Liger Movie Team Birthday Wishes To Legend Mike Tyson With Special Video | Vijay Deverakonda - Sakshi
Sakshi News home page

Mike Tyson Birthday-Liger Team: మైక్‌ టైసన్‌ బర్త్‌డే, ఆసక్తికర సీన్స్‌తో లైగర్‌ టీం స్పెషల్‌ వీడియో రిలీజ్‌

Published Thu, Jun 30 2022 1:03 PM | Last Updated on Thu, Jun 30 2022 1:26 PM

Liger Movie Team Wishes Mike Tyson On His Birthday With Special Video - Sakshi

ప్రముఖ బాక్సింగ్‌ దిగ్గజం, లెజెండరి ఆటగాడు మైక్‌ టైసన్‌ లైగర్‌ మూవీతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.  పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా  తెరకెక్కిన చిత్రంలో ఆయన ఓ కీ రోల్‌ పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే నేడు మైక్‌ టైసన్‌ బర్త్‌డే సందర్భంగా లైగర్‌ టీం ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేసింది.  గురువారం(జూన్‌ 30)మైక్‌ టైసన్‌ బర్త్‌డే సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో లైగర్‌ టీం ఒక్కొరుగా ఆయనకు బర్త్‌డే విషెస్‌ చేబుతున్న వీడియోను తాజాగా పూరీ కనెక్ట్స్‌ అనే ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 

చదవండి: టాలీవుడ్‌లో సాయి పల్లవి బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరో తెలుసా?

ఇందులో నిర్మాత కరణ్‌ జోహార్‌, హీరో విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, చార్మి కౌర్‌, ఇతర నటీనటులతో పాటు చివరగా పూరీ జగన్నాథ్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచమంతా మిమ్మల్ని చూసి గర్విస్తుంది మైక్‌ టైసన్‌, హ్యాపీ బర్త్‌డే అంటూ కరణ్‌ ఆయనను కొడియాడాడు. ఈ వీడియోలో టైసన్‌కు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా సెట్స్‌లో ఆయన సందడి చేసిన కొన్ని ఆసక్తికర సీన్స్‌తో ఈ వీడియోను మలిచింది చిత్రం బృందం. ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రేక్షకులను, మైక్‌ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అగస్ట్‌ 25న  ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో లైగర్‌ థియేటర్లలో అలరించనుంది. 

చదవండి: ప్రస్తుతం ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా: శ్రుతి హాసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement