సాయి పల్లవి బర్త్‌ డే.. ఆమె కోసం స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చిన టీమ్! | Thandel Movie Team Creates Special Video On Sai Pallavi Birthday, Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Sai Pallavi: సాయి పల్లవి బర్త్‌ డే స్పెషల్‌.. తండేల్ ‍టీమ్‌ సర్‌ప్రైజ్‌!

Published Thu, May 9 2024 11:10 AM | Last Updated on Thu, May 9 2024 1:49 PM

Thandel Movie Team Creates Specia lVideo On Sai pallavi Birthday

ఫిదా మూవీతో తెలుగువారి గుండెలు కొల్లగొట్టిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా అభిమానుల్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్‌ మూవీ నటిస్తోంది. చందూ మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మత్య్సకారుల బ్యాక్‌డ్రాప్‌ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చైతూ మత్య్సకారుని పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఇవాళ సాయిపల్లవి బర్త్‌ డే కావడంతో తండేల్‌ చిత్ర యూనిట్‌ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. సాయి పల్లవి తెలుగు సినిమాలతో మెప్పించిన పాత్రలను వీడియోలో చూపించారు. ముఖ్యంగా తండేల్‌ మూవీ సెట్‌లో సాయిపల్లవి హావభావాలతో కూడిన స్పెషల్ వీడియో అద్భుతంగా రూపొందించారు. చివర్లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే సీన్‌తో ఆడియన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement