love letter
-
చిచ్చురేపిన ప్రేమ లేఖ
కారెంపూడి: ఓ విద్యార్థిని వద్ద లభ్యమైన ప్రేమ లేఖ ఇద్దరు మండల విద్యాశాఖాధికారుల మధ్య చిచ్చురేపింది. దీంతో ఎంఈఓ–1, 2లు ఇద్దరూ రచ్చకెక్కారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ విద్యాశాఖ ప్రతిష్టను మసకబారుస్తున్నారు. స్థానిక కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో ఒక విద్యారి్థని వద్ద ప్రేమ లేఖ దొరకడంతో పాఠశాల ఎస్ఓ విద్యార్థిని మందలించారు. బాలిక తరుఫున ఒక పాస్టర్ వెళ్లి ఎస్ఓతో గొడవ పడ్డారు. దీంతో ఎంఈఓ–2 పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ ఘటన ఎంఈఓ–1కు ఆగ్రహం తెప్పించింది. ‘నేను చేయాల్సిన పని మీరెలా చేస్తారంటూ ఎంఈఓ–2పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోరు పారేసుకున్నారు. దీనికి ఎంఈఓ–2 తహసీల్దార్ చెబితే వెళ్లానని సమాధానమిస్తూ ఎంఈఓ–1 మాటలను కూల్‌గా రికార్డు చేసుకున్నారు. ఆ వాయిస్ రికార్డు వెలుగు చూడడంతో ఎంఈఓ–1 మళ్లీ ఆగ్రహించారు. దీనికి కౌంటర్‌గా అన్నట్లు ఎంఈఓ–2 టీచర్లను బెదిరిస్తున్న ఆడియో ఒకటి వెలుగు చూసింది. ఒక స్కూల్లో ముగ్గురు టీచర్లుంటే ఒక టీచర్‌కు మద్దతుగా మిగతా ఇద్దర్ని బెదిరిస్తూ ఎంఈఓ–2 మాట్లాడిన ఫోన్ సంభాషణ అది. ఆ టీచర్ ‘‘మీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానంటోందని ఎంఈఓ–2 చెబుతూ భయపెట్టినట్టు ఆడియోలో ఉంది. గతంలోనూ విభేదాలే ఎంఈఓలిద్దరి మధ్య గతంలోనూ విభేదాలు ఉన్నట్టు సమాచారం. ఒకరిపై ఒకరు అధికారులకు తరచూ ఫిర్యాదులు చేసుకుంటున్నారని తెలుస్తోంది. వారిద్దరూ విధుల్లో చేరిన దగ్గర నుంచి సఖ్యత లేదని సమాచారం. ఆదర్శంగా ఉంటూ పాఠశాలలను సవ్యంగా నడిపించాల్సిన వారే తగువులాడుకుంటుండడంతో సహజంగానే ఆ దు్రష్పభావం పాఠశాలలపై పడుతోంది. అంతర్లీనంగా ఉపాధ్యాయుల మానసిక స్థెర్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి ఘటనలు తావిస్తున్నాయి. వాస్తవానికి ఎంఈఓ–1 మండల విద్యాశాఖ కార్యాలయానికి సంబంధించిన పూర్తి విధులు, బాధ్యతలు నిర్వర్తించాలి. ఎంఈఓ–2 పాఠశాలలను తనిఖీ చేస్తూ అడకమిక్ పురోగతికి పాటుపడాలి. అందుబాటులో ఉండని ఎంఈఓ–1కారెంపూడి ఎంఈఓ–1 వెల్దుర్తి, గురజాల, మాచర్ల, దాచేపల్లి మండలాలకూ ఎంఈఓ–1గా ఎఫ్ఏసీగా పని చేస్తున్నారు. దీంతో ఆయన అన్నిచోట్లా అందుబాటులో ఉండడం సాధ్యం కాకపోవడంతో ఆయన విధుల్లో ఎంఈఓ–2 వేలు పెడుతున్నారని స్పష్టమవువుతోంది. అత్యవసర సమయాల్లో ఇతర విద్యాశాఖ కార్యక్రమాలలో అందుబాటులో ఉన్న ఎంఈఓ–2నే పాల్గొంటున్నారు. సమస్య వచ్చినప్పుడు పని ఒత్తిడి వల్ల ఎంఈఓ–1 అందుబాటులో ఉండలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ సమస్యను ఉన్నతాధికారులు పరిష్కరించకపోతే మండలంలో విద్యాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్‌ను గమనించారా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్మర్చంట్, శైలా విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలే ఇందుకు నిదర్శనం. అనంత్-రాధిక నిశ్చితార్థం వేడుక మొదలు ఇటీవల, ఇటలీలో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల దాకా ప్రతీదీ అత్యంత ఘనంగా నిర్వహించారు. లగ్జరీ క్రూయిజ్‌లో 800మందికి పైగా అతిథులతో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన విశేషాలు రోజుకొకటి నెట్టింట విశేషంగా మారు తున్నాయి. ముఖ్యంగా కాబోయే వధువు రాధిక మర్చంట్ దుస్తులు, నగలతో పాటు, అత్తగారి హోదాలో నీతా అంబానీ లుక్, ఖరీదైన నగలు చర్చనీయాంశంగా నిలిచాయి. తాజాగా సినీ నిర్మాత రియా కపూర్ రాధిక మర్చంట్ దుస్తులకు సంబంధించిన ప్రత్యేకతలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. రాధిక ధరించిన గౌనుపై అనంత్ లవ్ లెటర్‌ను అందంగా పొందుపరచడం విశేషం. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) అలాగే బంగారు పూతతో తయారు చేసిన మరో అద్భుతమైన డ్రెస్ వివరాలను కూడా రియా అందించారు. అంబానీ రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా టోగా పార్టీలో రాధిక ధరించిన గ్రేస్ లింగ్ ‘కోచర్’ని గురించి పరిచయం చేశారు. రాధిక బాడీకి అతికినట్టు సరిపోయింది అంటూ దీన్ని తయారు చేసిన టీంకు అభినందనలు తెలిపారు. అత్యాధునిక 3డీ టెక్నాలజీతో 30 మంది కళాకారులు దీన్ని తయారు చేశారట. -
అనంత్ ప్రేమంతా రాధిక గౌను మీదే..! వైరల్ ఫొటోలు
-
70 ఏళ్ల నాటి ప్రేమ లేఖ..అది మరో 'సీతారామం' సినిమా!
ప్రేమికుల గాథలు ఎన్నో చూశాం. కొన్ని విజయవంతమవ్వగా మరికొన్ని విషాదంగా ముగుస్తాయి. ఏదీఏమైనా ప్రేమికులకు సంబంధించిన స్టోరీలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అలాంటి కథే రసవత్తరంగా తెరపైకి వచ్చింది. ఓ లేఖ రూపంలో ఆ గాథ వెలుగులోకి వచ్చింది. అయితే ఆ లేఖ ఎవరూ రాశారు. ఎవరిదీ ఆ ప్రేమ గాథ అనేది మాత్రం మిస్టరీ! వివరాల్లోకెళ్తే..మిచిగాన్‌లోని గ్రాండ్ ర్యాపిడ్స్ అనే ప్రాంతం నుంచి హృదయాన్ని కదిలించే ప్రేమ గాథ వెలుగులోకి వచ్చింది. రిక్ ట్రోజనోవ్స్కీ అనే వ్యక్తికి 70 ఏళ్ల నాటి ప్రేమలేఖ ఒకటి దొరికింది. అతడు 2017లో వ్యవసాయానికి సంబంధించిన వేలంలో ఓ టూల్ బాక్స్‌ని కొనుగోలు చేయగా, అందులో 70 ఏళ్ల క్రితం నాటి లేఖ బయటపడింది. అది శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆర్మీ కార్పోరల్ ఇర్విన్ ఫ్లెమింగ్ రాసిన లేఖ. గ్రాండ్ ర్యాపిడ్స్‌లో ఉంటున్న మేరీ లీ క్రిబ్స్ అనే మహిళకు రాసిన లేఖ అది. అందులో.. "ఇన్నాళ్లు నీకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు. దేశ సేవ నుంచి తిరిగి వచ్చిన వెంటనే వివాహం చేసుకుంటాను". అని రాసి ఉంది. అయితే ఆ లేఖను ఎవరూ మర్చిపోయారనేది తెలియాల్సి ఉంది. దీంతో రిక్ ఆ లేఖకు సంబంధించిన వారితో ఆ లేఖను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ బాక్స్‌లో పెట్టి మర్చిపోయినా ఆ ప్రేమ లేఖ వెనుక ఉన్న కథను అన్వేషించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు. ఆన్లైన్ సాయంతో ప్రేమికులైన ఫ్లెమింగ్, క్రిబ్స్ని కనుగొని లేఖలో ఉన్నట్లు వారి ప్రేమ సఫలం అయ్యిందో లేదా అని తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు. అయితే తన అన్వేషణ ఫలిస్తుందో లేదో తెలియదు గానీ ఇది తనకు ప్రేమకున్న బలం, శక్తి గురించి గొప్ప అనుభూతిని ఇస్తుందని చెబుతున్నాడు రిక్. అయితే ఆ లేఖ ఈ రోజుల్లో రాసింది మాత్రం కాదంటున్నాడు రిక్. ఎందుకంటే ..ఆ లేఖ మొత్త కవిత్వంలా సాగింది. ప్రసతుతం రిక్ ఆ జంటకు సంబంధించిన బంధువులను వెతికే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే దీని వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా..వారి సంబంధికులు లేదా వారి పిల్లలను కనుక్కుంటే వారి ప్రేమ సఫలం అయ్యిందో లేదా తెలుసుకోగలను, అలాగే వారు కూడా ఓ గొప్ప అనుభూతిని పొందుతారు అని చెబుతున్నాడు రిక్. (చదవండి: మన ప్రేమలు ఏడు రకాలు!) -
నిహారిక లవ్ లెటర్.. సోషల్ మీడియాలో వైరల్!
నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా కెరీర్ మొదలెట్టి.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిహారిక ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలో పెళ్లిలో సందడి చేసింది. అన్న పెళ్లి డ్యాన్స్ వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటలీ జరిగిన గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా ఫ్యామిలీ కూడా హాజరైంది. అయితే ప్రస్తుతం మరో పెద్ద బాధ్యతను నిహారిక తీసుకుంది. దాదాపు 15 మంది కొత్త నటీనటులతో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి నూతన దంపతులు వరుణ్ - లావణ్య కూడా హాజరయ్యారు. అయితే తాజాగా నిహారిక తన ఇన్‌స్టాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. తనకు అత్యంత ఇష్టమైనవారికి.. అంతే కాకుండా తన జీవితంలో ప్రేరణగా నిలిచిన వారందరికీ ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ ఓక్క వీడియోలోనే అందరూ వచ్చేలా పోస్ట్ చేసింది. వీడియోతో పాటు 'లవ్ లెటర్ టూ ఆల్ మై ఏంజెల్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అందులో లావణ్య త్రిపాఠి, శ్రీజ కొణిదెల, జ్యోతిరాజ్ సందీప్, నిహారిక మదర్ కూడా ఉన్నారు. నా జీవితంలోకి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. మీతో గడిపిన క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను అంటూ ప్రస్తావించింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
కూతురికి లవ్ లెటర్.. విడిచిపెట్టని తల్లి.. 15 ఏళ్లపాటు కోర్టులో కేసు..
యూపీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. 15 ఏళ్ల క్రితం నాటి ఒక కేసులో నిందితునికి కోర్టు ఎట్టకేలకు శిక్ష విధించింది. ఒక మైనర్ బాలుడు మరో మైనర్ బాలికకు లవ్ లెటర్ రాశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపధ్యంలో బాలిక తల్లి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే యూపీలోని బాందా జిల్లాలో 2008లో ఒక మైనర్ బాలునిపై ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఆమె ఆ బాలుడు.. తమ కుమార్తె(బాలిక)కు అశ్లీల రీతిలో ఉత్తరం రాయడమే కాకుండా వేధించాడని పేర్కొంది. దీంతో పోలీసులు ఆ బాలునిపై కేసు నమోదు చేశారు. విషయం కోర్టు వరకూ చేరింది. గత 15 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో పలువురు జడ్జిలు కూడా మారారు. ఎట్టకేలకు చివరికి ఆ యువకుడిని (అప్పుడు బాలుడు) దోషిగా నిర్థారిస్తూ ఏడాదిపాటు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అలాగే మూడు వేల రూపాయల జరిమానా కూడా విధించారు. తెలిసీ తెలియని వయసులో రాసిన ఒక లవ్ లెటర్ కారణంగా ఆ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఈ ఉదంతం యూపీలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. 2008 మే 21న ఒక మహిళ తన కుమార్తెకు ఒక కుర్రాడు అశ్లీల రాతలతో కూడిన ఉత్తరం రాశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిని కోర్టుకు అప్పగించారు. ఈ కేసు 2008లో మొదలై 2023 వరకూ ఏకంగా 15 ఏళ్లపాటు సాగింది. ఈ కేసులో 70 నుంచి 80 వాయిదాలు పడగా, పదిమందికిపైగా జడ్జిలు కూడా మారారు. కాగా తాజాగా ఒక ఉన్నతాధికారి ఈ కేసులో చొరవచూపి, త్వరగా కేసును పరిష్కరించాలని జడ్జి బీడీ గుప్తాకు విన్నవించారు. ఈ నేపధ్యంలో నిందితుడు స్వయంగా జడ్జి ముందు తన తప్పును ఒప్పుకున్నాడు. తాను ఎటువంటి కేసును ఎదుర్కోలేనని, ఇటువంటి తప్పు మరోమారు చేయబోనని విన్నవించుకున్నాడు. దీంతో జడ్జి ఆ యువకుని సత్ప్రవర్తనను గుర్తించి, ఏడాదిపాటు పరిశీలన(ప్రొబెషన్)శిక్ష విధించారు. దీంతో ఆ యువకుడు ప్రాసిక్యూటింగ్ అధికారి పరిశీలనలో ఏడాది పాటు ఉండవలసి ఉంటుంది. -
స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్
నటి సాయి పల్లవి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నిర్ధిష్టమైన నిర్ణయంతో కథలను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తున్నారామె. మరీ ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈమె డాక్టర్ కాబోయి యాక్టరైన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: అమితాబ్ బచ్చన్ పోస్ట్ వివాదం..రంగంలోకి దిగిన ముంబై పోలీసులు) అంతే కాదు సాయిపల్లవిలో మంచి డ్యాన్సర్ కూడా. ప్రేమలో పడని వారు కళాకారులు కాలేరు అని ఇటీవల సీనియర్ దర్శకుడు భారతి రాజా కూడా పేర్కొన్నారు. అలాంటి అనుభవం నటి సాయి పల్లవి జీవితంలో కూడా జరిగిందట ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను ఏడవ తరగతి చదువుతున్నప్పుడే తన సహా విద్యార్థిపై ఇష్టం ఏర్పడిందని సాయి పల్లవి తెలిపారు. అదంటే ఏదో తెలియని ఆసక్తి కలిగిందన్నారు. ఆ విషయాన్ని అతనికి తెలియజేయడం కోసం ప్రేమలేఖను రాశానన్నారు. అయితే దాన్ని అతనికి ఎలా అందజేయాలో తెలియక పుస్తకంలో పెట్టానన్నారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. హోటల్ గదిలో ప్రముఖ సింగర్ సూసైడ్!) అయితే ఆ ప్రేమ లేఖ తన తల్లి కంట పడడంతో బాగా కొట్టినట్లు వాపోయారు. అలా అమ్మ తనను కొట్టడం అదే మొదటిసారి, చివరి కూడా అని పేర్కొన్నారు. అప్పటి నుంచి అమ్మకు కోపం వచ్చేది ఏ పనీ చేయలేదని చెప్పారు. పిల్లల్ని మంచి మార్గంలో నడిపించే ప్రతి తల్లీ తన పిల్లలకు హీరోయిన్నే అని సాయిపల్లవి పేర్కొన్నారు. -
Barefoot Empress: పోరాడే వాళ్లకో ప్రేమలేఖ
‘ఏదైనా సాధించాలనుకుని పోరాడే వాళ్లకు ఈ డాక్యుమెంటరీ ఒక ప్రేమలేఖ’ అంటాడు అంతర్జాతీయ చెఫ్ వికాస్ ఖన్నా. 94 ఏళ్ల వయసులో పట్టుబట్టి కేరళ సాక్షరతా మిషన్‌లో నాలుగో క్లాసు పాసైన కార్తాయని అమ్మ మీద అతడు ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ పేరుతో డాక్యుమెంటరీ నిర్మించాడు. ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఆ డాక్యుమెంటరీ త్వరలో భారతప్రేక్షకుల కోసం రిలీజ్ కానుంది. ఈ డాక్యుమెంటరీ ఆడపిల్లలందరినీ చదివించక తప్పని స్ఫూర్తినిస్తుంది అంటున్నాడు వికాస్. అంతర్జాతీయ వంటగాడిగా ఖ్యాతి పొందిన వికాస్ ఖన్నాకు నానమ్మ వయసు ఉన్న వారు ఇచ్చే స్ఫూర్తి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఎందుకంటే అతడు జన్మతః కాళ్లలో ఇబ్బందితో పుట్టాడు. అంటే 13 ఏళ్ల వరకు పరిగెత్తడం అతనికి సాధ్యం కాలేదు. దాంతో ఆడుకోవడానికి వెళ్లేవాడు కాదు. అందువల్ల అతడి నానమ్మ అతణ్ణి తన వంటగదిలో కూచోబెట్టుకుని వంటలు చేస్తూ మంచి మంచి కబుర్లు చెప్పేది. ఆమె వల్ల అతను స్ఫూర్తి పొందాడు. అంతే కాదు గొప్ప వంటవాడు అయ్యాడు. ఇప్పుడు బహుశా కేరళ కార్తాయని అమ్మను చూసినప్పుడు అతనికి తన నానమ్మ గుర్తుకు వచ్చి ఉంటుంది. కార్తాయని అమ్మ 96 ఏళ్ల వయసులో చదువుకోవాలని సంకల్పించింది. పల్లెల్లో వయోజనులు చదువుకోవడం గురించి ఆలోచనే ఉండదు. ఇక 90 దాటిన వారిని ‘ఇంకా పిలుపు రాలేదా’ అన్నట్టు చూస్తూ ఉంటారు కొందరు. అలాంటిది కేరళలోని అలెప్పి జిల్లా ‘చెప్పడ్’ అనే చిన్న ఊళ్లోని కార్తాయని అమ్మ అందరి అంచనాలు తారుమారు చేసింది. కేరళ ప్రభుత్వం వయోజనుల కోసం ఏర్పాటు చేసిన అక్షరాస్యతా కార్యక్రమం కింద ఇంట్లో ఉండి చదువుకుని నాలుగో తరగతిని వందకు 98 మార్కులతో పాసయ్యింది. 15 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్నవారికి కనీస చదువు నేర్పాలనుకున్న ఈ కార్యక్రమంలో కార్తాయని అమ్మ ఉత్సాహంగా దూకింది. చదవడం (30 మార్కులకు పరీక్ష), రాయడం (40 మార్కులకు), లెక్కలు (30 మార్కులకు) ఈ మూడు అంశాల్లో ఉమ్మడిగా 100కు 30 మార్కులు వస్తే పాస్ చేస్తారు. కాని కార్తాయని అమ్మకు 98 మార్కులు వచ్చాయి. దాంతో ఆమెకు రాష్ట్రం మొత్తం సలామ్ చేసింది. ప్రతిష్ఠా్టత్మక కేంద్ర స్త్రీ శక్తి అవార్డు వరించింది. ‘ఏదైనా పట్టుబట్టి సాధించాలనుకునేవారికి ఆమెను మించిన స్ఫూర్తి లేదు’ అంటాకు వికాస్ ఖన్నా. ఇంతకు ముందు వికాస్ ఖన్నా ‘ది లాస్ట్ కలర్’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ డాక్యుమెంటరీ అతడి రెండో ప్రయత్నం. ఉత్త కాళ్లతో ఆమె ఒక యోధురాలిగా పరీక్ష రాయడానికి స్థానిక స్కూలుకు వెళుతున్న ఫొటో ఎవరినైనా కట్టి పడేస్తుంది. ఆ పరీక్షలో పాసయ్యి గెలిచి ఆమె పట్టుదలకు సామ్రాజ్ఞి అయ్యింది. అందుకే వికాస్ ఖన్నా ఈ డాక్యుమెంటరీకి ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ (ఉత్తకాళ్ల సామ్రాజ్ఞి) అని పెట్టాడు. నూరేళ్ల ఆయుష్షుకు చేరినా కార్తాయని అమ్మ ఇంకా చదువుకోవాలనే అభిలషిస్తోంది. ‘మరి అలాంటిది మన దేశంలో చిన్నారి ఆడపిల్లలు ఎంతమంది చదువుకోవాలని కోరుకుంటారో కదా. వారందరూ చదువుకోవాల్సిన అవసరాన్ని ఈ డాక్యుమెంటరీ చెప్తుంది’ అంటాడు వికాస్. ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఈ డాక్యుమెంటరీ త్వరలో మన దేశంలో బహుశా ఓటీటీ ద్వారా విడుదల కానుంది. -
స్కూల్లో ఓ అబ్బాయికి లవ్ లేటర్ రాశా, అది ఇంట్లో తెలిసింది..: సాయి పల్లవి
హీరోయిన్ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందం, అభినయంతో పాటు తన డాన్స్‌తో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల విరాట పర్వంతో హిట్ కొట్టిన సాయి పల్లవి గార్గి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న సాయి పల్లవి తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. విరాట పర్వం సినిమాలో హీరో భావాలు, అతని విప్లవాత్మక కవితలు నచ్చి లెటర్ రాశాను. ఈ సీన్ చేస్తున్నప్పుడు నా నిజ జీవితంలో నేను రాసిన ప్రేమలేఖ సంఘటన గుర్తొచ్చింది. నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయికి లవ్‌లెటర్ రాశాను. అయితే ఈ విషమం మా పేరెంట్స్‌కి తెలిసింది. అడ్డంగా దొరికపోడంతో ఇద్దరు కలిసి నన్ను బాగా కొట్టారు. ఆ రోజును ఇప్పటికి మరిచిపోలేను. లవ్ లేటర్ రాసేటప్పుడు ఈ విషయం మా పేరెంట్స్‌కి తెలుస్తుందని అనుకోలేదు. అది వారికి ఎలా తెలిసిందో కూడా తెలియదు’ అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఇక గార్గి మూవీ గురించి మాట్లాడుతూ.. తన మనుసుని బాగా కదిలించిన కథ ఇది అని పేర్కొంది. ‘ఫిదా, లవ్‌స్టోరి, విరాటపర్వం’ సినిమాల్లో తండ్రీకూతుళ్ల కథలో నటించాను. ఆ చిత్రాల్లో తండ్రితో కలిసి ఉండే పాత్ర నాది. కానీ ‘గార్గి’ చిత్రంలో భావోద్వేగం వైవిధ్యంగా ఉంటుంది. యుముడితో పోరాటం చేసి, సావిత్రి తన భర్త ప్రాణాలు దక్కించు కొన్నట్టు.. ఈ సినిమాలో నాకు దూరమైన నా తండ్రి కోసం న్యాయపోరాటం చేస్తాను. ఈ పాత్ర కోసం ఏం చేయాలి? ఎంత చేయాలి? అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాను’ అని చెప్పుకొచ్చింది. -
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ప్రేమలేఖ.. ఎవరికంటే ?
K Raghavendra Rao Book A Love Letter What I Wrote To Cinema: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలతో అనేక మంది హీరోలకు మంచి సక్సెస్ ఇచ్చారు. ఇక హీరోయిన్స్‌ను గ్లామర్‌గా చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనేలా పేరు తెచ్చుకున్నారు. అయితే మే 23 ఈ దర్శకేంద్రుడి జన్మదినం. ఈరోజుతో 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా తన జన్మదినానికి ఉన్న ప్రత్యేకతను ఒక లేఖ ద్వారా వివరించారు. 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' అనే పుస్తకాన్ని రాసినట్లు పేర్కొన్నారు రాఘవేంద్ర. ఈ పుస్తకం గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. ''ఈ జన్మదినం ప్రత్యేకత ఏంటంటే, దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. అది 1963వ సంవత్సరం. ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదటిరోజున ‘పాండవ వనవాసం’ చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌పై తొలిసారి క్లాప్ కొట్టడంతో నా కెరీర్ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు నాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. పదేళ్ల పాటు అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత మా నాన్నగారు కె.ఎస్ ప్రకాశ్‌రావు గారు అందించిన ‘బాబు’ (1975) చిత్రంతో దర్శకునిగా సినిమా ప్రయాణం. ఆ రోజు నుంచి మొదలైన నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, ఆనందాలు, ఎత్తులు, లోతులు అవార్డులు, రివార్డులు ఎన్నిచూసుంటాను. చదవండి: ఆ హీరోయిన్స్‌ను జిరాఫీలు అన్న అదితి రావ్.. ఎందుకంటే ? 48 ఏళ్ల దర్శకత్వ సుదీర్ఘ ప్రయాణం గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి. అందుకే 80 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో ‘‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’’అంటూ నా స్వహస్తాలతో నేను ఓ పుస్తకం రాసుకున్నాను. ఆ పుస్తకంలో నేను నడిచిన సినిమా దారిలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లతో పాటు, రచయితలతో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను. అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ (నా) ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతన్నాను. చదవండి: సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు నా ఈ స్థితికి కారణమైన 24 శాఖలవారికి అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాల గురించి ‘‘అబద్దాలు రాయటం అనర్ధం, నిజాలు రాయటానికి భయం.. అంటూ మనసు పెన్‌తో రాశాను, ఓపెన్‌గా రాశాను. ఏది కప్పి చెప్పలేదు. విప్పి చెప్పలేదు. కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం.....’’ అంటూ తన బుక్ గురించి చెప్పుకొచ్చారు దర్శక దిగ్గజం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. చివరగా నేను చెప్పేదొక్కటే ‘సినిమా అనేది ఇలానే ఉండాలి అనే గీత గీయకూడదు, ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి. ఈ పుస్తకం ప్రతి పుస్తకాలయాల్లో దొరుకుతుంది. పాఠలకులందరూ పుస్తకాన్ని చదివి ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. '' కె.రాఘవేంద్రరావు -
బ్రేకప్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతూ..
Naga Chaitanya Quotes About Green Lights For Life Goes Viral: సమంత-నాగచైతన్య విడాకుల అనంతరం ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ మరింత పెరిగింది. సాధారణంగానే సమంతతో పోలిస్తే నాగ చైతన్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. తన సినిమాలు, బైకులు, కార్ల గురించి తప్పా సోషల్ మీడియాలో వేరే పోస్టులు షేర్ చేయడు. తాజాగా చైతూ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పాపులర్ రైటర్ మాథ్యూ రాసిన 'గ్రీన్ లైట్స్' అనే పుస్తకాన్ని షేర్ చేసిన చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. 'లవ్ లెటర్స్ టూ లైఫ్..మీ జర్నీని షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మాథ్యూ.. ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్ లైట్(జీవితంలో ముందుకు వెళ్లడం, క్యారీఆన్ అనే అర్థం) అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఎప్పుడూ ప్రేమ, జీవితం లాంటి వాటిపై సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని చైతూ..బ్రేకప్ తర్వాత ఇన్‌స్టాలో తొలిసారి చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) సామ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన చై ప్రస్తుతం ఆ ఙ్ఞాపకాల్లోంచి బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమచారం. ఈ నేపథ్యంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. మరోవైపు సామ్ సైతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్, హాలీవుడ్లో సైతం ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. -
Bigg Boss 5 Telugu: సిరి చదవకుండా మిస్సైన లెటర్ ఇదే
Siri Boyfriend Srihan Letter: బిగ్‌బాస్-5 హౌస్‌లో ఎనిమిదోవారం నామినేషన్ ప్రక్రియ కాస్త ఎమోషనల్‌గా సాగింది. 50 రోజులుగా కుటుంబ సభ్యులకు దూరమైన కంటెస్టెంట్స్‌కి.. ఇంటి నుంచి లేఖలు వస్తే.. వాటితోనే నామినేషన్ ప్రక్రియను కొనసాగించాడు బిగ్‌బాస్. దీంతో ఒకరి కోసం మరొకరు త్యాగం చేయాల్సి వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత అయిన వాళ్ళ దగ్గర నుండి వచ్చిన లేఖలు కళ్ళ ముందు చినిగిపోతుంటే వారిలోని దుఃఖం ప్రేక్షకులను కూడా కంటతడి పెట్టించింది. (చదవండి: నా కొడుకు నాకు పుట్టలేదు, నీ బాధ అర్థం చేసుకోగలను: సిరి) మొదటగా పవర్ రూమ్‌లోకి వెళ్లిన మానస్, శ్రీరామ్‌లకు లోబో, ప్రియాంక లేఖలు అందాయి. దీంతో లోబో భార్య వద్ద నుంచి వచ్చిన లేఖను త్యాగం చేసి.. ప్రియాంకకు ఇచ్చాడు.. తర్వాత షణ్ను- రవిలకు విశ్వ, సిరి లేఖలు అందాయి. అయితే విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి. 'నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు, కాబట్టి నీకు పుట్టిన పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను' అంటూ విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్ అయింది. సిరి చేసిన త్యాగానికి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా సిరి కోసం ప్రియుడు శ్రీహాన్ రాసిన లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘హాయ్ సిరి మన ఏడేళ్ల రిలేషన్లో ఇన్ని రోజులు దూరంగా ఉంటామని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నా పక్కన లేకపోయినా మన లవ్‌ను ఫీల్ అవుతున్నాను. మా అమ్మ నాన్న తర్వాత నా గురించి ఎక్కువగా ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. మనం బాగున్నప్పుడు అందరూ మనల్ని నమ్ముతారు.కానీ నా దగ్గర ఏమి లేనప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మావు సిరి. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా. హ్యాపీగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వు బయటకు వచ్చాక పెళ్లిచేసుకొని జీవితాంతం కలిసుందాం’అంటూ శ్రీహాన్ తన ప్రేమలేఖను సిరికి అందించాడు. View this post on Instagram A post shared by Heysiri official (@sirihanmanth) -
నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ
ముంబై: ప్రజాప్రతినిధులకు సమస్యలపై విజ్ఞప్తి చేయడం చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం తన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు తనకు ప్రేయసి (గర్ల్‌ఫ్రెండ్)ను ఏర్పాటు చేయాలని లేఖ రాశాడు. ఆ లేఖ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘నేను మంచోడిని.. నన్నెవరు పట్టించుకోవడం లేదు.. మీ నియోజకవర్గ అమ్మాయిలను ప్రేమించేలా ప్రోత్సహించండి’ ఆ యువకుడు లేఖ రాశాడు. అయితే ఆ లేఖ ఎవరూ రాశారో కనుక్కుంటే విస్తుగొల్పే నిజం తెలిసింది. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా?: రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని రాజూరా ఎమ్మెల్యే సుభాశ్ ధొతేకు ఇటీవల ఓ లేఖ వచ్చింది. మరాఠీలో రాసిన ఆ లేఖ భూషణ్ జాంబవంత్ రాఠోడ్ పేరిట వచ్చింది. ఆ లేఖ తెరచి చూడగా.. ‘మన ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏ అమ్మాయి కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. గద్‌చందూర్ నుంచి రాజురా మధ్య నిత్యం ప్రయాణిస్తుంటా. భవిష్యత్‌లో నాకు ప్రేయసి దొరుకుతుందనే నమ్మకం నాకు లేదు. తాగుబోతులకు తప్ప ఎలాంటి చెడు అలవాట్లు లేని నాలాంటివారికి ప్రేయసి దొరకడం లేదు. దయచేసి మీ నియోజకవర్గంలో ఉన్న అమ్మాయిలను ప్రోత్సహించండి’ అంటూ ఆ లేఖలో ఎమ్మెల్యేకు సూచిస్తూ పంపాడు. ఆ లేఖను చూసిన ఎమ్మెల్యే వెంటనే ఆరా తీశారు. చదవండి: లవ్ ఫెయిలైన యువకుడి ప్రాణం నిలిపిన ఫేస్బుక్ భూషణ్ జాంబవంత్ రాఠోడ్ పేరుగల వారిని ఆరా తీయగా అలాంటి పేరుతో ఉన్నవారెవరూ లేరు. వైరల్‌గా మారడానికి ఇలా లేఖ రాశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ లేఖపై సోషల్ మీడియా ఫన్నీగా స్పందిస్తోంది. నీదే కాదు బ్రదర్ నా పరిస్థితి అంతే అంటూ సింగిల్ కింగ్‌లు పేర్కొంటున్నారు. ఫన్నీ మీమ్స్, కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి లేఖ రావడం ఇదే మొదటిసారిని ఎమ్మెల్యే పేర్కొన్నాడు. ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే అతడికి కౌన్సిలింగ్ ఇస్తామని ఎమ్మెల్యే సుభాష్ చెప్పాడు. -
ఒకరి భార్యకు ‘ఐ లవ్ యూ’ అని రాసి చిట్టి విసరడం నేరమే
ముంబై: పెళ్లయిన మహిళకు ప్రేమలేఖ ఇవ్వడం కూడా తప్పేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ప్రేమపేరుతో ఆమెకు లేఖ పంపడమంటే ఆమెను అవమానించినట్లే అని న్యాయస్థానం పేర్కొంది. ఈ విధంగా చేయడం ఆమె పాతివ్రత్యాన్ని శంకించడం కిందకు వస్తుందని ధర్మాసనం తెలిపింది. పదేళ్ల కేసుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆసక్తికరంగా ఉన్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి... 2011లో ఓ కిరాణ దుకాణ యజమాని ఒక్కడ పనిచేసే వివాహితకు ప్రేమలేఖ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో ఓ చిట్టిపై ‘ఐ లవ్ యూ’ అని రాసి పడేసి వెళ్లాడు. అంతటితో ఆగకుండా రోజు వింత ప్రవర్తనతో ఆమెకు విసుగు తెప్పించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె అకోలాలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో 2018 జూన్ 21వ తేదీన సెషన్స్ కోర్టు ఆ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.40 వేల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పును అతడు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తోందని న్యాయస్థానానికి తెలిపాడు. తన దుకాణంలో సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఇలా ఆరోపణలు చేసిందని వాపోయాడు. అయితే అతడి వాదనను న్యాయస్థానం నమ్మశక్యంగా లేదని గ్రహించింది. పైగా బాధితురాలి వైపు బలంగా సాక్ష్యాలు ఉండడంతో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొనసాగించింది. నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.90 వేల జరిమానా విధించింది. -
బాలికకు ప్రేమ లేఖ ఇచ్చిన వృద్ధుడి అరెస్ట్
అన్నానగర్ : 16 ఏళ్ల బాలికకు ప్రేమ లేఖ ఇచ్చిన వృద్ధుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. వివరాలు.. కోవై పొత్తనూర్ భజన ఆలయ వీధికి చెందిన మహమ్మద్ బీర్ బాషా (66) 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఆ బాలికకి ప్రేమలేఖ రాసి ఇచ్చాడు. ఇందులో ‘నాకు నువ్వు నచ్చావు, నీకు ఓకేనా’ అని రాసి ఉంది. బాలిక ఆ లేఖను తన తల్లికి ఇచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు బుధవారం మొ హమ్మద్ బీర్ బాషా మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. -
నటి ‘ప్రేమలేఖ’ నెట్టింట్లో వైరల్
నటి ప్రియా భవానీశంకర్ తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమలేఖ లాంటిది తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల వార్తల్లో ఉంటుంన్న నటి ప్రియా భవానీశంకర్. అందుకు కారణం దర్శకుడు, నటుడు ఎస్జే.సూర్యతో ప్రేమాయణం అనే వదంతులు రావడమే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన ఈ అమ్మడు ఇప్పుడు సక్సెస్‌పుల్ కథానాయికిగా రాణిస్తోంది. మేయాదమాన్తో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియా భవానీశంకర్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌తో కలిసి ఇండియన్ 2 చిత్రంలో నటించే స్థాయికి చేరుకుంది. కాగా ఈ మధ్యలో ఎస్జే.సూర్యతో కలిసి మాన్స్టర్ చి త్రంలో నటించింది. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. తాజా గా బొమ్మై అనే మరో చిత్రంలో ఆయనతో జత కట్టింది. దీంతోనే వీరి మధ్య ప్రేమ సాగుతోందనే ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యవహారంపై నటుడు ఎస్జే.సూర్య క్లారిటీ ఇచ్చారు. ప్రియా భవానీశంకర్ తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని స్పష్టం చేశారు. అయినా సామాజిక మాధ్యమాలు వారి గురించి వదంతులు ప్రసారం చేస్తూనే ఉన్నాయి. తాజాగా నటి ప్రియా భవానీశంకర్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న తన ప్రేమికుడు రాజ్‌కు ప్రేమలేఖ రాసింది. అందులో ‘పదేళ్ల క్రితం కళాశాలలో చాలా సంతోషంగా, ఆత్మస్థైర్యంతో చాలా ఓ మాదిరి అందం కలిగిన నన్ను నువ్యు ప్రేమించినప్పుడు ఆశ్యర్యపడలేదు. ఇప్పటికీ అన్నింటినీ దాటి ఇంకా నాతో ఉండాలని కోరుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. పగిలిన భావాలను సేకరించుకుంటున్న ఒకరితో ఉండడం అంత సంతోషాన్నివ్వదు. నువ్వు నేను వినడానికి మరిచిన సంగీతం లాంటి వారం. గాయాలను మరచిపోవడానికి కొత్త ప్రేమను విమర్శించనవసరం లేదు. పరిస్థితులకు మారని అభిమానం చాలు. నాకు ఒక పాప పుడితే తన జీవితంలో నీలాంటి వాడు ఒకడు ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను. నక్షత్రాలు నిండిన నా జీవితంలో నువ్వు మాత్రమే సూర్యుడివి. పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని పేర్కొంది. అంతేకాకుండా తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫొటో సహా ఈ అమ్మడు ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్న ఈ ప్రేమలేఖ ఇప్పు డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు రెండు లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. View this post on Instagram I wasn’t surprised when you fell in love with the most happy, confident, less attractive, so called average looking ‘me’ from college a decade ago. But I am surprised you chose to stay with this ‘new me’ through everything. It is NOT fun & exciting to be with a broken person picking their destroyed pieces. நீ, நான் கேட்க மறந்த இசை. காயங்களை மறக்க புதிய காதலின் கிளர்ச்சி தேவையில்லை, சூழ்நிலைக்கு மாறாத அன்பு போதும் என்றிருக்கும் பேராண்மை. எனக்கு ஒரு பெண் குழந்தை பிறந்தா அவள் வாழ்க்கைல உன்னை மாதிரி ஒரு ஆண் இருக்கனும்னு நான் கடவுளை கேட்டுக்கறேன்😊 in my world full of stars you remain my sunshine! Happy birthday maa🤗 A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) on Jan 26, 2020 at 8:58pm PST -
ఆరో తరగతిలోనే లవ్‌లెటరా?
కర్ణాటక,హుబ్లీ: పసిప్రాయంలోనే ఓ విద్యార్థి లవ్‌లెటర్ రాయడంపై జిల్లా అధికారి గమనించి ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటన ఉప్పినబెటగేరిలో చోటు చేసుకుంది. వరద ఉధృతికి హాని వాటిల్లిన ఇళ్ల పరిశీలన కోసం జిల్లాధికారి దీపా చోళన్ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఉప్పినబెటగేరికి వెళ్లారు. అక్కడే గుమిగూడిన పిల్లలను ఆమె మాట్లాడించారు. అప్పుడు ఇంటి ఎదురుగా పుస్తకంలో ఏదో రాస్తున్న ఆరవ తరగతి బాలుడి దగ్గరకు వెళ్లారు. ఆప్పుడు ఆ బుడతడు ఐ లవ్ యూ అంటూ రాయడంతో డీసీ ముక్కున వేలు వేసుకోక తప్పలేదు. అయితే ఈ పదేళ్ల బడుద్దాయి పుస్తకాన్ని వదిలి పారిపోవడం కొసమెరపు. ఈ ఘటనతో దీపాచోళన్ మాత్రం తనలో తాను నవ్వుకోవడం కనిపించింది. -
విద్యార్థినికి టీచర్ ప్రేమలేఖ!
సాక్షి, అనంతపురం: తల్లిదండ్రుల తర్వాత గురువు దేవుడితో సమానం అంటారు. అదే నమ్మకంతోనే తల్లిదండ్రులు యుక్తవయసులో ఉన్న ఆడ పిల్లలను కూడా ధైర్యంగా పాఠశాలలకు పంపుతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువుకు సమాజంలో ఎనలేని స్థానం ఉంది. అయితే గురువు అనే పదానికి మాయని మచ్చలా వ్యవహరించాడు రామగిరి మండలం నసనకోటలోని మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలోని ఓ టీచరు. వివరాల్లోకి వెళ్తే.. ఈ స్కూల్లో 5 నుంచి 9వ తరగతి వరకు బాలికలు చదువుతున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు కొంతకాలంగా ఓ విద్యార్థినిపై కన్నేశాడు. అభంశుభం తెలియని అమ్మాయిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. తరచూ ఆ బాలికతో ప్రత్యేకంగా మాట్లాడేవాడు. వెకిలిచేష్టలకు పాల్పడేవాడు. తోటి విద్యార్థినులతో పాటు కొందరు ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తించారు. సదరు టీచరును హెచ్చరించినట్లు తెలిసింది. అయినా అతడిలో మార్పు రాలేదు. తరచూ బాలికకు ప్రేమలేఖలు రాస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటకు రాకుండా పాఠశాల యాజమాన్యం గుట్టుగా వ్యవహరించింది. అదికాస్తా గ్రామస్తులకు నాలుగు రోజుల కిందట తెలిసింది. స్కూల్‌కు వచ్చి యాజమాన్యంతో గొడవకు దిగారు. కీచక గురువుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సదరు టీచరును మూడు రోజుల కిందట స్కూల్ నుంచి పంపించేశారు. చిన్నపిల్లలను ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఇలాంటి టీచర్లను శిక్షించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్కూల్ ప్రిన్సిపల్ సంగీతకుమారిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆ టీచరును స్కూల్ నుంచి తప్పించామన్నారు. -
ఏడాది క్రితం భార్యకు ప్రేమ లేఖ ఇచ్చాడని..
