Marilyn Monroe
-
మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!
నాటి ప్రఖ్యాత హాలీవుడ్ నటి, మోడల్, గాయని మార్లిన్ మన్రో (1926–62) చిత్రాన్ని క్రిస్టీ సంస్థ మేలో వేలానికి పెట్టనుంది. పాప్ గాయకుడు ఆండీ వార్హోల్ గీసిన ఈ అరుదైన చిత్రం రూ.1521 కోట్లు పలుకుతుందని అంచనా. అదే జరిగితే 20వ శతాబ్దంలోనే అతి ఖరీదైన చిత్రంగా చరిత్రలో నిలుస్తుందని క్రిస్టీ తెలిపింది. ఇదిలా ఉండగా, హలీవుడ్లో బాగా ప్రాచుర్యం పొందిన జూలియన్స్ ఆక్షన్స్ సంస్థ ప్రముఖ తారలు వాడిన వస్తువులను వేలానికి పెడుతుంటుంది. అలా, ఇప్పటివరకు పలుమార్లు మన్రో వాడిన వస్తువులను అడపా దడపా వేలానికి పెట్టారు. ఇటీవలే మరికొన్ని మన్రో వస్తువులను వేలానికి పెట్టారు. వీటిలో మన్రో మాజీ భర్త జో డిమాగ్గియో ఆమెకు రాసిన ప్రేమలేఖ, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఆర్థర్ మిల్లర్ రాసిన ప్రేమలేఖ కూడా ఉన్నాయి. డిమాగ్గియో రాసిన ప్రేమలేఖ దాదాపు 48 లక్షలు సాధించగా, ఆర్థర్ రాసిన ప్రేమలేఖ 28 లక్షలకు అమ్ముడుపోయింది. -
మేకప్ లేకున్నా మరింత అందంగా..!
అందంగా ముస్తాబవడం అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ వేడుకలోనైనా తామే ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’గా ఉండాలని కోరుకుంటారు మగువలు. అయితే కొంతమంది సహజంగా ఉండటానికి ఇష్టపడితే.. ఇంకొంత మంది మేకప్‌తో తమ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈ విషయంలో హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. వాళ్లు మేకప్ లేకుండా బయటకు వచ్చే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి తమ ఆరాధ్య నటీమణుల నిజ రూపం ఎలా ఉంటుంది, వాళ్లు ఎలాంటి కాస్మొటిక్స్ వాడతారో తెలుసుకోవాలని మహిళా అభిమానులు ఉబలాటపడుతుంటారు. అయితే ‘అందం’గా కనిపించడం మన చేతుల్లోనే ఉంటుందని.. మేకప్‌తో దీనికి సంబంధం లేదని నిరూపిస్తున్నారు ఈ అందగత్తెలు. టీవీ, సినీ, సంగీత ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న సుందరీమణులు తమ ‘నేచురల్ లుక్’తో కట్టిపడేస్తూ.. సహజత్వమే నిజమైన అందమని చాటిచెబుతున్నారు. కేటీ హోమ్స్, నటి టీవీ సిరీస్ ‘డాసన్స్ క్రీక్’లో జాయ్ పాటర్(ఫీమేల్ లీడ్)గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ 1997లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా రాణిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్క్రూజ్ను పెళ్లాడిన(ప్రస్తుతం విడిపోయారు) 41 ఏళ్ల ఈ భామకు కూతురు ‘సురి’ ఉంది.‘‘50 మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్( పీపుల్స్ మ్యాగజీన్)’’లో ఒకరిగా నిలవడమే గాకుండా పలు సినీ వేడుకల్లో ప్రేక్షకులందరి చూపును తన వైపునకు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ మేకప్ లేకుండా ఇదిగో ఇలా ఉంటారు. నయోమీ వాట్స్, బ్రిటీష్ నటి ఆస్ట్రేలియన్ డ్రామా ‘ఫర్ లవ్ అలోన్’తో ఎంట్రీ ఇచ్చిన నయోమీ ఎలెన్ వాట్స్ నటిగా, నిర్మాతగా గుర్తింపు పొందారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన 51 ఏళ్ల నటీమణి నేచురల్ లుక్ ఇది. టైరా బాంక్స్, అమెరికన్ నటి బాంక్స్గా సినీ అభిమానులకు సుపరిచితమైన ఈ భామ 15 ఏటనే మోడలింగ్ ప్రారంభించారు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నటిగా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా ఎదిగారు. పలు మ్యాగజీన్ కవర్లపై దర్శనమిచ్చి, పారిస్ ఫ్యాషన్ వీక్‌తో పాటు పలు వేడుకల్లో రెడ్ కార్పెట్లపై హొయలొలికించిన 46 ఏళ్ల ఈ ఆఫ్రికన్- అమెరికన్ విత్ అవుట్ మేకప్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. డయానే క్రూగర్, ఫ్యాషన్ మోడల్ జర్మనీలో జన్మించిన డయానే క్రూగర ఫ్యాషన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించి నటిగా మారారు. టీవీ షో ది బ్రిడ్స్తో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న డయానే మేకప్ చేసుకుంటేనే అందంగా కనిపిస్తామనుకోవడం అపోహే అని నిరూపిస్తున్నారు. గ్వేన్ స్టెఫానీ, సింగర్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే గ్వేన్ స్టెఫానీ నటిగానూ తనను తాను నిరూపించుకుంటున్నారు. ‘నో డౌట్’మ్యూజిక్ బ్యాండ్‌లో లీడ్ వోకలిస్టు అయిన ఆమె.. జస్ట్ ఏ గర్ల్, స్పైడర్వెబ్స్, డోన్ట్ స్పీక్ వంటి ఆల్బమ్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 90వ దశకంలో పలు ప్రత్యేక ప్రదర్శనల్లో భారత సంప్రదాయానికి అద్దంపట్టే విధంగా నుదుటిన ‘బిందీ’ ధరించేవారు. ఎక్కువగా ముదరు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో కనిపించే ఈ భామ మేకప్ లేకుండా కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అలీసియా సిల్వర్‌స్టోన్ ది క్రష్‌తో 1993లో తెరంగేట్రం చేసిన అలీసియా సిల్వర్‌స్టోన్ బ్యాట్మన్ అండ్ రాబిన్ వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించారు. మూగజీవాల కోసం పోరాడే ఆమె.. పెటా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. వీగన్ అయిన అలీసియా.. ది కైండ్ డైట్ పేరిట పుస్తకం ప్రచురించారు. 43 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తన కూతురితో కలిసి తీసుకున్న సెల్ఫీ ఇది. బెల్లా హదీద్ ఇక వీరితో పాటు తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న బెల్లా హదీద్, ఇవా లంగోరియా, మిలా జొవోవిచ్, సల్మా హయేక్, పెనెలోప్ క్రూజ్, పాప్ సంచలనం షకీరా, అడెలె, షరాన్ స్టోన్, క్యాథరిన్ జెటా జోన్స్, క్రిస్టియానా, మార్లిన్ మన్రో తదితర సెలబ్రిటీలకు సంబంధించిన ‘నేచురల్ లుక్’ ఎలా ఉంటుందో ఓ సారి చూసేయండి. ఇవా లంగోరియా మిలా జొవోవిచ్ సల్మా హయేక్, పెనెలోప్ క్రూజ్ పాప్ సంచలనం షకీరా అడెలె షరాన్ స్టోన్ క్యాథరిన్ జెటా జోన్స్ క్రిస్టియానా -
ఆ ఎక్స్-రే హాలీవుడ్ స్టార్ మార్లిన్ మన్రోదట..
న్యూఢిల్లీ : అదేంటి! ఎక్స్‌రే ఫిల్మ్ హాలీవుడ్ సినీ అభిమానుల కలల సుందరి మార్లిన్ మన్రో అంటున్నారేంటి, ఆమె ఎప్పుడో చనిపోయిందిగా అనుకుంటున్నారా ? అక్కడే ఉంది అసలు విషయం .ముందు స్టోరీ మొత్తం చదవండి, తర్వాత మీకే విషయం మొత్తం అర్థమవుతుంది. జింబాబ్వేలో ఓ వ్యక్తి తన ఛాతిలో బొద్దింక కనిపించిన ఎక్స్‌రే ఫిల్మ్‌ను 'మిస్టర్ సైంటిఫిక్' ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి ఛాతి పరీక్ష కోసం జింబాబ్వేలో ఓ ఆసుపత్రికి వెళ్లగా.. వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్స్‌రే తీశారు. ఎక్స్‌రే ఫిల్మ్‌లో బొద్దింక కనిపించడంతో వెంటనే సదరు వ్యక్తిని సర్జరీ చేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. డాక్టర్లు చెప్పిన విషయాన్ని నమ్మిన ఆ వ్యక్తి తనకున్న ఆస్తిని మొత్తం అమ్మి సర్జరీ కోసం ఇండియాకు వచ్చాడు. కాగా, ఇక్కడి వైద్యులు అతనికి అన్ని పరీక్షలు నిర్వహించి అతని ఛాతిలో బొద్దింక లేదని, అది కేవలం ఎక్స్‌రే మిషన్‌లో ఉన్న బొద్దింక ఇమేజ్... ఆ ఫిల్మ్ మీద పడటంతో అలా కనిపించిందని తెలిపారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న బాధితుడు గుండెలు బాదుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఫేక్ న్యూస్‌లను పసిగట్టడంలో సిద్ధహస్తులైన యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ రంగంలోకి దిగింది. ఇదంతా కల్పితమని, కేవలం ఫోటోలను మార్పింగ్ చేశారని బయటపెట్టింది. గూగుల్ ద్వారా రివర్స్ ఇమేజింగ్ ప్రాసెస్ ద్వారా ఒరిజినల్ ఇమేజ్ను కనుగొన్నామని పేర్కొన్నారు. కాగా, ఆ ఎక్స్‌రే ఫిల్మ్ ఒకప్పటి హాలీవుడ్ స్టార్ మార్లిన్ మన్రోదని, కొన్నేళ్ల క్రితం కూడా ఇలాంటి కథనమే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందని తెలిపారు. 1954లోమార్లిన్ మన్రో గైనకాలజీకి సంబంధించిన ఆపరేషన్ కోసం ఓ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకున్నారు. అందులో ఒకటి ఛాతికి సంబంధించిన ఎక్స్‌రే ఫిల్మ్ కూడా ఉందని వెల్లడించారు. కాగా 2010లో మన్రోకు సంబంధించిన మూడు ఫిల్మ్ ఎక్స్‌రేలు వేలం వేయగా 45వేల డాలర్ల ధర పలికిందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఫోటోనూ రివర్స్ ఇమేజింగ్ ప్రాసెస్ చేయడంతో అసలు విషయం బయటపడిందని పేర్కొన్నారు. అదండీ దీని వెనకున్న అసలు రహస్యం. -
వెలుగులోకి సంచలన నటి మార్చురీ ఫొటోలు
న్యూయార్క్ : అలనాటి మేటి సంచలనాల నటి మార్లిన్ మన్రోకు సంబంధించిన రెండు రహస్య ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. మార్లిన్ మరణానంతరం మార్చురీలో ఉన్న ఆమె శవానికి చెందిన ఫొటోలు దాదాపు 60 సంవత్సరాల తర్వాత వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. 1950లలో ఓ వెలుగు వెలిగిన సంచలన తార మార్లిన్ మన్రో 1962 ఆగస్టు 4న ఎక్కువ నిద్రమాత్రలు మింగటం కారణంగా మృత్యువాత పడ్డారు. అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడి ఓ మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఫొటోగ్రాఫర్ లై వైనర్ మార్చురీ వద్దకు చేరుకుని, మార్చురీ సిబ్బందికి ఓ రెండు బాటిళ్ల వైన్ లంచంగా ఇచ్చి మార్లిన్ ఫొటోల కోసం అనుమతి తీసుకున్నారు. ఆమె శవానికి చెందిన 5 ఫొటోలను తీసిన ఆయన మూడింటిని పత్రికలకు అమ్మేశారు. పనికిరావు అనుకున్న ఓ రెండు ఫొటోలను తన వద్దే ఉంచుకున్నారు. అలా తన వద్ద ఉన్న ఫొటోలను బయటకు తీయకుండానే 1993లో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఓ ప్రముఖ ఛానల్ మార్లిన్ మృతిపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయటంతో పాటు లై వైనర్ కుమారుడితో ముఖాముఖి జరిపింది. ఆ సమయంలో తన తండ్రి దాచిన ఫొటోల గురించి ఆయన ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కాగా, మార్లిన్ మృతి చెందిన 24 గంటల వరకు కూడా ఆమె శవాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఎవరూ రాకపోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది. -
‘ఈ వీడియో షేర్ చేయడం ఆనందంగా ఉంది’
ముంబై : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. నా ‘మార్లిన్ మన్రో’ మూమెంట్ అంటూ బీచ్‌లో సరదాగా గడిపిన క్షణాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేగాక ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ కామెంట్ చేశారు. కాగా 1955లో విడుదలైన మన్రో ‘సెవెన్ ఇయర్ ఇట్చ్’ సినిమాలో ఓ మూమెంట్ ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆమె దుస్తులు పైకి ఎగురుతుంటే వెంటనే చేతులతో కిందకు లాక్కున్నారు. ఈ మన్రో మాదిరిగానే తనకూ అలాంటి అనుభవం ఎదురైందంటూ శిల్పా ఈ ఫన్నీ వీడియోను పంచుకున్నారు. ఇక శిల్పాశెట్టి కుంద్రా ప్రస్తుతం గ్రీస్, లండన్లలో కుటుంబం కలిసి హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. కాగా దిల్జిత్ దోసంజ్, యామీ గౌతమ్ నటిస్తున్న సినిమాతో శిల్పా బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఆమె రచయితగా కనిపించనున్నారు. సెలవుల నుంచి రాగానే ఆగష్టు మొదటి వారంలో ఆమె షూటింగ్లో పాల్గొననున్నారు. View this post on Instagram My 'Marilyn Monroe' moment on the cruise wasn't exactly a 'breeze' 😄 Please watch till the end...🤦🏻♀😂 #throwback #bloopers #funtimes #vacation #cruising #slomo #laughs #epic A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Jul 23, 2019 at 7:13am PDT -
చరిత్రలో నిలిచిపోయిన సెలబ్రిటీలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సూపర్ స్టార్ శ్రీదేవీ దుబాయ్‌లో అకాల మరణం చెందడం దశాబ్ద కాలంలోనే పెద్ద చర్చనీయాంశం అయింది. భారతీయులతోపాటు పాకిస్థాన్ ప్రజల నివాళులను అందుకుంటున్న ఏకైక తార శ్రీదేవీయే కాచ్చు! జాతి, మత, కుల వైషమ్యాలు లేకుండా ప్రపంచ ప్రజల నీరాజనాలు అందుకుని చరిత్రలో నిలిచిపోయే వారు అతి కొద్ది మందే ఉంటారు. మైఖేల్ జాక్సన్ (1958–2009) పాప్ సింగర్‌గా ‘కింగ్ ఆఫ్ పాప్’ విశ్వవిఖ్యాతి చెందిన మైఖేల్ జాక్సన్ 2009లో అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో, తన ఇంట్లో అకాల మరణం పొందారు. ఆయన తన పాటలకు సంబంధించి 26 లక్షల డిజిటల్ ట్రాక్‌లను విక్రయించడం ద్వారా పది లక్షల డిజిటల్ ట్రాక్లకన్నా ఎక్కువగా విక్రయించిన ఏకైన సింగర్‌గా కూడా రికార్డు సృష్టించారు. ఎల్విస్ ప్రెస్లీ (1935–1977) ప్రముఖ అమెరికా గాయకుడు, కంపోజర్, నటుడు ఎల్విస్ ప్రెస్లీ తన గానామతంతో ‘కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్’గా గుర్తింపు పొందారు. 20వ శతాబ్దంలో ఆయన పాట వినని ఇల్లంటూ అమెరికా, యూరప్ దేశాల్లో లేదంటే అతిశయోక్తి కాదు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకన్న ఆయన తన 42వ ఏట బాత్రూమ్లోనే కన్నుమూశారు. ఆయన అప్పటికే చిన్న ప్రేగు సమస్యతో బాధ పడుతున్నారు. ప్రిన్సెస్ డయానా (1961–1997) బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్సెస్ డయానా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన ఎంటర్డేన్మెంట్ సెలబ్రిటిగా గుర్తింపు పొందారు. 1997లో జరిగిన ఓ కారు ప్రమాదంలో మరణించారు. ఆమెతోపాటు అ ప్రమాదంలో మరో ఇద్దరు మరణించారు. మార్లిన్ మాన్రో (1926 –1962) హాలీవుడ్ శృంగార తారగా 1950వ దశకంలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మార్లిన్ మాన్రో పిన్న వయస్సులో, అంటే 36వ ఏట అకాల మరణం చెందారు. నాడీ మండలం చికిత్సకు వాడే ‘బార్బిటు రేట్’ ఒవర్ డోస్ వల్ల మరణించారు. విట్నీ హూస్టన్ (1963–2012) తన పాటలతో ప్రపంచ ప్రేక్షకులను అలరిస్తూ ‘బిల్బోర్డ్ ఆల్బమ్ అవార్డు’ను దక్కించుకొని అనేక అవార్డులు పొందిన మహిళా సింగర్ ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కిన విట్నీ హూస్టన్ కూడా వాటర్ టబ్‌లోనే మరణించారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్‌లో గెస్ట్ రూమ్‌లో 2012, ఫిబ్రవరి 11వ తేదీన ఆమె కన్నుమూశారు. ఆ తర్వాత మూడేళ్లకు అంటే, 2015లో ఆమె కూతురు బొబ్బి కష్ణా బ్రౌన్ కూడా నీటి తొట్టిలోనే కోమాలోకి వెళ్లి ఆర్నెళ్లలోగా మరణించారు. ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ (1958 నుంచి 2016) పాటకు తగ్గ నత్యంతో యువతను ఉర్రూతలూగించిన ప్రముఖ అమెరికా సింగర్ ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ తన 57వ ఏట ‘ఫెంటానిల్’ ఒవర్ డోస్ కారణంగా అకాల మరణం చెందారు. అభిమానులు ‘ప్రిన్సి’గా పిలుచుకునే రోగర్స్ పలు వాయిద్యాల్లో ఆరితేరిన విద్వాంసుడు. బెస్ట్ సెల్లింగ్ పాప్ సింగర్‌గా పాపులర్. -
ఢిల్లీకి వస్తున్న జాక్సన్, మన్రో !
న్యూఢిల్లీ: మైకేల్ జాక్సన్, మార్లిన్ మాన్రో.. ఈ పేర్ల తెలియనివారు ఉండరు. ఒకరు తన డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగిస్తే, మరొకరు తన అందచందాలతో యువతను కట్టిపడేశారు. అయితే ఇదంతా వారు బతికున్నప్పటి సంగతి. మరి చనిపోయినవారు ఢిల్లీకి ఎలా వస్తున్నారు? అనే కదా.. మైనపు విగ్రహాల రూపంలో..! ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియం ఇటీవల ఢిల్లీలో ఓ బ్రాంచిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులతో ఈ మైనపు మ్యూజియం నిండిపోయింది. త్వరలోనే ఈ మ్యూజియంలోకి మైకేల్ జాక్సన్, మార్లిన్ మన్రో, జస్టిన్ బీబర్, లేడీ గగా, బేవాన్స్ నోలెస్, ఆంజెలినీ జోలీ, స్కార్లెట్ జాన్సన్, నికోల్ కిడ్మన్, జెన్నిఫర్ లోపేజ్, కేట్ విన్సెస్లెట్, కిమ్ కర్దాషియన్, డేవిడ్ బెక్‌హామ్, లయోనెల్ మెస్సీ తదితర మైనపు విగ్రహాలు కొలువుదీరనున్నాయట. ‘హాలీవుడ్ ప్రముఖులకు కూడా భారత్‌లో విశేష సంఖ్యలో అభిమానులున్నారు. వారందరినీ అలరించేందుకు ఢిల్లీలోని మ్యూజియాన్ని హాలీవుడ్ అందాలతో నింపేస్తామ’ని మ్యూజియం జనరల్ మేనేజర్, డైరెక్టర్ అన్షుల్ జైన్ తెలిపారు. -
ప్రేమలేఖ విలువ 48 లక్షలు!
హాలీవుడ్ హాట్ స్టార్ మార్లిన్ మన్రో చనిపోయి దాదాపు యాభైఏళ్లు పైనే అవుతున్నా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆమెకున్న క్రేజ్ ఏంటో చెప్పడానికి తాజా ఉదాహరణ ఓ వేలం పాట. హలీవుడ్లో బాగా ప్రాచుర్యం పొందిన జూలియన్స్ ఆక్షన్స్ సంస్థ ప్రముఖ తారలు వాడిన వస్తువులను వేలానికి పెడుతుంటుంది. అలా, ఇప్పటివరకు పలుమార్లు మన్రో వాడిన వస్తువులను అడపా దడపా వేలానికి పెట్టారు. ఇటీవలే మరికొన్ని మన్రో వస్తువులను వేలానికి పెట్టారు. వీటిలో మన్రో మాజీ భర్త జో డిమాగ్గియో ఆమెకు రాసిన ప్రేమలేఖ, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఆర్థర్ మిల్లర్ రాసిన ప్రేమలేఖ కూడా ఉన్నాయి. డిమాగ్గియో రాసిన ప్రేమలేఖ దాదాపు 48 లక్షలు సాధించగా, ఆర్థర్ రాసిన ప్రేమలేఖ 28 లక్షలకు అమ్ముడుపోయింది. -
లవ్ లెటర్స్ ఆక్షన్!
హాలీవుడ్ కలల రాణి మార్లిన్ మన్రో ప్రేమ లేఖలు ఆక్షన్ వేయనున్నారు. బెవర్లీ హిల్స్‌లో వచ్చే నెల 15, 16 తేదీల్లో నిర్వహించే వేలం పాటలో మూడొందల లెటర్స్ అందుబాటులో ఉంచుతున్నారు. మాజీ భర్త జో డిమాగియోకు మార్లిన్ రాసిన లేఖలు ఇందులో ఉన్నాయి. ‘నిన్ను ప్రేమిస్తున్నాను. నీతోనే ఉండాలనుకుంటున్నాను. నాపై నీకు నమ్మకం కలగడానికి ఇంతకంటే నేనేమీ చేయలేను’ అంటూ మార్లిన్ రాసిన ఓ లేఖ అందరినీ కదిలించింది. ఇలాంటివెన్నో హృదయాలను తాకే లెటర్స్ ఆక్షన్‌లో పెడుతున్నారు. -
4 లక్షలు పలికిన మార్లిన్ మన్రో ఫొటో!
శృంగార దేవత మార్లిన్ మన్రో ఫొటోలంటే అభిమానులకు ఎప్పుడైనా క్రేజే. అలాంటిది ఆమె అరుదైన ఫొటో అంటే అసలు ఆగుతారా? అసలు సినిమాల్లోకి రాకముందు మార్లిన్ మన్రో తీయించుకున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను వేలానికి పెట్టగా.. దానికి ఏకంగా 4 లక్షల రూపాయలకు పైగా ధర పలికింది. 1946లో ఏజెన్సీ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ జస్గర్ ఈ ఫొటో తీశారు. మార్లిన్ మన్రో తొలిసారి మోడలింగ్ చేసినప్పుడు కాలిఫోర్నియాలోని జుమా బీచ్‌లో ఈ ఫొటో తీసి ఉంటారని భావిస్తున్నారు. దీని ఫొటో మాత్రమే 4 లక్షలు పలకగా.. దాని నెగెటివ్, కాపీరైట్ లాంటివి మరోసారి అమ్మకానికి పెట్టబోతున్నారు. వాటికి రెట్టింపు ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు. -
నేనుమార్లిన్ మన్రో!
‘‘ఈ హాలీవుడ్ చిత్రమైంది. ఇక్కడ మీ ఆత్మను పరిస్తే దక్కేది యాభై చిల్లర పెంకులు; అదే ఒక్క ముద్దుకు వేయి డాలర్లు ముడతాయి.’’ నాకు ఇప్పుడే తెలిసింది. ‘ఫాక్స్’ వాళ్లు నన్ను ‘సమ్‌థింగ్ ఈజ్ గాట్ టు గివ్’ నుంచి తొలగించారట. డెరైక్టర్ జార్జ్ కుకర్ నాతో పనిచేయలేనని చెప్పాడట. నేను ఆలస్యంగా షూటింగులకు వెళ్తున్నానట. నిలకడగా ఉండనట. మరి ఎవరిని పెట్టి పూర్తిచేస్తారు? మరో మార్లిన్ మన్రో దొరుకుతుందా వీళ్లకు? ‘సమయానికి’ రెడీ అవడం నాకెందుకు చేతకాదు! అందమైన స్త్రీకి, అద్దం ముందు కూర్చుంటే ఎందుకు తనివి తీరదో ఎవరూ కనిపెట్టినట్టులేదు. ఇంటిని అటుండనీ, ఒంటిని దిద్దుకోవడంలోనే నాకు తెల్లారిపోతుంది. ఇక నాకు మేకప్ ఎందుకు? ఎటని వెళ్లను! రాత్రి మస్కారా కూడా అలాగేవుంది. షాంపేన్ ఎక్కడుంది? నేను ఎలా నడిచినా ఆకర్షణీయంగానే ఉన్నప్పుడు, ఊగుతూ తూగుతుంటే మాత్రం బాగుండనా! మార్లిన్, నువ్వు ఫ్యాషన్ ఇండస్ట్రీని పదేళ్ల ముందుకు జరపగలవు! అలాంటిదాన్ని, ఫ్రాంక్ (సినట్రా) ఏమన్నాడు? కొంపదీసి, ఇక్కడే (కాల్ నేవా క్యాసినో) చచ్చిపోదుగా, అన్నాడా! నన్ను తోసేయమని చెప్పినట్టేగా! తను నామీద ఆశపడ్డవాడేగా! ఇప్పుడేం చేస్తావో చెయ్యి. ఇంకో పెగ్గు వంపుకుంటున్నా! ఈ ఇల్లు నాది. త్రీ బెడ్రూమ్. మెక్సికన్ స్టైల్లో కట్టించాను. నా ఫైర్‌ప్లేస్ ఎలా ఉంటుంది? డ్రెస్సర్, టిన్ కేండిల్బ్రా, ఫోల్డింగ్ స్టూల్స్... ఎక్కడ కొన్నానో అందరికీ కావాలి! అందరికీ ఎందుకు తెలియడం? పడుకున్నప్పుడు మీరు పైజామా ధరిస్తారా? గౌనా? ఇంకేమైనా? సినిమా తార అయితే ఏదైనా అడిగేయొచ్చా? మీకు వారానికి ఎంతమంది బాయ్ఫ్రెండ్సు? గాసిప్ కాలమ్స్ ఎక్కువ చదువుతారనుకుంటాను. ఏడీ నా మగస్నేహితుడు? హల్లో... నేను ల్లో అని ఒత్తి పలకడం ముచ్చటగా ఉంటుందట. పలకరించడానికి ఎవరూ లేరే! నా తండ్రి అని చెప్పిన వ్యక్తిని నేను తండ్రిగా భావించలేదు. మా అమ్మ ఫొటోలో చూపించినాయన బాగున్నాడు. సన్నమీసం, క్లార్క్ గేబుల్లా. ఆయన నాన్నయితే ఎంత బాగుండు! అమ్మకు మానసిక స్థిమితం లేదు; ఆర్థిక స్థిమితం అసలు లేదు. అందుకే నేను దేశపు బిడ్డను. నేను అనాథగా పెరగాలా! అమ్మ స్నేహితురాలు గ్రేస్ మెకీ నా బాధ్యత తీసుకుంది. జీన్ హార్లో అంటే పడిచచ్చేది. ఆమెలాగా నాకు మేకప్ చేసేది. నువ్వు కూడా సినిమా స్టార్‌వి కావాలనేది. పదకొండేళ్లకొచ్చాను కదా! సినిమా గొప్పతనం అర్థమవుతోంది. కానీ గ్రేస్ భర్త ప్రవర్తన అర్థంకాలేదు. అప్పుడు జేమ్స్ (డఫెర్టీ) పరిచయమయ్యాడు. పరిచయం ఏంటి? మా పక్కిల్లేగా! జిమ్మీ అనేదాన్ని. పోలీసు కావాలని అతడి కోరిక. జిమ్మీని చేసుకుంటే ఆసరా దొరుకుతుంది. పదహారేళ్ల అమ్మాయి, ఇరవయ్యేళ్ల అబ్బాయి! నేను ప్రేమించానా అతణ్ని? నేను హుషారుగా పాడతాను, ఆనందంతో నృత్యం చేస్తాను. అది జిమ్మీకి అర్థమయ్యేది కాదు. దాంతో మాకు మాటలు లేకుండా పోయాయి. నేను ఆర్మీ ఫ్యాక్టరీలో పని చేస్తున్నప్పుడొక అద్భుతం జరిగింది. మమ్మల్ని ఫొటోలు తీయడానికి డేవిడ్ కనోవర్ వచ్చాడు. యువతులు కూడా యుద్ధంకోసం కష్టపడుతున్నారని చెప్పాలిగదా! అతడే నన్ను మోడలింగ్ ఏజెన్సీకి అప్లై చేసుకొమ్మన్నాడు. నా పాతజీవితం నాకు నచ్చలేదు. నా కలలకు అందులో చోటులేదు. ఇంకేం, జీన్ హార్లో మళ్లీ వచ్చిందన్నారు. ‘నయాగరా’లోని నా నడకను యువతులు అనుకరిస్తున్నారట! ‘జెంటిల్మెన్ ప్రిఫర్ బ్లాండెస్’... ‘హౌ టు మ్యారీ ఎ మిలియనీర్’... ‘రివర్ ఆఫ్ నో రిటర్న్’... బంగారుజుట్టు, అమాయకపు చూపులు... మార్లీన్, యు ఆర్ సో స్వీట్! ‘ద సెవెన్ ఇయర్ ఇచ్’ అప్పుడు నా లోపలి గోడల్ని ప్రేమ గోకుతోంది. జిమ్మీతో విడాకులయింతర్వాత జో(డిమాగియో) దగ్గరయ్యాడు. బేస్‌బాల్ ఆటగాడు. 56 గేమ్స్‌తో హిట్టింగ్ స్ట్రీక్ వరల్డ్ రికార్డ్ ఉంది. పిల్లాడి తండ్రి! ఇదీ నిలబడలేదు. కారణం: గాలికి పైకిలేచే స్కర్టు సీన్. నా సిగ్నేచర్ ఫొటో! కానీ జో నొచ్చుకున్నాడు. అరుచుకున్నాం. లిజ్ రినే, క్లియో మూర్, రీటా గామ్... ఎంతమందితో అతడికి సంబంధముందని వార్తలొచ్చాయి. పబ్లిగ్గా ఒప్పుకున్నాడా? జోసెఫ్‌ను నా పిల్లాడిలా చూసుకుందామనుకున్నానే! జో ఒకప్పుడు గొప్పగా ఆడివుండొచ్చు. ఇప్పుడు నా అంత ఇమేజ్ ఏడిచిందా? మాది 274 రోజుల పెళ్లి అని లెక్కలేస్తున్నారట. అదేమైనా థియేటర్లో ఆడుతున్న సినిమానా? డిమాగియో బాధ కూడా నిజమేనేమో! ఇంతా చేస్తే నేను సెక్స్ సింబల్నా? 37-23.5-37.5 కొలతల శరీరాన్నా? నేను యంత్రాన్ని కాదు. ‘బస్‌స్టాప్’లో నా నటనను విమర్శకులు మెచ్చుకుంటున్నారట! ఇన్నిరోజులూ నా నడుము దగ్గరే ఆగిపోయాయా వాళ్ల చూపులు? ఈ మాత్రం పరిణతి చూపకపోతే ఆర్థర్ మిల్లర్ నన్ను ఎలా భార్యగా అంగీకరిస్తాడు! ఆర్థర్ నాకోసమే మిస్ఫిట్స్ రాస్తున్నాడు. కానీ మాకు మేము మిస్ఫిట్స్గానే ఉండిపోతున్నామా! ఆర్థర్‌తో నాకు ఏం సమస్య ఉంది? ప్రేమ లేకపోతే నేనెందుకు కోర్టులో అతడికోసం నిలబడ్డాను! నిర్మాతలందరూ నా కెరీర్‌ను రిస్క్ చేస్తున్నావన్నారు. కమ్యూనిస్టులతో నీకెందుకు అన్నారు. సినిమావాళ్లు, కార్మికులు, నల్లవాళ్లు, అరబ్బులు, యూదులు అందరూ సోదరుల్లా మెలగాలని కోరుకున్నానే! దానివల్ల ఎఫ్బిఐ నా మీద కూడా నిఘా పెట్టిందే! టోనీ కర్టిస్! ఓ లవ్లీ మేన్! నేను చంచలను. పురుషుడి ఆకర్షణకు లొంగిపోకుండా ఉండే మనోబలం నాకెందుకు లేదు! హ్యాపీ బర్త్‌డే మిస్టర్ ప్రెసిడెంట్! నాలాంటి అతిలోక సుందరికి జాన్ (ఎఫ్ కెన్నెడీ) లాంటివాడే సరైన జోడి. నా సాన్నిహిత్యం ఆయన పదవికి అలంకారమా? ఆటంకమా? నన్నే తిరస్కరిస్తాడా ఎంత అధ్యక్షుడైతే మాత్రం! నేను లేకపోతే ఏమిటో చూపించాలి. నేను ఎక్కడ పుట్టాను? ఎలా పెరిగాను? ఎవర్ని ఆదరించాను? దేహం మీద మమకారం కొద్దీ ఆత్మను నిర్లక్ష్యం చేశానా? ఆత్మను శుభ్రం చేసుకోవడం సాధ్యమేనా? ఇంకా ఈ దేహపు వస్త్రాలు నాకెందుకు? బార్బిట్యురేట్స్... ఎన్ని మాత్రలు వేసుకుంటే కళ్లు మళ్లీ తెరవకుండా నిద్రపోతాం? అయినా నేనెందుకు చావాలి? హాయిగా పిల్లల్ని కంటాను, పెద్దచేస్తాను, అమ్మమ్మనైపోతాను. ఏం బాగుండదా? మార్లిన్ మన్రో నానమ్మా! నేను నక్షత్రం లాంటిదాన్ని. కానీ నక్షత్రాల వయసు తెలుసా? నేను గృహిణిగా బతకలేదు. ప్రయత్నమైతే చేశాను. తల్లిని కావాలని ఎంతగా ఆశపడ్డాను! మూడుసార్లు గర్భస్రావం అయిపోయిందే! నేను స్త్రీగా విఫలమయ్యాను. నానుంచి ఎవరైనా ఏం ఆశించారు? నేనేం ఇవ్వలేకపోయాను? నేను ప్రేమించిన మనిషిగా వాళ్లను ప్రేమించానా? వాళ్లను వాళ్లుగా ప్రేమించానా? ఒక్క నిమిషం. ఫాక్స్ వాళ్ల నుంచి సందేశం. నాకోసం డెరైక్టర్నే మార్చేస్తామంటున్నారు. ఎందుకు మార్చరు! కానీ చప్పగా ఉంది. నేను ఉత్సాహంగా కనబడ్డానేమోగానీ ఏనాడూ ఆనందంగా లేను. ఎవరి నొప్పిని వారే అనుభవించాలి. జీవితం పట్ల కఠినంగా ఉండాలంటారు. కోమలమైన స్త్రీ అలా ఎలా ఉండగలదు? కఠినత్వంలో ఏ స్త్రీత్వమూ లేదే! నేను 1926లో పుట్టాను. ఇది 1962. 26-62. ఇదేదో చిత్రంగా ఉంది. జీన్ హార్లో కూడా ఎక్కువ కాలం బతకలేదు. 26 ఏళ్లకే పోయింది. చివరికి నా దేహం కూడా నశిస్తుందా? మనిషికి అర్థవంతమైన ముగింపు ఏదవుతుంది? నాకు ఏస్పర్జర్ సిండ్రోమ్ ఉందంటారేమో! నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారేమో! నేనేమిటో అర్థంకాక తలలు బద్దలు గొట్టుకోవాలి. మార్లిన్ మన్రో అనే రాకుమారి గురించి జానపద కథలా లోకం చెప్పుకుంటూనే ఉండాలి. నా మొదటి భర్త జేమ్స్ నేను చనిపోయానని తెలిస్తే ఏమంటాడు? తన పోలీసు డ్యూటీలో పాట్రోల్కు వెళ్తూ ‘ఐ యామ్ సారీ’ అనేస్తాడంతే! ఆర్థర్... రచయిత కదా! నాలాంటి జీవితాలకు శుభం కార్డు పడదని ఆయనకు తెలిసేవుంటుంది! జో మాత్రం మళ్లీ చేరువయ్యాడు. సినిమావాళ్లకూ క్రీడాకారులకూ మధ్య ఏదో తెలియని సంబంధం. వాస్తవం కన్నా కల్పనలోనే ఎక్కువగా బతుకుతాం కాబోలు. అయినా, ‘జస్ట్ ఫ్రెండ్స్’గా మాత్రమే ఉండదలిచాను. నువ్వు ఏమైనా చేయగలిగితే నా శరీరానికి అంతిమసంస్కారాలు నిర్వహించు. నీ చేతులకు తోచినప్పుడు నా సమాధి ముందు కొన్ని ఎర్రగులాబీ పూలనుంచు! కథనం: ఆర్. ఆర్. -
మత్తు మాయాజాలంలో సెలబ్రిటీలు!
మత్తు(డ్రగ్స్) మాయలో పడితే ఎంతటివారైనా అంతే. పరువు బజారునపడితే, కుటుంబాలు, జీవితాలు నాశనమవుతాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో యువతీయువకులు డ్రగ్స్‌కు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు స్వార్ధపరులు ఈ డ్రగ్స్ వ్యాపారం ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నారు. వారికి డబ్బే ముఖ్యంగానీ జీవితాలు తృణపాయం. ఈ మత్తులో మాములు వారే కాదు సెలబ్రిటీలు కూడా పడ్డారు.పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న పలువురు సెలబ్రిటీలు చివరికి చీకట్లో కలసిపోయారు. మత్తు ఎంతలా జీవితాలను నాశనం చేస్తుందో చెప్పడానికి వారు సాక్ష్యాలుగా మిగులుతున్నారు. హాలీవుడ్ చరిత్రను ఒక్కసారి గమనిస్తే ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. యావత్ ప్రపంచాన్ని తమ అందచందాలు, నటన, ఆటపాటలతో అలరించిన ఎందరో డ్రగ్స్‌కు బానిసలయ్యారు. చివరికి వాటివల్లే ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. మార్లిన్ మన్రో: హాలీవుడ్ చరిత్రలో అత్యంత అందగత్తె మార్లిన్ మన్రో. వరల్డ్ లీడింగ్ సెక్స్ సింబల్. ఇప్పటికీ మన్రో డ్రెస్, స్టైల్, గెటప్‌ను ఫాలో అవుతున్నామంటే ఆమె క్రియేట్ చేసిన ట్రెండ్ ఎలాంటిదో అర్థమవుతుంది. కానీ మన్రో స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ వల్ల చనిపోయిందంటే ఆశ్చర్యపోక తప్పదు. లాస్ ఏంజిల్స్‌లోని బ్రెంట్వుడ్ హోమ్‌లో ఆగస్టు 4, 1962న స్పృహలేకుండా కనిపించింది. డ్రగ్ ఓవర్ డోస్ వల్లే మన్రో కోమాలోకి వెళ్లి చనిపోయినట్లు నిర్థారించారు. మైకేల్ జాక్సన్: కింగ్ ఆఫ్ పాప్. ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించుకున్న మ్యూజిక్ లెజెండ్. 50 నైట్ కమ్ బ్యాక్ టూర్ రిహార్సల్స్ చేస్తూ చాలా అలసటకు గురవుతుండేవారు. ఆ సమయంలో ఆయన రిలాక్సేషన్ కోసం మెడిసిన్ తీసుకోవాలనుకున్నారు. మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతో జూన్ 25, 2009లో ఆయన అర్థాంతరంగా కన్నుమూశారు. ఆయనకు డ్రగ్స్ ఓవర్ డోస్ ఇచ్చిన ఆయన డాక్టర్ ముర్రే ప్రస్తుతం జైల్లో ఉన్నారు. విట్నీ హౌస్టన్: గొప్ప గాయనిగా పేరుప్రఖ్యాతులు సాధించింది. ఆమె ఫ్యాన్స్ లేని దేశం లేదంటే అతిశయోక్తికాదు. తన పాట ద్వారా అంతటి స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. కానీ మత్తుకు బానిసై చివరికి బాత్‌టబ్‌లో శవమై తేలింది. అమీ విన్‌హౌజ్: హాలీవుడ్లో అత్యంత ప్రతిభాశాలులైన గాయణీమనుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. రిహాబ్ పేరిట ఆమె పాడిన పాటల్లో తనను డ్రగ్స్ నుంచి బైటపడేసేందుకు జనం చేస్తున్న ప్రయత్నాలను వివరించింది. కానీ ఆమె ట్రీట్మెంట్కు ఒప్పుకోలేదు. ఫలితంగా 27 ఏళ్ల ప్రాయంలోనే ఆమె మృత్యు ఒడిలోకి చేరింది. హీత్ లెడ్జర్: ది డార్క్ నైట్ సినిమాలో జోకర్‌గా యాక్ట్ చేసి, అది రిలీజ్ కాకముందే హీత్ లెడ్జర్ తుదిశ్వాస విడిచారు. నేలపై నగ్నంగా పడి ఉన్న ఆయనను చూసి అందరూ నివ్వెరపోయారు. ఇందుకు కారణాలు ఏమిటని ఆరా తీస్తే, తీవ్ర నిద్రలేమితో బాధపడిన లెడ్జర్ డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు తెలిసింది. చివరికి అదే ఆయన ఉసురు తీసింది. ప్రమాదకరమైన మాదకద్రవ్యాలకు, వివిధ రకాల మత్తు పదార్ధాలకు అలవాటుపడేవారు వారి జీవితాలను హెచ్చరికగా తీసుకోవాలి. వీరి జీవితాలు గుణపాఠంగా తీసుకొని అటువంటి వారు డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ జీవితాలను సుఖమయం చేసుకుంటారని ఆశిద్దాం. - శిసూర్య -
త్రీడీలో మన్రో జీవితకథ
సినిమా తారల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా మార్లిన్ మన్రో వంటి సంచలన తార జీవిత విశేషాలు తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఈ అద్భుత సౌందర్య రాశి హాలీవుడ్లో 17 ఏళ్లు ఓ వెలుగు వెలిగారు. భౌతికంగా ఆమె దూరమై దాదాపు 52 ఏళ్లవుతోంది. అయినప్పటికీ ఆమెను ఎవరూ మర్చిపోలేదు. ఇప్పటికీ అడపా దడపా మన్రో ఫొటోలు, ఆమె వాడిన వస్తువులను వేలం వేస్తుంటారు. వాటిని సొంతం చేసుకోవడానికి భారీ ఎత్తున అభిమానులు పోటీపడుతుంటారు. అలాంటి అభిమానులకు ఓ తీపి వార్త. మన్రో జీవితం ఆధారంగా స్వీయదర్శకత్వంలో రూపేష్ పౌల్ ఓ సినిమా తీయనున్నారు. త్రీడీలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. దీనికి ‘36 ఎంఎం త్రీడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వారంలో ఫ్రాన్స్‌లో కేన్స్ చలన చిత్రోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రచార చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు రూపేష్. స్టార్‌గా ఎదగడానికి మన్రో చేసిన కృషి, స్టార్ అయిన తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? తదితర అంశాలతో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రం కోసం యూనివర్సల్ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. మన్రో పాత్రను ఎవరు చేస్తారనేది దర్శకుడు ఇంకా బయటపెట్టలేదు. వాస్తవానికి గత ఏడాదే ఈ చిత్రాన్ని ప్రకటించారు రూపేష్. అప్పట్లో కొంతమంది నటీనటుల పేర్లు కూడా చెప్పారట. ఆ జాబితాలో భారతీయ నటీనటులు లేరని సమాచారం. సో.. మన్రోగా చేయబోతున్నది హాలీవుడ్ తార అని ఊహించవచ్చు. -
సేవా శునకాలు
