను ప్రభాస్ సలార్ మూవీ కాటేరమ్మ ఫైట్ సీన్‌తో పోలుస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఈ ఫైట్ సీన్‌ను కామెడీగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది మాస్ హీరో సన్నివేశమా లేదా కామెడీ సన్నివేశమా? అని కామెంట్స్ చేస్తున్నారు. గాల్లోకి ఎగిరి ఫైట్ చేయడం చూస్తుంటే నవ్వడం ఆపుకోలేకపోయానంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరైతే నేను బట్టలు ఉతుక్కోవడం ఇలాగే ఉంటుందని పోస్ట్ చేశారు.కాటేరమ్మ > రప్పా రప్పాపుష్ప-2 క్లైమాక్స్ ఫైట్ (రప్పా రప్పా) కంటే ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలోని కాటేరమ్మ ఫైట్ చాలా బాగుందని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 'రప్పా రప్పా' ఫైట్ సీన్ 'ఓవర్ ది టాప్' ప్రశంసించాడు. అయినప్పటికీ పుష్ప 2 క్లైమాక్స్ చాలా ఓవర్‌గా ఉంది. సలార్ కాటేరమ్మ సీన్ అదిరిపోయిందని తెలిపాడు. ఇది పుష్ప ఫైట్ కంటే కాటేరమ్మ సీక్వెన్స్‌కు ఎక్కువ రిపీట్స్ ఉన్నాయని రాసుకొచ్చాడు. అయితే ఇందులో అల్లు అర్జున్ గొప్పగా చేసినప్పటికీ రప్పా రప్పా కంటే కాటేరమ్మ సీన్ ఎక్కువని అభిప్రాయం వ్యక్తం చేశారు.In my opinion,Pushpa 2 climax was more over the top.Salaar kaateramma scene was worth it.It has a greater number of repeats than rappa sequence of pushpa.It's what I really felt.Nonetheless, AA did a great job.But for me,Kaateramma > Rappa#Salaar #Pushpa2 https://t.co/9DnePiuTtA— Sandeep (@02Sandeepdyh) January 31, 2025 How to Watch Pushpa 2 Without Regretting It:1. Intro Scene: Skip it entirely and jump straight to his wake-up scene.2. Songs: Whenever a song pops up, just fast-forward to the next scene.3. Climax Fight (Rappa Rappa): Do yourself a favour. Skip it completely (highly…— 𝓚𝓻𝓲𝓼𝓱𝓪𝓿 (@haage_summane) January 31, 2025 -
Salaar@1 Year: 6 రోజుల్లో 500 కోట్లు.. టెండ్రింగ్‌లో 300 రోజులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ ‘సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్’ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరడం విశేషం. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా 300 రోజులు కంటిన్యూగా ట్రెండింగ్ లో కొనసాగి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఓవరాల్ పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి."సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా..భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. ప్రస్తుతం "సలార్ 2, శౌర్యంగపర్వ" చిత్రీకరణ జరుపుకుంటోంది. -
'సలార్' రిజల్ట్‌తో నేను హ్యాపీగా లేను: ప్రశాంత్ నీల్
ప్రభాస్ 'సలార్' సినిమా రిలీజై అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. గతేడాది సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 22) థియేటర్లన్నీ సందడిగా మారిపోయింది. ఇప్పుడు అభిమానులు.. 'సలార్' గుర్తుల్ని నెమరవేసుకుంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బోలెడన్ని సంగతులు చెప్పాడు.'సలార్ ఫలితంతో నేను సంతోషంగా లేను. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఎక్కడో కేజీఎఫ్ 2 ఛాయలు కనిపించాయి. అయితే 'సలార్ 2' సినిమాని మాత్రం నా కెరీర్లో బెస్ట్ మూవీగా తీస్తాను. ప్రేక్షకులు ఊహలకు మించిపోయేలా ఆ మూవీ తీస్తాను. జీవితంలో కొన్ని విషయాలపై కాన్ఫిడెంట్‌గా ఉంటాను. 'సలార్ 2' అందులో ఒకటి' అని ప్రశాంత్ నీల్ చెప్పాడు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' చూసేసిన సుకుమార్.. ఫస్ట్ రివ్యూ)ప్రశాంత్ నీల్ చెప్పింది కరెక్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే గతేడాది 'సలార్' మూవీ చూసిన చాలామంది 'కేజీఎఫ్'తో పోలికలు పెట్టారు. కానీ తర్వాత ఓటీటీలో మాత్రం బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. మరీ ముఖ్యంగా కాటేరమ్మ ఫైట్‌ని అయితే డార్లింగ్ ఫ్యాన్స్ రోజుకోకసారైనా చూడందే నిద్రపోరు.'సలార్ 2' విషయానికొస్తే కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో మూవీ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుంది. లెక్క ప్రకారం 2026 సంక్రాంతికి రిలీజ్ అని చెప్పారు గానీ ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువ. అంటే 2026 వేసవి తర్వాత 'సలార్ 2' షూటింగ్ మొదలవ్వొచ్చు. ఎలా లేదన్నా 2027-28లోనే ఇది వచ్చే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)I'm not completely happy with #Salaar’s performance in theatres, says Prashanth Neel pic.twitter.com/WXIBkdgMh5— Aakashavaani (@TheAakashavaani) December 22, 2024 -
ప్రభాస్ సలార్ 2 లో కొరియన్ సూపర్ స్టార్..
-
ప్రభాస్ ఫ్యాన్స్ పోరు పడలేక ఆ ఫొటో పెట్టాడా?
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. 'రాజాసాబ్', 'ఫౌజీ'(వర్కింగ్ టైటిల్) మూవీస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి 'స్పిరిట్' షురూ అవుతుంది. మరో మూడు నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే ప్రభాస్ 'స్పిరిట్'లో కొరియన్ స్టార్ డాన్ లీ ఉంటాడనే ప్రచారం కొన్నిరోజుల క్రితం జరిగింది. ఇప్పుడు ఇందులో మరో ట్విస్ట్!(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు)కొరియన్ సినిమాల్లో మాఫియా డాన్, గ్యాంగ్‌స్టర్ పాత్రలు ఎక్కువగా చేసే మా డాంగ్ స్యూక్ అలియాస్ డాన్ లీ.. ఇప్పుడు ప్రభాస్ 'సలార్ 2' పోస్టర్ ఒకటి తన్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. థంబ్సప్ సింబల్ కూడా దానిపై పెట్టాడు. దీంతో తెలుగు నెటిజన్లు.. రచ్చ రచ్చ చేస్తున్నారు. సలార్ 2 లో విలన్ ఇతడే అన్నట్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. 'స్పిరిట్' మూవీలో విలన్ గా చేస్తాడని అన్నారు కదా మరి 'సలార్ 2' పోస్టర్ ఎందుకు పెట్టాడా అని మరి కొందరు అనుకుంటున్నారు.'స్పిరిట్'లో ఇతడు యాక్ట్ చేస్తాడనే రూమర్ వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్.. డాన్ లీ ఇన్ స్టాలో ప్రతి పోస్ట్ దిగువన ప్రభాస్-స్పిరిట్-సలార్ 2 అని వందలకొద్ది కామెంట్స్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. దీంతో వీళ్ల పోరు పడలేకపోయాడో ఏమో గానీ 'సలార్ 2' పోస్టర్ షేర్ చేశాడా అనిపిస్తుంది. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది డాన్ లీ ఫుల్ క్లారిటీ ఇస్తే తప్ప తెలియదు.(ఇదీ చదవండి: ఆర్జీవీ మేనకోడలు పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ) -
ప్రభాస్ సలార్ మూవీ.. ఏకంగా 250 రోజులుగా!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'సలార్ సీజ్ ఫైర్'. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు.అయితే ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ హక్కులు మాత్రం మరో ఓటీటీ దక్కించుకుంది. సలార్ హిందీ వర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో క్రేజీ రికార్డ్ సృష్టించింది. ఏకంగా 250 రోజులుగా హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన సినిమాగా అవతరించింది. ఈ విషయాన్ని ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓటీటీ సంస్థ రివీల్ చేసింది. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్ చిత్రాలను కాదని.. ప్రభాస్ చిత్రం రికార్డ్ క్రియేట్ చేయడం చూస్తుంటే నార్త్‌లో కూడా రెబల్ స్టార్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. -
లీక్ చేసిన సలార్ మ్యూజిక్ డైరెక్టర్
-
సలార్ రికార్డ్ పై గురిపెట్టిన స్త్రీ-2!
-
హేమ కమిటీ రిపోర్ట్.. ఆశ్చర్యం కలగలేదన్న సలార్ నటుడు!
హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటీమణులు బహిరంగంగా తమకెదురైన వేధింపులను బయటపెడుతున్నారు. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం(అమ్మా)పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ నివేదికపై స్పందించారు. ఈ విషయంలో అమ్మా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇండస్ట్రీని ప్రక్షాళన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "హేమ కమిటీతో మాట్లాడిన మొదటి వ్యక్తిని నేను. సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వారికి సురక్షితమైన పనివాతావరణం సృష్టించే మార్గాలను కనిపెట్టడమే ఈ నివేదిక లక్ష్యం. హేమ కమిటీ నివేదిక తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఆ ఆరోపణలు నిజమని రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఉన్నా. నివేదికలో పేర్కొన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలి. అదే విధంగా ఆరోపణలు తప్పు అని రుజువైతే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని కూడా శిక్షించాల్సిందేనంటూ' సలార్ నటుడు కోరారు. ఈ విషయంలో నిందితుల పేర్లను విడుదల చేయాలనే నిర్ణయం కమిటీ సభ్యులదేనని స్పష్టం చేశారు.కాగా.. ఈ ఏడాది ఆడుజీవితం (ది గోట్ లైఫ్) మూవీతో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్నారు. దుబాయ్ నేపథ్యంలో ఓ యధార్థం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతకుముందు సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తనదైన నటనతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్ పోస్ట్ వైరల్!
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళలు, చిన్నారులపై జరిగే దారుణాలపై నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటోంది. ప్రపంచలో ఎక్కడ అఘాయిత్యం జరిగినా సోషల్ మీడియాలో వేదికగా పోరాటం చేస్తూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద గట్టిగానే మహిళల తరఫున పోరాడింది.తాజాగా నటుడు జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రస్తావించింది. అతని ప్రవర్తనపై ఇతర మహిళలు కూడా తనతో మాట్లాడారని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్షాట్లను చిన్మయి ట్విటర్లో షేర్ చేసింది. పని ప్రదేశాల్లో, పబ్‌లు, రెస్టారెంట్లలో జాన్ విజయ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తనకు వచ్చిన స్క్రీన్‌షాట్స్‌ను పంచుకుంది. కాగా.. 2018లోనూ అతనిపై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. జాన్ విజయ్ చివరిసారిగా మలయాళ నటుడు దిలీప్ నటించిన తంకమణి చిత్రంలో విలన్‌గా కనిపించాడు. 2017లో దేశాన్ని కుదిపేసిన లైంగిక వేధింపుల కేసులో నిందితుల్లో దిలీప్ కూడా ఒకరు. అంతే కాకుండా 'ఓరం పో', 'సర్పట్ట పరంబరై, 'సలార్: పార్ట్ 1- సీజ్ఫైర్' లాంటి చిత్రాల్లో జాన్ విజయ్ నటించారు. ప్రభాస్ నటించిన సలార్ మూవీలో రంగ పాత్రలో జాన్ విజయ్ కనిపించారు.More on John Vijay from others who read the post.One of them interviewed him on camera. pic.twitter.com/md6TkyYNJn— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024After The Newsminute report about the Sexual Assault case of Malayalam cinema also mentioned John Vijay for his misdemeanour with the journalistThere are other women speaking about his behaviour in general. pic.twitter.com/AfeLgdC0lY— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024 -
ట్రైబల్ కథల్
ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడతాయి... సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం ఓ వ్యక్తి పోరాటం చేస్తాడు... తమ హక్కుల కోసం పోరాటం చేస్తాడు ఓ గిరిజన తెగ నాయకుడు... ఓ తెగకు చెందిన వ్యక్తి శివభక్తుడిగా మారతాడు... సినిమా పాయింట్ ఏదైనా ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ ‘ట్రైబల్’ నేటివిటీ. ఇలా ట్రైబల్ కథల్తో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ ‘కాన్సార్ ఎరుపెక్కాలా...’ అంటూ ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్‌కి అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల కేకలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాన్సార్ సింహాసనం కోసం శౌర్యాంగ, ఘనియార్ తెగలు పోటీపడటం, వారికి దక్కకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం మన్నార్ తెగకు చెందిన రాజ మన్నార్ చేసే ప్రయత్నం... ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం మొదటి భాగంలో చూశాం. చివరికి ఏ తెగవారు కాన్సార్ సింహాసనం చేజిక్కించుకున్నారనేది తెలియాలంటే మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ విడుదల వరకూ ఆగాల్సిందే. ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ ఆరంభం కాలేదు. ⇒ ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర’ కోసం ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటో చెప్పింది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ్రపాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. ఈ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ⇒ ‘చావుని ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం’ అంటూ ‘తంగలాన్’ మూవీ ట్రైలర్లో హీరో విక్రమ్ చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలతో ఈ చిత్రం రూపొందింది. బంగారు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ నటించారట. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ⇒ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్‌ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ⇒ మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ఓ తెగకు చెందిన తిన్నడు (ఆ తర్వాత శివ భక్తుడు కన్నప్పగా మారారు) పాత్ర చేస్తున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో తిన్నడు వాడిన విల్లు విశిష్టత గురించి ఇటీవల మేకర్స్ తెలిపారు. తన బిడ్డ తిన్నడు ధైర్యసాహసాలకు ముగ్దుడైన నాద నాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సాగే సీన్స్ ఆసక్తిగా ఉంటాయట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందట. -
ఆ సినిమా కోసం క్యూరియాసిటీతో ఉన్నా: కల్కి డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టింది. రిలీజైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం చాలా సినీ యూనివర్స్‌లు వస్తున్నాయని.. ముఖ్యంగా పుష్ప-2, యానిమల్, సలార్ లాంటి సినిమాల సీక్వెల్స్ వస్తున్నాయి.. ఒక అభిమానిగా మీరు ఏ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు? అని ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా పేరును నాగ్ రివీల్ చేశారు. తాను ప్రభాస్ మూవీ సలార్ పార్ట్-2 కోసం క్యూరియాసిటీతో ఉన్నానని నాగ్ అశ్విన్ అన్నారు. సలార్ స్టోరీ చాలా బాగా నచ్చిందని తెలిపారు. ముందుగా నేను గేమ్ ఆఫ్ త్రోన్స్కు వీరాభిమానిని.. అదోక విభిన్నమైన ప్రపంచం.. విభిన్నమైన హౌస్‌లు ఉంటాయి.. సలార్ కూడా అలాగే అనిపిస్తోందని అన్నారు. డిఫరెంట్ వరల్డ్, హిస్టరీ ఆధారంగా వస్తోన్న సలార్-2 కోసమే తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.కాగా.. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పార్ట్-1 సీజ్ఫైర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో దేవ (ప్రభాస్) శౌర్యంగ అని రివీల్ అవుతుంది. దీంతో ఆ తర్వాత ఖాన్సార్‌లో ఏం జరిగిందనే దానిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం పేరుతో రానుంది."I'm definitely curious about #Salaar because the story just started there. I'm a huge Game of Thrones fan, so seeing different houses and stories makes me excited."My hero Prabhas - #NagAshwin 😍#Prabhas #Kalki2898AD pic.twitter.com/88NKadDsHT— Prabhas' Realm (@PrabhasRealm) July 16, 2024 -
కోట్ల విలువైన కారు కొనుగోలు చేసిన సలార్ నటుడు!
సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల బడే మియాన్ చోటే మియాన్లో చిత్రంలో కనిపించారు. అంతకుముందు మలయాళంలో తెరకెక్కించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్గా నటించింది. దుబాయ్‌లో ఓ వ్యక్తి నిజజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.తాజాగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. సరికొత్త పోర్షే మోడల్ కారును కొన్నారు. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోర్షే ఇండియా బ్రాండ్ ప్రతినిధులతో పృథ్వీరాజ్ మాట్లాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అతనితో పాటు భార్య సుప్రియా మీనన్ కూడా ఉన్నారు. కాగా.. పృథ్వీరాజ్ ఇప్పటికే లంబోర్గిని, పోర్స్చే, టాటా సఫారి, మినీ కూపర్ లాంటి మోడల్ కార్లు కలిగి ఉన్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఎల్2: ఎంపురాన్ షూట్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో నటించడమే కాకుండా లూసిఫర్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్లో జరుగుతుండగా.. కేరళ, న్యూఢిల్లీ, లడఖ్, యూఎస్ఏ, యూకే లొకేషన్లలో కూడా చిత్రీకరించారు. View this post on Instagram A post shared by Porsche India (@porsche_in) -
నాలుగేళ్లకే లాభాల్లోకి చేరిన హైదరాబాద్ కంపెనీ
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు తాజాగా విడుదలకు సిద్ధమైన కల్కి చిత్రానికి డిజిటల్‌మార్కెట్ చేస్తున్న సిల్లీమాంక్స్ నాలుగేళ్లకే లాభాల్లోకి చేరింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రూ.26.83లక్షలు లాభాన్ని పోస్ట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లమేర నష్టపోయిన సంస్థ తాజా ఫలితాల్లో లాభాలు పోస్ట్ చేయడంతో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.కంపెనీ లాభాలపై సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలకంగా ఉన్న సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభదాయకంగా మారడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. సంస్థ చేపట్టిన కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలతో ఈ విజయం సొంతమైంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. సంస్థ ప్రాజెక్ట్‌లు ఇవే..ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ సంస్థ సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. గతంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు త్వరలో విడుదలయ్యే ప్రబాస్ నటించిన కల్కి 2898-ఏడీ చిత్రం యూనిట్లతో కలిసి పనిచేసింది. డిజిటల్ మార్కెటింగ్తోపాటు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తోంది.ఉద్యోగులకు షేర్క్యాపిటల్లో 5 శాతం వాటాకంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా తమ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ‘ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్’(ఈసాప్)ను ప్రకటించింది. ఈప్లాన్‌లో భాగంగా కంపెనీ మొత్తం షేర్క్యాపిటల్లో 5శాతం వాటాను తమ ఉద్యోగులకు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో ఈవాటాలో 70 శాతం మూలధనాన్ని ఉద్యోగులకు పంచనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2024 నుంచి ప్రారంభంకానుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండికరోనా కారణంగా సినిమా పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి తీవ్ర అనిశ్చితులు ఎదుర్కొంది. క్రమంగా కొవిడ్ భయాలు తొలగి గతేడాది నుంచి ఆ రంగం పుంజుకుంటోంది. ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన కంపెనీలు లాభాల్లోకి చేరుతున్నట్లు మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. -
'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ
ప్రభాస్ 'సలార్ 2' ఆగిపోయిందా? ఇంకెందుకులే అని పక్కనబెట్టేశారా? మీరు కూడా ఇలాంటి రూమర్స్ ఎక్కడో ఓ చోట వినే ఉంటారుగా. గత కొన్నిరోజుల నుంచి ఈ మూవీ గురించి ఏదో ఓ గాసిప్ వస్తూనే ఉంది. ఎందుకంటే ఆగస్టు నుంచి డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ మొదలు పెట్టబోతున్నాడు. రీసెంట్‌గానే తారక్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అదిగో అప్పటినుంచి 'సలార్' సీక్వెల్‌పై పుకార్లు షురూ అయ్యాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'కేజీఎఫ్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన యాక్షన్ మూవీ 'సలార్'. పలుమార్లు వాయిదా పడి.. గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందనే టాక్ అయితే వచ్చింది గానీ వసూళ్లు మాత్రం రూ.700 కోట్లు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్‌తో ఇతడి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోతుందనేసరికి 'సలార్'ని లైట్ తీసుకున్నారా అనే సందేహాలు వచ్చాయి.ఈ క్రమంలోనే క్లారిటీ ఇచ్చిన 'సలార్' నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.. 'వాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు' అనే క్యాప్షన్‌తో ప్రశాంత్ నీల్-ప్రభాస్ సెట్లో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. అంటే 'సలార్ 2'పై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం అన్నట్లు తేలింది. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే తారక్‌తో మూవీ కంప్లీట్ చేసిన తర్వాతే ప్రశాంత్ నీల్ 'సలార్ 2' తీస్తాడేమో?(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి)They can't stop laughing 😁#Prabhas #PrashanthNeel#Salaar pic.twitter.com/FW6RR2Y6Vx— Salaar (@SalaarTheSaga) May 26, 2024 -
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
-
Salaar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అయిన సలార్.. ట్రైలర్ అదిరింది!
జపాన్‌లో ఇండియన్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అక్కడ భారతీయ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో పాటు కేజీయఫ్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు కూడా జపాన్‌లో రిలీజై మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా మరో ఇండియన్ చిత్రం జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’. కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో ప్రభాస్‌కి ఓ మంచి హిట్ లభించింది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు ప్రభాస్. జులై 5న ఈ చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం యాక్షన్ సీన్లతోనే కట్ చేసిన ఈ ట్రైలర్ గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో శృతీహాసన్ హీరోయిన్గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. -
'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
డార్లింగ్ ప్రభాస్‌కి 'సలార్' స్పెషల్ మూవీ. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ఇతడికి.. ఈ మూవీ సక్సెస్ సరికొత్త ఎనర్జీ ఇచ్చింది. గతేడాది థియేటర్లలో రిలీజైనప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. కొన్నిరోజుల క్రితం టీవీలో వచ్చినప్పుడు మాత్రం ఊహించనంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్)ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన సినిమా 'సలార్'. 'కేజీఎఫ్' తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన ఈ మూవీ.. చాలాసార్లు వాయిదాలు పడుతూ గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని, రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బిగ్ స్క్రీన్‌పై సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. బుల్లితెరపై మాత్రం ఫెయిలైంది. ఏప్రిల్ 21న ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారం చేయగా కేవలం 6.52 టీఆర్పీ వచ్చింది. తాజాగా ఈ విషయం బయటపడింది.థియేటర్లలో 'సలార్'ని బాగానే చూశారు. కానీ టీవీల్లోకి వచ్చేసరికి దీన్ని లైట్ తీసుకున్నారు. ఎందుకంటే థియేటర్లలో ఫ్లాప్ అయిన ఆదికేశ (10.47), స్కంద (8.11)తో పాటు ఓ మాదిరిగి ఆడిన నా సామి రంగ (8.08), మంగళవారం (7.21), బిచ్చగాడు 2 (7.12) చిత్రాలకు కూడా 'సలార్' కంటే ఎక్కువ టీఆర్పీ రావడం అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ హవా నడుస్తోంది. దీని వల్ల టీఆర్పీ తగ్గిందని తెలుస్తోంది. లేదంటే ఎక్కువ వచ్చేదేమో?(ఇదీ చదవండి: ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్) -
‘సలార్’ ఆల్ సెట్... గో
‘సలార్’ సెట్స్‌లోకి తిరిగి జాయిన్ అయ్యేందుకు ప్రభాస్ సై అన్నారట. హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రంలోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ‘సలార్’లోని మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ చిత్రీకరణను వెంటనే మొదలు పెట్టాలని ప్రభాస్, ప్రశాంత్ నీల్ భావించారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను ప్రశాంత్ నీల్ పూర్తి చేశారట. ఇక ఆల్ సెట్... గో అంటూ షూటింగ్‌ను ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌లో మొదలు పెట్టనున్నారని సమాచారం. ఓ పది రోజుల పాటు షూటింగ్ జరిపి, ఆ తర్వాత బెంగళూరులో చిత్రీకరణను ప్లాన్ చేశారట, వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేసి, కుదిరితే ఈ ఏడాది చివర్లోనే క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా.జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహా, శ్రుతీహాసన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రం జపాన్‌లో జూలైలో విడుదల కానుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు జపాన్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో ‘సలార్: సీజ్ఫైర్’ సినిమాను కూడా జపాన్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. -
ఒక్క మెసేజ్‌తో 'సలార్' బైక్‌ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్. గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. కొద్దిరోజుల క్రితమే బుల్లితెరపై కూడా సందడి చేసింది. ఈ క్రమంలో సినిమా చూస్తూ సలార్ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని స్టార్ మా వారు అవకాశం కల్పించారు. తాజాగా విన్నర్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోన్ స్టార్ మా షేర్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 700 కోట్లకుపైగానే కలెక్ట్ చేసిన ‘సలార్’ రెండో భాగం ‘శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో కొద్దిరోజుల్లో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది.సినిమా థియేటర్లు, ఓటీటీలో సందడి చేసిన సలార్ మూవీ ఏప్రిల్ 21న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూస్తూ బైక్‌ను గెలుచుకోవచ్చని హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. ఏ విధంగా సలార్ బైక్‌ను సొంతం చేసుకోవాలో కూడా హోంబలె ఫిలిమ్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. విజయవాడకు చెందిన వరప్రసాద్ అనే వ్యక్తి సలార్ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలను వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు.ఏప్రిల్ 21న సలార్ సినిమాను చూస్తున్న సమయంలో స్క్రీన్ పై ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో బైక్ ఎన్ని సార్లు స్క్రీన్ మీద కనిపించిందో ప్రేక్షకులు లెక్కబెట్టాలని ఆ వెంటనే 9222211199 నంబర్‌కు SALAAR అని టైప్ చేసి పంపించాలని మేకర్స్ కోరారు. ఈ ఎస్సెమ్మెస్‌లను డిప్ ద్వారా ఎంపిక చేస్తామని ఆ సమయంలో ప్రకటించింది. వారు చెప్పినట్లుగానే సలార్ బైక్‌ను విజేత వరప్రసాద్‌కు అందచేశారు. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
క్రేజీ గాసిప్.. ప్రశాంత్ నీల్‌తో విజయ్ దేవరకొండ సినిమా?
లైగర్ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అయిపోయేవాడు. ఆ చిత్రం ప్లాప్ అయినప్పటికీ విజయ్ క్రేజీ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు కానీ పాన్ ఇండియా రేస్‌లో కాస్త వెనుకబడ్డాడు. ఒకే ఒక్క హిట్ వస్తే చాలు విజయ్‌తో సినిమా చేయడానికి కరణ్ జోహార్ మొదలు.. పాన్ ఇండియా దర్శకనిర్మాతలంతా రెడీగా ఉన్నారు.కానీ విజయ్ బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆయన నటించిన సినిమాలన్నింటికి మంచి పేరు వస్తుంది కానీ బాక్సాపీస్ వద్ద బోల్తా పడుతుంది. ఖుషి, ఫ్యామిలీ స్టార్.. రెండు మంచి చిత్రాలే కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పడు విజయ్ దృష్టి అంతా గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ పైనే ఉంది. ఈ చిత్రంలో ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు రౌడీ హీరో. గౌతమ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్.. విజయ్‌ని కలిశాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండబోతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ కోసం ప్రశాంత్ ఓ కథ రెడీ చేశారట. ఇటీవల హైదరాబాద్‌కి వచ్చి విజయ్‌కి కథ వినిపించాడట. మరి ఆ కథేంటి? వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందా లేదా? అనేది త్వరలో తెలుస్తుంది. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా ఉన్నప్పటికీ.. అది ఇప్పట్లో పట్టాలెక్కే చాన్స్ లేదు. ప్రశాంత్ ప్రస్తుతం సలార్ 2 ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు విడుదలైన తర్వాతే ప్రశాంత్ మరో ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తారు. సలార్ 2లో విజయ్ దేవరకొండ?ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం సలార్. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా సలార్ శౌర్యంగపర్వం’ రూపుదిద్దుకోనుంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాని కోసమే హైదరాబాద్‌కి వచ్చి విజయ్‌ని కలిశాడట ప్రశాంత్. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ ఈ క్రేజీ న్యూస్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. -
ఒక్క మెసేజ్‌తో 'సలార్' బైక్‌ను సొంతం చేసుకోండి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్. గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 700 కోట్లకుపైగానే కలెక్ట్ చేసింది. దీంతో వెంటనే ‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో ఇదే నెలలో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది. సినిమా థియేటర్లు, ఓటీటీలో సందడి చేసిన సలార్ ఇప్పుడు బుల్లితెరలో వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో సలార్ మూవీ ఏప్రిల్ 21న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ సినిమాను చూస్తూ బైక్‌ను గెలుచుకోవచ్చని హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. ఏ విధంగా సలార్ బైక్‌ను సొంతం చేసుకోవాలో కూడా హోంబలె ఫిలిమ్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.. ఏప్రిల్ 21న సలార్ సినిమాను చూస్తున్న సమయంలో స్క్రీన్ పై ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుందట, ఆ బైక్ ఎన్ని సార్లు స్క్రీన్ మీద కనిపించిందో ప్రేక్షకులు లెక్కబెట్టాలి. అదే సమయంలో ఎస్సెమ్మెస్ లైన్లు ప్రారంభమౌతాయి. ఆ వెంటనే 9222211199 నంబర్‌కు SALAAR అని టైప్ చేసి పంపించాలి. ఈ ఎస్సెమ్మెస్‌లను ఏప్రిల్ 21 రాత్రి 8 గంటల నుంచి పంపించాల్సి ఉంటుంది. దీంతో సలార్‌లో ప్రభాస్ ఉపయోగించిన బైక్ మాడల్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. Here's your exclusive opportunity to win the same iconic motorcycle ridden by Rebel Star #Prabhas in #SalaarCeaseFire. All you need to do is count the number of times the bike image/bug appears on the left of the screen during the movie from 5:30 PM to 8 PM. When the SMS lines… pic.twitter.com/WYMJ8FANqj — Hombale Films (@hombalefilms) April 18, 2024 -
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా తెలుగు వర్షన్
కన్నడలో గతేడాది రిలీజ్ అయిన కాటేరా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దర్శన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ సినిమా ప్రభాస్ సలార్‌తో పోటీ పడి రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వర్షన్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. కేజీఎఫ్ సినిమాకు పోటీగా కాటేరా సినిమాను నిర్మించారని కన్నడనాట భారీగా ప్రచారం జరిగింది. దీంతో కేజీఎఫ్ రికార్డులను కాటేరా బీట్ చేస్తుందని ప్రచారం జరిగింది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా కాటేరా చిత్రాన్ని దర్శకుడు తరుణ్ సుధీర్ తెరకెక్కించాడు. తాజాగా తెలుగుతో పాటు తమిళ వెర్షన్ జీ5 అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఆదివారం నుంచి కాటేరా చిత్రాన్ని జీ5 విడుదల చేసింది. థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి మేకర్స్ తీసుకొచ్చారు. కాటేరా సినిమాలో దర్శన్ సరసన ఆరాధన రామ్ హీరోయిన్గా మెప్పించింది. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధన రామ్ కాటేరాతోనే సాండల్‌వుడ్‌లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సాధారణ కథనే అయినప్పటికీ కన్నడ ఆడియెన్స్‌కి ఎక్కేసింది. మరీ తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం రీచ్ అవుతుందో చూడాల్సి ఉంది. -
పుష్ప-2 టీజర్.. ఆ సినిమాను దాటలేకపోయింది!
ఐకాన్ స్టార్ పుష్ప-2 ది రూల్ చిత్రానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు బర్త్ డే రోజే అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పుష్ప-2 టీజర్‌ను పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు. అయితే విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఒక్కసారిగా నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అయితే ఆ ఒక్క విషయంలో మాత్రం పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేయలేకపోయింది. ప్రభాస్ సలార్ మూవీ టీజర్ రికార్డ్‌ను అధిగమించలేకోపోయింది. సలార్ టీజర్ రిలీజైనప్పుడు కేవలం 6 గంటల 15 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. అదే లైక్స్ పుష్ప-2 టీజర్‌కు రావడానికి 9 గంటల 59 నిమిషాలు పట్టింది. ఇక ఇదే జాబితాలో ఆర్ఆర్ఆర్ చిత్రం 36 గంటల 4 నిమిషాలతో మూడుస్థానంలో ఉంది. ఏదేమైనా యూట్యూబ్‌లో మాత్రం రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వాళ్లకు డబ్బులు తిరిగిచ్చేసిన 'సలార్' నిర్మాత.. అదే కారణమా?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్'.. బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ వరకు చాలామంది సందేహపడ్డారు. కానీ థియేటర్లలోక వచ్చిన తర్వాత వసూళ్ల మోత మోగించింది. అలాంటి ఈ సినిమా వల్ల కొందరు డిస్ట్రిబ్యూటర్స్‌కి నష్టాలొచ్చాయట. ఇప్పుడిదే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) 'కేజీఎఫ్' లాంట ఊరమాస్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడనేసరికి అందరూ అంచనాలు పెంచుకున్నారు. ఇందుకు తగ్గట్లే బిజినెస్ కూడా జరిగింది. నైజాం హక్కుల్ని దక్కించుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. మంచి లాభాల్ని కూడా చూసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ 'సలార్' రైట్స్‌ని ఎక్కువ ధరకి కొనడం కొంపముంచిందట. పెట్టిన పెట్టుబడి తగ్గట్లు ఆయా ప్రాంతాల్లో వసూలు కాలేదని, దీంతో 'సలార్' నిర్మాత విజయ్ కిరగందూర్.. సదరు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయిన మొత్తాన్ని తాజాగా తిరిగిచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు 'సలార్' సీక్వెల్ 'శౌర్యంగపర్వం' షూటింగ్ జూన్ నెల నుంచి మొదలయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే 'సలార్' రెండో పార్ట్.. వచ్చే ఏడాది థియేటర్లలో రావడం గ్యారంటీ. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) -
'సలార్' విలన్ పాన్ ఇండియా మూవీ.. ట్రైలర్ ఓ విజువల్ వండర్
ఈసారి వేసవిలో ప్రభాస్ 'కల్కి' తప్పితే స్టార్ హీరోల సినిమాలేం రావట్లేదు. ఏప్రిల్‌లో 'దేవర' రావాల్సింది కానీ వాయిదా పడింది. అయితే ఇప్పుడు సినీ ప్రేమికుల్ని మెస్మరైజ్ చేసేందుకు క్రేజీ పాన్ ఇండియా మూవీ వచ్చేస్తోంది. 'సలార్'లో ప్రభాస్ ఫ్రెండ్, విలన్‌గా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ మూవీ సర్వైవర్ డ్రామాలో హీరోగా నటించాడు. మార్చి 28న సినిమా థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ మూవీ 'ఆడు జీవితం'. పొట్టకూటి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ మహమ్మద్ అనే మలయాళీ కుర్రాడు ఎన్ని కష్టాలు పడ్డాడు? అక్కడ బానిస బతుకు నుంచి బయటపడేందుకు ఎడారి బాట పట్టిన ఇతడు.. ఎలా బతికి బట్టకట్టాడు అనేదే స్టోరీ. పాత ట్రైలర్ సంగతి పక్కనబెడితే తాజా ట్రైలర్ మాత్రం విజువల్ వండర్లా అనిపించింది. లాంగ్ ఫ్రేమ్స్, క్లోజ్ ఫ్రేమ్స్ సీన్స్ మాత్రమే చూపించారు. ఒకే ఒక్క డైలాగ్‌తో అద్భుతమైన సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించారు. హీరోగా చేసిన పృథ్వీరాజ్ లుక్ ట్రైలర్లో చూస్తుంటే షాకింగ్‌గా అనిపించింది. ఏఆర్ రెహమన్ సంగీతం కూడా సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. ఈ సినిమా దర్శకుడు బ్లెస్సీ, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి.. ఇలా జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలు అందరూ ఈ చిత్రం కోసం పనిచేయడం విశేషం. (ఇదీ చదవండి:ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
స్పీడ్ పెంచిన ప్రభాస్... స్పిరిట్ కోసం ప్రభాస్ ప్లాన్ అదుర్స్
-
'శౌర్యంగ పర్వం' యాక్షన్ తో స్టార్ట్
-
సలార్ 'శౌర్యంగపర్వం' యాక్షన్‌తో స్టార్ట్
‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ షూటింగ్‌కు రెడీ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో వెంటనే ‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో ఏప్రిల్‌లో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది. ముందుగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారట ప్రశాంత్ నీల్. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 చివర్లో విడుదల కానుందని సమాచారం. -
ఎన్టీఆర్ కోసం డార్లింగ్ ని పక్కన పెట్టిన నీల్..!
-
మరో ఓటీటీలోకి వచ్చేసిన సలార్.. కానీ అదే ట్విస్ట్!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సలార్: పార్ట్-1 సీజ్ఫైర్'. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చింది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన సలార్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 20వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్కు వచ్చిన సలార్ ఓటీటీలో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే తెలుగులో కూడా వచ్చి ఉంటే బాగుండేదని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ రాబోయే రోజుల్లో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందేమో వేచి చూడాల్సిందే. Jab bhi Deva bulayega, Hum aayenge! #SalaarHindi Now Streaming #Salaar #SalaarOnHotstar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84 @vchalapathi_art @anbariv @SalaarTheSaga pic.twitter.com/pZfK2LVagB — Disney+ Hotstar (@DisneyPlusHS) February 16, 2024 -
ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్
మరో వారం వచ్చేసింది. రేపు (ఫిబ్రవరి 16) సందీప్ కిషన్ నటించిన భైరవకోన విడుదల కానుంది. గత వారంలో విడుదలైన రవితేజ ఈగల్, యాత్ర- 2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఓటీటీలోకి రాబోయే రెండు రోజుల్లో నా సామిరంగా, ది కేరళ స్టోరీ చిత్రాలు రానున్నాయి. దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోవడంతో ఆ సినిమాపైనే అందరి గురి ఎక్కువగా ఉంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారంలో అందుబాటులో ఉండనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. డంకీ, నా సామిరంగ, సబా నాయగన్, ది కేరళ స్టోరీ నాలుగు చిత్రాలు ప్రత్యేకం. నెట్‌ఫ్లిక్స్ • డంకీ (నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది) • హౌస్ ఆఫ్ నింజాస్ (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 15 • ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్- సీజన్-2(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • లిటిల్ నికోలస్- హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15 • రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15 • ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • ది క్యాచర్ వాజ్ ఏ స్పై - ఫిబ్రవరి 15 • క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15 • ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16 • కామెడీ చావోస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 • ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) - ఫిబ్రవరి 16 • ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ • నా సామిరంగ (తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17 • సబా నాయగన్ ( తమిళ్,తెలుగు,మలయాళం,హిందీ మూవీ)- స్ట్రీమింగ్ అవుతుంది • సలార్ (హిందీ వర్షన్) - ఫిబ్రవరి 16 • ది స్టోరీ ఆఫ్ అజ్ (వెబ్ సిరీస్- 1)- - ఫిబ్రవరి 16 అమెజాన్ ప్రైమ్ వీడియో • రూట్ నం.17 ( తమిళ్ మూవీ) - ఫిబ్రవరి 15 • అమవాస్ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 16 • లవ్‌స్టోరీ యాన్ (హిందీ వెబ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది జీ5 • ది కేరళ స్టోరీ (బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16 • క్వీన్ ఎలిజిబెత్ (తమిళ్,మలయాళం మూవీ) - స్ట్రీమింగ్ అవుతుంది -
OTT: ఒకేరోజు ఐదు సినిమాలు.. సలార్ హిందీ వర్షన్‌పై అప్డేట్
ప్రతివారం అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రమే పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలవుతుంటాయి. ఇకపోతే థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన భారీ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాయి. గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్, అయలాన్, కాటేరా సినిమాలు శుక్రవారం (ఫిబ్రవరి 9న) డిజిటల్ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టాయి. మరి ఈ చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.. కెప్టెన్ మిల్లర్ ఎక్కడంటే? మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. రూ.280 కోట్లకు పైగా రాబట్టిన గుంటూరు కారం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ మూవీ తమిళనాట జనవరి 12న విడుదలైంది. తెలుగులో సంక్రాంతి బరిలో దిగిన సినిమాల లిస్ట్ పెద్దదిగా ఉండటంతో ఇక్కడ కాస్త ఆలస్యంగా విడుదలైంది. తెలుగులో జనవరి 26న రిలీజైంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. కాటేరా స్ట్రీమింగ్ అక్కడే! కన్నడ స్టార్ దర్శన్ నటించిన చిత్రం కాటేరా. గతేడాది సలార్‌కు పోటీగా విడుదలైన ఈ మూవీ తన సత్తా నిరూపించుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా రాబట్టింది. డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నేడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీతో సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు ఆరాధన్ రామ్ కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. సన్ నెక్స్ట్లో అయలాన్ తమిళ హీరో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం అయలాన్. గ్రహాంతరవాసితో శివకార్తికేయన్ చేసిన హంగామా తమిళ ప్రేక్షకులను మెప్పించింది. అక్కడ జనవరి 12న విడుదలైన ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ సినిమా సన్ నెక్స్ట్‌లోకి వచ్చేసింది. Ayalaan vandhutaan! 👽🔥#Ayalaan is streaming worldwide now only on #SunNXT https://t.co/xFjM7jf2GI@Siva_Kartikeyan @rakulpreet @ravikumar_dir @arrahman#SivaKarthikeyan #ARRahman #AyalaanOnSunNXTFromFeb9 #AyalaanOnSunNXT #SunNXTExclusiveAyalaan pic.twitter.com/Ni1c8W4pHD — SUN NXT (@sunnxt) February 9, 2024 ఓటీటీలో థ్రిల్లర్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. అదే భక్షక్. భూమి పడ్నేకర్ నటించిన ఈ మూవీకి పులకిత్ దర్శకత్వం వహించాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్‌ఖాన్, గౌరీఖాన్ నిర్మించారు. ఈ సినిమా నేడే నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎట్టకేలకు సలార్ హిందీ వర్షన్‌పై అప్డేట్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా రాబట్టింది. జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా హిందీ వర్షన్ ఎప్పుడు? ఎక్కడ? అనేదానిపై బిగ్ అప్డేట్ వచ్చింది. హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 19న హిందీ వర్షన్ విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. Tumne bulaya aur Salaar chala aaya 😎 #SalaarInHindi streaming from 16th Feb.#Salaar #SalaarOnHotstar pic.twitter.com/few5IFwQyA— Disney+ Hotstar (@DisneyPlusHS) February 9, 2024 చదవండి: ‘ఈగల్’ టాక్ ఎలా ఉందంటే.. -
ఓటీటీలో సలార్.. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ రేంజ్లో!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సలార్: పార్ట్-1 సీజ్ఫైర్'. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చింది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన సలార్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 20వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం టాప్ టెన్ మూవీస్‌లో ట్రెండ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్కు వచ్చిన సలార్ ఓటీటీలో దూసుకెళ్తోంది. అయితే గ్లోబల్ వైడ్‌గా ఉన్న అభిమానుల నుంచి డిమాండ్ రావడంతో ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫిబ్రవరి 5 నుంచి సలార్ ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. ఇక ఇప్పటి నుంచి సలార్ పాన్ ఇండాయా కాదు.. గ్లోబల్ సినిమాగా మారిపోయింది. ఇప్పటికే గ్లోబల్‌గా దూసుకెళ్తోన్న సలార్ మరింత ట్రెండ్ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సలార్ మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సలార్ హిందీ వెర్షన్ మాత్రం ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. ఈ విషయంపై అప్డేట్ కూడా ఇవ్వలేదు. 90 రోజుల వరకు వెయింటింగ్ పీరియడ్ ఉండడంతో హిందీ వర్షన్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. సలార్ హిందీ వర్షన్ మార్చిలో వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి, టినూ ఆనంద్, దేవరాజ్, బాబీ సింహా కీలకపాత్రల్లో కనిపించారు. కాగా.. చిత్రానికి సీక్వెల్‌గా సలార్: పార్ట్-2 శౌర్యంగపర్వం ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Final voting begins. 🙌 Salaar is now available in English, Telugu, Tamil, Malayalam and Kannada on Netflix! #SalaarOnNetflix pic.twitter.com/8gQpRWNmum — Netflix India South (@Netflix_INSouth) February 5, 2024 -
ఇది కదా ప్రభాస్ రేంజ్.. నిముషానికి కోట్ల రూపాయలు
-
ఓటీటీలో యానిమల్ దూకుడు.. మూడు రోజుల్లోనే సలార్ రికార్డ్ బ్రేక్!
గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. థియేటర్లలో ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం జనవరి 26న ఓటీటీకి వచ్చేసింది. గణతంత్ర దినోత్సవం రోజు నుంచే సినీ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన యానిమల్ వారం రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది. అంతకుముందే రిలీజైన ప్రభాస్, ప్రశాంత్ నీల్ మూవీ సలార్‌ను అధిగమించింది. కేవలం టాప్ ట్రెండింగ్ ఉన్న సినిమాలే కాదు.. రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యానిమల్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ టెన్ మూవీస్ లిస్ట్‌లో మొదటిస్థానంలో కొనసాగుతోంది. అంతేకాకుండా ఇండియాతో పాటు దాదాపు 16 దేశాల్లో నంబర్‌వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కమర్షియల్ యాక్షన్ మూవీ సలార్ థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత జనవరి 20న ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కాగా.. ప్రస్తుతం సలార్ ఇండియా వ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. సలార్‌ను దాటేసిన యానిమల్.. టాప్ ట్రెండింగ్ మూవీస్‌లోనే కాదు.. వ్యూస్ విషయంలోనూ సలార్‌కు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. యానిమల్ నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి మూడు రోజుల్లోనే 62 లక్షల వ్యూస్‌తో పాటు.. 20.8 మిలియన్ల గంటల వ్యూయర్షిప్ను నమోదు చేసింది. కాగా.. సలార్ మొదటి 10 రోజుల్లో 35 లక్షల వ్యూస్‌తో పాటు 10.3 మిలియన్ గంటల వ్యూయర్షిప్ నమోదు చేసింది. దీంతో ఓటీటీలో సలార్‌కు రణ్‌బీర్ కపూర్ యానిమల్ గట్టి పోటీ ఇస్తోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.900 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. -
ప్రభాస్ విచిత్రమైన రికార్డ్.. సెకనుకు రూ.80 లక్షల రెమ్యునరేషన్?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' మూవీతో హిట్ కొట్టాడు. డిసెంబరులో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఈ మధ్యే ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇక్కడ కూడా ట్రెండింగ్‌లో ఉంటూ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. అయితే థియేటర్లలో 'సలార్' చూస్తున్నప్పుడు గమనించని చాలా విషయాలు.. ఓటీటీలోకి వచ్చాక బయటపడ్డాయి. అలా ఇప్పుడు ప్రభాస్ సెట్ చేసిన ఓ విచిత్రమైన రికార్డ్ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో) 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. 'సాహో' మూవీ కొంతలో కొంత పర్వాలేదనిపించింది కానీ 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఫ్లాప్స్‌గా నిలిచాయి. దీంతో అందరూ 'సలార్' మీదే ఆశలు పెట్టుకున్నారు. అలా గతేడాది డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై ఇక్కడ కూడా రచ్చ లేపుతోంది. అయితే 'సలార్'లో ప్రభాస్ ఫైట్స్ అదరగొట్టినప్పటికీ.. సినిమా మొత్తం కలిపి కేవలం 2 నిమిషాల 35 సెకన్లు మాత్రమే డైలాగ్స్ చెప్పాడు. మరోవైపు ఈ చిత్రంలో నటించినందుకు గానూ రూ.125 కోట్ల పారితోషికం తీసుకున్నాడని టాక్ వినిపించింది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి చూస్తే మాత్రం డార్లింగ్ హీరో.. సెకనుకు రూ.80, 64,516 సంపాదించినట్లే. అంటే నిమిషానికి పదులు కోట్లు అందుకున్నట్లే. మనదేశంలో ఇలా సెకనుకు లక్షలు.. నిమిషానికి కోట్లు సంపాదించిన రికార్డు ప్రభాస్‌దే. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) Prabhas Dialogue time in Salaar (sped up) Roughly 4 minutes with dialogue gaps and 2:35 min without gaps... https://t.co/aHPhd30Mp5 pic.twitter.com/bxTclXjMcA — Lok (@TeluguOchu) January 21, 2024 -
సలార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత..!
-
సలార్ సెన్సేషన్..ప్రభాస్ నెక్స్ట్ లెవెల్
-
#SalaarGoesGlobal: నెట్‌ఫ్లిక్స్ ఎఫెక్ట్.. హాలీవుడ్లో దుమ్మురేపుతున్న సలార్
ఖాన్సార్ సామ్రాజ్యం నేపథ్యంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం 'సలార్'. శ్రుతిహాసన్ కథానాయిక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. వెయ్యి కోట్లు రాబట్టే సత్తా ఉన్నా బాలీవుడ్లో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో ఆ మార్క్‌ను రీచ్ కాలేకపోయింది. అంతే కాకుండా డంకీ సినిమాకు కార్పొరేట్ బుకింగ్స్ జరగడం. సలార్‌కు బాలీవుడ్లో పెద్దగా స్క్రీన్స్ ఇవ్వకపోవడం వంటివి జరగడంతో కలెక్షన్స్‌పై కొంత ప్రభావం పడింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సలార్‌కు ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు నార్త్‌లో టాప్-1లో దూసుకుపోతుంది. టాలీవుడ్ నుంచి మొదలైన ప్రభాస్ దండయాత్ర పాన్ ఇండియా దాటి హాలీవుడ్లో అడుగుపడింది. జనవరి 20 నుంచి ఓటీటీలో రన్ అవుతున్న సలార్ గ్లోబల్ ఆడియన్స్‌కు దగ్గరైంది. హాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ కటౌట్ చూసి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం #SalaarGoesGlobal హ్యాష్ ట్యాగ్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.నెట్‌ఫ్లిక్స్‌కు భారత్‌లో కంటే ఫారిన్ దేశాల్లోనే సబ్స్క్రైబర్స్ ఎక్కువ దీంతో వారిలో సలార్‌ను చూసి బాగుందంటూ కామెంట్లు చేయడం విశేషం. ప్రస్తుతం తెలుగు,తమిళ్,కన్నడ,మళయాలం, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఫారిన్ ఆడియెన్స్ నుంచి ఊహించని రేంజ్లో క్రేజ్ దక్కుతోంది. వారందరూ ఎక్స్ పేజీ ద్వారా సలార్‌పై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. దీంతో #SalaarGoesGlobal హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన అక్కడి ప్రేక్షకులు సలార్ సూపర్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇండియన్ భాషల్లోనే వారు చూసి ఇలాంటి కామెంట్లు చేస్తే ఇక ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ప్రభాస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ నుంచి రాబోతున్న కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో కూడా విడుదల చేస్తే ప్రభాస్ హాలీవుడ్‌కు కూడా దగ్గరయ్యే ఛాన్స్ ఉంది. The most happiest person right now 🤩🤩🤩🤩❤❤🥰🔥🔥👌👌👌#SalaarGoesGlobal pic.twitter.com/2NrCjJcDX2 — prabhas raju (@prabhasraaaju) January 26, 2024 Normally I don’t watch Bollywood movies but Salaar was worth the hype for real Nice movie 🍿 🎥 from the india 🇮🇳 movie industry 🤝👏#SalaarGoesGlobal pic.twitter.com/Q6auTPPYzd — ✨𝕌ℂℍ𝕀ℍ𝔸Ⓜ️✨ (@Ero__Dy) January 26, 2024 With just the South Indian versions of #Salaar on Netflix, movie lovers worldwide have already started enjoying #Prabhas' #SalaarCeaseFire. Just imagine the reach it will gain after the release of English version🥵 English Version will be out 🔜 on Netflix!#SalaarGoesGlobal 🔥 pic.twitter.com/1JTQpM4SRb — Prabhas FC (@PrabhasRaju) January 26, 2024 Foreign Couple Reacting On Coal Mine Fight Scene 🔥🔥🔥🔥🔥🔥 Look At Her, How Interestingly She Is Waiting & Excited 🤩🤩🤩🤩 Their Reaction 👌👌👌👌 @hombalefilms Please Release English Version Soon 🤞#Prabhas || #Salaar#SalaarCeaseFire pic.twitter.com/F16wzuSEhc — Goutham (@goutham4098) January 26, 2024 #SalaarGoesGlobal pic.twitter.com/0QqNWJAmRQ — Venkat Sai kiran 🦜 (@prabhas_drln) January 26, 2024 #SalaarGoesGlobal pic.twitter.com/0QqNWJAmRQ — Venkat Sai kiran 🦜 (@prabhas_drln) January 26, 2024 -
డూప్ వద్దన్నాడు.. ప్రభాస్ ఎలాంటివారంటే?: సలార్ విలన్
గతకొంతకాలంగా డిజాస్టర్లు ఇచ్చిన ప్రభాస్ సలార్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో అతడి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ఇక్కడ, మా హీరో ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కావాల్సిందేనంటూ కాలర ఎగరేసుకుని మరీ తిరిగారు. ఇక సలార్ మూవీలో ప్రభాస్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. డైలాగులు తక్కువైనా యాక్షన్ సీన్లతో అదరగొట్టాడు. ఈ మూవీలో ఎమ్మెస్ చౌదరి విలన్‌గా నటించాడు. సలార్ చిత్రంలో ప్రభాస్‌ను కొట్టిన ఏకైక విలన్‌గా దమ్మున్న పాత్రలో యాక్ట్ చేశాడు. నేను డిస్టర్బ్ చేయను.. తాజాగా అతడు సలార్ సినిమా సంగతులను గుర్తు చేసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నేను హీరోలను ఎక్కువగా పలకరించను. ప్రతి ఒక్కరూ వాళ్లతో మాట్లాడాలి, ముచ్చట్లు పెట్టాలి అనుకుంటారు. అలా చేస్తే వారికి విసుగ్గా ఉంటుంది. అందుకని నేను వారిని డిస్టర్బ్ చేయను. వారితో కలిసి సీన్లో నటించేటప్పుడు మాత్రం పలకరిస్తుంటాను. ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయినా చాలా సింపుల్‌గా, సరదాగా ఉంటాడు. డూప్ వద్దని తనే నా కాళ్లు.. సలార్ మూవీలో ప్రభాస్ నా కాళ్లు పట్టుకునే సన్నివేశం ఒకటుంది. అప్పటికే రెండు, మూడు యాంగిల్స్‌లో ఎలా షూట్ చేద్దామా? అని చూస్తున్నారు. మూడోసారికి హీరో డూప్ వచ్చి తాను చేస్తానన్నాడు. కానీ ప్రభాస్ అతడిని వద్దని వారించి తానే చేస్తానని ఆ సీన్ పూర్తి చేశాడు. సలార్ అయిపోయాక ప్రభాస్ బెంగళూరులో పార్టీ ఇచ్చాడు. నేను కూడా ఆ పార్టీకి వెళ్లాను' అని చెప్పుకొచ్చాడు ఎమ్మెస్ చౌదరి. చదవండి: అప్పుడు విడాకులు.. ఇప్పుడు డేటింగ్.. 45 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి! పెళ్లైన ఏడాదికే విడిపోతామనుకోలేదు.. విడాకులపై తొలిసారి ఓపెన్ అయిన నిహారిక -
'సలార్' నటుడికి కోర్టు నోటీసులు.. కారణం అదే?
ఇతడు తెలుగు నటుడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య వచ్చిన 'సలార్' మూవీలోనూ గుర్తుంచుకోదగ్గ పాత్రలో అలరించాడు. ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతా బాగానే ఉందనుకునేలోపు.. ఇతడికి ఆలందూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో అందరూ షాకయ్యారు. నోటీసులు జారీ చేసేంతలా ఇతడు ఏం చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఆలందూర్కు చెందిన జేఎంఏ హుస్సేన్.. బాబీసింహపై కోటి రూపాయలు పరువు నష్టం దావా వేస్తూ ఆలందూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను బాబీసింహ స్నేహితులమని.. చిన్నప్పుడు కలిసి చదువుకున్నామని పేర్కొన్నారు. జమీర్ కాశీం అనే వ్యక్తి.. తన ద్వారా బాబీసింహకు పరిచయమయ్యారని, అతడు భవన నిర్మాణ రంగంలో ఉన్నారని హుస్సేన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే బాబీసింహ.. కొడైక్కానల్‌లో నిర్మించే భవన నిర్మాణ బాధ్యతలను జమీర్ కాశీంకు అప్పగించారని చెప్పాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) అయితే 90 శాతం భవన నిర్మాణ పనులను పూర్తి చేయగా.. అప్పటివరకు అయిన ఖర్చుని బాబీసింహా చెల్లించలేదని.. ఈ వ్యవహారంలో వారిద్దరి మధ్య గొడవ జరిగిందని హుస్సేన్ చెప్పాడు. దీంతో తన తండ్రి.. వాళ్లిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారని.. కానీ ఆ సమయంలో 77 ఏళ్ల తన తండ్రిని బాబీసింహ బెదిరించారని హుస్సేన్ ఆరోపించారు. గతేడాది సెప్టెంబర్ 27న ప్రెస్ మీట్ పెట్టి మరీ తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బాబీసింహపై తగిన చర్యలు తీసుకోవాలని హుస్సేన్.. ఆలందూర్ కోర్టులో పిటిషన్లో వేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయస్థానం.. వివరణ కోరుతూ ప్రముఖ నటుడు బాబీసింహకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. (ఇదీ చదవండి: చిరంజీవికి 'పద్మ విభూషణ్'.. ఈ అవార్డుతో పాటు ఏమేం ఇస్తారు?) -
గ్లోబల్ మూవీగా సలార్..అరుదైన ఘనత సాధించిన ప్రభాస్
-
ఇకపై సలార్ పాన్ ఇండియా కాదు.. అంతకు మించి!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ నటించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. స్నేహితునికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ చేసే పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ డైలాగ్స్ సైతం ఫ్యాన్స్‌ను కట్టిపడేశాయి. థియేటర్లలో భారీగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలో టాప్-10లో నిలిచిన నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. త్వరలోనే ఈ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. పాన్ ఇండియా మూవీ సలార్.. ఇప్పుడు గ్లోబల్ మూవీగా మారిపోయిందంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Thala for every reason 🫠🫠#SalaarTopsOnNetflix #SalaarCeaseFire is trending at top 7 on Netflix🎬 pic.twitter.com/iGyBG2qFfK — Jay (@slowandlow02) January 23, 2024 View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
టాలీవుడ్లో కొనసాగుతున్న సరికొత్త ట్రెండ్.. అదేంటో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో ఇటీవల ఓ ట్రెండ్ తెగ నడుస్తోంది. గతేడాది సూపర్ హిట్ సినిమాల రి రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా నడిచింది. అయితే ఇప్పటికే హిట్ అయిన సినిమాలు పార్ట్-2కు రెడీ అవుతున్నాయి. పార్ట్-1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మేకర్స్ అదే ఊపులో సీక్వెల్స్ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్లో బిజీగా ఉన్నాయి. మరికొన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో తెరకెక్కుతోన్న స్టార్ హీరోల సీక్వెల్ సినిమాలపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన టాలీవుడ్ సినిమాల జాబితా నెట్టింట వైరల్‌గా మారింది. టాలీవుడ్లో సీక్వెల్స్ రూపొందిస్తున్న చిత్రాల్లో అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, బాలకృష్ణ, రామ్ లాంటి సూపర్ స్టార్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్లో అఫీషియల్‌గా ప్రకటించిన సీక్వెల్ సినిమాల జాబితాపై ఓ లుక్కేయండి. టాలీవుడ్ సీక్వెల్స్ సినిమాలు పుష్ప-2- ది రూల్ సలార్-2- శౌర్యాంగపర్వం దేవర-2 జై హనుమాన్ అఖండ-2 టిల్లు స్క్వేర్ డబుల్ ఇస్మార్ట్ గూఢచారి-2 హిట్-3 బింబిసార-2 ప్రాజెక్ట్-జెడ్ గీతాంజలి మళ్లీ వచ్చింది శతమానం భవతి కార్తికేయ-3 విరూపాక్ష-2 -
OTTలో సలార్ భారీ రికార్డులను సృష్టించింది
-
ఓటీటీలో దుమ్ములేపుతున్న సలార్
-
ప్రభాస్ సలార్.. ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు.. ఎందుకంటే?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ నటించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. స్నేహితునికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ చేసే పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ డైలాగ్స్ సైతం ఫ్యాన్స్‌ను కట్టిపడేశాయి. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ వీడియో నెట్టింట వైరలవుతోంది. సలార్ మూవీ రన్‌టైమ్ 2 గంటల 55 నిమిషాలు కాగా.. అందులో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ దాదాపుగా 5 నుంచి 6 నిమిషాల వరకు ఉండవచ్చు. కానీ అవే డైలాగ్స్ కాస్తా స్పీడ్ వర్షన్లో చూస్తే కేవలం 2 నిమిషాల 33 సెకన్స్ మాత్రమే ఉన్నాయి. దాదాపు మూడు గంటల సినిమాలో కేవలం రెండున్నర నిమిషాలే హీరో డైలాగ్స్ ఉండడం ప్రశాంత్ నీల్ ఘనతే అని నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు కమర్షియల్ సినిమాలో ఇదొక అద్భుతమైన ప్రయోగమని నీల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Prabhas has dialogues for 2 minutes and 33 seconds in the entire movie of #Salaar which has a runtime of 2 hours and 55 minutes. Can also be called as an experiment in commercial cinema! Neel. Take a bow! 👏 pic.twitter.com/EBH3Cq4F9e — idlebrain jeevi (@idlebrainjeevi) January 21, 2024 -
ఎన్టీఆర్ వల్ల సాలార్ 2 ముందుకు...బిగ్ అప్ డేట్..
-
సలార్‌లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి.. ప్రభాస్, పృథ్వీరాజ్‌ల యాక్షన్ సీన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సలార్ పార్ట్-2 ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. దానికి 'సలార్ శౌర్యాంగపర్వం' అనే టైటిల్ కూడా రివిల్ అయిపోయింది. సలార్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. అఖిల్ లుక్‌తో పాటు అతని బాడీ కూడా బాలీవుడ్ హీరోలకు ఏం తక్కువ కాదు అన్నట్టుగా ఉంటుంది. అఖిల్ భారీ యాక్షన్ సీన్స్‌లలో దుమ్ములేపగలడు. దీంతో సలార్ పార్ట్ 2లో అఖిల్ ఎంట్రీ దాదాపు ఖాయం అని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి తాజాగా స్పందించారు. అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు అడిగడంతో క్లారిటీ ఇచ్చారు. సలార్‌లో దేవా తండ్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు..? తన తండ్రిని రాజమన్నార్ చంపాడనే విషయం దేవాకు తెలుసా..? అని చాలామంది అడిగిన ప్రశ్నకు ఆమె రివీల్ చేయలేదు.. సమాధానాల కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. 'సలార్' గ్లింప్స్‌లో చూపించిన జురాసిక్ పార్క్ డైలాగ్ గురించి ఆమె చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. శౌర్యాంగపర్వం విడుదలయ్యాకు ఆ డైలాగ్ కరెక్టా? కాదా? అనేది తెలుస్తుందని తెలిపారు. అంతేకాకుండా పండిట్ రోల్ కూడా సలార్‌లో కొంత మాత్రమే రివీల్ చేసినట్లు ఆమె చెప్పారు. -
ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. అక్కడ మాత్రం ఇంకా పెండింగ్‌లోనే
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇది నిజంగా సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కనీసం థియేటర్లలోకి వచ్చి నెల రోజులైనా పూర్తి కాకుండానే ఇలా ఓటీటీల్లోకి వచ్చేయడం.. అభిమానులకు షాకింగ్‌గా అనిపించింది. మరోవైపు సగటు మూవీ లవర్ మాత్రం పండగ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ చాలామంది చూసేశాడు కూడా. అయితే ఓ చోట మాత్రం 'సలార్' ఓటీటీలో రిలీజ్ కాలేదు. దీనికి కారణమేంటో తెలుసా? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?) ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'సలార్' సినిమా.. డిసెంబరు 22న థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.700 కోట్ల మేర సొంతం చేసుకుంది. ఇంకా పలుచోట్ల స్క్రీన్ అవుతున్న ఈ చిత్రం.. తాజాగా అంటే జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ హిందీ వెర్షన్ మాత్రం రిలీజ్ కాలేదు. సాధారణంగా స్ట్రెయిట్ లేదా డబ్బింగ్ సినిమా ఏదైనా సరే ఉత్తరాదిలోనే మల్టీప్లెక్సుల్లో రిలీజ్ చేయాలంటే ఎనిమిది వారాల థియేట్రికల్ రూల్ తప్పనిసరి. అంటే మల్టీప్లెక్సుల్లో విడుదల చేసిన సినిమాని కచ్చితంగా 8 వారాల తర్వాత ఓటీటీల్లో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీనిబట్టి చూస్తే ఓటీటీలో 'సలార్' హిందీ వెర్షన్ రిలీజ్ మరో నెల తర్వాతే ఉండొచ్చు. అంటే బాలీవుడ్ ఆడియెన్స్ 'సలార్' చూడాలంటే మరో నెలరోజుల ఆగాల్సిందే లేదంటే మిగతా భాషల్ని సబ్ టైటిల్స్ పెట్టుకుని చూడటమే! (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనున్న సీక్వెల్?
-
సడన్ ఓటీటీ రిలీజ్ కు రీజన్ ఏంటి...?
-
సలార్ సీక్వెల్ కు లైన్ క్లియర్ చేస్తారా?
-
Salaar OTT Release: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యప్తంగా ఈ సినిమా రూ.700 కోట్ల మార్క్‌ను దాటి ప్రభాస్ ఖాతాలో మరో భారీ హిట్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే పలుమార్లు థియేటర్లో సలార్‌ను చూసిన అభిమానులు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఒక శుభవార్త చెప్పింది. 'సలార్'ను జనవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. వాస్తవంగా గణతంత్రదినోత్సవం రోజున ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఎవరూ ఊహించిన రీతిలో నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్ చేసింది. ఖాన్సారా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్‌కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టాలెంట్ తోడు కావడంతో ఈ సినిమా బిగ్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, ఈశ్వరిరావు, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సలార్‌కు పార్ట్-2 కూడా ఉంటుందని చిత్ర మేకర్స్ ప్రకటించారు. (ఇదీ చదవండి: ‘సలార్’ మూవీ రివ్యూ) -
గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ గాయపడ్డాడు. తాజాగా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో అఖిల్ కనిపించాడు. కాకపోతే ఎడమ చేతికి కట్టు ఉండటంతో పెద్ద దెబ్బ తగిలిందని అర్థమైంది. అసలు ఇంతకీ అఖిల్ చేతికి ఏమైంది? 'సలార్' సక్సెస్ పార్టీలో ఈ కుర్ర హీరో కనిపించడానికి కారణమేంటనేది చూద్దాం. గతేడాది డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన 'సలార్' సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ క్రమంలోనే మొన్నీమధ్య బెంగళూరులో గ్రాండ్ సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. అదే టైంలో అయ్యగారు అఖిల్ కూడా కనిపించాడు. కాకపోతే చేతికి కట్టుతో కనిపించడంతో గాయం విషయం బయటపడింది. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) అయితే అఖిల్.. గతేడాది 'ఏజెంట్' మూవీతో వచ్చాడు. ఘోరమైన డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే యువీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా అని అప్పట్లో అన్నారు. ఇది నిజమో కాదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థనే. అలా అఖిల్‌కి ఆహ్వానం అంది ఉండొచ్చు. అలా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కనిపించి ఉండొచ్చు. ఇక గాయం విషయానికొస్తే.. బయటకు చెప్పకుండా అఖిల్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడేమో. ఈ క్రమంలోనే గాయమై ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. చేతికి కట్టు చూస్తే పెద్ద గాయంలానే కనిపిస్తుంది. మరి ఎప్పుడైందో ఏమో? (ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్) -
Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంక్రాంతి హడావుడి గట్టిగా నడుస్తోంది. మరోవైపు పండగ బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ కాగా, చాలామందికి 'హనుమాన్' గట్టిగా నచ్చేసింది. దీని తర్వాత 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామి రంగ' చూస్తున్నారు. వీటితోపాటే డిసెంబరు చివర్లో వచ్చిన 'సలార్' కూడా ఇంకా థియేటర్లలో అక్కడక్కడా స్క్రీన్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్ 'సలార్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా? (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) 'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలైతే చేస్తున్నాడే గానీ సరైన హిట్ అయితే పడలేదు. దీంతో అందరూ 'సలార్'పై అంచనాలు బాగా పెట్టుకున్నారు. వాటిని అందుకోవడంలో కాస్త తడబడింది గానీ ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్ రన్ పూర్తయ్యేటప్పటికి రూ.800 కోట్ల మార్క్ దాటేయొచ్చు. ఇకపోతే 'సలార్' డిజిటల్ హక్కుల్ని ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సంక్రాంతి పండగ సందర్భంగా మరోసారి ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాత అనే అగ్రిమెంట్ ప్రకారం ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ లోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఈ తేదీకి కుదరకపోతే ఫిబ్రవరి 9న ఓటీటీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరో వారంలో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?) The people of Khansaar can begin their celebrations. Their Salaar has returned to his kingdom.👑#Salaar is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/iSuNbKHjNv — Netflix India South (@Netflix_INSouth) January 15, 2024 -
ఆ గుడిలో స్పెషల్ పూజలు చేసిన హీరో ప్రభాస్.. ఎందుకో తెలుసా?
మన డార్లింగ్ ప్రభాస్ చాలారోజుల తర్వాత బయట కనిపించాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ దర్శనమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందరూ ఫస్ట్ షాకయ్యారు. ఎందుకంటే అసలు బయటే పెద్దగా కనిపించని హీరో ప్రభాస్.. ఇలా దైవసన్నిధిలో ప్రత్యక్షమయ్యాడేంటా అనుకున్నరు. కానీ దీని వెనక ఓ కారణముంది. ఇంతకీ అదేంటో తెలుసా? (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ) హీరో ప్రభాస్.. 20 రోజుల ముందు 'సలార్' సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. హిట్ కొట్టాడు. అయితే ప్రమోషన్ కూడా ఒక్క ఇంటర్వ్యూతో సరిపెట్టేశారు. ఇది తప్పితే ప్రభాస్ పెద్దగా కనిపించలేదు. మధ్యలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు కానీ ఒకటో రెండో ప్రభాస్ ఫొటోలు బయటకొచ్చేసరికి ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. తాజాగా 'సలార్' గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రే ఇది జరగనుంది. ఈ క్రమంలోనే కర్ణాటక వెళ్లిన ప్రభాస్.. మంగళూరులోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయానికి వెళ్లాడు. వైట్ క్యాప్, మాస్క్ ధరించిన ప్రభాస్.. 'సలార్' ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్తో కలిసి గుడికి వెళ్లాడు. అలానే స్పెషల్ పూజాలు కూడా చేయించాడు. 'సలార్' సినిమా సక్సెస్ అయినందుకే ఈ పూజలు చేయించారన తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రభాస్.. దైవభక్తి సంగతి అందరికీ తెలిసింది. ఇకపోతే ప్రభాస్ 'కల్కి' మూవీ రిలీజ్ తేదీని తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది మే 9న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు పోస్టర్‌తో సహా అనౌన్స్ చేశారు. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) . #Prabhas @ Kateel Temple. He walked a lot may divine listens to him & bestow him whatever his desires are 🤲♥️ pic.twitter.com/uZ6w5By1Xg — Ace in Frame-Prabhas (@pubzudarlingye) January 12, 2024 May the force be with u always ! .#Prabhas 🤲 pic.twitter.com/luGV7WOxNv — Ace in Frame-Prabhas (@pubzudarlingye) January 12, 2024 -
సలార్ కలెక్షన్స్.. మరో నంబర్‌కు రీచ్ అయిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను క్రియేట్ చేసింది. గతేడాది వచ్చిన సినిమాల్లో అత్యధికంగా వసూళ్ల వర్షం కురిపించింది. విడుదలైన 18 రోజుల్లో ప్రపంచవ్యప్తంగా ఈ సినిమా రూ.700 కోట్ల మార్క్‌ను దాటినట్లు ప్రముఖ సంస్థ Sacnilk గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా భారత్‌లో రూ. 400 కోట్ల మార్క్‌ను చేరుకున్నట్లు పేర్కొంది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్లో డంకీ సినిమాతో పోటీగా బరిలోకి దిగింది. దీంతో అక్కడ కొంతమేరకు థియేటర్ల కొరత ఏర్పడింది. అంతేకాకుండా కార్పొరేట్ బుకింగ్స్ పేరుతో కొందరు సలార్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన సలార్ మూవీ.. ఇక ఇప్పుడు స్పెయిన్, జపాన్‌లోనూ రిలీజ్ కానుంది. స్పానిష్ భాషలో లాటిన్ అమెరికాలో మార్చి 7న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. సినిమా విడుదలయ్యి మూడు వారాలు అయినా సక్సెస్‌ఫుల్‌గా చాలా థియేటర్లలో సలార్ రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సలార్ సక్సెస్‌ను తాజాగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మైత్రి మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ కార్యాలయంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ సందడి చేశారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Salaar WW Box Office #Prabhas ' Salaar is racing towards ₹7️⃣0️⃣0️⃣ cr club. Day 1 - ₹ 176.52 cr Day 2 - ₹ 101.39 cr Day 3 - ₹ 95.24 cr Day 4 - ₹ 76.91 cr Day 5 -… pic.twitter.com/2XPEPGQHWp — Manobala Vijayabalan (@ManobalaV) January 8, 2024 The blockbuster success calls for a BLOCKBUSTER CELEBRATION! 💥#SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG #HombaleMusic @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/c3knzwB4vK — Prithviraj Sukumaran (@PrithviOfficial) January 8, 2024 -
సలార్ 1000 కోట్లు కొట్టేదెప్పుడు..?
-
సలార్ కి 1000 కోట్లు కష్టమే..
-
ప్రమాదంలో 'సలార్' నటికి తీవ్రగాయాలు.. వీడియో వైరల్!
'సలార్' నటికి యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ముఖమంతా రక్తంతా నిండిపోయింది. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అసలేం జరిగిందా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ ప్రమాదం ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగింది? (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) 'సలార్' సినిమాలో ఓ ఫైట్ సీన్ బాగా హైలైట్ అయింది. చిన్నపిల్లపై ఓ విలన్ బలత్కారం చేయబోతే హీరో వచ్చి కాపాడుతాడు. మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఉండే ఈ యాక్షన్ సన్నివేశం బాగా హైలైట్ అయింది. ఈ సీన్లో విలన్ పక్కన కళ్లద్దాలు పెట్టుకుని ఓ ఆంటీ యాక్ట్ చేసింది. ఆమె పేరు పూజా విశ్వేశ్వర్. ఈమెది వైజాగ్. తాజాగా ఈ నటి.. వైజాగ్‌లోని అనకాపల్లి హైవేపై వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి డివైడర్ని ఢీకొట్టింది. దీంతో ఈమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఈమెని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె త్వరగా కోలుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ హీరో మూవీ) View this post on Instagram A post shared by Tag Telugu (@tag.telugu) -
Ramachandra Raju-Jeest : తిరుమలలో కేజీఎఫ్ విలన్, బెంగాలీ స్టార్ నటుడు సందడి (ఫోటోలు)
-
రవి బస్రూర్ పేరు వెనుక కన్నీళ్లు తెప్పించే స్టోరీ
పాన్ ఇండియా రేంజ్లో రవి బస్రూర్ పేరు కేజీఎఫ్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రభాస్ 'సలార్' సినిమాతో మళ్లీ దేశవ్యాప్తంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' సినిమా బాలీవుడ్లో కూడా సూపర్ హిట్‌తో దూసుకుపోతుంది. ఇందులో రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు మాత్రమే కాదు, మాస్ సినిమాలకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని కూడా ఆయన అందించారు. బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా తమ సినిమాల కోసం రవి బస్రూర్ హంటింగ్ బీజీఎమ్ కోసం తహతహలాడుతున్నారు. ఆకలితో జీవనం.. రవి బస్రూర్ నేపథ్యం రవి బస్రూర్ తండ్రి గ్రామంలో కొలిమి నడుపుతున్నాడు. రవి కూడా తండ్రి దగ్గర కొలిమి పని చేస్తూ ఉండేవాడు. కానీ సంగీత రంగంలో ఏదైనా సాధించాలనే అచంచలమైన సంకల్పం అప్పటికే అతనిలో ఉండేది. కానీ ఆర్థిక స్థోమత అడ్డొచ్చి చాలా రోజుల పాటు తండ్రి వద్దే పని చేస్తూ ఉండేవాడు. ప్రస్తుతం గొప్ప సంగీత దర్శకుడిగా అయిన తర్వాత తాజాగా కన్నడ సరిగమప సీజన్ 10కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు.ఆ సమయంలో తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించాడు. సరిగమప షోలో రవి బస్రూర్ తన జీవితాన్ని మార్చేసిన సంఘటనను వివరించాడు. 'సంగీత ప్రపంచంలో తానేంటో నిరూపించుకోవాలని ఇంటి నుంచి వచ్చేశాను. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు.. అప్పటికే మూడు నాలుగు రోజులు భోజనం చేయలేదు.. నీళ్లు తాగుతూనే గడిపేశాను... కానీ నా జేబులో ఒక లిస్ట్ ఉంది.. ఏ రోజు ఏ గుడిలో ఎలాంటి ప్రసాదం ఇస్తారో రాసి పెట్టుకున్నాను. ఆ సమయంలో నేను సమయానికి వెళ్ళలేదు, నాకు ప్రసాదం లభించదు.' అని ఆ రోజు సంఘటనను గుర్తుచేసుకున్నాడు. 'దేవుడా, నా పరిస్థితి ఏమిటి..? అని నా మదిలో చాలా ప్రశ్నలే మొదలయ్యాయి. అప్పుడు ఒక పెద్దాయన నన్ను చూశాడు. అతని పేరు కామత్. నన్ను బెంగళూరులోని ఎవెన్యూ రోడ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ నన్ను ఒక దుకాణానికి తీసుకెళ్లి ఇతను ఇత్తడి, బంగారు వస్తువుల తయారి వంటి అన్ని పనులు చేస్తాడని యజమానికి పరిచయం చేశాడు .కానీ ఇతనికి సంగీతం అంటే పిచ్చి. ఎప్పుడూ చూడే అదే పనిలో ఉంటాడని తెలిపాడు. పనిలో పెట్టుకోమని కామత్ చెప్పడం.. వెంటనే అతను ఓకే చేయడం జరిగిపోయాయి. అతను ముందే చెప్పాడు.. నేను ఈ రేంజ్లో ఉంటానని కానీ నేను ఎలాంటి పని చేయనని చెప్పాను.. అప్పుడు అక్కడ ఉన్న యజమాని నాకు రూ. 5 ఇచ్చి ఏదైనా తిని రమ్మన్నాడు. అప్పుడు నన్ను చూసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావని చెప్పాడు. భవిష్యత్‌లో అతన్ని చూడటానికి 5 నెలలు అపాయింట్మెంట్ కావాలి. అంతలా అతని రేంజ్ పెరిగిపోతుందని చెప్పాడు. కానీ ఆయన మాటలు నాకు నమ్మకంగా లేవు.. ఇలా చెప్పేవాళ్ళు చాలా మందిని చూస్తున్నాను. నాకు సంగీతం మాత్రమే కావాలని చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి మీకు ఏమి కావాలి అని అడిగాడు, నాకు కీబోర్డ్ కావాలి, నాకు డబ్బు ఇస్తావా అని చెప్పాను, అతను ఎంత కావాలి అని అడిగాడు. నేను. 35 వేలు అన్నాను. క్షణం ఆలోచించకుండా వెంటనే ఇచ్చాడు.. ఆయనెవరో నాకు తెలియదు.. ఆ సమయంలో నేను, కామత్ ఇద్దరం షాక్ అయ్యాము. ఈ డబ్బు తిరిగివ్వకు. కీబోర్డ్ తీసుకో.ఈ 35వేలకు పని ఇస్తాను, పని చేసి చెల్లించు అని చెప్పాడు. ఆ సాయం చేసిన వ్యక్తి పేరు రవి. అప్పటి నుంచి నా పేరు తొలగించి అతని పేరును నా ఊరు పేరుతో పాటు ఉంచాను. అలా రవి బస్రూర్ వెలుగులోకి వచ్చింది. నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అతనే.. అతనికి క్రెడిట్ ఇవ్వడానికే నా పేరును మార్చుకున్నాను. నా అసలు పేరు కిరణ్.. కానీ రవి బస్రూర్ అని పిలుస్తేనే నాకు సంతోషం.' అని ఆయన చెప్పాడు. -
అక్కడ రిలీజ్ కి సిద్ధమవుతున్న సలార్
-
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అంటూ ప్రభాస్ పోస్ట్
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె ఒకరు. భారతదేశంలోనే టాప్ హీరోయిన్గా ఆమె కొనసాగుతుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించి ప్రపంచానికి తానేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో వ్యాఖ్యాతగా మెరిసింది. ఇలా తన జీవితంలో ఎన్నో విజయాలను అందకున్న ఈ బ్యూటీ నేడు (జనవరి 5) 38వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమ, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా హీరో ప్రభాస్ కూడా ఆమెకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీపికను 'అత్యంత అందమైన నటి' అని ప్రభాస్ పేర్కొన్నాడు. భవిష్యత్తు రోజులు అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. వీరిద్దరూ కలిసి సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ ప్రధానంగా ఇందులో నటించారు. ఈ చిత్రం ప్రతిష్టాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)లో కూడా ప్రదర్శించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్, దీపికా అభిమానులు కొత్త సినిమాపై చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'సలార్' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బర్త్ డే గర్ల్ దీపికా పదుకొనే నటించిన ఫైటర్ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. హృతిక్ రోషన్ తో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్న 'ఫైటర్' ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్‌తో కూడా 'ది ఇంటర్న్' ప్రాజెక్ట్‌పై దీపిక సంతకం చేసింది. ఇలా ఈ బ్యూటీ చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. -
సలార్ మేకర్స్ బిగ్ ప్లాన్.. అక్కడ కూడా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతుండడంతో విదేశీ భాషల్లోనూ సలార్ రిలీజ్ చేయనునట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని స్పానిష్ భాషలో రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని స్పానిష్ భాషలో రాస్తూ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దీంతో సలార్ సీజ్ఫైర్ పార్ట్-1 మార్చి 7న లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల కానుంది. విదేశాల్లోనూ తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ కావడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. #SalaarCeaseFire se estrenará en América Latina el 7 de marzo de 2024, en español, lanzado por @Cinepolis. ¡Prepárate para la acción épica! 💥#SalaarCeaseFire is releasing in Latin America on 7th March 2024, in 𝐒𝐩𝐚𝐧𝐢𝐬𝐡.@IndiaCinepolis#Salaar #Prabhas #PrashanthNeel… pic.twitter.com/B5wV9BVmuM — Hombale Films (@hombalefilms) January 5, 2024 -
జైలర్, బాహుబలి రికార్డ్స్‌ను కొట్టేసిన సలార్ కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా సలార్ అన్నీ థియేటర్లలో సందడి చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ మువీ బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.650 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సౌత్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా మొదటి వారాంతం తర్వాత కలెక్షన్స్ పరంగా కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ కాస్త పుంజుకుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 'లియో' సినిమా మొత్తం కలెక్షన్లను సలార్ అధిగమించింది. ప్రభాస్ 'బాహుబలి: ది బిగినింగ్' రికార్డును బద్దలు కొట్టేందుకు కూడా సలార్ సిద్ధమైంది. అలాగే తలైవా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా రికార్డు కూడా మరో రెండు రోజుల్లో బద్దలయ్యే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం, సలార్ 11వ రోజు (సోమవారం) రూ.15.5 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టోటల్ కలెక్షన్ రూ.400 కోట్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 650 కోట్ల రూపాయలను రాబట్టింది. బాహుబలి పార్ట్ వన్ సినిమా టోటల్ కలెక్షన్ 650 కోట్లు. ప్రభాస్ తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే సూపర్ స్టార్ విజయ్ 'లియో' చిత్రాన్ని 'సాలార్' అధిగమించింది. లియో ప్రపంచవ్యాప్తంగా 605 కోట్ల రూపాయలు సంపాదించింది. అలాగే రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’ మొత్తం కలెక్షన్స్ దాదాపు రూ. 655 కోట్ల రూపాయలు. మరో రెండు రోజుల్లో జైలర్, బాహుబలి రికార్డ్స్‌ను సలార్ బీట్ చేయడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు. ఖాన్సార్ అనే కల్పిత ప్రపంచంలో జరిగే స్నేహితుల కథ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఈ చిత్రానికి డంకీ పోటీ లేకపోతే బాలీవుడ్లో ఇంకాస్త మెరుగ్గా ఆడేది కానీ కుదరలేదు. అంతేకాకుండా కార్పోరేట్ బుకింగ్స్ పేరుతో కూడా సలార్ కలెక్షన్స్ కొంతమేరకు దెబ్బతిన్నాయి. ఏదేమైనా సలార్ పార్ట్-2 మీద భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు. -
కేవలం పది రోజుల్లోనే అన్ని కోట్లు రాబట్టిన సలార్..
