‘సలార్‌’ ఆల్‌ సెట్‌... గో | Prabhas Salaar 2 Shauryaanga Parvam Shooting will Start Soon | Sakshi
Sakshi News home page

‘సలార్‌’ ఆల్‌ సెట్‌... గో

Published Fri, May 3 2024 12:41 AM | Last Updated on Fri, May 3 2024 5:48 AM

Prabhas Salaar 2 Shauryaanga Parvam Shooting will Start Soon

‘సలార్‌’ సెట్స్‌లోకి తిరిగి జాయిన్‌ అయ్యేందుకు ప్రభాస్‌ సై అన్నారట. హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘సలార్‌’. ఈ చిత్రంలోని తొలి భాగం ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ గత ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ‘సలార్‌’లోని మలి భాగం ‘సలార్‌: శౌర్యాంగపర్వం’ చిత్రీకరణను వెంటనే మొదలు పెట్టాలని ప్రభాస్, ప్రశాంత్‌ నీల్‌ భావించారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ను ప్రశాంత్‌ నీల్‌ పూర్తి చేశారట. ఇక ఆల్‌ సెట్‌... గో అంటూ షూటింగ్‌ను ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌లో మొదలు పెట్టనున్నారని సమాచారం. ఓ పది రోజుల పాటు షూటింగ్‌ జరిపి, ఆ తర్వాత బెంగళూరులో చిత్రీకరణను ప్లాన్‌ చేశారట, వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేసి, కుదిరితే ఈ ఏడాది చివర్లోనే క్రిస్మస్‌ సందర్భంగా రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా.

జగపతిబాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్, బాబీ సింహా, శ్రుతీహాసన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాను విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ చిత్రం జపాన్‌లో జూలైలో విడుదల కానుంది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలు జపాన్‌ బాక్సాఫీస్‌ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ సినిమాను కూడా జపాన్‌లో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement