shooting started
-
జాలీ రైడ్
బాలీవుడ్ హిట్ మూవీ ఫ్రాంచైజీలో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘జాలీ ఎల్ఎల్బీ’, ‘జాలీ ఎల్ఎల్బీ 2’ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి థర్డ్ పార్ట్ ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమా రానుంది. ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీలోని తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన సుభాష్ కపూరే మూడో భాగాన్నీ తెరకెక్కిస్తున్నారు.అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో సౌరభ్ శుక్లా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ‘‘ఒరిజినల్ ఎవరో, డూప్లికేట్ ఎవరో తెలియడం లేదు. కానీ ఈ సినిమా మాత్రం ఓ జాలీ రైడ్‌గా ఉండబోతోంది’’ అంటూ ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమా షూటింగ్లో తాను పాల్గొంటున్నట్లుగా వీడియోను షేర్ చేశారు అక్షయ్ కుమార్. నకిలీ లాయర్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. -
‘సలార్’ ఆల్ సెట్... గో
‘సలార్’ సెట్స్‌లోకి తిరిగి జాయిన్ అయ్యేందుకు ప్రభాస్ సై అన్నారట. హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రంలోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ‘సలార్’లోని మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ చిత్రీకరణను వెంటనే మొదలు పెట్టాలని ప్రభాస్, ప్రశాంత్ నీల్ భావించారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను ప్రశాంత్ నీల్ పూర్తి చేశారట. ఇక ఆల్ సెట్... గో అంటూ షూటింగ్‌ను ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌లో మొదలు పెట్టనున్నారని సమాచారం. ఓ పది రోజుల పాటు షూటింగ్ జరిపి, ఆ తర్వాత బెంగళూరులో చిత్రీకరణను ప్లాన్ చేశారట, వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేసి, కుదిరితే ఈ ఏడాది చివర్లోనే క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా.జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహా, శ్రుతీహాసన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రం జపాన్‌లో జూలైలో విడుదల కానుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు జపాన్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో ‘సలార్: సీజ్ఫైర్’ సినిమాను కూడా జపాన్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. -
సలార్ 'శౌర్యంగపర్వం' యాక్షన్‌తో స్టార్ట్
‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ షూటింగ్‌కు రెడీ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో వెంటనే ‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో ఏప్రిల్‌లో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది. ముందుగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారట ప్రశాంత్ నీల్. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 చివర్లో విడుదల కానుందని సమాచారం. -
విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మొదలైన సిగ్గు
జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘సిగ్గు’ ఆదివారం ప్రారంభం అయింది. భీమవరం టాకీస్ పతాకంపై టి. రామసత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు కె.విజయేంద్ర ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ వీవీ వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాతలు సి.కల్యాణ్, దామోదర ప్రసాద్ స్క్రిప్ట్‌ను దర్శక–నిర్మాతలకు అందించారు. ‘‘చలంగారి నవల ‘సుశీల’ ఆధారంగా ‘సిగ్గు’ చేస్తున్నాను’’ అన్నారు నరసింహ నంది. ‘‘సి.కల్యాణ్‌గారి సపోర్ట్‌తో ముందుకు వెళ్తున్నాను’’ అన్నారు టి.రామసత్య నారాయణ. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, డైరెక్టర్ రేలంగి నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: సుక్కు, కెమెరా: అబ్బూరి ఈషే. -
రామ్ చరణ్.. చిన్న బ్రేక్!
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘గేమ్‌చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే ఈ షెడ్యూల్లో చిన్న విరామం ఇచ్చిన యూనిట్ తిరిగి షూటింగ్‌ని ప్రారంభించినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. రామ్‌చరణ్‌తో పాటు కీలక తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట శంకర్. జయరాం, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
పాన్ ఇండియా రేంజ్లో 'జూదం' అడేందుకు రెడీ అవుతున్న వరుణ్ తేజ్
వరుణ్ తేజ్, మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరో హీరోయిన్లుగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘మట్కా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మోహన్ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది. తొలి సీన్‌కి దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు సురేష్‌బాబు, విజయేందర్ రెడ్డి, సీవీఎం కలిసి దర్శకుడు కరుణ కుమార్‌కు స్క్రిప్ట్ అందించగా, దర్శకుడు హరీష్ శంకర్ టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. ‘‘వరుణ్‌కు ‘మట్కా’ తొలి పాన్ ఇండియన్ మూవీ. ‘మట్కా’ అంటే ఒక రకమైన జూదం. 1958–1982 మధ్య కాలంలో దేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారు. నాటి వైజాగ్‌ను తలపించేలా ప్రొడక్షన్ డిజైనర్ ఆశిష్ తేజ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో వింటేజ్ సెట్ వర్క్ జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, కెమెరా: ప్రియా సేత్. -
జీవితంతో బాబూజి
భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘బాబూజి’. దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందు తున్న ఈ చిత్రం షూటింగ్ గుంటూరులో జరుగుతోంది. కాగా అదే నగరానికి వెళ్లిన జగ్జీవన్‌రామ్ కుమార్తె, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఈ చిత్రంలో జగ్జీవన్‌రామ్ పాత్రధారి మిలటరీ ప్రసాద్‌పై చిత్రీకరిస్తున్న సీన్‌కి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ – ‘‘మహాత్మాగాంధీ ఆహ్వానంతో స్వాతంత్య్ర ఉద్యమంలోకి వచ్చిన జగ్జీవన్‌రామ్ మరెందరినో ఆ ఉద్యమంలోకి తీసుకురావటం, జైలు శిక్ష అనుభవించడం వంటివాటిని ‘బాబూజి’లో తప్పనిసరిగా చూపించాలని మీరాకుమార్ సూచించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, 2024 జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. -
‘దిల్వాలా’ సినిమాకు క్లాప్ ఇచ్చిన డైరెక్టర్ వీవీ వినాయక్
నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి జంటగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ‘దిల్ వాలా’ సినిమా షురూ అయింది. నబీ షేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు అలీ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. హీరో ‘అల్లరి’ నరేష్ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కి అందించారు. ‘‘మా నిర్మాతలు నబీ షేక్, తూము నర్సింహాగారు తొలి సినిమాగా ‘దిల్వాలా’ని నా దర్శకత్వంలో చేయడం హ్యాపీ. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు వీరభద్రం. ‘‘మొదటిసారి ‘దిల్వాలా’ లాంటి ఒక కమర్షియల్ సినిమా చేయబోతున్నా’’ అన్నారు నరేష్ అగస్త్య. ‘‘క్రైమ్ కామెడీ జోనర్లో ‘దిల్ వాలా’ ఉంటుంది’’ అన్నారు నబీ షేక్. రాజేంద్ర ప్రసాద్, దేవ్ గిల్, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: అనిత్. -
పగ, ప్రతీకారంతో త్రిష.. ఎందుకంటే ?
Trisha Upcoming Movie The Road With Debutant Director Arun Vaseegaran: ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు హీరోయిన్ త్రిష. అయితే ఆమె పగ, ప్రతీకారాలు ఎందుకు? ఎవరిపై? అనే సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది రోడ్’. వి.అరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి ‘ది రోడ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 22 సంవత్సరాల క్రితం మధురైలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మధురైలో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌ను దాదాపు 50 రోజులు మధురై లొకేషన్స్‌లోనే ప్లాన్ చేశారని తెలిసింది. సంతోష్ ప్రతాప్, షబ్బీర్, మీయా జార్జ్, వివేక్, ఎమ్ఎస్ భాస్కర్, వేలా రామ్మూర్తి ఇతర ముఖ్యతారాగణంగా నటిస్తున్న ‘ది రోడ్’ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన త్రిష, కానీ సంతోషంగా లేనంటూ ట్వీట్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన సుధీర్ బాబు
Sudheer Babu Next Film Directed By Harsha Vardhan Goes On Floors: సుధీర్‌బాబు కెరీర్లో 15వ సినిమాగా రాబోతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ షురూ అయ్యింది. నటుడు–దర్శకుడు హర్షవర్ధన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభం అంటూ చిత్రయూనిట్ ఓ వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. సుధీర్‌బాబు కోసం భిన్నమైన కథను రెడీ చేశారు హర్షవర్ధన్. ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తారు సుధీర్ బాబు. ఈ చిత్రంలో ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తున్నారాయన. ఈ తొలి షెడ్యూల్లో కీలక పాత్రధారులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా. -
గోపీచంద్-శ్రీవాస్ కాంబోలో మూడో సినిమా.. అంతకుమించి..
Hero Gopichand And Director Srivas New Movie Shooting Begun: ‘లక్ష్యం, లౌక్యం’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్లో మూడో సినిమాకి శ్రీకారం జరిగింది. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రాజకీయ, పారిశ్రామిక వేత్త టీజీ వెంకటేష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ ‘‘గోపీచంద్ కెరీర్లో 30వ సినిమా ఇది. భూపతి రాజా కథ మీద చాలా వర్క్ చేశాం. ‘లక్ష్యం, లౌక్యం’ సినిమాలను మించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘సంక్రాంతి పండగ తర్వాత మా సినిమా సెట్స్ మీదకు వెళుతుంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. గోపీచంద్ మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీ, హిలేరియస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది. మంచి కథకు మంచి ఆర్టిస్ట్‌లు దొరికారు’’ అని తెలిపారు. ఈ సినిమాకు కెమెరామేన్ వెట్రి పళనీ స్వామి, రచయిత భూపతి రాజా. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఇదీ చదవండి: వెబ్ సిరీస్‌లలోకి అడుగు పెట్టిన హీరోయిన్లు వీళ్లే.. -
చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్.. ఫిబ్రవరిలో షూటింగ్
Chiranjeevi Movie Shooting With Salman Khan: బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేరుగా ఓ తెలుగు చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ కీలక పాత్ర చేయనున్నారు. మోహన్ లాల్ నటించిన మలయాళ మూవీ ‘లూసీఫర్’కి రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ను తెరకెక్కిస్తున్నారు. ఈ ‘లూసీఫర్’లో పృథ్వీరాజ్ చేసిన కీలక పాత్రను తెలుగులో సల్మాన్ చేయనున్నట్లు సమాచారం. ‘అంతిమ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఈ హీరో ‘గాడ్‌ఫాదర్’లో నటించనున్నట్లు స్పష్టం చేశారు కూడా. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్‌లోకి ఎంట్రీ ఇస్తారట సల్మాన్ ఖాన్. చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్‌తో కూడా సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు సల్లూ భాయ్. అయితే ఈ సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే బాలీవుడ్ భాయిజాన్ లెక్కలేనన్నిసార్లు ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ అప్పీరెయన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటిస్తున్న 'పఠాన్'లోనూ, అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కొత్త చిత్రం 'లాల్ సింగ్ చద్దా'లోనూ అతిథి పాత్రలో అలరించనున్నాడు. ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'పై బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ప్రశంసలు.. -
టైసన్‌ను 'ఢీ' కొట్టేందుకు రెడీ అంటున్న లైగర్
Vijay Devarakonda And Mike Tyson Ready To Face To Face Fight For LIGER: హీరో విజయ్ దేవరకొండ, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఫేస్ టు ఫేస్ తలపడేందుకు సిద్ధం అయ్యారు. ఇది ‘లైగర్’ చిత్రం కోసమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్, టైసన్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ అమెరికాకు వెళ్లింది. ఈ సందర్భంగా విజయ్, టైసన్‌ల పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘మైక్ టైసన్‌తో కలిసి ఉన్న ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను.. అవి ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
‘క్యాలీఫ్లవర్’ షూటింగ్‌కు రెడీ అయిన సంపూ
‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాల ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ గా నటిస్తున్నారు. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌కి కొంచెం విరామం ఇచ్చిన చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలుపెట్టింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి, కథ: గోపీ కిరణ్, సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: ముజీర్ మాలిక్. -
ఆదిపురుష్ ఆరంభ్.. ప్రభాస్ సర్ప్రైజ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'ఆదిపురుష్' షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన డార్లింగ్.. టైటిల్ లోగోతో కూడిన 'ఆదిపురుష్' ఆరంభ్ అనే సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ రోజు (మంగళవారం) ముంబైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఇక తమ హీరో సినిమా నుంచి అప్డేట్ అందించి సర్ప్రైజ్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఆదిపురుష్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు. చదవండి: రాముడి తల్లిగా హేమ మాలిని? #Adipurush aarambh. #Prabhas @omraut #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @RETROPHILES1 pic.twitter.com/bCOKB49s12 — Prabhas (@PrabhasRaju) February 2, 2021 అంతేగాక సీతగా కృతీ సనన్ నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రభాస్ సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను మెల్లమెల్లగా పట్టాలెక్కిస్తున్నాడు. ఆయన నటిస్తున్న 'రాధేశ్యామ్' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో నెక్ట్స్ మూవీపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే 'సలార్' సెట్స్ మీదకు రాగా.. తాజాగా మరో బిగ్గెస్ట్ మూవీ ఆదిపురుష్ కూడా ప్రారంభించేశాడు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్!
అబుదాబి: సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన తాజాగా నటిస్తున్న‘సర్కారు వారి పాట’ ఎప్పుడేప్పుడు సెట్స్‌పై వెళుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు మైత్రీ మూవీస్ సర్ప్రైజ్ అందించింది. ఇవాళ దుబాయ్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైందంటూ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘ది యాక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీటర్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇక అది చూసిన మహేశ్ అభిమానులంత పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ‘సర్కారు వారి పాట’ పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తుండగా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ‘‘సర్కారు వారి పాట’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభమైంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబును డైరెక్ట్ చేయాలన్న ఇన్నేళ్ళ నా కల ఈ రోజు నిజమైంది. మహేష్ బాబుతో కలిసి పనిచేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. (చదవండి: ‘సర్కారు వారి పాట’ కోసం దుబాయ్ ఛలో) ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్‌గా ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇరవై రోజుల పాటు దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. ‘సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు. బ్యాంకింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం. కాగా మహేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్ మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు. అంతేగాక ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల. (చదవండి: మహేశ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా.. వీడియో వైరల్) The auction and the action begins 🎬 #SarkaruVaariPaataShuru 💥💥 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents#SarkaruVaariPaata 🔔 pic.twitter.com/Z75sPfWoi9 — 14 Reels Plus (@14ReelsPlus) January 25, 2021 -
రీసౌండ్ రీస్టార్ట్
సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రీసౌండ్’. రాశీ సింగ్ కథానాయిక. ఎస్.ఎస్. మురళీకృష్ణ దర్శకత్వంలో సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం పునః ప్రారంభమైంది. ‘‘ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. ‘రీసౌండ్’ టైటిల్ మాసీగా ఉండి ఆకట్టుకుంటోంది. మా సినిమా ఇప్పటివరకూ 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. తాజా షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
డ్యూటీ ముగిసింది
క్రిమినల్స్ అంతు చూడటానికి పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా మారారు సల్మాన్ ఖాన్. విజయవంతంగా డ్యూటీ పూర్తి చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాధే’. ‘మోస్ట్ వాంటెడ్ భాయ్’ అన్నది ఉపశీర్షిక. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాలో స్టయిలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు సల్మాన్. లాక్డౌన్ వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. ఇటీవలే ముంబైలో చిత్రీకరణ ప్రారంభించారు. అనుకున్న తేదీ కంటే చిత్రీకరణ ముగిసిందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో లేదా ఈద్ పండగకు థియేటర్స్‌లోకి తీసుకురావాలన్నది యూనిట్ ప్లాన్ అని తెలిసింది. -
ఓ ప్రేమ జంట జీవితం
నరసింహ నంది దర్శకత్వంలో అంతా కొత్తవారితో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ నెల 15న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్న సందర్భంగా నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘2011లో ‘1940లో ఒక గ్రామం’ చిత్రానికి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు, 3 నంది అవార్డులు అందుకున్నాను. 2013లో ‘కమలతో నా ప్రయాణం’ చిత్రానికి నంది అవార్డు వచ్చింది. 2016లో తీసిన ‘లజ్జ’ సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి పంపించాను. ఇటీవలే యూత్ కోసం ‘డిగ్రీ కాలేజ్’ అనే సినిమా తీశాను. తాజా చిత్రం కరోనా లాక్ డౌన్లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాల వల్ల ఒక ప్రేమ జంట జీవితం ఎలా చిన్నాభిన్నం అయింది? అనే కథాంశంతో ఉంటుంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: సుకుమార్. -
షూట్ స్టార్ట్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఆరు నెల్లల కోవిడ్ బ్రేక్ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. షూటింగ్ ప్రారంభించారు. అయితే ఇది సినిమా కోసం కాదు. ఓ కమర్షియల్ యాడ్ కోసం. సినిమాలతో పాటు బ్రాండ్ అడ్వటైజ్మెంట్లు ఎక్కువగా చేస్తుంటారు మహేశ్. రెండు రోజుల పాటు జరిగే ఈ యాడ్ చిత్రీకరణలో బుధవారం పాల్గొన్నారాయన. అలాగే మహేశ్ నటించనున్న ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
బ్యాక్ టు వర్క్
కరోనా వల్ల ఇండస్ట్రీలో ఆరు నెలలుగా పని మొత్తం స్తంభించిపోయింది. మెల్లిగా చిత్రీకరణలు ప్రారంభం అవుతున్నాయి. నేటి నుంచి నటుడు, నిర్మాత సందీప్ కిషన్ కూడా పని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇందులో సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడిగా నటించనున్నారు. అలాగే ఆయన నిర్మిస్తున్న ‘వివాహ భోజనంబు’ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం అవుతోంది. ఈ చిత్రం ముహూర్తం నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ప్రభుత్వం చెప్పిన గైడ్‌లైన్స్ అన్నీ పాటిస్తూ ఈ సినిమాల చిత్రీకరణలను జరపనున్నారు. -
మోదీ బయోపిక్ షూటింగ్ షురూ
సాక్షి, న్యూఢిల్లీ : వివేక్ ఓబెరాయ్ టైటిల్ రోల్లో రూపొందుతున్న ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ షూటింగ్ సోమవారం అహ్మదాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. సోషల్ మీడియాలో మోదీగా వివేక్ ఓబెరాయ్ కనిపించే ఫస్ట్‌లుక్ విడుదలైనప్పటి నుంచీ ఈ బయోపిక్‌పై క్రేజ్ నెలకొంది. అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ బయోపిక్ షూటింగ్ ప్రారంభమైందని, గుజరాత్‌లోని పలు లొకేషన్లలో చిత్రీకరణ కొనసాగుతుందని బాలీవుడ్ విశ్లేషకులు, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ మూవీలో వివేక్ ఓబెరాయ్‌తో పాటు బొమన్ ఇరానీ, దర్శన్ కుమార్ వంటి నటులు నటిస్తున్నారు. సుషేర్ ఓబెరాయ్, సందీప్ సింగ్‌లు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాకు ఒమంగ్ కుమార్ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. -
బార్డర్లో గోపీచంద్ పోరాటాలు!
పంతం సినిమాతో రీసెంట్గా పలకరించినా..గోపిచంద్‌కు సరైన హిట్ మాత్రం దొరకలేదు. లౌక్యం సినిమా తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్కొట్టలేకపోతున్నాడు. తాజాగా ఈ హీరో ఓ స్పై థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం జైసల్మీర్‌కు దగ్గర్లోని ఇండో-పాక్ బార్డర్ వద్ద షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ యాక్షన్ కొరియోగ్రాఫర్ సెల్వన్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. -
విశాల్ కొత్త చిత్రం ప్రారంభం
విశాల్ ‘అభిమన్యుడు’తో తిరుగులేని హిట్ కొట్టాడు. డబ్బింగ్ సినిమాగా రిలీజైనా కూడా.. ఒక స్ట్రెయిట్ సినిమాలా కలెక్షన్లను కొల్లగొట్టింది. డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో విజయం సాధించిన విశాల్.. పందెంకోడి 2తో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. విశాల్ పందెంకోడి2 షూటింగ్‌ను ఇటీవలె పూర్తి చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించేశాడు. తాజాగా తన తదుపరి చిత్రం షూటింగ్‌ను మొదలుపెట్టాడు. పూరి జగన్నాథ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘టెంపర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అయోగ్య’ అనే టైటిల్‌ను ఫిక్స్చేశారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించినట్లు విశాల్ ట్విటర్ ద్వారా తెలిపాడు. here we go.strtd my nxt film no.26 #AYOGYA dir by debutante #mohan music by @SamCSmusic starrin @RaashiKhanna @rparthiepan sir n #ksravikumar sir shoot fm 2day wit a formal Pooja.#Pongal2019.Dis ones close 2 my heart 4 the social cause it touchesupon.@FridayCinemaa @AntonyLRuben pic.twitter.com/3DiTDBfi6U — Vishal (@VishalKOfficial) 23 August 2018 -
షాబాద్‌లో ‘తెలంగాణ దేవుడు’ సందడి
షాబాద్(చేవెళ్ల) : షాబాద్ మండలంలో తెలంగాణ దేవుడు సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మ్యాక్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాతగా, హరీష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ షాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో జరుగుతోంది. 1969 నుంచి 2018 వరకు తెలంగాణ చరిత్రే సినిమా కథ. ఇందులో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ పాత్రలో సినీ హీరో సుమన్, చిన్నతనంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాత్రలో నిర్మాత కుమారుడు జీషాన్ ఉస్మాన్ నటిస్తున్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం, ప్రొఫెసర్ జయశంకర్ సార్, కేసీఆర్ పాత్రలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించేలా చిత్ర నిర్మాణం జరుగుతోందని నిర్మాత చెప్పారు. పోతుగల్ గ్రామంలో, ప్రభుత్వం పాఠశాలలో, గిరిజన తండాలో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తామన్నారు. తెలంగాణ దేవుడు సినిమా షూటింగ్ స్పాట్‌ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డిలు సందర్శించారు. సినిమా విశేషాలను హీరో సుమన్, చిత్రయూనిట్‌ను అడిగి తెలుసుకున్నారు.