![Vijay Devarakonda Shoots With Mike Tyson In US For PAN India Movie LIGER - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/16/Untitled-1_1.jpg.webp?itok=dVrF74NN)
విజయ్ దేవరకొండ, మైక్ టైసన్
Vijay Devarakonda And Mike Tyson Ready To Face To Face Fight For LIGER: హీరో విజయ్ దేవరకొండ, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఫేస్ టు ఫేస్ తలపడేందుకు సిద్ధం అయ్యారు. ఇది ‘లైగర్’ చిత్రం కోసమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
విజయ్, టైసన్‌లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ అమెరికాకు వెళ్లింది. ఈ సందర్భంగా విజయ్, టైసన్‌ల పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘మైక్ టైసన్‌తో కలిసి ఉన్న ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను.. అవి ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment