Mike Tyson
-
మైక్ టైసన్‌కు షాకిచ్చిన యువ బాక్సర్ జేక్ పాల్
ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్ మైక్ టైసన్ ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్‌లో జరిగిన బిగ్ బౌట్లో మైక్ టైసన్‌ను సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జేక్ పాల్ ఖంగు తినిపించాడు. ఈ మ్యాచ్‌లో జేక్ పాల్ చేతిలో 74-78 తేడాతో ఐరన్ మైక్ మైక్ ఓటమిపాలయ్యాడు.టైసన్ గేమ్‌లో వయస్సు ప్రభావం స్పష్టంగా కనిపించింది. 58 ఏళ్ల టైసన్ తనకంటే 37 ఏళ్ల చిన్నోడైన జేక్ సూపర్ పంచ్‌లకు తట్టుకోలేకపోయాడు. తొలి రెండు రౌండ్లలో మైక్ టైసన్ ఆధిపత్యం కనబరిచినప్పటకి.. తర్వాతి 8 రౌండ్లలో జేక్ పాల్ తన అద్బుతమైన బాక్సింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.ఆ తర్వాత మైక్ తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయాడు. కొన్ని పంచ్‌లు ఇచ్చినప్పటికి పెద్దగా పవర్ కన్పించలేదు. దీంతో మహాబలుడు మైక్ టైసన్ యువ బాక్సర్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే గెలిచిన వెంటనే జేక్ పాల్ మైక్ టైసన్‌కు తల వంచి నమస్కరించాడు. టైసన్ కూడా పాల్‌ను మంచి ఫైటర్‌గా కొనియాడాడు. ఇక విజేతగా నిలిచిన బాక్సర్ జేక్ పాల్ కు 40 మిలియన్ అమెరికా డాలర్లు ప్రైజ్ మనీగా లభించింది. కాగా మ్యాచ్ ఈ మొదలు కాగాగే పోటెత్తిన వ్యూయర్షిప్తో నెట్‌ఫ్లిక్స్ క్రాష్ అయింది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
టైసన్... అదే దూకుడు
టెక్సాస్: ఆరు పదుల వయసు సమీపిస్తున్నా... తనలో దుందుడుకుతనం తగ్గలేదని బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ చాటుకున్నాడు. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన ఈ ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్... సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జాక్ పాల్‌తో బౌట్లో తలపడనున్నాడు. ప్రధాన పోటీకి ముందు జరిగిన ఆటగాళ్ల ప్రత్యేక కార్యక్రమంలోనే రెచ్చిపోయిన టైసన్... జాక్ పాల్ చెంప చెళ్లుమనిపించాడు. సుదీర్ఘ కెరీర్లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్లను నాకౌట్ చేశాడు.అసలు పోరుకు ముందు నిర్వహించిన ‘ఫేస్ ఆఫ్’ కార్యక్రమం సమయంలో నిర్వాహకులు అడుగుతున్న ప్రశ్నలకు విసుగెత్తిన టైసన్... ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ని చెంపదెబ్బ కొట్టాడు. ఇప్పటికే ఈ బౌట్‌పై విపరీతమైన అంచనాలు పెరిగిపోగా... టైసన్ ప్రవర్తనతో అది మరింత ఎక్కువైంది. శనివారం జరగనున్న ఈ బౌట్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో ప్రసారం చేయనున్నారు. ఈ ఫైట్‌ను ప్రత్యక్షంగా 60 వేల మంది అభిమానులు... ప్రసార మాధ్యమాల ద్వారా కోట్లాది మంది వీక్షించనున్నారు. 2005లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టైసన్... ఆ తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. షెడ్యూల్ ప్రకారం టైసన్, జాక్ పాల్ మధ్య బౌట్ ఈ ఏడాది జూలైలోనే జరగాల్సి ఉన్నా... ఆ సమయంలో టైసన్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో దాన్ని వాయిదా వేశారు. దూకుడు మీదున్న టైసన్‌కు... ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పది బౌట్లు నెగ్గిన 27 ఏళ్ల జాక్ పాల్ ఏమాత్రం పోటీనిస్తాడో చూడాలి. ‘చివరి బౌట్లో కెవిన్ మెక్‌బ్రైడ్ చేతిలో ఓడిన తర్వాత జీవితంలో చాలా చూశాను. ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాను. కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపాను. అన్నిటికి మించి బాక్సింగ్‌నే ఇష్టపడతా. ఒకప్పటి టైసన్ ఇప్పుడు లేడు. నా జీవితంలో ఎక్కువ ఏమీ మిగిలి లేదు. అందుకే మంచి అనుభూతులు సొంతం చేసుకోవాలనుకుంటున్నా’ అని ఫైట్‌కు ముందు టైసన్ అన్నాడు. -
బీస్ట్‌లా విరుచుకుపడటమే తెలుసు.. 57 ఏళ్ల వయసులోనూ!
వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్.. రెండో రౌండ్.. 12 రౌండ్ల పాటు సాగాల్సిన పోరు.. అప్పటికి రెండు నిమిషాల ముప్పై ఐదు సెకన్ల పోరు మాత్రమే సాగింది. ఓ వైపు మొహమ్మద్ అలీనే ఓడించిన ధీరుడు ట్రెవర్ బెర్బిక్.. మరోవైపు 20 ఏళ్ల యువకుడు. ఎవరు గెలిచి ఉంటారో అంచనా వేయండి. సాధారణంగా బాక్సింగ్ అభిమానులెవరైనా బెర్బిక్ పేరే చెబుతారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆ 20 ఏళ్ల యంగ్‌స్టర్ తన ఆగమనాన్ని చాటే పంచ్ విసిరాడు. ఆ దెబ్బకు ప్రత్యర్థి నేలకూలాడు. తిరిగి లేచి నిలబడే ఓపిక అతడిలో లేకపోయింది. దీంతో రిఫరీ వచ్చి సదరు యువకుడిని విజేతగా ప్రకటించాడు. అలా తొలిసారి వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్ గెలిచిన ఆ సింహబలుడు మరెవరో కాదు.. మైక్ టైసన్! అద్భుత విజయాలతో.. అదిరే పంచ్‌లతో ఐరన్ మైక్, కిడ్ డైనమైట్ అని అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకున్న అమెరికా ప్రొఫెషనల్ బాక్సర్. 1966లో న్యూయార్క్ జన్మించిన మైక్ టైసన్.. తండ్రి ప్రేమలేక.. నిరాదరణకు గురికావడంతో వీధి గుండాలతో సావాసం చేశాడు. విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడేవాడు. అలా.. టీనేజ్‌లో ఉండగానే ఏకంగా 38 సార్లు అరెస్టైన టైసన్.. అక్కడి జైలర్ చలవతో బాకింగ్స్ వైపు అడుగులేశాడు. ఆ తర్వాత కస్ డి అమాటో అనే వ్యక్తి మార్గదర్శనంలో తనలోని ప్రతిభకు పదునుపెట్టి చాంపియన్‌గా ఎదిగాడు. బీస్ట్‌లా ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాడు. రెండు దశాబ్దాలపాటు బాక్సింగ్ ప్రపంచాన్ని ఏలి.. అందరికీ ఫేవరెట్‌గా మారిపోయాడు. Mike Tyson in his prime, was not a human pic.twitter.com/6uUM3RO3b8 — Weird History (@theuntoIdsecret) February 12, 2024 అయితే, తనలోని చీకటి కోణాన్ని వదల్లేక.. అత్యాచారాలు, వివాహేతర సంబంధాలతో రచ్చకెక్కడం అతడి జీవితంపై మాయని మచ్చల్లా మిగిలిపోయాయి. ఇక బాక్సర్‌గానే నటుడిగానూ పలు అమెరికన్ టీవీ సిరీస్‌లో నటించిన మైక్ టైసన్.. తెలుగు సినిమా లైగర్‌లోనూ మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది!! Mike Tyson in his prime was a beast....like nobody else. pic.twitter.com/qWgNQY4fDo — floridanow1 (@floridanow1) February 16, 2024 ఇక తన కెరీర్లో మొత్తంగా ఆరు వరల్డ్ హెవీ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచిన మైక్ టైసన్.. 57 ఏళ్ల వయసులోనూ తనలోని పస తగ్గలేదన్నట్లుగా పంచ్‌లు విసురుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి! Mike Tyson training at 57 years old and he still got it pic.twitter.com/z6XeoneEon — Historic Vids (@historyinmemes) February 16, 2024 -
38 సార్లు అరెస్ట్! జైలర్ చొరవతో ఇలా! వివాహేతర సంబంధాలు.. ఈ ‘హీరో’ విలన్ కూడా!
1986 నవంబర్ 22 .. వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్. అప్పటికి విజేతగా ఉన్న జమైకా బాక్సర్ ట్రెవర్ బెర్బిక్ తన టైటిల్ నిలబెట్టుకునేందుకు తయారయ్యాడు. ఎదురుగా 20 ఏళ్ల కుర్రాడొకడు తనతో పోటీకి సిద్ధమయ్యాడు. అప్పటికే ఆ కుర్రాడు వరుస విజయాలతో మంచి ఊపు మీదున్నా సరే.. ఒకప్పుడు మొహమ్మద్ అలీనే ఓడించిన రికార్డు ఉన్న బెర్బిక్ గెలుపుపై ఎవరికీ సందేహాలు లేవు. మొత్తం 12 రౌండ్ల పోరు.. రెండో రౌండ్లో ఆ కొత్త బాక్సర్ విసిరిన ఒక పదునైన పంచ్‌కు బెర్బిక్ కుప్పకూలాడు. అయితే లేచి నిలబడే ప్రయత్నం చేసి మళ్లీ పడిపోయాడు. మరోసారి కూడా అలాగే శక్తి కూడదీసుకొని నిలబడే ప్రయత్నం చేశాడు. అయినా సాధ్యం కాక కింద పడిపోయాడు! ఒక్క దెబ్బకు బెర్బిక్ మూడు సార్లు నేలకూలాడు! అప్పటికి జరిగింది 2 నిమిషాల 35 సెకన్ల పోరు మాత్రమే. రిఫరీ వచ్చి ఆటను ఆపేశాడు. కొత్త కుర్రాడిని వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌గా ప్రకటించాడు. ఆ పంచ్ గురించి గర్వంగా చెప్పుకున్న, తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా అభివర్ణించుకున్న ఆ బాక్సర్ పేరే ‘మైక్ టైసన్’. సుదీర్ఘకాలం పాటు ఒక తరం మొత్తానికి బాక్సింగ్ అంటే టైసన్ మాత్రమే అనిపించుకున్న మహాబలుడు. ‘అమ్మను నేను ఎప్పుడూ సంతోషంగా చూడలేదు. నేను ఆమె కోసం ఏమీ చేయలేకపోయాను. వీథుల్లో నేను ఆవారాగా తిరుగుతూ గొడవలు పడుతుంటానని ఆమెకు తెలుసు. ప్రతిరోజూ కొత్త బట్టలతో వస్తుంటే అవి నేను కొన్నవి కాదనీ ఆమెకు తెలుసు. అసలు అమ్మతో నేను ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేకపోయాను’ అంటూ తన బాల్యం, తల్లి గురించి టైసన్ చెప్పుకున్న మాటలు అవి. నిజంగానే దశాదిశా లేని జీవితం. పట్టించుకోని తండ్రి.. గల్లీ గూండాలతో సాన్నిహిత్యం.. డీలర్ల నుంచి డ్రగ్స్ దొంగతనం.. టైసన్ చిన్నతనమంతా ఇలాగే సాగింది. 13 ఏళ్ల వయసు వచ్చే సరికే టైసన్ 38 సార్లు అరెస్ట్ అయ్యాడు. జైలర్ వల్లే అయితే టీనేజర్‌గా జైలుకు వెళ్లిన సమయం కూడా చివరకు అతని జీవితానికి కొత్త దారిని చూపించింది. ఒక స్ట్రీట్ ఫైటర్ స్థాయి నుంచి వరల్డ్ చాంపియన్‌గా నిలిపింది. టైసన్లోని ఆవేశాన్ని సరైన రీతిలో వాడుకుంటే అద్భుతాలు చేయవచ్చని గుర్తించిన వ్యక్తి అక్కడి జైలర్.. మాజీ బాక్సర్ కూడా అయిన బాబీ స్టివార్ట్! టైసన్ పవర్‌ను పద్ధతిగా ఉపయోగించుకునేలా చేశాడు. స్టివార్ట్తో పాటు తల్లి తాను చనిపోతూ టైసన్‌ను అప్పగించిన వ్యక్తి కస్ డి అమాటో.. ఆ తర్వాత టైసన్ దిగ్గజ బాక్సర్‌గా మారేందుకు దిశానిర్దేశం చేశాడు. టీనేజర్‌గా ఉన్నప్పుడే తాను ఇష్టపడే పావురం మెడ విరిచాడనే కోపంతో వీథిలో ఒక పెద్ద రౌడీ మెడవిరిచి తనలో ఆవేశాన్ని ప్రదర్శించిన టైసన్ ఆ తర్వాత ఎంతో మంది ప్రత్యర్థులను తన నాకౌట్ పంచ్‌లతో కుప్పకూల్చాడు. ఆరంభం అదిరేలా.. కెరీర్ ఆరంభంలో టైసన్ అమెచ్యూర్ బాక్సర్‌గా రాణించాడు. వరుసగా రెండేళ్లు జూనియర్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించాడు. అయితే అతని కోచ్‌లు, ప్రమోటర్లు వాటిని టైసన్ స్థాయికి మరీ చిన్నవిగా భావించారు. అందుకే అన్ని రకాలుగా సిద్ధం చేసి పదునైన ప్రొఫెషనల్ రింగ్లోకే దింపారు. టైసన్ వారి అంచనాలను వమ్ము చేయలేదు. 18 ఏళ్ల వయసులో తొలిసారి అసలు పోరులోకి దిగిన టైసన్ తొలి మ్యాచ్‌లో హెక్టర్ మెర్సిడెజ్‌తో తలపడ్డాడు. టెక్నికల్ నాకౌట్ ద్వారా తన ప్రత్యర్థిని చిత్తు చేసిన టైసన్‌ను చూడగానే అందరికీ కొత్త చాంపియన్ వచ్చాడని అర్థమైంది. అక్కడితో మొదలైన విజయ ప్రస్థానం 37 బౌట్ల వరకు సాగింది. వీటిలో తొలి 26 బౌట్లలోనైతే అతను ఏకపక్షంగా విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వని ఈ పోటీలన్నీ నాకౌట్ లేదా టెక్నికల్ నాకౌట్ ద్వారా ముగిశాయి. ఈ ప్రదర్శన చూస్తేనే అతని ఆధిపత్యం ఎలా సాగిందో అర్థమవుతుంది. 20 ఏళ్ల 145 రోజుల వయసులోనే వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన అతను ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ‘బాక్సింగ్ భవిష్యత్ గురించి ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. రాబోయే కొన్నేళ్ల పాటు ఈ ఆటకు ప్రాచుర్యపరంగా శిఖరానికి తీసుకెళ్లగలవాడు వచ్చేశాడు’ అంటూ విశ్లేషకులంతా అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. కొనసాగిన జోరు అతి బలమైన శరీరం, వేగంగా దూసుకొచ్చే చేయి, తీవ్రత, కచ్చితత్వంతో పాటు ఎప్పుడు పంచ్ విసరాలో తెలిసిన టైమింగ్‌తో టైసన్ బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించాడు. ప్రత్యర్థి శరీరంపై కుడి చేత్తో హుక్ చేసిన వెంటనే అప్పర్‌కట్‌తో దవడపై వరుసగా దాడి చేసే శైలికి ఎదురులేకుండా పోయింది. పైగా బలమైన డిఫెన్స్ అవతలి బాక్సర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అతని ఈ ఆటపై అప్పట్లో ‘మైక్ టైసన్స్ పంచ్ అవుట్’ పేరుతో ఒక వీడియో గేమ్ కూడా వచ్చి సూపర్ హిట్ అయిందంటే అతని పాపులారిటీ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో బాక్సింగ్ ప్రపంచాన్ని నడిపిస్తున్న మూడు వేర్వేరు సంఘాలు వేర్వేరు వరల్డ్ చాంపియన్ షిప్‌లను నిర్వహిస్తుండేవి. అలా డబ్ల్యూబీఏ, డబ్ల్యూబీసీ, ఐబీఎఫ్ నిర్వహించిన వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ షిప్‌లలో గెలిచి ఈ మూడింటిలో ఒకేసారి చాంపియన్ గా నిలిచిన ఏకైక బాక్సర్‌గా చరిత్రలో నిలిచాడు టైసన్. ఆ ఒక్క ఓటమితో.. వరుసగా 37 బౌట్లలో విజయాలు, అన్ని హెవీవెయిట్ పోటీల్లోనూ విశ్వవిజేత, అప్రతిహతంగా సాగిపోతున్న మైక్ టైసన్ కు 1990 ఫిబ్రవరిలో షాక్ తగిలింది. తన మూడు టైటిల్స్‌ను కాపాడుకునేందుకు జేమ్స్ బస్టర్ డగ్లస్‌తో టైసన్ పోటీ పడాల్సి వచ్చింది. అప్పటికే కొంత కాలంగా వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతూ ప్రాక్టీస్‌కు కూడా తగినంత సమయం ఇవ్వలేకపోయిన టైసన్ ఈ పోరుకు వచ్చాడు. అయినా సరే అతనిపై 42–1 తేడాతో బెట్టింగ్ అంచనాలు ఉన్నాయి. కానీ 10 రౌండ్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు టైసన్ తడబడ్డాడు. 82 సెకన్ల వ్యవధిలో ముగిసిన పోరులో టైసన్ ఓడి తన మూడు టైటిల్స్‌ను కోల్పోయాడు. అతని కెరీర్లో ఇదే తొలి పరాజయం. ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యంత సంచలన ఫలితాల్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ఈ పరాజయం అప్పటికప్పుడు టైసన్ కు నష్టం కలిగించకపోయినా ఆటపై అతని ఏకాగ్రత చెదిరినట్లు బాక్సింగ్ ప్రపంచం గుర్తించింది. డగ్లస్‌తో పోరు తర్వాత మరికొన్ని విజయాలు దక్కినా, అవి మునుపటి టైసన్ ను చూపించలేకపోయాయి. టైసన్‌ను కూడా ఓడించవచ్చనే విషయాన్ని గుర్తించేలా చేశాయి. తర్వాతి తొమ్మిదేళ్ల కెరీర్లో 12 బౌట్లలో పాల్గొన్న టైసన్ ఐదింటిలో పరాజయం చవిచూడటం అతనిలో సత్తా తగ్గిందని నిరూపించాయి. దాంతో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి తప్పుకోవడం అనివార్యంగా మారింది. హోలీఫీల్డ్, లెనాక్స్ లూయీ లాంటి స్టార్లతో పాటు కెరీర్ చివర్లో డానీ విలియమ్స్, కెవిన్ మెక్‌బ్రైన్ లాంటి అనామకులు కూడా టైసన్ ను ఓడించగలిగారు. ఆద్యంతం వివాదాలమయం.. ఒక దశలో తన పంచ్‌లతో ప్రపంచాన్ని శాసించిన మహా బాక్సర్ జీవితంలో లెక్కలేనన్ని వివాదాలు ఉన్నాయి. ఒక అమ్మాయిపై అత్యాచారం చేసి ఆరేళ్ల జైలుశిక్షకు గురి కావడంతో టైసన్ పతనం మొదలైంది. శిక్ష తగ్గించుకొని మూడేళ్లకే బయటకు వచ్చినా ఇతరత్రా కూడా అతనిలోని ‘పాత టైసన్ ’ బయటకు వచ్చి కెరీర్‌ను నాశనం చేశాడు. వివాహేతర సంబంధాలు, డ్రగ్స్‌తో పట్టుబడటం వివాదాల కారణంగా అప్పటికే తెచ్చుకున్న పేరుప్రతిష్ఠలను కోల్పోవడమే కాకుండా తను ఆర్జించిన కోట్లాది సంపద కూడా ఆవిరైంది. బాక్సింగ్ రింగ్‌లో చూస్తే ఓటమి ఎదురువుతున్న దశలో పంచ్‌లతో కాకుండా హోలీఫీల్డ్ ‘చెవి కొరికి’ డిస్క్వాలిఫై కావడం అతని చక్కటి కెరీర్లో మచ్చగా మిగిలిపోయింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా బయట అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు, డ్రగ్స్‌తో పట్టుబడటం, డోపింగ్, కోర్టు వివాదాలు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ నెగెటివ్ వార్తలే! అద్భుతమైన అతని కెరీర్‌ను మరచి అతన్ని ఒక దుర్మార్గుడిలా చిత్రీకరించాయి. తన ఆత్మకథ ‘ద అన్ డిస్ప్యూటెడ్ ట్రూత్’లో అతను ఈ విషయాలన్నీ పంచుకున్నాడు. అమెరికాలో పలు టీవీ సిరీస్‌లలో నటించిన టైసన్ ఇటీవల తెలుగు సినిమా ‘లైగర్’లోనూ కనిపించాడు. అయితే టైసన్లోని ‘విలన్’ను పక్కన పెట్టి చూస్తే క్రీడా ప్రపంచంలో ఎదురు లేని ‘హీరో’ల్లో ఒకడిగా టైసన్ నిలిచిపోతాడనేది నిజం! -మొహమ్మద్ అబ్దుల్ హాది -
మైక్ టైసన్ నన్ను బూతులు తిట్టాడు, బయటికి చెప్పలేను: విజయ్
విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్'. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. కథలో లోపాలున్నా విజయ్ నటనకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అతని రెండేళ్ల కష్టం ప్రతి ఫ్రేములో కనిపిస్తుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించిన మైక్ టైసన్ గురించి విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో మైక్ టైసన్ తనను చాలా సందర్భాల్లో తిట్టాడని, ఆ బూతుల్ని తాను చెప్పాలనుకోవట్లేదని తెలిపాడు. అయితే అవన్నీ టైసన్ కేవలం ప్రేమతోనే అన్నాడని చెప్పుకొచ్చాడు. 'ఇండియా అంటే ఆయనకు ఎంతో గౌరవం. ఇక్కడి ఆహారం, మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తాడు. కానీ పెద్ద సంఖ్యలో జనాల్ని చూస్తే మాత్రం భయపడతాడు. ఓసారి ఆయన ఇండియాకు వచ్చిన క్రమంలో ఆయన్ని చూడటానికి గుంపులుగా వచ్చిన జనాల్ని చూసి హోటల్ నుంచి బయటికి కూడా రాలేదు' అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. -
'లైగర్' సినిమా ఎమ్ఎంఏ ఫైట్.. క్రూరమైన క్రీడ నుంచి ఆదరణ దిశగా
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా సినిమా ''లైగర్'' ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ఫలితం సంగతి పక్కనబెడితే.. ఈ సినిమా ఎంఎంఏ ఫైట్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) నేపథ్యంలో తెరకెక్కింది. మన దేశంలో చాలా మంది ఎంఎంఏ అంటే తెలిసి ఉండకపోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తెలిసినవాళ్లకు మాత్రమే ఈ క్రీడపై కాస్త అవగాహన ఉంటుంది. చాలా మందికి తెలియని ఎంఎంఏ క్రీడ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. -సాక్షి,డెబ్డెస్క్ photo credit : Getty Images ఎంఎంఏ ఫైట్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) అనేది ఒక హైబ్రిడ్ యుద్ధ క్రీడ. బాక్సింగ్, రెజ్లింగ్, జడో, కరాటే, థాయ్ బాక్సింగ్ వంటి క్రీడల నుంచి తీసుకున్న కొన్ని టెక్నిక్స్‌తో ఎంఎంఏను రూపొందించారు. అయితే ఎంఎంఏ రూపొందించిన తొలి రోజుల్లో ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడంతో అత్యంత క్రూరమైన క్రీడగా చాలా మంది పేర్కొన్నారు.కానీ కాలక్రమంలో ఎంఎంఏ ఆ చెడ్డ పేరు నుంచి బయటపడి ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న క్రీడగా ఆదరణ పొందుతుండడం విశేషం. photo credit : Getty Images చరిత్ర తిరగేస్తే క్రీస్తూ పూర్వమే ఎంఎంఏ గేమ్‌ను ఒలింపిక్స్‌లో ఆడారని ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. మనకు తెలిసి 20వ శతాబ్దంలో బ్రెజిల్ లోని వాలే ట్యూడో ద్వారా ఎంఎంఏ గేమ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కార్లో, హెలియో అనే ఇద్దరు సోదరులు నార్త్ అమెరికాలో ఈ గేమ్‌కు బాగా పాపులారిటీ తీసుకొచ్చారు. వాళ్లే ఈ టోర్నమెంట్ కు యూఎఫ్‌సీ(UFC)-అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ అని పేరు పెట్టారు.అయితే ఈ ఎంఎంఏ(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్)పై అమెరికా సహా చాలా దేశాల్లో ఆంక్షలు ఉన్నాయి. ఎంఎంఏ మ్యాచ్‌ల్లో విజయాలను సబ్మిషన్, నాకౌట్, టెక్నికల్ నాకౌట్, న్యాయనిర్ణేతల ద్వారా నిర్ణయిస్తుంటారు. photo credit : Getty Images ఎంఎంఏ ఆట.. కఠిన నిబంధలు ►దశ దిశ లేకుండా సాగుతున్న ఎంఎంఏ ఆటకు యూఎఫ్‌సీ(అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్) కొన్ని స్థిరమైన నిబంధనలు, రూల్స్ తీసుకొచ్చింది. ఆ నిబంధనలు, రూల్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం ►రింగ్‌లోకి వెళ్లే ఆటగాళ్లు ప్యాడ్స్ ఉన్న ఫింగర్‌లెస్ గ్లౌజులతోనే పోరాడాలి ►బూట్లు వేసుకోకూడదు.. తలకు ఎటుంటి సేఫ్‌గార్డ్స్ పెట్టుకోకూడదు. ►ప్రత్యర్థి ఆటగాడి కంట్లో పొడవడం, కొరకడం, జట్టు లాగడం, తలతో కొట్టడం వంటివి పూర్తిగా నిషేధం. photo credit : Getty Images ఎంఎంఏలో యూనిఫైడ్ రూల్స్ కింద ఒక్కో రౌండు ఐదు నిమిషాల చొప్పున మూడు రౌండ్లు పోరాడాల్సి ఉంటుంది. ఒక్కో రౌండు ముగిసిన తర్వాత ఒక నిమిషం విశ్రాంతినిస్తారు. అదే చాంపియన్‌షిప్ బౌట్స్‌లో ఐదు రౌండ్లు ఉంటాయి. ప్రత్యర్థిని నాకౌట్ చేయడం, సబ్మిషన్(ప్రత్యర్థిని ఓటమి ఒప్పుకునేలా చేయడం) ద్వారా గెలుపును నిర్ణయిస్తారు. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్లు సమంగా పోరాడితే మాత్రం.. ఇద్దరిలో విజేత ఎవరనేది ప్యానెల్ నిర్ణయిస్తుంది. photo credit : Getty Images ఇక అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని లాస్వేగాస్లో ఉన్న యూఎఫ్‌సీ ఎంఎంఏకు ప్రధాన సంస్థ. ప్రతీ ఏడాది వివిధ స్థాయిల్లో యూఎఫ్‌సీ ఎంఎంఏ విభాగంలో ఈవెంట్లు నిర్వహిస్తూ వస్తోంది. అందుకే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా సెకండాఫ్ మొత్తం లాస్వేగాస్లో షూటింగ్ జరుపుకుంది. చదవండి: 'లైగర్' బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడిన మౌత్ టాక్ Stuart Broad: ముప్పతిప్పలు పెట్టి తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. -
వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..?
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ గురించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ 'లైగర్'లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం వరకు సినిమా ప్రమోషన్స్‌లో బిజిబిజీగా గడిపిన మైక్ టైసన్.. తాజాగా వీల్‌చైర్‌లో కూర్చొని కదలలేని పరిస్థితిలో కనిపించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు లెజెండరీ బాక్సర్‌కు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. లైగర్ షూటింగ్లో హుషారుగా కనిపించిన యోధుడు కర్ర పట్టుకు కూర్చొని, ఇతరుల సాయంతో ముందుకు కదులుతున్న దృశ్యాలను చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. Former heavyweight boxing champion Mike Tyson’s health failing him and says his ‘expiration date may come really soon’ Mike Tyson is pictured in a wheelchair at Miami Airport, raising new fears for his health amid problems with sciatica. pic.twitter.com/ITHHAwfJQK — Zedbugs (@Zedbugs1) August 17, 2022 ఈ దృశ్యాలు టైసన్ మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసినవిగా చెబుతున్నారు. టైసన్ ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ కొందరు సెల్ఫీల కోసం ఎగబడిన వైనం విస్మయానికి గురి చేస్తుంది. టైసన్ ఈ స్థితిపై ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. టైసన్ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికాతో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్లు టైసన్‌ను వీల్ చైర్ వాడాలని సూచించారట. విషయం తెలుసుకున్న అభిమానులు.. ప్రపంచాన్ని ఏలిన దిగ్గజ బాక్సర్‌కు ఈగతి పట్టిందేనని వాపోతున్నారు. 56 ఏళ్ల టైసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎక్స్పైరీ డేట్‌కు దగ్గర పడుతున్నానని చెప్పిన మాటల గురించి ప్రస్తుతం జనం చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్ ఈనెల (ఆగస్టు) 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా బాలీవుడ్ క్యూటీ అనన్య పాండే నటించగా.. టైసన్ కీ రోల్ పోషించాడు. ఇక మైక్ టైసన్ ప్రొఫెషనల్ కెరీర్ విషయానికొస్తే.. టైసన్ ఇరవై ఏళ్ల వయసుకే తన దూకుడుతో ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగాడు. జూన్ 30, 1966లో జన్మించిన టైసన్.. చిన్నవయసులోనే అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఎదిగాడు. బాల్యంలో ఎన్నో కష్టాలు, వేధింపులు ఎదుర్కొన్న టైసన్.. స్ట్రీట్ఫైట్లలో పాల్గొని జైలు పాలయ్యాడు. లైంగిక వేధింపులు, ఇతరత్రా వివిదాల కారణంగా అతను 38సార్లు జైలుకెళ్లాడు. టైసన్ జైల్లో ఉండగానే బాక్సింగ్ దిగ్గజం ముహమ్మద్ అలీని కలిశాడు. 1997లో ప్రత్యర్థి ఇవాండర్ హోలిఫీల్డ్ చెవి కొరికి 3 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాడు. టైసన్ కెరీర్ రికార్డు 50 విజయాలు-20 ఓటములుగా ఉంది. చదవండి: విజయ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మైక్ టైసన్.. ఎంతంటే -
విజయ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మైక్ టైసన్.. ఎంతంటే
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చదవండి: హీరో కాకముందు విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా? ప్రస్తుతం వరుస ప్రమోషన్స్‌తో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. లైగర్ కోసం విజయ్ దేవరకొండ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం విజయ్ దాదాపుగా రూ. 35కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అనన్య పాండేకు మాత్రం కేవలం రూ. 3కోట్ల రూపాయాలే అప్పజెప్పారట. మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈ సినిమాలో నటించిన మైక్ టైసన్‌కు విజయ్ కంటే ఎక్కువగా సుమారు రూ. 40కోట్ల వరకు రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం. -
మైక్ టైసన్ బర్త్‌డే, స్పెషల్ వీడియోతో విషెస్ తెలిపిన ‘లైగర్’ టీం
ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం, లెజెండరి ఆటగాడు మైక్ టైసన్ లైగర్ మూవీతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా తెరకెక్కిన చిత్రంలో ఆయన ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే నేడు మైక్ టైసన్ బర్త్‌డే సందర్భంగా లైగర్ టీం ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. గురువారం(జూన్ 30)మైక్ టైసన్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో లైగర్ టీం ఒక్కొరుగా ఆయనకు బర్త్‌డే విషెస్ చేబుతున్న వీడియోను తాజాగా పూరీ కనెక్ట్స్ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. చదవండి: టాలీవుడ్లో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ఇందులో నిర్మాత కరణ్ జోహార్, హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, చార్మి కౌర్, ఇతర నటీనటులతో పాటు చివరగా పూరీ జగన్నాథ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచమంతా మిమ్మల్ని చూసి గర్విస్తుంది మైక్ టైసన్, హ్యాపీ బర్త్‌డే అంటూ కరణ్ ఆయనను కొడియాడాడు. ఈ వీడియోలో టైసన్‌కు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా సెట్స్‌లో ఆయన సందడి చేసిన కొన్ని ఆసక్తికర సీన్స్‌తో ఈ వీడియోను మలిచింది చిత్రం బృందం. ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రేక్షకులను, మైక్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో లైగర్ థియేటర్లలో అలరించనుంది. చదవండి: ప్రస్తుతం ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా: శ్రుతి హాసన్ Team #LIGER Wishes the LEGEND, The One & Only @MikeTyson a very Happiest Birthday! Await to witness the BIG CLASH on the Big Screens 👊🏾 https://t.co/3KLUcGxbFc@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18#LigerOnAug25th pic.twitter.com/03dY12k0v3 — Puri Connects (@PuriConnects) June 30, 2022 -
అభిమాని ఓవరాక్షన్.. చితక్కొట్టిన మైక్ టైసన్, వీడియో వైరల్
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ 'లైగర్' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక టైసన్ బాక్సింగ్ పంచులకే కాక ఆయన సినిమాలకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. సాధారణంగానే సెలబ్రిటీలు అంటేనే క్రేజీ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లు కనపడగానే ఒక్క ఫోటో అయినా తీసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. చదవండి: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, గంటల వ్యవధిలోని ఆన్లైన్లో లీక్ కానీ కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే అత్యుత్సాహం సెలబ్రిటీలకు విపరీతమైన కోపం తెప్పిస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితే బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కు ఎదురైంది. దీంతో సహనం కోల్పోయిన టైసన్ సదరు యువకుడిపై పిడిగుద్దులు కురిపించాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు మైక్‌టైసన్ విమానంలో వెళ్తుండగా ఆయన వెనుక సీట్లో కూర్చున్న యువకుడు టైసన్‌ను చూసి తెగ ఎగ్జయిట్ అయ్యి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. మొదట్లో టైసన్ కూడా అతనితో నవ్వుతూనే మాట్లాడాడు. కానీ సదరు యువకుడు నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉండటంతో టైసన్ అభ్యంతరం చెప్పాడు. కాసేపు సైలెంట్‌గా ఉండమని కోరాడు. అయినప్పటికీ అతను వినిపించుకోకుండా నస పెట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన టైసన్ సీట్లో నుంచి లేచి వెనకున్న యువకుడిపై పిడిగుద్దులు కురిపించాడు. టైసన్ పంచింగ్ పవర్‌కి సదరు యువకుడి తలకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: మీలో ఆ టాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ #miketyson seemed to lose his cool on a #plane on Wednesday night ... repeatedly #punching a man in the face after the guy had apparently annoyed him. Video Footage: TMZ pic.twitter.com/xiy9zgdrhd — 𝘽𝙚𝙨𝙩 𝙀𝙣𝙩𝙚𝙧𝙩𝙖𝙞𝙣𝙢𝙚𝙣𝙩 𝙀𝙫𝙚𝙧🥊🔥 (@NoPlugMedia) April 21, 2022 -
నాపై దయ చూపినందుకు ధన్యవాదాలు: బాక్సింగ్ దిగ్గజం
ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ‘లైగర్’ చిత్రం ద్వారా భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదలకానుంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేసిన మైక్ టైసన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. డబ్బింగ్ డన్ అంటూ ‘‘నా పట్ల దయ చూపినందుకు ధన్యవాదాలు. నేను కృతజ్ఞుణ్ణి’’ అని టైసన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘లైగర్’ రిలీజ్ కానుంది. The final bell has rung!🔔The legend @MikeTyson has completed his dubbing for #Liger.#VaatLagaDenge pic.twitter.com/LTG9tOHVCV— Dharma Productions (@DharmaMovies) April 1, 2022 చదవండి: నువ్ ఏడ్చే రోజు వచ్చేసింది.. కరణ్ జోహార్‌పై కంగనా కామెంట్స్ -
టైసన్‌ను 'ఢీ' కొట్టేందుకు రెడీ అంటున్న విజయ్.. లైగర్ టీమ్
-
టైసన్‌ను 'ఢీ' కొట్టేందుకు రెడీ అంటున్న లైగర్
Vijay Devarakonda And Mike Tyson Ready To Face To Face Fight For LIGER: హీరో విజయ్ దేవరకొండ, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఫేస్ టు ఫేస్ తలపడేందుకు సిద్ధం అయ్యారు. ఇది ‘లైగర్’ చిత్రం కోసమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్, టైసన్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ అమెరికాకు వెళ్లింది. ఈ సందర్భంగా విజయ్, టైసన్‌ల పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘మైక్ టైసన్‌తో కలిసి ఉన్న ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను.. అవి ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
బాక్సింగ్ లెజెండ్‌తో లైగర్ విజయ్..ఫోటో వైరల్
Vijay Devarakonda Shares Photo With Mike Tyson : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా షెడ్యూల్లో మైక్‌టైసన్‌ని కలుసుకున్న విజయ్ దేవరకొండ ఆయనతో పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.ఐరన్ మ్యాన్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ..ఈ మెమోరీస్ జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నాడు. ఈ షెడ్యూల్లో లైగర్ మూవీ క్లైమాక్స్‌ను షూట్ చేయనున్నట్టు సమాచారం. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీని పూరి కనెక్ట్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. This man is love ❤️ Every moment I am making memories! And this one will forever be special..#Liger Vs The Legend.. When I came face to face with Iron @MikeTyson pic.twitter.com/F2QRpIaitS — Vijay Deverakonda (@TheDeverakonda) November 16, 2021 -
మహాబలుడు
అతను పిడికిలి బిగిస్తే చాలు ప్రత్యర్థి గుండెల్లో దడ మొదలవుతుంది. రింగ్‌లోకి దిగిన తర్వాత అతని రౌద్ర రూపాన్ని చూస్తే ఇక తప్పుకోవడమే మేలనిపిస్తుంది. తొలి పంచ్ పడక ముందే ఓటమికి సిద్ధమైపోయినట్లుగా అనిపిస్తుంది. మెరుపులు, పిడుగుల్లాంటి పిడిగుద్దులతో అతను చెలరేగుతుంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసింది. ఇంతటి పవర్ ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యపోయింది. నాటి దిగ్గజం మొహమ్మద్ అలీ తర్వాత ఆ స్థాయిలో ఒక తరం మొత్తాన్ని తన పంచ్‌లతో ఊపేసిన వ్యక్తి మైక్ టైసన్. ఒక దశలో బాక్సింగ్ అంటే టైసన్ మాత్రమే అన్నంతగా అతని పేరుప్రఖ్యాతులు మోగిపోయాయి. సీరియస్‌గా అయినా, సరదాగా అయినా కాస్త దుందుడుకు స్వభావంతో ఎవరైనా కనిపిస్తే చాలు... ఏరా టైసన్ అనుకుంటున్నావా అనడం జనం పరిభాషలో సాధారణంగా మారిపోయింది. అతి పిన్న వయసులో ప్రతిష్టాత్మక వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌గా టైసన్ నిలిచిన క్షణం బాక్సింగ్ చరిత్రలో ఎంతో ప్రత్యేకం. అమెరికాలోని బ్రూక్లిన్‌లో నేరగాళ్లు ఎక్కువగా ఉండే బ్రౌన్స్విలే ప్రాంతంలో పుట్టి పెరిగిన మైక్ టైసన్ ‘స్ట్రీట్ ఫైటర్’గా అప్పటికే తన పంచ్‌లతో ఎంతో మంది పని పట్టాడు. చివరకు ఇది పెద్ద సమస్యగా మారి జైలు తరహాలో ఉండే సంరక్షణ కేంద్రానికి పంపాల్సి వచ్చింది. అతడిలో మార్పు తెచ్చే క్రమంలో ఒక కౌన్సిలర్ టైసన్‌కు బాక్సింగ్ నేర్పించాడు. అయితే ఇది టైసన్ దృష్టిలో ‘చేపకు, నీటికి మధ్య ఉన్న అనుబంధం’ తరహాలో మారిపోయింది. దాంతో తన పట్టుదల, క్రమశిక్షణ, కఠోర శ్రమతో అతను పూర్తి స్థాయిలో బాక్సింగ్‌పై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత బాక్సింగ్ మేనేజర్ డి అమాటో పర్యవేక్షణలో టైసన్ దూసుకుపోయాడు. అమెచ్యూర్ పోటీల్లో వరుస విజయాల తర్వాత 18 ఏళ్ల వయసుకే ప్రొఫెషనల్ బాక్సింగ్ బరిలోకి దిగి హేమాహేమీలను గడగడలాడించాడు. ఆ క్షణం వచ్చేసింది... తన ప్రొఫెషనల్ కెరీర్ తొలి ఏడాది 1985లో టైసన్ 15 బౌట్లలో పాల్గొంటే అన్నీ నాకౌట్ విజయాలే. తర్వాతి ఏడాది కూడా అదే జోరు కొనసాగింది. వరుసగా మరో 12 బౌట్లు గెలిచిన టైసన్ తన రికార్డును 27–0కు పెంచుకున్నాడు. అప్పటికే ఈ మహాబలుడి గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇంత చిన్న వయసులో అతని అద్భుత బాక్సింగ్ ప్రదర్శనకు అంతా అచ్చెరు వొందారు. పంచ్లలో పదును, వేగంతో కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థులపై నిర్దయగా టైసన్ విరుచుకుపడుతున్న తీరు కూడా భవిష్యత్తులో అతను ఎంత పెద్ద స్థాయికి చేరుకోగలడో అంతా ఊహిస్తూనే ఉన్నారు. అలాంటి అంచనాల మధ్య వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్ల్యూబీసీ) నేతృత్వంలో హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ టైటిల్ కోసం డిఫెండింగ్ చాంపియన్ ట్రెవర్ బెర్బిక్ (జమైకా)తో తలపడే అవకాశం వచ్చింది. విన్చెస్టర్లోని లాస్‌వెగాస్ హిల్టన్ వేదికగా 12 రౌండ్ల పోరుకు రంగం సిద్ధమైంది. అయితే టైసన్ భీకర ప్రదర్శన ముందు బెర్బిక్ నిలవలేకపోయాడు. కేవలం రెండో రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. 2 నిమిషాల 35 సెకన్లలోనే బౌట్ ఫినిష్ చేసి టైసన్ రింగ్‌లోనే గర్జించాడు. కేవలం 20 ఏళ్ల 145 రోజుల వయసులో వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. తిరుగులేని విజయాల తర్వాత... ఈ గెలుపు తర్వాత టైసన్‌ను నిలువరించడం ఎవ్వరి తరం కాలేదు. ఆ తర్వాత ‘హెవీ వెయిట్ బాక్సింగ్ సిరీస్’ పేరుతో మూడు వేర్వేరు హెవీ వెయిట్ కేటగిరీలతో ‘అన్ డిస్ప్యూటెడ్ చాంపియన్’ అంటూ పోటీలు నిర్వహించారు. డబ్ల్యూబీసీతో పాటు డబ్ల్యూబీఏ, ఐబీఎఫ్ ఏర్పాటు చేసిన బౌట్లలో విజేతగా నిలిచి మూడు టైటిల్స్‌ను ఒకేసారి తన ఖాతాలో వేసుకొని టైసన్ తనకు ఎదురు లేదని చాటి చెప్పాడు. ఈ ఘనత సాధించిన ఏౖకైక బాక్సర్ టైసన్ ఒక్కడే కావడం విశేషం. ఈ క్రమంలో వరుసగా తొమ్మిది బౌట్లలో తనకు సవాల్ విసిరిన వారందరినీ అతను మట్టికరిపిస్తూ హెవీ వెయిట్ టైటిల్స్‌ను నిలబెట్టుకున్నాడు. ఎట్టకేలకు 1990 ఫిబ్రవరిలో ఈ అద్భుతానికి విరామం వచ్చింది. 37–0తో అప్రతిహతంగా దూసుకుపోయిన టైసన్‌కు జేమ్స్ బస్టర్ డగ్లస్ రూపంలో తొలి ముప్పు ఎదురైంది. 12 రౌండ్ల పోరులో 10వ రౌండ్ వరకు పోరాడి టైసన్ తలవంచాడు. తన మూడు హెవీ వెయిట్ టైటిల్స్‌ను చేజార్చుకున్నాడు. 54 ఏళ్ల వయసులో టైసన్ మళ్లీ రింగ్‌లోకి దిగాలని భావిస్తున్నాడు. ఇటీవల తన ఫిట్నెస్ వీడియోలను పెట్టి ‘ఐయామ్ బ్యాక్’ అంటూ టైసన్ వ్యాఖ్య పెట్టాడు. వివిధ సహాయ కార్యక్రమాల కోసం టైసన్ ఎగ్జిబిషన్ బౌట్లలో పాల్గొనే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం హాంకాంగ్‌కు చెందిన ఒక సినిమాలో నటించిన టైసన్... ప్రస్తుతం యువ రెజ్లర్లను ప్రమోట్ చేస్తూ ప్రఖ్యాత రెజ్లింగ్ ఈవెంట్ ‘డబుల్ ఆర్ నథింగ్’తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. పతనం వైపు సాగి... వ్యక్తిగత సమస్యలు, రేప్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష, ప్రమోటర్లతో విభేదాలు... ఇలా ఎన్నో దెబ్బలు తిన్న టైసన్ ఆ తర్వాత తన ప్రాభవం కోల్పోయాడు. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత మళ్లీ డబ్ల్యూబీఏ టైటిల్ గెలుచుకున్నా... అతనిలో అంతటి ఊపు కనిపించలేదు. కొద్ది రోజులకే అదీ పోయింది. బౌట్లో హోలీఫీల్డ్ చెవి కొరికి మరో వివాదం కొనితెచ్చుకున్నాడు. చిన్నాచితకా బాక్సర్ల చేతుల్లో ఓడి వరుసగా ఓడిపోగా... ఆ తర్వాత కేవలం డబ్బుల కోసమే ఆడిన బౌట్లు కూడా ఉన్నాయి. చివరకు 50–6 గెలుపోటముల రికార్డు (44 నాకౌట్లు)తో టైసన్ ప్రొఫెషనల్ కెరీర్ ముగిసింది. అయితే అతను బాక్సింగ్‌పై వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోనిది. -
'జాగ్రత్త.. నేను బరిలోకి దిగుతున్నా'
న్యూయార్క్ : బాక్సింగ్ ప్రపంచంలో మైక్ టైసన్ పేరు తెలియని వారు ఉండరు. అతని బరిలోకి దిగాడంటే ఎంతటి ప్రత్యర్థి అయినా టైసన్ పంచ్‌లకు తలొగ్గాల్సిందే. రెండు దశాబ్ధాల పాటు తన ఆటతీరుతో ఉర్రూతలూగించిన మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ మళ్లీ తన పంచ్ పవర్ చూపించనున్నాడు. బౌట్ సత్తా చాటేందుకు మైక్ టైసన్ ప్రిపేరవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అతను ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్టు చేశాడు. చాలా కఠోరంగా కసరత్తు చేస్తున్న 53 ఏళ్ల మైక్ టైసన్‌ను చూస్తుంటే అతని పవర్ ఏ మాత్రం తగ్గలేదిని తెలుస్తుంది. ఆ వీడియోలో ' నేను మళ్లీ రింగ్‌లోకి వస్తున్నా.. ప్రత్యర్థులకు ఇదే సవాల్ ' అంటూ కామెంట్ జత చేశాడు. 53 ఏళ్ల మైక్ టైసన్ వర్కవుట్ చేస్తూ చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన బాక్సింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.('ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లి ముందుంటాడు') వేగం, పంచ్ పవరుతో హెవీ వెయిట్‌గా నిలిచి పలు టైటిళ్లు సాధించిన టైసన్ మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాల సేకరణ కోసమే మైక్ టైసన్ బాక్సింగ్ రింగ్‌లోకి దిగుతున్నారని సమాచారం. ఇక చివరిసారిగా 2005లో కెవిన్ మెక్‌బ్రైడ్‌తో టైసన్ చివరి బౌట్లో తలపడ్డాడు. 1986లో 20 ఏళ్ల వయసులోనే టైసన్ ట్రెవర్ బెర్బిక్ను ఓడించి ప్రపంచ యువ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా ఖ్యాతి గాంచాడు. టైసన్ తన కెరీర్లో మొత్తం 50 ప్రొఫెషనల్ ఫైట్స్‌ను గెలిచాడు. ఇక మాజీ చాంపియన్ ఇవాండర్ హోలీఫీల్డ్‌తో టైసన్ తన ఎగ్జిబిషన్ బౌట్లో తలపడే అవకాశాలు ఉన్నాయి. -
బస్తీల నుంచే బడా బాక్సర్లు
ముంబై: మురికివాడల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే పెద్ద పెద్ద బాక్సర్లుగా ఎదిగారని మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ చెప్పాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) కుమిటే–1 లీగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తొలిసారి భారత్‌కు విచ్చేసిన ఈ బాక్సింగ్ దిగ్గజం మీడియాతో మాట్లాడుతూ ‘నాతో సహ చాలా మంది బాక్సర్లు మురికివాడల నుంచి కష్టపడి వచ్చినవాళ్లే! వాళ్లంతా ఇప్పుడు మేటి బాక్సర్లయ్యారు. ప్రస్తుతమున్న టాప్ బాక్సర్లు కూడా బస్తీలకు చెందిన వారే’ అని అన్నాడు. 52 ఏళ్ల మాజీ బాక్సర్ 2005లో రిటైరయ్యాడు. అతను 1988లో 20 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ సాధించి ఈ ఘనత సాధించిన తొలి యువ బాక్సర్‌గా రికార్డులకెక్కాడు. తన కెరీర్లో 50 విజయాలు సాధించగా... ఇందులో 44 నాకౌట్లుండటం విశేషం. కేవలం ఆరు బౌట్లలో మాత్రం ఓటమి పాలయ్యాడు. గొప్ప విజయాలే కాకుండా వివాదాలూ టైసన్ వెంట నడిచాయి. 1991లో ‘మిస్ బ్లాక్ రోడ్ ఐలాండ్’ డిజైరీ వాషింగ్టన్‌పై అత్యాచారం చేసి ఆరేళ్ల శిక్షకు గురయ్యాడు. అనంతరం 1997లో ఇవాండర్ హోలీఫీల్డ్‌తో జరిగిన బౌట్లో హోలీఫీల్డ్ చెవిని కొరికి డిస్క్వాలిఫై అయ్యాడు. భారత పర్యటనలో అతను ఆసియాలోనే అత్యంత పెద్ద మురికివాడగా పేరొందిన ధారవిని, అలాగే ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించాల్సి ఉంది. ఈ సందర్భంగా టైసన్ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘నేనూ పేదవాణ్నే. మురికివాడలోనే పుట్టిపెరిగా. వాడల నుంచి బయటపడాలనే లక్ష్యంతోనే కష్టపడ్డాను. అనుకున్నది సాధించి ఇప్పుడు ఈ స్థితికి ఎదిగాను. ఎవరైనా సరే చెమటోడ్చితే అక్కడ్నించి బయటపడొచ్చు. ఎంతో బాగా ఎదగొచ్చు’ అని టైసన్ చెప్పాడు. తనకు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్అంటే చాలా ఇష్టమన్నాడు. లాస్ వెగాస్‌లో జరిగే యూఎఫ్‌సీ పోటీలను తిలకించేవాడినని చెప్పుకొచ్చాడు. క్రికెట్ గురించి మాట్లాడుతూ ఈ ఆట తనకు తెలుసని బేస్బాల్లా ఉంటుందని, బ్యాట్‌తో బంతిని బాదే ఆటే క్రికెట్ అని చెప్పాడు. ఎమ్ఎమ్ఏ కుమిటే–1 లీగ్‌లో భాగంగా శనివారం భారత్, యూఏఈ జట్ల మధ్య తొలి ఫైట్ జరగనుంది. -
తొలిసారి భారత్‌కు రానున్న దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్
ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ వచ్చే నెలలో భారత్‌కు విచ్చేయనున్నారు. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ లీగ్ ప్రాచుర్య కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సెప్టెంబర్ 29న ఈ వివాదాస్పద బాక్సర్... మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) ఈవెంట్ అయిన కుమిటే–1 లీగ్‌ను ప్రచారం చేసేందుకు ముంబై వస్తున్నారని లీగ్ వర్గాలు తెలిపాయి. భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారిగా జరిగే ఈ టోర్నీలో భారత్ తమ తొలి బౌట్లో యూఏఈని ఎదుర్కొంటుంది. లీగ్ వ్యవస్థాపకులు మొహమ్మద్ అలీ బుద్వాని మాట్లాడుతూ కుమిటే లీగ్ కోసం ప్రపంచ మాజీ చాంపియన్ రానుండటం ఆనందంగా ఉందన్నారు. -
సినిమాల్లోకి అలనాటి బాక్సర్
మైక్ టైసన్... ఒకప్పుడు ప్రత్యర్థి ఎవరైనా కూడా ఒక నిమిషంలోపే నాకౌట్ చేసిన ధీరుడు. 20 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లోకి వచ్చి, మొదటి 19 బౌట్లలోను నాకౌట్ విజయాలు సాధించాడు. అందులో 12 మొదటి రౌండులోనే పడేశాడు. అలాంటి లెజెండరీ బాక్సర్... ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నాడు. 'కిక్బాక్సర్: ద రిటాలియేషన్' అనే సినిమాలో టైసన్ నటిస్తున్నాడు. ఇంకా విడుదల కావాల్సిన మార్షల్ ఆర్ట్స్ సినిమా 'కిక్ బాక్సర్: వెంజెన్స్'కు ఇది సీక్వెల్. టైసన్ సినిమా ప్రస్తుతం కాలిఫోర్నియా, నెవడాలలో షూటింగ్ జరుపుకొంటోంది. జూన్‌లో థాయ్‌లాండ్‌లో షూటింగ్ ఉంటుంది. ఒక కేసులో దోషిగా తేలి.. జైల్లో తప్పనిసరిగా ఫైటింగ్ ప్రపంచంలోకి వెళ్లిన వ్యక్తి పాత్రను టైసన్ పోషిస్తున్నాడు. ఇప్పటికి తాము క్రీడా ప్రపంచంలో 14 మంది చాంపియన్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇప్పుడు టైసన్ రాకతో సినిమాకు కొత్త లుక్, సరికొత్త ఉత్సాహం వచ్చాయని నిర్మాత రాబర్ట్ హిక్మన్ చెప్పారు. 'కిక్బాక్సర్: వెంజెన్స్' సినిమాకు జాన్ స్టాక్‌వెల్ దర్శకత్వం వహించారు. 1989లో విడుదలైన 'కిక్బాక్సర్' సినిమాకు ఇది రీమేక్. -
టైసన్ ఈ సినిమా చూస్తారట!
మైక్ టైసన్ తెలుసుగా! ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ మాజీ బాక్సర్. ఇప్పుడు ఆయన మన భారతీయ సినిమా చూడా లని ఆశపడుతున్నారు. ఆశ్చర్యపోకండి! ఇది నిజం! సాక్షాత్తూ మైక్ టైసనే స్వయంగా తన ఫేస్బుక్ పేజీలో ఆ సంగతి వెల్లడించారు. ఇంతకీ, ఆ సినిమా ఏమిటంటే - మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా ‘సాలా ఖదూస్’ (తమిళంలో ‘ఇరుది సుట్రు’). చెన్నైలోని మురికివాడల నుంచి మట్టిలోని ఓ మాణిక్యాన్ని వెలికితీసి, బాక్సింగ్ చాంపియన్‌గా తీర్చిదిద్దిన బాక్సింగ్ కోచ్ జీవితం చుట్టూ నడిచే సినిమా అది. తెలుగమ్మాయి సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితికా సింగ్ మహిళా బాక్సర్ పాత్ర పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన సమీక్షను ఒక భారతీయ పత్రికలో చదివిన మైక్ టైసన్ ఆ సమీక్షను తన ఫేస్బుక్లో షేర్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా, ‘‘ఈ బాక్సింగ్ సినిమాను చూడాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. బాక్సింగ్ బరిలో రికార్డులు నెలకొల్పి, ప్రపంచమంతటా ప్రసిద్ధుడైన టైసన్ ఇలా ‘సాలా ఖదూస్’ సినిమా చూస్తాననడంతో సహజంగానే అందరి దృష్టీ ఆ చిత్రంపై పడింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మాధవన్‌కు మంచి పేరు తేవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద ఆదరణ పొందుతుండడం విశేషం. -
బాలీవుడ్ సినిమాపై మనసు పడ్డ టైసన్
ముంబై: బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న సాలా ఖదూస్ సినిమాను తాను చూడాలనుకుంటున్నానని బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ తెలిపాడు. 'నేను బాక్సింగ్ సినిమా చూడాలని అనుకుంటున్నా' అంటూ టైసన్ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ లో పేర్కొన్నాడు. ఇప్పటికే రెండు అంతర్జాతీయ సినిమాల్లో నటించిన టైసన్ సోషల్ మీడియాలో తన కోరికను అభిమానులతో పంచుకున్నాడు. బాక్సింగ్ కోచ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా చూడ్డానికి తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నాడు. దీంతో ఇప్పటికే పలువురి ప్రశంసలందుకుంటున్న మూవీకి భారీగా క్రేజ్ క్రియేట్ అయింది. 20 యేళ్ల అతిచిన్న వయసులోనే ప్రపంచ బాక్సింగ్ రంగంలో అనేక టైటిల్స్ ను అందుకుని బాక్సింగ్ లెజెండ్ గా ఖ్యాతి గడించాడు. ఇపుడు ఈ బాక్సింగ్ యోధుడు ఓ ఇండియన్ సినిమా చూస్తానని చెప్పడం ఆసక్తి కరంగా మారింది. అటు ఇప్పుడు అత్యుత్తమ బాక్సర్ నుంచి కూడా ఇలాంటి కామెంట్ రావడంతో.. దర్శకురాలు సుధ కొంగర ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ మూవీలో కోచ్ కేరక్టర్ ని టైసన్ ని స్ఫూర్తిగా తీసుకునే డిజైన్ చేసినట్లు గతంలో చెప్పారు. 'నేను కోచ్ మాటలు విన్నరోజున ఖచ్చితంగా గెలుస్తాను పెడచెవిన పెట్టిన రోజు ఓడిపోయాను.' అని మైక్ టైసన్ మాటలు తనకు స్ఫూర్తి అని తనమూవీ కూడా ఇదే థీమ్ తో ఉంటుందని తెలిపారు. కాగా మాధవన్. రితికా సింగ్ ల అద్భుతమైన నటన, సినిమా కథాకథనాల బలంతో ఇప్పటికే చాలా సంచలనాలకు వేదికైన ఈ మూవీ మరెన్ని బోలెడు రికార్డులు క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే. -
ఆకట్టుకునే.. సెలబ్రిటీల స్నానాల గదులు
గృహ నిర్మాంణంలో వాస్తుతో సమానంగా ఇంటీరియర్ డిజైన్ కూ ప్రాముఖ్యతను ఇస్తారు. అయితే ఇటీవల సంపన్నుల ఇళ్ళలోనే కాక సాధారణ ప్రజలు కూడ గృహ నిర్మాణంలో ఆకట్టుకునే ఇంటీరియర్ డెకరేషన్ కు లక్షలకు లక్షలు కుమ్మరిస్తున్నారు. ఇక సెలబ్రిటీల ఇళ్ళలో ఇంటీరియర్ గురించి వర్ణించడం కూడ కష్టమే. బెడ్ రూం నుంచి... బాత్రూం వరకూ ఇంట్లో ప్రతి అంశం ఆకట్టుకోవలసిందే. ఇటీవల విడుదలైన కొందరు ప్రముఖులు, సెలబ్రిటీల బాత్ రూమ్ ల ఇంటీరియర్ డెకరేషన్ ఫొటోలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. న్యూయార్క్ లోని హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్... ప్రపంచ ప్రఖ్యాత సెక్సీతార మార్లిన్ మన్రో... అపార్ట్ మెంట్లోని బాత్రూం... ఇంద్ర భవననాన్ని తలపిస్తోంది. పాలరాతి మెట్లమీద నల్లని జాకూజ్జీతో పాటు... అద్దాలు అమర్చిన గోడలు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి. తీర్చి దిద్దిన అలంకరణ... కనువిందు చేస్తోంది. అలాగే మాజీ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ సౌథింగ్టన్ ఓహియో హోమ్ లోని పైకప్పులు, గోడలు, గదుల్లోని ప్రతి అలంకరణకు తోడు.. బాత్రూం ఇంటీరియర్లు.... అతడి విలాసవంతమైన జీవితాన్ని బహిర్గత పరుస్తున్నాయి. 1980, 90 లమధ్య మైక్.. నివసించిన ఓహియో హోమ్ లోని రెస్ట్ రూం, బంగారపు వన్నెచిన్నెలద్దిన బ్రహ్మండమైన బ్లాక్ హాట్ టబ్, అద్దాల గోడలు, ఆకట్టుకునే డైజనర్ కిటికీలు అత్యున్నత సౌందర్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 1999 లో 49 ఏళ్ళ వయసున్న మైక్.. తన ఇంటిని అమ్మేసి లాస్ వెగాస్ లో నివసిస్తున్నాడు. ఆ తర్వాత అతడి ఇల్లు చర్చిగా రూపాంతరం చెందింది. కెనడాలోని ఓ ప్రైవేట్ ద్వీపంలో ఉన్న కెనడియన్ గాయని సెలిన్ డయాన్ అందమైన ఆరు బెడ్ రూమ్ ల ఇంట్లో ఉండే బాత్ రూం లోని టబ్.. బంగారు వన్నెలతో అలంకరించి ఉంది. అలాగే 47 ఏళ్ళ ఓ గాయకుడి ఇంట్లోని బాత్ టబ్ కూడ ఎర్రని రంగులో రిచ్ క్లాసిక్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ఐకానిక్ సినిమా స్టార్ కాథరిన్ హెప్ బర్న్ ఒకప్పటి లాస్ ఏంజిల్స్ మాన్షన్ లోని బాత్ రూం చూపరుల కళ్ళు మిరుమిట్లు గొలుపేట్టు చేస్తోంది. బాత్ రూమ్ లోని మార్బుల్ ఫ్లోర్, హాట్ టబ్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అలాగే ఫ్లోరిడాలోని పాప్ స్టార్ జాసన్ డెరూలో స్నానాల గది.. డినీస్ రిచర్డ్స్ లేడీస్ రూం, లివింగ్ రూం లా కనిపించే కెవిన్ కాస్టనర్ ఇంట్లోని బాత్ రూమ్ లు కూడ విభిన్న అలంకరణలు, ఆకట్టుకునే అందమైన గోడలు, క్లాసిక్ లుక్ నిచ్చే బాత్ టబ్ లతో కళ్ళు తిప్పుకోలేని సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇక న్యూయార్క్ లోని ప్రముఖ కళాకారుడు ఎడ్వర్డ్ హోపర్స్ వాష్ రూమ్... విక్టోరియా మాన్షన్ ను తలపిస్తుండగా.. బకింగ్ హామ్ షైర్ లో.. బ్రిటిష్ సినిమాల షూటింగ్ లకు తరచుగా వాడే.. జేమ్స్ బాండ్ స్టార్ రోగర్ మూరె ఇంట్లో కాంతులీనే తెల్లని బాత్ రూమ్ లు ఇంటీరియర్ డిజైన్లకే మోడల్స్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మాంఛెస్టర్ సిటీలోని ఇరవై ఏళ్ళ అతి చిన్న వయసైన సాకర్ స్టార్ రహీమ్ స్టెర్లింగ్ రెస్ట్ రూం ఏకంగా ఎందరికో కలల సౌధంగా కనిపిస్తుండటం ఇంటీరియర్ డిజైనింగ్ ప్రపంచాన్నే శాసిస్తోంది. వారి వారి ఇష్టాలకు అనుగుణంగా నిర్మించుకున్న ఇంటీరియర్ డిజైన్లు ప్రముఖులు, సెలబ్రిటీల అనుభూతులను, వారి విలాసవంతమైన జీవితాలను కళ్ళముందుంచుతున్నాయి. -
డ్రగ్స్ + మందు + మగువ = మైక్ టైసన్
20 ఏళ్ల కుర్రాడతడు.. మహా అయితే అప్పుడే కెరీర్లో ఎదిగే వయస్సది.. కానీ అంత చిన్న వయస్సులోనే అతడు ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్‌ను అందుకుని పెను సంచలనమే సృష్టించాడు.. ఇంకేముంది..లెక్కలేనంత డబ్బు ఒళ్లో వచ్చి వాలింది.. దీంతో జీవితం కట్టు తప్పింది.. చెప్పే వారు లేక.. వినే ఓపిక లేక.. విచ్చలవిడి వ్యవహార శైలితో అధోగతి పాలయ్యాడు. ఎంతలా అంటే అత్యంత విలాసవంతమైన జీవితం గడిపి డబ్బును మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టిన చేతులతోనే జైలు ఊచలు లెక్కపెట్టాడు.. ఇంతకీ ఈ దురదృష్టవంతుడెవరో కాదు.. ది గ్రేట్ మహ్మద్ అలీ తర్వాత అంతటి మొనగాడు తనే అని ప్రపంచమంతా చెప్పుకున్న మైక్ టైసన్. - రంగోల నరేందర్ గౌడ్ చిన్ననాటి జీవితం బాధాకరం.. టైసన్ జీవితాన్ని గమనిస్తే మనకు ఓ సినిమా కథకు కావాల్సినంత సరంజామా దొరుకుతుంది. మైదానంలోనూ, బయట ఇంత హింసాత్మకంగా ప్రవర్తించడానికి కారణం అతడి బాధాకరమైన బాల్యమే. అందరూ ఉన్నా అనాథలాగే పెరిగాడు. తల్లి మద్యానికి బానిస.. దీనికి తోడు స్వేచ్ఛా జీవితం. వ్యభిచార గృహాన్ని నిర్వహించే తండ్రయితే టైసన్‌తో పాటు అతడి తోబుట్టువులకు ఎప్పుడో కానీ కనిపించే వాడు కాదు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన టైసన్ సహజంగానే ఎవరినీ లెక్కచేసేవాడు కాదు. దాదాపు రౌడీలా పెరిగాడు. పదేళ్లు రాకముందే స్కూల్‌కు డుమ్మా కొట్టి దొంగతనాలు చే యడం అలవాటు చేసుకున్నాడు. ఈ కారణంగా పలుమార్లు పోలీసులకూ పట్టుబడ్డాడు. చాలాసార్లు వారు ఇతడిని నిర్బంధ శిక్షణ కేంద్రాలకు పంపించారు. మహ్మద్ అలీ రాకతో.. ఓసారి టైసన్ ఉంటున్న సెంటర్‌ను బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ సందర్శించారు. ఆయన గురించి తెలుసుకున్న టైసన్.. తానూ బాక్సర్‌ను కావాలని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమైతే జరిగింది కానీ బాక్సింగ్ గురించి టైసన్‌కు తెలిసింది శూన్యం. అప్పుడు తనతోపాటు అక్కడే ఉంటున్న ఓ బాక్సర్ మార్గదర్శకంగా నిలిచాడు. బయటికి వెళ్లాక వెటరన్ కోచ్ కస్ డి అమటోను కలవమని సలహా ఇచ్చాడు. టైసన్ పంచ్ పవర్‌ను గమనించిన కోచ్ మరో మాట లేకుండా తనతో చేర్చుకున్నాడు. చాంపియన్ అవతారం.. కోచ్ జిమ్‌లోనే తన శరీరాన్ని ఓ బాక్సర్‌గా మలుచుకున్నాడు. ఓసారి తన ఆటతీరును రింగ్‌లో ప్రదర్శించి బయటకు వస్తున్నప్పుడు కోచ్ అమటో పక్కనున్నతడితో ఓ మాటన్నాడు.. ‘అదిగో ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్’ అని. దీనికితోడు 14 ఏళ్ల వయస్సులో ‘నీవో అద్భుత ఫైటర్‌వి’ అని కోచ్ పదేపదే చెప్పే మాటలతో యువ టైసన్ ఎంతగానో ఉత్తేజితుడయ్యేవాడు. అప్పటిదాకా అతడి గురించి ఏ ఒక్కరూ ఒక మంచి మాటైనా చెప్పింది లేదు. కోచ్ మాటల ప్రభావం టైసన్‌పై విశేషంగా పడింది. బాక్సర్ల గురించి పుస్తకాలను టైసన్‌తో అమటో చదివించాడు. ఎనిమిది సెకన్లలోనే.. 1981 జూనియర్ ఒలింపిక్స్ తనకు తొలి మేజర్ టోర్నమెంట్. ఇక్కడే తనపై తనకు ఎంతగానో నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే 15 ఏళ్ల వయస్సులో.. కేవలం ఎనిమిది సెకన్లలో.. ఒకే ఒక్క పంచ్‌కు ప్రత్యర్థిని మట్టి కరిపించి స్వర్ణం సాధించాడు. అయితే అప్పటికే తను విపరీతంగా తాగడం కాకుండా డ్రగ్స్‌కు కూడా అలవాటు పడ్డాడు. దీనికి తోడు ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ డిగో మారడోనాతో సమానంగా పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉండడంతో ఆ ‘మత్తు’లో మెల్లగా జీవితం కట్టు తప్పసాగింది. టైసన్ శకం... టైసన్ కెరీర్లో అతి పెద్ద సంచలనం 1986లో నమోదైంది. 20 ఏళ్ల వయస్సులో డిఫెండింగ్ చాంపియన్ ట్రెవర్ బెర్బిక్ను మట్టికరిపించి వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్ల్యుబీసీ)ను గెలుచుకున్నాడు. ఇది బాక్సింగ్ చరిత్రలో అతిపెద్ద విజయంగా విమర్శకులు పేర్కొన్నారు. అంతేకాకుండా తన ఆరాధ్యుడు మహ్మద్ అలీని ఓడించిన బెర్బిక్పై విజయం ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యిందని టైసన్ భావించాడు. ఇక్కడి నుంచి టైసన్ శకం ప్రారంభమైంది. ఎక్కడికెళ్లినా నీరాజనాలు.. లెక్కలేనంత డబ్బుతో టైసన్ పెద్ద సెలబ్రిటీగా మారాడు. కానీ టైసన్ భవిష్యత్‌ను ముందుగానే ఊహించిన కోచ్ డి అమటో మాత్రం తన శిష్యుడి ఎదుగుదలను ప్రత్యక్షంగా చూడలేకపోయారు. ఇది టైసన్‌ను కూడా తీవ్రంగా బాధించింది. 1990లో షాక్.. ఐరన్ మైక్ టైసన్‌గా పేరుతెచ్చుకున్న తనకు 1990లో జీవితంలో కోలుకోలేని షాక్ తగిలింది. టోక్యోలో జేమ్స్ డగ్లస్‌తో పోటీ అది. మహామహులనే ఓడించిన టైసన్‌కు ఇతడొక లెక్కా.. అనే అనుకున్నారంతా. పంటర్లంతా పెద్ద ఎత్తున టైసన్‌పై పందాలు కాసారు. అప్పటికే విందు వినోదాల్లో కూరుకుపోయిన టైసన్ సరైన ప్రాక్టీస్ కూడా చేయలేకపోయాడు. బౌట్ అనంతర వెలువడిన ఫలితం చూసి ఓ రకంగా ప్రపంచం నిర్ఘాంత పోయింది. జరిగింది నిజమా? కలా? నమ్మలేకపోయారు. ఓటమనేది తెలీని టైసన్‌కు తొలిసారి పరాజయం. ఇక అక్కడి నుంచి జారిపడిన టైసన్ మళ్లీ లేవలేకపోయాడు. ఇవాండర్ హోలీఫీల్డ్‌తో జరిగిన ఫైట్‌లో ఓటమి తట్టుకోలేక చెవి కొరికాడు. బాక్సింగ్ లోపల పని లేకపోవడంతో బయట తన ‘ప్రతాపం’ చూపసాగాడు. వీధి గొడవలు, భార్యతో విడాకులు, రేప్ కేసులు చివరికి జైలుపాలు. జైల్లో అయినా సక్రమంగా ఉన్నాడా అంటే అదీ లేదు. అక్కడ విచ్చలవిడి శృంగారంతో భ్రష్టు పట్టిపోయాడు. ఎంతలా అంటే మామూలు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా సరైన శక్తి లేనంతగా.. జైల్లోనే ఇస్లాం స్వీకరించాడు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దివాలా తీశాడు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు వెంటాడాయి. కూతురు మరణం తట్టుకోలేకపోయాడు. పశ్చాత్తాపం మొదలు... ఇప్పుడు తన జీవితంపై 47 ఏళ్ల వయస్సులో పశ్చాత్తాపపడుతున్నాడు. అందుకే 2011లో అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో టైసన్‌ను చేర్చినప్పుడు తన జీవితంపై ఆశ్చర్యపోయాడు. ‘వెనక్కి తిరిగి చూసుకుంటే అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించింది నేనేనా అని అనిపిస్తుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ‘ది అన్డిస్ప్యూటెడ్ ట్రూత్’ అనే పేరిట ఈ దుర (అ)దృష్టవంతుడు జీవిత చరిత్ర రాస్తున్నాడు. పతనం ఆరంభం... టైసన్ ఒక్కో బౌట్లో ప్రత్యర్థిపై పిడిగుద్దులు విసురుతూ బాక్సింగ్ రింగ్‌లో అజేయుడుగా నిలుస్తున్నాడు. అప్పటికి దిగ్గజాలుగా పెరుతెచ్చుకున్న జేమ్స్ స్మిత్, మైకేల్ స్పింక్స్, లారీ హోమ్స్, పింక్లోన్ థామస్, టోరీ టక్కర్‌లను అత్యంత సులువుగా ఓడించి ఔరా అనిపించుకున్నాడు. దీంతో విపరీతంగా డబ్బు వచ్చిపడుతోంది. దాన్ని సరైన రీతిలో ఎలా ఖర్చు చేయాలో తెలీకపోవడంతో పాటు ఎక్కడికి వెళుతున్నావు.. ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదా? అని అడిగేవారు లేకపోవడంతో తెగిన గాలిపటంలా మారిపోయాడు. విచ్చలవిడిగా పార్టీలు ఇచ్చేవాడు. ఒక్కోసారి అవి నాన్‌స్టాప్‌గా సాగేవి. ఒక్కో క్లబ్ నుంచి మరో క్లబ్‌కు.. ఒక్కో నగరం నుంచి మరో నగరానికి ఇలా సాగేవి.