ప్రేమలేఖ విలువ 48 లక్షలు!
హాలీవుడ్ హాట్ స్టార్ మార్లిన్ మన్రో చనిపోయి దాదాపు యాభైఏళ్లు పైనే అవుతున్నా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆమెకున్న క్రేజ్ ఏంటో చెప్పడానికి తాజా ఉదాహరణ ఓ వేలం పాట. హలీవుడ్‌లో బాగా ప్రాచుర్యం పొందిన జూలియన్స్ ఆక్షన్స్ సంస్థ ప్రముఖ తారలు వాడిన వస్తువులను వేలానికి పెడుతుంటుంది. అలా, ఇప్పటివరకు పలుమార్లు మన్రో వాడిన వస్తువులను అడపా దడపా వేలానికి పెట్టారు. ఇటీవలే మరికొన్ని మన్రో వస్తువులను వేలానికి పెట్టారు. వీటిలో మన్రో మాజీ భర్త జో డిమాగ్గియో ఆమెకు రాసిన ప్రేమలేఖ, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఆర్థర్ మిల్లర్ రాసిన ప్రేమలేఖ కూడా ఉన్నాయి. డిమాగ్గియో రాసిన ప్రేమలేఖ దాదాపు 48 లక్షలు సాధించగా, ఆర్థర్ రాసిన ప్రేమలేఖ 28 లక్షలకు అమ్ముడుపోయింది.