సాక్షి, వాజేడు: తన భార్యకు ఏడాది క్రితం ప్రేమలేఖ ఇచ్చాడనే కోపంతో కోడిని కోసే కత్తితో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని ప్రగళ్లపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొప్పునూరు గ్రామానికి చెందిన వేల్పుల నగేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన హిమామ్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కాగా నగేష్ హిమామ్ భార్యకు ఏడాది క్రితం ప్రేమిస్తున్నానని లెటర్ ఇచ్చాడు. విషయం తెలుసుకున్న హిమామ్ దాన్ని మనసులో దాచుకున్నాడు. మంగళవారం నగష్ హిమామ్ చికెన్ సెంటర్‌కు రాగా ఈ విషయమై ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశం పట్టలేక హిమామ్ కత్తితో నగేష్‌పై దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో నగేష్ మొఖంపై గాయాలయ్యాయి. వైద్యం చేయించున్న అనంతరం బాధితుడు నేరుగా వాజేడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపారు. గాయపడిన నగేష్ -
రోమియో టీచర్
చెన్నై ,తిరువొత్తియూరు: దిండుక్కల్ సమీపంలో తరుంబత్తుపట్టి ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్న విద్యార్థినికి అదే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు రాజా అశోక్‌కుమార్ ప్రేమలేఖ ఇచ్చాడు. ప్రేమలేఖ విద్యార్థికి ఇచ్చిన సంగతి పాఠశాలలో సంచలనం కలిగించింది. దీనిపై పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రులు సంఘం సమక్షంలో విచారణ జరిగింది. నివేదికను పాఠశాల విద్యాశాఖ అధికారులకు పంపించారు. విచారణ అనంతరం జిల్లా ముఖ్య అధికారి శరత్‌కుమార్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
నా జీవితంలో నువ్వో మ్యాజిక్
నాగార్జునకు 33 ఏళ్లు. అవును.. నటుడు నాగ్ వయసు ఇది. ‘విక్రమ్’ (23 మే 1986 రిలీజ్) సినిమాతో హీరో అయిన నాగ్ ఈ మే 23తో నటుడిగా 33 ఏళ్ల ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భర్త నాగార్జున గురించి ఆయన సతీమణి అమల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సారాంశం ఈ విధంగా...‘‘నా హీరో, నా భర్త, నా స్నేహితుడు... నీ కాళ్లపై నువ్వు నిలబడ్డావు. నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగావు. నువ్వు స్క్రీన్‌పై కనబడితే ఇప్పటికీ నా చూపు తిప్పుకోలేకపోతున్నా. నీ స్టైల్, నీ స్మైల్, నీ కళ్లలోని మెరపుని చూసేందుకు ఇప్పటికీ నా గుండె తపిస్తూనే ఉంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ నీ అందం ఇంకా పెరుగుతూనే ఉంది. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మాకు నువ్వు ఓ ఉదాహరణగా నిలిచావు. మిస్టరీ, రొమాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా జానర్ ఏౖదైనా నీ సినిమా విడుదలవుతున్న ప్రతిసారీ ఎలా కనిపించబోతున్నావో అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటాను. శ్రీ వెంకటేశ్వరస్వామికి, రాముడికి, షిరిడీ సాయికి నన్ను పరిచయం చేశావు. ఆ దేవుళ్లు మన కుటుంబంలో భాగమ య్యారు (‘అన్నమయ్య, షిరిడి సాయి, శ్రీరామదాసు’ చిత్రాల్ని ఉద్దేశిస్తూ). కంటెంట్ ఉన్న కథలను ఇస్తున్నావు. మా అంచనాలను మించి చేస్తున్నావు. నీ పాత్రల పరంగా 2 గంటల అమూల్యమైన సమయాన్ని మాకు ఎంటర్టైనింగ్గా అందిస్తున్నావు. ఓడిపోతానేమోనని నువ్వెప్పుడూ భయపడలేదు. ఎందుకంటే ది బెస్ట్ ఇస్తావ్ కాబట్టి. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి నువ్వు వెనకాడలేదు. అనుకున్న సమయానికి సినిమాలను రిలీజ్ చేయడంలోనూ నువ్వు విఫలం కాలేదు. నీ నిర్మాతను తగ్గనివ్వలేదు. నీలాంటి నటుల వల్ల సినిమాల్లో ఫన్, మ్యాజిక్, గ్లామర్ ఉంటున్నాయి. నా లైఫ్‌లో నువ్వో మ్యాజిక్. ఇండస్ట్రీలో 33 ఏళ్లు పూర్తిచేసుకుని, 95 సినిమాల్లో నటించినందుకు శుభాకాంక్షలు మై స్వీట్హార్ట్. క్లింట్ ఈస్ట్ ఉడ్, మిస్టర్ అమితాబ్ బచ్చన్, ఏయన్నార్‌లా సినిమాల్లో నువ్వింకా ఏన్నో ఏళ్లు పూర్తి చేసుకోవాలి. గోల్డెన్ స్కై కింద నీ రైడ్ సాగుతోంది. ఇది కేవలం సగం దూరం మాత్రమే. మై హీరో, మై ఫ్రెండ్. ప్రేమతో నీ అభిమాని అమల -
ఎలా డేటింగ్ చేయాలో తెలియదు
చెన్నై: నాకు వచ్చిన మొదటి ప్రేమలేఖను అమ్మకు ఇచ్చాను అని చెప్తోంది హీరోయిన్ అదితిరావ్ హైదరి. మణిరత్నం తెరకెక్కించిన కాట్రువెలియిడై చిత్రంలో కార్తీకు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు హైదరాబాద్ బ్యూటీ. ఈ మధ్య తెలుగులో సమ్మోహనం చిత్రంలో నటించి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అంటూ చుట్టేస్తున్న అదితిరావ్ ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా సైకో చిత్రంలో నటిస్తోంది. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇటీవల ఈ బ్యూటీ తన ప్రేమ వ్యవహారం గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను 5వ తరగతి చదువుతున్నప్పుడే తన సీనియర్ ప్రేమలేఖను రాశాడని చెప్పింది. అప్పుడు తన వయసు 9 ఏళ్లు అని పేర్కొంది. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసులో అతను రాసిన రెండు పేజీల ప్రేమలేఖను తీసుకెళ్లి గర్వంగా తన తల్లికి ఇచ్చానని చెప్పింది. అంతే వేగంతో తనను బోర్డింగ్ స్కూల్లో చేర్పించారని తెలిపింది. ఇంతకీ ఆ లేఖలో అతను రాసిందేమిటంటే నువ్వు చాలా అందంగా ఉన్నాను.. లాంటి ఏవేవో రాతలు రాశాడని చెప్పింది. తనకు 21 ఏళ్ల వయసులో పెళ్లి జరిగిందని, ఎలా డేటింగ్ చేయాలో కూడా తెలియలేదని చెప్పుకొచ్చింది. ఆ తరువాత చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయాను అని నటి అదితిరావ్ పేర్కొంది. గ్లామర్ విషయంలో పరిమితులు లేవనే విధంగా నటించడానికి రెడీ అనే అదితిరావ్ కారణాలేమైనా ఎక్కువ చిత్రాల్లో చిత్రాల్లో కనిపించడం లేదు. -
బాలిక ఉసురు తీసిన లేఖ..
ముంబై : మహారాష్ట్రలోని పందార్పూర్లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి రాసిన లవ్‌లెటర్‌తో మనస్థాపం చెందిన 15 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలికకు దుండగుడు రాసిన లేఖ క్లాస్ టీచర్ చేతికందడంతో ఆమె అందరి ఎదుట బాలికను మందలించింది. బాలిక తల్లితండ్రులను పిలిచి లేఖ విషయం వారికి చేరవేసింది. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన బాధిత విద్యార్ధిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి ఈ ఘటనపై స్పందిస్తూ తమకు స్కూల్ నుంచి ఫోన్ కాల్ రావడంతో తాను అక్కడికి వెళ్లగా తన కుమార్తె ఏడుస్తూ కనిపించిందన్నారు. తమ కుమార్తె చేతిలో ప్రేమలేఖ ఉందని టీచర్ చెప్పగా, తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, ఈ లేఖ ఎవరు రాశారో కూడా తనకు తెలియదని తమ బాలిక చెప్పిందన్నారు. అనంతరం ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందిన తమ కుమార్తె సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. బాలిక మరణించిన కొద్దిసేపటికే వాఖ్రి గ్రామస్ధులు పందార్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మరణానికి కారణమైన గుర్తుతెలియని ప్రేమికుడు ఎవరనేది నిగ్గుతేల్చనున్నారు. -
ప్రేమలేఖ ఎంతపని చేసింది..!
పశ్చిమగోదావరి, తణుకు: తణుకు పట్టణంలోని మాంటిస్సోరి స్కూలులో పదో తరగతి చదువుతూ సోమవారం అనుమానాస్పద స్థితిలో విద్యార్థి చనిపోయిన ఘటనకు సంబంధించి మిస్టరీ వీడలేదు. యాజమాన్యం వేధింపుల కారణంగానే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇరగవరం మండలం గోటేరు గ్రామానికి చెందిన అన్నాబత్తుల వెంకటేశ్వరరావు కుమారుడు అన్నాబత్తుల నాగవెంకట సాయిప్రసాద్ సోమవారం సాయంత్రం మాంటిస్సోరి స్కూలు ఆవరణలో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు స్కూలు యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అర్ధరాత్రి వరకు మృతదేహంతో హాస్టల్ ఆవరణలోనే ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో ఊగిపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు స్కూలు ఫర్నీచర్‌తో పాటు స్కూలు బస్సులను ధ్వంసం చేశారు. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకు స్కూలు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలు రాజకీయ పార్టీల నాయకులు స్కూలు యాజమాన్యంతో చేసిన చర్చలు ఫలితంగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రిలోని శవాగారానికి తరలించారు. మంగళవారం బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే బంధువుల డిమాండ్ మేరకు ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం మొత్తం వీడియో కెమెరా ద్వారా తీయించారు. ప్రేమ వ్యవహారం...? స్కూలు ఆవరణలోని హాస్టల్ భవనంలో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి సాయిప్రసాద్ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ప్రేమలేఖ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. స్కూలులో చదువుతున్న ఒక బాలికకు సాయిప్రసాద్ రాసిన ప్రేమలేఖ ఇప్పుడు కీలకంగా మారినట్టు సమాచారం. ప్రేమలేఖ ఉపాధ్యాయురాలి ద్వారా సాయిప్రసాద్ తరగతి ఉపాధ్యాయుడు, లెక్కల టీచర్ బాలాజీకి చేరినట్టు తెలిసింది. దీంతో నాలుగు రోజులుగా పనిష్మెంట్ పేరుతో సాయిప్రసాద్‌ను బయట నిలబెడుతూ తీవ్రంగా కొడుతున్నట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం విద్యార్థి తండ్రికి కబురు పంపిన యాజమాన్యం విషయం తెలియజేశారు. అయితే ఇదే సమయంలో స్కూల్ డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు విద్యార్థిని చితకబాదగా కోపంతో తండ్రి కూడా చేయి చేసుకున్నట్టు సమాచారం. సాయంత్రం వచ్చి తన కుమారుణ్ని తీసుకెళ్లిపోతానని చెప్పిన తండ్రి సాయంత్రం స్కూలుకు వచ్చే సరికి ఉరి వేసుకున్న సాయిప్రసాద్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మృతదేహంతో హాస్టల్‌కు వచ్చి బైఠాయించారు. అజ్ఞాతంలోకి బాలాజీ...? సాయి ప్రసాద్‌ను చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్యకు కారణమైన క్లాస్ టీచర్ బాలాజీతో పాటు స్కూలు డైరెక్టర్ ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అతని ఫేస్బుక్ ఖాతాను సైతం క్లోజ్ చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు సీఐ కె.ఎ.స్వామి తెలిపారు. అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
విదేశీ యువతికి ప్రేమలేఖ.. ఊహించని పరిణామం
బంజారాహిల్స్: తన తల్లి చికిత్స నిమిత్తం ఆమెకు సహాయకురాలిగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి వచ్చిన సిరియా దేశానికి చెందిన బర్కా అనే యువతి ఆస్పత్రిలోని గదిలో ఉంటోంది. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం, తిమ్మరాజుపల్లి కాటేపల్లి గ్రామానికి చెందిన మునిచంద్ర ఆరు నెలల క్రితం ఇస్లాం మతం స్వీకరించాడు. మెహిదీపట్నంలో ఉంటూ ఎంబీఏ చేస్తున్నాడు. ఆమెను చూసి మనసు పారేసుకున్న మునిచంద్ర తాను ముస్లింనని తన పేరు మహ్మద్ ఆయాన్‌గా పరిచయం చేసుకోవడమే కాకుండా ముస్లిం మతాన్ని స్వీకరించినట్లు పత్రాన్ని కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ‘నువ్వు లేకుండా నేను ఉండలేను, నీది ఏ దేశమైనా ప్రేమిస్తూనే ఉంటాను నా ప్రేమను అంగీకరించు’ అంటూ ఓ లేఖ రాశాడు. తరచూ ఆమె గది వద్దకు వెళ్తూ వేధిస్తుండటంతో బాధితురాలు మంగళవారం రాత్రి సెక్యూరిటీకి ఫిర్యాదు చేసింది. సెక్యూరిటీ గార్డులు మునిచంద్రను చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.