పెట్ వరల్డ్ ‘‘కుక్కలు నన్ను ఎప్పుడూ కరవలేదు. మనుషులు తప్ప’’ అని కుక్కల్లోని మానవత్వాన్ని ఎప్పుడో లోకానికి చాటారు హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో. శునకాలలో ‘విశ్వాసం’ మాత్రమే కాదు బోలెడు ‘మానవత్వం’ కూడా ఉందని ‘సహాయక శునకాలు’ నిరూపిస్తున్నాయి. లంకంత కొంప. అంత పెద్ద ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఆ వృద్ధదంపతుల పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. చుట్టపు చూపుగా వచ్చిన ఒకాయన ‘‘మీ ఇంట్లో కుక్క ఉంది కదా...ఇక ముందు చిన్న చిన్న పనులన్నీ అదే చేసి పెడుతుంది’’ అంటూ ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు. అది శునకాలకు సహాయ పనులు నేర్పించే సంస్థ అది. ఒక నెల రోజుల తరువాత... ‘‘స్టార్... వెళ్లి ఆ పాల పాకెట్ తెచ్చివ్వు’’, ‘‘స్టార్... వెళ్లి ఆ పేపర్ తెచ్చివ్వు’’ ... అలా చెబితే చాలు టకీమని చేసేస్తుంది ‘స్టార్’ అనే పేరున్న ఆ శునకం. ‘స్టార్’ చేస్తున్న పనుల గురించి ఇరుగు వారికి పొరుగు వారికి తెలిసిన వారు కూడా తమ శునకాలకు ‘సేవ’లో ప్రత్యేక శిక్షణ నిప్పించారు. విదేశాల్లో విరివిగా... విదేశాల్లో శునకాలకు సహాయక పనులు నేర్పే సంస్థలు ఎక్కువగా ఉంటాయి. శునకాలకు ఇచ్చే శిక్షణలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. గైడ్ డాగ్స్: దృష్టి లోపం ఉన్న వాళ్లకు, అంధులకు సహాయపడే విధంగా శునకాలకు శిక్షణ నిస్తారు. హియరింగ్ డాగ్స్: వినికిడి సమస్య ఉన్నవాళ్లకు సహాయపడేలా శిక్షణ నిస్తారు. సర్వీస్ డాగ్స్: పైన వాటిలా ప్రత్యేకంగా ఒక పనికి కాకుండా రకరకాల పనులకు ఉపయోగపడేలా శునకాలకు శిక్షణ నిస్తారు. వీటితో పాటు మెడికల్ అలర్ట్ డాగ్స్, సైకియాట్రిక్ సర్వీస్ డాగ్స్... పేరుతో శునకాలకు శిక్షణ నిస్తారు. మన దేశంలో తొలి అడుగు... విదేశాల్లోలాగే మన దేశంలోనూ శునకాలకు శిక్షణ నిచ్చే సంస్థ ఏదైనా ఉంటే బాగుండేది కదా అనుకుంది షిరిన్ మర్చెంట్. ఆలోచన రాగానే లండన్‌కు వెళ్లి ప్రపంచ ప్రసిద్ధ డాగ్ థెరపిస్ట్ జాన్ రోగర్సన్ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఆ తరువాత ఆమె ‘కెనైన్ కెన్ కేర్’ పేరుతో ముంబయిలో ఒక సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహించడం ప్రారంభించింది. యజమానులకు రకరకాలుగా సహాయపడే రీతిలో శునకాలకు శిక్షణ నివ్వడంలో ‘కెనైన్ కెన్ కేర్’ అగ్రగామిగా నిలిచింది. ‘వూఫ్’ పేరుతో ఒక ప్రతికను కూడా ప్రారంభించింది షిరిన్. శునకాల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను నడపడం మన దేశంలో ఇదే ప్రథమం. ఈ పత్రిక పేరు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి కూడా ఎక్కింది. ఒకసారి ముంబయిలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నప్పుడు ఒకాయన వచ్చి షిరిన్‌ను కలిశాడు. ఆయన వికలాంగుడు. గతంలో ఒకసారి తన శునకానికి షిరిన్ దగ్గర శిక్షణ ఇప్పించాడు. ‘‘ బిడ్డలు లేని లోటును మా పెంపుడు కుక్క తీరుస్తోంది. ప్రతి పనినీ ఓపికగా, చురుకుగా చేసి నాకు అన్నిరకాలుగా సహాయపడుతోంది’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన. అలా చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో వెలుగు! ఆయన చెబుతున్నది వింటున్నప్పుడు ఆమె కళ్లలో అంతకు రెట్టింపు వెలుగు!! -
వేలానికి మార్లిన్ మన్రో ఎక్సరేలు
ఒక తరాన్ని ఉర్రూతలూగించిన హాలీవుడ్ హాట్ గాళ్ మార్లిన్ మన్రో చనిపోయి దాదాపు 50 ఏళ్లవుతున్నా చాలామంది హార్ట్స్‌లో ఆమె నిలిచిపోయారు. అతి చిన్న వయసు (36)లోనే చనిపోయిన ఈ అందాల తార గురించి ఇప్పటికీ హాలీవుడ్లో ఏదో ఒక టాపిక్ వినిపిస్తుంటుంది. అలాగే ఈ సౌందర్య రాశి వాడిన వస్తువులను, ప్రత్యేకమైన ఫొటోలను అడపా దడపా వేలం వేసిన సందర్భాలూ ఉన్నాయి. మన్రో అభిమానులు వీటిని చేజిక్కించుకోవడానికి వేలం పాటలో చాలా జోరుగా పాల్గొంటుంటారు. వచ్చే నెల 9, 10 తేదీల్లో మరో వేలం పాట జరగనుంది. 1950 నుంచి 1962 వరకు మన్రో వైద్యానికి సంబంధించిన ఎక్స్‌రేలు, ఆమె కాస్మటిక్ సర్జరీ చేయించుకున్న రికార్డ్స్‌ను వేలం వేయనున్నారు. అప్పట్లో డా.గుర్డిన్ దగ్గర ముక్కు, బుగ్గల అందం రెట్టింపు కావడం కోసం ఆమె కాస్మటిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇతర శారీరక సమస్యలకు సంబంధించి ఆమె తీయించుకున్న ఆరేడు ఎక్స్‌రేలతో పాటు ఈ రిపోర్ట్స్‌ను ఓ వ్యక్తికి బహుమతిగా ఇచ్చారట గుర్డిన్. వాటిని సదరు వ్యక్తి జూలియన్స్ ఆక్షన్స్కి అమ్మాడు. వాటినే వేలానికి పెట్టబోతున్నారు. 15 వేల డాలర్ల నుంచి 30 వేల డాలర్ల వరకు ఇవి అమ్ముడుపోతాయని అంచనా వేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. దాదాపు మూడేళ్ల క్రితం మన్రో మూడు చెస్ట్ ఎక్స్‌రేలను వేలానికి పెడితే, 45 వేల డాలర్లకు అమ్ముడు పోయాయట. ఓ వైపు ఈ వేలం పాటలో పాల్గొనడానికి ఇప్పట్నుంచే చాలామంది రెడీ అయిపోతుంటే, కొంతమంది మాత్రం ‘మార్లిన్‌ది సహజ సౌందర్యం అనుకున్నాం. కాస్మటిక్ సర్జరీ చేయించుకుందా’ అని చర్చించుకుంటున్నారు. అయితే మన్రో వీరాభిమానులు మాత్రం... ‘మన్రో అద్భుత సౌందర్య రాశి. ఆ సౌందర్యానికి మెరుగులు దిద్దించుకుని ఉంటుంది’ అంటున్నారు. ఏదేమైనా... వచ్చే నెల జరగబోతున్న వేలం పాటకు మాత్రం మంచి డిమాండ్ ఉంటుందని ఊహించవచ్చు.