కంటెంట్ బాగుంటే హిట్ టాక్ దానంతటదే వస్తుంది. అదే కంటెంట్‌కు కటౌట్ యాడ్ అయితే కలెక్షన్ల మోత మోగాల్సిందే! సలార్ విషయంలో ముమ్మాటికీ అదే జరిగింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.500 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా ఈ మూవీ ఇప్పటివరకు ఎంత రాబట్టిందో తెలియజేస్తూ ఓ పోస్టర్ వదిలింది చిత్రయూనిట్. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.625 కోట్లు వసూలు చేసిందని వెల్లడించింది. కేవలం 10 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను అవలీలగా దాటేసి అరుదైన ఘనత సొంతం చేసుకుంది సలార్. ఇక బాలీవుడ్లో షారుక్ ఖాన్ డంకీ మూవీ రిలీజవగా ఆ పోటీని తట్టుకుని అక్కడ కూడా మంచి కలెక్షన్సే రాబట్టింది. మరి రానున్న రోజుల్లో సలార్ ఇంకా ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి! 𝑲𝒉𝒂𝒏𝒔𝒂𝒂𝒓… 𝑰’𝒎 𝑺𝒐𝒓𝒓𝒚! Unstoppable #SalaarCeaseFire has crossed a massive ₹ 𝟔𝟐𝟓 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 💥#SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/JFgqX99Ojv — Salaar (@SalaarTheSaga) January 1, 2024 చదవండి: రూ.75 కోట్లు పెట్టి పాత బంగ్లా కొన్న 'పఠాన్' విలన్ -
సలార్ రూట్ లోనే గుంటూరు కారం..కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ !
-
అక్కడ 'సలార్'ని మించి కలెక్షన్స్ సాధిస్తున్న చిన్న సినిమా!
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ప్రస్తుతం రూ.600 కోట్లకు చేరువలో ఉన్న ఈ చిత్రం.. లాంగ్ రన్లో మరో రూ.100 కోట్లు దక్కించుకునే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. అయితే ఓ చోట మాత్రం 'సలార్' కంటే ఓ ప్రాంతీయ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది. 'సలార్' సినిమాని తీసింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్' సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ప్రభాస్‌తో మాస్ సినిమా తీశాడు. అయితే ఇది 2014లో తన తీసిన ఫస్ట్ మూవీ 'ఉగ్రమ్'కి రీమేక్ అని సరిగ్గా రిలీజ్‌కి ఓ రోజు ముందు చెప్పాడు. మిగతా భాషా ప్రేక్షకులు 'ఉగ్రమ్' చూడలేదు కానీ కన్నడ ఆడియెన్స్ చాలాసార్లు చూసేశారు. (ఇదీ చదవండి: 'మంగళవారం' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం) ఈ క్రమంలోనే కర్ణాటకలో 'సలార్' వసూళ్లు ఓ మాదిరిగానే వచ్చాయి. ఇప్పటివరకు రూ.35.7 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. అదే టైంలో రీసెంట్గా డిసెంబరు 29న కన్నడ స్టార్ హీరో దర్శన్ 'కాటేరా' రిలీజైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.37 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మిగతా చోట్ల 'సలార్' వసూళ్ల మేనియా గట్టిగా ఉన్నప్పటికీ కన్నడలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. ఈ కారణంగానే 'కాటేరా'కు ప్లస్ అయింది. అలా కాకుంటే మాత్రం ప్రభాస్ సినిమా ముందు దర్శన్ అస్సలు నిలబడలేకపోయేవాడు. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
సలార్ VS డంకీ.. మొదటిసారి రియాక్ట్ అయిన ప్రశాంత్ నీల్
'ఉగ్రం' సినిమాతో దర్శకుడిగా 2014లో కెరీర్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘ఉగ్రం’ తర్వాత మూడు సినిమాలే చేశాడు. కానీ ఆయన సినిమాలకు ఆదరణ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కేజీఎఫ్ 1, 2 సినిమాల ద్వారా ఇండియన్ సినిమా మార్కెట్లో ఫేమస్ డైరెక్టర్‌గా పాపులారిటీ పెంచుకున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యాక్షన్ ప్యాక్డ్ మూవీ సలార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అదరగొట్టేస్తున్నాడు. 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ తెరకెక్కించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ తదితరులు నటించిన సలార్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ విజయం పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు.. తన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సలార్ వర్సెస్ డంకీ ఫైట్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఇద్దరు టాప్ హీరోల సినిమాల మధ్య గొడవలు పడుతుంటారు. 'నేను అలాంటి వాటిని ప్రోత్సహించను. అలాంటివి వినడానికి కూడా ఇష్టపడను. ఇలాంటి ట్రెండ్ సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచిది కాదు. కళాకారులు ఒకరితో ఒకరు పోటీపడరు. అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ‘సలార్’, ‘డంకీ’ల మధ్య చాలా మంది అనుకుంటున్నట్లు ప్రతికూల వాతావరణం ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. డంకీ నిర్మాతలు కూడా మనలాగే పాజిటివ్‌గా ఆలోచించాలి. మనమందరం ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఉండే క్రికెట్ మ్యాచ్ కాదు.' అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బాలీవుడ్లో సలార్ చిత్రానికి థియేటర్లు లేకుండా చేసిన కొందరు రివ్యూలు కూడా నెగటివ్‌గానే చెప్పడం జరిగింది. సలార్ సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేస్తే బాగుంటుందని అలా చేసి ఉంటే మరింత వసూళ్లు వచ్చేవని కూడా వచ్చే ప్రశ్నలకు కూడా ఆయన ఇలా చెప్పారు. 'డంకీతో విడుదల కాకుండా మా సినిమా మాత్రమే విడుదలై ఉంటే ఇలాంటి వార్తలు వచ్చేవి కావు.' అని ప్రశాంత్ నీల్ అన్నారు. సలార్ చిత్రం డిసెంబర్ 22న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్ల మార్క్‌ను దాటింది. -
'ఆ కుర్చీని ఇస్తానని దేవా మాటిచ్చాడు'.. సలార్ పవర్ఫుల్ డైలాగ్ ప్రోమో!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈనెల 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రెండో వీక్‌లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సలార్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?) తాజాగా ఈ చిత్రంలోన ఓ డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సలార్- సీజ్ఫైర్ చిత్రంలో క్లైమాక్స్‌లో శ్రుతిహాసన్ చెప్పే ఈ డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా చూడని వారు డైలాగ్ ప్రోమోను చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. -
కల్కి రిలీజ్ ఆరోజే! ప్రభాస్ ప్లానింగ్ అదుర్స్..!
-
సలార్ కొల్లగొట్టిన రికార్డ్స్ ఇవే..!
-
'సలార్' రూట్లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?
'గుంటూరు కారం' పాట ఒక్కసారిగా కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది. 'కుర్చీ మడతపెట్టి' పాట ప్రోమోని రిలీజ్ చేయగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులకు ఈ పాటలోని మాస్ నచ్చేయగా.. లిరిక్స్‌పై సగటు మూవీ లవర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. మహేశ్-త్రివిక్రమ్ అసలు ఈ సాంగ్ ఎలా ఒప్పుకొన్నారా అని డౌట్ పడుతున్నారు. ఇలాంటి టైంలో మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. మహేశ్ బాబు మాస్ మూవీ అంటే చాలామందికి 'పోకిరి'నే గుర్తొస్తుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేస్తున్నప్పటికీ.. వాటిలో మహేశ్ కూల్ అండ్ క్లాస్ లుక్‌తోనే కనిపిస్తున్నాడు. ఈ మూవీస్ హిట్ అవుతున్నాయి, డబ్బులు కూడా వస్తున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం మాస్ మసాలా మూవీస్ మహేశ్ చేయాలని తెగ ఆరాటపడ్డారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు 'గుంటూరు కారం' చేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) ప్లస్సో మైనస్సో 'గుంటూరు కారం'పై అంచనాలు పెరుగుతున్నాయి. అభిమానులు కూడా మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు సర్ప్రైజ్ ఇచ్చేలా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మహేశ్ కొత్త మూవీకి బెన్ఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారట. 'సలార్'కి వేసినట్లు అర్థరాత్రి ఒంటి గంటకు తొలి షో పడేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే ఉదయం 4 గంటలకైనా సరే షో పడుతుందని అంటున్నారు. 'గుంటూరు కారం' బెన్ఫిట్ షో ప్లాన్ బాగుంది కానీ.. ఈ సినిమా రిలీజ్ అవుతున్న జనవరి 12నే 'హనుమాన్' అనే స్ట్రెయిట్ తెలుగు సినిమా, ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' అనే డబ్బింగ్ మూవీ కూడా థియేటర్లలోకి రానున్నాయి. విడుదల తేదీలు కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ రెండు చిత్రాల వల్ల మహేశ్ సినిమా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందా? అని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తపై దాడి చేసిన యువకుడు) -
500 కోట్ల క్లబ్ లో చేరిన సలార్..
-
రూ.500కోట్ల క్లబ్లో సలార్.. మరో వంద కోట్లు వస్తే
ప్రభాస్ నటించిన సలార్ కలెక్షన్స్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ నెల 22న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో షారుక్ ఖాన్ డంకీ చిత్రాన్ని తట్టుకుని అక్కడ కూడా భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. సినిమా విడుదలయ్యి ఇప్పటికి మొదటి వారం పూర్తి కాకుండానే రూ.500 కోట్ల మార్క్‌ను సలార్ అందుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే సలార్ రూ.1000 కోట్ల టార్గెట్‌ను కూడా రీచ్ అవుతుందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో వంద కోట్లు వస్తే సేఫ్ మార్క్ ప్రపంచవ్యాప్తంగా సలార్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. 'బాహుబలి'ని మించి కొన్ని ఏరియాల్లో టికెట్ రేట్లు ఉండటం విశేషం. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ. 400 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అంటే టార్గెట్‌ను అందుకోవాలంటే సలార్ ఫుల్ రన్లో రూ. 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉందని సమాచారం. ఇప్పటికే సలార్ ఖాతాలో రూ. 500 కోట్లు వచ్చేశాయి. మరో రూ. 100 కోట్లు సలార్‌కు వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్- ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం సలార్.. రెండు పార్టులుగా రానున్న ఈ చిత్రం డిసెంబర్ 22న మొదటి భాగం విడుదలైంది. ఈ మూవీలో ప్రభాస్ మాస్ యాక్షన్ సీన్స్‌తో పాటు భారీ ఎలివేషన్స్ అభిమానులను మెప్పిస్తున్నాయి. దీని కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్‌తో థియేటర్లకు వెళ్తున్నారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
సలార్2 లో అదిరిపోనున్న శ్రీయ రెడ్డి క్యారెక్టర్..