నటి సాయి పల్లవి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నిర్ధిష్టమైన నిర్ణయంతో కథలను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తున్నారామె. మరీ ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈమె డాక్టర్ కాబోయి యాక్టరైన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: అమితాబ్ బచ్చన్ పోస్ట్ వివాదం..రంగంలోకి దిగిన ముంబై పోలీసులు)
అంతే కాదు సాయిపల్లవిలో మంచి డ్యాన్సర్ కూడా. ప్రేమలో పడని వారు కళాకారులు కాలేరు అని ఇటీవల సీనియర్ దర్శకుడు భారతి రాజా కూడా పేర్కొన్నారు. అలాంటి అనుభవం నటి సాయి పల్లవి జీవితంలో కూడా జరిగిందట ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
తాను ఏడవ తరగతి చదువుతున్నప్పుడే తన సహా విద్యార్థిపై ఇష్టం ఏర్పడిందని సాయి పల్లవి తెలిపారు. అదంటే ఏదో తెలియని ఆసక్తి కలిగిందన్నారు. ఆ విషయాన్ని అతనికి తెలియజేయడం కోసం ప్రేమలేఖను రాశానన్నారు. అయితే దాన్ని అతనికి ఎలా అందజేయాలో తెలియక పుస్తకంలో పెట్టానన్నారు.
(ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. హోటల్ గదిలో ప్రముఖ సింగర్ సూసైడ్!)
అయితే ఆ ప్రేమ లేఖ తన తల్లి కంట పడడంతో బాగా కొట్టినట్లు వాపోయారు. అలా అమ్మ తనను కొట్టడం అదే మొదటిసారి, చివరి కూడా అని పేర్కొన్నారు. అప్పటి నుంచి అమ్మకు కోపం వచ్చేది ఏ పనీ చేయలేదని చెప్పారు. పిల్లల్ని మంచి మార్గంలో నడిపించే ప్రతి తల్లీ తన పిల్లలకు హీరోయిన్‌నే అని సాయిపల్లవి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment